Thursday, December 31, 2009
బ్లాగులు నాకేమిచ్చాయి?
Posted by Kathi Mahesh Kumar at 8:46 PM 46 comments
Labels: వ్యక్తిగతం
Friday, December 25, 2009
Tuesday, December 22, 2009
భాష గోల
Posted by Kathi Mahesh Kumar at 7:36 AM 13 comments
Labels: సాహిత్యం
Sunday, December 20, 2009
ప్రేమజ్యోతి
The light of love
shine through
even when
the darkness
of familiarity
begins to cast it's shadows
Posted by Kathi Mahesh Kumar at 6:06 PM 7 comments
Labels: కవిత
Thursday, December 10, 2009
శాంతి కావాలా?
Posted by Kathi Mahesh Kumar at 11:34 AM 16 comments
Labels: కవిత
Thursday, December 3, 2009
విమర్శకుడి బాధ్యత
Posted by Kathi Mahesh Kumar at 5:27 AM 4 comments
Labels: సాహిత్యం
Tuesday, December 1, 2009
ఆర్య లాంటి ఫ్రెండుంటే - కేసీఆర్ లాంటి నాయకుడుంటే
ఈ మధ్యే విడుదలైన ఆర్య-2 సినిమా "ఆర్య లాంటి ప్రెండ్ వుంటే చాలు వేరే శత్రువులు అక్కర్లేదు…" అనే డైలాగ్ తో మొదలౌతుంది. సినిమా మొత్తం అతిప్రేమ-సైకోప్రేమ- అతిసైకో చేష్టలతో ఆర్య పిచ్చిపిచ్చిగా సినిమా మొత్తం ఎనర్జీతో గెంతి, ప్రేక్షకుల్ని 70MM లో వెధవల్ని చేసి బయటికి పంపిస్తాడు...
Posted by Kathi Mahesh Kumar at 1:45 PM 15 comments
Sunday, November 29, 2009
Friday, November 27, 2009
ప్రగతికోసం ఆంగ్లభాష - చేతన్ భగత్
ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత పెరిగినంత మాత్రానా దేశభాషలు, దేశీయభాషలు తరిగిపోవడమో వాటి వాడకం కుంచించుకుపోవడమో జరగాల్సిన అవసరం లేదు. కానీ తెలుగుకి ఈ పరిస్థితి పడుతుందని కొందరు వాపోవడానికి కారణం మాత్రం ఒక్క ఇంగ్లీషు ఉపయోగమైతే కాదని నా నమ్మకం.
ఈ సందర్భంగా ఒక మిత్రుడు, Five Point Someone, One night @ The Call Center, The Three Mistake of my Life, 2 States- The Story of My Marriage వంటి నవలలు రాసిన చేతన్ భగత్, బ్రిటిష్ కౌన్సిల్ వారు నిర్వహించిన "English for Progress conference" లో చేసిన ప్రసంగాన్ని పంపారు. ఆ ప్రసంగంతో నేను నూరుశాతం ఏకీభవిస్తాను. ఆ వ్యాసం మీకోసం ఈ క్రింద పొందుపరుస్తున్నాను.
That said, he hired ten teachers for his two hundred students for the sole job of teaching proper, MNC interview-ready English. My own books are simply written. One of the big uses of my books in small town India is that of using it as a tool to learn English. I was invited to a talk in Bastar, a backward area ten hours drive from the nearest airport of Raipur. I asked them who reads Chetan Bhagat in Bastar? They said tribal kids, they use your books to learn English. It shows you the hunger. For my recent book, we did a round of simplification editing, so that the book is more accessible to Indians. Of course, critics in India hate me for it. But that’s what critics do anyway, and if I am getting a chance to aid transforming a young person’s life, I am not going to pass up on that.
Chetan
Posted by Kathi Mahesh Kumar at 11:19 AM 7 comments
Labels: సాహిత్యం
Monday, November 23, 2009
గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు
ఎముకలలో ఎముకై ఎగసిన మా మాంసం
రక్తంలో భాగమై దుమికిన మాంసం
ఊరికి దూరంగా నన్నుంచినపుడు
నా అడుగులే నీకంటరానివైనపుడు
మనిషినే మనిషిగా నువ్వు చూడలేనపుడు
నాకండగా ఉన్నది
నన్నీడికి చేర్చినది - గొడ్డు మాంసం
మా తాతాలు నేతులు తాగారని
ఏవేవో గొప్పలు చేశారని
నీ తరపున నువ్వేదో చెప్పుకుంటూ పోతుంటే
నా తరపున నిలబడ్డది
నాతోనే ఉన్నది - గొడ్డు మాంసం
రొమ్ము పిండి పాలు పిసికినపుడు
నీకు నెప్పంటే తెలియనే లేదు
చెప్పు కుట్టి తొక్కి నడచినపుడు
నీకు బాధంటే తెలియనే లేదు
నీ పెళ్ళికి... నీ చావుకి
డప్పై మోగినపుడు
దెబ్బంటే తగలనే లేదు
నా ఆకలిని తీర్చినపుడు
నీకు దేవతయ్యిందా గొడ్డు మాంసం?
Posted by Kathi Mahesh Kumar at 2:42 PM 14 comments
Sunday, November 22, 2009
భాష - భావం
Posted by Kathi Mahesh Kumar at 7:56 PM 7 comments
Labels: సాహిత్యం
Friday, November 13, 2009
వరద వార్త
పేపరు తడిగా ఉందెందుకో!
