రతన్ టాటా నానొ కార్ గురించి చెప్పినప్పటి నుండీ మన తెలుగు బ్లాగుల్లో చిట్టిపొట్టి కవితలు నానొల రూపంలో దర్శనమిస్తున్నాయి. వీటినే అక్కడక్కడా "హైకులు" గా వ్యవహరించినట్లు గుర్తు. ‘వాక్యాల్ని విరగదీసి,విడదీసి వరుసగా పేర్చేస్తే కవిత్వమౌతుందా?’ వంటి ప్రశ్నలే ఈ నానోలకూ పడ్డాయి. కొందరు వింతకవితా ప్రక్రియగా అభిమానిస్తే, మరికొందరు మరుగుజ్జు కవితలు అవసరమా అని ప్రశ్నించారు. మరొకరు ఏకంగా, "నానోల స్ఫూర్తితో నేను 'నోనో'లు కనిపెట్టా.. " అన్నారు.
ఈ నేపధ్యంలో You tube ప్రయాణం చేస్తుటే ప్రముఖ హిందీ కవి,రచయిత, దర్శకుడు ‘గుల్జార్’ గారి కవితా ప్రయోగాన్ని చూశాను. మూడు పాదాలుండే ఈ బుల్లి కవితల్ని ఈయన "త్రివేణి" అని ముద్దుగా పిలుచుకున్నారు. ఈ పేరు వెనుకా మర్మముంది. అది తరువాత. ఈ బుల్లి కవితలోని ప్రత్యేకతేమిటంటే మొదటి రెండు పాదాలు ఒక పరిపూర్ణమైన ఆలోచనను ఆవిష్కరించేస్తాయి. ఆలోచన పూర్తయిందనుకున్న తరుణంలో, అప్పటిదాకా కనిపించని మూడో పాదం గబుక్కున వచ్చేస్తుంది. వస్తూవస్తూ, మొదటి రెండు పాదాల అర్థాన్ని సమూలంగా మార్చెయ్యడమో, ఉదాత్తతను వ్యంగ్యంగా కూల్చెయ్యడమో లేక రెండుపదాలకూ మరింత భావాన్ని తెచ్చేదిగానో తయారవుతుంది.
ఇక దీనికి "త్రివేణి" అని పేరుపెట్టడానికిగల కారణాల్ని గుల్జార్ చాలా అర్థవంతంగా చెబుతారు. అలహాబాద్ లో గంగా-యమునల సంగమం జరుగుతుంది. కలిసేది రెండునదులే అయినా, కనిపించని సరస్వతీ నదితో కలిపితేగానీ త్రివేణీ సంగమం అవదు. అందుకే అర్థాల్ని మూడోపాదం మార్చే చిట్టిపొట్టి కవితలకు గుల్జార్ త్రివేణి అని పేరు పెట్టుకున్నారు.
గుల్జార్ చెప్పిన కొన్ని త్రివేణిలకు నేను తెలుగు స్వేఛ్ఛానువాదం అందిస్తూ ఆ యూట్యూభ్ వీడియో కూడా పెడుతున్నాను. చూడండి. వినండి. ఆనందించండి.
1. उड के जाती हुयी पंछी ने बस इतना ही दॆखा
दॆर से हाथ हिलाती हुयी ऒ शाख फिजा मे
...अल विदा कहनॆ कॊ या पास बुलाने कॊ !?!
ఏగిరేపావురానికి ఇంతే కనిపించింది
దూరంగా చిటారుకొమ్మ చెయ్యూపిన వైనం
...వీడ్కోలు పలికేందుకో, రమ్మనిపిలిచేందుకో తెలియరాలేదు
2. सब पर आती है सब कि बारी सॆ
मौत मुन्सिब है कमुमॆष नही
...जिन्दजी सब पर क्यू नही आती ?
అందరికీ వస్తుంది, అనుకున్న సమయానికి వస్తుంది
మృత్యువు తప్పదు, అదీ వస్తుంది
...కానీ జీవితం అందరికీ రాదెందుకో?
4. आप के खातिर आजर हम लूट भी लॆ आस्मा
क्या मिलॆगा चंद चम्कीलॆ शीशॆ तॊड कर?
...चांद चुब जायॆग तो उंग्ली से खून आजायेग !
