ఇప్పుడే C.B.రావు గారు తమ టపాలో ‘నా ప్రపంచం’ బ్లాగు పదివేల క్లిక్కుల మాట చూసి, ఇంతకూ నా బ్లాగుకి ఎంతమందొచ్చారో చూద్దామని వచ్చాను. ఆశ్చర్యంగా నా బ్లాగు సందర్శకుల సంఖ్య పదివేలు దాటి ఇప్పుడు పదకొండు వేల దిశగా పరుగులెడుతోంది. ఈ సందర్భంలో ఆశ్చర్యంతొపాటూ బోలెడంత ఆనందంగానూ ఉంది.
ఈ సందర్భంగా నా బ్లాగు సందర్శకులకూ, వ్యాఖ్యాతలకూ, విమర్శకులకూ, అభిమానులకూ, నా బ్లాగు అస్సలు నచ్చనివారికీ, కొంచెంగా మాత్రం నచ్చేవారికీ అందరికీ నా కృతజ్ఞతలు.
***
23 comments:
పదివేల సందర్శకుల ఆనందమయమూ...........!
కంగ్రాట్స్. నేనే ఫాస్ట్ చెప్పాను.
మంచి మంచి విషయాలని అందిస్తూ, మధ్య మధ్యలో ప్రశ్నలు రేకెత్తిస్తూ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిరాటంకంగా సాగిపోవాలి.
http://dummyspeaks.blogspot.com/2008/09/blog-post.html
పై లింక్ చూసి కాసేపు నవ్వుకోండి.
మహేష్ గారు, అభినందనలు.
నాకు పది వేలు దాటడానికి రెండు సంవత్సరాలు పైబడి పట్టింది !!
టపాకాయల్లాంటి టపాలు రాస్తుంటే సందర్శకులు కూడా టప టపా వచ్చేలా చేస్తున్నావు మహేష్, అభినందనలు..నీ ఆలోచనలకు, వేగానికి. కీఫిటప్...
మరి నాకు థేంక్స్ చెప్పండి ! కనీసం 200 సార్లు క్లిక్కింది నేనే బాబూ ! :D
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చర్చల ద్వారానే మంచి విషయాలు బయటకి వస్తాయి. అటువంటి ఆలోచనలని రేకెత్తించేవి మీ వ్యాఖ్యలు, టపాలు. అవి అలా పేలుతూనే ఉంటాయి.
మహేష్ గారూ,
అభినందనలు. నిజానికి మీ పోస్టుల్లో చాలా నాకు నచ్చవు. మీరు వ్రాసే విషయాలలో ఎన్నిటిలోనో నాకు అభిప్రాయబేధాలున్నాయి. ఐనా సరే, మీ టపాలన్నీ శ్రద్ధగా చదువుతానంటే అది మీ గొప్పదనమే. మీరు నమ్మిన సిద్ధాంతాలపై మీ నిబద్ధత ఆశ్చర్యం కలిగిస్తుంది.
హృదయపూర్వక అభినందనలు.
"ఎంత మీ బ్లాగైనా మరీ ఏడంకెలకు మించి స్టాట్ కౌంటర్ అక్కరలేదులెండి" అని కొంచెం టీజ్ చేస్తూ అప్పుడన్నా, మీరు ఇలానే రాస్తూ, నచ్చినా నచ్చకపోయినా, విషయం గురించి అయితే ఆలోచించేలా చేస్తారని కోరుకుంటూ..
పూర్ణిమ
10000 సందర్శనలలో నా సంఖ్య తక్కువే. కూడలి లో, నా కాలేజీ కథ అనే టపా చూసి ఇదేదో కాలేజీ కుర్రాడి ప్రతాపమనుకుని, అప్పటి పని ఒత్తిడిలో పర్ణశాల బ్లాగు దాటవేశాను. ఎన్ని మంచి వ్యాసాలు మిస్ అయ్యానో. శాన్ హొసే (కాలిఫోర్నియా) లో తీరిక సమయంలో వీటిని చదవాలి. 10000 వ పర్ణశాల పాఠకుడు (అదృష్టవంతుడు కానే కాదు బాబోయ్) ఎవరు? అతని I.P., ఊరు, పేరు ఏమిటి? దీప్తిధార 10000 వ పాఠకుడికి బహుమతిగా మా అమ్మాయి తులసినిచ్చి వివాహం చేశా. మహేశుడేమి బహుమతి ఇవ్వబోతున్నాడో?
