Friday, September 26, 2008

ఇక్కడ షివల్రీ (chivalry) లభించదు !

ఆడవాళ్ళు సరదాగా ఏ రెస్టారెంటుకో వెళ్ళినప్పుడు మీ బాయ్ ఫ్రెండో, భర్తో, స్నేహితుడో రెస్టారెంటు గుమ్మం దగ్గరున్న స్వింగ్ డోర్ ని అలవోకగా తీసిపట్టుకుని, ఎయిర్ ఇండియా మహరాజులా కొంచెంగా తలవంకించి, అల్లరిగా మీకళ్ళలోకి చూస్తూ, ladies first అనే అర్థం ధ్వనించేలా నవ్వి, మీకు దారి చూపిస్తే ఎలా ఉంటుంది? మహా సరదాగా, అందమైన అనుభూతిలా అనిపించదూ!


కానీ...అదే మీరు ఒక చర్చావేదికలో మీ మేధస్సును, అనుభవసారాన్ని, భాషాపటిమనూ ఉపయోగించి ఒక అమూల్యమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చితే, "బాగా చెప్పారండీ! ఎంతైనా ఆడవారుకదా, మీ అభిప్రాయాన్ని అంగికరించాలి" అని సగౌరవంగా ఒక మగాడు అంటే ఎలా ఉంటుంది? చిరాగ్గా, పచ్చి బూతులా అనిపించదూ!


ఈ మధ్య నా కథ "యాదృచ్చికం-ఒక ప్రేమకథ" గురించి జరిగిన చర్చల్లో, లక్ష్మి అనే ఒక మహిళా వ్యాఖ్యాత, నా ప్రతి వ్యాఖ్య గురించి "author's ways of commenting when responding to women are really disgusting" అన్నారు. అనవసరమైన విషయాల్ని కూడా అతిగా ఆలోచించేనాకు, ఈ అత్యవసర విషయం మీద కొంత ఆలోచన ఖచ్చితంగా అవసరం అనిపించింది. అది అపోహే అయినా, కనీసం నాకైనా నేను సమాధానం చెప్పుకోవల్సిన అవసరం ఉందనిపించి ఈ టపా రాస్తున్నాను.


"మహిళలు సమానమేగానీ, విభిన్నం...women are equal, but different" అని నేను నమ్ముతాను. కాబట్టి, మనుషులుగా వారి అభిప్రాయాల్ని గౌరవిస్తూనే, మహిళలుగా వారికున్న సామాజిక ధృక్పధాన్ని కూడా ఆమోదిస్తాను. అంతమాత్రానా, వారితో విభేధించకుండా ఉండకపోవడం వారికి నేనిచ్చే గౌరవంగా భావించడం నాకు ఆమోదయోగ్యం కాదు. పైపెచ్చు, ‘కేవలం మహిళలుగనక’ వారి అభిప్రాయాల్ని ఆమోదించడం వారి మేధను కించపరచడంగా నేను భావిస్తాను. అందుకే మహిళలైనా, మగవారైనా నా టపాపై వ్యాఖ్యానిస్తే వారి వ్యాఖ్యలోని విషయానికి ప్రతిస్పందిస్తానేతప్ప, వారి sex ని దృష్టిలో పెట్టుకుని కాదు. ఈ కారణంగా నా బ్లాగులో నేను మహిళా వ్యాఖ్యతలతో విభేధిస్తున్నప్పుడు, సాధారణంగా ఆడవారికి మగవారు చూపించే మగలాలిత్యం...షివల్రీ (chivalry) చూపించను.


ఒక వేళ ఈ విధంగా కాకుండా, కేవలం మహిళలు కాబట్టి వారి ఆలోచనలకూ, అభిప్రాయాలకూ ప్రత్యేకమైన గౌరవం జరగాలనుకుంటే, నా బ్లాగువైపు రాకపోవడమే మంచిది. ఎందుకంటే, "ఇక్కడ షివల్రీ (chivalry) లభించదు !"


****

21 comments:

సుజాత వేల్పూరి said...

ఎవరు ఎవరితోనైనా విభేదించవచ్చు! ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి కాబట్టి. ఇందులోనూ మహిళా రిజర్వేషన్స్ లాగా ఈ chivalry ఏమిటండి మీరు మరీను!

