Thursday, March 18, 2010

ఆమె వెళ్ళిపోయిన రోజు

ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను
ముక్కలైన జీవితాన్ని చేతికెత్తుకున్నాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే ఆవేశం
హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను
విభ్రమ స్ఫూర్తితో కొండకోనల్ని చీల్చిపారే నీటికి
ఏ సముద్రం చేరే కోరికో?
లేదా,మందగతిన ఇసుక ఒడిలో కూరుకుపోయే నిర్వేదమో
నాలోనేను లేనన్నది ప్రశ్న
ఇక ఆమెకళేబరాన్ని అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను

మరాఠీ మూలం: నామ్ దేవ్ ఢపాళ్
ఆంగ్లానువాదం: దిలీప్ చిత్రే
తెలుగుసేత: హరీష్. జి.



(హృద్యమైన కవితను అనువదించిన  మితృడు హరీష్ కు అభినందనలు. )
****

4 comments:

Bolloju Baba said...

wonderful concept


హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
may i know the original word for హుందాగా here

after finishing the poem, some dry feeling filled the heart.

that is the majic of poetry

వైతాళికులకు or వైతాళికులను ? may be typo


bollojubaba

భావన said...

బాగుంది మహేష్.

మరువం ఉష said...

బాధని, ఆక్రోశాన్నీ కనులెదుట పరిచింది... బాబా గారి ప్రశ్నకి నాకూ సమాధానం కావాలి. నిజానికి "నాలోనేను లేనన్నది ప్రశ్న"నాలోనేను లేనన్నది ప్రశ్న" కూడా నాకు అక్కడ గొలుసుకట్టుగా ఎలా కలిసిందో అవగతమవలేదు.

madan said...

Mee kapitha chadivi baaga navvukunnano. Nee photo chusi inkaa navvukunnanu.