Tuesday, September 2, 2008

వ్యాపారాల్లో లోకలైజేషన్ (స్థానికీకరణ) - గ్లోబలైజేషన్


ఈ మధ్య మొదటిసారిగా నా మిత్రుడు తీసుకెళ్తే ఐమ్యాక్స్ లోని మెక్ డొనాల్డ్ రెస్టారెంటుకివెళ్ళాను. నాకు పిజ్జాలూ బర్గర్లు లాంటివి పెద్దగా పడవుగానీ, ఈ మెక్ డొనాల్డ్స్ లోకి అడుగుపెట్టగానే నన్ను ఆకర్షించింది ఒక మూలన అద్దంపై తెలుగులో ఏదో పేపర్ కట్టింగులతో కొలాజ్ లాగా అంటించబడిన పోస్టరు. పైనవున్న ఫోటో అక్కడిదే.కరువు, అధికధరలు, ద్రవ్యోల్బణం నేపధ్యంలో వారు తక్కువ ధరకే అందిస్తున్న హ్యాపీ ప్రైజ్ మెన్యూ గురించినవారి అడ్వర్టైజ్మెంట్, ఈ గ్లోబల్ ఫుడ్ చైన్ వారి effective స్థానికీకరణకు చిహ్నంగా అనిపించింది. ఈ మధ్యకాలంలో కొన్ని భారతీయ బ్రాండ్లు తమ ప్రకటనల్లో తెల్లతోలు ముఖాలూ, పాశ్చాత్య పోకడలూపోతుంటే, ఈ అమెరికన్ వ్యాపారస్తులు మాత్రం స్థానిక సమస్యల్ని తమ ప్రకటనల్లో సృజనాత్మకంగా వాడటం చాలా ఆసక్తికరంగా అనిపించింది.ఇదే విషయాన్ని వుపయోగించుకుంటూ ‘బిగ్ బజార్’ వారుకూడా ఆగస్టు నెలలో ఒక మెగా సేల్ పెట్టారు కూడా. కాకపోతే పాంటలూన్ (pantaloons) సంస్థకు కూడా అధిపతులైన వీరు (ఈ రెండు వ్యాపారాలూ ‘బియానీ’ కుటుంబానికి చెందినవి) తమ బట్టలను అమ్మటానికి గ్లోబలైజేషన్ పంధానివుపయోగిస్తే, బిగ్ బజార్ లో నిత్యావసర వస్తువుల్ని అమ్మడానికి లోకలైజేషన్ విధానాన్ని అందిపుచ్చుకోవడం గమనించదగిన విషయం. అంటే మన భారతీయులు aspirational బట్టలు కట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తే, ఖర్చుతగ్గే నిత్యావసరవస్తువుల కొనుగోలుకి ప్రాధాన్యతనిస్తామన్నమాట. ఇలాంటి ప్రకటనలు చూసి విశ్లేషిస్తే నిజానికి మనకన్నా, ఈ వ్యాపారస్తులు మన మనస్తత్వాల్ని బాగా అర్థం చేసుకున్నారా అనిపించక మానదు.కొన్ని బ్రాండ్స్ అసలు మన దేశానికి చెందినవేనా అనిపించేలా వుంటే, మరికొన్ని ఖచ్చితంగా విదేశాలవే అనిపించేలా చేస్తారు. ఉదాహరణకు చెప్పులూ, షూలూ అమ్మే ‘బాటా’(Bata) కంపెనీ ఐదు సంవత్సరాల క్రితంవరకూ మనదేశానికి సంబంధిందే అనుకున్నాను. మొన్నటివరకూ ‘వుడ్ ల్యాండ్’ (woodland) విదేశీ కంపెనీ అనుకున్నాను. కానీ అది ఢిల్లీకి చెందిందని ఈ మధ్యనే తెలిసింది. అలాగే ‘పీటర్ ఇంగ్లండ్’ (Peter England) షర్టులు మన హైదరాబాద్ కు చెందిన కంపెనీ బ్రాండని మనలో ఎంతమందికి తెలుసు?ఈ మధ్య ‘బిగ్ బజార్’ అధిపతి ‘కిశోర్ బియానీ’ తన ఆత్మకథలో, భారతీయులకు ఏదైనా వస్తువును అమ్మటానికి గల మూల సూత్రాన్ని"We should change the rules not the values" అని వివరించారట. దీనికి ఉదాహరణగా చెబుతూ, "తాము కొనే బియ్యాన్ని చేతితోపట్టి చూస్తేగానీ భారతీయ కొనుగోలుదారునికి సంతృప్తివుండదు. అలాంటిది కేవలం ప్లాస్టిక్ ప్యాకెట్లలో బియ్యాన్ని పెడితే కొనేవాళ్ళు తక్కువగావుంటారు. అందుకే, మా బిగ్ బజార్లో డ్రమ్ముల్లో విడి బియ్యం చూసేందుకు పెట్టి, వాటినే ప్యాకెట్లుగా కొనడానికికూడా సిద్దంగా వుంచుతాం. ఒక వేళ ఎవరైనా డ్రమ్ముల్లోదే కొనాలనుకుంటే ఆ సౌలభ్యంకూడా కల్పిస్తాం" అన్నారట.నిజమే, మనకు సాంప్రదాయబద్ధంగా అమరిన కొన్ని విలువలూ, అలవాట్లూ అలాగేవుంటాయి. పిజ్జా ఆవకాయ పచ్చడితోతిన్నట్లు, మన పంధాలు మారినా విలువలు,అలవాట్లూ మాత్రం అంత ఈజీగా మారవు. ఇంతగా మనల్ని మనకన్నాబాగా అర్థం చేసుకుంటున్నారు కాబట్టే, మనచేత వారి వస్తువుల్ని కొనిపించడానికి ఇంత బాగా సిద్దం చెయ్యగలుగుతున్నారు. సోపు కొందామని బిగ్ బజారుకి వెళ్ళి, మొత్తం నెలసరి సామాన్లతో తిరిగొచ్చిన మీ పక్కింటివాళ్ళనో లేక ఇలా కనీసం ఒకసారైనా చేసిన మిమ్మల్నో ప్రశ్నిస్తే ఈ మార్కెటింగ్ మహత్యాలు తెలిసివస్తాయి.మధ్యతరగతిలో కొనుగోలు శక్తి పెరుగుతున్న ఈ తరుణంలో ఈ గ్లోబలైజేషన్లో లోకలైజేషనూ, లోకలైజేషన్లో గ్లోబలైజేషనూ తప్పవు మనకి. మార్కెట్ దేవతకీజై ! జై !!


