మతం అనేది ప్రతి సమాజం తన ఉనికిని కాపాడుకోవడానికి ఏర్పరిచే కట్టుబాట్ల చిట్టా (Rule book).అది సమయానుగుణంగా మారుతుంది. ఏ మతమైనా “Thou shall not do this,do that” అని ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెబుతుంది.అందుకే అదొక rule book అన్నాను. మీకు మరీ తేలిగ్గా అనిపిస్తే అదొక “మతపరమైన రాజ్యాంగం” అనికోవచ్చు. అది నా నిర్వచనం.
దేవుడెక్కడున్నాడో చెబితే,ఆ అతరువాత చేరుకునే మార్గం దానంతట అదే దొరుకుతుంది. ఒకవేళ అదే మతం యొక్క నిర్వచనమైతే, ప్రస్తుతానికి నాకు దాని అవసరం లేదు.భగవంతుదితో నాకు ప్రత్యేకమైన పనేమీ లేదు. నామటుకు మనిషి ఎలా సుఖశాంతులతో బ్రతకాలో తెలిపేది ఏదైనా మతమే. ఏమతంలో ఈ అంశాలున్నా వాటిని స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు.
నేను వ్యతిరేకించేది మూఢాచారాల్నీ,మూఢనమ్మకాలని,అమానవీయ పద్ధతులను. మతం దానికి మూలంగా కనబడితోంది కాబట్టి, దాని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తాను. అంతే తప్ప కేవలం వ్యతిరేకించడం కోసం మతాన్ని వ్యతిరేకించడం మరో మూఢత్వం కాబట్టి, నేను అలాంటి ధృక్పధాన్ని దరిజేరనివ్వను.
‘జీర్ణక్రియని ఆధారాలతోసహా స్వయంగా తెలుసుకుంటేగానీ మనిషి ఆహారం తినడానికి అర్హుడు కాదు’, అంటే బాగుంటుందా? మతం మొత్తాన్ని తెలుసుకునిగానీ మీరు గుడికెళ్ళరా?మరి నేను మతాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రం "అరతెలివి" అంటే ఎట్లా?!?
****
15 comments:
శంకరాభరణంలో శంకర శాస్రి చెప్పినట్లు కుల మతాలు,ఆచార సాంప్రదాయాలు మనుషుల్ని కట్టుబటులో ఉంచడానికీ,ఒక సక్రమమయిన మార్గంలో నడిపించడానికే గానీ వాటి పేరుతో కొట్టుకు చావడానికి కాదన్నది నా విస్వాసం కూడా...
భగవంతుదితో నాకు ప్రత్యేకమైన పనేమీ లేదు.
శెహభాషో...
evadi pichhi vaadiki aanandam......naa pichhi naaku mee pichhi meeku.........evvaru vere vadi cheppedi artham chesukovadam ala vunchu vinanu kooda vinaru........tame goppa anukuntaaru.........
హిందూత్వ గురించి మీరు వ్రాసిన వ్రాతలు వివాదాస్పదమవ్వడం వల్ల పాపులారిటీ పోగొట్టుకున్న మీరు మీ పాపులారిటీని తిరిగి రివైవల్ చేసుకోవడానికి ఈ వ్యాసం వ్రాశారా?
@ప్రవీణ్: నాకు పాప్యులారిటీ వచ్చిందో, ఉందో,పోయిందో నేనెప్పుడూ ఆలోచించిన విషయాలు కావు. వాటిని బట్టి బ్లాగులో టపాలు రాసే అలవాటూ నాకు లేదు. మనకు తోచింది, అనిపించింది రాసెయ్యడమే మన తరహా.
అయినా ఈ టపాలో నా "వివాదాస్పద"టపాలకు విపరీతంగా డ్యామేజ్ కంట్రోల్ కోసం రాసిన విషయం ఏముందబ్బా!
మతమంటే .. వేరు కాదు.. మన ఆభిమతమే .. ఇది నా నిర్వచనం
thanks for sharing..
