పూజచేస్తే పరీక్ష్జల్లో పాసవుతారు. తాయెత్తు పంపిస్తా అడ్రసివ్వండి. మీపేరు మీద పూజచేయిస్తా గోత్రంచెప్పండి. దేవీ కుంకుమ పంపిస్తా పిల్లలకు పెట్టండి. అంటూ ఇలాంటోళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూనే స్వామీజీలుగా ఎదుగుతారు. చుట్టూ వీళ్ళకి భజనమండలి ఖచ్చితంగా ఉంటుంది. "ఏం చెప్పారు సార్", "సరిగ్గా చెప్పారు గురువు గారూ" అంటూ యమభజన వీళ్ళ తరహా, నమ్మామో నట్టేట మునిగినట్లే.
మతాన్ని నమ్మే చదువుకున్న మూర్ఖులు వీళ్ళ టార్గెట్. ఎలాగూ రెడీగా శఠగోపం పెట్టించుకోవడానికి ఉంటారు కాబట్టి వాళ్ళు మోసపోయే అంతవరకూ నమ్ముతూనే ఉంటారు. కానీ అటూఇటూ తేల్చుకోలేకుండా ఉండే చాలా మందిలోని బలహీన క్షణాల కోసం వీళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటోళ్ళు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం. మొదట్లో బాగున్నా, మత్తులో పడింతర్వాత ఇంతేసంగతులు చిత్తగించవలెను.
వీళ్ళ తరహా ఎలా ఉంటుందంటే...మత మారిన హిందువుని చంపెయ్యమంటారు. కానీ వేరే మతస్తుడు "మీ దయతో అమ్మను నమ్ముకున్నాను సార్" అంటే "చూడు హిందూమతం గొప్పతనం" అని చంకలు గుద్దుకుంటారు. ఇలాంటి మోసగాళ్ళాతో మతవ్యాపారస్తులతో, జాగ్రత్త. వీళ్ళదగ్గర భూడిదతప్ప జీవితం ఉండదు. మోసం తప్ప నమ్మకం ఉండదు. అందుకే వీళ్ళు నమ్మకద్రోహాలు చెయ్యడానికే ఉంటారు. కాస్త తర్కం ఉపయోగిస్తే వీళ్ళకు అదురు బెదురు. వీళ్ళతో జాగ్రత్త.
తస్మాత్ జాగ్రత్త. ఇంటర్నెట్లో స్వాములు అవతరించారు. బ్లాగులద్వారా ప్రచారాలు చేస్తుంటారు. తస్మాత్ జాగ్రత్త.
****
38 comments:
నువ్వేమీ పట్టించుకోకు కత్తి. హంస మీద బురదజల్లినంత మాత్రాన హంస పందైపోతుందా, పందికి సున్నం కొట్టినంతమాత్రాన పంది హంసైపోతుందా? ఎవరు ఏమన్నారు అని అనవసరంగా ఆలోచించడం ఎందుకు?
నేను బ్లాగ్లోకంకు కొత్త. ఇక్కడి ఆచారాలు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. మీరన్నట్లు ఒక వ్యక్తి పేర్లు, గోత్రనామాలు పంపండి మీ పేరున అర్చన చేస్తాం అని రాయడం చూసాను. బ్లాగుల్లో ఇలాంటి సన్నాసులు కూడా ఉంటారా అని నవ్వొచ్చింది.
నేటి బ్లాగు స్వాములే రేపటి బజారు స్వాములు అనడంలో సంశయం లేదు
ఆధ్యాత్మిక మార్గం మూర్ఖత్వం అనుకోవడం ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్చను హేళన చేయడమే. హేతువాదులని చెప్పుకునే వాల్లు దీన్ని గ్రహించకుండా నోరుపారేసుకుంటుంటారు. ఈ సృష్టిలో చాలా విషయాలు మనకు తెలియనివి, సమాధానం దొరకనివి, మనల్ని భయపెట్టేవి వున్నాయి. వాటి గురించి ఆలోచించి ఆందోళన చెందకుండా పైవాడు చూసుకుంటాడులే అనుకోవడములో ఒక భధ్రత వుంది. ప్రశాంతత వుంది.
