‘బారా ఆణా’ అనే సినిమాలో నసీరుద్దీన్ షా పాత్ర కిడ్నాప్ చేసి ప్రతిగా డబ్బులు తీసుకూంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడుతుంది. కానీ...కోర్టు వారు అతని మీద కేసు కొట్టేస్తారు. కారణం, ప్రభుత్వ రికార్డుల ప్రకారం అతను ఒక "మరణించిన" వ్యక్తిగనక. చిత్రంగా ఉందికదా! అదే నిజంలో ఉన్న విచిత్రం. గ్రామంలో తన దాయాదులు ఆస్థి కొట్టేసే ప్రయత్నంలో భాగంగా, నసీరుద్దీన్ షా ఎక్కడికో వెళ్ళిన సమయంలో అధికారులతో కుమ్ముక్కై అతను చనిపోయాడని నిర్ధారిస్తారు. తను బ్రతికున్నాననై నిరూపించడానికి చేసే ప్రయత్నం బెడిసి కొడుతుంది. అప్పటి నుండీ ఒక మరణించిన వ్యక్తిగా జీవిస్తాడు.
కానీ ఇక్కడ చర్చ, ‘బారా ఆణా’ సినిమా గురించీ కాదు. నసీరుద్దీన్ షా నటన గురించీ కాదు. ప్రభుత్వ రికార్డుల గురించి.
నాగరికత పరిణామంలో లిఖితపదం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ముఖ్యంగా రాజశాసనాలూ, రాజ్యాంగాలూ ప్రభుత్వం యొక్క ఉనికికీ అధికారానికీ చిహ్నాలు గనక దాని ప్రకారం రాయబడిన ఏదైనా writing on the wall ఏం ఖర్మ, writings on the rock అయిపోయాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నదే నిజం. అది భౌతికంగా నిజం కాకపోయినా, సైద్ధాంతిక పరంగా మనం అంగీకరించకపోయినా, రికార్డులు మారేంతవరకూ అదే నిజం.
ఈ నేపధ్యంలో, దళిత క్రిస్టియన్లు రికార్డుల పరంగా హిందూ మతంలో ఉండటాన్ని ఏవిధంగా ఎవరు ఛాలెంజ్ చేస్తారు? అందుకే హిందుత్వ పార్టీలూ అధికారంలో ఉన్నప్పుడు చట్టాల్ని మార్చకుండా, ఇప్పుడు మతం మార్పిడి గురించీ, ‘దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లకు అర్హులు కారు’ అని మాట్లాడుతుంటే నాకు చిత్రంగా ఉంటుంది.
మతం అనేది నమ్మకానికి సంబంధించిన విషయం అనుకుంటే, క్రైస్తవాన్ని నమ్మినా సామాజిక పరిస్థితి మారని దళితులు తమ కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనభవిస్తే జరిగే ఘోరమేమిటి? ఎందుకంటే, కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు సామాజిక సమానత కోసం కల్పించబడినవేగానీ మతం ప్రాతిపదన కాదు కదా! క్రైస్తవానికి మారిన రెడ్డి, రెడ్డికులానికి సంబంధించకుండా పోనట్లే, దళితులు క్రైస్తవానికి మారినంత మాత్రానా దళితులు కాకుండా పోవాలంటే ఎట్లా?
ఏది ఏమైనా కూడికలూ తీసివేతలూ మనం చేస్తే అయ్యేవి కావు. రికార్డుల్లో ఉన్నదే సత్యం. క్రైస్తాన్ని అవలంభిస్తున్న దళితులు కూడా ప్రభుత్వ పరంగా హిందూ మతం వారే.
Wednesday, April 22, 2009
కూడికలు - తీసివేతలు
*****
Subscribe to:
Post Comments (Atom)
17 comments:
ఇది కామెంట్ కాదు.ప్రశ్న:
దళిత క్రిస్టియన్లు రిజర్వేషన్లకు అర్హులు కారు అన్నారు...సరే...కానీ వాళ్ళు దళిత హిందువులుగా రికార్డుల్లో ఉన్నారా? మరి అప్పుడు అదే దళిత హిందువులకి రిజర్వేషన్ దొరకట్లేదా?ఒకవేళ దొరికితే మరిక ప్రాబ్లెం ఏంటి??
