Monday, April 6, 2009

మన చరిత్ర !?!

ఈ మధ్యకాలంలో పురాణాల్ని చరిత్రల్ని చేసే ప్రహసం ఒకటి మొదలయ్యింది. ‘మన సామాజిక జీవనాన్ని రాసే అలవోక,అత్యంత ప్రాచీన విధానం కథ చెప్పడం కాబట్టి, కటికనిజానికి కొన్ని అతిశయోక్తులు జోడించి చెప్పబడినవి పురాణాలు’.అనే వాదనొకటి బలంగా ఒక మూల వినిపిస్తూనే ఉంది. బీజేపీ వారు అధికారంలో ఉన్నప్పుడు "చరిత్రని తిరగరాస్తాం" అని ఒంటికాలిమీద లేచి ఒరగబడింది కూడా ఈ ధోరణితోనే. ఏదిఏమైనా ఎట్టకేలకు అటు కాంగ్రెస్ కూ ఇటు బీజేపీకీ కొరుకుడుపడని వామపక్ష చరిత్రకారుల చేతుల్లో "మన చరిత్ర" ఉండిపోయింది.

వామపక్ష మేధావులకి దేవుడు ఎలాగూపడడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులంటే అసలు పడదు. ఎంతైనా రష్యా విప్లవానికీ, చైనా ప్రగతికీ భక్తులు కదా! మొత్తానికి చరిత్రను ఎవరికీ కాకుండా కేవలం పుస్తకాల్లో పాఠాలుగా, పరీక్షల్లో ప్యాసయ్యే కీలకాలుగా, పోటీపరీక్షలకు ఆయువుపట్లుగా మార్చేసి ఉసూరుమన్నారు. అంటే మనకు చరిత్రలో మిగిలింది తారీఖులూ, తద్దినాలేతప్ప మన (దు)స్థితికి కారణాలు కాదు. ఆ కారణాలు అకారణాలైనా, ప్రస్తుతం ఆ కారణాల్ని చూపించి మరో మారణకాండకు తయారవడం, అదీ ముతక వాదనల్ని శాస్త్రీయం చేసేరీతిలో తయారవడం మరింత దారుణం.

ఒకరు మ్యాక్స్ ముల్లర్ని "మాయదారి" అంటూనే మా మాయదారి కృష్ణుడు అసలు చరిత్ర అంటాడు. మరొకడు ఆర్య-ద్రవిడ సిద్ధాంతం కుట్ర అంటాడుగానీ, హరప్పా మొహెంజదారో త్రవ్వకాల తరువాత ఈ సిద్ధాంతం చరిత్రలో అటకెక్కిందని తెలుసుకోడు. చరిత్ర కారులేదో మాయజేసి కుట్రజేసి వేలసంవత్సరాల సంస్కృతికి అన్యాయం చేశారని వాపోతూ ఉంటారు. అంతేతప్ప చరిత్ర పునర్నిర్మాణానికి తగిన ప్రాతిపదికల్ని ఏర్పరుచుకోరు.

చరిత్ర ఒక అభిప్రాయం కాదు. లభ్యతలోఉన్న ఆధారాలూ,ఆలోచనల ప్రాతిపదికన ప్రతిపాదించే శాస్త్రీయ సూచన లేక సిద్ధాంతం. చరిత్ర "సృష్టిలో"చరిత్రకారుల పరిధి,వారి నేపధ్యం,వారికి లభించిన ఆధారాలు, వాటికి మద్ధత్తుగా చూపించగలిగే ప్రమాణాలు చాలా ప్రముఖపాత్ర వహిస్తాయి. కేవలం ఆధారాలూ,ప్రమాణాలూ మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే, చరిత్రలో ఘటనలు జరిగిన చూచాయ తారీఖులు తప్ప వాటి నేపధ్యాలూ,వాటి ప్రభావానికి సంబంధించిన అంచనాలు ఉండేవికాదేమో. ప్రామాణికమైన నిజాలు, నమ్మదగిన కల్పనల సమాహరమే చరిత్ర కాబట్టి,దాన్ని మార్పేరాని శాస్త్రంగా అనుకోవడానికి వీల్లేదు. Pure sciences లో కూడా మునుపు ప్రతిపాదించిన సిద్ధాంతాలను కొత్త సమాచారంతో తిరగరాయడం జరుగుతుంది. అలాంటిది అంచనాలూ,ఆలోచనల ప్రాతిపదికన నిజాల నేపధ్యాల్ని ఆలోచించి రాసిన చరిత్ర "స్థిరం" లేక "పరమసత్యం" అనేది హాస్యాస్పదం. చరిత్రను చూసే సాంకేతిక ధృక్పధం అది కాదు.

