Senior CCMB scientist Kumarasamy Thangarajan said there was no truth to the Aryan-Dravidian theory as they came hundreds or thousands of years after the ancestral north and south Indians had settled in India.
The study analysed 500,000 genetic markers across the genomes of 132 individuals from 25 diverse groups from 13 states. All the individuals were from six-language families and traditionally “upper” and “lower” castes and tribal groups. “The genetics proves that castes grew directly out of tribe-like organizations during the formation of the Indian society,” the study said. Thangarajan noted that it was impossible to distinguish between castes and tribes since their genetics proved they were not systematically different.
The study was conducted by CCMB scientists in collaboration with researchers at Harvard Medical School,
ఉత్తర(UP,Bihar)-దక్షిణ(Tamilandu,Kerala)-తూర్పు (West Bengal,Orissa)-పశ్చిమ(Pujab,Haryana)-ఇంకా north east వైపుకు కువెళితే భారతీయుల మధ్య, శరీరనిర్మాణం, సాంస్కృతిక విధానాల్లో తేడాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.కాబట్టి మనది mixed race అనేది కాదనలేని సత్యం.
1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. It was a "great idea" and it still is. రాజకీయంగా,భౌగోళికంగా ఒకటైనంత మాత్రానా, ‘అందరూ ఒకటే’ అనే సిద్ధాంతం కూడా చెల్లదు.కాబట్టి ఆర్య-ద్రవిడులే కాదు, నానా జాతుల సమాహారం భారతదేశం. అదే భిన్నత్వంలో ఏకత్వం.
ఈ భావనని అర్థం చేసుకోకుండా, ఎవడో కుట్ర చేసాడనికి మనం కుట్రలు అల్లుకుంటూ వామపక్ష చరిత్రకారులమీదా, మ్యాక్స్ ముల్లర్ మీదా పడి ఏడిస్తే ఏంలాభం?
"బయట" "లోపల" అనేవి చారిత్రాత్మకంగా సమస్యాత్మకమైన నిర్వచనాలు.ఆప్ఘనిస్తాన్ అవతలినుంచీ బర్మాలోని చిట్టగాంగ్ వరకూ, వీలైతే ధాయిలాండ్ వరకూ, హిమాలయాలనుంచీ శ్రీలంకవరకూ "అఖంఢ భారతం"గా కొన్ని సిద్ధాంతాల ఆధారంగా వాదించొచ్చు, కొంత వరకూ నిరూపించొచ్చుకూడా.
ఇక శరీరాల్లో తేడాలంటారా,ఒక సారి మణిపూర్ వెళ్ళి తరువాత బీహార్ రండి. లేకపోతే పంజాబ్ నుంచీ తమిళనాడుకి ప్రయాణం కట్టండి. తేడాలు మీకు కొట్టొచ్చినట్టు కనబడతాయి.
మనకంటూ హిస్టరీ ఉన్నట్టా లేనట్టా అనే బాధ అసంబద్ధం."మనదంటూ" ఒకప్పుడు ఏమీలేదు. ఎందుకంటే ఒక definitive దేశంగా మనం మారిందే 1947 లో, అంతవరకూ ఒదొక notionally unified culture అంతే!
Recorded history కన్నా ముందు, ఎవరు ఎక్కడికి ఖండాంతరాల వలస వచ్చారు అన్నదానికి ఒకదానుకొకటి పొంతనలేకుండా వంద సిద్ధాంతాలు ప్రతిపాదించొచ్చు. కాని దానివల్ల మన వర్తమానానికొచ్చే నష్టంగానీ, విరగ్గాసే లాభంగానీ లేదనే నా ఉద్దేశం.
తమిళనాడు neo-political-cultural nationalism ఒక ప్రత్యేకమైన case దాని గురించి చర్చించాలంటే అదొక పెద్ద కథ అవుతుంది.
1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు. అంతేకాకుండా,విస్తీర్ణంలో మిక్కిలైనవీ, జనాభా రీత్యాకూడా బాహుళ్యమైనవీ అయిన లెక్కకు మించి రాజ్యాలూ, సంస్థానాలూ వారి పనుల్లో వారున్నారేతప్ప స్వాంతంత్ర్యోద్యమ స్పూర్తికూడా వీరిని అంటలేదు.