Transliterator is very slow and hence comment in english...hope you don't mind.
Quite surprising and asu sual, if I may say, quite contreversial thought.
If the reservations are based on castes and as the mentioned castes are that of Hindu religion, how can you seperate the caste from religion?
If this is what you believe, then why the criticism of hindu religion mainly for casteism?.
(ps- I have not read all of yur postings, so if you have criticised other religions as well for casteism, then my last para stands cancelled)
Contd
so taking some of your comments, opinions and posts together, you beleive that it is allright for converted chirstians to behave selfishly irrespective of morality- but on the other hand you rise the banner of morality when questioning the slefishness of the so called forward castes.
Somewhere else you have said that it is right proportional representation is right and is socially acceptable (not in exact words but in essence)...is proportional represntation not a system of unmoralistic system whereby a group of person's ability to vote is given precedence over the "actual merit"....for example...how many of ALL the general population (including those who support proportional represetation) would, in their heart of hearts....aggree that it is right that they or their relative should be treated by a doctor who did his MD by caste based reservation rather than merit?
All in all, the bottomline shall allways be that, irrespective of moralities, it is allways the power to wield power that decides what social norms are.....irrespective of moralities AND irrespective of who is the real power wielder...fcs in the past or others now.
It is power that counts and nothing else...so let us not beguile oursleves that it is anything else...least of all morality.
కత్తి,
భలే దిక్కుమాలిన పాయింట్లు లాగుతావు బాసూ నువ్వు. వీపీ సింగు ప్రధాని అయినప్పుడు నువ్వెవరో తెలిసుంటే, నీకో మంత్రిపదవి ఇచ్చేవాడు.
ఇంతకీ తమరు సెలవిచ్చినదాని ప్రకారం, దళిత కిరస్తానీలు క్రీస్తు ఊసెత్తకుండా కిరస్తానీ డబ్బులతో జీడిపప్పులు కొనుక్కుతింటూ, రికార్డుల్లో మాత్రం దళితులుగానే మతం మార్చుకోకుండా పండగ చేసుకోమనేగా?
(పాపం ఆ వాటికనౌ పిచ్చినాన్నలు డబ్బులిస్తే క్రీస్తు క్రీస్తు అని మన దళితులు పాటలు పాడుకుంటారనుకుంటారో ఏమో, ఇక్కడ కత్తి స్వామి ఇలాంటి ట్రిక్కులు దళితులకి చెప్తాడని తెలీక)
ఏమైనా కత్తీ నువ్వు మామూలోడివి కాదు.... చావు తెలివితేటలు పుష్కలంగా ఉన్నోడివి.
"క్రైస్తవానికి మారిన రెడ్డి, రెడ్డికులానికి సంబంధించకుండా పోనట్లే, దళితులు క్రైస్తవానికి మారినంత మాత్రానా దళితులు కాకుండా పోవాలంటే ఎట్లా?"
మరిదే విచిత్రం, కులాతీతమైన క్రైస్తవ మతంలోకి వెళ్లాకకూడా ఇంకా దళితులేంటి, రెడ్డులేంటి, వాళ్లు క్రైస్తవులంతే.
@కత్తి:
This time you are on the point. You wrote... "క్రైస్తాన్ని అవలంభిస్తున్న దళితులు కూడా ప్రభుత్వ పరంగా హిందూ మతం వారే".
This morally and economically wrong on the part of Christian Dalits, to steal the opportunities of Hindu Dalits.
Hindu Dalits are fighting back on this injustice for the ages. Before upper caste people denied them the rights, now Christian Dalits denying the rights of Hindu Dalits.
So Hindu Dalits are facing discrimination in the hands of Christian Dalits.
So Christian Dalits are real culprits (who steal opportunities) who keep Hindu Dalits at the bottom of the society.
So Christian Dalits are committing day light robbery under the Indian Constitution.
Can't we do something for our downtrodden brethren (Hindu Dalits)? When this exploitation ends? The exploiter shifted from upper caste person to a Christian Dalits, but the plight of Hindu Dalit is same.