Posted by Kathi Mahesh Kumar at 12:24 PM 7 comments
Labels: కవిత
Thursday, November 5, 2009
ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర
ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయం,ప్రజాఉద్యమాలకున్న ప్రాధాన్యత మీకు తెలియంది కాదు. సరిగ్గా ఈ పరిస్థితినే రాష్ట్రప్రభుత్వం తన ఆర్ధిక పరిస్థితిని చక్కబెట్టుకోవడానికి వాడుకుంటోంది. పాఠశాల విద్యను 6-12 వరకూ చేసి ఇంగ్లీషు-హిందీ చేస్తే కేంద్రప్రభుత్వం తేరగా నిధులిస్తుంది.రాష్ట్రప్రభుత్వం తన సొంత నిధులు విద్యాశాఖలు కేటాయించాల్సిన పనిలేదు. ప్రాధమిక విద్య ఎలాగూ SSA (సర్వశిక్షా అభియాన్) పుణ్యమా అని కేంద్రం నిధులతో గడిచిపోతోంది. పాఠశాల విద్యకూడా ఒదిలిపోతే ఒకపనైపోతుందనేది ప్రభుత్వ విధానం.
ఈ తెలుగు భాషా ‘బాధ’కులకు మిగిలింది మూడు options. ఒకటి భాషాబోధనను మార్చడం. అది వాళ్ళు చచ్చినా చెయ్యరు. ఎందుకంటే అదే "అచ్చతెలుగు" అనేది వీళ్ళ పిచ్చినమ్మకం. భాషా వారసత్వం వీరికి ముఖ్యం. భాష కాదు. వీరికి వర్తమానంకన్నా భూతకాలపు వైభవం ముఖ్యం.ప్రజల తెలుగుకన్నా, సారస్వతం ముఖ్యం.
రెండోది. ఏ ఆర్థిక కారణాల వల్లనైతే ప్రభుత్వం ఇంగ్లీషుమీడియం చదువులవైపు మొగ్గుచూపతోందో ఆ ఆర్ధిక కారణాన్ని రూపుమాపడం. స్వచ్చందంగా "భాషా సెస్" విధించమని ప్రభుత్వానికి చెప్పి,తెలుగు భాషా పరిరక్షణకోసం ట్యాక్స్ కట్టడానికి తయారవ్వడం. ఈ పని వీళ్ళు చేస్తారని నాకు అస్సలు నమ్మకం లేదు. ఏదో తెలుగు భాషకోసం lip service వరకూ చేస్తారుగానీ జేబులోంచీ డబ్బుతీసి తెలుగు భాషను రక్షించడమంటే..హమ్మో!
మూడొది. తెలుగు భాషను ఒక రాజకీయ ఉద్యమం చెయ్యడం. అన్ని రాజకీయపార్టీల మ్యానిఫెస్టోలోనూ తెలుగు భాషను "రక్షించే"(what ever it means to them)విధంగా చర్యలు ప్రతిపాదింపజెయ్యడం. అధికారంలోకి వచ్చిన తరువాత అమలు పరిచేలా ఒత్తిడి తేవడం. లోక్ సత్తా లాంటి స్థానిక పరిపాలన తెలుగులో జరగాలని కోరుకునే పార్టీల నెత్తిన తమ ఆభిజాత్యాల్ని రుద్ధకుండా, పరిపాలనా తెలుగును సర్వత్రా ఉపయోగించేలా చర్యలు తీసుకుంటూ స్వచ్చందంగా దానికోసం పాటుపడటం.
Posted by Kathi Mahesh Kumar at 8:31 PM 23 comments
భాష - మతం: దీనిభావమేమి తిరుమలేశా!
Posted by Kathi Mahesh Kumar at 7:54 AM 13 comments
Saturday, October 31, 2009
తెలుగుకన్నా...పిల్లల హక్కులు ముఖ్యం
Posted by Kathi Mahesh Kumar at 8:23 PM 14 comments
Labels: సమాజం
Friday, October 23, 2009
మునెమ్మ - A manifesto on the Feminine
Posted by Kathi Mahesh Kumar at 9:56 AM 3 comments
Labels: సాహిత్యం
Thursday, October 22, 2009
ప్రేమ వైరుధ్యం
Posted by Kathi Mahesh Kumar at 11:44 AM 8 comments
Labels: కవిత
Wednesday, October 14, 2009
ఆధునికోత్తరవాదం : Post-modernism
"Post-modernism is not an ideology. Its an 'idea' of demystifying all ideologies at the strength of independent thinking" అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు.అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా,ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను.
"ఒక సిద్ధాంతానికి కాని, ఒక నియమానికి కాని, ఒక వాదానికి గాని, ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా, స్వతంత్రంగా ఆలోచించి, సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం". ఇలా ఉంటే ‘మీ మాటల్లో పొంతనలేదు’ అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తుంది. అలాంటప్పుడు గ్రహించాల్సింది ఏమిటంటే, seeking nobody's approval and disapproving no one's idea of what you are is also part of post- modernism.
Posted by Kathi Mahesh Kumar at 9:46 AM 20 comments
Labels: సమాజం
Monday, October 12, 2009
అర్థం-ఆనందం : జీవితం
ఆనందకరమైన జీవితానికీ అర్థవంతమైన జీవితానికీ చాలా తేడా ఉంది.