చరిత్ర ఎప్పుడూ పునర్నిర్వచింపబడుతూ ఉండాలి. ఆధునిక సాంకేతిక విజ్ఞానం ప్రసాదించిన నైపుణ్యత ఆధారంగా, ఇప్పటికే లబ్యతలో ఉన్న ప్రమాణాలను పున:సమీక్షించి వాటి ప్రామాణికతను ప్రశ్నిస్తూ ఉండాలి. ఈ తార్కిక ఆధునిక ధృక్పధం లోబడిన రోజున, చరిత్ర అర్థరహితంగా తయారవుతుంది. ఆ చరిత్రకు సంబంధించిన జాతి లేక ప్రజలకు నిరుపయోగమౌతుంది. ప్రస్తుతం "భారతీయ చరిత్ర" అనబడే అంగీకారాత్మక కథకు అదే గతి పట్టింది. ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, భేధదృష్టి,రాజకీయ ప్రయోజనాపేక్షల ఆధారంగా చరిత్రను పునర్నిర్వచించే ప్రయత్నం జరగటం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇప్పుడు రాయాలంటే...?! అదో పెద్ద ప్రశ్నార్ధకమౌతుంది. హైదరాబాద్ చరిత్రను అందులో కలపాలా వద్దా? కడప నవాబు హిందూ అభిమానాన్ని ప్రస్తావించాలా వద్దా? చంద్రగిరి కోట రహస్యాల్ని చరిత్రలో భాగం చెయ్యాలా? శాతవాహనుల తరువాత రెడ్డిరాజులొచ్చారా? ఓరుగల్లు ప్రాసస్థ్యాన్ని కీర్తిస్తే తెలంగాణా వాదులకు బలం చేకూరుతుందేమో! లాంటి చచ్చు ప్రశ్నలూ చొప్పదంటు సమాధానాలూ ఎన్నో వస్తాయి. ఈ పరిస్థితుల్లో చరిత్రను పునర్నిర్వచించడం ఏట్లా!?!

"విజేతలు రాసిందే చరిత్ర" అని ఎవరో అన్నట్లు, చరిత్ర ఒక విజయగాధగా మిగిలి, పరాజితుల జాడ లేక సగం చచ్చిపోయింది. అశోకుడు కళింగను జయించాడని మనకు తెలుసుగానీ, ఆ ఓడిపోయిన కళింగ రాజు పేరు ఎవరైనా విన్నారా? అయినా ఈ చరిత్రను "మన" చరిత్ర అనడానికి మనకు గల హక్కులుకూడా తెలీని అయోమయస్థితిలో ప్రస్తుతం పడికొట్టుకుంటున్నాం.

