Wednesday, June 9, 2010

టైం వేస్ట్ కెలుకుడు బ్యాచ్

పనికొచ్చే విషయాలు మాట్లాడితే "మేధావులు" అంటూ ఎద్దేవాచేసే ఒక కెలుకుడు పెద్దమనిషి "చిరాకొచ్చి", "టైంపాస్" కి ఎంచుకున్న కెలుకుడు, ‘భారతీయ విలువలు’.

ఇక్కడున్న ఐరనీ ఏమిటంటే ఏ హిపోక్రసీ గురించి నేను కామెంటానో అదే హిపోక్రసీని ఈ మహానుభావుడు పీకిపాతరేస్తూ, తన పరమహిపోక్రసీని పళ్ళికిలించిమరీ బయటపెట్టుకోవడం. So, much for their integrity and భారతీయత.

ఆయన ఉద్దేశ ఫ్రకారం "భారత దేశానికి ఉన్నవీ, చాలా దేశాలకు లేనివి" ఈ క్రింది లిస్టు.
1. కుటుంబ వ్యవస్థ
2. వివాహ వ్యవస్థ
3. భిన్నత్వంలో ఏకత్వం
4. ఆప్యాయత
5. పెద్దల పట్ల గౌరవం

భారతీయత అంటూ మాట్లాడే ఈ మిడిల్ క్లాసు మోరలిస్టులకు కనిపించే immoral దేశాలు అమెరికా, యూరోప్ దేశాలు. కామెడీ విషయం ఏమిటంటే, వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ  భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లు కనిపించదు.ఆ లిస్టు చూసి నేను ఎన్నిసార్లు పడీపడీ నవ్వుకున్నానో నాకే గుర్తులేదు. ఇవన్నీ భారతదేశంలో ఉంటే ఉండొచ్చుగాక, కానీ మిగతాదేశాల్లో లేవంటేనే వస్తుంది అసలు తంటా అంతా.

గుండెలమీద చెయ్యెసుకుని చెప్పండి...పై లక్షణాలు లేని దేశం ఏదో? ఒక్క పేరు చెప్పండి చాలు.

****

16 comments:

శ్రీనివాస్ said...

ఇంత అర్జంటుగా ఇతర దేశాల మీదా ప్రేమ , డాలర్లు సంపాదించే వారి మీదా ద్వేషం కలగడానికి కారణం తెలుసుకోవచ్చా ?

karthik said...

1. కుటుంబ వ్యవస్థ
సంవత్సరానికి ఒకరోజో, లేదా ఆర్నెలలకు ఒక రోజో అమ్మా నాన్న లతో మాట్లాడటం మన దేశం లో ఎక్కడైనా చూశామా?? కనీసం నేనైతే చూడలేదు హీన పక్షం వినలేదు..
ఒక వయసు వచ్చిన తరువాత పిల్లలని ఎంతమంది తల్లి దండ్రులు బయటకు తన్ని తరిమేస్తున్నారు?? మీ గురించి నాకు తెలియదు నన్నైతే తరిమేయలేదు ;);)
2.వివాహ వ్యవస్థ
దీనికి సంబంధించిన గణాంకాలు నా దగ్గర లేవు కానీ 2005 లో నేను చదివిన ఒక ఆర్టికల్ ప్రకారం అమెరికాలో సగటు వివాహ బంధం 3-5 సంవత్సరాలట.. రెఫెరెన్సెస్ ఇవ్వలేను.. సారీ
ఇంకొక విషయం: అమెరికన్ హోమిసైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెక్కల ప్రకారం 60% హత్యలు త్రికోణం అఫైర్స్ కారణంగా జరుగుతున్నవట..
4. ఆప్యాయత
దీని గురించి నేను మళ్ళీ సెపరేటుగా చెప్పేదేముంది??
5.పెద్దల పట్ల గౌరవం
భారతీయ యూనివర్సిటీలలో ఎంతమంది విద్యార్థులు తమ ప్రొఫెసర్లను పేర్లతో పిలుస్తారు??
3. భిన్నత్వంలో ఏకత్వం
show me one country with so much diversity as ours.. I worked in market research industry and happen to go through some data of our customers.. based on any standards we carry more variety..
భారతీయత అంటే "ఓర్పు సహనం శాంతం". ఇవి మిగతా దేశాలలో కనపడ్డం కొంచెం కష్టమే అని నా అభిప్రాయం కూడా!