Posted by Kathi Mahesh Kumar at 7:54 AM 9 comments
Labels: వ్యక్తిగతం
Thursday, October 1, 2009
నిజం - అబద్ధం: ఒక నిర్వచనం
వస్తువులు మన ఎదురుగా బౌతికంగా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు. కాబట్టి బౌతికవస్తు పరిజ్ఞానానికి ఎటువంటి వ్యతిరేక భావనా లేక వైరుధ్యం ఉండవు. కానీ మన "నిజాల" జ్ఞానానికి ", "అబద్ధం" అనే వ్యతిరేకపదం ఎప్పుడూ వెన్నంటినే ఉంటుంది. అందుకే నిజాల భావనలో వైరుధ్యాలు సహజం. అలాగే అబద్ధాల్లో కూడా వైరుధ్యం అంతే సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే, నిజం-అబద్ధం అనేవి "నమ్మకం" ఆధారంగా ఏర్పడతాయి. కాబట్టి నిజాన్ని అబద్ధంగానూ,అబద్ధాన్ని నిజంగానూ కూడా ఈజీగా నమ్మొచ్చు. ఒక్కోసారి అబద్ధాల్ని మరింత బలీయంగా నమ్మెయ్యొచ్చు. కాబట్టి నమ్మకాల నిజానిజాల్ని సమీక్షించుకోవడం అత్యంత కష్టం. అంతకన్నా క్లిష్టమైన సమస్య ఏమిటంటే... నిజాన్నీ అబద్ధాన్నీ నిర్వచించడం.
Posted by Kathi Mahesh Kumar at 9:49 PM 7 comments
Labels: సాహిత్యం
పదునున్నా గురిలేని ‘బాణం’
“వ్యవస్థలో ఉంటూనే దానిలో మార్పు తీసుకురావాలా లేక వ్యవస్థలోని (ఫ్యూడలిజం,పోలీస్ దుండగాలు వంటి) లోపాలకు వ్యతిరేకంగా సాయుధపోరాటం (నక్సలిజం) చెయ్యాలా?” అనే ప్రశ్నకు ఖరాఖండిగా తేల్చిచెప్పగలిగే సమాధానం ఇప్పటికీ ఉండకపోవచ్చు. కానీ పరిణామక్రమంలో, హింసను ప్రేరేపించే ఏ విధానమైనా, ప్రాణహాని కల్పించే ఏ ఆలోచనా ధోరణైనా ఒకవైపు ప్రజాస్వామ్యానికి మరోవైపు మానవత్వానికీ గొడ్డలిపెట్టనే భావన స్థిరపడింది. ఇలాంటి సైద్ధాంతిక నేపధ్యాన్ని సినిమా కోసం ఎంచుకున్నప్పుడు కొంత ఆలోచన,మరికొంత అవగాహన, మరింత స్థితప్రజ్ఞత కథకుడికి,దర్శకుడికి కావాలి. చివరికి ఏంచెప్పాలనుకున్నాడో దానిమీద conviction కావాలి. “బాణం” సినిమాలో అవి లోపించాయి. అందుకే పదునువున్నా గమ్యం లేక, దారితెలీక గురిలేకుండా మిగిలింది. ఏ కారణంచేతో అర్థంకాదుగానీ, ఈ సినిమా కథ 1989 సంవత్సరంలో జరుగుతుంది. వ్యవస్థను లోపలినుంచే మార్చడానికి పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఒక మాజీనక్సలైట్ కొడుకు ‘భగత్’ (నారా రోహిత్). తండ్రి (షయాజీ షిండే) మంచి కోసం ఉద్యమంలో ఉన్నాడని నమ్ముతూనే, తండ్రి విధానాలతో విబేధించే ఆదర్శవాది. ఒక దృశ్యంలో ఏకంగా “నేను మానాన్న లాగా తప్పు చెయ్యను” అని చెప్పగలిగే సిద్ధాంతకర్త. మరోవైపు మరణశయ్యమీదున్న తండ్రినే చంపే ఒక ఫ్యూడల్/మాఫియా యువనాయకుడు ‘శక్తి సాహు’(రణధీర్). ఫ్యూడలిజాన్ని,రౌడీయిజాన్ని రాజకీయంగా మలుచుకుంటేనే వ్యవస్థమీద పట్టు సాధించగలమనే విజన్ కలిగిన విలన్. ఈ రెండు విపరీత శక్తుల ఘర్షణ ఈ సినిమా కథకు మూలం. చివరికి హీరో ఆదర్శం-నమ్మకం గెలుస్తాయా లేక తన ధృక్పధంలో ఏమైనా మార్పులు వస్తాయా? చివరికి ఏంజరుగుతుంది అనేది కథ. కథకున్న పరిధి చాలా ఉన్నతం. కథలో చర్చించాలనుకున్న విషయం ముదావహం. అయితే కథనంలోని లోపాలు,హీరోపాత్ర ఎదుగుదల క్రమంలోని పేలవత్వం, అత్యంత నీరసమైన ఎడిటింగ్ కలగలిపి, ఉద్దేశం మంచిదైనా కేవలం ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే అభినందించదగ్గ సినిమాగా బాణం మిగిలింది. బరువైన భగత్ పాత్రలో కొత్త నటుడు నారా రోహిత్ నటించడానికి బాగానే ప్రయత్నించాడు. కానీ పాత్రలోని పరిణితి నటనలో లేకపోవడంతో తన పాత్రలోని స్థిరత్వాన్ని, భావగాంభీర్యాన్ని ప్రదర్శించే విషయంలో చాలాసార్లు ఆసక్తిలేనట్లుగా అనిపించే (రోజా సినిమాలో అరవింద్ స్వామి లాంటి) తన భావప్రకటన