నాకు సంభందించినంత వరకూ మతమంటే ఒక జీవన విధానం. మతాన్ని తిడుతున్నారు అంటే దానిలోని వ్యక్తుల జీవన విధానాన్ని అవహేళన చేస్తున్నారు అని అర్థం. అందుకే మతాన్ని గురించి తప్పుగా మాట్లాడితే అందరూ కోపగించుకునేది. అంత మాత్రాన దొంగ బాబాల్ని, నీచుల్ని సమర్ధిస్తున్నారనుకుంటే అది పొరపాటే.
@ఆకాశరామన్న: ఆధ్యాత్మికతను మూర్ఖత్వం అని ఎవరన్నారు? అయినా ఆధ్యాత్మికత వ్యక్తిగత అంత:శోధనతో వస్తుంది. గ్రూప్ థెరపీతో కాదు.మతం పేరుతో జరుగుతున్న మ్యానియాని రెప్రెజంట్ చేస్తూ బ్లాగుల్లో ఈ వ్యాపారాన్ని మొదలెడుతున్న కొందరు దొంగస్వాముల గురించి ఇది ఒక హెచ్చరిక మాత్రమే. వింటే వినండి లేదా మీ ఇష్టం. మీరూ "జై హరిసేవ" అనుకోండి.
స్వశక్తితో కాకుండా "పైవాడు చూసుకుంటాడు" అనే ప్రశాంతత, భద్రతే మీరు ప్రబోధించాలని చూస్తే people like you will get resistance from the likes of me.
మనిషి పురోగమనానికి, మానవత్వవ్యాప్తికి ఆటంకాలుగా ఉన్న అన్ని పోకడలనూ నేను ఎండగడతాను. అందులో మతం ఒకటి.That is my democratic right.If you have any objections...you too have a right to object.So, please do.
Yaaawns..(((( baagaa cheppaaru.
బాబూ. ఆయన్నలా వదిలెయ్యండి. ఇప్పుడు మీరైనా ఈ రాతలు ఆపుతారా లేదా? ఇది చీప్‌గా మీకనిపించడంలేదా? మీరిలా అనవసరమైన విషయాలకి హెచ్చరికలు జారీచెయ్యడం అవసరమంటారా?
[b]స్వశక్తితో కాకుండా "పైవాడు చూసుకుంటాడు" అనే ప్రశాంతత, భద్రతే మీరు ప్రబోధించాలని చూస్తే people like you will get resistance from the likes of me.[/b]
"కర్తవ్యం నీవంతు కాపాడుట నావంతు " అనేది బహుశా భగవద్గీతలోని సూక్తి అనుకుంటా(may be or may not be) దాన్ని తలుచుకుంటూ నా పని నేను చేసుకు పోతాను. మనిషిగా నాకు కొన్ని పరిమితులున్నాయి. ఆ పరిమితులకు లోబడి నేను చేయాల్సిందంతా చేస్తాను. చివరకి వచ్చే ఫలితాన్ని దేవుడు చూసుకుంటాడని భావిస్తాను. "పైవాడు చూసుకుంటాడు" అన్న నా మాటను నా పరిమితిలో లేని దానికి మాత్రమే అన్వయిచుకుంటాను. దీని వలన అనవసర ఆందోళన తగ్గుతుంది. నా ప్రశాంతత నా భధ్రత ఇదే.
