Monday, March 22, 2010

పశువధ - గొడ్డుమాంసం

కర్ణాటక ప్రజలకు శుభవార్త...త్వరలో చికెన్, మటన్ ధరలు ఆకాశానికంటి ఆదివారమైనా ముక్కముట్టలేని పరిస్థితి రానుంది.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పశువధలపై బ్యాన్ విధించింది.
ఒక అడుగు ముందేసి పశుమాసం ఉన్నా,తిన్నా, అమ్మినా దాన్ని నేరంగా పరిగణిస్తూ ఏడుసంవత్సరాల వరకూ శిక్షను ప్రతిపాదించింది.
ఈ బ్యాన్ అప్రజాస్వామికం అన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం "రాష్ట్రంలోని పశుసంపదను కాపాడాలంటే ఈ చట్టం తప్పదు"ఆని.
నిజమే...ఎకలాజికల్ సమతౌల్యాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న చాలా విపరీతమైన పరిణామాల్ని అడ్డుకోలవసిందే.
దానికి నీరు, మట్టి, గాలి,చెట్టుతో పాటూ  పశుసంపదను కాపాడాల్సిందే.
కానీ ఈ నిర్వచనంలో వచ్చే ‘పశువు’లో గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందులూకూడా వస్తాయి.
కానీ చిత్రంగా ఈ హిందుత్వ బీజేపీ ప్రభుత్వానికి ఇవేమీ కనిపించలేదు.
కేవలం "ఆవు" మాత్రమే కనిపించింది.
నిజానికి ఇప్పటికే అమలులో ఉన్న Prevention of Cow Slaughter and Cattle Preservation Act, 1964 మరింతగా ఉపయోగరమనే వాదన ఉంది.
ఎందుకంటే, అందులో ఆవులతోపాటూ పాలిచ్చే గేదెల్ని చంపడాన్ని చట్టవ్యతిరేకంగా పరిగణించింది.
సమస్య పాల ఉత్పత్తి అనేవాదన కొందరు వినిపించినప్పటికీ ఒట్టిపోనంతవరకూ ఆవుల్ని ఎవరూ చంపరనే ఇంగితజ్ఞానం చాలు ఈ వాదనకు చుక్కలు చూపించడానికి.
మొత్తానికి బీజేపీ ప్రభుత్వం తన హిందుత్వ అజెండాని ముందుపెట్టి మఠాల్ని, అగ్రకుల మైనారిటీలను సంతృప్తిరిచే బాటపట్టింది.
మాంసం తినే అగ్రకుల హిందువుల్ని బుజ్జగిస్తూనే గొడ్డుమాంసం తినే దళితులు, ముస్లింమైనారిటీలు, విదేశీయుల హక్కుల్ని విజయవంతంగా ఈ బ్యాన్ కాలరాసింది.
మరీ ముఖ్యంగా చికెన్, మటన్ తినలేని పేదకు అందుబాటులో ఉండే పౌష్టికాహారమైన గొడ్డుమాంసాన్ని చట్టవ్యతిరేకం చెయ్యడం ద్వారా ఈ ప్రభుత్వం సాధించిందేమిటో ప్రశ్నార్థకమే.
ఇలాంటి కేసుల్లో ఏడుసంవత్సరాల జైలు శిక్ష ప్రతిపాదించడం మరో హాస్యాస్పదమైతే తలాతోకా లేని ఈ చట్టం హిందుత్వ అజెండాని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి భవిష్యత్తులో రాజకీయంగా పనికొస్తుందనుకునే బీజేపీ తెలివితక్కువతనం మరో జోకు.

****

24 comments:

satya said...

మహేష్ గారు, మీరు గొర్రెలు, మేకలు, కోళ్ళు, పందుల పాలు తాగుతారా? బర్డ్ ఫ్లూ పేరు తో రోగం, వున్నా లేకపోయినా లక్షలాది కోళ్ళని చంపినపుడు భాధ లేని మీరు, ఆవు ని నిషేదించినప్పుడు మొసలి కన్నీరు కార్చటం లో అంతరార్ధం తెలిసిన వాళ్ళ ఇంగితం చాలు మీకు చుక్కలు చూపించటానికి.

