నీ తర్కం కాదనలేనని తెలుసు
అందుకే…
కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు
నీ ప్రేమను ప్రశ్నించే సాహసం చెయ్యలేను
అందుకే…
నా ప్రేమను కాదన్నా నొచ్చుకోలేదు
నీ మౌనాన్ని ఛేదించాలనుకోలేదు
అందుకే…
నీ నిశ్శబ్ధాన్ని మౌనంగా విన్నాను
అయినా వసంతం రానేవచ్చింది...
నా మదిలో, కోయిల స్థానంలో
నీమౌనం కూసింది
మూగబోయిన మనసూ
ప్రాణం లేని తనువూ
వసంతం సాక్షిగా ఇక…
చిగురించే సాహసం చెయ్యలేవు
****
9 comments:
@ మహేష్ గారు..
కవిత్వం బాగుందోచ్ !!!
Exact expression of my feelings great.Same pinch okka saari gichhu konde mari.Same feelingto alochistunna ave kanapaddayi anukokunda.
"నీ మౌనాన్ని ఛేదించాలనుకోలేదు
అందుకే…నీ నిశ్శబ్ధాన్ని మౌనంగా విన్నాను"
మూగ మనసుల మౌన రాగాలు simply superb.
కత్తి లా ఉంది అండి ,కత్తి మహేష్ గారు. మీరు కూడా కత్తిలాంటి కవి అన్నమాట.
నాకు బాగా నచ్హిన వరస/ప్రాస
********************
నీ తర్కం కాదనలేనని తెలుసు
అందుకే…
కారణం అడిగే ధైర్యం చెయ్యలేదు
చాలా బాగుంది.
ప్చ్ ..మౌనం కూయడం ఏమిటో ?
మౌనం కూసింది!!! మౌనం కోస్తుంది కదా?
మీరు ఇంత బాగా కవిత్వం కూడా రాస్తారని తెలీదు. :)
చాలా బాగా రాసారు.
చాలా బాగుంది
కవిత్వంలో
మౌనం మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది, కూయవచ్చు కూడా. :-)
Post a Comment