Monday, September 8, 2008

సత్యశోధన


మొన్నే తెలిసింది !
కానీ, ఈ రోజది లేదు.
సత్యం నిత్యమంటారు.
మరైతే మొన్నతెలిసింది ఈ రోజు మారిందే ?

తెలిసొచ్చిన సత్యమే ప్రమాణంగా
మిగతా నిజాల్ని కొలవాలనుకున్నాను.
సత్యమే సందేహాస్పదం అయ్యాక,
కొలవడానికి ఏమీ మిగల్లేదు !

సత్యం నిత్యం కాదనే నిజం
అనునిత్యం తెలుసుకోవడమే సత్యమా !
అయితే,
ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి
మనిషి పడే కష్టమెంత?
అడ్డుకుని మాయమాటలు చెప్పి
మోసగించే ఈ సమాజానికి
నిజంవల్ల కలిగే నష్టమెంత?

అద్దంలో ఓసారి చూసుకుని
నా సత్యాన్ని నేను వెతుక్కోవాలి.
ఎక్కడపోగొట్టుకున్నానో అక్కడే సాధించాలి.
అనుక్షణం శోధించాలి.

***

3 comments:

Suresh Kumar Digumarthi said...

నేటికి మార్పే సత్యం

Anonymous said...

బుబ్బి బుబ్బి బుచికి బుచికి. ఎందుకు ఏమిటి ఎలా? అదంతే.

కొత్త పాళీ said...

Keep searching ..
సమాజానికి నిజం వల్ల చాలానే నష్టం. నిజం చెప్పాలని ప్రయత్నించిన వాళ్ళందర్నీ దేవుళ్ళని చేసి పారేసి వాళ్ళ నోళ్ళు మూయించింది అందుకనే! బొమ్మ బావుంది.