1964 చట్టం లోనే ఈ అంశం ఉన్నప్పుడు, మీరు ఇప్పుడు కొత్తగా ఏదో అయిపోతుందని భాధ పడటం ఎందుకో అందరికీ తెలిసిందే. విదేశీయుల హక్కుల గురించి తర్వాత ఆలోచిద్దురు గాని ముందు స్వదేశీయుల సెంటిమెంటు గురించి కూడా శ్రద్ద పెట్టండి.

చికెన్, మటన్ కొనుక్కొనే స్తోమత లేని వాళ్ళు గొడ్డు(ఆవు) మాంసం తింటారని మీరు కనిపెట్టిన కొత్త విషయం నిజంగా ఇంకో ph.D కి సరిపడా సబ్జక్టే

Ramakrishna Bysani said...

హిందువులు యజ్ఞయాగాదుల్లో పశువుని యూపస్థంభానికి కట్టి వధించి అరగించేవారు అని చదివాను...

Kathi Mahesh Kumar said...

@అయ్యా సత్యగారూ,
నేను గొర్రె,మేకల పాలు తాగాను. ఆవుపాలకన్నా గేదెపాలే ఇష్టంగా తాగుతాను. దానికీ నా టపాకీ సంబంధం ఏమిటో నాకైతే అర్థంకాలేదు.

నేను పూర్తిస్థాయి మాంసాహారిని. చిన్నప్పట్నుంచీ ఇంట్లో కోళ్ళు కొయ్యడం అలవాటుగా పెరిగినవాడ్ని. మా పల్లెల్లో గొడ్డుమాంసం, పందిమాసం డెలికసీగా కలిగినవాణ్ణి. కాబట్టి మాంసం తింటూ కన్నీరు కార్చే అలవాటు నాకు లేదు.

1964 నాటి చట్టం ఉద్దేశం ఇప్పుడు దాన్ని మార్చిన వాళ్ళ ఉద్దేశంలో తేడా నక్కకూనాకలోకానికీ ఉన్నంత ఉంది. అది నా టపాలో చెప్పాను. కానీ you were busy jumping the gun rather than reading it carefully.

మటన్ ధర కిలో 250 రూపాయలు
చికెన్ ధర కిలో 140 రూపాయలు
బీఫ్ ధర కిలో 70 రూపాయలు
దీనికి phd ఎవరూ ఇవ్వరు.

satya said...

ఆహా, ఆదిమానవులు బట్టలేకుండా తిరిగే వారని చదవలేదా రామకృష్ణ గారు?

Kathi Mahesh Kumar said...

@భైసాని రామకృష్ణ: జైనబౌద్ధాల తాకిడికి హిందూమతంలో ప్రారంభమైన సంస్కరణల్లో భాగమే ఈ వెజిటేరియనిజం. అదికూడా కేవలం ఒక కులానికి సంబంధించింది మాత్రమే. కాలక్రమంలో ఆ కులాన్ని ఇమిటేట్ చేసిన మరికొన్ని కులాలకు ఈ అలవాటు పాకింది. అయినా మెజారిటీ హిందువులు (ఇప్పటికీ) మాంసాహారులే. అందుకే మాంసం "పవిత్రత" కేవలం మైనారిటీ హిందువుల వాదం అంటున్నాను.

చాలా మంది అవసరమైనంత మేరకే చరిత్రలో వెనుకకీ ముందుకీ వెళ్తారు. వాళ్ళ ఎకసెక్కాలతో మనకెందుకులెండి.

satya said...

మీకు అర్ధం కాలేదా?

ఎకలాజికల్ సమతౌల్యం లో భాగం గా కోఅళ్ళు, మేకల్ని నిషేదించాలని మీరు చేసిన వితండవాదానికి వ్రాసిన కామెంట్ అది.దేశం లో ఎక్కువ మంది ఆధారపడేది గేదె, ఆవు పాలపై మాత్రమే. అందుకే వాటిపై ప్రత్యేక నిషేదం.