[b]మతం పేరుతో జరుగుతున్న మ్యానియాని రెప్రెజంట్ చేస్తూ బ్లాగుల్లో ఈ వ్యాపారాన్ని మొదలెడుతున్న కొందరు దొంగస్వాముల గురించి ఇది ఒక హెచ్చరిక మాత్రమే. వింటే వినండి లేదా మీ ఇష్టం. మీరూ "జై హరిసేవ" అనుకోండి.[/b]
నేను చెట్టును నమ్ముకున్న వాన్ని, చెట్టుపేరి చెప్పి కాయలమ్ముకునే వాల్లను కాదు. నేను చెప్పొచ్చేది, మీరు చెట్టును తిట్టడం మాని అలా దాని పేరు చెప్పి కాయలమ్ముకునే వాల్లని తిట్టమని. దాన్ని నేను మనస్పూర్తిగా సమర్దిస్తాను.
మీ మీద ఇన్నిరోజులు ఒక గౌరవ భావం వుండేది . ఏది రాసినా సాధికారంగా రాస్తారు , కాని ఇది ఎంటండి ? ఎందుకు ఇలా రోజు రోజుకు దిగజారి ఇలా వ్యక్తి గత దూషణలకు దిగారు ?
హిందుత్వ భావనలు నమ్మేవారిని మూర్ఖులనడం ఎలా వుందంటే .. హేతువాదం నమ్మేవారు పరమ మూర్ఖులు అనేలా వుంది .
అంతే కాని ఇది ఏమి సంస్కారం ? ఇది మీకే కాదు అవతల వ్యక్తి కి కూడా వర్తిస్తుంది .
శోధన, సాధన చేసిన జ్ఞానం మాత్రమె శాశ్వతం అన్నారు ( ప్రొఫైల్ లో ) .
అలా చేయకుండా సాధన చేయకుండా ,శోధించకుండా వ్యక్తి గత దూషణ వల్ల మీరు నేర్చుకున్న సత్యం ఏంటి ?
@విజయక్రాంతి: ఇది కూడా నేను సాధికారంగానే రాశాను. మీకు వ్యక్తిగత ధూషణలాగా అనిపిస్తే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు.
నేనన్నది "మతాన్ని నమ్మే చదువుకున్న మూర్ఖులు" ని అది కేవలం హిందుత్వానికి సంబంధించిన విషయం కాదు. ముఖ్యంగా గుడ్డిగా నమ్మే మనుషుల గురించి సంబంధించినది మాత్రమే ఆ వ్యాఖ్య.అది ఏమతం వారైనా మూర్ఖులే.
నేను సాధన శోధన లేకుండా ఈ వ్యాఖ్యలు చేశానని మీరెలా అనుకుంటున్నారు? Have you tried to probe the truth about what I have written?
మీకు నా మీద గౌరవభావం ఉండాల్సిన అవసరం లేదు. Thank you.
నేను సాధన శోధన లేకుండా ఈ వ్యాఖ్యలు చేశానని మీరెలా అనుకుంటున్నారు? Have you tried to probe the truth about what I have written?
శోధన అంటే వున్న అన్ని మార్గాలతో అంటే చదివి , చూసి , విని ఇంకా ఏమైనా వుంటే వాటి ద్వారా తెలుసుకోవటం . ఇది మీరు చేయటం నిజం అది మీ బ్లాగులు చదివే అందరికి తెలుసు .
సాధన అంటే అర్థం ఏంటి ? ఏదైనా సరే కొంత ఆచరించి కొంత ప్రయత్నించి కొంత అనుభవించి తెలుసుకోవటమే . మీరు అలా ఏరోజైనా ఏ మతాన్ని అయినా పాటించార ? లేకుంటే అది సాధన ఎలా అవుతుంది ? సాధన చేసి మాత్రమె నమ్మటం ఎలా అవుతుంది ?
ఇక పోతే గౌరవ భావం నాకు అందరిమీద వుంది . అది నాకు నా సంస్కారం నేర్పిన విషయం .
ఏం చేస్తాం? కాదేది బ్లాగు కి అనర్హం. ఎవరి ప్రచారాలు వాళ్ళవి. హేతువాదులు, సమైక్యవాదులు, ప్రత్యేకవాదులు ఉన్నట్లే అతివాదులు, మతవాదులు కూడా ఉంటారు.
