Monday, March 8, 2010

మనోభావాలు గాయపర్చుకుందాం రా!

ఎమ్.ఎఫ్ హుస్సేన్ కతార్ పౌరసత్వం తీసుకోవడంతో మళ్ళీ చర్చలు మొదలు.
కొందరు అన్యాయం అంటే, మరొ కొందరు అక్రమం అన్నారు. కొందరు తగినశాస్తి అనుకుంటే ఇంకొందరు ముసలోడు చస్తే పీడాపోతుందనుకున్నారు.

విషయమంతా ఈ కళాకారుడు హిందూదేవతల్ని "నగ్నంగా" చిత్రించాడన్న వంకతో మొదలయ్యింది.
ఆర్టుగ్యాలరీల ముఖమైనా చూడని కొందరు ఎవరో చెప్పిన హిందుత్వ అజెండా ప్రాపగాండాతో అర్జంటుగా మనోభావాలు గాయపర్చేసుకున్నారు.
నిజంగా సమస్య నగ్నత్వం అనుకునేవాళ్ళు ఉన్న దేవాలయాలన్నింటినీ పడగొట్టెయ్యాలి. ముఖ్యంగా దక్షిణభారతదేశంలో ఉన్నవన్నీ మొదటిగా నేలమట్టం చేసెయ్యాలి.
దేవాలయాల చుట్టుపక్కలనుంచీ పూజలందుకునే ఉత్సవ విగ్రహం వరకూ పాతికో ముప్పాతికోవంతు నగ్నంగానే ఉంటాయి మరి!
నిజానికి పూర్తిగా బట్టలేసుకున్న హిందూ దేవతలు 19 వ శతాబ్ధంలో రాజారవివర్మ క్రియేషన్.
ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగంలోకి రావడం వలన, దానిద్వారా కమర్షియల్ ఆర్ట్ ను పెంపొందించే భాగంగా రూపిందించబడిన శైలి అది.
అంటే ఈ గొడవంతా నిజమైన హిందూ ఐకనోగ్రఫీని పక్కనబెట్టి రాజారవివర్మ కళాసృష్టిని మాత్రమే ప్రామాణికంగా ఎంచుకుంటున్న కొందరి తెలియనితనమే తప్ప మరొకటి కాదు.

 ఎట్టకేలకు కాటికి కాళ్ళుజాపుకున్న హుస్సేన్ (95 ఏళ్ళ వయసువాడు మరి) దేశం వదిలి పోవాల్సి వచ్చింది. ఇందులో మూర్ఖత్వంతో మనోభావాలు దెబ్బతీసుకున్నాళ్ళకన్నా ఇలాంటి పిచ్చిచేష్టలు జరుగుతున్నా ఏమీ చెయ్యక చేతులుకట్టి కూర్చున్న ప్రభుత్వాలది పెద్దతప్పుంది. ఇప్పటివరకూ క్రైస్తవ, ఇస్లాం మతాల్లో మాత్రమే కనిపిస్తూవస్తున్న ఈ ఉన్మాదం ఈ మధ్యకాలంలోనే హిందూమతానికీ పాకింది. నియో-హిందుత్వ భావజాలంలో మునిగిపోతున్న కొందరి పైత్యం కారణంగా సృజనాత్మక స్వాతంత్ర్యం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అభిలషణీయం కాని ఇలాంటి పోకడలు ప్రజాస్వామ్యానికి చేటు మాత్రం ఖచ్చితంగా చేస్తాయి.

****

41 comments:

ఆ.సౌమ్య said...

అంత హిందూత్వం, గౌరవం ఉంటే దేవాలయామీద బూతుబొమ్మలని ఎలా అంగీకరిస్తున్నరో ఇన్నాళ్ళూ?

ఒరిస్సా లోని కొణార్కలోని సూర్యదేవాలయం ఈ మధ్యనే చూసాను. కళ్ళు తిరిగి కింద పడినంత పనయింది. ఆ దేవాలయాన్ని పరిశీలనగా చూస్తే చాలు. ఏ సెక్సు పుస్తకలూ చదవక్కర్లేదు. చిన్నపిల్లలకి కూడా అన్ని సులభంగా అర్థమయిపోతాయి.

నాకు బొమ్మలు అర్థం చేసుకోవడం రాదు అని గోలపెడుతున్న ఈ మారుతీరావుగారు అవి చూడలేదో ఏమో, ఆ బొమ్మలలో దేవుడు కనిపించట్లేదేమో?

http://gollapudimaruthirao.blogspot.com/2010/03/blog-post_08.html#comments

అదేమి వింతోకానీ చూడాలనుకున్నచోటే దేవుణ్ణి చూస్తారు మిగతా సమయాలలో కళ్ళు మూసుకుంటారు. భగవంతుడు అంతటా ఉన్నాడు అనేదాల్నో వీళ్ళకి గట్టినమ్మకం ఉన్నట్టులేదు.

రవివర్మ రాకముందు దేవుని చిత్రాలు ఎలా ఉండేయో ఒకసారి చూస్తే సరి వీళ్ళంతా.

కళ ని కళగా గుర్తించడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో !

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

దేవాలయాల్లో ఉన్న నగ్నభంగిమలలోని పాత్రలు మానవులవి లేదా గంధర్వులవంటి ఇతరులవే తప్ప శివుడు, అమ్మవారు, విష్ణువు వంటి దేవతలవి కాదనుకుంటా. నేనుచూసినంతలొ నేను గమనించింది అదే. దేవతల శిల్పాల్లో ఆచ్చాదన అందునా వక్షస్థలం, జననాంగం వంటి భాగాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మహేష్‌గారు.
సరె నగ్నత్వాన్ని పక్కన పెదదాం. మరి రావణుడి ఒడిలోకూర్చున్న సీతమ్మను ఏరకంగా ఒప్పుకోగలం? ఇది ఎంతవరకు సమంజసం? ఇంకాకొన్ని అంశాలున్నాయి. ఇక్కడ రాయటం మళ్ళీవాదనలు ఎందుకులెండి. వీలైతే నాబ్లాగులో రాయడానికి ప్రయత్నిస్తా. సమయం చిక్కుతుందోలేదో చూడాలి

Naveen Garla said...

మహేష్ గారు, అసలు మీరు హుస్సేన్ వేసిన అన్ని బొమ్మలూ చూశారా? కలలో సైతం భరించలేని విషయాలను అతడు సృజనాత్మకత పేరిట బొమ్మలేశాడు.
హనుమంతుడు లక్ష్మీ దేవిని ఏదో చేస్తున్నట్లు, కాళికా దేవిని .. ఛ .. . ఇంత చేసి, మనోభావాలు గాయపడటం హిందువుల తప్పు అనటం బాగోలేదు. గాయపడినా అతని బ్రతకనిచ్చారు. ఇదే వేరే మతస్తులైతే, తల నరికి గేట్ వే ఆఫ్ ఇండియాకు వేలాడకట్టేవారు.

Anonymous said...