5,000 సంవత్సరాల ఘనచరిత్ర అని మహాఘనంగా చెప్పుకుంటాంగానీ, అది ఎవరి చరిత్రో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. హరప్పా-మొహెంజోదారో మనభారతీయ సంస్కృతి అందామనుకున్నా అదెలా పుట్టిందో, మరెందుకు గిట్టిందో ఆధారాలు లేవు. ప్రస్తుతం ఆ రెండు తవ్వకాల ఊళ్ళూ పాకిస్తాన్లో పడిచచ్చాయి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఎంచక్కా మీకూ మాకూ సంబంధం లేదు మాదే గొప్ప పురాతన చరిత్ర అని చంకలు గుద్దుకున్నా, మనం బావుకునేదేమీ లేదు. వేదాలు మనవే అనుకుందామన్నా, అవి మొత్తం భారతదేశమనే mythical land scape కు సంబంధిస్తాయా అనేది అత్యంత సందేహాస్పదం. భ్రిటిష్ వాడు తీసి దాచకుంటే, మ్యాక్స్ ముల్లర్ ఇంగ్లీషులోకి అనువదించకుంటే, ఈ "పవిత్రగ్రంధాలు" ఏ పాడుబడిన గుళ్ళపాలో అయ్యి, జీర్ణమయిపోయుండేవి. అనవాలుకూడా చిక్కకుండా అదృశ్యమయ్యుండేవి. మ్యాక్స్ ముల్లర్ మాయదారోడైనా కనీసం మా సంస్కృతి మూడువేల సంవత్సరాలనే ఆధారాల్ని జ్ఞానంతో సహా అందించాడు. అవును, తారీఖు తన క్యాధెలిక్ నమ్మకాల్ని బట్టి ఒక పదిహేనువందల సంవత్సరాలు కుదించాడు పాపం! ఆ మాత్రం దానికి, తను చేసిన కృషి మొత్తాన్నీ తుంగలోతొక్కి, మతిలేని కొత్త సిద్ధాంతాల్ని మన తలకు చుట్టాలంటే ఎట్టా?

ఇన్ని సమస్యల్లో మొత్తానికి మన చరిత్రకి పొయ్యేగాలం వచ్చింది. చూద్ధాం ఇది ఎంతవరకూ పోతుందో లేక అసలే మిగలకుండా పోతుందో!

****

16 comments:

Anonymous said...

Katti:

You started the post very well but ended it with disappointingly. Various groups have vested interest on Indian history. For that matter any history. The world history was dominated by Western writers. They added/deleted as per their limited knowledge and/or perceived limitations and biases.

Hope positive things for our history. Personally I would like that histrians highlight history of our masses (STs, SCs, BCs and Dalits).

As you pointed out Communist/Marxist/Islamic historians in India wrote lopsided history of India. They painted rosy picture of Islamic rule. The prominant historians in the west agree that Islamic rule commited largest holocaust in India between 712 AD to 1707 AD. Islamic thugs killed/converted estimated 100 Million people in that time.

Keep up the good work.

ISP Administrator said...

>>>వామపక్ష మేధావులకి దేవుడు ఎలాగూపడడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులంటే అసలు పడదు. ఎంతైనా రష్యా విప్లవానికీ, చైనా ప్రగతికీ భక్తులు కదా!>>>
మేము నాస్తికులమే కానీ కొన్ని విషయలాలో మతం మనిషికి నాగరికత నేర్పింది అని మేము అంగీకరించాము. ఉదాహరణకి వావివరసలు లేని వివాహాలని అన్ని మతాలు నిషేధించాయి. ఇతర దేశాలతో పోలిస్తే క్రైస్తవ దేశాలలో ఆ రకం వివాహాలపై స్ట్రిక్ట్ నిషేధం ఉంది.

Malakpet Rowdy said...

hmmmmmmm!

కత్తి మహేష్ కుమార్ said...

@అనామకుడు: చరిత్రకారులకు ఇస్లాం/మొఘల్ పరిపాలన పట్ల అవాజ్యమైన ప్రేమ ఎందుకుందనుకుంటున్నారు? చరిత్రకారులకు మీరు ఆపాదిస్తున్న bias మీ మాటల్లో కూడా ప్రతిధ్వనిస్తోందని గుర్తించండి. చరిత్ర రచనలో కుట్రలు ఎన్నున్నాయో సమాచార లేమి వలన కలిగిన gaps అలాగే ఉన్నాయి.

ముఘల్ బాదుషాల ఉన్నతిని చూపించే ఎన్నో ప్రమాణాలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయి. వారు యుద్ధాలు చేసి రాజ్యాల్ని ఆక్రమించారు గనక రక్తపాతం జరిగిందనేది తేటతెల్లం. ఎంత మంది(హిందువుల)ని చంపారు అనే లెఖ్ఖ తేలిస్తేగానీ వారు చరిత్ర తప్పంటే ఎలా? What is purpose of asking for such history? Isn't your politics behind it! ‘మరోచరిత్ర’ మీ రాజకీయ ఉద్దేశానికి కావాలంటే ఎలా?