మీరు ప్రస్తావిస్తున్న బ్లాగరు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. ఆయన సంసారి. ఉపాధ్యాయుడు. ఆయన ఏ ఆధ్యాత్మిక వ్యాపారమూ చేయడం లేదు. పండుగలు మాత్రం బాగా జఱుపుతారు. ఆ సందర్భంగా పూజలు చేస్తారు. ఆయన బ్లాగు ద్వారా గోత్రనామాల వివరాలు అడుగుతున్నారని రాశారు. ఆయన డబ్బులెప్పుడైనా అడిగారా ? స్వయంగా పూజలు చేసుకునే ఓపికా, తీఱికా లేని భక్తులు ఆయనతో చెప్పి చేయిస్తే మీకేంటి బాధ ? మీ (అ)విశ్వాసాల ప్రచారం కోసం మీరు బ్లాగు నడుపడం తప్పు కాదు గానీ, ఇతరులు వారి విశ్వాసాల ప్రచారం కోసం బ్లాగు నడిపితే తప్పా ? మీలాంటివాళ్ళు కర్మఫలాన్ని నమ్మితే ఎవడిక్కావాలి ? నమ్మకపోతే ఎవడిక్కావాలి ? Who cares ? దానికి మీరు జనాన్ని ఇలా వ్యక్తిగతంగా attack చేస్తారా ? ఏమైనా ఆంటే నేను దళితుణ్ణి, ఎస్సీఎస్టీకేసు పెడతా అదీ అదీ అంటారు. మీరు మాత్రం అందఱినీ అన్నీ అనొచ్చు.
ఇకముందు కాస్త ఆత్మవిమర్శ చేసుకుని టపాలు రాయడం మొదలుపెట్టండి.
"మీరు చెట్టును తిట్టడం మాని అలా దాని పేరు చెప్పి కాయలమ్ముకునే వాల్లని తిట్టండి...."
బాగుంది.
@తాడేపల్లి లలితాబాలసుబ్రమణ్యం: మీరు ప్రస్తావిస్తున్న బ్లాగరెవరో నాకు తెలీదు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరిపైనా దాడిచేసాననేది మీ అపోహ మాత్రమే.ఈ భూజాలు తడుముకోవడమేమిటో నాకు తెలీదు!
నన్ను ఎందరో ఎన్నో అన్నారు. నేను ఎన్నిసార్లు ఎస్సీఎస్టీకేసు పెడతానన్నానో మీరు లెక్కెంచుకోండి. ఇలా మీరు అనవసరంగా నోరుపారేసుకోవడం బాలేదు. నేను ఆత్మవిమర్శ చేసుకొనే ఈ టపారాశాను. మీరు కొంచెం కళ్ళు తెరుచుకుని చదవండి.
ఎవడిబ్లాగులో వాడు వాడికి ఇష్టమొచ్చినట్లు రాసుకోవచ్చు. నేనూ అదే చేస్తున్నాను.ఇదొక సార్వజనిక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండమని సలహా. If you don't care for what I care, then why bother?
మన్నించాలి, నేనెవఱినీ ఏమీ అనలేదూ అంటూనే, మఱొక ప్రక్క మీరు మీరూ "జై హరిసేవ" అనుకోండి అనడం చూస్తే చాలా చీకాకుగా ఉందండీ.
@రాఘవ: "జై హరిసేవ" ఎవరిదైనా పేటెంటాండీ! మీకు చికాకెందుకొచ్చిందో కాస్త చెబుదురూ!!!
తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నారు, కాని మీ తెలివితక్కువ తనాన్ని ఇంకోసారి బయటపెట్టుకున్నారు
హ హ హ .. ఈ టపా ఎవరిని ఉద్దేశించి రాయలేదంట.. అది అందరూ నమ్మలంట.. మళ్ళీ ఈయన గారిని మేధావి అనే ఒక భజన వర్గం..
