Wednesday, September 17, 2008

యాధృచ్చికం - ఒక ప్రేమకథ

"మనం తప్పు చేసామా?" అని అరమోడ్పు కళ్ళతో నా కనుల్లోకి చూసి తను అడిగితే ఏంచెప్పాలి? "నాకు మాత్రం అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది" అని నిజాన్ని చెబితే, తను ఆశ్చర్యపడుతుందో ! అబ్బురపడుతుందో!! గర్వంతో నన్ను హత్తుకుంటుందో !!! తెలీదు.

౦౦౦

తనని కలిసి మూడురోజులే అయింది.

తను ఒక స్నేహితుడి స్నేహితురాలికి స్నేహితురాలు. కాస్త తికమకగావున్నా, చాలా వరకూ యూనివర్సిటీలో పరిచయాలూ, ప్రణయాలూ ఇలాగే మొదలవుతాయి. ఎవరో ఎవరికోసమో ఎవరిద్వారానో ఎలాగో పరిచయమవుతారు. కలవడం. విడిపోవడం. మళ్ళీమళ్ళీ కలవడం. కలుస్తూనేవుండటం. కలవలేకుండావుండటం. కలిస్తేగానీ వుండలేకుండావుండటం. కలిసిపోవడం. మళ్ళీకలవకపోవటం. జీవితాంతం కలిసుండటం లాంటి కబుర్లేన్నో, కథలెన్నో, వ్యవహారాలెన్నో, వెతలెన్నో, వ్యధలెన్నో. అన్నింటికీమించి అనుభవాలూ, జ్ఞాపకాలూ ఎన్నెన్నో.

తను..తన స్నేహితురాలికి తోడొస్తే, నేను మావాడికి తోడెళ్ళాను. "అరుణప్రియ అని నా ఫ్రెండు" అని తన పరిచయం జరిగింది. అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ కళ్ళలోకి కళ్ళుపెట్టేసిన నా మిత్రుడు నన్ను పరిచయం చేసినా, పక్కనేవున్న నాకే వాడు చెప్పింది వినపడలేదు. అలాంటిది తనకు వినపడిందనిమాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను. పెద్దగా ఆసక్తి లేనట్టే "హలో" అని ముభావంగా అంది.ఒక రెండు నిమిషాల తరువాత మా మిత్రులు తమ ఏంకాంతాన్ని వెతుక్కుంటూ "ఇప్పుడేవస్తాం" అని చెప్పి మాకు ఏంకాతాన్నిచ్చి వెళ్ళిపోయారు.

ఏదోఒకటి మాట్లాడాలికాబట్టి "రెండెందుకు" అని నేనే మొదలుపెట్టాను.

ఒక్కక్షణం సందేహంగా మొదలుపెట్టి "ఏమిటి రెండు?" అంది.

"అదే రెండుపేర్లెందుకు? 'అరుణ' 'ప్రియ' అని".

"అదంతే, మా పేరెంట్స్ అలాగే పెట్టారు."

"అంటే అరుణానికి నువ్వు ప్రియమా, అరుణం నీకు ప్రియమా లేక నువ్వే ప్రియమైన అరుణానివా ?"

ఒక్కక్షణం నిశ్శబ్ధం...

"ఏమో ఇప్పటివరకూ ఆలోచించలెదు. ఎవరూ ఇలా అడగలెదుకూడా."

"ఇప్పుడు నేనడిగానుకదా ! ఆలోచిస్తారా?"

"నాకు తెలిసినంతవరకూ, నా నక్షత్రం ప్రకారం నా పేరు 'అ' అక్షరంతో మొదలవ్వాలికాబట్టి 'అరుణ' అని పెట్టారు. మా నాన్నగారికి 'ప్రియ' అనే పేరు ఇష్టం. అందుకని రెంటినీ కలిపి...ఇలా."

"ఓ..బహుశా మీ నాన్నగారికి ఇష్టమైన బంధువులో లేక స్నేహితుల పేరేమో !"

"మా బంధువుల్లో ఆ పేరుగలవాళ్ళెవ్వరూ లేరు. మా నాన్నగారి స్నేహితులు..." అంటూ ఆగి ఒక్క క్షణం ఆలోచించి నావైపు కొంచెం కోపంగా చూసి "అంటే మీ ఉద్దేశం మానాన్నగారి స్నేహితురాలెవరైనా అనా ?" అని నిరసనగా అంది.

అనాలోచితంగా అడిగినా, నేనడిగిన ప్రశ్నలోని అంతర్లీన ఉద్దేశం అదేనేమో ! మన తల్లిదండ్రులకు పెళ్ళికి ముందుగానీ, పెళ్ళి తరువాతగానీ వారిదంటూ ఇక జీవితం వుండగలదని పిల్లలు అనుకోవడం సంస్కారహీనంగా అనిపిస్తుంది.కానీ వారు తల్లిదండ్రులకంటే ముందు వ్యక్తులని. 'వ్యక్తిగతం' వారి హక్కని మర్చిపోతాం.తనకి కోపంరావడం సహజమే అనిపించినా, నేనిలా అడగటం మాత్రం యధాలాపంగా జరిగిందంతే.

ఆ కోపం వర్షించే చూపులో నాకొక పరిచయమున్న కళ్ళు కనిపించాయి. అప్పటివరకూ ఈ సాయంత్రపు అరచీకటిలో తన దేహాన్ని గుర్తించానకానీ రూపాన్ని కాదు. కానీ ఇప్పుడా కళ్ళు...నన్ను ఆకర్షించే కళ్ళు, ప్రేమించేకళ్ళు, కాంక్షించదగిన కళ్ళు, ఎనాళ్ళుగానో తెలిసున్నకళ్ళు. ఆకళ్ళలో అంతటా నా మీద కోపం. త్వరగా సర్ధుకుని "నా ఉద్దేశం అది కాదు" అని చెబుదామనుకున్నాను. కానీ "మరి ఏ ఉద్దేశంతో అన్నారు?" అంటే నాదగ్గర సమాధానం లేదు.

తనే అంది "మీరెప్పుడూ ఇలాగే మాట్లాడుతారా?" అని.

