Thursday, August 28, 2008

హైద్రాబాదొస్తున్నానోచ్ !

ఉద్యోగరీత్యా విధించుకున్న ఆరు సంవత్సరాల self exile నుంచీ మరో assignment రీత్యా హైదరాబాద్ వస్తున్నాను. So, I will be back in Hyderabad.మొన్న హైదరాబాదొచ్చినప్పుడు ట్రాఫిక్కును చూసి భయపడ్డాను. ఆ భయాన్ని అధిగమించాలి

సిటీబస్సులో వెళ్తూ పక్కనున్న బిల్డింగులనుబట్టి దారి కనుక్కునే అవకాశం కోల్పోయినందుకు ఖంగారుపడ్డా...ఎన్ని కొత్తకొత్త హార్మ్యాలో !!! అవన్నీ ఇప్పుడు కనుక్కుని ఖంగారు తగ్గించుకోవాలి.

దేశంమొత్తం "హైద్రాబాదీ బిర్యానీ" ఆర్డరు చేసి, రుచిచూసి విసిగివేసారి వస్తున్నాను. మళ్ళీ ‘బావర్చి’లో బిర్యానీ తిని హైద్రాబాదు రుచిని మళ్ళీతాజాగా తెలుసుకోవాలి.

తెలుగు సినిమాల్ని ఢిల్లీ పాలికాబజార్లో పైరేటెడ్ DVD లలో చూసిచూసి విసుగెత్తి, పెద్దతెరపై తెలుగు సినిమా చెత్తను టికెట్టు కొనిమరీ ప్రోత్సహించాలి.

గోకుల్ చాట్లో నాకిష్టమైన దహీపాపడీ...మిర్చిబజ్జీలకు మొఖంవాచిపోయున్నాను. ఈ సారి కనీసం మరో ఆరు సంవత్సరాలకి సరిపడా రెండేళ్ళలోనే పట్టించెయ్యాలి.

సినిమా ఇండస్త్రీలోవున్న స్నేహితులందరి జీవితాల్నీ నేనే ఒక సినిమాగా తియ్యాలి.

హైద్రాబాదులోని నా స్నేహప్రపంచంలో మరిన్ని బ్లాగుదేశాలు చేరాయి. అన్నింటినీ ఒక్కటిగాచేసి, అంతానాదే అనేసుకోవాలి.

మళ్ళీ హైదరాబాదుని సొంతం చేసుకోవాలి.


వస్తున్నా హైదరాబాద్ ! just wait for me !

***

11 comments:

katuri said...

welcome ....
telugu cinema chetta yenti .... ninnu prostainchamani vallu yemi adagaledu basu .........

cbrao said...

మీరు హైదరాబాదు వస్తున్న తరుణంలో, నేను దూరంగా వెళ్తున్నానే. అయినా మనిషి మారలేడు. మనస్సంతా హైదరాబాదే. మీకు హార్దిక స్వాగతం. మా సహాయం ఏమన్నా కావాలా?

కత్తి మహేష్ కుమార్ said...

@రావు గారు:మీ అభిమానానికీ ఆదరణకీ ధన్యవాదాలు. ఇప్పటికే పలువురు స్నేహితులు నాకు సహాయపడేపనిలో వున్నారు. వారి శక్తికిమించిందేదైనావుంటే మీలాంటి పెద్దల సహాయం ఖచ్చితంగా తీసుకుంటాను.

@కస్తూరి: నా తెలుగు సినిమా అభిమానం జదద్విదితం.తెలుగు సినిమా చెత్తదైనా అభిమానంతో చూస్తాను. అది వారు అడగనఖ్ఖరలేదు. నా అభిమానం అంతే...అందుకే టికెట్టుకొనిమరీ వారికి నావంతు ఆదాయన్నిచ్చి ప్రోత్సహిస్తాను.

మీ స్వాగతానికి ధన్యవాదాలు.

సుజాత said...

రండి రండి! హైదరాబాదులో మీకు తెలియనివేవీ లేవు కాబట్టి పెద్దగా సహాయం అవసరం పడకపోవచ్చు. ఏదైనా అవసరం అయితే మాత్రం తప్పక కాల్ చేయచ్చు, మొహమాటం లేకుండా!
ఎన్నాళ్ళుంటారు?

ప్రతాప్ said...