మతమార్పిడి గురించి చెప్పారు. మతమార్పిడి ఖచ్చితంగా జరిగింది. దాన్ని చరిత్ర కప్పిపుచ్చలేదు. కానీ మతమార్పిడి జరిగిన శాతం నగణ్యం గనక దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. అంతే! ఇంత విస్తృత జనాభాని "బలవంతంగా" మతమార్పిడి చేద్దామనే ఆలోచన కనీస జ్ఞానం ఉన్న పరిపాలకుడికి రాదు.

Medieval times can't be judged by your present values.

@మార్తాండ: మొత్తానికి మిమ్మల్ని మీరు వామపక్షమేధావి వరుసలో చేర్చుకున్నారు. మతం మనిషికి నాగరికత నేర్పితేనేర్పిందిగానీ, మీరిచ్చిన ఉదాహరణ ఆర్ధిక విషయాలకు చెందిన "వావివరసల" సంబంధాలది అని గ్రహించండి.

@మలక్పేట రౌడి: హ్మ్మ్ అని వదిలేస్తే ఎలా?

భాస్కర రామి రెడ్డి said...

కత్తి మహేష్ గారు,
సత్యం స్థిరం, చరిత్ర సత్యాన్నే చెప్పాలి . కానీ మనకు జరిగిందేమిటి? బ్రిటీష్ వారు రాక ముందు అది మన దేశీయులు రాసుకున్న చరిత్ర . చరిత్ర ఎప్పుడూ ప్రముఖ వ్యక్తులదే. అందులో తప్పు ఏముంది? ఇప్పటికి కూడా నువ్వు,నేను వార్తలలో వ్యక్తులమా? ఇప్పటి వార్తలలో వ్యక్తులే ఒక ౧౦౦ సంవత్సరాల తరువాత చరిత్ర.

ఇక్కడ చరిత్ర అంటే ఎక్కువమంది ఇప్పుడు నమ్మేది మరో వంద సంవత్సరాలకు చరిత్ర అవుతుంది. సత్యమేదో ఆ కార్యాన్ని చేసే వ్యక్తికి తప్ప మరెవ్వరికి తెలియదు.

ఇక్కడ చిక్కు ఏమిటంటే ఆ ప్రముఖ వ్యక్తుల చరిత్ర బ్రిటీష్ జమానా లో తిరగ రాయబడింది. ఏ రకంగా అంటారా? పరిశోధన అనే పేరు పెట్టి తమకు తోచిన సిద్ధాంతాలను ప్రతిపాదించి ఇదీ మీ చరిత్ర అని కొన్ని వేల సంవత్సరాల చరిత్రను ౨౦౦ సంవత్సరాల్లో మనకున్న చదువులేమి అఙ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని సునాయాసంగా మార్చి మనమీదకి వదిలారు. మరి ఇప్పుడు చదువుకున్న వారికి ప్రమాణ గ్రంధాలు ఏమౌతాయి? మరణ శయ్య పైన వున్న సంస్కృత గ్రంధాలా ? లేక ప్రపంచ మంతా వ్యాపించివున్న ౨౦౦ సంవత్సరాల ఇంగ్లీష్ భారత దేశ చరిత్రా? [ ఎందుకంటే అవిగాక వేరేవి చదివి అర్థంచేసుకొనే స్థితిలో మనము లేము. అంతేకాదు ఎవరైనా చెప్పినా వినేస్థితిలో కూడా లేము]

కత్తి మహేష్ కుమార్ said...

భాస్కర రామిరెడ్డి గారు,
మీబాధే నాదీను.కాకపోతే సత్యంకూడా చూసేవాడి ధృక్కోణాన్ని బట్టి స్థిరత్వాన్ని కోల్పోతుందికాబట్టి చరిత్ర ఒక ఆధారాలతో నిరూపించదగిన అంగీకారాత్మక ధృక్కోణం అని మాత్రమే నా భావన.

బ్రిటిష్ వారు తమ రాజకీయాపేక్షకోసం చరిత్రను అనుకూలంగా తిరగరాశారనుకున్నా, ఇప్పుడు మనం మాత్రం చేస్తున్నదేమిటి? మన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చరిత్రను తిరగరాయాలనుకోవడం. Can we justify it!