నీకోసం చుక్కలూ చంద్రుడ్ని తెచ్చినా
గాజుపెంకులు తప్ప దక్కేది ఏముంది?
చందమామ మొనతగిలితే నీ వేలికి రక్తమొస్తుందేమో!
5. तमाम सफॆ किताबॊं के फड्फडा नॆ लगॆ
हवा धकॆल कर दर्वाजा आगई घर मॆ
...हभी हवाकि तरह तुम भी आजाया करॊ !
పుస్తకాల పేజీలన్నీ రెపరెపలాడాయి
గాలి తలుపును తోసుకుని విసురుగా వచ్చింది
...అప్పుడప్పుడూ నువ్వుకూడా అలావస్తే, నీ సొమ్మేంపోయింది!
Tuesday, April 21, 2009
త్రివేణి - గుల్జార్ నానోలు
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
ఇవి మూడు "పాదాలు " కదా ! కొంత నయం
నానో లు అంటే బొత్తిగా నాలుగు ముక్కలే . నాకెందుకో ఇన్ని పదాలు, ఇన్నివరుసలు, అంటూ హద్దులు నిర్ణయించడం నచ్చలేదు. భావావేసం తీరేదాకా రాసుకుంటూ పోవడమే బావుంటుంది. అయినా ఎవరి అభిరుచి వారిది
haiku, the japanese short poetry form is a type of poetry that has three lines and doesnt rhyme. i didnt see this form experimented in kannada [we have a short poetry form called as hanigavanagalu] or in telugu [we have naanis, i believe] in its strict form. the simple rule of a haiku is - the first and the third lines are of five syllables and the middle line has seven syllables.[most of the people mistake syllables to words]. haiku is usually about nature and it captures a moment in time.
మహేష్ గారూ,
సాధారణంగా నేను కామెంట్లు, ముఖ్యంగా బ్లాగుల్లో, రాయను. మొన్నోసారి పొరబాటున రాస్తే నన్నో హంతకుడిలా చిత్రీకరించారందరూ :)-
మీరు రాసిన హిందీలో చాలా అప్పుతచ్చులున్నాయి( ఉదాహరణకి - చంద్ అని రాసారు, చాంద్ అని వుండాలి ).
త్రివేణిలు చదివి ఒక్కసారి అలహాబాదులో మునిగినట్లనిపించింది. మీ అనువాదం బాగానే వుంది కానీ, మెరుగులు దిద్దాలి. మీది చూసాక నాకు తోచినవివి. క్లుప్తతద్దంలో కవిత్వం మెరవాలి. అనువాదంలో భావం జారిపోకూడదు. మీరు రాసినదాంట్లో భావముంది. కాస్త అటూఇటూ పదాలు మార్చానంతే!
ఎగిరేపావురానికి దూరంగా కనిపించింది
చెయ్యూపుతూ చిటారు కొమ్మ -
వీడ్కోలుకో! విన్నపాలకో !!
అందరికీ వస్తుంది, అనుకున్న క్షణానికి
మృత్యువూ తప్పదు, అదీ వస్తుంది !
జీవితం రాదెందుకో - అందరికీ ?
చుక్కలూ, చంద్రుడూ నీకిస్తే
గాజుపెంకులు దక్కాయి నాకు
వేలి మొనల రక్తం - చంద్రుడి గాయమా?
రెపరెపలాడాయి పుస్తకాల పుటలు
తలుపు తోసుకొచ్చింది విసురు గాలి
అప్పుడప్పుడ అలావస్తే - నీ సొమ్మేంపోయింది?
సాయి బ్రహ్మానంద గోర్తి గారూ,
మీ అనువాదం చాలా బాగుంది. నేను పదాలని అల్లేప్రయత్నం చేశానేగానీ కవిత్వం నా వశం కాదులెండి.
హిందీ టైపింగులో కొన్ని అక్షరాలు ఇంకా పట్టుబడలేదు. ముఖ్యంగా అర్థచంద్రాలు ఎలా ఇస్తారో ఇప్పటికీ తెలీదు. కాబట్టి కొన్ని తప్పులు ఖచ్చితంగా జరిగుంటాయి. ఐతే, మీరు ఎత్తిచూపింది "చంద్" సరైనదే. చంద్ అంటే, ‘కొన్ని’ అని అర్థం. చంద్ లమ్హే, చంద్ సిస్కియా అంటూ ఒక expression ఉంది. అదే ఇక్కడ "చంద్ చమ్కీలే శీషే" అని వాడటం జరిగింది.