PS:పైనెక్కడో యధాలాపంగా ఒక స్మైలీ పెట్టాను.. అది మీతో "చనువు పెంచుకొనేందుకు కాదు" అని మనవి చేస్తున్నాను..

Kathi Mahesh Kumar said...

@కార్తీక్:For your kind information ప్రపంచంలో దాదాపు 195 దేశాలున్నాయి.ఇండియా, అమెరికాలు మాత్రమే కాదు.

ప్రతి దేశంలోని ప్రతి వందకిలోమీటర్లకూ భాష, సాంప్రదాయం,ఆహారపు అలవాట్లలో ఎంతో కొంత తేడా ఉంటుంది. జాతుల పరంగా, ప్రజలపరంగా, సమూగాలపరంగా కొన్ని లక్షల తేడాలు ఉన్నాయి.

సెటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గా UGC ద్వారా గుర్తింపబడిన అన్ని యూనివర్సిటీలలోనూ ప్రొఫెసర్లు తమని పేరుతో, మహాయైతే ‘మిస్టర్’ తగిలించి పిలవమంటారు.గౌరవించడానికీ పేరుతో పిలవడానికీ అస్సలు సంబంధంలేదు.‘సార్’ అని పిలిచే బానిసత్వపు మెంటాలిటీని ఈ విశ్వవిద్యాలయాలు వదిలించుకుంటున్నాయి.

ఆప్యాయత మానవసంబంధాల ముఖ్యలక్షణం. అది వ్యక్తపరిచే తీరు ప్రతి సంస్కృతిలోనూ వేరేగా ఉంటుంది. అంతే తేడాతప్ప భారతదేశం ప్రత్యేకంగా సాధించింది ఏమీ లేదు.

వివాహవ్యవస్థ - కుటుంబ వ్యవస్థ: ప్రపంచ వ్యాప్తంగా ఒకటే. మీరు చెప్పిన అమెరికాలో సమస్యలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఎన్నికల్లో కూడా "కుటుంబ వ్యవస్థ" అభ్యర్థి ఓట్లను నిర్ణయించే కొన్ని దేశాల్లో అమెరికా ఒకటి. Evolution of America as a nation అర్థం కాకుండా, మీ భారతీయ విలువలతో అమెరికాని కొలుస్తానంటే ఎట్లా?

ఓర్పుసహనం శాంతి universal human values.ఇక్కడ మన దేశం ప్రత్యేకంగా చేసిన సాధన ఏమిటో చెప్పండి. భారతీయులుగా మనం చేసిన గొప్పేమిటో చెప్పండి. South east Asia లో ఉన్న అన్ని దేశాల్లోనూ ఉన్న విలువల్లో సామీప్యం ఉంది. ఎక్కడా తప్పిదండ్రుల్ని తన్ని తగలెయ్యరు. అమెరికాలో మాత్రం తన్నితగలేస్తారని మీకెవరు చెప్పారు? They have an institutional mechanism to take care of old.అది ఆ సమాజ పరిణామంలో వచ్చిన క్రమం. దాన్ని మీ విలువలతో చూసి జడ్జిచేస్తామంటే ఎట్లా?

తెలుగు వెబ్ మీడియా said...

మహేష్ గారు. తల్లితండ్రులని వృద్ధాశ్రమాలలో వదిలేసేవారు ఇండియాలోనే ఎక్కువ. ఇక్కడ పెద్దల పట్ల గౌరవం ఎక్కడ ఉంది?

తెలుగు వెబ్ మీడియా said...

ద్వేషపూరిత వ్రాతలు వ్రాసే కెలుకుడు బ్లాగర్లు ఓర్పు, సహనం గురించి మాట్లాడడం అంటే పెద్ద పులి శాఖాహారం గురించి మాట్లాడినట్టు ఉంది కదా. శర్మ భరద్వాజ ఫామిలీని ఏదో అన్నాడు, నేను అతని గురించి టాపిక్ కి వెయ్యి కామెంట్లు వ్రాస్తాను అనే కార్తీక్ కూడా శ్రీరంగ నీతులు చెప్పడం విచిత్రంగా ఉంది.

karthik said...