"ఎప్పుడూ ఏమోగానీ, ఇప్పుడిలా జరిగిపోయిందంతే"

తను ఛివాలున లేచింది. వెళ్ళిపోయింది.
౦౦౦

మరుసటిరోజు హాస్టల్లో చేసిన ఉప్మాని తప్పించుకోవడానికి క్యాంటిన్లో పూరీని ఆశ్రయించాను. పూరీ తీసుకుని టేబుల్ పైన పెట్టి కుర్చీలో కూర్చున్నాను. ఎదురుగా "హలో" అంటూ తను. ఉదారంగు కాటన్ టై అండ్ డై సల్వార్ కమీజ్, దుపట్టాని దుప్పటిలాగా కప్పెయ్యకుండా కేవలం మెడను దాస్తూ వెనుకగా వేసుంది.తన మేని ఛాయలో కనీకనిపించకుండా కలిసిపోయిన ఒక సన్నటి బంగారు గొలుసు. ఆకర్షనీయమైన ముఖం. ప్రశ్నించే ముక్కు. ఎదిరించే నుదురు. చక్కటి గీసిన పెదవులు. అల్లరిపిల్లల్ని బలవంతంగా కట్టిపెట్టినట్లున్నా చిత్రమైన జుట్టుముడి. అవే కళ్ళు...'నా' కళ్ళు.

"హలో మీ హాస్టల్లోనూ ఉప్మాయేనా" అంటూ కూర్చోమన్నాను.

ఒక్క క్షణం సందేహంగా ముఖంపెట్టి, మళ్ళీ ఏదో తెలిసినట్లు నవ్వింది.

"లేదు ల్యాబ్ కెళ్తూ మిమ్మల్ని చూసి ఇటొచ్చాను"

"ఓహ్ ! నన్ను కలవడానికొచ్చారా?"

"ఏం రాకూడదా !"

"అలాగని కాదు. నిన్న మీరు కోపం,తో వెళ్ళిపోయేసరికీ మళ్ళీ కలిసే అదృష్తం లేదనుకున్నాను."

"అదృష్టమా !!!"


"నేనలాగే అనుకున్నాను."

మా నాన్నగారు రెండేళ్ళక్రితం చనిపోయారు. వారు నన్నెప్పుడూ 'ప్రియ' అనే పిలిచేవారు. నిన్న మీరు హఠాత్తుగా అలా మాట్లాడే సరికీ చాలా కోపమొచ్చింది. అక్కడే ఏడ్చేస్తానేమో అనిపించింది. అందుకే వెళ్ళిపోయాను.

"ఐయాం రియల్లీ సారీ. నేనేదో ఊహించుకుని కావలనే అడగలేదు."

ఆ తరువాత హాస్టల్ కెళ్ళిన తరువాత ఆలోచిస్తే నాకూ అలాగే అనిపించింది. అలాగే, మీరు సూచించిన "స్నేహితురాలి కోణం" ఒకవేళవున్నా, నాకు ఇబ్బందిగా అనిపించినా,అందులో తప్పేమిటనిపించింది."

"ఇబ్బంది అనిపించడం సహజం లెండి. తల్లిదండ్రుల్ని కేవలం వ్యక్తులుగా చూడటం అంత సులభం కాదు. అదీ ఇలాంటి విషయాలలో. పదాలకు అర్థాలున్నట్లే పేర్లకీ నక్షత్రాలు, కుటుంబ ఆకాంక్షలూ, అనుభవాలూ,ఆలోచనలతో కూడిన నేపధ్యాలుంటాయి. ఆ నేపధ్యాన్ని అర్థం చేసుకుంటే ఆ వ్యక్తి పరిచయం మరింత అర్థవంతం అవుతుందనే ఉద్దేశంతో అడిగాను అంతే "

"కానీ ఇలాంటి నేపధ్యం ఉండొచ్చనే ఆలోచనే..." అంది తనలోతానే మాట్లాడుకున్నట్లుగా.

నిన్న కేవలం మన సంభాషణ మొదలుపెట్టడానికి అలా అడిగాను. కానీ మొత్తం మన మాటలన్నీ దానిమీదే జరిగేట్టుగా వున్నాయే !"

అబ్బే అదేంకాదు లెండి. నేనిప్పుడు ల్యాబ్ కెళ్ళాలి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకేదైనాకూడా మాట్లాడొచ్చు"

"ఎప్పుడు?"

"ఎప్పుడైనా"


"ఈ రోజు సాయంత్రం !"

"సరే" అంటూ లేచింది. "బై" అంటూ ల్యాబ్ వైపుగా అడుగులు వేసింది.

పూరీ తినకుండానే నాకు కడుపునిండినట్లనిపించింది.

ooo

ఆ రోజు సాయంత్రం కలిసాం. కూర్చున్నాం. మాట్లాడాం. స్కూలు, కాలేజి, కుటుంబం, స్నేహితులు, రుచులు, అభిరుచులు, అభిలాషలు, ఆశయాలు, ఆలోచనలూ, ఆదర్శాలూ, అన్నీ... అన్నీ...మాట్లాడాం. భోజనానికి సమయం అయ్యిందన్న స్పృహ లేకుండా మాట్లాడాం. మేముతప్ప మిగతా ప్రపంచం లేదన్నట్లు మాట్లాడుకున్నాం. ఈ లోకంతో మాపనైపోయిందన్నట్లుగా, ఈ విశ్వాన్ని గెలిచామన్నట్లు, ఇన్నాళ్ళూ ఎవరితోనూ మాట్లాడనట్లు మాట్లాడుకున్నాం.

మాటలింకా పూర్తికాలేదుకానీ, చేతిలో వాచ్ మాత్రం రాత్రి 11 గంటలు చూపించింది. నేను వాచ్ చూడటం తను గమనించింది.

"చాలా లేటయ్యింది కదా !" అంది అపాలజిటిగ్గా.

"లేదు. చాలా త్వరగా సమయం గడిచిపోయింది"

తన కళ్ళలో మెరుపు. 'నా' కళ్ళలో మెరుపు. నాకళ్ళలోనూ మెరుపే ! సిగ్గుతో ఎరుపెక్కిన తన చెక్కిలి, వేడిగాలులు వెలువరిస్తున్న నా చెంపలు. ఇద్దరికీ ఏదో జరిగిందని అర్థమయ్యింది. కాకపోతే అదేమిటో పూర్తిగా తెలీదు. "ఇదే" అని ఖచ్చితంగా అసలు తెలీదు.

ప్రియని హాస్టల్లో వదిలాను. నా ఆలోచనల్ని మాత్రమే నావెంట తీసుకుని నేనూ హాస్టల్ వైపు కదిలాను. ఆ రాత్రి నాకు నిద్ర లేదు. తనకొచ్చిందని కూడా అనిపించలేదు. తెలవారుతుండగా వచ్చిన కొంత నిద్రనికూడా, ఈ రోజు ఎప్పుడు, ఎక్కడ కలుస్తామో నిర్ణయించుకోలేదనే ఆలోచన భంగం చేసింది.ఇంకా పొద్దున ఐదుగంటలవుతోంది. బయట ఇంకా చీకటిగానేవుంది. వెంఠనే తన హాస్టల్ కు ఫోన్ చేసాను.