ఇతరదేశాలలో తమ చరిత్ర పట్ల ఉన్నంత ఆదరం,ఆసక్తి,అభిమానం,అధ్యయనం మనదగ్గర లేదు.ఇలా ఉన్నంతవరకూ మనం చరిత్రలేని జాతే!

భాస్కర రామి రెడ్డి said...

కత్తి మహేష్ గారు,

>>బ్రిటిష్ వారు తమ రాజకీయాపేక్షకోసం చరిత్రను అనుకూలంగా తిరగరాశారనుకున్నా, ఇప్పుడు మనం మాత్రం చేస్తున్నదేమిటి? మన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చరిత్రను తిరగరాయాలనుకోవడం. Can we justify it!

ఇప్పుడు మనము రాజకీయ అవసరాలకు తిరగరాసినా అది చరిత్ర అనిపించుకోదు. చరిత్ర ను చరిత్ర లా ఆదరించే దాకా. ఇవి జరిగిపోయిన కథలు.వాటిని ఎలా జరిగింది అన్నారో అలాగే చెప్పేవాళ్ళు రావాలి.

>>ఇతరదేశాలలో తమ చరిత్ర పట్ల ఉన్నంత ఆదరం,ఆసక్తి,అభిమానం,అధ్యయనం మనదగ్గర లేదు.ఇలా ఉన్నంతవరకూ మనం చరిత్రలేని జాతే!

ఇది వ్యక్తిగతం.దేశ చరిత్ర మీద ఆసక్తి రావాలంటే ముందు దేశభక్తి అవసరమేమో.

Dhanaraj Manmadha said...

The whole problem is that there is specific for what is to be written i the history books.

Our ancestors wrote the history in the form of some folk stories. The Britishers rewrote the entire history in their view point.

Once there was a man, who wanted to see the world in a mirror. What he could see then was the world that was fit in that mirror. After some time, he bought another mirror, and that one is a shade bigger and so on.

The story of history is also like that. శోధించిన వాడికి శోధించినంత. Like that.

The problem with the Britishers is that they were envious of our rich culture, and heritage. And ours is an insecure, and inferiority, which is being covered with superioriy complex. Anyway, both the parties are wrong here, as said by my Masterji.

కత్తి మహేష్ కుమార్ said...

@ధనరాజ్: బ్రిటిష్ వాడు మన సంస్కృతిని చూసి కన్నుకుట్టుకోలేదు లెండి. మన దేశ సంపదనిచూసి వ్యాపారానికొచ్చాడు.నిజానికి మనది ఆటవిక సంస్కృతిగా భావించి తన నాగరీకాన్ని మన మీద రుద్ధాడు. ప్రస్తుతం "మనవి"గా చలామణీ అవుతున్న లైంగిక విలువలన్నీ Victorian morals అని గ్రహించగలరు.

మనవాళ్ళు చరిత్రని కథలుగా రాశారని ఎలా నమ్మేది.మనది ఎప్పుడూ ఒక leisure societyనే.అంటే ఎంటర్టైన్మెంటుకోసం రాసుకున్న కథలేతప్ప సమాచారాన్ని పొందుపరచడానికి కాదు. అంతెందుకు ఇప్పుడు మనసాహిత్యాన్ని తీసుకున్నా కోకొల్లలుగా దొరికేది imagination ను celebrate చేసుకునే కవిత్వమేతప్ప సామాచారాన్ని అందించేది కాదు.