>>ఇండియా, అమెరికాలు మాత్రమే కాదు.
మీరు ఇమ్మోరల్ దేశాలు అని అమెరికాను ప్రస్తావించారు అది చూసి నాకు ఆ స్టాట్స్ గుర్తుకు వచ్చాయి.
>>జాతుల పరంగా, ప్రజలపరంగా, సమూగాలపరంగా కొన్ని లక్షల తేడాలు ఉన్నాయి.
మీరు చెప్పిన కొన్ని లక్షల తేడాలు మనదేశం లో మరింత ఎక్కువని చెబుతున్నాను..
>>సార్’ అని పిలిచే బానిసత్వపు మెంటాలిటీని ఈ విశ్వవిద్యాలయాలు వదిలించుకుంటున్నాయి.
'సార్ ' అనేది బానిస మెంటాలిటీయా?? ఇంజినీరింగ్ కాలేజీలలో సీనియర్లను కూడా అలానే పిలుస్తారు. అది కూడా అంతేనా?? నేనైతే అది ఒక గౌరవ సూచకం అని అనుకున్నాను/అనుకుంటున్నాను. మీరు చెప్పిన జాబితాలో ఏ కాలేజీలు ఉన్నాయో నాకు తెలీదు కానీ నేను చూశిన కాలేజీలలో ఐతే అందరూ సుబ్బరంగా సార్ అనే పిలుస్తున్నారు..
>>వివాహవ్యవస్థ - కుటుంబ వ్యవస్థ: ప్రపంచ వ్యాప్తంగా ఒకటే. మీరు చెప్పిన అమెరికాలో సమస్యలు ఉంటే ఉండొచ్చుగాక, కానీ ఎన్నికల్లో కూడా "కుటుంబ వ్యవస్థ" అభ్యర్థి ఓట్లను నిర్ణయించే కొన్ని దేశాల్లో అమెరికా ఒకటి. Evolution of America as a nation అర్థం కాకుండా, మీ భారతీయ విలువలతో అమెరికాని కొలుస్తానంటే ఎట్లా?

ఇది నాకు అర్థం కాలేదు మరింత వివరిస్తే స్పందించగలను..

>>ఓర్పుసహనం శాంతి universal human values.
completely agreed. కానీ అవే మన అస్తిత్వం. అంతవరకూ ఎందుకు, శాంతియుతంగా పోరాడి స్వాత్యంత్రం సాధించిన దేశం మరొకటేదైనా ఉందా??

>>అమెరికాలో మాత్రం తన్నితగలేస్తారని మీకెవరు చెప్పారు?
it seems I lead to some misunderstanding.
నేను తన్ని తగలేస్తారనింది పిల్లల గురించి.. అమెరికాలో 17-18 ఏళ్ళు వచ్చిన పిల్లలని తల్లి దండ్రులు బయటకు పంపిస్తారు అని మా క్లైంట్ చెప్పాడు.. అతనొక అమెరికన్.

>>They have an institutional mechanism to take care of old.
There you are! they have a "mechanism" but we have our hearts to take care of the old.

Ram Krish Reddy Kotla said...

Well said Mahesh.

Nrahamthulla said...

చూడండి http://nrahamthulla.blogspot.com/2010/05/blog-post_10.html

..nagarjuna.. said...

i wonder how referring to one as 'sir' would account to slavery!!
Even in many countries police address civilians as 'sir' does that mean they in slavery ?

మీరు ఏ UGC కాలేజీలు చూసారో తెలియదు కాని నేను చూసిన, చదివిన అన్ని కాలేజీలలో, స్కూళ్లలో సర్, మేడమ్ అని సంభోధిస్తారు.
మీరు చూసిన ఆ UGC కాలేజీలు, మీరు సర్ అని పిలవని దశలు ఏమైనా ఉన్నాయో చెప్తారా?

katta vijay said...

@karthik
మీ వివరణ బాగుంది !

Varunudu said...

నాణేనికి మరో వైపు లా మీకు ఒక సూటి ప్రశ్న..

అసలు భారత దేశం లో మీకు నచ్చే ఒక ఐదు అంశాలు చెప్పండి.. అప్పుడు మాట్లాడుదాం..
మీ వ్యాసానికి, నా ప్రశ్నకు సంబంధం లేదు అని కొట్టి పారెయ్యకుండా సమాధానం చెప్పండి.. నా ప్రశ్న మీ ఈ వ్యాసానికో, లేక మరో వ్యాసానికో సంబంధించింది కాదు. చాలా జనరల్ ప్రశ్న !