పంటికిందరాయిలా అనిపిస్తుంది. రోహిత్ కున్న పెద్ద ప్లస్ అతడి వాచకం. కొంచెం నీరసంగా అనిపించినా స్పష్టంగా తెలుగు మాట్లాడగలడు. గొంతు బాగుంది. మాజీనక్సలైట్ గా షయాజి షిండే పాత్ర కొంత అస్తవ్యస్థంగా ఉన్నా, నటనతో దాన్ని సమర్ధవంతంగా కప్పిపుచ్చగలిగాడు. వరకట్నం, అత్తింటి దౌష్ట్యం, భర్తచేతకానితనం, తండ్రి అకాలమరణం వలన అనాధగా మిగిలే సుబ్బలక్ష్మి పాత్రలో నూతన నటి వేదిక ప్రాత్రోచితమైన ఆహార్యంతో సరిపోయింది. హీరోయిన్ పాత్రకు గాత్రదాతగా గాయని సునీత కృషికూడా ఈ పాత్రను పండించడానికి యధావిధి ఉపయోగపడింది. చాలా మంది కొత్త ముఖాలు కనిపించే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన రణధీర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో ఉన్న పెద్ద లోపం ఏ ఆదర్శంకోసమైతే హీరో సినిమా మొత్తం పోరాడతాడో చివరకి అదే ఆదర్శాన్ని తుంగలోతొక్కి విలన్ “సమస్య”ని చట్టబద్ధంగా అనిచెబుతూనే చట్టాన్ని చేతుల్లోకితీసుకుని “తీర్చెయ్యడం”. దానితోపాటూ, హీరోకీ విలన్ కీ మధ్య సరైన direct conflict లేకపోవడం. ఈ సమస్యల్ని మరింత గాఎత్తిచూపేది, చాలా ఆకర్షనీయమైన విలన్ పాత్ర రూపకల్పన. విలన్ శక్తిసాహు వ్యక్తిత్వం,ఆదర్శం నీచమే అయినా, దానిలో అతను చూపే నమ్మకం, తాత్వికత ప్రేక్షకుల్ని ఆ పాత్రని గౌరవించేలా చేస్తాయి. ఆ పాత్రపలికే కొన్ని సంభాషణలు ఎంత intellectual గా ఉంటాయంటే, వాటికి ధియేటర్లో చప్పట్లు తప్పవు. అలాంటి విలన్ ని హీరో సినిమా మొత్తం చెప్పే ఆదర్శాల్ని మంటగలిపి తరిమితరిమి కొడుతుంటే, (అ)సహజంగా సానుభూతి విలన్ మీదకెళ్ళి హీరో హీరోయిజం కృతకంగా అనిపిస్తుంది. సాంకేతిక విభాగంలో అనిల్ భండారి సినెమాటోగ్రఫీ సినిమాకి చాలా సహాయం చేస్తే, ఎడిటింగ్ సినిమా గమనాన్ని దెబ్బతీసి ప్రేక్షకుల్ని విసిగిస్తుంది. ఈ సినిమాలో దాదాపు ప్రతిషాట్ నిడివినీ తగ్గించొచ్చని చెబితే ఆశ్చర్యపోనక్కరలేదు. మార్తాండ్ కె.వెంకట్ లాంటి సీనియర్ ఎడిటర్ ఇలా చెయ్యడం అర్థంకాని విషయం. లేదా తప్పు మొదటి సారిగా దర్శకత్వం వహించిన దంతులూరి చైతన్య దయినా అయ్యుండాలనిపిస్తుంది. మంచి పోరాటదృశ్యాల్లోకూడా షాట్ల నిడివి గమనిస్తే ఎడిటర్ కు దర్శకుడికీ మధ్య అస్సలు సమన్వయం కుదరలేదనే విషయం తేటతెల్లమవుతుంది. గంధం నాగరాజు మాటలు కొన్ని సహజంగానూ, మరికొన్ని కొటేషన్లు ఏరుకొచ్చి ఇరికించినట్లుగానూ, మరికొన్ని పాత్రలకు వన్నెతెచ్చేవిగానూ ఉన్నాయి. శ్రమకోర్చి, ఆలోచించి రాసారన్న నిజం “వినిపిస్తుంది”. ఆ శ్రమ అభినందనీయం. మణిశర్మ సంగీతం పాటల్లో పండితే, అనవసరంగా వచ్చే నేపధ్యసంగీతం కటువుగా ఉంటుంది. లిప్ సింక్ లేకుండా అన్నీ నేపధ్యగేయాలే ఉండటం ఒకపెద్ద రిలీఫ్. ప్రత్యేకత కోసం ప్రదమార్థంలో పోరాటదృశ్యాలు తెరపైన చూపించకుండా కేవలం జరిగిన భావనని కలిగించడం సినిమాలోని రక్తపాతం శాతాన్ని తగ్గించినా, ఎందుకో నవ్వొచ్చింది (ముఖ్యంగా రైల్వేస్టేషన్ పోరాటం)గానీ, ఆ “ప్రత్యేకత”ని ఆస్వాదించలేని పరిస్థితి కలిగింది. మెగానిర్మాత ఆశ్వనీదత్ భారీతన వారసత్వాన్ని వీడి, కుమార్తె ప్రియాంక నిర్మించిన ఈ చిరుచిత్రం ఒక నవీనపోకడగా అభినందనీయం. కానీ కథనం,పాత్రపోషణ మీద అవగాహనలేకుండా సాగిన ఈ ప్రయత్నం కొంత నిరాశని కల్పించిందని మాత్రం చెప్పక తప్పదు. దర్శకుడు చైతన్య ప్రధమ యత్నంగా ఇలాంటి కథను ఎన్నుకోవడం సాహసంగా ఒప్పుకున్నా, ఆ సాహసానికి సార్థకత చేకూర్చలేకపోయాడని ఒప్పుకోక తప్పదు. మళ్ళీ చాలా రోజులకు తెలుగులో ఒక సిన్సియర్ సినిమా తీసే ప్రయత్నం జరిగిందని ఈ సినిమా చూడమని రెకమండ్ చెయ్యాలా లేక నిరాశపరిచిందని వెళ్ళొద్దని చెప్పాలా తెలీని పరిస్థితిలో ‘బాణం’ నిలిపింది. అందుకే పదునున్నా ఈ బాణానికి గురిలేదు అని సర్ధుకోక తప్పదు. ******