ఏదీ మీ నగ్న చిత్రాలను తమ తమ బ్లాగుల్లో పెట్టండి. కళను కళగా చూస్తాము , ఆస్వాదిస్తాము.

ఆ మాత్రం కళా పోస మాకూ వుంది. :))

Kathi Mahesh Kumar said...

@సుబ్రమణ్య చైతన్య: మొత్తానికి మీరు భారతదేశంలో ఉన్న ఏ పురాతన గుడినీ చూసినట్లు లేరు. వక్షస్థలంపై ఆచ్చాదనమున్న అమ్మవారి విగ్రహాలు దాదాపు లేవనే చెప్పాలి. జననాంగం కూడా నగలతోనో లేక ఏకవస్త్రంతోనో కప్పబడి ఉంటుందేతప్ప చీరలు కట్టి ఉండవు.విష్ణువు ఎప్పుడూ అర్థనగ్నంగానే ఉంటారు.ఇక శివుడి చిహ్నమే "లింగం" అందులోనా బూతు వెతికి బ్యాన్ చేస్తానంటే మీ ఇష్టం. ఒకసారి చూసిరండి తరువాత మాట్టాడుకుందాం.

హుస్సేన్ చాలావరకూ impressionist/abstract modern painting వేశాడు. వాటిల్లో మీరు portraits వెతకడమే పప్పులోకాలెయ్యడం వంటిది.ముఖ్యంగా కళాకారుడి subconscious లో జరిగేకళాప్రక్రియని భౌతికదృష్టితో చూడటమే చెల్లదు.

మీరు చెబుతున్న దృశ్యం రామాయణంలోది అయ్యే అవకాశం కథాపరంగా ఉందా? సీతను రావణుడు ఎత్తుకెళ్ళేప్పుడు ఝటాయువు పోరాడుతుంది హనుమంతుడు కాదు. మరి ఈ దృశ్యం ఎక్కడిది? రావణుడి ఒడిలో సీత కూర్చోవడం అనేది ఒకవేళ కళాకారుడి భావం అదే అయినా అందులో ఉన్న అభ్యంతరం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఆరుద్ర అనుకుంటాను రామాయణంలోని ప్రక్షిప్తాల గురించి చెబుతూ ఇలాంటి వాటిని ఎలా జోడించారో వివరిస్తాడు. బలవంతంగా ఎత్తుకెళుతున్న దానవుడు సీతను ఎలా పట్టుకున్నాడు, ఎక్కడ కూర్చోబెట్టాడు అనేది మీకు మాత్రం ఖచ్చితంగా ఎలా తెలుసు?

@నవీన్ గార్ల: నేను హుస్సేన్ పెయింటింగ్స్ దాదాపు అన్నీ చూశాను. హైదరాబాద్ సినెమాఘర్ లో ఫిల్మ్ స్క్రీనింగ్ కోసం వెళ్ళినఫ్ఫుడల్లా అక్కడి గ్యాలరీ చుట్టడం ఒక అలవాటుగా ఉండేది.

హుస్సేన్ చాలావరకూ తన పెయింటింగులకు పేర్లు పెట్టడు. కొద్దివాటికి తనుపెడితే చాలావాటికి గ్యాలరీ ఓనర్లు, క్యూరేటర్లూ పెడతారు. అవి వారికి అర్థమైన అర్థాన్ని బట్టి ఉంటాయిగానీ నిజంగా హుస్సేన్ అదేగీసాడు అని ఎవరూ చెప్పలేరు.గీసిన తరువాత ఏ కళాకారుడూ ఆ చిత్రాన్ని ఏ "ఆలోచనతో" గీసాడు అంటే చెప్పలేడు. Its a creative process. అంచనాలకు రావడం, అర్థాల్ని విశదీకరించడం art critics పని. వారికెవరికీ మీరూహించిన బూతు కనిపించలేదు. మరి కళను decipher చెయ్యలేనివాళ్ళ interpretation విలువెంత?

మీరు చెబుతున్నది లక్ష్మీ-హనుమంతుడు కాదు. లక్ష్మీ-ఏనుగు. "ఏదేదో చెయ్యడం" సంగతి నాకు తెలీదుగానీ లక్ష్మీ యోనిదగ్గరనుంచీ ఏనుగు రూపం ఒకటి ఉద్భవించినట్టుగా ఆ పెయింటింగ్ చూస్తే అనిపిస్తుంది.దాని అర్థం నాకు తెలీదు. కాబట్టి అది ఏవిధంగా offensive అనేది చూసేవాడి interpretation ని బట్టి ఉంటుంది.

ఏమతస్తులు free expression ని అడ్డుకున్నా అది తప్పే. హిందువులు కాబట్టి బ్రతకనిచ్చారనే మీ అసహనం ఒక అవగాహరాహిత్యానికి సూచనేతప్ప హిందూ assimilation power కి కాదు.Intolerance and violence on the name of any religion is condemnable.

Anwartheartist said...

నిజమే కొన్నిటిని చూడటానికి, వినడానికి,ఫీల్ అవడానికి జన్మత నీలొ ఆ సంస్కారం ఐనా వుండాలి, దాన్ని ప్రేమించడం ద్వారా దాన్ని గురించి తెలుసుకొవాలనే గ్నానించడానికి శిక్షణ అయినా అవసరం.
భారతీయ చిత్రకళ, శిల్పకళ మూలలు వెతుక్కొగలగాలి, మెడలొ పాము, పులి చర్మం, త్రినేత్రం, త్రిశూల ఢమరుకాలతొ నిలిచిన పరమ శివుణ్ణి లింగాకరం ఎట్లా ಐకన్ ల చూపించగలిగినారు, ఎవరా మహా స్రష్ట అనే ప్రశ్న నీలొ వచ్చిందా ?? తక్కిన వాల్లకంతా పారుతున్న నీరులా కనిపించిన గంగా నది మన చిత్రకారులు, శిల్పకారుల చెతుల్లొ ఒక స్త్రీ మూర్తీ అకారం దాల్చిందెందుకు?? మకర తొరణం చూడండి ఎంత స్టైలేజేషన్ , వొడలు పులకించదూ, కల్ల వెంట నీల్లు రావు ఆ క్రియేషన్ చూసి, అజంతా ఎల్లొరా, హొలీబీడు ,సొమనాధ ఆలయం ఒకటా రెండా, సమస్త భారతమంతా వ్యాపించి ఉన్న చిత్ర కళ ను చూచి ఎన్ని సార్లు అందులొ శత సహస్రంశాన్ని కొటి జన్మ లెత్తినా సాధించలేని ఈ వేల్లను ఒక్క దెబ్బకు తెగ నరకాలనిపించులొలేదూ!!!
ప్రపంచ చిత్ర్కళా రంగంలొ ఒకే ఒక మహా పికాసొ ఎందుకని భారతీయ శిల్పకళ ముందు మూగపొయాడు, గుడిలోని శిల్పాన్ని చూస్తే కలగల్సింది భక్తి కాని కామం కాదు, అలా జరిగితే అది మన కళ్ళ దొషం తప్ప మరేమి కాదు,
అన్నిటిని మించిన దొషం ఎవరిదంటే తన బొమ్మను తాను సమర్ధించుకొలేని హుస్సేన్ ది , వెనుక నిలబడ చాతకాని సాటి కళాకారులది, ఇంతమంది గగ్గొలు పెడుతున్నా సువిశాల భారత దేశంలొ వున్న సమస్త చిత్రకారుల్లొ ఒక్కరైనా ఇది తప్పుడు బొమ్మ అని నొరేత్తారా? ఏం వారిలొ మాత్రం హిందువులు లేరా??? ప్రతిఒక్కడికన్నా ముందుగ సరస్వతి తల్లి మాది, మా కళా కారులది , మా అమ్మ , మేం చచ్చే దాక మా నొటికి ముద్దలు పెట్టే మా అమ్మ. ముందుగా చెప్పినట్టు కళను అర్ధం చేసుకొవడానికి కొంత శిక్షణ అవసరం, నేర్చుకుంటే వచ్చేది కాదది... జన్మత వచ్చినపుడే అందులొ నగ్నత్వం కన్నా, రేఖ, వర్ణం, స్రుజన కనపడుతుంది. ఆ స్రుజన ను చూసి దండం పెట్టుకొ బుద్దేస్తుంది.
ఇది మూడక్షరాల సాయబు వ్రాసిన రాతగా చూడొద్దు, కొటిమంది మంది కళాకారులు నొరుమూసుకూచున్న సమయం లొ తన చేతనైనంత స్పందించి రాళ్ళ దెబ్బ తినడానికి ముందుకొచ్చిన మహేష్ కుమార్ గారికి నమస్కరిస్తూ, ఆయన తొ కలిసి రాళ్ళ దెబ్బలు పంచుకుందామని.
అన్వర్.

