Sunday, June 13, 2010

చేతబడి నేర్చుకుందాం - సంస్కృతిని ఉద్దరిద్ధాం

భారతీయ ‘చేతబడి శాస్త్రం’ అద్భుతమైనది. కారణం అది దేవుడి పేరుతో జరిగే ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉద్యమంచిన మహనీయులు తయారుచేసిన తంత్రపద్దతి కావడమే.

భారతీయ చేతబడి శాస్త్రం నిజంగా అద్బుతమైనది అనడానికి ఎన్నో ఋజువులు అడుగడుగునా కనిపిస్తాయి. చూచే దృష్టి మనకు ఉండాలి. ఇటువంటి మహోన్నత జ్ఞానాన్ని మనకిచ్చిన ఉద్యమకారులకు నిజంగా మనం ఋణపడి ఉన్నాం. హేళనాత్మక దృష్టివల్లా,గర్వం వల్లా, తెలిసినా తెలియకపోయినా ప్రతిదాన్నీ ఎగతాళి చెయ్యడం అలవాటు అయినందువల్లా ఇటువంటి దెయ్యవిద్యలను ఉపయోగించుకోలేక మనమే నష్టపోతున్నాం.

మనవైన చేతబడిని ‘విచ్ క్రాఫ్ట్’ పేరుతో పాశ్చాత్యులు నేర్చుకుని మనకే తిరిగి నేర్పే స్థాయిలో ఉన్నారు.
చైనీయులూ జపనీయులూ కూడా ‘వూడూ’ అనే పేరుతో ఇలాంటి విద్యల్ని సంరక్షించుకుంటున్నారు. తమ ప్రాచీన విద్యలనూ సంస్కృతినీ అమితంగా అబిమానిస్తూ గౌరవిస్తూ ఆచరిస్తూ ఎంత అభివృద్ది చెందారు.
 

రండి...మనమూ మన చేతబడిని నేర్చుకుని సంస్కృతిని ఉద్దరిద్దాం !


****


P.S. This post is a total Bullshit. ఇదొక చెత్త పోస్టు. ఎవరూ నమ్మకండి.


***

26 comments:

చదువరి said...

ఏదో మీరు విపరీతమైన వినయ సంపన్నులు కాబట్టి కే..వలం బుల్షిట్ అని చెప్పారు గానీ, ఈ టపా దాన్ని మించినదండీ! రైలు కట్టలెమ్మటా, చెరువు కట్టల మీదా కనబడే నిప్పుల కంటే హీనం అని చెప్పొచ్చు! నమ్మడం కాదు, అసలు చదవనే అక్కర్లేదు. కానీ, చదివాక కదా ఇది చదవరానిదని తెలిసేది, తొక్కాక కదా అది చెరువుకట్ట మీది నిప్పులని తెలిసేది! తొక్కనే తొక్కాను. ప్చ్!

జేబి - JB said...

lol. Super. I understand.

admin said...

కంటెంట్ వార్నింగ్ అని వస్తుంది. మీ బ్లాగ్ ఓపెన్ చేస్తుంటే ... ఏమైంది ????

Kathi Mahesh Kumar said...

@శ్వేతపత్రం: ఈ మధ్య మానసికంగా ఎదగని చాలా మంది నా బ్లాగుకొచ్చి గుండెలు బాదుకుంటున్నారు. అందుకని కేవలం పెద్దలకు మాత్రమే నా బ్లాగు అని అలా చేశా....on a serious note, మొన్న కొన్ని రక్తసిక్తమైన ఫోటోలు నా బ్లాగులో పెడితే ఎవరో సలహా ఇచ్చారు, ఇది అడల్ట్ కంటెంట్ కదా అని. అందుకని ఇలా...

@జేబి: వాస్తు, జోతిష్యం లాంటి కొన్ని పదాల్ని "చేతబడి"స్థానంలో ఉంచుకుని కూడా బోనస్ గా చదువుకోవచ్చు. I am sure you understand...;)

శరత్ కాలమ్ said...