కోళ్ళని చంపినపుడు గుర్తు రాని ధరలు, పందులని చంపినపుడు వ్రాని టపా, ఆవులపై నిషేదం అనగానే వచ్చింది. ఇది మొసలి కన్నీరా, మహేష్ కన్నీరా? దేశం లో ఎన్నో ధరలు పెరుగుతున్నాయి, కాని ఆదివారం తినే గొడ్డు మాంసం ధర భాదించిందంటే మిగిలిన ఆరు రోజుల తిండి ధర పట్టలేదంటే నక్క కి నాగలోకానికి తేడా ఏంటో తెలియట్లేదా?

satya said...

అవును మహేష్ గారు, చరిత్ర లో బూతు బొమ్మలు ఉన్నాయి. మరి అదే చరిత్ర లో కుల వ్యవస్థ ఉంది. మీరు హుస్సేన్ ని సమర్ధించటానికి గూగుల్ గాలించి ఆడిన ఎకసెక్కాలు గుర్తులేవా? చరిత్ర లో జరిగిన వన్నీ కరక్టే నా లేక చరిత్ర లో మహేష్ చెప్పే చరిత్రే కరెక్టా?

Anonymous said...

Pig is certainly a delicacy. English writer Robert Lynd described this delicacy in his short story on Rost Pig. Why pig is so tasty? May be becoz it is a recycled food, naturally loved by some people in India.
But, I don't like it. I never touched meat after I converted to Buddism following our great Ambedkar. I don't know whether our Ambedkar was vegitarian too.

Thanks for reminding me Pork, but our muslim friends hate pigs & pig-eaters.

Keep writing on such stuff..

satya said...

అవును మహేష్ గారు, చరిత్ర లో బూతు బొమ్మలు ఉన్నాయి. మరి అదే చరిత్ర లో కుల వ్యవస్థ ఉంది. మీరు హుస్సేన్ ని సమర్ధించటానికి గూగుల్ గాలించి ఆడిన ఎకసెక్కాలు గుర్తులేవా? చరిత్ర లో జరిగిన వన్నీ కరక్టే నా లేక చరిత్ర లో మహేష్ చెప్పే చరిత్రే కరెక్టా?

Kathi Mahesh Kumar said...

@సత్య: ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది food chain management తోపాటూ water,land,animal husbandry and trees management తోవస్తుంది. నేనిక్కడ మాట్లాడింది వాటి organized and balanced యాజమాన్యానికి ప్రభుత్వాలు చెయ్యవలసిన comprehensive legal framework గురించి. వాటిని పక్కనబెట్టి symbolic value కోసం తమ హిందుత్వ అజెండా కోసం గోరక్షణ పేరుతో గంగవెర్రులెత్తుతున్న బీజేపీ ప్రభుత్వం గురించి.అది మీకు అర్థం కాలేదు. లేదా బహుశా తెలీదు. నేను కోరుకున్నది కోళ్ళు, మేకల మీద నిషేధం ఏమాత్రం కాదు. అలా కోరుకుని నా పొట్టనేను కొట్టుకోలేను.

ప్రస్తుతం ప్రతిపాదించిన చట్టం పేరు "Cow slaughter ban bill" ఇదివరకూ ఉన్న చట్టం పేరు "Prevention of Cow Slaughter and Cattle Preservation Act, 1964" పేర్లు చాలు వళ్ళ ఉద్దేశాలేమిటో తెలియడానికి.

కోళ్ళ కల్లింగ్ జరిగింది ఒక రోగాన్ని మట్టుబెట్టి ప్రజారోగ్యాన్ని కాపాడటానికి. పందుల విషయంలోనూ అదే జరిగింది. కానీ ఇది.....