Anonymous said...

http://akasaramanna.wordpress.com/2010/03/08/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%86%E0%B0%B0%E0%B0%AC%E0%B1%86%E0%B0%9F%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81%E0%B0%95%E0%B1%81%E0%B0%82/

Ravi said...

అన్వర్ గారు చెప్పినట్లు చూసే దృష్టిని బట్టి అందులో అర్థం ఉంటుందనే నా నమ్మకం కూడా...

Anwartheartist said...

శ్రీ నవీన్ గారు,
ఒక కథనం ప్రకారం సీతమ్మ తల్లి రావణుల వారి పుత్రికై జన్మిస్తుంది, పుత్రిక వల్ల నీకు మరణం తప్పదన్న వాణి విని, ఆ బిడ్డని మిధిలా నగరం లోని వొక ప్రాంతంలోని పూడ్చి పెట్టి స్తారు, రియలిస్టిగ్గా కాదు గాని,కళాకారుడి గా తనకున్న ఇచ్చా స్వాతంత్రాన్ని ఉపయొగించుకొని హుస్సైన్ అక్కద తండ్రి వొళ్ళొ కూ చున్న కూతురిగా సీతమ్మని ... ఏ రామయణం లొ రచయిత కల్పించలేని సన్ని వేశాన్ని బొమ్మలొ చూపించాడేమొ తెలియదు ఏమైనా ఈ విషయం హుస్సైన్ గారే చెప్పాలి.

రమణ said...

హుస్సేన్ ని ఖండించటానికి దేవుళ్లను విపరీతంగా ఆరాధించవలసిన అవసరం కూడా లేదు. మామూలు గా మతాన్ని, దైవాన్ని దూరంగా ఉంచే దృష్టితో చూసినా చాలు, అతను చేసింది మంచి పని కాదు అని. ఏది కళ? ఏది సృజనాత్మకత? వీటికి జవాబులు చెప్పేవాళ్లు ఎవరూ ఉండరు నాకు తెలిసి. ఇవన్నీ సాపేక్షమైనవి. అలాగని వీటికి ఒక పరిధి లేదనుకుంటే పొరపాటే. ఆ పరిధి ఏమిటనేది ఎవరూ నిర్వచించనక్కర్లేదు. కొద్దిపాటి విచక్షణ తో చాలా వరకు జనాలకు తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెబుతాను- కులతత్వం, ప్రాంతీయతత్వం, పరమత సహనం లేని మతతత్వం జాడ్యం గా ఎలా పిలవబడుతున్నాయి ? అదే దేశభక్తి ఎలా గొప్పదయ్యింది?.కొన్ని తర్కాలకు అందవు. సృజనాత్మకతకైనా సమాజ దృష్టికోణంలో ఒక పరిధి ఖచ్చితంగా ఉంటుంది. వ్యక్తి స్వేచ్ఛ ఎంత ముఖ్యమో సమాజ ఆవశ్యకత కూడా అంతే ముఖ్యం .ఇంత సంక్లిష్టమైన అంశాన్ని ఇంతకంటే సులభంగా నేను చెప్పలేను.సార్వజనీన మైన ప్రేమ అనేది ఊహాలకే పరిమితం కానీ భౌతికంగా ఉండదు. ఒకవేళ కొన్ని సార్లు కనపడినా, "నాది" అనేది దాటాకనే అన్నింటినీ అంగీకరించే స్థితి వస్తుంది. గుడుల మీద ఉన్న నగ్న భంగిమలను అంగీకరించి, కేవలం జనాలు ఆరాధించే దేవుళ్లను ఎందుకు నగ్నంగా చూడొద్దనుకుంటున్నారు?. ఇవి తర్కానికి అందనివి.

Paadarasam said...

కత్తి గారు,

ఉదయం రెంటాల కల్పన గారి " శివుని సొల్లు కబుర్లు " అన్న దాని మీద కామెంటెట్టి, గొల్లపూడి వారి టపా చూసింది లగాయిత్తూ మీ టపా కొసమే ఎదురు చూసాను.

ఇక విషయానికి వస్తే -

[1] మీరన్న ప్రకారము దేవతలకి బట్టలు కుట్టించింది "రాజా రవి వర్మ" అయితే మన హుస్సేన్ సార్ రవి వర్మతో విభేదించి వస్త్రాపహరణం చేసాడు. మీ వాదం ప్రకారం దాని పేరు సిద్ధంత వైరుధ్యమో, వల్లకాడో అనుకుందాం. మరి సదరు హుస్సేన్ సార్ ఎగేసుకొని కేరళ గవర్నమెంట్ ప్రకటించిన "రాజ రవి వర్మ" అవార్డు తీసుకోవడానికి ఎందుకు రెడీ అయ్యైనట్లొ ?

[2] కాసేపు దేవతల విషయం పక్కన పెట్టి "భారత మాత" విషయానికి వద్దాము. పోనీ హిందూ దేవతల్ని వక్ర మతం ద్రుష్టి తో చూసాడనుకున్నా, భారత మాత ఏం చేసిందండి? ఇది ఏ రకమైన స్రుజనాత్మకత ? లేక మీరు కూడా ఒక లెవల్లో ఏమి భారత మాత ? వోనికి మాత అంటారా ?