అలా chivalry చూపిస్తే మీ బ్లాగు చూడ్డం ఎప్పుడో మానేసేవారు చాలమంది లేడీసు! మహిళా బ్లాగర్లు ఇలాంటి chivalry ఎక్కడన్నా దొరుకుతుందన్నా ఒప్పుకోరు లెండి!

"అనవసరమైన విషయాల్ని కూడా అతిగా ఆలోచించే నాకు.." ఇది బాగా పేలింది. హ హ !

kiraN said...

ఆడవాళ్ళం - ప్రత్యేకంగా చూడాల్సిందే అని అనుకుంటారు.
ఆ ప్రత్యేకత వారికి రుచించే విధంగా లేకపోతే గోలగోల చేస్తారు.

ఇవి ప్రతీ మగ వాడికి ఎదురవుతూనే ఉంటాయి.

-కిరణ్

arunakiranalu said...

మహేష్ గారు

చాలా బాగా చెప్పారండి, నేను ప్రతి ఒక్కరి లో అంటే ఆడవారిలో గమనిస్తు వుంటాను మేము అన్నింటా మగవారితో సమానం అంటు స్పెషల్ కేర్ ఆశిస్తు వుంటారు ఎందుకో నాకు ఇ ప్పటికి అర్థమవదు


అరుణ

సిరిసిరిమువ్వ said...

నిజమే మహిళలయినంత మాత్రాన వారి అభిప్రాయాల్ని అలోచనల్ని ఆమోదించనవసరం లేదు, అలా కోరుకునే మహిళలు కూడా ఉంటారు కాని ఇక్కడ అలాంటి వారు లేరనే అనుకుంటాను.

Anonymous said...

>>> మీరు సరదాగా ఏ రెస్టారెంటుకో వెళ్ళినపుడు మీ బాయ్ ఫ్రెండో, భర్తో, స్నేహితుడో రెస్టారెంటు గుమ్మం దగ్గరున్న స్వింగ్ డోర్ ని అలవోకగా తీసిపట్టుకుని, ఎయిర్ ఇండియా మహరాజులా కొంచెంగా తలవంకించి, అల్లరిగా మీకళ్ళలోకి చూస్తూ, ladies first అనే అర్థం ధ్వనించేలా నవ్వి, మీకు దారి చూపిస్తే ఎలా ఉంటుంది? మహా సరదాగా, అందమైన అనుభూతిలా అనిపించదూ!

One curious doubt...
Do you think only women read your blog?? "No man's blog" aa??;p

When I started reading this para...I was clueless(as 'm normal:p) what to interpret from this para with out any reference to...

--Vamsi

జ్యోతి said...

హహహహ..

అభిప్రాయాలలో కూడా ఆడ,మగ తేడాలుంటాయా?? బహుశా ఆ వ్యాఖ్యాత పొరబడినట్టున్నారు?? మహేశా!
టేక్ ఇట్ ఈజీ!!>..

కొత్త పాళీ said...

షివల్రీ అనంగానే నాకో జోక్ గుర్తొస్తూ ఉంటుంది. దీన్ని అంగ్లంలో చెబితేనే మజా.
A twenty something confident young woman was hurriedly walking towards an office building. As she approached the main door, an elderly man in a suit who was right behind her hurried past her and held the door open for her.
She said in a frustrated tone - Don't open doors for me just because I am a lady.
He quipped - No. I do it because I am a gentleman.
:)

సుజాత వేల్పూరి said...

కొత్తపాళీ గారి జోకు ఈ సందర్భంలో సూపర్ గా పేలింది.

వర్మ said...

మహేష్ గారు చాలా బాగా వ్రాసారు. మహిళల గురించి రాసినంత మాత్రాన వారిని చిన్నచూపుచూడటం కాదన్నది ముక్కుసూటిగా చెప్పారు. నేను 100% మీతో ఏకీభవిస్తాను... మహిళల బ్లాగుల్ని మనం ఆదరిస్తున్నాం, వారి అభిప్రాయాల్ని గౌరవిస్తున్నాం . .. Go Ahead ...

వేణూశ్రీకాంత్ said...