మైసూర్, ట్రావెంకూర్, హైదరాబాద్, కాశ్మీర్, జునాగడ్, జైపూర్,బార్మేర్,ఉదైపూర్,బికానేర్,జోధ్పుర్,north-east రాజ్యాలూ, భోపాల్ మరియు ఇతర మధ్యభారతంలోని పలు విశాలమైన సంస్థానాలు ప్రత్యేకరాజ్యాలుగా స్వాతంత్ర్యానంతరం వరకూ మిగిలాయి.
బ్రిటిష్ పాలనలో, మిగతా భారతదేశంకూడా ప్రెసిడేంసీల మయమేతప్ప ఒక సంఘటిత పాలనా యూనిట్ కూడా కాదు.గోవా,యానాం,పాండిచ్చేరి వంటి భాగాల్లో ఫ్రెంచ్ వారు, పోర్చుగీసువారుకూడా పరిపాలించే వారు.ఈ భాగాల్నన్నింటినీ ఒక రాజకీయపటంగా మార్చడానికి దాదాపు 1975(సిక్కిం భారతదేశంలో కలిసే)వరకూ పరిశ్రమించాల్సివచ్చింది.
నిజానికి 1947 లో స్వతంత్ర్యం వచ్చినప్పుడు భారతదేశం ఒక దేశంగా మనగలుగుతుందనే ఆశ ప్రపంచదేశాల్లో ఎవరికీ లేదు. ఎందుకంటే ,భారతదేశం అనేది అప్పటికి కేవలం ఒక గొప్ప ఆలోచన మాత్రమే. ఇప్పటికీ అది మన ఆలోచనల్లో స్థిరపడిందేతప్ప, నిజమై ఆవిష్కరింపబడలేదు. కాకపోతే, ఈ దేశం ఇంకా రాజకీయంగా, భౌతికంగా ఒకటిగా ఉందంతే.మానసికంగా we are a fragmented country still.
ప్రస్తుతం ద్రవిడ-ఆర్య సిద్ధాంతాలను కుట్రలంటున్నవాళ్ళ discourses లో "అనుకుంటున్న" భారతీయత సాంస్కృతికపరమైన భారతీయత(cultural nationalism)కానీ, స్వాతంత్ర్యోద్యమ సమయంలో వచ్చిన చైతన్యం రాజకీయ భారతీయత(political nationalism)కు చెందిన సృహ. కేవలం rhetoric కోసం ఈ రెంటినీ కలగాపులగం చేసి వాడుకుని, ఒక emotional issue చేస్తున్నారుగానీ అవి రెండూ వేరు.
భారతీయరాజకీయ భావనకూడా భారతదేశం మొత్తం ఏకస్థాయిలో లేదు. ఉదాహరణకు కాశ్మీర్ లో ఉండే భారతీయ భావన యొక్క తీవ్రత,definition వేరుగా ఉంటే, గోవా లో దాని స్వరూపం విభిన్నంగా ఉంటుంది.సిక్కింలో దాని రూపం వేరుగా ఉంటే పంజాబ్ లో పరిస్థితి మారుతుంది.
అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.
కాలానుగుణంగా లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన సిద్ధాంతాలు ప్రతిపాదించబడతాయి, తుంగలోతొక్కివేయబడతాయి.అంగీకరించబడతాయి, వ్యతిరేకించబడతాయి.
అదే విధంగా అనుకూల సిద్ధాంతాలను నెత్తికెక్కించుకోవడం,ప్రతికూలంగా అనిపించినదాన్ని పట్టించుకోకపోవడం సమాజాలూ,interest groups చేసే పని. వాటిని context of time లో చూసి అర్థం చేసుకోవాలేతప్ప వాటి ఆధారంగా వర్తమానాన్ని నిర్ణయిస్తామంటే కొంచెం ఆలోచించాల్సిందే!
ఉదాహరణకు ఆర్య-ద్రవిడ అనుకూల సిద్దాంతాన్ని సాంస్కృతిక-రాజకీయ లబ్ధికోసం తమిళులు ఎలా ఉపయోగించుకున్నారో, దాని ప్రతికూల సిద్ధాంతాల్ని బీజేపీ తన హిందుత్వ అజెండాకోసం ఉపయోగించుకుంటోంది. కానీ ఈ సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మి మనం మనవర్తమానాన్ని సమస్యాత్మకం చేసుకోవడం అర్థరహితం. మన బాధ్యత వాటి నేపధ్యం ఆధారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి "రాజకీయాలకు" దూరంగా ఉండటానికి ప్రయత్నించడం ఒక్కటే.
