సద్దాం హుస్సేన్ ను చంపాలన్నా, బిల్ లాడెన్ కోసం వెతకాలన్నా అది అన్యాయాలు చేశాడనో లేక అమెరికాను బాంబులుపెట్టి పేల్చాడనో కాదు. మూలకారణం అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేశారని. మరొ కారణం...సహజ వనరులు. ‘సద్ధాం విషయంలో పెట్రోల్ అయితే లాడెన్ విషయంలో ...ఏమిటి?’ అనే ప్రశ్నకు ఇప్పుడే సమాధానం దొరికింది.
అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ట్రిలియన్ డాలర్ల విలువచేసే ఖనిజనిక్షేపాల్ని కనుగొనింది. ఇనుము, రాగి, కోబాల్ట్, బంగారంతో పాటూ ల్యాప్ టాపులు, బ్యాటరీలు వంటి వాటిని తయారుచెయ్యడానికి వాడే లిథినియం లాంటి ఖనిజాలు ఈ లిస్టులో ఉన్నాయి. వీటిని కనుగొనడంతో ఆఫ్ఘనిస్తాన్ పరిశ్రమ భవిషత్తేమోగానీ అమెరికా పంటమాత్రం పండిందనే చెప్పుకోవాలి.
http://www.nytimes.com/2010/06/14/world/asia/14minerals.html?hp=&pagewanted=all
****
7 comments:
ఒకరిననడం దేనికిఁగాని, ముందు మనయింట్లో లిథియం వాడఁబడే వస్తువులు ఎన్నివుంటాయో లెక్కవేసుకుంటే ప్రయోజనం వుంటుంది।
సినిమాలు చూడడానికి లాపటాపులు వాటిని భద్రపఱచుకోడానికి డిస్కులు ఇలా ఎన్నిటిలో లిథియం వాడతారు, ఇలా ఎన్నిటి వెనకఁ అమెరికా మేధస్సువుందో లెక్కవేసుకుంటే, 'పపం'లో మన వంతు ఎంతుందో తేలిపోతుంది।
పైపెచ్చు, లాపుటాపు కరీదు ముప్పైవేలయితే, "అబ్బేకాదు అందులో కాస్త cost externalization జరిగింది నలభైవేలు తీసుకోండి డెల్ వారు" అని మనమెవరమూ అనము కాబట్టి।
చిన్నప్పుడు చెప్పినట్టు, వేలు చూపించేటప్పుడు మూఁడు వేళ్ళు మనవైపు వున్నాయని గుర్తించాలి।
ఈ ఖనిజాలు ఉన్నాయని కనుగొంది ఇప్పుడు. ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించి తొమ్మిది సంవత్సరాలయ్యింది. తొమ్మింది సంవత్సరాల తరువాత కనుగొంటామని ఊహించి అమెరికా దాడి చేసిందా...? ఏమైనా ఒక్క సారి ఖనిజ సంపదను కనుగొంది గనుక ఇక వదిలిపెట్టదు
@రామ్ బొందలపాటి: తెలవడానికీ, కనుక్కోవడానికీ అది మీడియాతో చెప్పడానికీ వెనక అమెరికా చాలా ప్లానింగ్ ఉంటుంది. అమెరికా ఎప్పుడూ ముప్పైసంవత్సరాలు ముందు ఆలోచిస్తుందంటారు. వాటిల్లో ఇదొకటి.
Yves Smith has some doubts:
here.
ట్రిలియన్ డాలర్ల ఖనిజాల కోసం అంతకన్నా ఎక్కువ ఖర్చుతో యుద్ధం చేసిందా అమెరికా?
అమెరికా అక్కడి ఖనిజ నిక్షేపాలపైనే కాదు ఆఫ్ఘనిస్తాన్ రష్యా కు సరిహద్దు ప్రాంతం కూడా. అందుకే ఆ దేశంపై యుద్ధం ప్రకటించి అన్ని విధాలుగా లాభపడుతోంది. ఇరాన్ నుండి పాకిస్తాన్ మీదుగా భారత్ కు గాస్ సరఫరాను కూడా పైపు లైను ద్వారా వేయడాన్ని అడ్డుకుంటోంది. ఏది చేసినా దానికి వ్యాపార పరంగా లాభ పడడమొక్కటే దాని లక్ష్యం.
అవి వెలికి తీయడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. అంతేగాక ఎంతో పెట్టుబడి కావాలి. కనుక అమెరికాకి ఆ అవకాసం కాస్త తక్కువని మరుసటి రోజు పేపరులో రాశారు. అంతేగాక భారత్ తో పాటు అనేక ఇతర దేశాలను ఖనిజ తవ్వకాల కోసం ఆఫ్గన్ ఆహ్వానించింది. కాని తీవ్రవాద సమస్య వల్ల భారత్ ఆలోచనలో పడింది. అమెరికా యుద్ధం వనరుల కోసం చేయలేదు. వనరులు ఉన్నాయని యుద్ధానికి ముందు ఎవరికీ తెలియదు. పైగా అమెరికా ఆ ఖనిజ తవ్వకాలలో పాల్గొనే అవకాసం తక్కువ.
Post a Comment