నేనెవరినీ ఆనలేదంటూనే మీరు విమర్శించిన బ్లాగరు నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయమే.ఆయనెప్పుడూ ఎవరినీ డబ్బులుగానీ వేరేగానీ ఏమీ అడగలేదే.ఆయనకు తోచిన మార్గం అందరికీ తెలియజేస్తున్నారు.నమ్మినవారు నమ్ముతారు.లేదంటే లేదు.
మళ్ళీ మీరన్నట్లు ఆబ్లాగరు కాకపోతే వేరెవరైనా అయితే పేరు చెప్పి పుణ్యం కట్టుకోండి.దొంగ బ్లాగుస్వాములగురించి తెలిపితే సార్వజనీనికంగా మేమూ అలాంటివాళ్ళ బారినపడకుండా బాగుపడతాము.
@చిలమకూరు విజయమోహన్: ఇంతకీ నేను టపాలో చెప్పననుకుని మీరు అనుకుంటున్న బ్లాగరు ఎవరండీ?
అయినా స్వాములోరు డబ్బులు ఎక్కడా తీసుకోరండి. భక్తకోటి స్వామి వారిపై భక్తితో తృణమో ప్రణమో కానుకలుగా సమర్పించుకుంటారు. దేవుడెక్కడైనా లంచం తీసుకుంటాడా? స్వాములు ఎక్కడైనా డబ్బులు తీసుకుంటారా? మీకు మరీ ఈ తరహా హిందూమతం గురించి బొత్తిగా తెలీనట్లుందే!
మీరు ఆయనగురించే రాసారని మేము అనుకుంటున్నాయన గురించి మీరు రాయకపోతే,మీరు రాసింది ఎవరినుద్దేశించో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి[ఓ సారీ సారీ మీరు పాపపుణ్యాలు లెక్కచెయ్యరు కదూ] సరే ఆ దొంగ స్వామీజీ ఎవరో చెప్పి అర్జంటుగా మమ్మల్ని కాపాడండి.
@రాధిక: మీకు ఈ పనులు చేస్తున్న బ్లాగుస్వామీజీ తెలిసుంటే నా టపా ఖచ్చితంగా అలాంటివాళ్ళ గురించే. ఆయనెవరో పేరుచెబితే నేనూ పేరు చెప్పే రాస్తాను.ప్రస్తుతానికి నాదగ్గరున్నది అనధికారిక సమాచారం. ఈ బ్లాగుస్వామిద్వారా హెరాస్ చెయ్యబడిన కొందరి మాటల మాత్రమే ఆధారం. మీరు పేరుచెబితే "పుణ్యం" చేసినవారౌతారు.
హెరాసా!? ఆశ్చర్యంగా ఉందే! ఎవరో వ్యక్తి ఎవరో "కొందరు" వ్యక్తులను హెరాసు చేసారని మీకు చెబితే మీరీ "డూమ్స్ డే టపా"ను రాసేసారన్నమాట. కనీసం హెరాసు చేయబడ్డామని మీతో చెప్పుకున్న చెప్పిన కొందరు వ్యక్తుల్లో కొందరి పేర్లైనా చెబుతారా? లేక పైన చెప్పిన సమాధానాల్లాంటివే చెబుతారా?
"కొందరు" వ్యక్తులు పాపం తమ మానాన తాముండగా మహేష్ గారికి తెలిసిన ఎవరో ఒక వ్యక్తి వచ్చి, వారి మానానికీ, మానసిక శాంతికీ భంగం చెయ్యబోతే ఈ టపాను రాసేసారన్నమాట! భేష్!! ఆ హెరాసు చేసిన వ్యక్తి పేరు చెప్పడానికి వెనకాడుతున్నారు, కనీసం హెరాసుకు గురైన ఆ కొందరి పేర్లైనా చెప్పగలరో లేదో!!!