ఇతరుల లాభానికి మనం తెలిసీతెలియకుండా పావులవకుండా ఉండటం మరియూ విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని, విజ్ఞత ఉపయోగించి విచక్షణతో వ్యవహరించడాన్ని ఫలాయనమని నేను అనుకోను.
ఆ discretion మనకొచ్చే చర్చలు లాభదాయకమేతప్ప, playing in to those politics to jeopardizes our present is always useless. అందుకే, dispassionate గా విషయం తెలుసుకోవడానికి చర్చలు కావాలిగానీ, ఏదో ఒక తరఫున emotional rhetoric లో భాగమవ్వడానికి కాదు.
****
25 comments:
>>> అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.
Deenivalla upayogam emiti? Enduku aa bhavana ninchi dooram avvali?
@విశ్వనాథ్: ఏకత్వమంటే భిన్నత్వాన్ని కాలరాసి monolithic culture అవడం కాదు.ఉన్న భిన్నత్వాల్ని గుర్తించి, గౌరవించి వాటిమధ్య ఒక ఏకసూత్రాన్ని కల్పించడం.
ప్రస్తుతం నియో-కల్చరల్ నేషనలిజం పేరు మీద ఆ భిన్నత్వాన్ని నాశనం చేసి ఏకత్వాన్ని సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, భిన్నత్వంలో ఏకత్వ తపనకు విరుద్ధం. Its not the denial of the difference, but accepting it and still being one that matters.
ఏకత్వమంటే భిన్నత్వాన్ని కాలరాసి monolithic culture అవడం కాదు.ఉన్న భిన్నత్వాల్ని గుర్తించి, గౌరవించి వాటిమధ్య ఒక ఏకసూత్రాన్ని కల్పించడం.
very nice
but distruction of the diversities in culture is not actually the moto of indian thought culture.
it is base for the globel village
>>> ఏకత్వమంటే భిన్నత్వాన్ని కాలరాసి monolithic culture అవడం కాదు.ఉన్న భిన్నత్వాల్ని గుర్తించి, గౌరవించి వాటిమధ్య ఒక ఏకసూత్రాన్ని కల్పించడం.
అందుకే Indian culture లో భిన్నత్వానికి ఎంత importance అయితే ఇచ్హారో అంతే importance ఏకత్వానికి కూడా ఇచ్హారు ... భిన్నత్వాల్ని destruct చేసిన ఉదాహరణలు ఏమైనా ఇవ్వగలరా?? ... కానీ భిన్నత్వం, ఏకత్వం రెండిటిలో choose చేసుకోవల్సి వస్తే ఏకత్వం important అని నాకు అనిపిస్తుంది ... ఎందుకంటే వ్యక్తి కంటే కుటుంబం, కుటుంబం కంటే సమాజం, సమాజం కంటే దేశం priority అని నా అభిప్రాయం ...
Thangarajan is one of the authors of the paper that he commented on. Surprisingly, many interpretations that I read at that time were different from his. See for example this post http://suvratk.blogspot.com/2009/09/genetic-ancestry-of-indians-new-paper.html by Suvrat Kher. The question is not purely academic. Some of the legal implications were pointed out in 'The law and other Things Post' post http://lawandotherthings.blogspot.com/2009/09/origins-of-caste.html
@విశ్వనాథ్: I think you are not getting my point....Indian is one nation with ONE PEOPLE కన్నా "India is one nation with MANY PEOPLE (as collectives)" అనేది విలువైనది కాబట్టే వివిధ సంస్కృతుల్ని లేదు లేదు అనే బదులు అవున్నాయని గుర్తిస్తూనే వాటిని "మనవి" చేసుకోవాలంటున్నాను.
మీరు ఏకత్వాన్ని సమగ్రతతో confuse అవుతున్నారు.అవి రెండూ వేరు. ఇక్కడ నేను చెబుతున్న ఏకత్వం మీకు important గా అనిపించినట్లే, హిట్లర్ కూ అనిపించింది. అందుకే ఆర్యన్ రేస్ తప్ప మిగతా అందరినీ చంపడానికి పూనుకున్నాడు. Unity can never be at the cost of diversity.
