Tuesday, April 28, 2009

తమిళజాతీయత - శ్రీలంక

‘తమిళజాతీయత’ పేరుతో శ్రీలంక సమస్యని, తమిళనాడు రాజకీయ సమస్యగా మార్చేసారు. ఇన్ని సంవత్సరాల తరువాత టైగర్ ప్రభాకరన్ శ్రీలంక ఆర్మీకి కనుచూపుమేరలో కనిపిస్తున్న తరుణంలో,కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి "యుద్ధం" ఆపే సలహా ఇవ్వాలని కరుణానిధి పట్టుబడుతున్నాడు.

తమిళ ప్రజలపై సింహళ ప్రజల దౌష్ట్యాలు చరిత్ర ఎరగనిది కాదు. మరోవైపు తమిళ ప్రజలకోసం పోరాడుతూ ఒక ఉగ్రవాద సంస్థగా ఎదిగిన LTTE ఉన్మాదంకూడా జగద్విదితమే.

భారతదేశం మొదట్నుంచీ శ్రీలంక విషయంలో "అతి"గానే వ్యవహరించింది. ఒకప్పుడు తమిళ టైగర్ల శిక్షణా శిబిరాలు భారతభూభాగంలో ఉంటే మిన్నుకుండి పరిస్థితి చేజారేసరికీ, PKF ను శ్రీలంక సైన్యానికి మద్ధతుగా పంపి భారతదేశ సైనిక చరిత్రలోనే ఒక ప్రమాదకరమైన అధ్యాయాన్ని రచించింది. పులినెక్కి స్వారీ చేసి, దిగేసి ఎదురు తిరిగిన ఫలితం...రాజీవ్ గాంధీ దారుణహత్య. ఈ చరిత్ర నుంచీ మనం ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉందేమో!

కరుణానిధి ఆకస్మిక నిరాహారదీక్షతో కేంద్రం ఉలిక్కిపడింది. కానీ, తెలివిగా శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం ముగిసిందనే స్టేట్మెంట్ ఇప్పించి అటు కరుణానిధిని మంచి చేసుకుంటూనే, రాజకీయలబ్ధిని చేకూర్చింది. జయలలిత తమిళ్ ఈలం ఏర్పాటు చేస్తానన్న మాటతరువాత, ఈ రకమైన political posturing కరుణానిధికి చాలా అవసరం. లేకపోతే, శ్రీలంక తమిళులపై సానుభూతి కలిగిన తమిళ ప్రజలు కరుణానిధికి రాజకీయ సమాధి కట్టినా కట్టగలరు.

ఈ రాజకీయ నాటకాన్ని పక్కనబెడితే, అత్యంత దయనీయమైన స్థితి ఒకవైపు తమిళ్ టైగర్ల మధ్య మరోవైపు శ్రీలంక సేనలమధ్య కొట్టుమిట్టాడుతున్న సామాన్య ప్రజలది. దాదాపు 5 లక్షల మంది ఈ కల్లోలంలో చిక్కుకుని అలమటిస్తున్నారు. వీరిని రక్షితప్రదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకుంటున్న టైగర్ల దౌర్జన్యం దారుణమైతే, తక్షణ సహాయం అందకుండా అంతర్జాతీయ సహాయాన్ని నిలువరిస్తున్న శ్రీలంక ప్రభుత్వానిది మరో దాష్టీకం.

భారతప్రభుత్వం 100 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇతర దేశాలు, ఐక్యరాజ్య సమితి,రెడ్ క్రాస్ తమ సహాయంతో శ్రీలంకను చేరుకున్నాయి. ఆక్స్ ఫామ్ వంటి స్వచ్చంధ సంస్థలుకూడా తమ వంతు సహాయార్థం వచ్చాయి. ప్రభాకరన్ పట్టుబడే అవకాశాలు కనిపించడం. చాలా వరకూ తమిళ్ ఈలం ఆక్రమిత భూభాగాన్ని శ్రీలంక సైన్యం సొంతం చేసుకోవడంతో ఈ ప్రజలకు సత్వర సహాయం అందుతుందని ఆశిద్ధాం.

*****

6 comments:

Dil said...

ప్రభాకరన్ ను హతమార్చినా, బంధించినా అది శ్రీలంక ప్రభుత్వానికి తాత్కాలిక విజయమే అవుతుంది. మూల సమస్య ఉన్నంతకాలమూ మరో నేత, మరో ఉద్యమమూ పుట్టుకొస్తూనే ఉంటాయి.

దిలీప్

Sujata said...

It is widely believed that this is not the end of neither Prabhakaran nor LTTE. Nor it is the end of Tamil cause in Lanka. LTTE has always lost and won territories in the past. The real challenge for Lankans is to preserve what they won so far.

కన్నగాడు said...

"భారతదేశం మొదట్నుంచీ శ్రీలంక విషయంలో "అతి"గానే వ్యవహరించింది."
చిన్న దేశం, మనపై ఆధారపడే దేశం, లోకువ కాక మరేమిటి?
ప్రపంచాన్నే గడగడలాడించే తాలిబాన్ల దగ్గర కూడా లేనంత ఆయుధ సంపత్తి(వైమానిక దళం, నౌకా దళం) LTTE దగ్గరకి ఎక్కడి నుండి వచ్చింది. దీని వెవక తమిళ ప్రబుత్వాల హస్తముందా?

Anonymous said...

@కన్నగాడు: You raise a good point. But pointing at wrong direction. With money any one can buy those things in international market.

Praveen's talks said...

ప్రభాకరన్ సముద్ర మార్గంలో తప్పించుకుని పారిపోయి ఉండొచ్చు కానీ ప్రభాకరన్ ఎప్పటికైనా శ్రీలంకకి తిరిగివచ్చి విజయ పతాకం ఎగరేస్తాడు.

தமிழ் தமிழ் said...

Hi

Kindly write about the 3 Lakh Tamils kept in Concentration Camps there in Lanka.

I request my Telugu Brothers to read the Eelam Struggle.

Thanks