"హలో ఎవరు కావాలి?" అని అటువైపునుంచీ ఒక పరిచితమైన గొంతు.

మెల్లగా "ప్రియ" అన్నాను.

అటువైపు నుంచీ ఒక్క క్షణం నిశ్శబ్దం. "హ్మ్ నేనే" అంది ప్రియ. అవును అది ప్రియ గొంతే. అంతే, "వస్తున్నాను" అని చెప్పి ఫోన్ పెట్టేసి బయల్దేరాను.

ఐదు నిమిషాల్లో తన ముందున్నాను. రాత్రంతా నిద్రపోని కళ్ళు కలిసాయి. అలసట, బడలిక, నిద్రలేమి అన్నీ..ఇప్పుడు లేవు.

మొదటిసారిగా ఇద్దరం అసంకల్పితంగా చేతిలో చెయ్యేసి నడిచాము. అప్పటివరకూ సన్నగా అనిపించిన రోడ్లు విశాలంగా కనిపించాయి. ఆకులురాలిన చెట్లు చిగురించినట్లనిపించింది.

మేమిద్దరం నడుచుకుంటూ యూనివర్సిటీ లోవున్న లేక్ (lake) చేరేసరికీ ప్రియ కళ్ళలో కన్నీరు. అప్పటివరకూ నా చేతిలోవున్న తనచెయ్యి మరింత బలంగా బిగుసుకుంది.

"హేయ్ ! ఏమయ్యింది?" అని మాత్రం అడగగలిగాను.

ప్రియ నావైపుచూస్తూ, "ఎలా చెప్పాలో తెలియటం లేదు. మా నాన్నగారు పోయిన తరువాత గత రెండు సంవత్సరాలుగా మా వదిన పెట్టిన బాధలన్నీ నిన్న మీతోమాట్లాడుతుండగా మర్చిపోయాను. నాకంటూ కొన్ని ఆలోచనలూ, ఆశలూ,ఆశయాలూ ఉన్నాయనే విషయమే నిన్నటివరకూ మర్చిపోయాను. మీతో వుంటే మళ్ళీ నాకు జీవించినట్లుంది. నాకంటూ ఒక అస్థిత్వం వున్నట్లనిపించింది. నన్ను నేను ప్రేమించుకోగలననే విశ్వాసం వచ్చింది" అంటూ అక్కడేవున్న ఒక పెద్ద బండరాతిపై కూర్చుంది.

ఇంకా తన చెయ్యి నా చేతిలోవుంది. బలంగా ఇంకా బలంగా అది నన్ను పట్టుకునే వుంది.

నా భుజం మీద తన తల. నా చొక్కాపై తన కన్నీళ్ళు. నా చెయ్యి తన చెక్కిళ్ళ తడిని తుడిచాయి. నా చెయ్యివదిలి తన చేయి నా భుజాన్ని సాయమడిగాయి.

మగాడు తన సాహసాన్ని, ఆడది తన కష్టాల్నీ చెప్పుకుంటేగానీ స్నేహం హద్దులుదాటి బంధాలు ఏర్పడవేమో ! ఇప్పుడదే జరిగింది. మా పరిచయంలో తను ఒక నమ్మకాన్ని చూసుకుంటే, నాకు తనపై కలిగిన ఇష్టం నామీద నాకే మరింత నమ్మకాన్ని కలిగించింది.

ఈ నమ్మకాలు కలిసిన సామీప్యంలో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి సాక్షిగా మేం ఏంచేసామో మాకు తెలుసు. కానీ ఏం జరిగిందో ఇద్దరికీ తెలీదు.

౦౦౦

"మనం తప్పు చేసామా?" అని అరమోడ్చిన కళ్ళతో నా కనుల్లోకి చూసి ప్రియ అడిగింది.

"నాకు మాత్రం అనిర్వచనీయమైన ఆనందానుభూతి కలిగింది" అని నిజాన్ని చెబితే, తను ఆశ్చర్యపడుతుందో ! అబ్బురపడుతుందో!! గర్వంతో నన్ను హత్తుకుంటుందో !!! తెలీదు.

తన నుదిటిపై చెయ్యి వేసి "మన 'చర్యకు' సామాజిక విలుని ఆపాదించగలమేగానీ, అనుభవానికి కాదు. ఈ అనుభవం అలౌకికమైతే ఈ చర్యకు సమాజం చేత ఆపాదించబడే 'విలువ'తో సంబంధం లేదు. నా వరకూ ఇది అసంకల్పితమైన, అనిర్వచనీయమైన, ప్రేమైకమైన, అందమైన అనుభవం. అందుకే మనం ఏం చేసామో తెలుసుగానీ, నిజంగా ఏంజరిగిందో చెప్పగలవా? మనం యాధృచ్చికంగా కలిసిన క్షణమే, ఇలా జరగాలనే నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడు కేవలం ఆ నిర్ణయం అమలయ్యిందంతే. అది 'తప్పు' అని నువ్వు భావిస్తే ఈ చర్యకేతప్ప అనుభవానికి విలువలేకుండా పోతుంది" అన్నాను.

ప్రియ నాకళ్ళలోకి అర్థమైనట్లు చూసింది.

కలయికే గమ్యంగా కొన్ని ప్రేమలు మొదలైతే, మరికొన్ని కలయిక తరువాత వైవిధ్యం నశించి నీరసిస్తాయి. కొన్నిప్రేమలు ఆకర్షణకోల్పోతే, మరికొన్ని కలయిక తరువాత కేవలం ‘బాధ్యతలుగా’ మిగిలిపోతాయి. కానీ... మా ప్రేమకథ అప్పుడే మొదలయ్యింది.

50 comments:

ramya said...

బావుంది. కథనం ఇంకా అద్భుతం గా ఉంది.

Suresh Kumar Digumarthi said...

అందమైన అనిర్వచనీయమైన అనుభవం. అనుభవాలన్నింటికి కారణాలు చూపగలిగితే, ప్రతీ అనుభవం అందంగానే వుంటుందేమో

Chandra Mohan said...

చాలా బాగా వ్రాశారు. నేను చదివిన మీ టపాలన్నింటిలోనూ నాకు నచ్చింది, ఏ వైరుధ్యాలు లేనిదీ ఇదే. మీలో గొప్ప కథకుడున్నాడు.కొ.కు. గారి కథ చదివిన అనుభూతి కలిగించారు.

- చంద్ర మోహన్

Anonymous said...