>>> Indian is one nation with ONE PEOPLE కన్నా "India is one nation with MANY PEOPLE (as collectives)" అనేది విలువైనది కాబట్టే వివిధ సంస్కృతుల్ని లేదు లేదు అనే బదులు అవున్నాయని గుర్తిస్తూనే వాటిని "మనవి" చేసుకోవాలంటున్నాను.
- This is what that has been happening in India ... do you have any specific instance where one different culture was not accepted/thoroughly rejected by Indian people. Before going there, what do you mean by "Acceptance"?
- Hitler visualized the Aryan race as superior to other races ... I don't say that as "ఏకత్వం".
@విశ్వనాథ్: you sound very naive.Acceptance and rejection అనేవి instances కావు. They are "processes".ఈ కాలంలో అవి చాలా లోపాయకారిగా జరుగుతాయి. మీరు ’exclusionary nationalism” అనే మాట ఎప్పుడైనా విన్నారా?
"One notices that the infiltration of RSS progeny in practically all areas of society and state structure has created a social common sense and orientation which already has the deeper elements of Hindu Nation."
"Hindu nationalism is a form of ethno- centric nationality based on mythical homogeneity, tilting towards race based nationalism. In fascism the divide is between republican democracy and narrow definitions of nationality and nationalism."
>>> ప్రస్తుతం నియో-కల్చరల్ నేషనలిజం పేరు మీద ఆ భిన్నత్వాన్ని నాశనం చేసి ఏకత్వాన్ని సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Nenu adugutunnadalla ee particular statement ki basis emiti ... ala nasanamina examples emina choopinchagalara .... ??? Ee culture reject ayyindi ani konni examples choopinchandi ...
Fantastic topic and well written, I haven't seen a better article on this topic so far..but not the best I have read from you. Some how it looked like the author in Mahesh has over taken the rational presenter of a concept. The smooth flow of unveiling the idea and fortifying it with rational thought is missing.
I totally agree that till 1947 there was no India, it was just a "great idea" -- well said. One major political party also tried convince people that 1857 revolt was the first war for Indian independence. There can't be a bigger lie then this.
But this is the truth about any, any country. All the countries were just ideas before they were formed and this idea can never be 100% concrete even after the country formation. And there is no guarantee that the idea will remain intact forever. We have seen a few examples of those in the last few decades in Germany or Yugoslavia or USSR
Sincerely I couldn't get clarity on the below thought
అందుకే మనలో భిన్నత్వంలో ఏకత్వం ఎంతో ఏకత్వంలో భిన్నత్వమూ ఇప్పటికీ అంతేకాబట్టి India as one nation with ONE PEOPLE అనే అపోహనుంచీ దూరమవ్వాలని నా అభిప్రాయం.
I feel Unity in diversity and Diversity in unity mean the same.
I don't understand why we shouldn't feel India is ONE NATION with ONE PEOPLE. One people doesn't mean there should be monolithic culture.
I think India can certainly be called One Nation with wide range of diversity. If India cannot be called One Nation, I don't know which country can be called One Nation. I am not saying this with some kind of pride, this is just a rational question. There is diversity every where varying with the size of the country. I think some countries or a few people foolishly try to unify this diversity in the name of communism, dictatorship, religionism or regionalism but it is not possible to sustain this in the longer run ...well China is still there :-)
I also feel The Indian State was never a fore runner in such kind of activities till date. Yes, some times we can say it might have been just a spectator and might not have done enough to protect its diversity. I just remembered….. Sadly there are few examples like doing bhoomi pooja for projects, muhurtams for openings etc., but may be not very major.
I agree with you, Unity in diversity never ever meant establishing a monolithic culture. It means we take pride in our diversity and it should also mean that there is unity, in rule of law, equal opportunities to all and fundamental rights to all.
Yes I do agree some/all bloody ***** political parties do keep raising this issues and try instill false pride in the peoples mind based on stupid parameters like culture, religion region etc., we should denounce them. I don't become better then Katti Mahesh because of the region I am born in or caste I am born in or the religion. I should be talented enough. (Talents and one being better then other is a different story)
I totally agree your conclusions but steps in reaching those conclusions were a bit blurry and the expressions were playing to the gallery. Nevertheless it still a good post and raises fundamental questions.