మీరు బ్లాగుల్లో దర్జాగా కామెంటండి. వాదోపవాదాలు,భేధాభిప్రాయాలూ ఎక్కడైనా ఉండేవేగా!
@భవతరంగిణి: సమాచారానికి ధన్యవాదాలు. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి.
@లలిత:భావావేశానికి హద్దులుండవు లెండి. ఈ చిట్టికవితల్లోకూడా భావాన్ని భర్తీచెయ్యగలిగితే, నానోలైనా సుమోలుగా మారవలసిందే
మీ అనువాదం "బాగానే ఉంది" అనుకుంటూ కిందికొచ్చి చూస్తే బ్రహ్మానందం గారి అనువాదం బ్రహ్మాండంగా ఉంది.:)
ఒక్కోసారి పెద్ద పెద్ద కవితలు చదవడం కంటే చిన్ని చిన్ని పదాలతో వాక్యాలతో కూర్చిన హైకూలు, నానోలు మనసుకు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. ఇదివరలో ఆంధ్రజ్యోతి వీక్లీలో మంచి హైకూలు ప్రతి వారమూ వచ్చేవి.
Good post! thanks to all- for the information
గుల్జార్ కవిత్వానికి నాంది నానోలతో మొదలెట్టడం ఏం బాలేదు! ప్చ్. నానోలకీ గుల్జార్ త్రివేణీలకీ నక్కకీ నాకలోకానికీ ఉన్న తేడా ఉంది.
ధన్యవాదాలు మహేష్ ఇంత మంచి 'త్రివేణి ' లను అందించినందుకు..
గుల్జార్ పొయెట్రీ అంటే నాకు చాలా చాలా ఇష్టం.. ఆయన తన కవితలు/ఘజల్స్ ని చదువుతున్నప్పుడు కవితార్ధ్రతకి తోడు ఆయన గంభీర స్వరం తోడై ఆ భావావేశానికి కళ్ళల్లో నీళ్ళు రాక మానవు!
ఈ త్రివేణిలపై గాలీబ్ ప్రభావం కనబడుతుంది నాకు.. like this one..
chalo aaj intezaar khatam hua
chalo ab tum mil hi jaaoge..
...maut ka koi fayda to hua!
కొత్త పాళీ గారి వ్యాఖ్యే నాది కూడా
@కొత్తపాళి: గుల్జార్ ని పరిచయం చేసే ఉద్దేశముంటే, "మెర గోర అంగ్ లేయ్ లే, మొహె శామ్ రంగ్ దేదై" తొ మొదలెట్టే వాడిని. నానోల నేపధ్యంలో I happened to tumble upon this video. ఈ శైలిని పరిచయం చేద్దామన్న ఉద్దేశంతో మాత్రమే ఈ టపా రాశాను. హైకులూ,నానోల మీద నా జ్ఞానం చాలా తక్కువలెండి.
@నిషిగంధ: నిజమే! ఇక్కడ వీడియోలో గుల్జార్ recitation వినండి.It is touching as always.
@సుజాత: అంగీకరించి టోపీ లేపేసాను.
త్రివేణీలను పరిచయం చేసినందుకు థాంక్స్.మీ అనువాదాలు బావున్నాయి.
నా 'నోనో'లని ప్రస్తావించినందుకు థాంకులు :-)
కొత్తపాళీ అన్నట్లు - గుల్జార్ కవితల్ని నానోలతో పోల్చటం బాలేదు.
"అందరికీ వస్తుంది, అనుకున్న సమయానికి వస్తుంది
మృత్యువు తప్పదు, అదీ వస్తుంది
...కానీ జీవితం అందరికీ రాదెందుకో?"
పై త్రివేణికి స్ఫూర్తి పదమూడో శతాబ్దపు స్కాటిష్ స్వతంత్ర సమర యోధుడు సర్ విలియమ్ వాలెస్ మాటలు కావచ్చు: "Every man dies; not every man really lives".
Post a Comment