ఒక ఫైటింగూ లేదు, ఓ రేప్ సీనూ లేదు. ఇలాంటి బేవార్సు కధ సినిమాకి పనికిరాదు నాయనా.(చెస్ట్ మీదనుంచి స్టీము వదిలించుకోడానికి తప్ప) ;-)

teresa said...

బావుంది.వాక్య నిర్మాణానికి ఇంకొంచెం పదును పెడితే మంచి కథకులవుతారు. keep writing:)

MURALI said...

అద్బుతమైన కధనం. మీ వర్ణన చాలా బావుంది. మీ భావజాలాని కి, మీరు తరుచూ చెఫ్ఫేమాటలకే ఒక కధ అనే రూపాన్ని ఇచ్చారనిపిస్తుంది. ఇది వేరే స్నేహితుని కధగానో లేక ఏ సుబ్బారావు కధగానో చెప్పుంటే ఆ విలువ దక్కేది కాదేమొ.

అబ్రకదబ్ర said...

ఇదంతా నిజమో కాదో అన్న సంగతి అవతల పెడితే, ఒక కధగా - మీ 'కాలేజీ కధ' లోని ఫీల్ ఇందులో లేదు. మీ భావాలు, ఆలోచనా విధానం తెలిసుండటంవల్ల మీరేమి రాయబోతున్నారో ముందుగానే ఊహించగలగటం దానికో కారణమేమో. హడావిడిగా రాసినట్లనిపించింది. పంటికింద రాళ్లలా అక్కడక్కడా ఉన్న అప్పు తచ్చులు అందుకు సాక్షం.

'మా ప్రేమ కధ అప్పుడే మొదలయింది' అంటూ ముగించటాన్నిబట్టి ఇది రాబోయే భాగాలకి ప్రీక్వెల్ అనుకోవాలా?

సూచన: సంభాషణలతో నిండిన కధ రాసినప్పుడు text ని రెండువైపులా కాకుండా ఎడమవైపుకి మాత్రమే align చేస్తే చదవటానికి సులువుగా ఉంటుంది

laxmi said...

what non-sense? the hero in the story just takes advatange of a girl who's disappointed with her life, and tells her it's ok to have 'aloukika anubhuti' , with whoever listens to her sadness for sometime?

i say it's just a man's way of taking advantage of a woman.

may be the hero in the story starts his 'love story' from there. but how many other men will stick by her ?

Anonymous said...

@laxmi
seems like you are new to telugu blogs. if you want to live long and be happy with the blog(ger)s world, learn to say 'tandana tana'. otherwise you will learn it the hard way.

with the above in mind, katti your story is SUPERB!

కత్తి మహేష్ కుమార్ said...

@లక్ష్మి: మీరు చెప్పింది నిజం కావచ్చు,కాకపోవచ్చుకూడా. ఈ కథ అబ్బాయి తరఫున్నుంచీ చెప్పబడింది. Objective గా కాదు.ఒకవేళ అమ్మాయి చెప్పుంటే తనకారణాలు తనకుండేవేమో!
అయినా, "taking advantage" అనేది ఎప్పుడూ అబ్బాయి తరఫునుంచే అని ఎందుకనుకోవాలి? can't it be mutual at times?!?

మిగతా ప్రేమల్లో ఏంజరగొచ్చోకూడా కథలో చెప్పడం జరిగింది.ఈ ప్రేమకథలో ఇలాజరిగింది. అలాంటప్పుడు, ఎంతమంది మగాళ్ళు "అది" జరిగిన తరువాత అదే అమ్మాయితో వుంటారనే మీ ప్రశ్న నిర్హేతుకం.అన్ని ప్రేమలూ ఒక్కలా వుండవు...

@అనామకుడు: తెలుగు బ్లాగుల్లో "you scratch my back, I scratch yours" అనే ధోరణి వున్నట్లు మీ వ్యాఖ్యలో చెబుతున్నారు.దీన్నిబట్టి, మీరు నిజంగా తెలుగు బ్లాగులు చదవలేదు ఇంకా నా బ్లాగు,ఇతర బ్లాగుల్లో నా వ్యాఖ్యలు ఇంతవరకూ అస్సలు చదవకుండా ఉండుండాలి.

Strongest disagreements and difference of opinion are entertained here. కాబట్టి అపోహలతోకూడిన అవాకులూ చవాకులూ తగ్గించి కనీసం మనస్ఫూర్తిగా విభేధించడం నేర్చుకోండి.

@అబ్రకదబ్ర:ఫిక్షన్ కథకుడిగా ఇది నా రెండో కథ. ‘కాలేజి కథ’ నా సొంత అనుభవాలు కాబట్టి దానిలోని "ఫీల్" ఇక్కడ రావాలంటే కొంత కష్టమే! నేనేం రాయబోతున్నానో మీరు ఊహించగలిగారంటే నా ఆలోచనల్ని మీరు అర్థం చేసుకున్నారనే చెప్పాలి. అదికూడా నాకు అఛీవ్మెంట్ కిందే లెక్క.

ఈ కథకి సీక్వెల్ వుండకపోవచ్చు. కానీ అమాయితరఫు నుంచీ ఒక నెరేటివ్ అవసరం అనిపిస్తోంది. మీరు చెప్పిన సూచనల్ని పాటించడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.

@మురళి: నేను రాసేవన్నీ వ్యక్తిగానాలోని భాగాలే.కాబట్టి నా భావజాలం ఇందులో ప్రతిఫలించడం సహజమనుకుంటాను."ట్రెండు"నిబట్టి రాసే స్థాయికి నేను ఇంకా ఎదగలేదనుకుంటాను. ఏదో నాకు అనిపించింది రాసెయ్యడమే!
కథ నచ్చినందుకు ధన్యవాదాలు.

@తెరెసా:మీ సూచనకి ధన్యవాదాలు. ప్రయత్నిస్తాను.

@అనామకుడు: ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కథ. కాబట్టి మీకు కావాల్సిన "మసాలా" ఇందులో వెతుక్కోకండి. బ్లాగులున్నదే "చెస్ట్ మీద స్టీము వదిలించుకోవడానికి" కాబట్టి మీ ఎత్తిపొడుపే సరైంది. నెనర్లు.

@చంద్ర మోహన్: కో.కు గారితో పోల్చగానే నేను మునగచెట్టు ఎక్కేసాను. ఆస్థాయి ప్రస్తుతానికి లేకపోయినా ఆశించడంలో తప్పులేదుకదా! నా కథ మీకు ఆ అనుభూతినివ్వడం నా అధృష్టం. ధన్యవాదాలు.

@రమ్య: కొంతైనా కొత్తగా చెబుదామని ప్రయత్నించాను. మీకు కథనం నచ్చినందుకు ధన్యవాదాలు.

Anonymous said...