ధరల పెరుగుదల నా సమస్యే అయినా. ఈ టపా విషయం అదికాదు. కాబట్టి మీ అప్రస్తుత ప్రసంగాన్ని నేను entertain చెయ్యలేను.

Unknown said...

మరి ఐతె కొళ్ళని గొర్రెలని మేకలని నెషేదించి ఆవులనె చంపమందాం తినమాందం

ఏందుకంటే బియ్యం కూరగయలు పప్పులు చక్కెర ఒకటెమిటి సామాన్యుడికి అన్ని తలకు మించిన భారం ఐనప్పుడు, ఒక్క ఆవు మాంసం మాత్రమే ప్రత్యమ్నయం అని మనకు తెలియదా ఎంటి

satya said...

మహేష్, గోరక్షణ పేరు తో బీజేపీ గంగవెర్రులెత్తుతుందా? మరి అత్యవసరంగా గుర్తొచ్చిన 'ఆదివారం' ధరలు గురించి మీరు చేస్తుంది? మన దేశంలో కోళ్ళు, మేకల్ని ఆహార (వ్యాపార) నిమిత్తమై ఫారాల్లో పెంచుతారు. అవి ecological balance లో భాగం కాదు. కాని గేదెలని, ఆవులకి ఇలాంటి వ్యవస్థ లేదు. ఇక హిందూ మతానికి చెందిన symbolic values గురించిన చర్చ మీతో అనవసరం. మీకు తెలీదనుకుంటా, సౌదీ లో ఒంటె ని చంపిన వారికి ఉండే శిక్ష ఏమిటో? atleast ఇతర మతాల symbolic values అర్ధం చేసుకోవటం ద్వారా అయినా వాటి గొప్పదనం అర్ధమైతే సంతోషమే. కోళ్ళు, పందుల్లో రోగం ఉన్నవాటికన్నా, అనుమానం తో చంపినవే ఎక్కువ అని చెప్పిన అప్పుడు NECC ads చూసె వుంటారు.

ఇంక మీరు చెపిన 1964 చట్టం ద్వార ఎక్కడ prevention జరిగిందో నాకు నిజంగా తెలియదు.

మీరు ఈ టపా ద్వారా చేసిన entertainment చాలు. మీరు entertain చెయ్యను అని కాకుండా సమాధానం చెప్పను అని వ్రాసుండాల్సింది.

Kathi Mahesh Kumar said...

@సత్య: సౌదీలో ఒంటెల్ని చంపడం నేరమా! మొన్నే ట్రావల్ అండ్ లిగింవ్ లో ఒంటె మాంసం ఒంటెపాలూ సౌదీ రెస్టారెంటుల్లో విదేశీయులకు ఆఫర్ చేసే డెలికసీ అని చూపించారే!!!!! బహుశా వారికి మీ అంత జ్ఞానం లేదనుకుంటాను.

కోళ్ళు మేకలు వ్యాపారం బీఫ్ కాదంటారు. బాగుంది. కానీ ప్రపంచ బీఫ్ ఎగుమతుల్లో భారతదేశం మూడోస్థానంలో ఎలా ఉందో కాస్త చెప్పగలరా? ప్రపంచ బీఫ్ మార్కెట్ షేర్ లో మన వాటా పెంచుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఎవరి ఇమాజినేషన్ అంటారూ?

Entertain చెయ్యను అనేది ఒక expression. బహుశా మీకు తెలీదనుకుంటాను. కాస్త ఈ సారి మీ జాతకం సరిగ్గా చూసుకుని ఇటురండి. తరువాత చర్చిద్దాం.

satya said...

>> అందుకే మాంసం "పవిత్రత" కేవలం మైనారిటీ హిందువుల వాదం అంటున్నాను.

మహేష్, మీరు హిందూ మత చరిత్ర గురించి వ్రాస్తున్నరో, చదువుతున్నారో అర్ధం కావట్లేదు. (రెండిటిలో ఏదైనా మీ స్టైల్లోనే)

హిందూ మతం లో ఎక్కడా మాంసం పవిత్రత గురించి వివరించలేదు, కేవలం గో హత్య మహా పాతకం అని నిషేదించింది. ఇంక గోవు పవిత్రత గురించి మీరు in & out చదివిన హిందూ మత చరిత్ర లో ఎక్కడా ఉండదని నాకు తెలుసు.