బుధవారం 21 ఏప్రిల్ 2010
క్షుద్ర మాంత్రికులకు ఆహ్వానం!

http://sarath-kaalam.blogspot.com/2010/04/blog-post_21.html

ఆ.సౌమ్య said...

హ హ హ కేక!

జేబి - JB said...

నా వ్యాఖ్యలో వ్యంగమేమీ లేదని అర్ధం చేస్కున్నందుకు ధన్యవాదాలు; మీరు వెరే బ్లాగులో రాసిన వ్యాఖ్యల తర్వాతే ఇక్కడ నేను వ్యాఖ్య పెట్టా. నాకు వాస్తు, జ్యోతిషం వంటివాటి మీద నమ్మకం లేదు - అందుకే నాకు మీరిక్కడ రాసినది నచ్చింది.

Anonymous said...

You think that you are promoting 'constitutional' spirit (refer 51A a-h) through such writings? Can you prove it is unscientiffic? What qualification in science you have anyway to prove it? Science needs reasonable proof.

Nrahamthulla said...

జన విజ్ఞాన వేదిక వారు 'రక్ష' సినిమా దర్శక నిర్మాతలకి ఓ సవాలు విసిరారు. ఆ సినిమాలో చూపినట్లుగా చేతబడి ఉందని ప్రూవ్ చేస్తే పది లక్షలు ఇస్తామని వారు అన్నారు. సినిమాలనేవి సమాజాన్ని జ్ఞానవంతులని చేయాలి. కానీ వర్మ తన సినిమా ద్వారా చేతబడి అనే మూఢ నమ్మకాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు కాబట్టి సెన్సార్ వారు పట్టించుకుని ఈ సినిమాపై బ్యాన్ పెట్టాలని వారు డిమాండ్ చేసారు. వర్మ కేవలం డబ్బు సంపాదనకే ఈ రకమైన సినిమాలు తీస్తున్నాడని, జనాల నమ్మకాలతో ఆడుకుంటున్నాడని విమర్శించారు. చేతబడి మూడనమ్మకాలను ప్రోత్సహించే విధంగా సినీ నిర్మాత దర్శకుడు రాం గోపాల్‌ వర్మ నిర్మించిన రక్ష సినిమాను, చేతబడిని వ్యతిరేకిస్తూ ఓ బాలిక తనపై చేతబడి చేయాలని అందుకు తన వెంట్రుకలు, గోళ్లు, తాను తొక్కిన మట్టి పంపుతున్నానని సవాల్‌ విసిరింది. రక్ష సినిమాకు సంబంధించి జన విజ్ఞాన‌ వేదికకు రాం గోపాల్ వర్మ విసిరిన సవాల్‌పై ప్రతిగా టి.శ్రీయ అనే ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తల వెంట్రుకలు , గోళ్లు, ఆమె తొక్కిన మట్టిని వర్మకు పోస్టు ద్వారా పంపారు. ఆయనకు నిజంగా దమ్ముంటే ఆ పాపకు చేతబడి చేయాలని, తనకెంత సమయం కావాలో అంత సమయం తీసుకొమ్మని వారు సూచించారు. సమాజాన్ని, ప్రజలను చేతబడి మూఢనమ్మకాల వైపు మళ్లించే విధంగా సినిమాలు తీయడమే కాకుండా దాన్ని సమర్థించుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని జన విజ్ఞాన వేదిక నాయకులు పేర్కొన్నారు. తనకు చేతబడి మీద విశ్వాసం లేదని చెబుతున్న వర్మ మరోవైపు చేతబడిని నమ్మించే విధంగా సినిమాలు తీస్తున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి సినిమాల వల్ల రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చేతబడి, బాణామతి నెపంతో దళితులు, బలహీన వర్గాల వారిపై అఘాయిత్యాలు, వేదింపులు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
చేతబడి కారణంగా దానికి చాలా సందర్భాల్లో అమాయకులు బలైపోతున్నారు. అనుమానితుల్ని రాళ్ళతో కొట్టడం, వివస్త్రల్ని చేసి ఊరేగించడం, పళ్ళు రాలగొట్టడం, మల మూత్రాదులు బలవంతంగా తినిపించడం ఇలాంటి చిత్ర హింసలకు గురి చేయడం జరుగుతున్నది. ఇందుకు కారణం ఊర్లో ఉండే భూత వైద్యులు కూడా.
(సాక్షి,సూర్య 3.2.2009 ఈనాడు 20.10.2009,18.3.2010)