బాగా చెప్పారు మహేష్, వాదనలోనూ షివల్రి ఆ... హ్మ్!!
కొత్తపాళీ గారు జోక్ సూపర్ :-)

Ramani Rao said...

మహేష్ గారు: అభిప్రాయాలకు ఆడ, మగ తేడా ఏమి లేదండి. ఎవరి అభిప్రాయాలు వారివి అలాగే ఎవరి ప్రత్యేకత వారిది.
@ కొత్తపాళీ గారు జోక్ అదిరింది. నాకెందుకో తెలుగులో ఓ సామెత గుర్తొస్తోంది. మరిక్కడ మీ జోక్ కి అది సరిపోతుందా?? ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకోడానికి.. అని

Anil Dasari said...

మహేశా

వివరణ బాగా రాశావు కానీ ఇది ఆల్రెడీ ఆ టపాలోనే చెప్పేశావు కదా. మళ్లి విడీగా ఇక్కడ ఎందుకు? ఇలా నిన్ను కాస్త గాఠ్ఠిగా విమర్శించేవాళ్లకోసం ప్రత్యేక టపాలు రాస్తే ఎలా స్వామీ? అది సంజాయిషీలు చెప్పుకోవటంలాగుంది. ఎవరో ఏదో అన్నారని వివరించుకుంటూపోతే నీ జీవితమంతా దానికే సరిపోదా?

Purnima said...

నాకు మీ టపాల్లో కమ్మెంటాలంటే భలే ఇష్టం / కష్టం. నేను ఎంత చూసీ చూడకుండా వదిలేస్తున్నట్టు ఊహించుకుంటూ చాలా విషయాల్ని లైట్ తీసుకుంటున్న వేళ, మీరో టపా కట్టి నా చేత చదివించి, నాలోని disgust అంతా బయటకి వచ్చేలా చేస్తారు.

In a complete faceless and voiceless communication as in these blogs, why is there so much discussion about men and women? మనకి మనంగా చెప్పుకుంటే తప్ప మన వివరాలు తెలిసే అవకాశం లేని బ్లాగుల్లో కూడా ఎందుకింత గోల ఆడ-మగ అంటూ? ఇప్పుడు నేనే "కిరణ్" లేక "మధు" లాంటి పేరు పెట్టుకుని వాణ్ణి, దాన్ని లాంటి పదాలు రాకుండా జాగ్రత్త పడి రాస్తే, ఎంత మంది నేనే అని గుర్తిస్తారు? వీటి గురించి కాసేపు ఆలోచించి వదిలేశా, ఇక మీరు ఆలోచించండి కాసేపు. :-)

వంశీ: :-)

Kathi Mahesh Kumar said...

@అబ్రకదబ్ర:మీకు ఈ టపా సంజాయిషీలా అనిపించిందా? మూలప్రశ్న వచ్చినప్పుడుకూడా నేను సమాధానమిచ్చానేగానీ, సంజాయిషీ చెప్పలేదు.అలాంటిది ఇక్కడ ఇలా ప్రయత్నిస్తానంటారా!

సాధారణంగా మనం చేసే నిర్ణయాలూ, ప్రవర్తించే తీరూ అసంకల్పితంగా ఉండి, భాషరూపంల సాధారణంగా చెప్పడానికి కుదరవు. అందుకే నన్ను నేను అర్థం చేసుకునే దిశలో కొన్ని టపాలు మొదటినుంచీ "రాస్తూ"నే ఉన్నాను. ఇదీ అలాంటిదే! ఇంగ్లీషులో thinking laud అంటారుకదా, ఇదీ అలాంటిదే అనుకోవచ్చు.

ఇక వివరణకు సమయం వెచ్చించడం అంటారా, నన్ను నేను సవరించుకోవడం ఒక నిరంతరప్రకియకాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఇది నేను నాకిచ్చుకున్న వివరణే తప్ప పూర్తిగా విమర్శకులకోసం మాత్రం కాదు.

@పూర్ణిమ/వంశీ: నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కానీ చాలా మంది "మనుషులం" అనే గుర్తింపు (identity)కోల్పోయి కేవలం ఆడ-మగ అనే గుర్తింపుతోనే బ్రతికేస్తారు. అలాంటివారికి పేరూ,రూపం లేకున్నా, సైబర్ ప్రపంచంలో నైనా నిజమైన ప్రపంచంలోనైనా, ఇక్కడున్నా,ఎక్కడున్నా అదే "నిజం". వారి ప్రవర్తన,భావప్రకటన అదే గుర్తింపు స్థానం నుంచీ వస్తాయి.