@రామిరెడ్డి: చరిత్ర మీద ఆసక్తి కలగాలంటే కావలసింది దేశభక్తికాదు. చారిత్రక దృక్పధం, ఆసకి అంతే!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మనచరిత్రనుంచి మతాన్ని వేరుచేయటమంటే శరీరంనుంచి ఆతమను వేరుచేసినట్లే అన్నది నా అభిప్రాయం. దాని వల్ల మంచా చెడా అన్నది మనస్థాయిని మించింది. మీరు ఎంటర్టైన్మెంటుకోసం రాసుకున్న కథలేతప్ప సమాచారాన్ని పొందుపరచడానికి కాదు అన్నారు. ఇక్కడ సమచారం పొందుపరిచేందుకు శాసనాల్ని, కొన్ని గ్రంధాల్ని రాశారు. ఇప్పుడు వాడుతున్న కాగితాలు కొన్ని సవత్సరాలకే చెదలు పడుతుంటే అవి శతబ్దాలతరువాత కూడ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీరు అన్నట్లు ఎంటర్టైన్మెంట్ కోసం రాసినవి ఉన్నా, వీటిలో కొన్ని అంతర్లీనంగా అప్పటి సామజీ పరిస్థితులను, దేశకాలమానాలకు చెందిన విషయాలు తెలియజేసే ప్రయత్నం చేశారు. కొన్ని కానీ మనకు మతపరంగా తెలిసిన చరిత్రకి, ఇప్పుడుకడుతున్న లెక్ఖలకి మద్య ఏదో అగాధం ఉంది. అది ఎందుకు ఏర్పడిందో? ఎలా ఏర్పడిందో? అది ఎక్కడి నుంచి ఎక్కడవరకు ఏర్పడిందొ? ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక చివరగా నామాట, ఎన్నోశాస్త్రాలకు ధ్ర్మాలకు ఇది పుట్టీనిళ్లు. దీనికి నేను ఋజువులు చూపలేను. నా నమ్మకం మాత్రమే.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

అన్నట్లు నా టపా మీద వాత పెట్టలేదు. ఎమైనా రాస్తారు అనుకొన్నాను

కత్తి మహేష్ కుమార్ said...

@సుబ్రహ్మణ్య చైతన్య: Agreed. భారతదేశాన్ని మతం లేకుండా అర్థం చేసుకోవడం కష్టం. కానీ స్వాతంత్ర్యానంతర పరిస్థితి దృష్ట్యా "మతరహిత" చరిత్ర ఒక అవసరంగా మారింది. దానితోపాటూ, మతగ్రంధాలు modern scientific inquiry కి సానుకూలంగా ఉండకపోవడంకూడా మరొక కారణం.

ముఖ్యంగా సంస్కృతపండితులు తమదైన convincing framework of inquiry on power with western scientific inquiry ప్రతిపాదించి తమ వాదనల్ని నిలుపుకునే పరిస్థితిలో లేకపోవడం కూడా ఈ "మత చరిత్ర"ను మరుగు పర్చిన కారణాల్లో ఒకటి.

ఆర్ధిక-సామాజిక స్థితిగతుల్ని ఆధారం చేసుకుని రాసే వామపక్ష చరిత్రతో నాకు కొన్ని విబేధాలున్నా, చరిత్రను మతాన్ని రెచ్చగొట్టి-కొందరిలో insecurity నింపి,హింసకు పురిగొల్పి రాజకీయలబ్ధి పొందాలనే "హిందుత్వవాద చరిత్ర" కన్నా better అని అనుకుంటాను. ఆకోణంగా సాగిన చర్చల్లోనే RSS చరిత్రలో చెప్పే బాబ్రీ మసీద్ విషయం చెప్పాల్సివచ్చింది. So, the discussion started off as a historical discussion and now turned in to a religious discussion.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీరు చెప్పిన దాని ప్రకారం దేశంలో రెండువర్గాలు. మొదటిది మతాన్ని ఆయుధంగా చేసుకొనే వర్గమైతే, రెండోది అసలు మతాన్ని నమ్మనిది. ఇక మూడొవర్గంలో మిగిలింది మతాన్ని నమ్ముతూ అదేసమయంలో హింసకు దూరంగా ఉండే వర్గం. వీళ్లు మనజనాభాలో 90-95శాతం ఉంటారు అనుకొంటా. అంటే 10శాతంకూడలేని వర్గాలవల్ల వీళ్లకు తమచరిత్రను తామే తెలుసుకోలేని పరిస్థితి. తప్పెవరిది? హిందూమతానిదా? దానితరపున గొంతును వినిపించలేని హిందువుదా? తమ ప్రయోజనాలకు అనుగుణంగా దానిపై దాడిచేసిన వాళ్లద?
ఇక్కడ సంసృతపండితులు ఎదుర్కొన్న సమస్య ప్రపంచంలోని ఇతరమతాధికారులు ఎదుర్కొన్నారు. నిజానికి యూరోప్‌లో హేతువాదుల చేతిలో కాథలుక్కులు తిన్న దెబ్బలకంటే ఇది తక్కువే అనుకొంటా. ఇస్లాం అందుకు మినహాయింపు. కారణం మీకుకూడా తెలిసిందే. అక్కడ ప్రజలకు భావప్రకటనాస్వేచ్చ్చ అతితక్కువ స్తాయిలో ఉంటుంది. దానినే బృహస్పతిగారు మరోరకంగా రాశారు.అయినా అప్పటికే ముస్లిములకు విడిగా రాజ్యాన్ని ఇచ్చేశాం. మనతో బతకలేం అనుకున్నవాళ్లు వెళ్లిపోయారు. అంటే ఇక్కడమిగిలినవాళ్లు హిందుత్వాన్ని ఆచరించకపోయినా అందులోని విషయాలను ఒప్పుకోవాలిగా. ఇది ఎంతవరకు సమర్ధనీయం