I am going to go a little off track. But if you have please try to answer my question. Did you study at Hyderabad Central University?

కత్తి మహేష్ కుమార్ said...

@గంగా భవాని: మీరు off track కాదులెండి. సరిగానే ఊహించారు.నేను HCU productనే. ఈ కథలో నాయికానాయకులు కలిసేది "గోప్స్" లో, రెండోసారి కలిసిన క్యాంటిన్ "స్టూడెంట్స్ సెంటర్", ఇక ఆఖర్న చెప్పిన లేక్ "పికాక్ లేక్".

Anonymous said...

Just had a dejavu. That's why i had asked you. Your posts always reflect honesty coupled with a genuine aplomb inspite of them being contrary to popular beliefs.

సుజాత said...

హాయ్ హాయ్! మీరు వ్యాసాల ద్వారా చెపితే వివాదాస్పదమైన అంశం కథగా మలిస్తే ఎన్ని ప్రశంసలో చూడండి! ఈ ప్రశంసల్లో నాది కూడా చేర్చుకోండి. చాలా "తడి"గా ఉంది! కథనం కూడా చాలా బాగుంది. బావుంది, నిజం! మీరు అసలు వ్యాసాల తో పాటు మంచి ప్రేమ కథలు కూడా రాస్తే బాగుంటుంది అనిపించింది.

మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి gulabi98@gmail.com కి మీ మెయిలైడీ మెయిల్ చెయ్యగలరా?

ప్రతాప్ said...

లాజిక్కులు వెతక్కుండా ఫీల్ కోసం వెతికితే నిజంగా బావుంది. మీలో ఒక విమర్శకుడు, ఒక దార్శనికుడు అలానే ఒక మంచి కధకుడు కూడా ఉన్నారు.
కాకపొతే ఒక అమ్మాయి అంత తొందరగా బ్రేక్ అవుతుందా అన్న సందేహం నన్ను వదలడం లేదు. ఇదొక్కటే చిన్న లోపం అని నాకనిపిస్తూ ఉంది.

GIREESH K. said...

కథనం అదిరింది... మరోసారి భావవ్యక్తీకరణలో మీ విలక్షణత నిరూపింపబడింది! సూపర్బ్!

Anonymous said...

రామాయణం లో రాముడి కేరెక్టర్ నచ్చకపోతే ,వాల్మీకిని నిందిస్తామా!
నిజంగానే కదనం బావుంది. ఏదైనా పాత్రమీద పాటకులకిప్రేమో కోపమో కలిగిందీ అంటే
ఒకవిధంగా రైటరు సక్సెస్ ఐనట్టే కదా.ఇక నావరకూ నాకు ఈ కదలో హీరో అవకాశ వాదిగాను ,హీరోఇన్ నిరాశవాది గాను కనిపించింది. మొత్తానికి చిన్న కద పెద్ద చర్చకు తెరతీసింది. ఏమంటారు గురువుగారు?

Anonymous said...

avunu naa cament venakala vunna chetta dabbani elaa thiyyali cheppi punyam kattukondi.

శ్రీకాంత్ said...

మహేష్ గారు,

మీ కధ చాలా బాగుంది .కాని భాష లో ఒకే తీరు లేదు.ఒకచోట సామన్యంగా ఉంటే ,మరోచోట సాంకేతికంగాను,పుస్తకాల భాష గాను ఉంటోంది.

ఏ కధైనా మన భాష లో ఉంటేనే మనసుకు హత్తుకుంటుంది.

జ్ఞానం అనుభూతి కి అడ్డు కాకూడదు.

బొల్లోజు బాబా said...

గుర్రబ్బండిలో ప్రయాణం చాలా బాగుంది

బొల్లోజు బాబా

రమణి said...

ఒక అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు తమది అవసరం అనుకొంటేనో లేదా శృంగారం వల్లే స్వాంతన అనుకొంటేనో అయితే మీరు చెప్పిన ఈ కథ బాగుంది. అవకాశం, ఆశ, నిరాశ ఇవన్నీ ఇక్కడ వాడకూడదు. ఎంతో యాదృఛ్ఛికంగా జరిగిపోతుంది. ఇది ప్రేమ కథ కాదు ఓ ఆకర్షణ కథ. ఇక్కడ ముగింపు విషాదమే.

ఒక అమ్మాయి, అబ్బాయి తమది ఒక బంధం అనుకొంటే ఇలా జరగదు. అది ప్రేమ. వీళ్ళకి కావాల్సింది జీవితం. ఇక్కడా ఆకర్షణ ఉంటుంది, దానితో పాటు ప్రేమ కూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమ అనే భందం పెళ్ళి కి దారి తీసి ముగింపునిస్తుంది.

కథ శైలి బాగుంది. ముగింపు ప్రేక్షకులికే వదిలేసారనుకొంట. ఇద్దరి అమ్మాయిల ప్రేమకథా చిత్రాలలో లా...

ఇహ

"మిగతా ప్రేమల్లో ఏంజరగొచ్చోకూడా కథలో చెప్పడం జరిగింది.ఈ ప్రేమకథలో ఇలాజరిగింది. అలాంటప్పుడు, ఎంతమంది మగాళ్ళు "అది" జరిగిన తరువాత అదే అమ్మాయితో వుంటారనే మీ ప్రశ్న నిర్హేతుకం.అన్ని ప్రేమలూ ఒక్కలా వుండవు..."

చక్కటి భాష, పదాల పట్టు, చక్కటి విశ్లేషణ తెలిసిన మీరు ఇలా "అది" "ఇది" అనే పదాలని వాడడం కొంచం బాధాకరంగా ఉంది. తెలుగులో "శృంగారం " అన్న పదం వాడద్దు అని ఎవరూ ఎక్కడా ఉధ్ఘాటించలేదు. మరి ఆ పదానికి పర్యాయపదాలుగా ఇలా "అది" "ఇది" అన్న పదాలు చదవడానికి కాస్త ఎబ్బెట్టుగాను, ఇబ్బందికరంగాను అనిపిస్తున్నాయి.

Dileep.M said...

[..]మగాడు తన సాహసాన్ని, ఆడది తన కష్టాల్నీ చెప్పుకుంటేగానీ స్నేహం హద్దులుదాటి బంధాలు ఏర్పడవేమో ! [..]

బాగుంది.

శ్రీకాంత్ వాడరేవు said...

బాగుంది
కధనం మాత్రం అధ్బుతం

నిషిగంధ said...