నన్ను ఆలోచించమన్నావు. నిజంగా కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే మరో టపా రాయాల్సొస్తుందేమో.."politics of gender identity in cyber- world" అని.

@కొత్తపాళి: మీ జోకు బాగుంది. "బోడి నిన్నెవరు గౌరవించారు! నన్నునేను గౌరవించుకున్నాను!!" అన్నట్లుంది కత.

MURALI said...

women are equal, but different ఇది మీరు ఎప్పుడూ చెప్పి మీ బ్లాగులో ఆచరించేదే కదా!
కొత్తపాళీ గారు జోక్ సూపర్ :-)

Anonymous said...

మహేశా,

బహుసా మీ అతి సున్నిత హ్రిదయం లక్ష్మి గారి కామెంట్ ని చూసి తెగ బాధా పడ్డట్టుంది. ఆ కామెంట్ కి reply అక్కడే ఇచ్చింది సరిపోక, టపాలే రాసారు !

అబ్రకదబ్ర గారు, పాపం అయన సున్నిత హృదయం బాధ పడితే, వేరే టపా లు రాయక ఎం చేస్తారు చెప్పండి? అయన బ్లాగ్ లో, ఏవి allowed, ఏవి not allowed సామాన్య మహిళలకి అర్థం కాకపోవచ్చును కదా ! అందుకే పాపం కస్టపడి ప్రత్యెక టపా రాయల్సోచ్చుంటుంది !

ఇక పోతే , మహేశా ... మీ అంత సమానత గల వాళ్ళు , హేతు వాదాన్ని, కేవలం హేతువు గానే గుర్తించ గలిగేంత మీ ఉదార స్వభావం, పాపం ఆవిడా కి తెలిసినట్లు లేవు, మీకు తెల్సినంత గా ! మీ శైలి చూసి, బహుశా మీ బ్లాగ్ కి రాకపోవచు కూడా, తనే కాదు తన లాంటి శివల్రీ expect చేసే ఇతర మహిళలు కూడా ! సో కలత చెందకండి !

ఐన మీ అంత గొప్ప గా వాదించటం, ఎలాంటి సందర్భం లో ఐన, composed గా ఉండటం అందరికి అబ్బుతయ మహేశ?

http://shankharavam.blogspot.com/2008/08/blog-post_25.html ఈ టపా లో, సరస్వతి కుమార్ గారి టపా కి మీ కామెంట్ ఆ పెద్ద మనిషి మీద , మీరు ఆయన్ని ఒక సారి " ఇది మీ .... చిహ్నం " అన్నారు ! మీ ------ కి చిహ్నం !!! ఇలా బహు సంస్కార వంతం గా ఉంటుంది మీ శైలి !

అదే మీ బ్లాగ్ లో ఎవరైనా disgusting అన్న పదం వాడితే మీ పట్ల, ఆ disgust అన్న పదం మిమ్మల్ని నొప్పించేయాడు మరీ ?మీ సున్నిత హృదయాన్ని !

ఈ లెక్కన మీ పేరు మీద ఆ పెద్ద మనిషి ఎన్ని టపా లు రాయాలి మహేశ ? మీ ----- అనే పదాల గూర్చి !

అందుకే, ఇప్పుడు నేను అంటున్న ! మీరు ఒక disgusting person to men and women , equally without discrimination ! మీలో ఈ equality నాకు బాగా నచ్చేసింది సుమా !

ఇక దీని మీద మీకు ఇస్తమోచ్చినాన్ని టపా లు రాస్కోండి !

Kathi Mahesh Kumar said...

@చినరాయుడు (ఇదిఖచ్చితంగా అసలు పెరైతేకాదు. లంకెకూడా లేదుకాబట్టి, కనీసం ఒక సక్రమైన అడ్రసూ, అభిప్రాయాలూ లేవు)నేను సరస్వతీ కుమార్ బ్లాగులో "మీ....చిహ్నం" అంటే ఆ ఖాళీలో "మూర్ఖత్వానికి" అని పెట్టుకోవచ్చుగా! కానీ, మీరు బూతులేతప్ప (?) మిగతావి ఆలోచించలేరు. దాన్నిబట్టి మీ ఆలోచనాస్థాయి,పరిణితీ అర్థమవుతున్నాయి.