Kathi Mahesh Kumar said...

@కార్తీక్:మొత్తంగా అమెరికన్ సోషియల్ ఆంత్రపాలజీ చెప్పే తీరిక ఓపిక లేవుగానీ, ఒక వాక్యంలో మూలాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను. వ్యక్తివాదం, క్యాపిటలిజం అమెరికన్ సామాజిక నిర్మాణానికి మూలస్థంభాలు. వాటి ఆధారంగా ఏర్పడిన సమాజాల్ని ఓరియంటల్ వ్యాల్యూస్ తో కొలవడం తప్పయితే, కొలిచి మేమే బెస్ట్ అనుకోవడం మూర్ఖత్వం.

రెండో ప్రపంచ యుద్దం తరువాత స్వతంత్ర్యం సంపాదించుకున్న యాభైకి పైగా దేశాల్లో మెజారిటీ శాంతీయుతంగానే స్వాతంత్ర్యాన్ని తెచ్చుకున్నాయి.

అమెరికాలో పిల్లల్ని తన్నితగలెయ్యరు. స్వతంత్ర్యంగా బ్రతకడానికి వదిలేస్తారు. మనకులాగా పిల్లలు తల్లిదండ్రుల ప్రాపర్టీకాదు అక్కడ. They are considered independent individuals.

Mechanism అంటే భావాలు లేని మెషిన్ అనికాదు అర్థం. అదొక వ్యవస్థ. దాన్ని పెట్టుకుని మనకు గొప్ప హృదయాలున్నాయని మురిసిపోవడం మీకే చెల్లింది.

కాల్మొక్త బాంచన్ నుంచీ అయ్యా/ఆర్యా, సార్ వరకూ మనకు తెలిసిందీ, మనం గర్వపడేదీ మన ఫ్యూడల్ భావాలతో జనించిన బానిసత్వభావజాలాన్నే అనుకుంటాను.Its not the word but the intent with which we call any body "sir" is an issue.

JNU నుంచీ HCU వరకూ బెస్ట్ యూనివర్సిటీస్ లో చాలా డిపార్ట్మెంటుల్లో ఫ్రొఫెసర్స్ ని ఫస్ట్ నేమ్ బేసిస్ లోనే పిలుస్తారు. లేకపోతే "ప్రొఫెసర్ సో అన్డ్ సో" అని పిలుస్తారు.

@వరుణుడు: నాకు భారతదేశంలో నచ్చేవి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. ప్రపంచంలోని చాలా దేశాలకన్నా ఇవి ఎంతో మెరుగు.

పెదరాయ్డు said...

haha...."prajaswamyam", "rajyamgam"..:)

బొందలపాటి said...