ఈ టపా చదివితే మతం విషయంలో మీరు కొంచెం వెనక్కి తగ్గినట్టు కనిపించింది. నేను చాలా మంది నాస్తికులు గురించి చదివాను. వాళ్ళలో ఎక్కువ మంది క్రైస్తవ, ఇస్లాం మతాలు వదిలి వచ్చిన వాళ్ళు. హిందూ మతం వదిలి నాస్తికత్వంలోకి వచ్చిన వాళ్ళు తక్కువ. నేను కూడా హిందూ మతం వదిలి నాస్తికత్వంలోకి వచ్చినవాడినే. కానీ మాజీ హిందువులలో నాస్తిక భావాలు అంత బలంగా లేకపోవడం నేను గమనించాను.
అరతెలివా? ఆరోతెలివా? ఎదో బాగున్నట్టుందే. :-) ఏమతమయినా దానిదైన రేషనాలిటీని వదిలి మూఢంగా నమ్మమంటే పనికిరానిదే.
అసలేమీ ఆలోచించకుండా గురువో, లేక బుక్సో చెప్పింది చేయమంటం చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. వాళ్ళు చెప్పింది చేయాలన్నా మనం ఆలోచించక తప్పదు.
అందుకే నా దృష్టిలో ’నా ఆలోచనే నా మతం’
ఆరోతెలివి (సిక్స్త్ సెన్స్) అన్నది అదేదో దైవ ఘటనగా చెప్పేవారున్నారు. కానీ అది కాది. ఒక విషయం గురించి చాలా passionate గా ఆలోచిస్తే ఆ క్షణానికి మనకి తెలియకుండానే ఆ విషయాలకి సంబంధించిన సమాచారం (either future or past) తెలిసేందుకు అవకాశమ్ ఎప్పుడూ ఉంటుంది.
>>కేవలం వ్యతిరేకించడం కోసం మతాన్ని వ్యతిరేకించడం మరో మూఢత్వం కాబట్టి, నేను అలాంటి ధృక్పధాన్ని దరిజేరనివ్వను.
*** *** ***
బావుందికానీ కొన్నిసార్లు కేవలం వ్యతిరేకించేందుకే వ్యతిరేకించినట్లు కనిపించింది. (మరొకసారి చదువుతాను. నేనన్నది పొరబాటైతే, నా వ్యాఖ్యని సమర్ధించుకునే ఆధారాన్ని చూపలేనిదే ఈ మాటలని ఉపసంహరించుకుంటాను).
>>‘జీర్ణక్రియని ఆధారాలతోసహా స్వయంగా తెలుసుకుంటేగానీ మనిషి ఆహారం తినడానికి అర్హుడు కాదు’, అంటే బాగుంటుందా? మతం మొత్తాన్ని తెలుసుకునిగానీ మీరు గుడికెళ్ళరా?
*** *** ***
ఈ మాటలెందుకో కన్ఫ్యూజన్ గా అనిపిస్తున్నాయి. కాస్త వివరిస్తారా?
@గీతాచార్య: నేను వ్యతిరేకించినప్పుడల్లా I have a reason to do so. కాబట్టి కేవలం వ్యతిరేకించడానికి నేను వ్యతిరేకించను.
నా మాటలకు అర్థం మొత్తం విషయాన్ని తెలుసుకుంటేగానీ వాటిని నిరసించేహక్కు లేదన్న తరహా వాదన వ్యర్థమని మాత్రమే. మతగ్రంధాలన్నీ తెలీకుండా మనం గుడికెళ్ళామా! అలాంటప్పుడు నిరసించాలంటే మొత్తం మతం తెలిసుండాలని అనుకోవడం ఎందుకు అని ప్రశ్నించాను.