I under criticizing is a lot easier the writing a post, but still ... :-)
ఆర్యులు బయటివారనే సిద్ధాంతాన్ని మాత్రం నేను అంగీకరించను. కానీ ఒక భౌతిక వాస్తవంగా ఈ వ్యాసంలోని విషయంతో 99% ఏకీభవిస్తున్నాను, దీన్ని వ్రాయడంలో ఈ వ్యాసకర్త యొక్క అసలు ఉద్దేశం ఏదైనప్పటికీ.
--తాడేపల్లి
Another perspective
Your post also brings up some of my forgotten thoughts in process (were in process some time back). When reading Indian history, I always felt it was the circumstances that lead to India's formation.Without Gandhi and other many great leaders, it might have reduced to another Afghanistan. But some times I also wonder, why only 3 countries were formed out of Indian sub continent (not including Nepal, Burma etc). Why didn't people clamor for formation of more countries. people could have asked for a separate Punjab, Maharashtra or Tamilnadu. May be there were some similarities through out the sub continent in a way the women and down trodden were oppressed (negative aspects), social structure, basic religious concepts, some cultural aspects and of course geography would have played a major role in threading all these.
Or may be it was (early) Brahmanism which has spread through out the sub continent in one form or the other, that has held it together. (just a thought)
మహేష్ గారూ, చాలా బాగా రాశారండీ. I appreciate your thought contributions to this society.
"1947 కు మునుపు భారతదేశం అనేది ఒక దేశంకూడా కాదు. "It is a great idea and it still is."
వచ్చిన చిక్కల్లా, ఈ అద్భుతమైన భావనని సాకారం చేసుకునే ప్రయత్నం చేయకుండా.. వేల సంవత్సరాల ముందునుండే సంపూర్ణమైన ఏకత్వం ఉన్నట్లు నమ్మబలికే వాళ్ళతోనే. ఒకరకంగా వీళ్ళది Fake it and then Make it ఫిలాసఫీ అన్నమాట. వీళ్ళు మొదట ఎక్కుపెట్టే Fake belief నే దేశభక్తి అని అమాయకంగా నమ్మే వాళ్ళు, ఆ belief ని ప్రశ్నిస్తే తట్టుకోలేరు. Fake it and make it కంటే Realize-Accept and Work on it అనేదే న్యాయమైన పద్దతి. అదే విదంగా అసలు ఈ great idea realize అవ్వడానికి అసలు basis లేదని అనుకోవడం కూడా సత్యదూరమే.
ఇంక విషయానికి వస్తే, probably every other country in the world also has diversity of it's own measure. India may be a little bit special and more complicated (I am saying this, not because it is our country, but because I realize the magnitude of it in India ). What we are trying to acheive through our constitution is perhaps the most just experiment.
We became one country, not because we are born here or because somebody told us. We became one people by choice as we know that it is better for all of us and we share the same value system in our judgement and our perceptions of right and wrong. I understand that unification of our value system is still the work in progress and it is a huge work.
It is important for politicians to take recourse to Constitution while working on this experiment, rather than taking recourse to all silly talk of confused cultural moralists and directionless advocates of tradition.
PS: It would be great to see a post from you on the preamble of our constitution.
బ్రిటిష్ పాలనలో, మిగతా భారతదేశంకూడా ప్రెసిడేంసీల మయమేతప్ప ఒక సంఘటిత పాలనా యూనిట్ కూడా కాదు.
This is a factual error.
Regulating Act of 1773:
Power was given to Governor General of Fort William (Bengal presidency) and his council (4 members) to supervise and control the Bombay and Madras presidencies in matters of peace and war.
Charter Act 1833:
Governor General of Fort William renamed to Governor General of INDIA.
Legislative powers of different presidencies abolished. Governor Genral of INDIA and his council to legislate for all British India.
Government of India Act 1858:
Well a lot can be written about this, but I think the name itself is enough.
Since 1858 the Central Government was always referred to as Government of INDIA.
So I think, whatever part of India that was under British control it was one administrative unit (పాలనా యూనిట్).
These things may be out of context in relation to Mahesh's conclusions in the post, but I believe factual errors should be avoided as much as possible in concertizing an idea or building up a thought.