Nrahamthulla said...

ఉండ్రాజవరంలో ఆరుగురి పళ్ళు పీకేసిన నేపద్యంలో కలెక్టర్ కోరిక మేరకు చేతబడులు ఉన్నట్లు నిరూపిస్తే రూ.లక్ష ఇస్తానని, అంత ప్రభావం ఉంటే నామీద ప్రయోగించండని జనవిజ్ఞాన వేదిక పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పి.వీరాస్వామి సవాల్‌ విసిరారు.

Kathi Mahesh Kumar said...

@చదువరి: మీరు మహా లౌక్యులు సుమా !
ఇదే వ్యాసం జోతిష్యం మీద రాసుంటే "హా నా భారతీయ సంస్కృతి" అని స్తుతించేవాళ్ళు. ఇది క్షుద్రవిద్యకాబట్టి అశుద్దం అని నిర్ణయించేశారు. మీకు రాజకీయనాయకుడయ్యే లక్షణాలు మెండుగా ఉన్నాయి. కానీ పార్టీ తప్పుగా ఎంచుకున్నట్లున్నారు. పార్టీమార్చెయ్యండి జెండా పాతెయ్యండి. భారతీయ సంస్కృతిని రక్షించండి.

@రహంతుల్లా: అదే సవాలు నేనూ వాస్తువిజ్ఞానవంతులకూ, జ్యోతిష్యపండితులకూ విసురుతున్నాను. ఎవరూ రాలేదు లెండి.

రాంగోపాల్ వర్మ హారర్ సినిమాల విషయంలో మీరు లేవనెత్తిన పాయింట్స్ మీద నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. సాహిత్యం, సినిమాలలో భయానకం, భీభత్సం అనేవి రసాలు. వాటికి ఇలాంటి విలువలు ఆపాదించడం అనవసరం అనుకుంటాను. సినిమాల్లో ఎలాగూ "ఇది కేవలం కల్పితం" అనే disclaimer వేస్తూనే ఉంటారు.

అయినా, అరుంధతికి లేని అభ్యంతరం రక్ష కెందుకు? సాయిబాబా మహత్యానికి లేని అభ్యంతరం ఆవహం కు ఎందుకు? aren't both same?

@SNKR: This is a bullshit post.A satire. As you are asking me scientific proof, am seeking same from these cultural crusaders defending jyothishyam and vaasthu.

Anonymous said...

మహెష్ గారు,

మీరు హిందు మతస్తులకు మెలుకొలుపు చెసె ప్రయత్నం నిజంగా అభినందనియం(మీరు ఏ ఉద్దెశంతొ చెసినా సరె) అదెవిదంగ మీ దళితులు ఎంతొ మంది గుండెలమీద టాట్టులు వెయించుకొని, జ్వరం లాంటి ఇంకెమైన ఆరొగ్యపరమైన ఇబ్బందులు వస్తె "పాస్టర్స్ లెక ఫాదరస్ దగ్గర ట్రీట్మెంట్ చెయించుకుంటున్నరు" కొంచెం వాళ్ళ మీద కూడా ద్రుష్టిపెట్టండి సార్

Kathi Mahesh Kumar said...