అమెరికన్ సమాజాన్ని భారతీయ విలువల స్కేలు తో కొలవ కూడదనేదానితో మహేష్ గారితో ఏకీభవిస్తాను.ఇండియా ని రిఫరన్స్ గా తీసుకొని అమెరికా ని చూడటమూ తప్పే. అమెరికా ని రిఫరెన్స్ గా తీసుకొని ఇండియా ని చూడకూడదు కదా! స్వ ప్రేమ, స్వ దేశ ప్రేమల వలన ఎవరి దేశం వారికి గొప్ప గా కనపడటమూ సహజమే.ఎవరైనా ఒక అమెరికన్ వచ్చి, భారతీయ సమాజాన్ని అమెరికన్ విలువల స్కేలు తో కొలిస్తే మనం వెనుకబడిన వాళ్ళమూ, మూఢాచారులమూ,ఆం చయిర్ థింకర్స్మూ,అవినీతి పరులమూ, ఇంకా చాలా చాలా అవుతాము.రెండు దేశాల విలువలూ యాపిల్ కాయా, నిమ్మ కాయల లాంటివి. నిమ్మ కాయ అంత పుల్ల గా లేదని యాపిల్ కాయని అన కూడదు కదా. ఇది కూడా కరెక్ట్ కాదు. ఈ రెండు సంస్కృతులూ అంగీకరించే ఒక కామన్ గ్రౌండ్ తీసుకొని, మానవాళి కంతటికీ వర్తించే విలువల స్కేల్ తో మాత్రమే రెండు సమాజాలనూ కొలవాలి. ఉదాహరణకి.. శాంతి, సంతోషం, భౌతిక అభివృధ్ధి, ఆధ్యాత్మికత, పర్యావరణం. ఒక్కో విషయం లో ఇండియా ది పై చేయి ఐతే ఒక్కో విషయం లో అమెరికా ది పై చేయి అవుతుంది. పర్యావరణం వంటి కొన్ని విషయాలలో ఇండియా అమెరికా రెండూ నాసి గానే ఉంటాయి. సంతోషాన్ని ఎలా కొలవటం? అమెరికా లొ ఏ సంసార బాదరబందీ లేనివాడు నేనే సంతోషం గా ఉన్నానంటాడు...అలానే ఇండియాలో కుటుంబం తో ఉన్నవాడు కూడా నేనే సంతోషం గా ఉన్నానంటాడు. ఈ ఇద్దరి బుర్రలనూ ఏ ఎం ఆర్ ఐ స్కానింగో తీయించి వాళ్ళీద్దరి సంతోషాన్నీ కొలవాలేమో. ఇండియా ఒక సంధి కాలం లో ఉండి.ఇండియా కూడా విలువల విషయం లో అమెరికా దిశ లోనే పోతోంది.ఇండియా లో కూడా వ్యక్తి వాదం ఎక్కువౌతోంది. కుటుంబాలు చిన్నా భిన్నమౌతున్నాయి. ఓ రెండు దశాబ్దాల తరువాత భారతీయ విలువలకీ అమెరికన్ విలువలకీ పెద్ద తేడా ఉండక పోవచ్చు.

A K Sastry said...

డియర్ ‘కత్తి‘ మహేష్!

మిగిలినవాటి సంగతెలావున్నా, ‘సర్’ గురించి మీరు వ్రాసినది అక్షరాలా నిజం!

కాస్త పైవాడినించి ఫోను వచ్చినా, లేచినిలబడి, వణుకుతున్నట్టు 45 డిగ్రీలకోణం లో వంగి, ‘సార్! యెస్సార్! ఓకే సార్!’ అనేవాళ్ళు కోకొల్లలు! (చూ: మన సినిమాలలో బ్రహ్మానందం, వేణుమాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వగైరాలు!)

అంతేకాదు! చిన్న చిన్న పెళ్ళికానిపిల్లలనైనా, ‘మేడం’ అనడం నాగరికతకో చిహ్నం!

నేనిదివరకే నా బ్లాగులో వ్రాశాను—మా డిగ్రీ కాన్వొకేషన్ కి వచ్చిన యూనివర్సిటీ డీన్ వల్లా, మా కాలేజీ ప్రిన్సిపల్ వల్లా మాకు తెలిసింది—మిష్టర్ డీన్! మిష్టర్ ప్రిన్సిపల్! అని పిలవ్వొచ్చని!

ఇక ‘ఫస్ట్ నేమ్’ గురించి మన వాళ్ళకి యెంత తక్కువ చెపితే అంత మంచిది కదూ!

రెండురోజులకోసారో యెప్పుడో వచ్చే మునిసిపాలిటీ ‘చెత్త లారీ’ నించి దిగి, తట్టతో మన వీధి గేటు ముందు నిలబడి, విజిల్ వేసే పారిశుధ్య కార్మికుడిని (నెలకి ఓ ముఫ్ఫై రూపాయలు మనం అతడికి ‘చదివించుకుంటూ’ ఉన్నా), ‘సార్! ఒక్క నిముషం! వచ్చేస్తున్నాను!’ అనో, ‘సార్! ఇవాళ మా ఇంట్లో చెత్త యేమీ లేదు!’ అనో—చెప్పుకోవాల్సిన భాషా బానిసత్వం మనది!

ఇక నోకామెంట్ ప్లీజ్!

rākeśvara said...

/వీళ్ళు ఎగేసుకెళ్ళేదీ అక్కడికే. అక్కడికి వెళ్ళి డాలర్లు సంపాదిస్తేగానీ భారతీయత వీళ్ళకు బూతద్దంలో పెట్టినట్లు కనిపించదు/ - Amen