Friday, September 5, 2008

టీచర్లు ఎంచేస్తారు?

ఒక బడాబాబుల పార్టీ భోజనాలదగ్గర, బఫే తింటూ భారతదేశ ప్రగతి గురించి చర్చలు జరుగుతున్నాయి.

ఇంతలో ఒక లోకం తెలిసిన కంపెనీ CEO "ఇంకేమీ చెయ్యడం చేతగాక, టీచర్లైనవాళ్ళ దగ్గర మన పిల్లలు చదువు ఎలా నేర్చుకుంటారో నాకైతే యమ సందేహంగా వుంది" అన్నాడు.

ఇంతలో మరో పెద్దమనిషి "నిజమేనండోయ్, అదేదో సామెత చెబుతారుకదా ! Those who can't DO, they TEACH అని" అంటూ పెద్దగా నవ్వేసాడు.

ఇద్దరూ కలిసి పక్కనే నిశ్శబ్దంగా వారి మాటలు వింటున్న అనిత అనే టీచర్ తో "అనిత టీచర్లు నిజంగా ఏం చేస్తారో చెప్పు" అని ఎద్దేవాచేసారు.

తను ఒక్క క్షణం మౌనం వహించి చెప్పడం ప్రారంభించింది.

"తన సొంత కష్టంతో ఎంత స్థాయిని చేరుకోగలడో తెలియని విధ్యార్థికి తన సామర్ధ్యాన్ని తెలియజెప్పడం టీచర్ చేసే పని."

"విద్యార్థి కష్టంతో సంపాదించిన పది మార్కుల్నికూడా ‘పద్మశ్రీ’ బిరుదంత అపురూపంగా అనిపించేలా చెయ్యగలిగేదే టీచర్"

"తల్లిదండ్రులు టీవీ లతో, ప్లేస్టేషన్లతో, ఐ-పాడ్ ల వంటి ఆకర్షణలతోకూడా కనీసం ఐదునిమిషాలుకూడా కుదురుగా కూర్చోబెట్టలేని విధ్యార్థిని నలభై నిముషాలసేపు తమ విద్యతో కూర్చోబెట్టేదే టీచర్."

"నేను టీచర్ గా ఏంచేస్తానో తెలుసా....

పిల్లల్ని ఆలోచింపజేస్తాను, అబ్బురపడేలా చేస్తాను, ప్రశ్నించేలా చేస్తాను. వారి చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తాను. బాధ్యతల్ని సంతోషంగా భుజాలకెత్తుకునే పౌరుల్ని చేస్తాను.

వారిలోవున్న గ్రహణ శక్తిని, ఆలోచనా ప్రవాహాన్ని, అనుభవాల్నీ జీవితానికి అన్వయించుకుని పరిపూర్ణులుగా తయారయ్యేలా చూస్తాను.

అలా తయారైన నా విధ్యార్థులు జీవితంలో వున్నత శిఖరాల్ని చేరడానికి నేను పునాదినౌతాను. నా విద్యార్థుల్లోనే కొందరు మీలా CEOలవుతారు. ఇంకొకరిలా వ్యాపారస్తులవుతారు.

టీచర్లు మాత్రం ఈ చిన్నచిన్న పనుల్నే జీవితాంతం చేస్తారు." అని ముగించింది.

ఇద్దరినోట్లోంచీ మరో మాటకూడా రాకుండా పార్టీ ముగిసింది.

****

అందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు


* నేను ఇంగ్లీషులో చదివిన ఒక ఘటన ఆధారంగా

21 comments:

Purnima said...

TRUE!

Rajendra Devarapalli said...

Decent observation

Suresh Kumar Digumarthi said...

Understanding the Teacher

Kranthi M said...

nice observation.chaala baaga chepparu.

Sarath said...

well said.

venku ... said...

kathi garu... kathilaa raasaru...

Srividya said...

Too Good :)

Unknown said...

చాలా బాగా చెప్పారు.

Ramani Rao said...

చాలా బాగుంది. టీచర్లగురించి మీ విశ్లేషణ. "

సుజాత వేల్పూరి said...

true!

Kottapali said...

