Thursday, March 25, 2010

పెళ్ళికి ముందు సెక్స్ చట్టవ్యతిరేకం కాదు

మొన్న సుప్రీం కోర్టు  "పెళ్ళికి ముందు సెక్స్ చట్టవ్యతిరేకం కాదు" అని వ్యాఖ్యానించింది.
తమిళనటి ఖుష్బూ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని రద్దుచేస్తూ కోర్టు ఈ మాట అన్నది.

నైతికత - చట్టం అనేవి రెండు భిన్నమైన విషయలు. అనైతికత అనేది నేరం కావచ్చు కాకపోవచ్చు. అది ఆ దేశ చట్టాన్ని బట్టి ఉంటుంది. సుప్రీం కోర్టుకూడా పెళ్ళికి ముందు సెక్స్ చట్టానికి వ్యతిరేకం అన్నదిగానీ దాన్ని మేము ప్రోత్సహిస్తాము అనలేదు. కాబట్టి ఈ నేపధ్యంలో జరుగుతున్న హిందూసాంప్రదాయాలూ, పెళ్ళివ్యవస్థ, పురాణాలూ లాంటి చర్చలూ ఆవేశకావేశాలు చాలా వరకూ అర్థహితాలు.

ఈ చర్చల్లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు;

ఖుష్బూ వ్యాఖ్యలమీద 2004 లో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ఇప్పటికి విచారణకి వచ్చింది. ఆ విచారణలో జడ్జిచేసిన observations ఇవి. ఇది తీర్పు కాదు.

1. వయోజనులు పరస్పర అంగీకారంతో గంటలు, నిమిషాలు సంభోగంలో పాలొనచ్చు. అది చట్టవ్యతిరేకం కాదు.దాన్ని సహజీవనం అనరు. Living in is different from having sex.


2. వ్యభిచారానికి చట్టపరమైన నిర్వచనం ఉంది. అలాగే సహజీవనానికీ ఉంది. కాబట్టి రెంటినీ "చట్టపరంగా" confuse అవ్వాల్సిన పనిలేదు. మీకు నైతికంగా ఏమైనా సమస్య ఉంటే అది మీ సమస్య.
Section 125 of Criminal Procedure Code (CrPC)లో జరిగిన మార్పుల దృష్ట్యా భార్యకీ సహజీవనంలో ఉన్న భాగస్వామికీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయి.So, it is legal to be in live- in relationships.

The Immoral Traffic (Prevention) Act or PITA వ్యభిచారాన్ని చాలా విశదంగా define చేస్తుంది.వేశ్యలకు ప్రైవేటుగా వ్యభిచారం చేసే హక్కు ఉంది. It is only offense if they solicit customers in public. వ్యవస్థీకృత వ్యభిచారం (బ్రోతల్)మాత్రం చట్టవ్యతిరేకం. ప్రస్తుతం ఆ చట్టాన్నికూడా మార్చి వ్యభిచారాన్ని decriminalize చెయ్యాలని మానవహక్కుల సంఘాలు ఉద్యమాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే చాలా మార్పులొచ్చిన ఈ చట్టం మరింత విప్లవాత్మక మార్పులు సంతరించుకోవచ్చు.

3.పెళ్ళి చేసుకున్నవాళ్ళు ఆ వ్యవస్థని అంగీకరించి దాని ప్రకారం జీవిస్తున్నారు. సహజీవనం పెళ్ళికి ప్రత్యామ్న్యాయం మాత్రమే. పెళ్ళి అనేది ఎలాగైతే ఒక choice అవుతుందో సహజీవనమూ అదేవిధమైన choice. కాబట్టి ఇక్కడ ఒక వ్యవస్థని అంగీకారాత్మకంగా స్వీకరించినవాళ్ళు మరో వ్యవస్థ "రుచి చూసి" ఆనందించడానికి రావడం భావవైశాల్యం అవదు...దాన్ని భావదారిద్ర్యం అంటారు.