@కోనసీమ కుర్రాడు:దళితులు,ఆదివాసీల సమస్యల విస్తృతత్వం మీద నాకు అవగాహన ఉంది. వాటిమీద దృష్టీ ఉంది.

2.5 మిలియన్ ప్రార్థనాస్థలాలున్న ఈ దేశంలో, స్కూళ్ళు కేవలం 1.5 మిలియన్ ఉన్నాయి. ఆసుపత్రుల సంఖ్య 75 వేలు దాటడం లేదు. మరి మూర్ఖత్వం,మూఢనమ్మకాలూ ఎక్కడ్నుంచీ వెళ్ళిపోతాయి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? అందుకే నా రాతలు ఇలా ఉంటాయి.

Anonymous said...

@కత్తి మహేష్ కుమార్
2.5 మిలియన్ ప్రార్థనాస్థలాలున్న ఈ దేశంలో, స్కూళ్ళు కేవలం 1.5 మిలియన్ ఉన్నాయి. ఆసుపత్రుల సంఖ్య 75 వేలు దాటడం లేదు. మరి మూర్ఖత్వం,మూఢనమ్మకాలూ ఎక్కడ్నుంచీ వెళ్ళిపోతాయి? అభివృద్ధి ఎలా జరుగుతుంది? అందుకే నా రాతలు ఇలా ఉంటాయి.

మీరు వ్రాయడానికి కారణం అదే ఐతె, మతం ప్రస్తావన ఎందుకు? కులాల ప్రస్తావన ఎందుకు? కెవలం ఒక వర్గం మీద దాడి ఎందుకు?

Kathi Mahesh Kumar said...

@కోనసీమకుర్రాడు: నాకు అన్ని మతాల విధానాలతోనూ సమస్య ఉంది. హిందూమతం (బ్రాహ్మనిజం) being the predominant one దాని మీద నా ఫోకస్ ఎక్కువుంటుంది.

మతప్రస్తావన లేకుండా మూఢనమ్మకాల గురించి నేను మాట్లాడనేను. కుల ప్రస్తావన లేకుండా అందులోని అణచివేతను చర్చించలేను.వర్గ ప్రసక్తి లేకుండా జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించలేను.If you have issue with it, you are welcome to discuss it. But, don't expect me to change it for your convenience.

త్రినేత్రుడు said...

అగ్రకులాల మీద పడి ఏడవటం ఆపెహే.ఏదన్న అంటే రాజ్యాంగం,హక్కులు మన్ను మశానం చెప్తావు ఏదో అవన్నీ నీకే తెలిసున్నట్లు.

నీ బ్లాగు పేరెమో పర్ణశాల.రాసే రాతలు బ్రోతల్ హవుస్ స్టాండర్డ్ వి.ఛీ

Anonymous said...

@మహేష్: నాకు అన్ని మతాల విధానాలతోనూ సమస్య ఉంది-ఇది పచ్చి అబద్దం

I don't have any issue to argue, and don't have any expectations on you

Anonymous said...

@మహెష్:నాకు అన్ని మతాల విధానాలతోనూ సమస్య ఉంది-ఇది పచ్చి అబద్దం,

హిందూమతం (బ్రాహ్మనిజం) being the predominant one దాని మీద నా ఫోకస్ ఎక్కువుంటుంది-ఇది నిజం

Kathi Mahesh Kumar said...

@కోససీమకుర్రాడు: అది మొత్తం ఒక వాక్యమే. ముక్కలుముక్కలుగా మాత్రమే నిజాన్ని నీ కన్వీనియన్స్ కోసం అర్థం చేసుకుంటానంటే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. అయినా నీ అభిప్రాయంతో "నా నిజాలు’ మారిపోవు. ఇలాంటి విజయాల్ని డిక్లేర్ చేసేముందు నా బ్లాగులో ఎన్ని టపాలు చదివావో ఒకసారి గుర్తు చేసుకో.