"1857-1947 వరకూ జరిగిన స్వాతంత్రోద్యమ కాలంలో ఏకీకృతమైన "భారతీయ భావన" కల్పించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఉమ్మడి శతృవు బ్రిటిష్ వాళ్ళు గనక, ఆ దమనపాలనకు వ్యతిరేకంగా ఒకటిగా పోరాడే ప్రయత్నం జరిగిందేతప్ప స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అప్పటికీ ఇప్పటికీ లేదు."
మన చర్చ లో ఇక్కడ ఒక అస్పష్టత ఉంది. స్వాభావికంగా ఒకరమన్న స్పృహ అంటే ఏంటి? ఒక దేశంగా ఉండడానికి ఒకరమన్న స్పృహ అవసరం ఎంత? వేరువేరుగా ఉన్నామనే స్పృహతోనే ఒక వ్యవస్థ నిర్మించుకోలేమా? నా అభిప్రాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నానిక్కడ. చూద్దాం.. స్పష్టత ఏమైనా దొరుకుతుందేమో !
ఒక దేశంగా కలిసి ఉండాలని నిర్ణయించుకోవడానికి, ఒక ప్రజా సమూహానికి కావలసిన ప్రాతిపదిక ఏంటి? ఉప సమూహాల మధ్యే కాదు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య ఐనా భిన్నత్వం ఉంటుంది. ఉండితీరాలి కూడా. ఒకదేశంగా ఏర్పడటం వల్ల వ్యక్తులు గానీ, సమూహాలు గానీ తమ భిన్నత్వాన్నీ, ప్రత్యేకతనీ కోల్పోకుండా అందరికీ ఎక్కువ మేలు జరిగే ఒక ప్రాతిపదిక కావాలి. ఈ ప్రతిపదికని గుర్తించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులని అధిగమించడానికి ఆ సమయంలో అక్కడున్న మేధావి వర్గం ఒక మతాన్నో లేక ఏదోఒక ఇజాన్నో లేదా ఒక బలమైన శత్రువునో ప్రాతిపదికగా సామాన్య ప్రజలముందుకు తెస్తారు.
ఏ దేశనిర్మాణంలో ఐనా, ఉండే సహజమైన లోపాలని సరిచేసి ఒక న్యాయమైన వ్యవస్థని నిర్మించేటప్పుడు ని ప్రశ్నిస్తేనే ఆరోగ్యవంతమైన చర్చ జరిగి సరైన దారిలో ఆ సమాజం ముందుకెళుతుంది.
I see this discussion as one such. In all these discussions, our constitution which we gave to ourselves need to form the basis for the discussions and all others sources can only give information and different perspectives.
An individual or a group choose to be part of a country with others for common benifit. In this process each group or individual need to have certain garantees and a framework that ensures that the common affairs are run in a just and acceptable way. These gaurantees in the case of India were our Fundamenal rights specified in Part three of the constitution and the preamble is the guiding force.
In India the vision laid out by our constitution is still the work in progress. for this work to be carried out properly a healthy debate and questioning the statusquo is very important. There is no point in feigning as if the constitutional vision is already realized.
Whether we are different people or One People is a moot point. Since We have chosen to have one destiny. To help ourselves to build a just society we have the following choices:
1. To cling to statusquo and resist change so that different view points in the society are merged into one.
2. To destroy the statusquo completely and built or break into new nation/nationalities
3. To question, understand and work as specified by our own constitution.
everyone in this counry can opt for one of the above options. Whatever, would be our choices we will have one destiny. Hence one we can be one people. It's upto the people of India to make a wise choice or to regret later...
Whether we are different people or One People is a moot point. Since We have chosen to have one destiny. To help ourselves to build a just society we have the following choices:
1. To cling to statusquo and resist change so that different view points in the society are merged into one.
2. To destroy the statusquo completely and built or break into new nation/nationalities
3. To question, understand and work as specified by our own constitution.
everyone in this counry can opt for one of the above options. Whatever, would be our choices we will have one destiny. Hence one we can be one people. It's upto the people of India to make a wise choice or to regret later...
నేను గమనించినంత వఱకు ఇక్కడ చర్చలో పాల్గొన్న పెద్దలు వెలిబుచ్చిన అభిప్రాయాల్లో ఉన్న ప్రధానలోపం-ఇండియా అనేదొక దేశమని భ్రమపడడం. అదొక శాశ్వత వాస్తవమని భావించడం.