Posted by Kathi Mahesh Kumar at 2:58 PM 1 comments
Labels: సినిమాలు
Wednesday, September 30, 2009
వింత కలయికల ‘తడి’- ఈరమ్ (తమిళ్)
ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మాణ సంస్థ ‘S picture‘ వైవిధ్యానికి పట్టంగట్టే నిర్మాణసంస్థగా మంచి గుర్తింపు పొందింది. ఈ సంస్థ నూతన చిత్రం, ‘అరివళగన్‘ దర్శకత్వం వహించిన “ఈరమ్“. ఈరమ్ అంటే తెలుగులో తడి లేదా చమ్మ అని అర్థం. ఒక అపార్ట్మెంట్ బిల్డింగులో రమ్య(సింధు మీనన్) అనే గృహిణి బాత్ టబ్ లో మునిగి చనిపోతుంది. అది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీస్ పరిశోధన ప్రారంభమవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్ రమ్య ఒకప్పుడు ప్రేమించిన వాసుదేవన్ (ఆది). రమ్య సూసైడ్ నోట్ లభించడం, చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళ సాక్ష్యాల ఆధారంగా పోలీసులు రమ్య చావునొక ఆత్మహత్యగా నిర్ణయిస్తారు. కానీ రమ్య వ్యక్తిత్వం తెలిసిన వాసుదేవన్ కు అది ఆత్మహత్య అని నమ్మబుద్ది కాదు. ఒక మిత్రుడి సహాయంతో సొంతంగా తనే ఇన్వెస్టిగేట్ చెయ్యడం మొదలెడతాడు. అదే సమయంలో ఆ అపార్ట్మెంట్ లో రమ్యతో పరిచయమున్న ఒక్కొక్కరూ చంపబడ్డం మొదలౌతుంది. ఈ అందరి చావులోనూ ఉపయోగపడిన ఆయుధం …నీళ్ళు…తడి. రమ్య ఎందుకు చనిపోయింది? రమ్య చావుకీ ఈ చావులకీ మధ్యనున్న సంబంధం ఏమిటి? వాసు ఈ రహస్యాన్ని బేధిస్తాడా అనేది మిగతా కథ. ఈ మధ్యనే నవతరంగంలో సినిమాల మూసల (Genre – జాన్రా) గురించి చర్చలు జరిగాయి. ఆ నేపధ్యంలో చూసుకుంటే, ఈ సినిమాని మర్డర్ మిస్టరీతో మొదలై హృద్యమైన ప్రేమకథగా రూపాంతరం చెంది, హఠాత్తుగా మానవాతీతశక్తుల సినిమాగా పరిణితిచెందే ఒక ధిల్లర్ అనుకోవచ్చు. ఇన్ని మూసలు కలిపిన మసాలా మిక్స్ లాగా అనిపించినా, అన్ని మూసల్నీ సరైనపాళ్ళలో కలిపి కన్విన్సింగా చెప్పగలగటం వలన ఒక మంచి సినిమాగా తయారయ్యింది.ముఖ్యంగా హారర్ ఎలిమెంట్ ని ధ్రిల్లర్ పంథాలో నడిపి, ఎక్కడా జుగుప్స కలగకుండా దర్శకుడు చూపించిన విధానం అభినందనీయం. భద్రాచలం లాంటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సింధు మీనన్ (చందమామ ఫేమ్), రమ్యపాత్రలో చాలా మంచి నటన కనబరిచింది. చాలా అందంగా కూడా కనిపించింది. ‘మృగం’ చిత్రంలో తన భీకరమైన నటన కనబరిచిన ఆది(దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు) చాలా అండర్ ప్లే ఉన్న వాసుదేవన్ పాత్రలో రాణించాడు. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. రమ్య భర్త ‘బాల’గా నందా నటన ఆకట్టుకుంటుంది. రమ్య చెల్లెలిగా శరణ్య మోహన్ పాత్రోచితంగా నటించింది. ముఖ్యంగా రమ్య తనని ఆవహించినప్పుడు చేసిన నటనని మెచ్చుకోవచ్చు. సినిమాలో చాలా భాగం వర్షం పడుతూవుంటుంది. ఆ మూడ్ ని సినెమాటోగ్రఫీ విభాగం(మనోజ్ పరమహంస) మనసుకి హత్తుకునేలా చిత్రీకరించింది. నేపధ్యసంగీతం చాలా బాగున్నా, పాటల్లో కొంత మోనాటనీ ధ్వనిస్తుంది. ఇది ఔట్-అన్డ్-ఔట్ దర్శకుడు ‘అరివళగన్‘ చిత్రం. భారతీయ సినిమాల్లో ధ్రిల్లర్లు వచ్చేదే చాలా అరుదు. అదీ ఇంత మంచిది రావడం అత్యంత అరుదు. కాబట్టి… అర్జంటుగా చూసెయ్యండి. ****
Posted by Kathi Mahesh Kumar at 3:33 PM 6 comments
Labels: సినిమాలు
Tuesday, September 29, 2009
పరమసత్యాన్ని మించిన సత్యం !!!
