Monday, April 27, 2009

సమకాలీన పురుషుడికి ఒక "మేల్ కొలుపు"


"మగాళ్ళంతా ఇంతే" అని స్త్రీవాదులు స్వీపింగ్ జనరలైజేషన్ చేసినప్పుడల్లా, ఒక్కసారిగా నాలో ఉవ్వెత్తున ఎగిసే నిరసన స్వరాల్ని ఎప్పుడూ అక్షరబద్ధం చెయ్యలేకపోయాను. కానీ నా స్వరాన్ని సంగీతంలా వినిపించిన పుస్తకాన్ని ఇప్పుడే చదివాను. నా భావాల తీవ్రతను మించిన వ్యక్తీకరణ కలిగి ఉండటమో లేక నా ఆలోచనల తీరాల్ని తాను తాకొచ్చిన అనుభూతిని మిగల్చడమో తెలీదుగానీ ఇంస్టంట్ గా ఈ పుస్తకం నాకు నచ్చేసింది. అప్పుడప్పుడూ నాలో రేగిన భావతుంపరల్ని జడివానలాగా కురిపించిన ఈ పుస్తకం పేరు "మేల్ కొలుపు". రచయిత అరుణ్ సాగర్.ఆంధ్రజ్యోతి లో ఇరవై ఐదు వారాలపాటూ సాగిన ఈ వ్యాసపరంపరని ఒక సంకలనంగా 2003 లో ప్రచురించారు.

పూర్తి సమీక్షకై పుస్తకం చూడండి.

****

7 comments:

Anonymous said...

Great Effort..

I take a look at it for sure!!!

Sky said...

తప్పక చదవాల్సిన పుస్తకం. సగం చదివి ఆపాను సంవత్సరం క్రితం- మళ్ళీ మొదలుపెట్టి చదువుతాను.

Anonymous said...

ఈ పుస్తకం గురించి నేను చాలా రోజుల క్రితమే చదివాను. చదవగానే నాకు కూడా ఆ పుస్తకం కొని చదవాలనిపించింది. ఈ స్త్రీవాద ప్రపంచంలో మగాడు తన కంఠాన్ని వినిపించడం చాలా మంది స్త్రీవాదులకు నచ్చలేదనుకుంటా! ఒకావిడ (పేరెందుకులెండి), అంధ్రజ్యోతిలో ( ఆదివారం వచ్చే బుక్-లెట్ లో) దీన్ని సమీక్షిస్తూ "మన మధ్యలో ఒక మగ కంఠం వినిపించడం ఆహ్వానిచదగిందే" అంటునే పాపం చాలా సన్నాయి నొక్కులు నొక్కారు.

అందులో ఒకటీ...

"రచయిత గారు మగాల్లకి కూడా ఆత్మ గౌరవముంటుందని స్త్రీలు గుర్తించాలి అని" రాసినదానికి సదరు రచయిత్రిగారి వ్యాఖ్య ఏమిటొ తెలుసా? "చా! నిజమా" అని. అంటే ఆవిడగారి దృష్టిలో మగవారికి అత్మాభిమానం వుండదన్న మాట. "హా! ఫెమినిస్ట్" అని మనసులో అనుకోకుండా వుండలేక పోయాను.

కొత్త పాళీ said...

ఈ రచనలు ఆంధ్రజ్యోతి ఆదివారంలో కాలంగా వస్తున్నప్పుడు చదివాను. చాలా బాగా రాశారు. అక్కడ వ్యక్తపరిచిన ఆలోచనల్లో గొప్ప లోతుందని అనుకోను గాని వ్యక్తీకరణలో మంచి శైలి ఉంది. ఆధునిక సమాజంలో మగవాడిగా మనగలగటంలోని అనేక పార్శ్వాలని స్పృశించారు.

సుజాత వేల్పూరి said...

మీ రివ్యూ వెంటనే పుస్తకం కొనాలనిపించేలా ఉంది. నాకెందుకో మీరింతకు ముందొకసారి సమీక్షించిన "let me confess" గుర్తొస్తోందేమిటి?

ఆకాశరామన్నగారు....:))

Kranthi M said...

Mahesh garu,
nenu ilanti feelings lo unnappude anukokunda mee sameeksha chadavadam tatastinchindi naa feelings ikkada chudagalaru

http://srushti-myownworld.blogspot.com/2009/04/blog-post_28.html

వర్మ said...

మహేష్ గారు,

చాలా బాగుంది మీ విశ్లేషణ. పుస్తకం నేను కూడా తప్పకుండా కొంటాను. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు ............