Saturday, April 25, 2009

సృష్టి - సమయం - రొద - ప్రశ్న


ప్రముఖ భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తన బ్లాగులో రాసుకున్న కవితల్లో కొన్నింటికి ఇది స్వేఛ్ఛానువాద ప్రయత్నం. మీరూ ఒక ప్రయత్నం చెయ్యండి!

Conception

I conceive myself
in my imagination
and then
lose myself
in my own conception

సృష్టి
నా స్మృతిలో
నన్ను నేను సృష్టించుకున్నాను
ఆ సృష్టిలో
నన్ను నేను అర్పించుకున్నాను

''time' does not fly ?

and so said 'time'

"you have for so long
watched me go by,
now come aboard
and through my porthole
watch yourself go by
for I have been still
for as long as
I have known
myself"

సమయం పయనించదు
సమయం అన్నది...
"ఇన్నాళ్ళ నా గమనం గమనించావు
ఇప్పుడు నన్నధిరోహించి పయనించు
నా గుండ్రటి కిటికీ గుండా
నువ్వు నీ గమనపు వైనం చూడు
అప్పుడైనా...
నాస్థిరత్వం నీకు అవగతమౌనేమో!

Noise

Amidst the noise
and the screaming
in my head
I finally found
the whisper
of my joy

రొద
రణగొణ రొదల మధ్య
నా తలలో కేకలమధ్య
చిట్టచివరకు...
నా ఆనందపు అలికిడి వినిపించింది


a question

I asked you
and you said
'you're too vague'
of course i am
i am afraid
your answer
would be finite
leaving no room
for hope
for interpretation
for dreaming
for yearning
for the search
for myself
in you

an eternity lives
between a yes
and a no

ఒక ప్రశ్న
నా ప్రశ్నకు బదులిచ్చావు
‘అస్పష్టం నీ అస్థిత్వం’ అని
నిజమే! కానీ
నీ సమాధానపు ఖచ్చితత్వం
నన్ను నీలో వెతుక్కునే
ఆశకు స్థలం లేని
అవగాహనకు అవకాశం లేని
కలలకు బలం లేని
కోరికకు స్వరం లేని
అన్వేషణకు వీలు లేని
పరిస్థితి కల్పిస్తుందేమో అన్న భయం

ఎంతైనా ‘అవును’‘కాదు’లమధ్య
ఒక అనంతం జీవిస్తుంది కదా!


****

7 comments:

Bolloju Baba said...

ఇవి ఇంతకు ముందు చేసిన గుల్జార్ అనువాదాలు చాలా బాగున్నాయి.
ఇంకా మరిన్ని పరిచయం చేయండి.

Anonymous said...

mahesh gaaru..

meee anuvaadaalu adurs !!!

మరువం ఉష said...

ఈ అనువాద కవిత్వ ప్రయత్నం బాగుందండి. మరి కొందరు కూడా ఈ రకమైన ప్రక్రియ చేస్తున్నారు. బాబా గారన్నట్లు మరిన్ని ఇక్కడ మాకు పరిచయం చేస్తారని చూస్తుంటాను.

teresa said...

Well done!

వేణూశ్రీకాంత్ said...

బాగున్నాయి మహేష్...
కానీ "గుండ్రటి కిటికీ.." పంటి కింద రాయైంది. గవాక్షం బాగుంటుందేమో!!
దుర్బేధ్యమైన గోడ లోనో, యుద్ద నౌకలోనో తుపాకీ తో శత్రువుల పై దాడి చేయడానికి ఉండే చిన్న కన్నాన్ని porthole అంటారు అనుకుంటా కదా.. వేరే ఏదైనా పదం సూచించ గలరా !!

Kathi Mahesh Kumar said...

@వేణూ శ్రీకాంత్: మీ సూచన బాగుంది. మార్చి ప్రయత్నిస్తాను.
@బాబా&ఉష: ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
@తెరెసా&నెల బాలుడు: ధన్యవాదాలు.

రాధిక said...

really good sir