Life style is a choice. పెళ్ళి అనే వ్యవస్థని పూర్తిస్పృహతో అంగీకరించినవాళ్ళు సహజీవనాన్ని సరదా కోసం చెయ్యడం వాళ్ళ వ్యక్తిత్వంలోని బలహీనతను సూచిస్తుంది లేదా వారి అవగాహనారాహిత్యాన్ని సూచిస్తుంది. అలాంటి వాళ్ళు పెళ్ళి వ్యవస్థలోంచీ బయటకొచ్చి సహజీవనాన్ని ఎంచుకోవడం మంచిది.

విడాకులు సులువుగా లభ్యమయ్యే ఈ కాలంలో they can surely chose one over other.They also have a right to switch between both institutions by choice. కానీ అవ్వాకావాలి బువ్వా ఒకేసారి కావాలి అంటే దాన్ని భావదారిద్ర్యంకాక ఏమనాలి?

3. అక్రమసంబంధం నేరం కాదు. అక్రమసంబంధం" అనేది politically correct పదం కాదు. ‘వివాహేతర సంబంధం’ అనేది సరైన పదం.

కోర్టువారు రాధాకృష్ణుల ఉదాహరణ భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలగురించి perceived morality ధోరణిలో (పురాణాలను సాంప్రదాయాలనూ ఉటంకిస్తూ) కొనసాగుతున్న లాయర్ వాదనను త్రోసిపుచ్చడానికి చెప్పినది మాత్రమే. That is part of the argument/observation NOT "judgment". భార్య భర్త మీద అక్రమసంబంధం నెరుపుతున్నాడనే నెపంతో విడాకులు మాత్రం కోరొచ్చు.

సహజీవనానికి చట్టబద్ధత వచ్చినా, వయోజనులు శృంగారసంబంధాలు పెట్టుకోవడం చట్టవ్యతిరేకం కాదన్నా అవి "పెళ్ళి" అనే వ్యవస్థకు వ్యతిరేకం కాదు. కేవలం పెళ్ళి కాకుండా ఇప్పటికే అమలులోవున్న మరికొన్ని alternate వ్యవస్థలకు ఆమోదం మాత్రమే. దీనివల్ల భారతీయ సంస్కృతికొచ్చిన ప్రమాదమూ లేదు. పెళ్ళి వ్యవస్థకొచ్చిన ముప్పూలేదు.

****

9 comments:

తెలుగు వెబ్ మీడియా said...

పెళ్ళికి ముందు సెక్స్ తప్పు కాదు కానీ పెళ్ళికి ముందు సెక్స్ పేరుతో అమ్మాయిలని వాడుకుని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటి సామాజిక పరిస్థితులలో పెళ్ళికి ముందు సెక్స్ తప్పు అనే అనుకుంటాను. ఇప్పటి అమ్మాయిలు పాత కాలపు సీతా, సావిత్రులలాగ లేరు కానీ మగవాళ్ళలో హిపోక్రిసీ ఇంకా ఉంది. శంకరాభరణం శంకరశాస్త్రిలాగ మడి కట్టుకోవాలని అనడం లేదు. అలాగని విచ్చలవిడి తిరుగుళ్ళు తిరగకూడదు.

ANALYSIS//అనాలిసిస్ said...

ఏసుక్రీస్తు తల్లి (మేరి) ఎవరితోనో( Joseph ? or God ?) సహజీవనం చేసి అతనిని కన్నది -అతను పవిత్రుడు(డట?) . మరి అలాంటప్పుడు భారతదేశంలో సహజీవనం తప్పు కాదు కదా ? ఏమంటారు ? దీన్ని మీరు ఎలా సమర్దిస్తారో ?

Kathi Mahesh Kumar said...

@శీను: యేసు "కథ"లో సమర్ధించడానికీ వ్యతిరేకించడనికీ ఏమీ లేదు. అదొక కథ, ఒక అభూత కల్పన, పుక్కిటి పురాణం. దానికీ ఇప్పటి చర్చకూ లంకెపెట్టి మీ ఆభిజాత్యాన్ని చూపించుకుని అక్కసు తీర్చుకుంటున్నారుగానీ...does it really make an argument at all?