ఈ లెక్కన "కొందరు" మీ దగ్గరకొచ్చి, ’వచ్చే డిసెంబరు 25 న మీకు జ్ఞానోదయం అవుతుందంటూ ఫలానా వాడు మమ్మల్ని హెరాసు చేస్తున్నాడు’ అని మీతో మొర పెట్టుకుంటే మీరు ఇలాంటిదే ఇంకో "డూమ్స్ డే టపా" రాసేస్తారని అనుకోవచ్చా? రాస్తారా, రాయరా?
"కొందరు" చెప్పిన "కొన్ని" మాటలకు "ఒక్కరు" చేసిన "కొంచెపు" పని ఈ టపా!
@చదువరి: మీరు భలే జోకులేస్తారే!
జోకులకు స్పందన జోకులే!
మహేశ్ గారు, ఎవరో ఏదో అన్నారని నే విన్నానని వ్రాసి, దాన్ని సాధికారమనడము కూడ జోకే కదా?
Ee topic interesting gaane undi-
ikkada krishna vilaapam kooda - o mostaru pai discussion chain la unnadi-
మహేష్ గారు, మీరు ఉద్దేశించి రాసిన ఆ బ్లాగర్ పూజలకూ వాటికీ డబ్బు ఎప్పుడూ ఎవరి దగ్గరా వసూలు చేయరు నాకు తెలిసి.ఆయన నమ్మకాల ప్రకారం సర్వ జన సంక్షేమం కోరి పూజలు చేయడంలో తప్పేముంది? వాటి మీద నమ్మకం ఉన్న వారు గోత్ర నామాలు పంపడంలో అంతకంటే తప్పేముంది?
@సుజాత:ఆ బ్లాగర్ సంగతి నాకుతెలీదుగానీ, మీరు మాత్రం మరీ అమాయకంగా అడుగుతున్నారండీ!
భారతదేశంలోని ఏ స్వామీజీ అయినా భక్తుల్ని డబ్బులు అడిగాడా? ఏ దేవుడైనా తలనీలాలో నిలువుదోపిడులో ఇవ్వమన్నాడా?
భక్తబృందమే భక్తితో కానుకలు, ప్రేమతో సమర్పణలూ ఇచ్చుకుంటారు. ఇవేవీ లేకుండా ఆశ్రమాలూ, అంత:పురాలూ,భూములూ,పూజలకూ సంతర్పణలూ,యజ్ఞాలూ యాగాలకు డబ్బు సమకూరుతున్నాయంటారా????
ఎవరో ఇస్తేనే వస్తాయి. కానీ ఇక్కడ వాటిని ఇవ్వడం అనరు సమర్పించుకోవడం అంటారు. అంతే తేడా. "అది స్వచ్చందంకదా!" అని అనకండి. ఆ స్వచ్చంధంగా ఇచ్చే పరిస్థితి వీళ్ళు వివిధస్థాయిల్లో కల్పిస్తారు. They have a way of doing it.
మిమ్మల్ని పదిసార్లు పూజకు పిచిచిన మనిషి మాటవిని పదకొండోసారైనా మీరు పూజకు పోరా! ప్రసాదం పంపిస్తానన్న వ్యక్తితో మొహమాటానికైనా సరే పంపండి అని మీరు ఎప్పుడో ఒకప్పుడు అనకుండా పోతారా! అప్పుడు మొదలౌతుంది అసలు కథ. మీకు ఒక కూతురుందనుకోండి "చూడమ్మా మీ అమ్మాయి ముఖంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది. కానీ కలి ప్రభావం వలన చాలా మొండిగా తయారవుతోంది. అది పోగొట్టాలంటే శాంతి యజ్ఞమో లేక కలిశాంతి చెయ్యాలి" అని ఆ స్వామి అన్నాడనుకోండి. పోతేపోయింది వెధవ వెయ్యి రూపాయలు అని పూజలు చెయ్యించరూ!!! ఇలాంటి పూజలు వందలవుతాయి. మీలాంటి అసంకల్పిత భక్త బకరాలు పదివేలవుతారు.