నాహృదయం యొక్క సున్నిత్వాన్ని గురించి మీరు కలత చెందక్కరలేదు.నేను బాధపడను...ఆలోచిస్తాను. కనకనే, సమాధానాలిస్తానేతప్ప సంజాయిషీలు కాదు.

ఇక నాబ్లాగ్ సంగతి అబ్రకదబ్రకు/మిగతావారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను "ఏవి allowed, ఏవి not allowed" నిర్ణయించాలనుకుంటే, ఎంచక్కా వ్యాఖ్యల్ని moderation లో పెట్టుండేవాడిని. నీలాంటి బోగస్ గాళ్ళకామెంట్లు అసలు కనబడేవే కావు. కాబట్టి,ఏమీ భయాలుపెట్టుకోక కామెంట్లు రాసుకో!

Anonymous said...

అయ్యా మహేశా , బూతేమి లేకపోతే, ------- లు అంటూ రాయక్కరలేదు అనుకుంటాను ! దీన్ని బట్టి మీకు మూర్ఖత్వం అనే మాట వాడాలంటే ఉన్న పిరికితనం బోధ పడుతోంది ! మీలా మూర్ఖత్వం అనే మాటని వాడలేక ------- అంటూ , అవతలి వ్యక్తి ఊహకి వదిలేసే గొప్ప హృదయం గల వాళ్ళకే ఉంటాయి లెండి ... బహు గొప్ప ఆలోచనా స్థాయి, దాన్ని మించిన పరిణితి !

అబ్రకదబ్ర గారికి చెప్పాల్సిన అవసరం ఉంది, కనకే చెప్పాను ! అయన మీ గురించి పడ్డ బాధ చూసి, నా స్పందన అది ! నేను ఎవరికేది చెప్పాలో, నిర్యనించేది మీరు కాదనుకుంటాను !

ఇక పోతే, ----- లు అంటూ రాసే మీ బోటి వాళ్ళ కంటే, బోగస్ గాల్లే నయం !

నిజం చెప్పండి, మీ పేరు మహేష్ అని చెప్తున్నారు కాని ... మీ అసలు పేరు దినకర్ కదూ? ;-)

Anonymous said...

మహేష్ గారు
chivalry కి మగలాలిత్యం అన్న పేరు మీరు పెట్టిందో లేక దాని అసలు అర్తం అదేనో నాకు తెలీదు కానీ చాల చక్కగా వుంది..

Kathi Mahesh Kumar said...

@శ్రీకాంత్: ఈ పదం వేరొకరు ఉపయోగించగా నేను ఇప్పటివరకూ వినలేదు,చదవలేదు. కాబట్టి ప్రస్తుతానికి అది నా మేధోజనితమే! అని ఫీలౌతున్నాను.

ఆ పదప్రయోగాన్ని గుర్తించి అభినందించినందుకు ధన్యవాదాలు.

Kathi Mahesh Kumar said...

@చినరాయుడు: నేను బ్లాగుమొదలెట్టింది "నా" అభిప్రాయాలూ ఆలోచనలూ రాసుకోవడానికీ వీలైతే పంచుకోవడానికి. కాబట్టి ఇక్కడకూడా దొంగ/తప్పుడు/అబద్దపు మాస్కులు తొడుక్కోవల్సిన అవసరం,అగత్యం నాకు లేవు.ముఖ్యంగా నేను బ్లాగులో ఒకమాట నిజజీవితంలో మరోమాటే చెప్పే మనిషినికూడా కాదు.

కాబట్టి,మీకు నా వివరాలు..ఫోన్ నెంబర్తో సహా కావాలంటే mahesh.kathi@gmail.com కి రాయండి.

నేనెప్పుడూ వ్యక్తిత్వమున్నవ్యక్తులతో మాట్లాడ్డానికి సిద్దమే, కనీసం తమదంటూ ఒక పేరున్నా,నేను పరిచయానికి,చర్చకూ సిద్దం.