వాస్తవానికి ఇండియా ఒక దేశం కాదు. నేషన్ అనిపించుకోవడానికి అవసరమైన లక్షణాల్లో కనీసం ఒక్కటి కూడా లేని ఇమేజినరీ ఎంటిటీ ఇండియా. దేశం అన్నాక దానికొక కామన్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఆనాడైనా, ఈనాడైనా ఇండియాకి ఏ విషయంలోను అలాంటి కామన్ క్యారెక్టర్ లేదు. వీళ్ళందఱికీ ఉన్న ఒకే ఒక కామన్ క్యారెక్టర్ అల్లా ఎల్లపొద్దులూ విదేశీయులకి ఊడిగం చేయడం.
ఇండియా అనేది ప్రజలతో సంబంధం లేని, ప్రజల ఎంపికతో పనిలేని, ప్రజాపాల్గోలు లేని ఒక భౌగోళిక, రాజకీయ స్వరూపం (a territorial and political entity having nothing to do with either people's choice or their participation) మాత్రమే. దీనిమీది నిరంకుశ అప్రజాస్వామిక రాజకీయాధికారం ఢిల్లీ సుల్తానేట్ నుంచి బాబర్ కీ, అతని వంశం నుంచి ఇంగ్లీషువాళ్ళకీ, ఇంగ్లీషువాళ్ళ నుంచి నెహ్రూ కుటుంబానికీ వరుసగా సంక్రమిస్తూ పోయింది. ఒక వంశం ఒక పార్టీని స్వాధీనం చేసుకొని దాని వనరుల ద్వారా దేశాన్ని ఆడిస్తోంది. ఈ కొనసాగింపునే మనం జాతీయత అని భ్రమించాలి. ఇందులో ప్రజల పాత్ర ఏముంది ? ఏమీ లేదు, ఆయా వ్యక్తుల, వంశాల అడుగులకి మడుగులొత్తడం తప్ప ! యూరోపులోను, అమెరికాలోను ప్రజాస్వామ్యాలు చెందిన సహజ పరిణామ వైనంతో ఇండియా కేసుని పోల్చగలమా ? చెప్పొచ్చేదేమంటే - ఈ ఇండియా కాన్సెప్టు భారతదేశపు ప్రాచీనగ్రంథాలలో ఎక్కడా లేదు. ఇది ప్రజలు కోరుకుని ఏర్పఱచినది కాదు. ఇతరులు వాళ్ళ నెత్తిమీద బలవంతంగా రుద్దగా, తదనంతరం బ్రెయిన్‌వాషుల ద్వారా మఱింత బలవంతంగా కొనసాగించబడుతున్న కల్పిత కాన్సెప్టు మాత్రమే.
అయితే ప్రపంచంలో ఇండియా వంటి భౌగోళిక స్వరూపాలు చాలా ఉన్నాయి. ఐబీరియా ద్వీపకల్పం, అంటార్క్‌టికా మొదలైనవి. అయితే ఆయా ప్రాంతాల వారు వాటిని కేవలం భౌగోళిక స్వరూపాలుగానే చూస్తున్నారు తప్ప వాటిని నేషన్స్ గా గానీ, రాజకీయ స్వరూపాలుగా గానీ మార్చాలని ప్రయత్నించడంలేదు.
ఇండియా తన యొక్క అసలు స్వరూపంలో అనేక దేశాల యొక్క, నేషన్స్ యొక్క సమాహారం. ఆయా రాష్ట్రాలే నిజమైన నేషన్స్. కానీ దశాబ్దాల తరబడి పాఠ్యపుస్తకాల ద్వారా చేయబడుతూ వస్తున్న ప్రాపగాండా వల్లా ఈ అసలైన నేషన్సే బోగస్ అనీ, బోగస్ అయినదే అసలనీ తలంచడం ప్రచారంలోకి వచ్చింది.
వారెవా ప్రాపగాండా ! సర్వశక్తిమంతురాలివి సుమా నువ్వు !
--తాడేపల్లి
Tadepalli garu,
I think that there is much truth in what you say. at the same time I think many current nations are also not natural nations. look at the boundaries of countries in africa and Middle East. They are often almost like straight lines. I think once the countries are formed, they do acquire some sort of identity for what reasons I do not know. We see much less talk of separatism from South and even North East. Possibly economic integaration and the pain and effort of forming new nations have a role.