@రేరాజు: నాకైతే ఇది సమస్యకాదు. చాలా మంది దళితులు ఇది సమస్యగా అనుకోరు. కాకపోతే, దళితుల ఓట్లని దండుకోవాలనుకునే కొన్ని హిందుత్వపార్టీలు హిందూయిజాన్ని కాపాడుకోవడానికి మతమార్పిడులు విఘాతమని ఎలా అపోహలు కల్పిస్తున్నారో అదే విధంగా దళితుల్లో అభద్రతాభావాన్ని కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ ఆలోచనలకి ఊతమిస్తున్నారు. అందుకే ఈ టపా.
@భావుకుడన్: ప్రస్తుత సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో మతంకన్నా కులం identity చాలా ముఖ్యమైనది. అవకాశాలకోసం మతమైనా ఒదులుకుంటారేగానీ కులాన్ని ఎవ్వరూ వీడరు.
కులం ఎవరి సమస్యాకాదు. కులవివక్ష దళితుల సమస్య. కాబట్టి, కులవ్యవస్థ నిర్మాణంతో విభేధమేగానీ, కులం అనే ఆలోచనతో కాదనే నిజాన్ని మీరు గ్రహించాలి. వివక్షను పుట్టుక ప్రోత్సహించినా, లింగపమైనదైనా, తక్కువ జనాభా పరమైనదైనా అది ఖండనీయమే.అది ఏమతంలో ఉన్నా, ఏ సమాజంలో ఉన్నా నేను నిరసిస్తాను. మానవహక్కుల హననానికి జరిగే ప్రతి వివిక్షాపూర్వకమైన చర్యనూ నేను వ్యతిరేకిస్తాను.
నా వ్యాఖ్యలకూ టపాలకూ అదే basis.మీకు సందేహంగా ఉంటే మరొక్కసారి నా టపాల్ని వీలైతే చదువుకోండి.
To your second observation,నైతికవిలువలు నా సమస్య కాదు. మనిషిగా గౌరవప్రదంగా జీవించడం నా సమస్య. కాబట్టి మీరు చెబుతున్న నైతికత-morality తో నాకు సంబంధం లేదు. నేను morality కి సంబంధించిన banner ఎప్పుడూ పట్టుకోలేదు. ఎప్పుడూ advocate చెయ్యలేదు.
మీరు మాట్లాడుతున్న meritocracy ఒక మిథ్య అని ఇప్పటికే social scientists and psychologist తేల్చి చెప్పేసారు. కాబట్టి దాని మీద ఇక్కడ చర్చ చెయ్యడం అసమంజసం. కానీ ఒక్క మాటలో చెబుతాను.Merit is not inborn. It comes through conditioning. And conditioning can be "created" by providing opportunity.
@స్వామీ: మతంకన్నా కుల వివక్ష దళితుల సమస్య. మీరు హిందువులంటున్న దళితులు కూడా దళిత దేవతలైన మాతమ్మకు, పోతరాజుకూ, పోలేరమ్మకూ పూజలు చేస్తారేగానీ రెగ్యులర్ హిందూ దేవుళ్ళకు కాదు.అయినా, దళితుల్ని హిందువులుగా మిగిలినకులాలు ఎప్పుడు అక్కున చేర్చుకున్నారుగనక వారు హిందువులమని గర్వపడాలి?
మధ్య వాటికన్ ప్రసక్తి తెచ్చి మీరు మరీ నాకు నవ్వు తెప్పిస్తున్నారు. మనదగ్గర చాలా వరకూ క్రైస్తవులు ప్రొటెస్టంట్లు.
@సూర్యుడు: మతాన్ని వొదులుకున్నా కులాన్ని ఇంకా ఎవరూ వదలలేదు. మతమార్పిడి జరిగిన వాళ్ళలో కూడా అదే కులాల మధ్యన పెళ్ళిళ్ళు జరుగుతాయి. కాస్త inquiry చేసి చూడండి. చర్చిలోకూడా దళితులపట్ల వివక్ష చూపిస్తున్నారని పోరాటాలు జరిగిన ఘటనలున్నాయి.