కొంతమందితో సంవత్సరాల తరబడి స్నేహం చేసినా అది స్నేహం గానే ఉండిపోతుంది.. ఇంకొంతమందితో ఒక్కరోజులోనే దగ్గరితనం వచ్చేస్తుంది.. ఆ దగ్గరితనంలో చేసే పనులకి రీజనింగ్ ఇవ్వలేము.. అలా జరిగిపోతాయంతే! అలా నాకీ కధ చాలా నచ్చింది.. అబ్రకదబ్ర గారు అన్నట్లు ముందేం జరగబోతుందో తెలుస్తున్నా మంచి కధనంతో చివరివరకూ ఆపకుండా చదివించారు..

కానీ... ఇది 'కధ ' అంటున్నారని చెప్తున్నాను.. ఇందులో అక్కడక్కడ 'నేను ' అదృశ్యమైపోయి 'మహేష్ ' కనబడుతున్నారు!

మోహన said...

Spontaneous and smooth. I loved it. Thank you :)

Chivukula said...

అయ్యబాబోయ్ - ఇక్కడ అందరికీ కథ నచ్చేసింది. మహేష్ గారూ ఇంక మీకు తిరుగులేదు. మీరు చెపుదామనుకున్నది గొడవలు లేకుండా చెప్పడానికి మీకు కొత్త పద్ధతి దొరికేసింది. ఇక రెచ్చిపోండి.

సుజాతగారూ - మీరొక్కరే వ్యాఖ్యానించారు - మరెవ్వరూ ఆ విషయం పట్టంచుకోనేలేదు.

మొత్తం బ్లాగర్లందరికీ ఒకటే ప్రశ్న - ఇదే విషయాన్ని మహేష్ గారు కొంచెం కఠినంగా వచనంలో చెపితే అతని వెన్ను విరగగొట్టేంతగా అందరూ ఎందుకు వ్యతిరేకించారు? ఇక్కడ నేనేమీ value judgement pass చెయ్యటంలేదు - జరిగింది రైటా,తప్పా - ఇవేమీ నేను చెప్పదలుచుకోలేదు. నా సమస్య ఏమిటంటే - ఇదే విషయాన్ని ఒక వ్యాసంగా చెపితే అందరికీ తప్పు అనిపించింది - కథగా, కొంచెం బేలగా, కొంచెం భావుకత్వంతో చెప్పేస్తే రైటు అయిపోతుందా? ఒక సూఫీ కొటేషను ఉంది - "నాపక్క చూడకండి,నా చేతిలో మీకివ్వడానికి ఏముందో చూడండి" అని. నేను చెప్పదలుచుకున్నది ఒకటే - మనం ఒక అభిప్రాయాన్ని ఏ ముసుగు లేకుండా చెప్పినప్పుడు దానిని అంగీకరించడం మొదలుపెడదాము. లేదంటే మనందరికీ ఈ ముసుగు శాశ్వతమైపోతుంది. ఎవ్వరూ తన అభిప్రాయాన్ని నేరుగా చెప్పరు - ఈ కథలో హీరోలా, హీరోయిన్‌ లా బేలగా "తప్పు చేసామా?" అంటూ ప్రశ్నిస్తే - లేదు అస్సలు లేదు అంటూ రుమాలుతో కళ్ళు తుడిచేసుకుని - ఎంత భయంకర పరిస్థితులలో వాళ్ళలా చేసారో - ఎంత అందమైన ప్రేమకావ్యం ఇది - అని ఒప్పేసుకుంటూ ఉండడం మన సమాజానికి అంత మంచిది కాదేమో!
మహేష్ గారూ, నేను మిమ్మల్ని వ్యతిరేకించడం లేదు. మనందరిలో ఉన్న ద్వంద్వ ప్రవృత్తిని ఖండిస్తున్నా అంతే.
అందరికీ - ఒకవేళ అతిగా స్పందించాననిపిస్తే క్షమాపణలు.

కత్తి మహేష్ కుమార్ said...

@రమణి: మీ అభ్యంతరాన్ని గౌరవిస్తున్నాను.
కాకపోతే వ్యాఖ్యలో లక్ష్మిగారి సూచన కేవలం చర్య మీద మాత్రమే ఉండటంతో, శృంగారం లేక కలయికే గమ్యంగా అందరూ ఉండనఖ్ఖరలేదు అని కొంచెం "బలంగా" చెప్పాలనుకుని కావాలనే ఆ పదం వాడాను.

మీరడిగిన మిగతా విషయాల గురించి కొంత విశాలంగా వివరించాలి. కొంత సమయం తీసుకుని రాస్తాను.

@ప్రతాప్: ఒక అమ్మాయి ఎంతత్వరగా "బ్రేక్" అవుతుంది అనేది ఆమ్మాయిని నేపధ్యాన్ని బట్టి ఆ ప్రేమ తీవ్రతబట్టి ఉంటుంది.అయినా, ఇలాంటివాటిల్లో "బ్రేక్" అవడాలూ ‘వీక్’అవడాలూ ఉండవు. కేవలం "అలా జరిగిపోవడాలు" ఉంటాయి.

@శ్రీకాంత్:భావానికి, ఆలోచనలకూ ఉండే భాష దైనందిన చర్యలకు వాడే భాషలో తేడా ఉంటుంది. అందుకే పాత్ర స్థితిని బట్టి రాసానని నేను అనుకున్నాను. కానీ మీరు చెప్పిన దిశగా ఖచ్చితంగా పరికించి దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు.

@నిషిగంధ:అక్కడక్కడా ‘మహేష్’కనబడ్డం inevitable కదండీ!

అబ్రకదబ్ర said...

@చివుకుల:

మహేష్ ఆలోచనాధోరణి నాకు తెలిసినట్లే, నా భావాలు మహేష్‌కి తెలుసు కాబట్టి 'ఫీల్ లేదు' అన్న నా మాటలో అసలర్ధం అతను గ్రహించే ఉంటాడని నా నమ్మకం.

సుజాతగారయినా, అప్పట్లో గొడవ చేసిన ఇతరులయినా ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. అందుకే కధని కధగా చూసి వ్యాఖ్యానించుంటారని నా అభిప్రాయం.

వేణూ శ్రీకాంత్ said...

Good one Mahesh.

కత్తి మహేష్ కుమార్ said...

@రమణి: ఇది ఆకర్షణ కథ అని మీరు అంత సింపుల్గా తేల్చెయ్యడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. పైపెచ్చు ఇప్పుడే ప్రారంభమైన ‘ప్రేమకథ’కు ముగింపు విషాదం అంటూ మీరు ముక్తాయింపుకూడా ఇవ్వడం షాకింగ్.