మతమ్ మంటే ఒక వ్యక్తి అభిప్రాయము.లేక ఆయన నమ్మిన సిద్ధాంతము. అందుకనే మనమప్పుడప్పుడూ వాని మతం వేరురా ! అని అంటుంటాము . ఆ అభిప్రాయము సృష్టికంతకూ వర్తించకపోవచ్చు. కానీ ధర్మం వేరు. ధర్మం సృష్టికంతకూ వర్తిస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది ధర్మం. మన ఇష్టాయిష్టాలతో దానికి పనిలేదు అది సత్యం .అదేధర్మం.ఈ పవిత్ర భారతభూమి పైనున్నది ఆధర్మమే.దీనిలో ఎంతోమంది మహాత్ములు తమ సిద్ధాంతాలతో[తమ మతాలతో]ఈధర్మాన్ని సుసంపన్నంచేశారు..విశ్వంలోని మహాత్ములంతా ఈ ధర్మములోని సత్యాంశాలనే విభిన్నరీతులలో మానవాళికి అందజేశారు.
మతాన్ని నమ్మేవాళ్ళందరూ ఇంద్రియం (organ) తో అనుభవం పొందలేని శక్తులున్నాయని నమ్ముతారు. దేవుడు కూడా ఇంద్రియానికి అందని శక్తే. మత భక్తులు అతీంద్రియ శక్తుల్ని నమ్మకపోవడం జరగదు. ఎవడైనా నేను మతాన్ని నమ్ముతాను కానీ అతీంద్రియ శక్తుల్ని నమ్మను అని అంటే అతనికి మతం గురించి తెలియదనే అనుకోవాలి.
'భగవంతునితో నాకు ప్రత్యేకమైన పనేమీ లేదు ' అని చెప్పడం సరికాదు. భగవంతుడంటూ ఒకరు ఉన్నారు అన్నతర్వాత మన స్వంత ఇష్టాలకు ఆమోదం ఉండకపోవచ్చు. మీ మాటలు , అభిప్రాయాలు నాకు ఎలా అర్ధం అవుతున్నాయంటే నాకు సిగరెట్లు త్రాగడం తప్పు అని తెలుసు కానీ ప్రస్తుతం త్రాగుతున్నాగానీ ఎప్పుడో ఒకప్పుడు మానేస్తాను అన్నట్లుగా అనిపించింది. కొన్ని అలవాట్లు అంత తేలిగ్గా వదలవు. సిగరెట్లు త్రాగడం , మందు కొట్టడం, సీరియళ్ళు చూడడం, స్నానం చెయ్యడం, తలకు నూనె పెట్టుకొని చక్కగా దువ్వుకోవడం, రోజూ షేవింగ్ చేసుకోవడం, దేవాలయానికి వెళ్ళడం, దేవునికి దండం పెట్టుకోవడం, దేవునికి చందాలివ్వడం, ముష్టివారికి దానం చెయ్యడం ... ఇలా మనకు అనేక అలవాట్లు ఉంటున్నాయి. ఈ అలవాట్లు తప్పు అని తెలుసుకోవడం ఎంతకష్టమో దేవుదు లేడు అని ఆలోచన చెయ్యడం కూడా అంతే కష్టం. అరే ఇందులో తప్పేముందీ అని మనం ఆలోచిస్తున్నంత కాలం మనం ఆస్తికవాదులమే. దేవుడు లేడు అని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చినంత మాత్రాన నాస్తికులు కాలేరు. ప్రతి విషయాన్ని ప్రశ్నించు కోండి. నా ఉద్ధేశ్యం లో ఆస్తికవాదానికీ, నాస్తికవాదానికీ తేడా ఒక్కటే.నాస్తికవాదంలో అబద్ధానికి చోటులేదు.
మతం వల్ల వచ్చే సమస్యలు తెలియక మునుపే దేవుణ్ణి నమ్మినా కూడా మతమెప్పుడూ అవసరమనిపించలేదు. ఎందుకో నా మనసులో చాలా ఉదాసీనత ఈ విషయం పట్ల....హాస్టల్లో ఉండటం మూలాన అనుకుంటాను. ఎప్పుడైనా బాధ కలిగితే దేవుని పై కోపం చూపించటమే. అంతే.
ముస్లింలు నిరాకరించిన సైతాను ప్రవచనాలు (Satanic verses) గురించి ఫ్రెంచ్ చరిత్రకారుడు Maxime Rodinson వ్రాసినవి చదవండి. పరిణామ క్రమంలో మత నమ్మకాలు ఎలా మారుతుంటాయో అర్థమవుతుంది.
Post a Comment