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీరు చెప్పిన దాని ప్రకారం దేశంలో రెండువర్గాలు. మొదటిది మతాన్ని ఆయుధంగా చేసుకొనే వర్గమైతే, రెండోది అసలు మతాన్ని నమ్మనిది. ఇక మూడొవర్గంలో మిగిలింది మతాన్ని నమ్ముతూ అదేసమయంలో హింసకు దూరంగా ఉండే వర్గం. వీళ్లు మనజనాభాలో 90-95శాతం ఉంటారు అనుకొంటా. అంటే 10శాతంకూడలేని వర్గాలవల్ల వీళ్లకు తమచరిత్రను తామే తెలుసుకోలేని పరిస్థితి. తప్పెవరిది? హిందూమతానిదా? దానితరపున గొంతును వినిపించలేని హిందువుదా? తమ ప్రయోజనాలకు అనుగుణంగా దానిపై దాడిచేసిన వాళ్లద?
ఇక్కడ సంసృతపండితులు ఎదుర్కొన్న సమస్య ప్రపంచంలోని ఇతరమతాధికారులు ఎదుర్కొన్నారు. నిజానికి యూరోప్‌లో హేతువాదుల చేతిలో కాథలుక్కులు తిన్న దెబ్బలకంటే ఇది తక్కువే అనుకొంటా. ఇస్లాం అందుకు మినహాయింపు. కారణం మీకుకూడా తెలిసిందే. అక్కడ ప్రజలకు భావప్రకటనాస్వేచ్చ్చ అతితక్కువ స్తాయిలో ఉంటుంది. దానినే బృహస్పతిగారు మరోరకంగా రాశారు.అయినా అప్పటికే ముస్లిములకు విడిగా రాజ్యాన్ని ఇచ్చేశాం. మనతో బతకలేం అనుకున్నవాళ్లు వెళ్లిపోయారు. అంటే ఇక్కడమిగిలినవాళ్లు హిందుత్వాన్ని ఆచరించకపోయినా అందులోని విషయాలను ఒప్పుకోవాలిగా. ఇది ఎంతవరకు సమర్ధనీయం

కత్తి మహేష్ కుమార్ said...

@సుబ్రహ్మణ్య చైతన్య: You have asked partially right set of questions.

మీరు చరిత్రను చూసుకుంటే సామాజిక దిశానిర్దేశన చేసింది ఆ పదిశాతం మైనారిటీలే. 90 శాతం మంది ప్రజలు వాళ్ళు చెప్పిందాన్ని తమ బాధ్యతగా ఆచరించినవాళ్ళే. అందుకే మధ్యతరగతి మేధావుల ప్రాముఖ్యత,బాధ్యత సమాజానికి చాలా ఉంది. They provide a vision to the masses and lead them in to CHANGE.

ఆ మధ్యతరగతి రెండుగా చీలింది. ఒక గుంపు మతరహితమైతేనే శాంతి ఉంటుందని నమ్మితే, మరొక గుంపు మతాన్ని ఉపయోగించి ప్రతిదాన్నీ పునర్నిర్వచిస్తేగానీ మనకు మనుగడ ఉండదు అని ప్రతిపాదిస్తున్నారు. ఈ మేధోవర్గాల్లో దేనిదో ఒకదానిది పైచెయ్యి అయితేగానీ "సామాన్య ప్రజల" వరకూ ఈ మార్పు చేరదు. ప్రస్తుతానికి ఆ సామాన్యులు they are fighting for their basic livelihood. They have nothing to do with this meaningless debate.