Geographically India is huge enough to be a lot more countries. It will exist as long as people think (or may be brain washed, if we believe people cannot think) there are no issues in being one country or other issues are more important then concentrating on the National integrity right now. Before going to the point of breaking up the political boundaries of the country, there should be clarity on what should be the criteria for this breakup.
What is a natural nation? What are the characteristics of a natural nation? Is Andhra Pradesh a natural nation? Is Maharashtra a natural nation?
Cultural boundaries are never discrete; there can never be a fixed boundary for cultural regions. Cultural transition is contiguous. It is hard to distinguish the cultures of people living on either side of any POLTICAL BOUNDARY in this world. Most of the diversity characteristics attributed to India in the above discussions can be attributed to any country with at least 2 citizens.
I am not saying India should be one country at any cost, but what can be the alternatives to this idea. There can be many pros and cons.
Pros could be, politicians need not run to Delhi to get permission from the Adishtanam to go to the loo. On a serious note, power centre will be closer to the people.
Cons can be there might be a lot of infighting for the various natural resources. Nascent manufacturing sector can take a huge beating in forms of export and import duties, unless we model ourselves on the lines of European Union.
As a matter of fact, nothing is forever. The political map of the world has been re drawn umpteen times. 99% of this redrawing resulted in or may be I should say it was redrawn as a result of lot of bloodshed and taking down the humanity to a non-existent state.
అన్నయ్య గారు ! వ్యాసం చాల బాగుంది ,కానీ పరిశోధన అనేది వాస్తవాని వెలుగు లోకి తెచ్చేదిగా ఉండాలే కానీ వాస్తవాన్ని చంపేసేదిగ ఉండకూడదు కదా !
తెలివైన లాయర్ ఒక నేరస్తుడిని కాపాడినట్టుంది,తెలివి తేటలతో వ్రక్ర బాష్యాలు చెప్పటం తేలికే మరి !కట్టడం కష్టం కానీ కూల్చడం తేలికే !1947 కి ముందు భారత దేసమే ఒక దేశం కాదు
అన్న విషయం మీ గుడ్డి పరిసోధనుకు జేజేజేలు !ఒక్కసారి చారిత్ర పరిసోధకులను దయచేసి కలవగలరు ,సత్యం శోధనకు కోసం మరి !
........... మీ సావిరహే
The interesting concept of brainwash through propaganda
Does this technique really work? This technique doesn't work to remove corruption from the society. This doesn't work in improving the cleanliness habits of the nation. This doesn't work in stopping people from vandalizing the historical monuments. This doesn't work in removing the caste system.
But this technique works and was clearly proved by Joseph Goebbels (Reich Minister of Propaganda under Hitler). This was effectively used to make the Germans believe Aryans are a superior race and Jews were responsible to all their problems.
So it looks this technique only works majority find it easy to believe and the same majority have nothing to loose by believing it. If majority of the people believe India is One Nation under the influence of propaganda, may be it is because they have nothing to loose because of it.
YAB said above "... unless we model ourselves on the lines of European Union." I have been wondering about the principle of subsidiarity adopted by the european Union and how it would work in the indian context. it seems a good way for decentralization, if there are reasonable local institutions.
There arises no question of liking or disliking the concept of the Indian Republic or of the concept being useful or useless. I simply want to put across the point that India's people have no say in these matters, whether to live as independent linguistic nations or continue the amorphous Indian Republic. They never had that soveriegnty. Not now either in any case. There is a stony-hearted military angle as well to this forced integration. In order to be above the ground you must say "India is a single nation" or face the bullet. I don't think this should be the spirit of true nationalism.
So, I think India more than qualifies to be called as a military empire a la the British Empire or the Roman Empire, but not a democratic republic. So is the case with the Islamic empire of Pakistan where its true nations are similarly being suppressed to keep the invented identity of Pakistani-ness alive. Yes, there are periodical elections on the lines prescribed by the empire. But there is no scope for self-determination or even examining the possibility self-determination of different nations forming part of these empires.
This term Indian is a very vague, non-specific, misleading and faceless identity while we all know for sure that we are not at all one people as propagated at first by the indiscriminate English-speaking white colonialists and later by their brown political successors at home.
As usual Mahesh raised an important question and discussion. since Mahesh chose to keep his silence and others have expressed their opinions I have nothing more to contribute without deviating from the actual topic.
Post a Comment