కాస్త ఆలోచించండి!
" ఇది కూడా నేను సాధికారంగానే రాశాను"
".ప్రస్తుతానికి నాదగ్గరున్నది అనధికారిక సమాచారం. ఈ బ్లాగుస్వామిద్వారా హెరాస్ చెయ్యబడిన కొందరి మాటల మాత్రమే ఆధారం."
అనధికారిక సమాచారంతో సాధికారంగా టపా రాసేసారుగా. మీకు మీరే సాటి. ఆరు నెలల నించీ తోట రాముడి గారి టపా రాలేదని తెగ బాధపడిపోతున్నాను. మీ వ్యాఖ్యలు, సమాధానాలు ఆ కొరతను తీరుస్తున్నాయిలెండి.
మీ లెవెల్ కి "జై హరిసేవ" అనడం బాగాలేదు,
నా రెండు వరహాలు
శోధన అంటే వున్న అన్ని మార్గాలతో అంటే చదివి , చూసి , విని ఇంకా ఏమైనా వుంటే వాటి ద్వారా తెలుసుకోవటం . ఇది మీరు చేయటం నిజం అది మీ బ్లాగులు చదివే అందరికి తెలుసు .
సాధన అంటే అర్థం ఏంటి ? ఏదైనా సరే కొంత ఆచరించి కొంత ప్రయత్నించి కొంత అనుభవించి తెలుసుకోవటమే . మీరు అలా ఏరోజైనా ఏ మతాన్ని అయినా పాటించార ? లేకుంటే అది సాధన ఎలా అవుతుంది ? సాధన చేసి మాత్రమె నమ్మటం ఎలా అవుతుంది ?
దీనికి సమాధానం చెప్పండి మహేష్ గారు , అందరికి అన్ని సమాధానాలు ఇచ్చి దీనికి మాత్రం ఇవ్వకపోవటం ఏంటి ?
మహెష్ గారు,
విమర్స సహెతుకంగ వుంటె విజ్ఞతతొ చెబుతున్నారు అని అనుకొవచ్హు.
మానసిక వ్యధతొ మాత్లాడిన వారికి దూరంగ వుండడమె మేలు అని నేను భావిస్తాను.
"అనానిమిష" బ్లాగు స్వాములపై, మీ "సైద్ధాంతిక" విభేదం బానే ఉంది. అయితే కొన్ని అర్థం కాలేదు. (ఇది మామూలే లెండి). మామూలుగా అనానిమిషులను అనాదరించే మీరు (ఇది రాస్తున్నప్పుడు అనానిమిషులకు వ్యాఖ్యలు రాసే సౌకర్యం లేకపోవడం కూడా చూశాను) ఇప్పుడు అలాంటి అవతారం ఎందుకెత్తుతున్నారో ఏమో?
ఆ స్వామి ఏదో స్వప్రయోజనం కోసం పూజలవి చేస్తానంటారు. ఉద్ధరిస్తానంటారు. సరే. ఆయన తప్పు. మీరే ప్రయోజనం ఆశిస్తున్నారు? జనాలను సక్రమ మార్గంలో పెట్టే గురుతర బాధ్యత మీకెవరు అప్పగించారు? మీది ఆయనకంటే పెద్ద స్వార్థమని అంటే?
@రవి: నాకు తెలిసింది నేను చెప్పాను. నా మాట నమ్మమనిగానీ, నమ్మకపోతే కలిదయవల్ల నాశనమైపోతారనిగానీ నేను వార్న్ చెయ్యడం లేదు. I am not taking any responsibility to change anybody.అది పెద్ద స్వార్థమయితే so be it.
హేతు వాడి అంటే దేనీనీ నమ్మక పోవడం అనే నమ్మ కానిని కలిగి ఉండటమా ?
Please answer vijaya kranthi's questions dude.. later you can argue..