అభినందనలు. స్థూలంగా మీ అభిప్రాయాలే నావీ కావడంతోపాటు మీ శైలి కూడా తోడై మీ టపాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. కొనసాగించండి.
అభినందనలు. పర్ణశాల శాశ్వత ఖాతాదారుల్లో నేనూ ఒకడిని. మహేష్ టపాలని నా అంత ఘోరంగా ఎవరూ పీకి పాకాన పెట్టలేదేమో. పొగడ్తకైనా విమర్శకైనా, ఓపికగా, హుందాగా స్పందించటం మహేష్ లో నాకు బాగా నచ్చిన విషయం. ఈ బ్లాగు ఇలాగే కళకళలాడుతూ ఉండాలని నా హృదయపూర్వక ఆకాంక్ష.
అభినందనలు.ఇది మీరు సునాయాసంగా సంపాదించింది కాదని తెలుసు.ఇదే కష్టాన్ని కొనసాగించి త్వరలో మరిన్ని మైలురాళ్ళు దాటాలని కోరుకుంటున్నాను.
అభినందనలు. నేను క్రమం తప్పకుండా చూసే బ్లాగులలో మీది కూడా ఒకటి. నిర్మొహమాటంగా మీరు రాసే టపాలతోపాటు వాటిపై వచ్చే చర్చలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. Keep it up..
congrats
your blog deserves the appreciation
hope you will reach one lakh mark soon
with regards
bollojubaba
ఇదేమీ బాగాలేదండీ. సచిన్ టెండూల్కర్ పది పరుగులు సాధించి బేటు పైకెత్తినట్టుంది. మీరు ఒక లక్ష హిట్ల తర్వాత ఇలాంటి టపా వ్రాస్తే దానికో అందం - మాకో ఆనందం. ఇంకెంత చెప్పండి - ఇలాంటివి మరో పది - అంతేనా! బ్లాగర్లారా, చూస్తూ ఉండండి - లక్ష హిట్ల టపా మహేష్ గారి చేత ఇంతకంటా పెద్ద గ్రీటింగు కార్డు పెట్టి మరీ వ్రాయిస్తాను.
ఇవన్నీ భవిష్యత్తు - ప్రస్తుతానికి మాత్రం - మహేష్ గారూ, అభినందనలు.
శుభాకాంక్షలు
మీకు నా అభినందనలు!
అభినందనలు!
వ్యాఖ్యాతలకు, అభిమానులకూ, పాఠకులకూ నా ధన్యవాదాలు. మీ అభిమానంతో మరిన్ని మైళ్ళుదాటగలననే నమ్మకం నాకుంది.నెనర్లు.
మీ బ్లాగు శత్రువుల contribution కూడా చాలా ఉండవచ్చు, వాళ్ళకీ నెనరులు చెప్పండి :-) ...Wish u best of luck...
నా బ్లాగు లో stat counter పెట్టుకునే ఓపిక లేక అలా వదిలేసాను. :-( ... మీ ఎనెర్జీ కొంచెం అరువివ్వండి.
అప్పుడప్పుడూ మాత్రమే బ్లాగులు చూసే కోవకి చెందినవాణ్ణి నేను. మీ ఆలోచనలు పరుగెట్టే తీరు నాకు నచ్చింది. నాలాంటివాళ్ళ ప్రమేయం కూడా అంతో ఇంతో ఉన్నట్టే. అభినందనలు.
-శ్రీహర్ష-
Post a Comment