Sunday, June 27, 2010

నన్నయ ఆదికవేనా?

తమిళ భాషకు "క్లాసికల్ భాష" హొదా కట్టబెట్టినప్పుడు చాలా మంది తెలుగు భాషాభిమానుల గుండెలు మండాయి.
‘తమిళానికి ఉన్నదేమిటి? తెలుగుకు లేనిదేమిటి?’ అని చాలా చర్చలు జరిగాయి.

ఈ చర్చల్లో చాలావరకూ తమిళులు ఎలా తమ రాజకీయ influence ను ఉపయోగించి మార్గదర్శకాల్ని తమకు అనువుగా ఏర్పరుచుకుని లాభం పొందారో చర్చించడం జరిగిందేతప్ప, కొన్ని మూలప్రశ్నల్ని మనవాళ్ళు చాలా కన్వీనియంట్ గా అడగలేదు. కనీసం మనల్ని మనం ప్రశ్నించుకోలేదు. ఆ తరువాత ఎలాగూ ఆ గైడ్ లైన్స్ మారి తెలుగు, కన్నడ, మళయాళాల్ని చేర్చడంతో సమస్య తీరింది. కానీ ఆ అడగని ప్రశ్నలు మళ్ళీ ఎవరూ అడగలేదు.

 "ఆదికవి" నన్నయ్య 11 శతాబ్ధం వాడుకాబట్టి తెలుగు qualify కాలేదు  మొదట్లో,
కానీ అసలు ప్రశ్న ఏమంటే నిజంగా మన ఆది కవి ఆదికవేనా?
అంతకు మునుపు తెలుగులో సాహిత్యం లేదా?
బౌద్దజైనమతాలు బ్రహ్మాండగా విలసిల్లిన తెలుగునేలలో వీరు తెలుగు సాహిత్యాన్ని సృష్టించలేదా?
తమిళం తరువాత కన్నడం అత్యంత ప్రాచీనం అని గుర్తించిన మనకు కన్నడ కవులందరి పుట్టుకలో లేదా సాహిత్య సృజనో తెలుగునేల మీద జరిగిందనేది సత్యంకాదా?
మరలాంటప్పుడు, వాళ్ళు తెలుగు సాహిత్యం సృష్టించలేదా? ఒకవేళ సృష్టించి ఉన్నా దాన్ని మనం పట్టించుకోలేదా?

లభ్యతలో ఉన్నది బహుశా నన్నయ రాసిన ఆధ్రహాభారతం కావచ్చుగాక, అంత మాత్రానికి మనం సరిపెట్టుకుని ఆదికవి అని ఆయన్ను, ఆదికావ్యం అని ఆంధ్రమహాభారతాన్నీ కీర్తించి మన (భాషా)గొయ్యి మనమే తవ్వుకోవడం నిజంగా అవసరమా? లేక మనకు చేతనైన భాషా పరిశోధన అంతేనా?!
కన్నడ భాషా పండితులు చక్కగా ‘లభ్యమైన గ్రంథాల్లో కవిరాజామార్గ మొదటిది’ అని చాలా diplomatic గా రాసుకుంటే, మనమే బోరచాపుకుని ఆిదివి, ఆదికావ్యం అనే fixation లో ఉండిపోయి అసలుకి ఎసరు పెడుతున్నామేమో!

****

10 comments:

రాధిక said...

ఐతే!?

gaddeswarup said...

There is a Kurkyala(Kurikyala) inscrption interpreted by P.V. Parabrahma Sastry (P.V.P.Sastry). From this inscription, Professor Sastry deduced that Jinavallabha assisted Malliya Rechana in writing Kavijanasraya. This means that Rechana lived at least one hundred years before Nannaya, who is considered Adikavi (first poet)of Telugu. Some of the details are in Dr. P.V. Parabrahma Sastry Felicitation volume 1 (Sharada Publishing House, Delhi)in the article "Dr. P.V.P. :An Embodiment of Scolarship" by Prof. A.V. Narasimha Murthy. But I have no expertise in the matter; just happen to have a copy of the book. I think that the inscriptions are available in some digital library, I remember downloading it once. Can try to find it again if anybody is interested.

Anonymous said...

