Saturday, September 13, 2008

బాంబు బ్లాస్టులకి అలవాటుపడదామా !

మళ్ళీ మరో టార్గెట్...ఈ సారి ఏకంగా రాజధాని ఢిల్లీ.



5 ప్రదేశాల్లో 7 బాంబులు పేలాయి...20 మందికి పైగా మరణిస్తే, 100 కిపైగా క్షతగాత్రులు..పేలడానికి సిద్దంగా వున్న మరో బాంబుని ఒక ప..దే..ళ్ళ చిన్న పిల్లవాడు కనుగొన్నాడు.


‘పోటా’ వుంటే ఈ ఘటన జరిగేది కాదని బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తుంది.
అసలు ‘గుజరాత్’ జరక్కుండా ఉంటే, ఇంత ప్రమాదకర స్థితి ఏర్పడేది కాదని కాంగ్రెస్ ఎత్తిపొడుస్తుంది.
కాశ్మీర్ సమస్య నాన్చకుండా తేల్చుంటే, టెర్రరిజం అసలుండేదికాదని బీజేపీ చరిత్ర తిరగదోడుతుంది.
ముస్లింలను భయభ్రాంతుల్ని చెయ్యకుండా ఉంటే, ఈ పరిస్థితి వుండేది కాదని కాంగ్రెస్ అంటుంది.
కాంగ్రెస్ కుహానా సెక్యులరిస్టు విధానాలవలన ఈ స్థితి దాపురించిందని బీజేపీ మళ్ళీ గుర్తుచేస్తుంది.


దేశాన్ని రక్షించలేని ఈ ప్రభుత్వం పాలనకు పనికిరాదని బీజేపీ రాబోయే ఎన్నికలకు తన వ్యూహం సిద్ధం చేస్తుంది.
మూలసమస్యల్ని తీర్చాలని కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగించే మరిన్ని కార్యక్రమాలతో తమ ఎన్నిక ఖాయమయ్యేలా చూసుకుంటుంది.
వామపక్షాలు ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్నీ కసితీరా కడిగేసి..తమ నిబద్ధతను చాటుకుంటాయి.
మీడియాకు ఈ వారాంతరంలో బాంబుల పండుగ చేసుకుని నిరంతర వార్తల్ని కురిపిస్తాయి.


తెగిపడిన మానవ అవయవాలు... చచ్చిపడిన మృతదేహాలు...పేలిపోయిన పరిసరాలు...సొంత మనుషుల్ని కోల్పోయినవారి కన్నీళ్ళు మాత్రం ఆలాగే ఉంటాయి.
ఇంకో నగరంలో, మరోచోట బాంబుపేలుడికోసం మరిన్ని తయారవుతూ ఉంటాయి.
బాంబుబ్లాస్టులకి అలవాటుపడదామా !

****

18 comments:

Purnima said...
This comment has been removed by the author.
Anonymous said...

naa kee desham vaddu .....

teresa said...

@purnima- sulking IN it?? what do you mean?
If you ARE sulking, who is it at?
Sorry for nit-picking..

Bolloju Baba said...

you are absolutely correct

నిర్వేదం ముసురుకొంటూంది.
దృశ్యాలన్నీ చూసి మనసు వికలమైంది.
బహుసా మీరన్నట్లు అలవాటుపడిపోతామా?

Purnima said...

@teresa: sorry! it wasn't meant to be here. Correcting it.

Thanks :-)

Purnima said...

నేను ఈ వార్త విని, ప్రదేశాలు ఏమిటో తెలుసుకుని "తెలుసున్న వాళ్ళకి" ఫోను చేసి, బాగున్నారు అనగానే టి.వి కట్టేసాను.

నాది పూర్తి స్వార్ధం, తెలుస్తూనే ఉంది. కానీ "అయ్యో.. అయ్యో" అనుకోవడం, is not making me feel better.

Ajit Kumar said...

అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల.

చిలమకూరు విజయమోహన్ said...

@ anonymous దేశాన్నెందుకండి వద్దనుకోవడం ఈ పనికిమాలిన, చేతగానినాయకులను వద్దనండి

Anonymous said...

ఈపాటికే అలవాటు పడిపోయామని నా ఉద్దేశ్యం. ఏకంగా పార్లమెంటు మీదే బాంబులేసాక, ఏడెనిమిదేళ్ళ తరవాత కూడా సగటున మూణ్ణాలుగు నెల్లకోసారి పేలుళ్ళు జరుగుతూండడం, ఉగ్రవాద సంస్థలపై నిషేధాలను ఎత్తివేయాలని పార్టీలు ప్రయత్నించడం, తెరవెనక ఉగ్రవాదులతో స్నేహాలు చేసేవాళ్ళు మంత్రులుగా ఉండడం.. ఇవన్నీ చూస్తూ కూడా అలవాటు పడకుండా ఎలా ఉంటాం?