కాకపోతే గత రెండు దశాబ్ధాల్లో మతపరంగా పునర్నిర్వచింపమంటున్న గుంపుకు అదొక రాజకీయ ఆయుధంగా కనిపించి త్వరగా en-cash చేసుకుందామనుకుని, సైద్ధాంతికంగా ఎదగని ఆ ఆలోచనని ఆచరింపజూశారు. దానికి పర్యవసానం హింస-ప్రతిహింస-మళ్ళీహింస- మళ్ళీమళ్ళీ హింస.

Partition నేపధ్యంలో భారతీయ మానసికతలో భాగమైన మతరహిత చరిత్రకు ఈ తంతుతో మరింత ఊతం లభించింది. మతపరమైన చరిత్రతో హింసేతప్ప శాంతి రాదనే నమ్మకం స్థిరపడింది. అహింసను కోరుకునే మెజారిటీ ప్రజలు మౌనంగా దీన్ని ఆమోదించారు.హింసను ప్రోత్సహించే మతరాజకీయాలను దూరం పెట్టారు. దాంతో ఈ చరిత్ర కోణంకూడా సాధికారత కోల్పోతూ ఉంది.

ఎప్పుడైతే చరిత్రని రాజకీయం చేశామో. హింసాత్మక ప్రతీకారానికి దారిని చేశామో. అప్పట్నుంచీ ఈ చరిత్ర కోణం పట్ల సహానుభూతి ఉన్న ఆ కొద్ది మందినీ దూరం చేసుకున్నాము. భారతదేశం మతచరిత్రను dispassionate గా అర్థం చేసుకునే సమయంలో ఉంది అనే నమ్మకాన్ని వమ్ముచేశాము. మరో యాభయ్యేళ్ళవరకూ ఈ డిబేట్ కొనసాగించినా మతచరిత్రకు సాధికారత రాకుండా ఉండే పరిస్థితి కల్పించాము.

కాబట్టి సమస్య తమ గొంతు వినిపించలేని మెజారిటీ హిందువులది కాదు. ఆ హిందువులకు ఆధిపత్యం వహిస్తున్నామన్న భ్రమలో మొదటికే మోసం తెచ్చిన ఒక armature ideologyది. తప్పు తమ ప్రయోజనాలకు అనుగుణంగా దాడిచేసేవాళ్లది కాదు. తమ దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఫణంగాపెట్టి స్వల్పకాలిక రాజకీయలబ్ధి పొందాలనిచూసిన రాజకీయ నాయకులది.

భారతదేశం "హిందుత్వ దేశం" అయిన తరువాత మీ ఆఖరి పాయింట్ చెల్లుతుంది. ప్రస్తుతానికి ఇదొక సెక్యులర్ దేశం. కాబట్టి Lets go by the law of the land.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

మీరు చెప్పిన దాని ప్రకారం చూసినా తప్పు కొంతమంది మనుషులదే తప్ప హిందూధర్మానిది కాదుకదా? అలాంటప్పుడు మీరు ఎందుకు హిందూధర్మంపై అలాంటీ వ్యాఖ్యలు చేస్తారు. నేను చెప్పిన పాయింట్ సెక్యులర్ దేశంలోనే చెల్లుతుంది. మీరు సరిగా చూసినట్టులేరు. ఒక వేళ హిందూరాజ్యమైతే అప్పడు పరిస్థితి వేరేగా ఉండెది. సర్దుకోవాల్సిన అవసరం ఉండదు. మరొకవిషయం, ప్రజలు ఏనాడు మతరహితమైన సమాజాన్ని కోరుకోలేదు. ఒకవేళ అంతమంది కోరిక అదే ఐతే ఇప్పుడు సమాజం వేరేగా ఉండేది. మీరు చెప్పినంత హింస గత రెండుదశాబ్దాల్లో ఎంత జరిగింది?