లభించినంతవఱకు తెలుగులో నన్నయ ఆదికవే. ఆయన వ్రాసిన భారతభాగం (4,300 పద్యాలు) కంటే ప్రాచీనమైన తెలుగు "గ్రంథాలు" లభించలేదు కనుక. కానీ ఆయన కంటే ముందు తెలుగురచన లేదనుకోకూడదు. అంతకు కనీసం 350 సంవత్సరాలకు పూర్వమే తెలుగుపద్యాలతో కూడుకొన్న శాసనాలు లభిస్తున్నాయి. ఈ పై వ్యాఖ్యలో ఉదాహరించిన కుఱిక్యాల శాసనం కంటే కూడా అవి పూర్వతరమైనవి. వాటిల్లోని కవిత్వం నన్నయగారి ప్రౌఢశైలికి ఏ మాత్రమూ తీసిపోదు. పైగా అవి నన్నయగారే రాశారేమో ననిపించేలా ఉంటాయి. మల్లియ రేచన కాలం ఇప్పటికీ వివాదాస్పదమే కనుక దాని మీద ఇప్పుడు ఏమీ వ్యాఖ్యానించలేను. కానీ మల్లియ రేచన వ్రాసినది ఛందోగ్రంథమే తప్ప నన్నయగారి భారతంలా కావ్యం కాదు కాబట్టి బహుశా టెక్నికల్ గా నన్నయగారే ఆది"కవి" అవుతారు.

Kathi Mahesh Kumar said...

@రాధిక: ఐతే...నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఆ దిశగా పరిశోధనలు కావాలి. నేను చెప్పాలనుకున్నది అదే. We Telugu's often lose facts in celebrating images created by few.

@తాడేపల్లి: టెక్నికల్ గా ‘కవి’కుండాల్సిన క్వాలిఫికేషన్ నాకు తెలీదు. నా సమస్యల్లా అంతకు పూర్వమే తెలుగు సాహిత్యం ఉందని సాధికారకంగా నిరూపించే దిశగా మన పరిశోధనలు ఎందుకు జరగలేదా అని.బౌద్ధజైన సాహిత్యం ఏమైపోయిందా అని ఆశ్చర్యం. కన్నడాంధ్ర కవులను మనం ఎందుకు కలుపుకోలేకపోయామనే ఆసక్తి మాత్రమే.

@గద్దేస్వరూప్: మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదాలు.

gaddeswarup said...

Here is an article about Jain influence on Telugu:
http://jainology.blogspot.com/2008/11/jain-culture-in-telugu-literature.html
Arudra says in 'samagra andhra sahityam' that sarvadeva (?) might have written before Nannaya but only some stanzas remain. About three questionably pre-nannaya books remained but they are mainly reference books, with various claims about authorship and time. Now with many universities in A.P. , there should be more research on these topics. I think sri P.V. parabrahma Sastry lives in Hyderabad (he should be about 90 years old now) and it may be useful consulting him.

yab said...

Some information:

How could such a chiseled piece of magnificent work (Mahabaratha) appear without abruptly without any precursors and a long record of trials and travails ?
This questions puzzles the researchers a lot, they felt that telugu literature should have existed before Nannaya.


One of the poets who is supposed to be from pre Nannaya era is Nannichoda. Manavalli Ramkrishna Kavi published Nannichoda's work Kumara Sambhavamu in 1910. He claimed that Nannichoda lived about a hundred years earlier to Nannaya. It seems that some of the stanzas in the avatarika of this work have been lost. It is supposed that Nannichoda has paid tribute to desi poets in this stanzas and it could have been a good source to the names of some more poets of his time. But there is a lot of controversy regd. his work and time line.


Other name for consideration in this context is Bhima Kavi author of Raghava Pandaviyamu a dwyarthi kavya. None of his works are available except some occasional stanzas. Srinatha in one of his works lists four earlier poets presumably in a chronological order. Bhimakavi's name precedes all other including Nannaya. Kasturi Ranga Kavi also refers to Bhima Kavi as adima sukavi.

The general feeling is, since none of the earlier works exist, so the position of Nannaya as Adikavi stands unassailed.

All this is from one of the books I read about Andhra cultural history.

I think the title Adikavi to Nannaya doesn't mean, telugu literature did not exist before 11th century. If proper proofs exist, it shouldn't stop the concerned authorties in declaring Telugu as classical language, just because all the telugu people refer to Nannaya as Adikavi.