‘పెళ్ళి గమ్యమైతే తప్ప మిగతా ప్రేమలన్నీ ఆకర్షణే!’ అనేదే మీ అభిప్రాయంలా అనిపిస్తోంది. సాధారణ సంబంధాలలో ఉన్న బేరసారాలూ, ప్రణాళికలూ ఇక్కడ లేనంత మాత్రానా ఇది ప్రేమ కాకుండాపోతుందా? ప్రేమంటే ఒకరినొకరి బేషరతుగా ఇష్టపడటం. అదే ఇక్కడ జరిగింది.నిజానికి భవిష్యత్తుని "ప్లాన్" చేసుకుని ప్రేమిస్తే మాత్రమే అది నిజమైన ప్రేమ అనే మీ ధోరణేనాకు అభ్యంతరకరంగా అనిపిస్తోంది.

@దిలీప్: ధన్యవాదాలు.

కత్తి మహేష్ కుమార్ said...

@చివుకుల: వ్యాసంలో వ్యక్తిగత అభిప్రాయాలుంటాయి కాబట్టి విభేధించడం సులువు. అదే కథలో పాత్ర చేస్తే విశ్లేషించి విమర్శన చెయ్యడంతప్ప చెయ్యగలిగేదేమీ లేదు. అందుకే బహుశా అబ్రకదబ్ర గారన్నట్లు అందరూ కథని కథలాగా చదివారు.

ఇక మన భారతీయుల్లో ముఖ్యంగా తెలుగువారిలో వ్యక్తిగత విలువలపట్ల ఉన్న ద్వంద్వప్రవృత్తి గురించి నేను ఎక్కడో చెబితే దానికి నిరసనగా ఒక పెద్ద టపానే రాయబడింది.

అమలిన శృంగారం పేరిట అసందర్భ ప్రేమల్ని భేషుగ్గా ఆదరించే మనకు, కొంచెం భావుకత డోస్ కలిపితే తీవ్రంగా విభేధించాలని అనుకోకపోవడం సహజం.

కథైనా వ్యాసమైనా నేను చెప్పేది నేను చెబుతాను.విభేధించడం, అంగీకరించడం, విమర్శించడం,అభినందించడం,అడ్డగోలుగా వాదించడం అనేవి వారివారి హక్కు కాబట్టి నాకైతే అభ్యంతరం లేదు.

సుజాత said...

"వ్యక్తిగత విలువల పట్ల ఉన్న ద్వంద్వ ప్రవృత్తి గురించి నేను ఎక్కడో చెపితే దానికి నిరసనగా పెద్ద టపానే రాయబడింది"....ఆ టపా ఏదో, గుర్తు రావటం లేదు. కొంచెం గుర్తు చేస్తారా?

సుజాత said...

అబ్రకదబ్ర గారు,
అప్పట్లో "గొడవ" చేసిన వారిలో నాతో పాటూ మీరూ ఉన్నారని గుర్తు! "వ్యక్తిగత స్వేచ్చ పేరుతో విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించను" అని మాట్లాడింది మీరు, నేనే అనుకుంటాను.

O telugODu said...

break avaDam anE padam vinTE navvochchindi. NTR,bhAnumati kAlam lO duets lO kUDA anTI muTTanaTlunDEvi steps. marippuDO, KS level lO unTunnAyi. kAlam mArindi 'break' time kUDA taggindanukOrAdu ;P

BTW, katti gAru... double thumps up. kattilA vrASAru katha. 'kalavaDam, viDipovaDam, maLLI kalavaDam..' A padAla prayOgam chAlA bAvundi.

అబ్రకదబ్ర said...

సుజాతగారు,

ఎలా మర్చిపోతాను? పైగా మనిద్దరిలో ఎక్కువ గొడవ చేసింది నేనేనండీ.

tethulika said...

నేను సాహసించి మళ్లీ అంటే సరే మరి, వస్తువూ, వాతావరణం నాకు తెలీదు కనక ఆవిషయంలో నేనేం చెప్పలేను. తొలికథగా బాగానే సాగిందనుకుంటాను. మీరు కొత్తగా రాద్దాం అనుకున్నానన్నారు. కొత్తదనం చివరివాక్యంవల్ల వచ్చింది. పైన ఒక వ్యాఖ్యలో చెప్పిన సాంకేతికం, నేను అనుకోడం sermonizing or generalizing… సాధారణంగా రచయిత తన అభిప్రాయాలు కథలో చొప్పించి ఒప్పించడం కష్టంమే. నామటుకు నాక్కూడా ఒకటి రెండు వాక్యాలు అక్కడ నప్పలేదనే అనిపించింది.
పోతే, మీరెండో కథకి మరేదేనా వస్తువు ఎంచుకుని రాయండి అని నేను చెప్తే పైవ్యాఖ్యాతలు నామీద యుద్దానికొస్తారేమో .
ఇది విడిగా టైపు చేస్తున్నా నా సిస్టంపోరు పడలేక .. అంచేత, ఇంతే. అభినందనలు.

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత: ఒక బ్లాగులో ‘శృంగారం విషయంలో భారతీయులది ద్వంద్వ ప్రవృత్తి. శృంగారాన్ని అపరాధంగా భావించే మన విధానం దాదాపు 100 కోట్లన్న జనాభానే అందుకు నిదర్శనం’అని చెబితే,"గురితప్పిన ‘కత్తి’" అని శంఖారావం బ్లాగులో సరస్వతీకుమార్ గారు కుంకుడుకాయ పులుసుపెట్టిమరీ నా తలంటేంత టపా రాసారు. ఈ లంకెద్వారా చూడండి.
http://shankharavam.blogspot.com/2008/08/blog-post_25.html


@మాలతి గారు: నా అభిప్రాయాల్నీ, వాదనల్నీ,ఆలోచనల్నీ కథ రూపంలో చెప్పడానికి నేను చేసిన రెండో ప్రయత్నం ఇది. మొదటి కథ(సిరికట్నలీలలు)లో కథనం బాగాలేదని అందరూ అంటే, దీనిలో ఆ పటుత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాను.

మీ అభినందనలకు నా ధన్యవాదాలు.

laxmi said...

anonymous garu,thanks for your honest support, yes, i realized it the hard way!

with that in mind, i agree with the author !!!

జ్యోతి said...

కథ బావుంది.. ఇప్పుడే ప్రేమకథ మొదలైంది కదా. చూద్దాం. ఇద్దరి అంగీకారంతో జరిగిన incident ప్రేమగా మొదలై పెళ్లి వరకు దారి తీస్తుందో? లేక ఎవరి దారిలో వారు సెటిల్ అయి అది ఒక accident అని మర్చిపోతారో??

laxmi said...

ramani garu,

thanks for your support. author's ways of commentings when responding to women are really disgusting and i'm glad someone here raises their voice.

i've decided to follow the anonymous's comments on leaving ignorance for ignorance, and accepting the wicked ways of the world !