ఈ టపా గురించి కొన్నివ్యాఖ్యల్లో ఎవరో అజ్ఞాత reference ఇస్తుంటే...ఇంకోసారి పోస్టు చేస్తున్నా... ఈ టపా ఆగష్టు,2008 లో మొదటిసారిగా ఈ బ్లాగులో పోస్టు చెయ్యబడింది. సిద్దార్థుడు నిద్రపోతున్న భార్యాపిల్లల్ని వదిలి సత్యశోధనకై అడవుల్లో ప్రయాణించి ‘గయ’ చేరుకున్నాడు. బోధివృక్షం కింద జ్ఞానోదయం అయింది. ‘పరమసత్యం’ (Ultimate Truth) అవగతమయ్యింది. సత్యాన్ని కనుగొన్న ఉత్సాహం... ఎవరికైనా తెలియజెప్పాలన్న ఆతృత. సారనాధ్ తన మొదటి ప్రవచనానికి సిద్దమయ్యింది. ఐదుగురు శిష్యులు గౌరవంగా చేతుజోడించి ఎదురుగా నిల్చున్నారు. "నిజంగా సత్యాన్ని అవగతం చేసుకుని బుద్ధుడి మారిన సిద్దార్థుడికా ఆ గౌరవం? లేక, ఇన్నికష్టాలు అనుభవించి రాజ్యాన్నీ, పెళ్ళాంపిల్లల్నీ అంత:పురంలో వదిలి అడవులపాలై తిరిగివచ్చిన ఒక సాధకుడిగా ఆ గౌరవం?" ఈ ప్రశ్నకి సమాధానం బుద్ధుడితో సహా ఎవరికీ తెలీదు. నిజమే, "ఐతే ఏమిటి?", "ఐతే ఎలా?" అప్పుడే తను పొందిన జ్ఞానంలోంచీ మరో వెలుగురేఖ ఉదయించింది. ‘అష్టాంగమార్గం’. ఎలా కోరికల్ని త్యజించాలో తెలియాలి. దానికి మార్గం అవగతం కావాలి. అయ్యింది. అదే మరోక మూలసూత్రం. మొదటి మూడింటితో కలిపి ఇప్పుడు నాలుగు.దు:ఖాలనుండీ విముక్తికి ఒక మార్గముంది, అదే అష్టాంగమార్గం. సత్యావగాహన (Right Understanding), సత్యాలోచన (Right Thought), సత్యవాక్కు (Right Speech), సత్యప్రవర్తన (Right Action),సత్యజీవని (Right Livelihood), సత్యయత్నం (Right Effort),సత్యయోచన (Right Mindfulness), సత్యఏకాగ్రత(Right Concentration). తను పెదవి విప్పింది."ప్రపంచంలో ఒకే పరమసత్యం ఉన్నప్పుడు, అది అంత:పురంలో లేకుండా అడవిలో ఎలా దొరుకుతుందనుకున్నావు?". అంత సత్యం తెలిసిన బుద్దుడికి నోటమాట లేదు. సత్యం తెలిసిన బుద్దుడు నిజంకోసం వెతుకుతున్నాడు. తెలిసింది. "సత్యం ఎక్కడ దొరుకుతుందో నాకప్పుడు తెలీదు. ఒక్కటే తెలిసేది. అంత:పురంలో నన్ను సత్యన్ని చూడకుండా కట్టడి చేసారని. అందుకే అక్కడినుండీ పారిపోయాను. భార్యాబిడ్డల భాద్యత ఒక మనిషిగా నాకున్నాయని తెలుసు. అయినా సత్యశోధన బలం నన్ను ఈ బంధాలను త్యజించేలా చేసింది." యశోధర నవ్వినట్లనిపించింది. యశోధరకి పరమసత్యానికి మించిన సత్యమేదో తెలుసని బుద్దుడి మనసుకు అనిపించింది. "నిజంగా తెలుసా...!!! ఎలా అడగాలి?". "నా దగ్గర నా కొడుకుతప్ప ఇంకేమీ లేదు.తననే నీకు ధారాదత్తం చేస్తున్నాను. రాహుల్ తనదైన సత్యాన్ని కనుగొంటాడని కోరుకుంటాను.ఈ ప్రపంచంలో మరో యశోధర జన్మించకుండా ఆ సత్యం వుంటుందని ఆశిస్తాను." అది భార్యభర్తని ఎత్తిపొడిచినట్టుగా లేదు. ఒక జ్ఞాని తన శిష్యుడిని మందలించినట్టుగావుంది. బుద్దుడికి ఎలా అనిపించిందో తెలీదు. "పరమసత్యాన్ని గ్రహించినవాడివి వాటిని ప్రజలకు తెలియజెప్పాలని లేదా?" అని వీలైనంత శాంతంగా అడిగాడు. "తండ్రీ ! నన్ను మీకు అప్పగించేముందు నా తల్లి నాతో కొన్ని మాటలు చెప్పింది. నీ తండ్రి చెప్పిన దారిలో పయనిస్తూ ‘విశ్వజనీయమైన పరమ సత్యాన్ని’ (Universal Ultimate