Anonymous said...

ఇతే? ! ? !

ఇతే ఏటంట? !

Anonymous said...

yab గారి ప్రపశ్చనం (observation) బహుశా కరెక్ట్. నన్నయగారి కవిత్వంలో ( ఆనాటి భాషని అర్థం చేసుకోగలిగితే) ఉన్న మాధుర్యం, ప్రసాదగుణం, మాటల కూర్పు, గాంభీర్యం మనల్ని చాలా ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఆయన స్వయంగా చెప్పుకున్నదాని ప్రకారం ఆయన వృత్తి రాజాస్థానంలో రాజుగారి కోసం, రాజకుటుంబ సభ్యుల కోసం పూజలూ, హోమాలూ, వ్రతాలూ, పెళ్ళిళ్ళూ, తద్దినాలూ జఱిపించడం. అంటే పురోహితుడన్నమాట. పురాణం/ హరికథ లాంటివి కూడా చెప్పేవారని తెలుస్తున్నది. కానీ అటువంటి వృత్తిలో ఉన్నవారికి నన్నయగారి స్థాయిలో intellectual height ఉండడం చాలా అఱుదు, అఱుదున్నఱ. ఇంత శైలీవైభవాన్ని ప్రదర్శించిన నన్నయగారు పూర్వాశ్రమంలో తప్పకుండా ఎవఱో సాహితీవేత్తల వద్ద సుదీర్ఘకాలం పాటు శిష్యఱికం చేసే ఉండాలి. కానీ ఆ గురువుల పేర్లని కూడా ఆయన పేర్కొనలేదు. మహాభారత రచనని అసంపూర్ణంగా వదిలి చనిపోవడాన్ని బట్టి బహుశా ఆయన దాన్ని వృద్ధాప్యంలో ప్రారంభించి ఉంటారని కూడా తోస్తున్నది.

అనువాదాన్ని అనువాదంలా కాకుండా ఒక స్వతంత్ర Masterpiece లా తీర్చిదిద్దిన నన్నయగారికి అంతటి ప్రతిభ రావడానికి కారణభూతమైన, మార్గదర్శకమైన పాత తెలుగు పుస్తకాలు ఏవో తప్పనిసరిగా ఉండే ఉండాలి. కానీ వాటిని ఆయనెందుకు పేర్కొనలేదో తెలియదు. మహాభారత అవతారికలో తనకంటే పూర్వం ఉన్న ఒక్క తెలుగుకవి పేరు/ పుస్తకం పేరు కూడా ఆయన పేర్కొనలేదు.

మతాభినివేశం ఒక కారణమా ? అనిపిస్తుంది. ఆ పుస్తకాలన్నీ జైన, బౌద్ధపుస్తకాలై ఉంటాయనీ, ఒకవేళ వాటిని విద్యాభ్యాసంలో భాగంగా చదివినప్పటికీ తరువాతి కాలంలో పరమచ్ఛాందస వైదికుడుగా మారిన నన్నయగారికి వాటి ఊసే ఎత్తడం ఇష్టం లేక మౌనం వహించి ఉండవచ్చుననీ ఒకఱిద్దఱు పెద్దలు నాతో అన్నారు. ఎంతవఱకు నిజమో తెలియదు. A case of killing by silence ?

-తాడేపల్లి

Dileep said...

NOTE:This is not related to the above topic

Hello LBS garu,
miku mana telugu sahithyam lo chala thelusu anipisthondhi.Srikrishna devarayalu gurinchi,mana Rajulu,Zamindarlu and aa rojulalo mana gramalu,pattanalu ela undevi.Prajala jeevana vidhanam ela undedhi ilanti vishayalu unna manchi telugu pusthakalu ippati vallaki artham ayye manchi books suggest chesthe it would be helpful.

Ramachandran.P.V said...

The Kurikyala Inscription is in danger from qranite quarrying. It was installed by Jinavallabha, younger brother of Kannada's Adi Kavi Pampa. If any body is interested I can send them the details of the inscription. However, I am at a loss in deciphering the telugu portion of the inscription.

Can somebody send me its interpretation made by P.V.Parabhramha Sastry ?