Kathi Mahesh Kumar said...

అయ్యా సత్య గారూ,
మీరు నన్ను పిచ్చపిచ్చగా entertain చేస్తున్నారు. నేను రాసిన పవిత్రత double quotes లో ఉంది చూడండి సార్!

సెక్యులర్ దేశాల్లో చట్టాలు పవిత్రతా- అపవిత్రత, పాపం-పుణ్యం మీద చెయ్యబడవు. బీజేపీ "గోహత్య మహాపాతకం. కాబట్టి ఈ చట్టం చేస్తాం" అని చెప్పుంటే ఈ పాటికి ప్రభుత్వం కూలిపోయేది. కాబట్టి మీ హిందూ చరిత్ర మీదగ్గర పెట్టుకుని రాజ్యాంగాన్ని పారాయణం చెయ్యడానికి ప్రయత్నించండి. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని మీరు బాగా అర్థంచేసుకోగలరు.

Neptunian said...

http://news.rediff.com/slide-show/2010/jan/21/slide-show-1-dont-cull-camels-give-to-us-saudi-arabia-tells-australia.htm

satya said...

@ మహేష్, బహుసా నేను చదివింది, విన్నది అబద్దం కావచ్చు.కానీ అక్కడ pork పై నిషేదం ఉన్నదని మాత్రం తెలుసు.

Pork Import to Saudi Arabia is contradicting to the Saudi religion, laws and culture. Non-Muslimis are not allowed to eat pork in Saudi Arabia.

courtesy: http://www1.american.edu/TED/saudpork.htm

మనదేశం లో ఎక్కడైన beef కోసం పెంచుతున్న పసుశాల చూపిస్తారా? నేను కోళ్ళ ఫారాలు, పందుల ఫారాలు చూశాను, కానీ ఎక్కడా పాడి కోసం కాకుండా beef కోసం పెంచే పశువులని చూడలేదు.

ప్రభుత్వం కూలిపోతుంది అనేది తమరి కోరిక మాత్రమే. రామజన్మభూమి అంశాన్ని మేనిఫెస్టో లో పెట్టినా కూడా బీజేపీ చాలాసార్లు అధికారం లోకి వచ్చింది, బహుసా ఆ వోట్లేసిన ప్రజలకు, ఆ గెలుపుని అంగీకరించిన ఎలక్షన్ కమీషన్ కు సెక్యులరిజం గురించి జర చెప్పరాదు.

ఇప్పుడు బీజేపీ చేసిన ఈ చట్టం కూడా రాజ్యాంగానికి లోబడే ఉంది, కాబట్టి రాజ్యాంగం లో మీకు నచ్చిన ఆర్టికల్స్ మాత్రమే కాకుండా అన్నిటిని పారాయణ చెయ్యండి. రాజ్యాంగం లో మతపరమైన రిజర్వేషన్లు అంగీకరించదు. మీరు పారాయణ చేసెప్పుడు ఇలాంటి పేజీలను skip చెయ్యకుండా చెయ్యండి.

నేను మొన్న ఉగాది నాడు జాతకం చూపించాను. బాగా తగవులు పడతానని ఉంది, అందుకే ఇక్కడికి వచ్చా :)

మిమ్మల్ని నేను entertain చెయ్యటం ఏంటి సార్? మీరే దాదాపు ఒక పది బ్లాగుల్ని entertain చేస్తున్నారు. (ఈ చివరి మాట వీవెన్ గారి పోస్ట్ సౌజన్యం తో)

Trader said...

మీ దగ్గర నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేదు అండి మేము.. :))..

వాళ్ళు చేశింది కరెక్ట్ కాకపొయినా తప్పు మాత్రం కాదు...