[3] నేను అనుకోవడం అయితే కేసులకి భయపడే పారిపోయాడు అని. ఏమి తప్పు చేయక పోతే వచ్చి కోర్టులొ తన వాదన వినిపించుకొవచ్చు కదా? పారిపోవడం దేనికి?

[4] మన ఘనత వహించిన "చిదంబరం గారు" పూర్తి భధ్రత కల్పిస్తామని సెలవివ్వడం జరిగింది. మన సార్కి మాత్రం ఖతార్ నచ్చింది. బహుశా మీ "వలువలు లేని అభిమానం" సార్ గమనించలెదేమొ, ఇప్పుడే తన ఇండియన్ పాస్పోర్టుని ఇండియన్ హై కమీషన్ కు అప్పగించారట.


నాకైతే పీడ విరగడ అయింది :)

Kathi Mahesh Kumar said...

@పాదరసం గారూ,
1.రాజారవివర్మను ఇప్పుడైతే నెత్తినపెట్టకుంటున్నాముగానీ అతను జీవించివుండగా తన జీవన విధానం (he had lot of women in his life) తను పాశ్చాత్యశైలిలో (Oil painting in western style and form) వేసిన భారతీయ చిత్రాలపై అప్పట్లో చాలా అభ్యంతరాలు లేవనెత్తారు.ఇప్పటికీ రాజారవివర్మ ఫోటోల్లాగా పెయింటింగులను గీసే శైలిని క్రాఫ్ట్ పరంగా అభినందించినా, ఆర్ట్ పరంగా "మామూలు" అనేవాళ్ళూ ఉన్నారు. So, the context here is not of greatness. Its only about their times and technique. రవివర్మ గీస్తున్న తరుణంలో తన శైలిలో అనవసరమైన ఎమోషన్,సెంటిమెంటు, విక్టోరియన్ మోరల్స్ ఉట్టిపడుతూ భారతీయత లేమితో ఉన్న పెయింటింగులుగా కొందరు కిటిక్స్ అభివర్ణించారు.

హుస్సేన్ కూ రజారవివర్మకూ in terms of form and style వైవిధ్యం ఉన్నంతమాత్రానా అవార్డుస్వీకరించకూడదు అనే వాదన అసంబద్ధం.

2.భారతమాత అనేదే ఒక కాల్పనిక concept. నిజానికి అది భారతపిత ఎందుకు కాకూడదంటారూ! ఒక కల్పనకు మరో కల్పనను జీడించిన సృజనాత్మకత నగ్నత్వాన్ని సంతరించుకుంటే దానికి నైతికతను అంటగట్టి విలువల్ని బేరీజుచేసి సిలువవేస్తానడం మూర్ఖత్వంకాక మరేమిటి?

3. కేసులకు భయపడ్డాడని మీరనుకుంటున్నారు. ఈ వయసులో నాకెందుకీ గోల అని ఛీత్కరించుకుని వెళ్ళిపోయాడని నేను భావిస్తున్నాను. అనుకోవడంలో ఏముందిలెండి. అయినా,ఉన్నకేసుల బలమెంత! అవి ఎప్పటికి తేలాల!!

4.నాలాంటి ఎందరిదో మద్ధత్తు హుస్సేన్ కి ఉంది. ఆయన కతార్ లో ఉన్నా మా అభిమానం తగ్గదు. అతడు ఒక భారతీయుడు కాకపోయినా ఒక కళాకారుడిగా మా అభిమానం తగ్గదు. He is an icon of the world.

మైత్రేయి said...

మరేమి విషయం లేనట్లు ఇతర మతాల దేవుళ్ళ నే వెయ్యటం ఎన్దుకో! వేసాడు పొ, మా మనసు కష్ట పడింది అంటే సారి చెప్పటానికి తన పిచ్చి గీతలు వెనకకు తీసుకోవటానికి అంత బాధ ఎందుకో?

సౌమ్యా, నువ్వు చూసినవి దేవుళ్ళ బొమ్మలా? గుడిలో ఇతరుల బొమ్మలా? రతి మన్మధులు లాంటి పౌరాణిక పాత్రలను అలా చూపిస్తె ఎవరూ విమర్శించరు.

శివుడికి, విష్ణువుకు అలా ప్రతి దేవుడికి మూల లక్షణాలు ఉంటాయి. వాటిని దాటి వర్ణీంచటం, వ్రాయటం, ముమ్మాటికి మతాన్ని అవమానించటమే.

రచనకు కాని, చిత్రకళ కు కాని వస్తువులు ఇతరులు పూజించేవే అయి ఉండాలా? ఎంత మంది ఇతర మతస్తులను నెత్తిన పెట్టుకొన్నారు హిందువులు. ఇతన్నే ఎందుకు అంటున్నారొ ఆలోచిస్తున్నారా.

The Mother Land said...

మహేష్ గారు,
నేను చాలా సార్లు జవాబు చెప్తారేమో ఎవరన్నా అని ఎదురు చూసి చూసి రాస్తున్న జవాబు ఇది.
1. "దైవం" అనే భావన ఏ మతంలో నైనా చాలా ఉత్తమమైనది. (ఇస్లాం లో అల్లా, క్రిస్తియానిటి లో మేరీ, జీసస్ మొ. హిందు మతం లో ముక్కోటి దేవతలు. అయినా కావొచ్చు.)
2. ప్రపంచం లో ఏ మతస్థుడు అయినా తన పరిధి, పెరిగిన వాతవరణం ఇత్యాది అంశాలను బట్టి తన చిన్న తనం నుండే "దైవం" అనే భావన మీద ఒక నిర్ణయం ఉంటుంది. (ఇది నా సొంత అభిప్రాయం.) ఇలాంటి భావన మీద దాడి (మీ భాషలో) జరిగినప్పుడు తట్టుకోవడం చాల కష్టం.
3. ఇహ మీరనే ఆ దేవలయాల మీద బొమ్మలు మనిషికి జీవన సూత్రాలు నేర్పేదే కానీ, అది అశ్లీలం అని అలోచించడం మీ అవివేకం. (ఇక్కడ కూడా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, చదివిన లేదా వినిన దాని కంటే చూసినది ఎక్కువ ప్రభావితం చేస్తుంది) మీరు చూసిన ఆ దేవతల వివరాలు (ఏంటి ఏక వస్త్ర అమ్మ వారు (ఈ సంభోదన చూడండి - అమ్మ వారు ) వస్త్రాలు లేని దేవతల వివరాలు ఇస్తే కొంచెం చూసి తరిస్తా (ము). నేను చూసిన ఏ దేవతా మూర్తికి వస్త్రాలు లేకుండా అయితే లేవు (ఎవరైనా ఈ ఎం .ఎఫ్. హుస్సేన్ లాంటి వెదవలు స్రుష్టిస్తే తప్ప. ) )
4. ఇహ లింగాలు తదితర అంశాల గురించి - స్రుష్టిలో అత్యంత కీలక మైన ఒక అవయవం (బహుశా ప్రతి స్రుష్టి కి మూలం అనొచ్చెమో ) ని దైవం గా భావించడం ఏ విదంగా తప్పో తమ విగ్నతకే వదిలేస్తున్నా.