Truth) కాక నీదంటూ ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సత్యాన్ని’ (Personal Truth) తెలుసుకో. ఎందుకంటే, ఒక సారి విశ్వజనీయమైన సత్యాన్ని గ్రహించిన పిదప ఆ సత్యాన్ని అందరూ గ్రహించాలని కాంక్షిస్తావు. కానీ అది అసాధ్యం. ప్రతిమనిషీ తనదైన సత్యాన్ని తెలుసుకుంటేతప్ప నిర్వాణాన్ని అందుకోలేడు. విశ్వజనీయమైన సత్యాన్ని వేరొకద్వారా వింటే మనిషికి అర్థం కాదు. సత్యంయొక్క మహత్తు తెలిసినతరువాత ఆ సత్యాన్ని త్వరగా పొందాలని ఆశించే స్వార్థం ప్రారంభమవుతుంది. ఆ స్థితిలో అష్టాంగమార్గం శూన్యమై దానికి విపరీతమైన లక్షణాలు అలవడుతాయి" అని చెప్పాడు రాహుల్. అప్పుడు ఈ సందేహాస్పద తధాగతుడిని చూసి రాహుల్ "శాక్యమునీ ! నీ ఆలోచన నాకు అర్థమయ్యింది. ప్రపంచం నీ పరమసత్యాన్ని అర్థం చేసుకోలేదు. ఈ ప్రపంచం ఎప్పటికీ అర్థం చేసుకోదుకూడాను. కానీ నీ బోధనలవలన కొన్ని విప్లవాత్మక పరిణామాలు జరిగాయని మర్చిపోకు. కొన్ని వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన పేదలు, దళితులూ ఈ వ్యవస్థని మొదటిసారిగా ప్రశ్నించారు. హిందూమతంలోని సామాజిక దురాచారాలనీ, మూఢాచారాలనీ సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. త్యజిస్తున్నారు. పరమసత్యాన్ని వారు అందుకోలేకపోయినా సత్యం కానిదాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తిస్తున్నారు, నిరసిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యక్తిగత సత్యాన్ని సాధించటానికి గల ఉత్తమమైన మార్గం. నువ్వు చూపినదారి ఇంకోదారిని వెతుక్కుంది. ఈ దారి పరమసత్యాన్ని అందించకపోయినా, మెరుగైన జీవితాన్ని ఖచ్చితంగా అందిస్తుందు. అదే వ్యక్తిగత సత్యం. అదే ఇప్పుడు కావలసింది. నిజంగా కావలసింది దు:ఖం లేని జీవితంకాదు. పోరాడి సాధించుకునే హక్కులూ,స్వతంత్ర్యం." అన్నాడు.
సత్యాన్ని తెలుసుకోవడంద్వారా అనుభవించిన అలౌకిక ఆనందాన్ని, అవగతం చేసుకున్న పరమసత్యాన్ని ఎలా మాటల్లో చెప్పాలో బుద్దుడికైనా తెలిసేనా ! అనుభవానికి పదాలుకూర్చడం ముక్కుమూసుకుని ధ్యానిస్తే వచ్చేనా! మెల్లగా పెదాలు విడిపడ్డాయి...జీవితం దు:ఖమయం...కోరికలు దు:ఖానికి మూలకారణం...కోరికల్ని త్యజిస్తే దు:ఖాలు అంతమైపోతాయి. ఎదురుగా నించున్న శిష్యుల్లో ఎలాంటి చలనమూ లేదు. కనీసం కళ్ళలో ఈ పరమసత్యాన్ని తెలుసుకున్న ఆనందంకూడా ప్రతిఫలించడం లేదు. "ఇదేకదా నేను ఇన్నాళ్ళ ధ్యానంలో తెలుసుకున్నది. మరి సత్యం మరెవ్వరికీ అర్థం కాదా?" ఒక self doubt ఉదయించింది. పరమసత్యం అవగతమైనా, సందేహాలు తప్పవా! ఏమో!
పరమసత్యాన్ని తెలుసుకోవాలంటే అందరూ ధ్యానం చెయ్యాలా? దేన్ని ధ్యానించాలి? ఎంతకాలం ధ్యానించాలి? ఎలాధ్యానించాలి? ఎన్నో ప్రశ్నలు. తనే విడమర్చి చెబితే ! ప్రయత్నించాడు. చిన్నచిన్నఊర్లూ, పెద్దపెద్ద పట్టణాలూ అన్నీ తిరిగాడు. ప్రజలందరికీ ఈ సత్యాన్ని విప్పిచెప్పాడు. కొందరు అర్థమయ్యిందని తలలూపారు. శిష్యులు మరింత శ్రద్ధగా తలాడించారు. మరికొందరు, "ఐతే" అన్నట్లు ప్రశ్నార్థకంగా ముఖాలుపెట్టారు.