రవి వైజాసత్య said...

ఓ!! ఢిల్లీలో బాంబు పేలిందా? ఎంత మంది చచ్చారు? అలాగా..

జ్యోతి said...

పోలీసులు, తీవ్రవాదులు సైనికుల్లా తమ విధులు నిర్వహిస్తుంటారు. కాని ఈ రాజకీయనాయకులే తమ స్వంత ప్రయోజనాలకోసం పోలీసులను కూడా నియంత్రిస్తుంటారు. లేకపోతే బాంబ్ బ్లాస్టులు జరగవచ్చు అని తెలిసినా ముందే చర్య తీసుకోలేదు.తర్వాత చింతిస్తున్నాము, డబ్బులిస్తాము, ఎవ్వరిని వదలము అని శ్రీరంగనీతులు చెప్తారు. ఇక మిగతా రాజకీయపార్టీలు ఈ దుస్సంఘటనలను కూడా తమ ప్రయోజనాలకు ఎలా వాడుకోవచ్చో అని ప్లాన్లు వేస్తుంటారు. అస్సలు ఈ రాజకీయనాయకులందరిని ఒక ఇంట్లో పెట్టేసి దానిని బాంబులతో పేల్చేయాలి. పీడా విరగడవుతుంది. ఇలాంటి సంఘటన జరగ్గానే అంతా రెడ్ అలర్ట్, హై అలర్ట్ అని చెకింగులు చేస్తుంటారు. వారం కాగానే మళ్ళీ మామూలే. మన హైదరాబాదులో బాంబ్ బ్లాస్టులు జరిగి ఏడాది దాటింది. ఎంతమందిని పట్టుకున్నారు. సోనియాగాంధి సభకు కోట్లు ఖర్చుపెడతారు. బాంబ్ బ్లాస్టులో గాయపడ్డవారికి , చనిపోయినవారికి కనీసం నష్టపరిహారమన్నా, వాళ్ల చికిత్సకయ్యే ఖర్చులన్నా ఇవ్వరు ఎదవ సచ్చినోళ్ళు.

సుజాత వేల్పూరి said...

"అలవాటు పడదామా" ఏమిటి? పడ్డాంగా!
anonymas, మీకీ దేశం వద్దా? అయితే ఏ దేశం కావాలి? ఎక్కడ బాంబు దాడులు లేవు? ఇరాక్ వెళతారా పోనీ? శ్రీలంక వెళతారా? పోనీ పాకిస్తాన్? ఎక్కడికెళ్ళినా మీరు ఏమీ తప్పించుకోలేరు.

Anonymous said...

:))

Anonymous said...

previous comment was not supposed to be here. was mstk...Sorry. please delete previous one.
--vamsi

Anonymous said...

ఒకప్పుడు పల్లెటూరు లో వున్నామని బాధ పడేవాళ్ళం
ఇప్పుడనిపిస్థుంది, ఏనాడో పుణ్యం చేసుకున్నామని.

Ramani Rao said...

చిన్నప్పుడు స్కూల్ లో పొద్దున్న లేవగానే ఈరోజు ప్రశాంతంగా గడవాలనో ప్రార్ధన, పడుకొనేముందు ఈరోజు చాలా ప్రశాంతంతంగా గడించిందని థాంక్స్ చెబుతూ దేవుడికి "పరలోకము నందుండు మాయొక్క తండ్రీ" అంటూ ఓ ప్రార్ధనా గీతాన్ని బట్టీయం వేయించారు. ఇప్పుడు అలా ఉదయం లేవగానే, రాత్రి పడుకొనే ముందు కాదు, అనుక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, ప్రతిక్షణం "దేవుడా, దేవుడా" అని తలుచుకొంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చేసింది సగటు మనిషి జీవితం. ఎంతమంది మారినా, ఎన్ని రాజ్యాంగాలు మార్చినా "మీ జగ్రత్తలు మీవే, మీ జీవితానికి బాధ్యత మీదే" అని చెప్పకనే చెప్తున్నాయి ఈ రాజకీయాలు. కూరగాయలు కోసినంత తేలికగా పీకలు కోసేస్తున్నారు ఈ ఉగ్రవాదులు. మార్పు గురించి ఎదురుచూసే లోపులో మరో ప్రళయం మనముందు సాక్ష్యాత్కరిస్తోంది.

Anil Dasari said...

అదేం ప్రశ్న.. మీరింకా అలవాటు పడలేదా?

Anonymous said...

మీ సహాయ, సలహాలకు నెనర్లు.
నా బ్లాగు బాలారిష్టాలను దాటే వరకు మిమ్ములను
మాగురువుల్లో ఒకరిగా నియమిస్తున్నాం.
మీరు ఏమాత్రం మొహమాటా ఫాడకుండా
ఈ పదవిని అలంకరించండి.