Saturday, April 18, 2009

అనుభూతి లేని హేతువు...

అనుబంధాల అనుభూతుల్ని అవసరాలు నిర్ణయిస్తున్న తరుణంలో, హేతువు ఆధారంగా బంధాలను,అనుభూతుల్నీ,భావనల్ని నిర్వచిస్తే ! You are so rational, you will never understand my emotion" అనే అపవాదు మొయ్యాల్సొస్తుంది.

నిజంగా హేతువాదులకు నమ్మకాలతో,భావనలతో,అనుభూతులతో పనిలేదా? అంటే మాత్రం, "ఎందుకు లేదు,ఖచ్చితంగా ఉంది" అనే నా సమాధానం. మరి వాటికి అతీతంగా వీళ్ళెలా ప్రవర్తిస్తున్నట్లు ఎందుకు అనిపిస్తారా అంటే, దానికున్న సులువైన సమాధానం, భావలనపై వీరికున్న నియంత్రణ. అంటే, People who are more rational don't perceive emotions less, they just regulate it better అన్నమాట.

ఈ భావనల్ని నియంత్రించే రిమోట్ ఎక్కడుందా, అనేది ఇప్పుడు మనకు కావలసిన అత్యవసర సమాచారం. ఈ రిమోట్ కోసం నిజంగా మనం ఎక్కడో వెతకఖ్ఖరలేదు. అది మన మెదడ్లోనే ఉంది. మన మెదడులో ఉన్న prefrontal cortex అనే భాగం, మన అనుభూతులూ,భావనలతోపాటూ స్వీయచైతన్యం కలిగిన హేతువుని తోడుగా అందిస్తుందట. దీన్నే meta-cognition అంటారు. కానీ ఈ హేతువుని అందిపుచ్చుకోవాలంటే ఆ భావనల గురించి "ఆలోచించడం" అవసరం. ఉదాహరణకు మనకు కోపం వచ్చిందనుకోండి, ఆ కోపానికి గల కారణాల్ని ఆలోచించడం ద్వారా ఆ స్వీయచైతన్య హేతువుని అందుకోగలమన్నమాట.

అర్థం కాలేదా? మొదట్లో నాకూ అర్థం కాలేదు. కోపం తెచ్చుకోకుండా ఆలోచించి చూడండి. అనుభూతికలిగిన హేతువు దొరుకుతుందేమో!

మొత్తానికి హేతువాదులకు అనుభూతులు లేవనే అపోహ శాస్త్రీయంగా తొలగించబడింది. ఇప్పుడనమనండి "You are so rational, you will never understand my emotion" సరైన సమాధానం చెబుతాను.

*****

6 comments:

cbrao said...

దేశ, ప్రాంత, కాలాలకు అతీతంగా అందరికీ దుఃఖం, సంతోషం, కోపం, ప్రేమ, అసూయ, ద్వేషం ఉంటాయి. షేక్‌స్పియర్ (జననం: 1564 మరణం: 1616) నాటకాలలోని పాత్రల భావోద్వేగాలు గమనించండి. ఈ నాటి సాహిత్యం లోని పాత్రలకూ అలాంటి భావోద్వేగాలే ఉన్నాయి. హేతువాదులైనా హేతుబద్ధంగా ఆలొచిస్తారే కాని వారూ అందరిలాగానే స్పందిస్తారు, కొంచెం తక్కువగానైనా.

అశోక్ చౌదరి said...

Well Said..

Naga said...

prefrontal cortex పోతే రిమోట్ పోతుందా? ఇంతకు "మనం" ఎక్కడ ఉన్నాం?

gaddeswarup said...

Mahesh Kumar garu,
This seems to be a much discussed topic and there are even university courses. Antonio Damasio has made some significant contributions. There is a discussion here:

Emotional Rescue
.

సూర్యుడు said...

Emotional Intelligence & Working with emotional intelligence (Daniel Goleman)అని రెండు పుస్తకాలున్నాయి ఈ టాపిక్ మీద

చంద్ర మోహన్ said...

"హేతువు లేని అనుభూతి" అని ఉండాలేమో మీ శీర్షిక!