Kathi Mahesh Kumar said...

@దామోదర్ రెడ్డి: హుస్సేన్ వచ్చి ఎవరి మతం మీద దాడిదేశారు?
ఒక ఆర్టిస్టు తనకు నచ్చిన బొమ్మలు గీసుకున్నాడు. వాటిని గ్యాలరీలలో ప్రదర్శించాడు.తన కళని అమ్ముకున్నాడు. నిజానికి ఆ గ్యాలరీలను కొన్ని లక్షలమందికన్నా ఎక్కువ సందర్శించరు.మరి మతం మొత్తం మీదా ఆయన చేసినదాడి ఏమిటి?

దేవాలయాల మీది బొమ్మలతో నాకు అభ్యంతరం ఉందని మీకు ఎలా అనిపించింది? తాపీధర్మారావు గారి దేవాలయం మీద ‘బూతుబొమ్మలెందుకు’అలాగే ఆరుద్ర గారి ‘దేవాలయంలో సెక్స్’అనే పుస్తకాల్ని చదవండి. అవి సహేతుకంగా దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకున్నాయో వివరిస్తాయి.

వక్షోజాలు కనిపించకుండా చీరలుకట్టుకున్న అమ్మవారి విగ్రహాలు మీకు దేశమంతా కనిపించాయంటే మీరు దక్షిణభారతదేశంలోని ఏ గుడీ చూసినట్లు కాదు. ఒకసారి చూసే ప్రయత్నం చెయ్యండి.Ancient sculptures always depicted Goddess's half naked.

Naveen Garla said...

ఇది చూడండి మహేష్:
http://www.hindujagruti.org/activities/campaigns/national/mfhussain-campaign/

నాకు తెలిసీ, మీరు ఒక్క అభిప్రాయం మీద ఫిక్సయితే మీ మాట మీరే వినరనుకొంటా. ప్రపంచంలో ఎక్కువ మంది అభిప్రాయమే నిజమని చెల్లుబాటైయ్యే కాలం ఇది. అలాంటి చోట నలుగురు చెడు అనుకొనే మంచిని వారి ముందు చెప్పాలనుకోవడం కూడా పాపమే... ఎంత ధైర్యం ఉంటే ఇన్ని కోట్ల మంది తల్లిగా ఆరాధించే దేవతలను వారు ఇంత వరకూ చూడని, తెలియని రూపాల్లో చూపడానికి ప్రయత్నిస్తాడు. కొంత మందికి ఇంత విశాల భావాలు ఉండ బట్టే ఆ గణాధిపతి చిత్రాన్ని ఆడవాళ్ళ చెడ్డీల మీద బాత్రూమ్ టైల్స్ మీద ముద్రిస్తున్నారు.

శ్రీనివాస్ said...

మహేష్ గారు ...

బహుశా రవివర్మ తన చిత్రాలతో ప్రజలని కన్విన్స్ చేయకముందు .... హుస్సేన్ గారు ఈ బొమ్మ వేసి ఉంటే ... జనం అంగీకరించేవారేమో . జనం ఒక పద్దతికి అలవాటు పడ్డాక చాలా కాలనికి ఈ ముసలాయన ఇలా చేయడం జీర్ణించుకోలేక పోయారేమో.

ముఖ్యమైనది అన్నిటికంటే చివరిది ఏంటంటే ..... చాలా దేశాల్లో హిందూ దేవతల బొమ్మలు చెప్పుల మీద , కాళ్ళు తుడుచుకునే పట్టల మీద ఇంకా లెట్రిన్ కమోడ్ మీద ముద్రించడం వల్ల ఇది బర్నింగ్ ఇస్స్యూ ఐన తరుణంలో హుస్సేన్ గారు ఇలా చిత్రీకరించడం ...... వివాదానికి కారణం అయింది అనడంలో సందేహం, లేదు.

ఇక మీ వాఖ్యలు చూద్దాం

ఇప్పటివరకూ క్రైస్తవ, ఇస్లాం మతాల్లో మాత్రమే కనిపిస్తూవస్తున్న ఈ ఉన్మాదం ఈ మధ్యకాలంలోనే హిందూమతానికీ పాకింది.

అంటే దాదాపు ప్రపంచం అంతా పాకింది. మెజారిటీ ఓట్లు ఉన్మాదానికే అంటారా?

The Mother Land said...

ఆయనకు అంత ఆనదం గా ఉంటే, బొమ్మలు వేయడానికి ఇంకేమి సబ్జెక్ట్స్ దొరకలేదా? ఎందుకు హిందూ దేవుల్లనే ఎంచుకున్నాడు. చెట్లు పుట్టలు జంతువులు ఇలా ఏది గీసినా కూడా ఎవరికి అభ్యంతరాలు ఉన్నాయి.?
నేను వయసులో చిన్నవాడిని కావొచ్చు. కాని నేను ఇప్పటికి కొన్ని వందల్లో దేవాలయాలు దేవతా మూర్తులు చూసాను. కాని నాకు ఎక్కడా ఏక వస్త్ర దేవతా విగ్రహం కనిపించలేదు. ప్రతి గుడి లోనూ అభిషేకం ముందు మాత్రమే దేవుడి బట్టలు విసర్జిస్తారు . అది కూడా ఎంతో శాస్త్రోక్తం గా. ఇది చేసే వాల్లు కూడ పూజారులే. మీరన్నట్టు (అర్థ నగ్నం -పూర్థి నగ్నం - చూసారా తేడా)
భరత మాత అనేది ఒక భావన అన్నారు కదా - ఈ భావనే కొట్ల మంది గుండెల్లో స్వాతంత్ర్య కాంక్షకి ప్రతి రూపం. ఇలాంటి ఒక గొప్ప భావాన్ని (మీ భాషలో) సమర్థిస్తున్నారు అంటే - ఇక మీ ఇష్టం .
ఇదే విదంగా మరొకరు ఎవరో మీకు దగ్గర వారిదో లేక మీకు ఇష్టమైన వారిదో ఒక నగ్నం గా ఉన్న బొమ్మ గీసి ప్రదర్శన కి పెడితే మీరు అప్పుడు కూడా కళా &*(*(& అని వూరుకుంటారా లేక వేసిన వాడి తాట తీస్తారా?

venkat said...

If someone paints a naked picture of M.F Hussains mother wonderfully (in artistic sense ) will he appreciate the art as an artist or feel bad about that? I think lot of people don't have broad enough thoughts to appreciate the art in the pictures of their mother INDIA and goddess whom they respect next to their mother. You can give your opinion for MF Hussain as a broadminded art lover. Sorry for posting in english and my so called narrow mindedness.

Paadarasam said...

మహేష్ గారు,

నా మొదటి మరియు రెండవ ప్రశ్నలకు మీ సమాధానం expected lines లొనే ఉంది. మీతో ఏకీభవించ లేకపొతున్నాను.