Anonymous said...
This comment has been removed by the author.
Kathi Mahesh Kumar said...

@లెర్న్: మీరు చాలా నేర్చుకోవలసింది ఉందనుకుంటాను. దైవిక మహిమలున్నాయని నమ్మడం సాంప్రదాయమైనప్పుడు మంత్రతంత్ర సంబంధమైన శాక్తవిద్యలు సంస్కృతి ఎందుకు కాదు? సింపుల్ సమాధానం ‘మీరు కాదనుకుంటున్నారు కాబట్టి’ లేదా మీకు ‘ఇవి కావు’ అని ఎవరో చెప్పారు కాబట్టి.

అంటే మీరు నాకు మూర్ఖుడు నేను మీకు మూర్ఖుడు. చెల్లుకుచెల్లు.

అయినా నేను రాసింది బిల్ షిట్ అని నేనే చెబుతుంటే దాన్ని ప్రశ్నిస్తున్న మీరెంత...బిల్షిట్టో!

ఇక నాశాడిజం గురించి మాట్లాడే ముందు ఎంత మంది శాడిస్టులు నా మీద వ్యంగ్యాస్థాలు...కాదుకాదు ఏకంగా వ్యంగ్య బ్లాగులు నడిపారో తెలుసుకోండి. Then would have a clear estimate of who is a sadist.

I am sure you too deserve my pity.

శశికాంత్ said...

మూఢ నమ్మకాలు వేరు, సంస్కృతి వేరు. హిందూ గ్రంథాలలో ఎక్కడైనా చేతబడి గురించి ప్రస్థావన ఉందా? లేదు. కానీ క్రైస్తవ మరియు ఇస్లాం గ్రంథాలలో ఇవి అథికారికంగా ఉన్న నమ్మకాలు. అవి వదిలేసి ఇక్కడ హిందువులపై చిందులేస్తున్నారు. హిందూ మతం ప్రతి పనికిమాలిన వాడికి లోకువైపోయింది. దమ్ముంటే ఇస్లాం, క్రైస్తవ చేతబడుల గురించి రాయండి. witch hunts పేరుతో ఎందరో ఆడవాళ్ళను దారుణంగా చంపారు క్రైస్తవులు. ఇహ ఇస్లాం సంగతి చెప్పక్కర్లేదు. ఈ మధ్య సౌదీలో ఒకడిని చేతబడి చేశాడని ఉరి తీశారు.

ravi said...

pillalu meeku chala vichayalu theliyavani telisipotundi naaku oka addres istanu meeku chala vchayalu telustayi aavi ravi chandran ante aatma latomatladutaadu

ravi said...

tantra grahndhalu meeru sadinatlu ledu meeranta brahtish saduvulu sadivinavariki ivi ardamgaavu

student of teacher said...

sorry to say like this chethabadi anedi mudanammakam ane prathivadu pedda vedhava bcoz cehthabadi manchi ani nenu anatledu but chethabadi venaka chala scientifical knowledge udi....asala mundu meeru chethabadi gurinchi telusukovalante first prove to yourself the existence of soul scientifically....soul anedi ledu ani chala mandi vedhavalu antaru andi vallaki soul existence ni prove cheyataniki oka small hint isthunnanu"human body and a chair both are completely made of atoms only difference is both are made of different atoms,but a chair cannot move on its own but a HUMAN BODY can.....what makes a HUMAN BODY move????? 2nd hint-what is the difference between human body and human being????? 3rd hint-what is he difference between brain and mind?????" by these hints you can scientifically prove the existence of soul....one word evaraina enti ra babu veedu thikkalodi la unnadu brain and mind rendu okatega difference aduguthadu enti ani anukune vallu evaranna unte alanti vallu emi alochinchakunda chachipondi bcoz meeru brathakatam kuda waste aa....if any doubts post it i will definately give the proofs to you....

Unknown said...

ఎక్కడ నేర్పుతారు