కాబట్టి, మతమార్పిడి నేనే ఎక్కడో చెప్పినట్లు, "ఉద్యోగం మారిన"వైనమేగానీ మరొకటి కాదు.
@అనామకుడు: నువ్వు చెబుతున్న morality నాకు తెలీదు.అందుకే చట్టప్రకారం, చట్టం మార్చనంత ప్రకారం లీగల్ గా మతంపుచ్చుకున్న దళితులు కూడా హిందువులే. If you want to contest it in the court of law, please do so.
Don't give your Hindutva rhetoric to courts. You will be thrown out first.
హిందూ దళిత, క్రిస్టియన్ దళిత ఏంటి? అసలు రిజర్వేషన్లివ్వాల్సింది కుల మతాలకి అతీతంగా - కుటుంబ ఆర్ధిక పరిస్థితి ఆధారంగా. అధోగతిలో ఉన్న బ్రాహ్మలు, ముస్లిములకి లేని అవకాశాలు ఓ మధ్యతరగతి దళితుడికి ఎందుకుండాలి? సామాజిక న్యాయం అంతే కులాలవారీ న్యాయం కాదు - అందరికీ సమమైన న్యాయం. ఇప్పుడున్న కుల ఆధారిత రిజర్వేషన్ల వల్ల పదిమంది అర్హులైన దళితులు పైకొస్తే అదే సమయంలో మరో పదిమంది అర్హులైన దళితేతరులు వెనకబడిపోతున్నారు. ఇది ఏ రకమైన అభివృద్ధి? రిజర్వేషన్ల వల్ల గత అరవయ్యేళ్లలో పైకొచ్చిన వెనుకబడ్డ తరగతులవారి గురించిన సర్వేలున్నాయే కానీ వాటి కారణంగా అర్హతున్నా అవకాశాలు పోగొట్టుకుని వెనకబడిపోయిన వారి గురించిన లెక్కలెవరు తీశారు?
రిజర్వేషన్లు వచ్చింది ఆర్ధిక వెనుకబాటును నిర్మూలించేందుకు కాదు...
సామాజిక వెనుకబాటును, సామాజిక వివక్షను , సామాజిక అన్యాయాన్ని నిర్మూలించేందుకు. !
ఈ దేశం లో, హిందూ మతం లో వేలాది సంవత్సరాలుగా అగ్రకులాల వారే ఆధిపత్యం చెలాయిస్తూ..
చదువునూ, సమస్త సంపదలనూ తామే అనుభవించేలా మను స్మృతులనూ, ధర్మ స్మృతులనూ
రాసుకుని అమలు చేస్తూ వచ్చారు.
కింది కులాల వాళ్ళను గుడుల్లోకి, బడుల్లోకి , చివరికి వీధుల్లోకి కూడా రానివ్వకుండా జంతువులకంటే
హీనంగా చూసారు.
అందుకే అనేక కులాల వాళ్ళు వేలాది సంవత్సరాలుగా అన్యాయంగా వెనుకబాటుతనానికి
గురయ్యారు. ఇప్పటికీ ఈ దేశం లో అంటరాని తనం , దళితుల పట్ల చులకన చూపు, చీత్కారం పోలేదు;
తరతరాల ఈ సామాజిక దురన్యాయాని కొంతమేరకైనా సరిదిద్దడానికే
రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు.
ఇప్పుడు దానిని ఆర్ధిక చట్రం లోకి తెచ్చి దాని అసలు స్ఫూర్తినే దేబ్బతీయాలనుకోవడం
మరో అగ్రవర్ణ మనుస్మృతి కిందకే వస్తుంది.
మతం మారినా వేలాది ఏళ్లుగా కొనసాగిన వివక్ష ప్రభావం ఏమి పోదు. కాబట్టి దళితులు క్రైస్తవం ఇస్లాం, బౌద్ధం ఎ మతం లోకి మారినా వారి నేపధ్యం ఆధారంగా రిజర్వేషన్ సౌకర్యం కొనసాగించాలి అనే వాదన నా దృష్టిలో న్యాయమైన వాదనే !