ఇక మూడవ పాయింటులో "అనుకోవడంలో ఏముందిలేండి" అని శెలవిచ్చారు. చాలా మంచి మాట. ఎందుకంటే, మీ ఒరిజినల్ టపా అంతా ఆ "అనుకోవడంలోనే" కదండీ సాగి పోయింది. అన్నీను మీరు అనుకున్నవి అన్వరించుకున్నవే కదా !

ఇక నాలుగో పాయింటులోకి వస్తే, అభిమానులు కరాచి లో ఉన్న "దవూద్ ఇబ్రహీం కి కూడా ఉన్నారు లెండి.

విజయ క్రాంతి said...

శోధన అంటే వున్న అన్ని మార్గాలతో అంటే చదివి , చూసి , విని ఇంకా ఏమైనా వుంటే వాటి ద్వారా తెలుసుకోవటం . ఇది మీరు చేయటం నిజం అది మీ బ్లాగులు చదివే అందరికి తెలుసు .

సాధన అంటే అర్థం ఏంటి ? ఏదైనా సరే కొంత ఆచరించి కొంత ప్రయత్నించి కొంత అనుభవించి తెలుసుకోవటమే . మీరు అలా ఏరోజైనా ఏ మతాన్ని అయినా పాటించార ? లేకుంటే అది సాధన ఎలా అవుతుంది ? సాధన చేసి మాత్రమె నమ్మటం ఎలా అవుతుంది ?

దీనికి సమాధానం చెప్పండి మహేష్ గారు , అందరికి అన్ని సమాధానాలు ఇచ్చి దీనికి మాత్రం ఇవ్వకపోవటం ఏంటి ?

Kathi Mahesh Kumar said...

@విజయక్రాంతి:నేను పుట్టుకతో నాస్తికుడిని(?)కాను. నాస్తికుడిగా "మారాను".ఈ పరిణామక్రమంలో కొంత భౌతిక-ఆధ్యాత్మిక వాదాల్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను.అవి నాకిచ్చిన సమాధానాలకన్నా, మానవవాదం నాకు కల్పించిన జవాబులు మిన్నగా తోచాయి.దేవుడికన్నా మనిషి ప్రధానమని నమ్మినక్షణాన "దేవుడ్ని" త్యజించాను.

దేవుళ్ళ తత్వాల్నీ,రూపాల్నీ,లక్షణాల్నీ భౌతికజగత్తులో సమాజ నిర్మాణానికి,వ్యక్తిత్వ వికాసానికీ కావలసిన సామాగ్రులుగా చూసినన్నాళ్ళూ నాకు ఆమోదయోగ్యమే. ఎప్పుడైతే అవి "మిధ్య"స్థాయికి చేరుకుంటాయో అప్పుడు వాటిని ఖండిస్తాను.అవి సామాజిక-రాజకీయ-మానవజీవనానికి హాని చేస్తాయో అప్పుడు దాన్ని వ్యతిరేకించి పోరాడుతాను.

my "religion" is very clear to me.

తెలుగు వెబ్ మీడియా said...

ఇస్లాం మతం నాస్తికుల తలలు నరకాలని చెపుతుంది. ఇస్లామిక్ చాంధసవాదాన్ని వెనకేసుకొచ్చే నువ్వు నాస్తికుడివెలా అవుతావు మహేష్?

Kathi Mahesh Kumar said...

@ప్రవీణ్: ఇస్లామిక్ ఛాంధసవాదాన్ని ఎప్పుడు నేను వెనకేసుకొచ్చాను?
నేను నాస్తికుడినోకాదో నాకు తెలీదు.అందుకే అక్కడ "?" చిహ్నం ఉంది. నేను humanist ని అది మాత్రం నాకు తెలుసు.

విజయ క్రాంతి said...

చక్కగా వివరించారు కాని నాకెందుకో ఇంకా సందేహం గా నే వుంది .

మీరు చెప్పిన విధం గా "ఈ పరిణామక్రమంలో కొంత భౌతిక-ఆధ్యాత్మిక వాదాల్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను.అవి నాకిచ్చిన సమాధానాలకన్నా, మానవవాదం నాకు కల్పించిన జవాబులు మిన్నగా తోచాయి.దేవుడికన్నా మనిషి ప్రధానమని నమ్మినక్షణాన "దేవుడ్ని" త్యజించాను."

మీరు చేసిన ఆ ప్రయత్నాలు వివరిస్తే మాకు కూడా కొంత ఉపయోగం గా వుంటుంది .అలాగే మీకు ఎప్పుడు ఎలాంటి సమాధానాలు దొరికాయి?ఇది కేవలం సలహా మాత్రమె. చెప్పటం చెప్పక పోవటం మీ ఇష్టం.

మతం ని వ్యక్తుల స్థాయి లో చూస్తే ఒక లా , ఒక సమాజ పరం గా గమనిస్తే ఇంకోలా వుంటాయి . ఆ దిశగా శోదిస్తే మీకేమన్నా ఉపయోగమే గదా .అంతే కాని వ్యక్తి గతం గానో , ఒక వర్గాన్ని గానో నిందించటం ఎందుకు ? అలా నిందించటం వాళ్ళ కలిగేది ఏంటి ? మార్పు ? అస్సలు కలగదు . మీరు సోదాహరణం గా రాస్తే కనీసం కొంతైనా ఉపయోగం వుంటుంది .
ఎందుకంటే ఈ రోజు అభిప్రాయం రేపటి చరిత్ర .
చరిత్ర అన్ని సార్లు నిజం చెప్పదు.

అన్నట్టు బుక్ అఫ్ ఎలి సినిమా చూసారా ? ఆ దర్శకుడు ఇంకో కోణం లో చూపించాడు ఈ విషయాన్ని ....

విజయ క్రాంతి said...

అయ్యా ప్రవీణ్ గారు , మీరు రాయాలనుకుంటే ఏదైనా నిర్మాణాత్మకం గా రాయండి . ఇలా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఎందుకు రాసి చులకన అవ్వటం ?

విజయ క్రాంతి said...

ఇక ఈ టపా విషయానికి వస్తే , ఇది ఆయన గీయటం వరకు సరే . అది కళ. కాని అది ఏనాడు బజారులో పెట్టి అమ్ముకున్నాడో అప్పుడు అది వ్యాపారం . వ్యాపారం ఏదైనా సమాజానికి జవాబుదారినే . అలాంటప్పుడు హుస్సేన్ పారిపోకుండా ఎదుర్కొని , తన ఉద్దేశ్యాలు వివరించి వుంటే ఎంతో బావుండేది . అది ఆయన బాధ్యతా ,సంస్కారము .
అవి చేయకుండా వున్నప్పుడు హుస్సేన్ అయినా రవివర్మ అయినా ఇంకో ఎవరైనా చేసింది తప్పే .

మీరు దీన్ని కళ అనుతున్నారు . నేను వ్యాపారం అంటాను . కళ - కళా పోషణ ఇలాంటివి చచ్చి చాల రోజులైంది . ఉన్నదంతా అమ్మటం - కొనటం

Kathi Mahesh Kumar said...