రండి రండి దయచేయండి,
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ.
బిర్యానికి ఒకప్పుడు బావర్చి ఫేమస్, కాని ఇప్పుడు కాదు అని అందరి ఉవాచ (నాది కూడా).
మీకు మంచి బిర్యాని కానీ తినాలంటే, S.R. నగర్ లోని, మేఘన బిర్యాని సెంటర్ కి వెళ్ళండి. ఇంకో మాట అది only పార్సెల్ సెంటర్, కాని రుచి మాత్రం అదుర్స్. మిర్చి బజ్జీలు గోకుల్ చాట్ లో కన్నా నెక్లస్ రోడ్డులోని eat street లో బావుంటాయి. అస్సలే వర్షాకాలం, ఆపై వేడి వేడి బజ్జీలు, పక్కనే సముద్రం లాంటి హుస్సేన్ సాగర్ (కంపు గురించి మర్చిపోండి) ఇక ఎంజాయ్ చేసెయ్యండి మరి.

బొల్లోజు బాబా said...

welcome to andhra.

(కొంపతీసి తెలంగాణా అని అనాలా?)

బొల్లోజు బాబా

కల said...

స్వాగతం

saisahithi said...

స్వాగతం, సుస్వాగతం
వీలైతే మా విశాఖపట్నం రండి.

sujata said...

క్యా... భయ్యా.. దెల్లీ చోడ్ కె ..?! హైదరాబాద్ మే క్యా హై? నక్కో ఆ ఇదర్ కు తూ !! ఇదర్ క్యా హై మియా.. కోయీ భాయిసాబ్ న బోలేగా.. కొయి ఇజ్జత్ నయ్ ! కుచ్ నయ్ ! కొయి జుగాడ్ నయ్ !

బిరియానీ మే క్యా హై మియా! ఇతనా అచ్చా దిల్లీ కీ సర్దీ చోడ్కే.. చోటె చోటె పుల్ (ఫ్లై ఓవర్) కే ఊపర్ సఫర్ కాట్నాచ్ పడ్తా..! .... దిల్లీ కో మాన్ నా పడేగా! ఐసీ చోలె బటూరే, ఐసీ పాలికా బజార్, ఐసీ కనాట్ ప్లేస్, ఐసీ పీ.వీ.ఆర్. యహా నయి మిలెగా ! కోయీ సోషల్ లైఫ్ నయి ఇదర్. ఘర్ మె బైట్కె పరెషాన్ అవుతవ్ ! మెట్రో లేదు. రోడ్లు లేవు. స్వెటెర్లూ, రంగులూ లేవు ! గలీనా లేదు ! బైటికి బోయినవంటే ఇంటికి రావడం మస్తు కష్టం. ఇక పై మీ ఇష్టం.

సరే ! అవినాష్ కూడా వస్తే ఒకే లే మల్ల ! మిర్చీ బజ్జి ఖా సక్తె హై.. దేఖ్ లీజియె. ఫుల్ గ షిఫ్ట్ ఔతున్నారా ? వెల్కం ! (నాకు డిల్లీ వెలిపోవాలనుంది. మా గాంగ్ అంతా అక్కడే ! అందుకే !)

రమణి said...

వెల్ కం టు హైదరాబాద్! గోకుల్ చాట్ అంటూ కోఠీ కి వెళ్తారేమో అది అక్కడినుండి బషీర్ భాగ్ కి మారింది మహేష్ గారు. మీకు తెలీదని నేను అనుకోను. కాని నాకు తెలిసింది చెప్పాలనే ప్రయత్నం.

భరత్ said...

ఎమండోయ్ మహేష్ గారు,
చాల రోజుల తర్వాత హైదారాబాద్ వస్తున్న అంటునారు, మరిఏమొ మీకు బొలెడు ఆశలు, ఊహలు ఉన్నయ్. అందుకే మీకు ఒక విషయం చెప్పాలి, అది ఎంటంటే, సార్ హైదారాబాద్ లొ ఇప్పుడు కాలు పెడతానికి కాలి లేదు అంటే నమ్మండి. రోజు రోజుకు ఈ మహ నగరం లొ జనాభా చీమల దండు లాగ పెరిగిపొతుంది, ఈ ట్రాఫిక్ చూస్తే బహుస్య మీరు మీ నిర్ణయం మార్చుకుంటారేమో...... ఏది ఏమైనా మీకు హైదారాబాద్ కి స్వాగతం.