మార్గం చెప్పగానే వానవెలిసిన స్పష్టత ఏర్పడినట్టుంది. తేటగా కనబడుతున్న ప్రజల ముఖాలు, "ఇదే సరైన దారి" అన్నట్లు శిష్యుల కళ్ళూ. సత్యశోధన బోధించడానికి దారి లభించింది. సులభంగా అర్థమయ్యేలా అవగతం చేసే మార్గం లభించింది. అప్పుడే ‘సంఘం’ ఏర్పడింది. ఈ దారిని నమ్మి ప్రయాణించే ప్రయాణికుల సమూహం. అదే సమయంలో ‘కపిలవస్తు’ నుండీ పిలుపువచ్చింది. బుద్దుడికళ్ళలో సందిగ్ధత. "తనది ఇంకా చిన్నతనమని తండ్రి అనుకుంటున్నాడేమో!" అని. ఏంత పెద్దవారైనా తల్లిదండ్రులకు ఎప్పటికీ చిన్నపిల్లమే కదా. భార్య యశోధర "ఎందుకిలా చేసావంటే, సమాధానం?". కొడుకు "నాన్నా...అంటే నువ్వేనా?" అని అడిగితే. ఇవే ఆలోచనలా, లేక వారికీ సత్యాన్ని చూపించాలనే తపనా ! అరమూసినకళ్ళలో అటు సందిగ్ధత ఇటు తపనా కనిపించకపోతే చెప్పేదెలా.
యశోధర వచ్చింది. ఎదురుగా నిలుచుంది. ఒకప్పుడు ప్రేమించిన దేహం. చుంబించిన నుదురు. ఒళ్ళంతాకప్పుకున్న జుట్టు. వెలిగే కళ్ళు. కానీ ఇప్పుడు. మారిపోయింది. చాలామారిపోయింది. "మార్పుకు కారణం నువ్వే" అన్నంతగా మారింది. నిలదీస్తుందో...నిందిస్తుందో తెలీదు.
"బౌద్ద విహారానికొచ్చావు, ఏదైనా భిక్ష ఇవ్వకుండానే వెళ్ళిపోతావా?" అన్నాడు. కనీసం భిక్షగా అయినా పరమసత్యాన్ని మించిన సత్యాన్ని పరిచయం చేస్తుందేమో అన్న ఆశ.
రాహుల్ మంచి శిష్యుడిగా ఎదుగుతున్నాడు. ఇప్పుడు ఎక్కడికి బుద్దుడు వెళ్ళినా ప్రజలు అగరొత్తులతో స్వాగతిస్తున్నారు. అతన్ని కీర్తిస్తూ గానం చేస్తున్నారు.దేవుడంటూ అభిమానిస్తున్నారు. తన ఆశీర్వాదంతొ మోక్షం పొందొచ్చనుకుంటున్నారు. ధనవంతులు విహారాలనూ, ఉద్యానవనాలనూ బుద్దుడికి గౌరవంగా నిర్మించి నిర్వాణం పొందొచ్చనుకుంటున్నారు. ఈ మార్పులు బుద్దుడికి అస్సలు అర్థం కావటం లేదు. తను చెప్పిన పరమసత్యంకన్నా, తానెప్పుడు ప్రాముఖ్యత సంతరించుకున్నాడో అవగతం కాని దశ. ఎవరినీ ప్రశ్నించలేని, గద్దించి జవాబు అడగలేని స్థితి. ఏంచెయ్యాలో తెలీని పరిస్థితి.
ఇలాంటి తరుణంలో రాహుల్ బుద్దుడి దగ్గరికొచ్చాడు. " నాకు పరమసత్యం అవగతమయ్యింది" అన్నాడు. తన ముఖవర్ఛస్సూ చుట్టూ ప్రతిఫలించే కాంతీ అది నిజమని చెప్పకనే చెబుతున్నాయి. బుద్దుడు మరోమాట మాట్లాడేలోపు రాహుల్ "నేను మళ్ళీ రాజ్యానికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది" అన్నాడు. బుద్దుడి కళ్ళలో ఆశ్చర్యం.
మరోసారి బుద్ధుడికి జ్ఞానోదయం జరిగింది. "ఇదే పరమసత్యానికి మించిన సత్యం" అని అవగతమయ్యింది. "కానీ ఇప్పటివరకూ తాను చేసింది !" అనే సందేహంతోపాటూ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలోని రహస్యం బోధపడినట్లయ్యింది.
తధాగతబుద్ధుడు మందస్మితుడైవున్నాడు. పరమసత్యాన్ని మించిన సత్యాన్ని గ్రహించిన యశోధరకు ప్రణమిల్లుతున్నాడు. రాహుల్ తన వ్యక్తిగత సత్యాన్ని తనలోనే వుంచుకున్నాడు. లోకం మారింది కానీ బుద్దుడు అనుకున్నట్లుగా కాదు. పరమసత్యం ఇప్పటికీ ఎవరికీ తెలీదు.
*మైధిలీ శరణ్ గుప్త్ రాసిన ‘యశోధర’ కవితకు నా సొంతపైత్యం జోడించి.
Posted by Kathi Mahesh Kumar at 2:54 PM 6 comments