@విజయక్రాంతి: మీ preposition ఎంత అర్థరహితమో మీరైనా గ్రహించారా!

కళాకారుడు తను అనుకున్నది సృష్టిస్తాడు. సామాజిక కట్టుబాట్లను అనుసరిస్తూనే కళాకారుడు సృష్టిచెయ్యాలంటే "మార్పు" ఎక్కడ్నుంచీవస్తుంది? మామూలువాళ్ళకి నీతీ మంచీ వుండాలి - కాని ఏ ఒకరిద్ధరో అసాధారణ వ్యక్తులుంటారు. ప్రతి సంఘంలోనూ వారికి స్వేచ్చ ఉండాలి. ఉంటేనే ఏదోఒక ఘనకార్యం చెయ్యగలుగుతారు. సంస్కృతీ, నాగరికతా వారివల్లనే వృధ్ధిచెందుతాయి. కళాకారులు అట్లాంటివాళ్ళే.

హుస్సేన్ వ్యాపారం చేసి కళనిసృష్టించలేదు. అతను సృష్టించిన కళ "వెల" సహృదయులు గ్రహించి వెలకట్టారు. కాబట్టి దీన్ని వ్యాపారంగా మీరు ఉదహరించడం భావించడం రెండూ సహేతుకం కాదు.

Viswanath said...

>>> దేవుడికన్నా మనిషి ప్రధానమని నమ్మినక్షణాన "దేవుడ్ని" త్యజించాను.

మేము దేవుడు, మనిషి ఇద్దరూ ప్రధానం అని నమ్ముతాము ... ఇంత అద్భుత సృస్టి చేసిన భగవంతుడు(ఆ శక్తి) ఇంకా అద్భుతం అని విశ్వశిస్తం ...

>>> దేవుళ్ళ తత్వాల్నీ,రూపాల్నీ,లక్షణాల్నీ భౌతికజగత్తులో సమాజ నిర్మాణానికి,వ్యక్తిత్వ వికాసానికీ కావలసిన సామాగ్రులుగా చూసినన్నాళ్ళూ నాకు ఆమోదయోగ్యమే.

ఆ "మిధ్య"లోనే మాకు ఎదో కనిపిస్తొంది ... ... it's our own interpretation ...మీకు ఏది కనపడుతోందొ అదే మాక్కుడా ఎందుకు కనపడాలి?


>>> ఎప్పుడైతే అవి "మిధ్య"స్థాయికి చేరుకుంటాయో అప్పుడు వాటిని ఖండిస్తాను.

మీకు నచ్హిన వాటిని మీరు ఆచరించండి ... ఎవరికి ప్రొబ్లెం లేదు ... కానీ మెజారిటి ప్రజల నమ్మకాన్ని ఖండించటానికి మీ హక్కు ఏమిటి?

Shouri

Anwartheartist said...

మేము దేవుడు, మనిషి ఇద్దరూ ప్రధానం అని నమ్ముతాము ... ఇంత అద్భుత సృస్టి చేసిన భగవంతుడు(ఆ శక్తి) ఇంకా అద్భుతం అని విశ్వశిస్తం ...

Kathi Mahesh Kumar said...

@శౌరి: నమ్మకాలు private domain లో ఉన్నంతవరకూ ఎవరూ ప్రశ్నించరు ఖండించరు. కానీ అదే public domain లో రాజ్యాంగ వ్యతిరేక విధానంలో కనిపిస్తే అవి వ్యతిరేకించబడతాయి.ఆ హక్కు భారతీయుడిగా నాకుంది. I don't cross my line in doing that. I am a law abiding citizen.

Paadarasam said...

Mahesh gaaru,

please go through the below mentioned link which is self-explanatory.


http://www.hindujagruti.org/activities/campaigns/national/mfhussain-campaign/hussain_verdict.pdf

Viswanath said...

Exactly ... Same is applicable to M F Hussain paintings as well ... as long as it's in his private domain nobody is goanna bother about his paintings ... but once it becomes public everybody has a right to question and condemn.

విజయ క్రాంతి said...

మీరు చెప్పినట్టు మార్పు అవసరం . కాని మార్పు అనేది విపరీతం అయితే వచ్చే నష్టాలే ఇవి .
అయినా హుస్సేన్ చేసిన మార్పు ఏంటి ? లేని సమస్యలు లేపటమా? ఈ మార్పు వాళ్ళ లాభం ఎవరికీ ? మీకు కాదు ,నాకు కాదు . ఆయన వోక్కడికే . ఆయనలా ఇంకా తయారయ్యే ఫక్తు హుస్సేన్ కళాకారులకు మాత్రమె .
మన దేశం లో ఉన్నంత వైరుధ్యాలు ( సాంస్కృతికంగా ,మత పరం గా , జాతి పరంగా , కుల పరం గా , లింగ పరం గా ..ఇలా ఎన్నో )
మాపు చేయటం గొప్ప మార్పు. అంతే కాని బట్టలు వలిచి బొమ్మలు వేయటం స్వేచ్చ అంటే , వేరే మనిషి వచ్చి నా పక్కింటి వాళ్ళు నా ఇష్టం ఏమైనా చేస్తా అంటే అది కూడా స్వేచ్చ అందామా ?
మన బ్లాగుల్లోనే చాల ఉదాహరణలు వున్నాయి. మీకు బాగా తెలుసు .
మతం ఒక నమ్మకం . ఇక్కడ అది మూఢ నమ్మకం అంటారా నాకు సమస్య లేదు .
ఒక సమాజం లో ఉండాలంటే కొన్ని నియమాలు కట్టుబాట్లు వుండాలి . అవునంటార కాదంటారా ?
ఎందుకంటే మనిషి మార్పు వెంట పరిగెత్తి పరిగెత్తి అలసి పోయినపుడు కావాల్సింది స్వాంతన . అది దొరకకపోతే మార్పు ఎందుకు ?
మనిషి బ్రతికేదే మనసు కోసం . ఆ మనసు చెప్పింది వింటారు , చేస్తారు ,మీరు అంతే , నేను అంతే . అలాగే కొన్ని కోట్ల మందికి మనసు వుంటుంది . అప్పుడు పుట్టేవే ఈ రగడలు.

ఇంతెందుకు , రేపు ఎవడైనా వచ్చి స్వేచ్చ కావాలి సమాజానికి . దేవుడిని నమ్మని వాడిని నరికేయాలంటే ఏమి చేయాలి ?
స్వేచ్చకు రాజ్యాంగ బద్దం గా కొన్ని పరిధులు వున్నై . అందుకు వొప్పుకొని వారు వుంటే ఎంత లేకుంటే ఎంత ?

ఇదే ఒక పోస్ట్ ఐపోయే లావుంది . మీ స్పేస్ వాడినందుకు సారీ .. ;-)

Kathi Mahesh Kumar said...