****

5 comments:

జ్యోతి said...

గ్లోబలైజేజేషన్, లోకలైజేషన్. ఇలా ఎన్ని కథలు చెప్పిన చివరకు వినియోగదారుడికే బొక్క పడేది. ఇలా ఆఫర్‍లు గట్రా పెట్ట్ భలే ముంచేస్తారు జనాలను.

vemuleti said...

That's true....! some 5 years ago, A good dress of 1000 Rs - is a costliest one. Now it has changed to Rs. 2000/-. Mean, the average income of a middle clasee person has increased and so the market is making business by calling it localization and globalization.
Whatever it is - We Indians, feel proud to say- "Hey! Its an imported one or a foreign brand T-Shirt" (though it is made in india and branded in foreign) will have more value. so the market makes good business in all the shopping malls.

అబ్రకదబ్ర said...

హిమాలయాల్లో మంచుగడ్డలు అమ్మటమే కదా మార్కెటింగ్ అంటే. ఎవరి తిప్పలు వారివి.

ఈ సారి మీ టపాల్లో ఎప్పుడూ ఉండే వేడి లేదు. ప్రయాణ బడలికేమో!

Cinevalley said...

biyani business has a logic. Their target is cost concious middle class budget shppers. They are selling at a lower price compared to market price. They can do this because of the volumes. They made 300cr business in one week around independence day.

During that time, I was around there to buy 1kg Atta. Alas, they were selling 5kg & above only. And the shop was full as if some loot is happening (incidentally that 'loot mar' was the name of one section of that store)

--Cine Valley

vinu said...

hi mahesh garu

meeru cheppindi nijam, soap kondamani velli chala tisukochina valle 95% mandi, adhi okate kaadhu maa ammamma tiduthundi kuda emani ante bellam ee varsha kalam lo tecchi pedithe padaipothundi, kani aa big bazar ki velithe chachinatlu manam avasaram vunna lekapoyina 1 kg tevalsinde manaku kavalsinantha ante 1/4 kg tevatam kudaradhu