"సమస్య పాల ఉత్పత్తి అనేవాదన కొందరు వినిపించినప్పటికీ ఒట్టిపోనంతవరకూ ఆవుల్ని ఎవరూ చంపరనే ఇంగితజ్ఞానం చాలు ఈ వాదనకు చుక్కలు చూపించడానికి."

ఇది తప్పు కత్తి బాబూ..

మా ఊరిలొ ఇష్టం వచ్ఛినప్పుడు చంపేసే వాళ్ళు..

జయహొ said...

What is your own sampradaayam/ culture? And enlighten us how it is greater than other cultures? Probably we may embrace your beliefs and indulge throwing mud on others!
So far you did not reespond to this questions.

చైతన్య said...

అయ్యా మహేష్ గారు,
మీరు "గోవధ" ని నిషేదించినందుకు ఎందుకు ఇంతగా బాధ పడుతున్నారో నాకు అర్ధం కావటం లేదు.

"కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పశువధలపై బ్యాన్ విధించింది." మీ ఈ వాక్యం లోనే క్లారిటి లేదు. ఏం కేవలం కర్నాటకా ప్రభుత్వం మాత్రమే "గోవధ" ని నిషేదించిందా?
అసలు మీకు మన దేసం లో ఆ రాస్ట్రాలకు వుందో తెలుసా?
కేవలం కేరళ, అరునాచల్ ప్రదెష్, మెఘాలయా, మిజొరాం, నగాల్యాంద్ మరియు త్రిపుర లకు మాత్రమే "గోవధ" ను వ్యాపారం చేయుటకు ప్రభుత్వ అనుమతి వుంది...ఇంకెవరైనా చేస్తె అది నేరం. మిగిలిన రాస్ట్రాలు...మన ఆంధ్రా తో సహా...ఎవరూ కూద గోమాంసం ఉత్పత్తి చేయతం లేదు..

మీరు చెప్పిన 1964 యాక్ట్ లో, ఆ సంవత్సరంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పశువధలపై బ్యాన్ విధించింది. ఇపుడు కొత్తగా దానిని పునరుద్దించింది అంతే. మీకు తెలియాల్సిన ఇంకొక విషయం.....పై రాస్ట్రాలన్నిటిలో కేరళదె అగ్రభాగం (వాడకంలో (40%), ఉత్పత్తిలో (55%)). ఆందువల్ల కేవలం కేరళ ప్రభుత్వం మాత్రమే ఈ నిషేదాన్ని వ్యతిరేకించింది. అది కేవలం వ్యాపారపరంగా మాత్రమే...

"మాంసం తినే అగ్రకుల హిందువుల్ని బుజ్జగిస్తూనే గొడ్డుమాంసం తినే దళితులు, ముస్లింమైనారిటీలు, విదేశీయుల హక్కుల్ని విజయవంతంగా ఈ బ్యాన్ కాలరాసింది." ----

మీకు తెలియాల్సిన మరొక విషయం ఎంటంటె...హిందువు అనేవాడు ఎవడూ కూద (ఒక్క తమిళనాదు లో తప్ప) గోమాంసం తీసుకోడు.....


ఒక హిందువు మాంసం తీసుకోడు అని ఎవరు చెప్పరు...కేవలం బ్రాహ్మణులు తీసుకూరు....దానికి కారణం మీకు తెలుసా...అది ఆచారం వల్ల కాదు...బ్రాహ్మణుడికి మంత్రోచ్చారణ ముఖ్యం.... మాంసం తిన్నవారికి నాలుక మ్రుదుత్వం కోల్పోతుంది. శబ్ద దోషం వల్ల మంత్రము దుష్ప్రభావం కలిగిస్తుంది....అందువల్ల అది నివార్యమై ఆచారమైంది....
క్షత్రియులు మరియు ఇతర కులాలవాల్లు మాంసం తీసుకుంటారు. కానీ గోమాంసం మాత్రం కాదు....