మాక్సిమస్ మురళి said...

వివాహేతర సంబంధం "అక్రమసంబంధం" కాక సక్రమ సంబంధమా ?

The Mother Land said...

But the story of christ is not so old to justify. In bible also, they said that Christ was born to a Virgin Mary? then, whats ur comments on this..?

వడ్రంగిపిట్ట said...

@శీను:ఏసు క్రీస్తు ఒక్కరే కాదు మన హిందు పురాణాలలో చాలామంది అక్రమ సంతానమే. ఉదా: పాండవులు, కురవులు.. అసలు మన దాశరధ మహారాజుకి పిల్లలు పుట్టించే శక్తి లేక యజ్ఞం పేరుతొ ఎవరో ఋషికి పుట్టారు మన రామ, లక్ష్మణ, భారత, శతృజ్ఞులు. అలాగే మనమ భారత జాతిగా పేరుపెట్టుకున్న భరతుడు కూడా శకుంతలకు వివాహానికి ముందు పరిచయమైన దుష్యంతుల సంతానమే. మనడి గురివింద గింజ బతుకై వారివైపు వేలు ఎందుకు చూపుతారు.

Kathi Mahesh Kumar said...

@దామో: క్రీస్తుకథ ఎంత కొత్తదీ ఎంత పాతదీ అనేది అప్రస్తుతం. గాల్లోంచీ పిల్లలు పుట్టరు. ఆడామగా కలిస్తేనే పుడతారు. అది సహజం. కన్యమేరీకి పుట్టడం అనేది అర్థరహితం. అది అప్పుడైనా ఇప్పుడైనా పెద్ద తేడా లేదు.

Anonymous said...

కోర్టువారు రాధాక్రిష్ణులను సహజేవనం చేసారు అని చెప్పడం తప్ప మిగిలినది అంతా బాగుంది. కలిసి జీవించడం అన్నది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదు. రాధా క్రిష్ణులు చేసారు కాబట్టి తప్పేముంది అనుకుంటే క్రిష్నుడికి చాలా మంది భార్యలున్నారు కదా, దాన్ని ఉదాహరణగా తీసుకొని బహు భార్యత్వం అప్పటినుండే వుంది అని సమర్దించుకోవచ్చా? కోర్టువారు ఉదారహరణలు చెప్పేముందు కొంత ఆలోచించడం మంచిది. ఇలాంటివి ఈ మధ్య కోర్టుల్లో పెరిగిపోతున్నాయి.

Hima bindu said...

క్లోనింగ్ ద్వారా కూడా పుడతారు .జంతువులలో ''డాలీ ''పుట్టింది కదా .మహాభారతంలో కౌరవులు కూడా అలాగే పుట్టారు అంటారు కదండీ .పాశ్చాత్య దేశాల్లో వున్నసంస్కృతి సంప్రదాయాలు ఒక్కొక్కటి మన సంస్కృతిలో చోటుచేసుకున్డటం వింత కాదేమో ...ప్రపంచమే ఒక గ్రామం అయ్యింది కదా ,మనం అంతా ట్రాన్సిషన్ స్టేజ్ లో వున్నాం ..ముందు తరాలవారికి ఇది ఆమోదయోగ్యం అవుతుంది .ఒకప్పుడు వెనుక తరాల్లో ''విడాకులు ''అంటే వులిక్కిపడేవారు.,ఇప్పుడు పేపర్ లో మాట్రిమొనియల్ కాలం చూస్తె వున్నా నాలుగు పేజీల్లో మూడు పేజీలు విడాకులు తీసుకున్న వారే కనబడతారు ,ఈ రోజుల్లో ఇది సహజంగా ఆమోదిస్తున్నారు .సహజీవనం కానివ్వండి ఇతరత్రా రాబోయే తరాల్లో సహజంగానే ఆమోదిస్తారు .న్యాయమూర్తులు కూడా సంఘం లోని వారే కాలమాన పరిస్థుతుల బట్టి వారి తీర్పులు వుంటాయి .