Jyothirma Tamasgamaya !

కత్తి మహేష్ కుమార్ said...

@లక్ష్మి: ఆడవారి కామెంట్లపట్ల మీరు తెలియజెప్పిన నా వైఖరి విభ్రాంతిని కలిగించింది.ఇప్పటివరకూ నేను కేవలం వ్యాఖ్య తీవ్రతనిబట్టి,ఉద్దేశాన్నిబట్టీ ప్రతివ్యాఖ్య చేసానేగానీ అదిరాసింది మగాడా, మహిళా అనే ఆలోచన చెయ్యలేదు.

రమణిగారు లేవనెత్తింది నా పదప్రయోగాన్నే తప్ప నా ఉద్దేశంలో ఒకర్ని కించపరిచే గుణముందని కాదు. గ్రహించగలరు.

మీరు ఇదివరకూ అనామకుడి వ్యాఖ్యతో అంగీకరిస్తూ రాసిన దానిలోకూడా prejudice కనబడుతోందేతప్ప dispassionate గా చర్చకు సిద్దమయ్యే మనసు ప్రతిఫలించడం లేదు. ఇప్పుడు కూడా మీరొక స్త్రీకాబట్టి నేను ఇలా "disgusting"గా వ్యాఖ్యానించాననుకోవడం మీ sexist nature కు ప్రతీకగానే భావిస్తున్నాను.పైపెచ్చు మహిళా వ్యాఖ్యాతలందరిపట్లా నా వైఖరి ఇలాగే ఉంటుందనే మీ అపవాదు అత్యంత హాస్యాస్పదంగా ఉంది.

నేను సమానత్వాన్ని కాంక్షించే వ్యక్తిని. I do practice what I stand for. How unacceptable it might be, but, I always stand for my believes, and you have a right for yours. కానీ నాపై ఇలాంటి అపవాదులు వేసే హక్కుమాత్రం మీకు లేదు. కావాలంటే విభేధించండి..చర్చకు నేను ఎప్పుడూ సిద్దమే!

laxmi said...

anonymous garu, i got what u said !

సుజాత said...

పురుషుల వ్యాఖ్యలకొక రకంగా, మహిళ ల వ్యాఖ్యల కొకరకంగా మహేష్ రెస్పాండ్ అవుతారని నేననుకోవడం లేదు. తను "పాయింట్" ని చూస్తారే కానీ వ్యాఖ్యాతను కాదని మొదటి నుంచీ ఈ బ్లాగు ను ఫాలో అవుతున్న నేను గట్టిగా చెప్పగలను.

Sankar said...

మిస్టర్ అండ్ మిస్సెస్ అయ్యర్ సినిమాలో కూడా ఇలాంటి ప్రేమే చూసా. పరిస్దితుల ప్రభావం అనుకుంటా.. బావుంది... కానీ మరికొంచం పొడిగించి వాళ్ళిద్దరిమధ్య ఆకర్షణని వాళ్ళకే కాకుండా చదివే మాకు కూడా ఫీల్ కలిగేంతగా రాసుంటే ఇంకా బావుండేది. నాకెందుకో అంత దగ్గర కావాల్సినంత బంధం ఏర్పడినట్టుగా అనిపించలేదు. కధావిధానం మాత్రం బాగా నచ్చింది. ఇక మీరు కధకునిగా మరో రూపం ఎత్తొచ్చు...

yaaji said...

వెనుకటికి కొడవటిగంటే అన్నట్టు గుర్తు, నా సాహిత్యాని రాబోయే కాలం లో పాఠకులు మర్చి పోతే ఆనందం అని. అతని ఉద్దేశం అంత కన్నా చక్కటి సాహిత్యం రావాలని. యండమూరి ఆనందో బ్రహ్మ లో అన్నది నిజం - ఒక దీపాల పిచ్చయ్య శాస్త్రి, ఒక చా సో, మరొక అబ్బూరి - వారి చ్చాయలకు వచ్చే వారు కూడా లేరు. ఇలా అన్నానని అనుకోక పోతే, ఈ కథ ని కోకు సాహిత్యం తో పోల్చటం కొద్దిగా అతిశయోక్తి. కొద్దిగా బోర్డర్ లైన్ ఆన్ చందు సోంబాబు కథలు.కథకులు న కించ పరిచే ఉద్దేశం కాదు. ఇది కథ ని ఉద్దేశించి మాత్రమే.

కత్తి మహేష్ కుమార్ said...

@యాజి: చంద్రమోహన్ ‘కొకు కథచదివిన అనుభూతి కలిగింది’అని చెప్పారేగానీ, నా కథకు ఆ స్థాయి ఉందని చెప్పలేదు. ఆ స్థాయి నా కథకుందని నేనూ అనుకోవడం లేదు. కానీ,ఇక్కడ అది వ్యక్తిగతభావనకు సంబంధించిన విషయమేతప్ప సాహితీ తులనకుకాదు. I have no range ,experience or depth to be compared with any establish writer in Telugu.

Arun Kumar Aloori / అరుణ్ కుమార్ ఆలూరి said...

katha baagundandi..

kaani..

"నా భుజం మీద తన తల. నా చొక్కాపై తన కన్నీళ్ళు. నా చెయ్యి తన చెక్కిళ్ళ తడిని తుడిచాయి. నా చెయ్యివదిలి తన చేయి నా భుజాన్ని సాయమడిగాయి."

aa koddipaati parichayam lone, adi kuda alaanti paristitullo, "tappu" anabade charya jarugtundantaara ...?! naakaite sandehame..!

chivariki "కానీ... మా ప్రేమకథ అప్పుడే మొదలయ్యింది." ani muginchadam kathaku chaala andaannichchindi..

mottaniki mi katha o kotta anubhutini migilchindi.. blog lone kakundaa, mana telugu patrikalaki kathalu pampandi.. paatakulaki mi kathalu marinta cheruvavutayi..

all the best

కత్తి మహేష్ కుమార్ said...

@అరుణ్ కుమార్ ఆలూరి: Life is stranger than fiction అంటారు. ప్రేమ లేక శారీరక వాంఛ కొంత పరిచయంలో process జరిగిన తరువాత కలగాలని ఎక్కడా రూల్ లేదు. ఇలాక్కూడా జరగొచ్చు. అన్న ఒక సంభావనని ఈ కథలో చూపించాను. అందువల్ల "విలువల"కొచ్చిన్ విఘాతంకూడా లేదనేది నా నమ్మకం.

Naresh Vanukuru said...

good one... rachana saili, vivarana sarali bagundi...

umesh varma said...

chaala nachindi