మొత్తంగా నే చెప్పొచేదెంటంటె, మీరు అనుకున్నది కాకుండా...పూర్థిగా తెలుసుకొని వ్రాయండి....ఇది నా విన్నపం.

Kathi Mahesh Kumar said...

@చైతన్య: కందిపప్పుని బ్యాన్ చేసి అది కలిగుండటం, తినడం చట్టవ్యతిరేకం అన్నారనుకోండి...మీకు బాధకలగదా! ఖచ్చితంగా కలుగుతుంది. కొన్ని కోట్లమంది దళితులు, ముస్లింలు, కేరళవాళ్ళు ఇష్టంగా తినే గొడ్డుమాంసాన్ని (గోవధ నిషేధం పేరుతో) నిషేధిస్తే నాకు బాధకలగడం మీకు ఆశ్చర్యం ఎందుకు?

ఆంధ్రా గోమాసం ఉత్పత్తి చెయ్యడం లేదా...తినేవాళ్ళు లేరా...ఏ దేశంలో ఉంటున్నారండీ బాబూ! హైదరాబాద్ గల్లీగల్లీలో కళ్యాణీ బిరియాని దొరుకుతుంది ట్రై చెయ్యండి.

హిందువులు గోమాంసం తీసుకోరని మీరు ఏకపక్షంగా నిర్ణయించడంలోనే మీ ignorance తెలుస్తోంది. మెజారిటీ దళితులు ఇప్పటికీ గొడ్డుమాంసం తింటారు. వాళ్ళు హందువులు కాదు అని మీరంటే నాకైతే ఓకే.

@జయహో: నేను రాసేది నా సాంప్రదాయం. అది ఎవరూ ఫాలో అవనక్కరలేదు. బలవంతంగా ఆచరింపజెయ్యాలనే ఆలోచనా నాకు లేదు. Please be happy in your world of culture and heritage.I don't throw mud on individuals. I have issues with institutions and systems and I keep raising my voice against them.

@వేణు: వ్యాపారపరంగా పాలద్వారా రోజూ లబ్దిపొందే లగ్జరీ ఉన్న దళితుడు,జోడెడ్లు పెట్టుకిని ఉన్న కూసింతపొలాన్ని సాగుచేసుకుని గౌరవంగా బ్రతకాలనుకునే దళితుడు కేవలం జిహ్వాచాపల్యం కోసం గొడ్డుల్ని చంపుకోడు. మీ ఊరి మొత్తం సంగతి మీకు తెలిసినట్లు మాట్లాడకండి. ఎప్పుడైనా ఆ చచ్చిన గొడ్డు పూర్వాపరాలు విచారించారా...ఆ వాడలకు మీరు వెళ్ళారా???

మయూఖ said...

హిందూత్వం గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు దశావతారాలల్లో ఒక అవతారమైన (మత్స్యావతారమైన) చేపలను శుభ్రంగా భుజింఛే హిందువులను ఏమనాలి.చాలా మంది బ్రాహ్మణులు ముఖ్యంగా బెంగాళీ బ్రాహ్మణుల ప్రధాన మైన ఆహారం చేపలే ,దీనికి ఏమంటారో? పేదల పౌష్టికాహారాన్ని నిషేధించడం నిజంగా అప్రజాస్వామికం. కుహనా హిందూత్వ వాదులు ఇటువంటి పనులు చేయడం వలనే ముఖ్యంగా దళితులు హిందూ మతానికి దూరమయ్యారు.మహేశ్ గారు మీ అభిప్రాయాలతో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తాను.

S Swaroop Sirapangi said...

On Beef Eating and opposition to such traditions please refer this link:

http://socialjusticeanddemocratization.wordpress.com/2009/12/29/democratisation-of-the-public-sphere-the-beef-stall-case-in-hyderabad%E2%80%99s-sukoon-festival/

The above provided (link) article figured in South Asian Research Journal, in 2009. The article touched upon both theoretical and practical issues.

admin said...

http://www.innervoice.co.cc/2010/01/blog-post_13.html