@విశ్వనాథ్: హుస్సేన్ ని వ్యతిరేకించడం వరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ పెయింటింగుల్ని తగులబెట్టడం,వ్యక్తిపై గ్యాలరీలపై దాడిచెయ్యడం, తెలిసితెలిసీ తప్పుడు కేసులు బనాయించి హెరాస్ చెయ్యడం, దేశం వదిలివెళ్ళిపోయే పరిస్థితులు కల్పించడం వంటివాటిని ఏవిధంగా సమర్ధించుకోవాలి? అక్కడే ఉంది సమస్య.

@విజయ క్రాంతి:"హుస్సేన్ చేసిన మార్పు ఏంటి ?" అని మీరు ప్రశ్నించారంటేనే you have no knowledge of his contribution to taking Indian art to international అని అర్థమవుతోంది.

తన పెయింటిగుల్లొని నగ్నత్వంకాదు ప్రపంచంలోని కళాకారుల్లో అతన్ని ఒకానొక ఉత్తముడ్ని చేసింది. Its his craft,style and form. వీటిని అర్థం చేసుకోవాలంటే కొంత art education కావాలి.

MFH has accomplished what he is and what he can be to the world. కాబట్టి ఈ సమాజపు జడ్జిమెంటు, నా మద్దత్తూ అతనికి అస్సలు అవసరం లేదు. I am only supporting him because I WANT TO.

Viswanath said...

>>> తెలిసితెలిసీ తప్పుడు కేసులు బనాయించి హెరాస్ చెయ్యడం, దేశం వదిలివెళ్ళిపోయే పరిస్థితులు కల్పించడం వంటివాటిని ఏవిధంగా సమర్ధించుకోవాలి? అక్కడే ఉంది సమస్య.

ఏమిటి ఆ తప్పుడు కేసులు ... "మా అభిమానాలు దెబ్బ తిన్నాయి మహాఫ్రబో ... మీరు కల్పించుకోండి" అంటే అది తప్పుడు కేసా? :(

నాకు లీడర్లో గుర్తుకువస్తోంది ... "Small fishhh ... but beautiful fishhhh" ... అదే ruthless mentality M F Hussain చూపిస్తున్నది కూడా ....

విజయ క్రాంతి said...

నా ఉద్దేశ్యం హుస్సేన్ చేసిన మార్పు ఏంటి అనే విషయమే . ఆయన గొప్పవాడు ఎన్నదగ్గ వాడు కావచ్చు . కాని సాధారణ ప్రజానీకానికి ( ముఖ్యం గా మన దేశం లో ) కావాల్సినది ఏమిటి ? వాటికి ఈయన చేసింది ఏమిటి అనే విషయం లో నే. ఆర్ట్ గురించి నాకు తెలీదనటం ..ఇది కొంత మీ దృక్కోణం మరి . ఎందుకంటే ఒక ఆర్ట్ పట్టబద్రుడిగా నాకు ఆర్ట్ గురించి మీకన్నా ఎక్కువే తెలుసనుకుంటాను . అది ఇక్కడ అనవసరం .
మీరు సపోర్ట్ చేయద్దని నేను చెప్పలేదే ? మీరు చెప్పిన కారణాలతోనే ఈ బాధంత . ఎంత గొప్ప వ్యక్తి అయినా తప్పు చేస్తాడు . అది ఈయన చేయలేదనటం మీ అభిప్రాయం . కాని నేను చెప్పేది మీవాదన ఒక వైపే ఎందుకుంది అని ?

కొన్ని కోట్ల మంది భావాలు పరిగణలోకి తీసుకోనప్పుడు , రాజ్యాంగం కల్పించిన స్వేచ్చను దుర్వినియోగం చేసినప్పుడు సమర్థన ఎందుకు ?
స్వేచ్చకు నేనెప్పుడు అనుకూలమే . కాని అది సరైన మార్పును సూచిస్తే చాల సంతోషం . కాని జరిగింది ఏంటి ?
ఇది ఆయన కళ అంటారా ? దానికి ఆల్రెడీ నేను చెప్పాను. వెల కట్టింది ఇక కళ ఎందుకైతుంది ? అది కళ నేను చేసింది కళా పోషణ అనటం ఎంత సమంజసం ?
ఇంతమంది ని అవమానించిన వాడు ( ఇది నా అభిప్రాయం కాదు ) వుంటే ఎంత వేరే దేశం పోతే ఎంత ?

Kathi Mahesh Kumar said...

@విజయక్రాంతి: సచిన్ టెండూల్కర్ మూడువందల రన్లు కొడితే దేశప్రజానీకానికొచ్చిన లాభమేమిటి? అన్నట్లుంది మీ అభ్యంతరం. కళాకారులూ, క్రీడాకారులూ తమతమ పనులతో దేశానికి సేవచేస్తారు. టెండూల్కర్ కి BCCI జీతమొస్తుంది, యాడ్స్ చేస్తే డబ్బులొస్తాయికదా అతనేదో భుక్తికోసం వ్యాపారం చేసుకుంటున్నాడు ఇందులో దేశానికొచ్చిందేమిటని తీసిపారేద్దామా!

Its all the more pitiful if you are an arts graduate and still don't understand the function of fine arts in a society. ఒక నావాదన ఒకవైపు ఉండటం గురించి...I am for creative freedom so I cannot be on the other side.

Naveen Garla said...

మహేష్ గారు,
ఇంత వాదనలు ఎందుకు కానీ, మీకు అంత విశాల భావాలు ఉంటే, ఆ డానిష్ పత్రిక ప్రచురించిన ప్రవక్త కార్టూన్లు కూడా మీ బ్లాగులో ప్రచురించి, అదేమీ అంత తప్పుకాదని, అనవసరంగా మనస్సులు గాయపరచుకుంటున్నారని వ్రాయండి, తరవాత మేమందరం నోటి మీద వేలు వేసుకొని మీరు చెప్పేవి ఒప్పుకుంటాం.

Kathi Mahesh Kumar said...

@నవీన్ గార్ల: మీరు ఛాలెంజ్ చెయ్యనక్కరలేదు.

డానిష్ కార్టూన్ల విషయలో ఉన్మాదం చూపించిన ముంస్లింలూ మూర్ఖులే. అందులో ఏమాత్రం సందేహం లేదు. డానిష్ కార్టూన్లు విరివిగా ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి. క్రింది లింకుల్లో చూడండి.
http://flapsblog.com/wp-content/uploads/Mohammedcartoons.jpg

డావిన్సీ కోడ్ విషయంలో హంగామా చేసిన క్రైస్తవులూ ముమ్మాటికీ ఉన్మాదులే.

I am for right to expression and against all kind of violence. No matter what religion it comes from.

AVS said...

@ నవీన్ గార్ల: మహేష్ హిందువుగా పుట్టాడు కనుక, ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్లుగా 'ప్రక్షాళణ' హిందుత్వం పై మొదలుపెట్టారేమో... అందుకే ఆయనను 'ముస్లింలను విమర్శించండి', 'క్రైస్తవులను తిట్టండి' అనటం సమంజసం కాదేమో...! ఇక 'ప్రక్షాళణ'లో తప్పొప్పులంటారా, అవి నిజంగానే చర్చించాల్సినవి.