* గుంటూరులో 'అగ్ని యాగం' చేయబట్టే ఆసియా లో కెల్లా పెద్దదయిన MARKET YARD మాడి మసి అయిందని, అలాగే కేసముద్రం దగ్గిర ఇటువంటి యాగం చేయబట్టే 'గౌతమీ' కాలిందని చెప్పుకుంటున్నారు.
ధారుణాలు,దుర్మార్గాలు,అమానుషాలు
* అచ్చంపేట మండలం వలపట్ల గ్రామంలో చేతబడి చేస్తున్నారని గ్రామంలో సంభవిస్తున్న చావులకు వీరే కారణంగా ఆరోపిస్తూ లక్ష్మమ్మ, నారమ్మలను రాళ్ళతో చావబా దారు.నోట్లో పాదరసాన్ని పోశారు. దాదాపుగా 3గంటల పాటు ఇద్దరు మహిళలను చావబాదు తున్నా గ్రామంలోని వారు ప్రేక్షకులుగా చూశారుకానీ మహిళలను రక్షించే యత్నం చేయలేదు. లక్ష్మమ్మపై దాడి జరుగు తున్న సమయంలో అడ్డు తగిలిన ఆమె పిల్లలను సైతం గ్రామస్తులు చావ గొట్టారు. మహిళల ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా చేసి చితకబాదారు.[సాక్షి ,సూర్య 3.2.2009.]
* జార్ఖండ్‌లోని దేవ్‌ఘఢ్ జిల్లా పథర్‌ఘాటియా గ్రామంలో మహిళల్ని దేవతలుగా పూజించే భారతీయ సంస్కృతిని సైతం పక్కనపెట్టి బహిరంగంగా ఐదుగురు మహిళల్ని వివస్త్రలను చేశారు. వారిని నగ్నంగా వూరేగించారు. మంత్రగత్తెలనే అనుమానంతో కొందరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వందల మంది ఈ దురంతానికి సాక్ష్యంగా నిలిచారు. బాధిత మహిళల్లో ముగ్గురు వితంతువులు ఉన్నారు. ఇద్దరితో మలమూత్రాలు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించారు.మంత్రగత్తెలని అంగీకరించాలంటూ వేధించారు. చేతబడి చేస్తున్నట్లుగా ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆ వూరిలోని భూతవైద్యుడి సూచనల మేరకే వారీ పనికి పాల్పడ్డారు. ఈ మహిళలు చేతబడి చేస్తూ గ్రామంలో సమస్యలు సృష్టిస్తున్నారని భూత వైద్యుడు చెప్పడంతో కొందరు గ్రామస్థులు ఆగ్రహించి ఈ దారుణానికి పాల్పడ్డారు.(ఈనాడు20.10.2009)
* ఉండ్రాజవరం లో చోటుచేసుకున్న మరణాలకు చేతబడే కారణమని స్థానికులు నమ్ముతూ ఆరుగురి పళ్లు పీకేశారు.అడ్డొచ్చిన పోలీసులను సైతం చితకబాదేశారు. వచ్చారు. గ్రామస్థులు సుమారు 4 వందలమంది అనుమానితులపై పడ్డారు. కారణం చెప్పకుండానే లాక్కొచ్చి రామాలయంలో బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆవేశంతో చేతికందిన వాటితో బాధితుల పళ్లు పీకేశారు. తామేం చేయలేదని, వదిలిపెట్టమని ప్రాధేయపడ్డా ఎవరూ కనికరించలేదు.గ్రామస్థుల దాడిని తట్టుకోలేకపోయానని కానిస్టేబుల్ మల్లికార్జునరావు బోరున విలపించారు. తమకే రక్షణ లేనప్పుడు సామాన్యులను ఎలా కాపాడగలమని ప్రశ్నించారు. తన లాఠీ, టోపీ లాక్కుని చొక్కా చింపేశారని ఘొల్లుమన్నారు. (ఈనాడు 18.3.2010)
Post a Comment