ఆ క్షణంలో...
నమ్మిన నిజాలు
నగ్నంగా నిలబడతాయి
అర్జించిన ఆలోచనలు
అర్థరహితంగా మిగుల్తాయి
అమూల్యమన్న ఆదర్శాలు
ఆనవాలు లేకుండాపోతాయి
పవిత్రమనుకున్న విలువలు
పటాపంచలవుతాయి
నెత్తికెత్తుకున్న నియమాలు
నామరూపాల్లేకుండాపోతాయి
ఆ క్షణం ఎదురైన ప్రతిసారీ
ఎవరూ మిగలరు
ఏమీ మిగలవు
అన్నీ అంతర్ధానమైపోతాయి
గర్వం, వ్యక్తిత్వం
నమ్మకం, ఆదర్శం
అన్నీ...అన్నీ
ఆ క్షణం వేడికి
ఆవిరై ఆనవాలు లేకుండాపోతాయి
ఆ అద్భుతం ప్రతి క్షణం జరుగుతుంది
ఆ ఆవిర్లు అనుక్షణం మనచుట్టూ ఆవరిస్తాయి
ఆవిరి పరదామాటున
ఒక కొత్తలోకం ఆవిష్కరింపబడుతుంది
మళ్ళీ ఆక్షణం మనముందు సాక్షాత్కరిస్తుంది
ఆ క్షణంలో...
Wednesday, September 3, 2008
ఆవిరైన ఆ క్షణం
Subscribe to:
Post Comments (Atom)
10 comments:
బాగుంది కానీ నాకేమీ అర్ధం కాలేదు అని రాద్దామనుకున్నా, మొదట సారి చదవగానే! మరలా చదివాకా అర్ధమయ్యింది. బహు బాగుంది.
This is the moment, కదూ? :-)
ఆ అద్భుతం ప్రతి క్షణం జరుగుతుంది - అనటంలోనే ఉంది అసలైన మజా.
అదే కవిగాడి (ముద్దుగానే) రహస్య ఫార్ములా.
స్పందించే హృదయానికి
ప్రతీస్పందనకూ పదాలనందించగలిగే మేధకు
ప్రతీక్షణమూ సుందరమే
ప్రతీక్షణమూ అద్భుతమే!
బొల్లోజు బాబా
baaundi mahesh gaaru..
chaala ba raasaaru..meenakshi
baa raasaaru mahesh gaaru...
చాలా బాగుంది. A beautiful blend of experience and expression as well as wisdom and wit.
కవిత చాలా బాగుంది. మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు.
నేను కవితల్లో బహు వీకు. మొదటి రెండు పేరాలూ (పేరాలనొచ్చా?) బాగున్నాయి, తేలిగ్గా అర్ధమయ్యాయి. చివరిదే కొంచెం గందరగోళంగా అనిపించింది. ఇంతకీ ఏమిటా క్షణం? ప్రతి క్షణమూ అటువంటిదే అని మీ ఉద్దేశమా? జనాలు ఎప్పుడూ తమ నమ్మకాలు, ఆదర్శాల గురించి ఊగిసలాటలో ఉంటారని మీ భావమా?
ఆ క్షణం ఏమిటో నాకర్థం కాలేదు. అనేక రకాల క్షణాలు గుర్తొచ్చాయి. ఇదేదో 'మో ' గారి కవితల్లాగా బహు అస్పష్టంగా ఉంది. మొదటి రెండు పేరాలూ చదివాక ఆ క్షణమేదో తెలుస్తుందనుకున్నాను గానీ మూడో పేరా చదివాక మరీ అయోమయానికి లోనయ్యాను. నేనూ వీకే కవిత్వంలో!
ప్రతి క్షణం అలాంటిదే అనా లేక ఒక ప్రత్యేక క్షణమా ఇది?
"నమ్మిన నిజాలు నగ్నంగా నిలబడతాయి" అనే వాక్యం నాకు 'నమ్మిన నిజమొక్కటే మిగులుతుంది" అని ధ్వనించింది. మరి దాని కింద వాక్యాలన్నీ అందుకు విరుద్ధంగా ఉన్నాయి.
రెగ్యులర్ గా కవిత్వం చదవక పోతే ఇదే గొడవ, ఏమీ అర్థం కాదు!
బాగుంది.
వృత్తంలాగా మొదలైన చోటికే వచ్చి ఆగడంలోని సైక్లిక్ క్వాలిటీ నచ్చింది.
మొదటి చరణంలో మీరు తెలిసో తెలియకో యతి పాటించడం ఒక గేయం లాంటి తూగుని తెచ్చింది. దాన్ని రెండో చరణంలో భగ్నం చెయ్యడమూ సబ్జక్టుకి అనుగుణంగానే ఉంది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ఎఫెక్టు నాకు చాలా నచ్చింది.
నేను ఈ పద్యాన్ని సవరించే పనైతే .. రెండో చరణంలో ఆవిరైపోయే వాటి జాబితా చివర్లో అహాన్ని కూడా చేరుస్తాను.
మొదటిగా ఈ కవిత కొంత తికమకని మిగిల్చినవారికి ఒక్క మాట. ఈ కవితపైన వ్యాఖ్యానం నేను చెయ్యగలిగుంటే ఒక వ్యాసం రాయాల్సి వస్తుంది. ఆల్రెడీ కవిత రాసేసానుగనక, కేవలం ఇందులోని మూల వస్తువుని గురించి రెండు మాటలు చెబుతాను.
మార్పు ప్రతిక్షణం జరుగుతుంది. ఆ మార్పు ప్రస్తుతం వున్న విలువల సమాధులమీదనుంచీ జరుగుతుంది.ఈ నిరంతర మార్పులో ఒక వృత్తంలాంటి గతి వుంటుంది. మొదలు చివరిగా,చివర మొదటిగా మారుతూ ఈ క్షణాలు కొనసాగుతాయి అనే ఆలోచనే ఈ కవిత.
ఈ కవిత అర్థాన్ని సమూలంగా అర్థం చేసుకుని అభినందించినవారికీ, చదివి ఆలోచించిన వారికీ, ఎక్కడ అర్థంకాలేదో చెప్పిన వారికీ. అభినందించిన వారికీ అందరికీ నా ధన్యవాదాలు.
Post a Comment