Beautiful!
A grateful son of two teachers

Unknown said...

mahesh garu

chala chala baga rasaru, sunday vaste pillalu intlo vuntaru ani bayapade parents vunna ee kaalam lo teachers aa pillalane 6 days vallu handle chestunnaru, meeru cheppindi nijam

durgeswara said...

maa teacherla tarapuna dhanyavaadamulu.

Anonymous said...

Hmm...
Can you please clarify my doubts. Spare my ignorance.....

మీ లలిత క్లాస్ లో ప్రతి ఒక్కరూ ప్రయోజకలు అయ్యారా?? ప్రయోజకలు అంటే ఏంటీ అని అడగకండీ... మీ పోస్ట్ లోనే వుంది...
ఈ అల్ప జీవి కి ఇంకా చాలానే సందేహాలు వున్నాయి.

--- వంశీ

కొస మెరుపు ఏంటి అంటే.. పండిత పుత్రహ సునకహ అన్నట్టు.. మా తల్లిదంద్రులిద్దరూ పండితులే.

Kathi Mahesh Kumar said...

@వంశీ: ‘అనిత’ పాత్ర ఒక నిబద్ధతకలిగిన టీచర్ కు ప్రతీక. ఇలాంటి ఉపాధ్యాయులు కనీసం క్లాసుకొకరో లేక స్కూలుకొకరో లేకుండా మన మందరం ఈ స్థాయికి చేరుకోలేదు. నా అదృష్టం కొద్దీ దాదాపు నా జీవితంలోని ప్రతి చరణంలో ఇలాంటి బాధ్యతాయుతమైన టీచర్ల సహవాసం చేసాను. మీకు ఆదృష్టం కలగలేదంటే నాకు మాత్రం చాలా బాధగా వుంది.

మీకున్న మరిన్ని సందేహాలుకూడా చెబితే సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

@దుర్గేశ్వర్రావు: మీకు నా టీచర్స్ డే శుభాకాంక్షలు.

@విను: నిజమే,అల్లరి భరించలేక త్వరత్వరగా స్కూల్లో చేర్చే తల్లిదండ్రులుకూడా వున్నారు. కాబట్టి ఆ బాధ్యతని తీసుకుంటున్న టీచర్ కి ఆ కనీస గౌరవం వుండాల్సిందేకదా!

@కొత్తపాళి, సుజాత,రమణి, చంద్ర శేఖర్,శ్రీవిద్య, వెంకు,శరత్, క్రాంతి, సురేష్, రాజేంద్ర, పూర్ణిమ: ధన్యవాదాలు. టీచర్లకి ప్రణామాలు.

Anonymous said...

Adbhutam. I am the daughter of a wonderful teacher.

Anonymous said...

Hmm I certainly would like to clarify all my doubts... but you have not answered my first question itself...
>> "మీకు ఆదృష్టం కలగలేదంటే" నాకు మాత్రం చాలా బాధగా వుంది.
is it an assumption or conclusion??? but lets not get into 'who is lucky and not-lucky..' business... perhaps once you clarify my doubts i will come back...

Nways i hope you answer my first question...

--Vamsi

Bolloju Baba said...

thank you very much.
bollojubaba
p.s i hope this is a translation of a previous post of your english blog. isnt it?

Anil Dasari said...

నాకు మాత్రం టీచర్లంటే అసూయ, ఏడాదిలో సగం రోజులు హాయిగా సెలవులతో గడిపేస్తారని (ఎలక్షన్ డ్యూటీ, పేపర్లు దిద్దటం, ట్రైనింగులు గట్రా రుద్దుళ్లూ ఉంటాయనుకోండి కొందరికి)

బుజ్జి said...

ma annayya oka school nundi transefer ayyi vellipoyinappdu auto ninda nindipoyina bujji bujji gifts anni nene koorchoni open chesina sangati gurtohindi.. :)

వర్మ said...

మహేష్ గారు ఈ పోస్టు నేను టీచర్స్ డే రోజు చూడలేదు. లేటుగా చూసాను. నిజంగా దేశ ప్రతిభ, భవిష్యత్తు టీచర్ల చేతిలో ఉందని బాగా తెలియజేసారు.