@అబ్రకదబ్ర: మీ ప్రశ్నకు ప్రభాకర్ గారిచ్చిన సమాధానం సరైనది. దానికి అనుబంధంగా నేను కొంత చెబుతాను.
ఆర్థికపమైన తేడాలకు అనుగుణంగా వెసులుబాటు కల్పించడానికి ఎవరూ అడ్డుచెప్పటం లేదు. BPL-దారిద్ర్యరేఖకు దిగివనున్న వారికిచ్చే లాభాలన్నీ దాని క్రిందకే చెందుతాయి. విద్య ఉద్యోగాల్లో ప్రధానంగా కులం కారణంగా వివక్షకు గురైన వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దానికీ ఆర్థికపరమైన వెసులుబాటుకూ లంకె కలపడం చాలా misleading వాదన.
రిజర్వేషన్ అనేది ఒక సామాజికపునర్నిర్మాణ కార్యక్రమం. ఇందులో లెక్కలేసి దళితులకిచ్చిన అవకాశాలమూలంగా దళితేతరులకు అన్యాయం జరుగుతుందని వాదించడం అర్థరహితం.మరైతే కొన్ని వేల సంవత్సరాలుగా మాకు అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పుడు అన్ని అవకాశాలూ మాకే కావాలని దళిలంటే మీదగ్గర తప్పని చెప్పటానికి లెక్కలున్నాయా?
వాటికన్ కాకపోతే మరోటి. కిరస్థానీలేగా...అడుక్కుతినే యవ్వారం కాకపోతే, ఇప్పుడు మళ్ళీ ప్రయివేట్ కొలువుల్లో కూడా రిజర్వేషన్లని ఏడవటం ఎందుకో? అక్కడ కూడా తమ పని(లేమి)తనం చూపెట్టి చెడగొడదామనా?
సమస్యేంటంటే, ఓ సారి తోలు వాసన రుచి చూసిన తర్వాత విడిచిపెట్టటం కష్టం..... సచ్చేదాకా అదే కావాలంటారు.
One of the main reason for Dalit flight in India, for that matter any where in the world is slavery. India was enslaved by Muslims and Christians for 1000 years and looted the wealth and tranferred the wealth to Islamic lands and Europe respectively.
The other main reason is, we all know that upper sections domnated the economic, social and religious spheres and did not allow Dalits to prosper.
Religious conversions can not solve the Dalit problems. Missionaries are here to loot Dalits and enslave them for ever. Can't you learn any thing from Blacks in America and Africa?
@స్వామి: చాలా వివక్షాపురితమైన వ్యాఖ్య.
మతంమార్చుకునే దళితులకూ ఎక్కువజీతం కోసం ఉద్యోగం మార్చుకోవడమో లేక విదేశాలకు వెళ్ళే వారికీ తేడా లేదు. మీరు వీళ్ళని అడుక్కుతినేవాళ్ళంటే చాలా మందిని అనాల్సుంటుంది.
రిజర్వేషన్ల ద్వారా సీట్లు సంపాదిస్తారుగానీ,పాస్ అవడానికి minimum qualification ఖచ్చితంగా అవసరం. ఆ అర్హతలు సంపాదించుకునే కోర్సులు పూర్తిచేసి ఉద్యోగాల్లో చేరుతున్నారు. కాబట్టి వారి పనితనన్ని ప్రశ్నించడం మీ అపోహేతప్ప మరొకటి కాదు.
@అనామకుదు: Dalits are DALITS not because of muslim and christian rule. It is essentially because of the discrimination of hindu upper caste.
ఇక్కడ మాటలు,మీ పోస్టూ కూడా సరిగ్గా అర్ధం కావట్లేదు. ఐనా నా ఆలోచన ఒకటిక్కడ చెప్తాను.కొంచెం తింగరి అనిపించినా దానికి భిన్నమైనది ఏమి జరుతుతోందో నాకు చెప్పండి:
ఉదా ఇలా తీసుకోండి :: నేను దళితుడను; రికార్డులో నేను దళితుడనని, హిందువునని నమోదు అయి ఉన్నది. కాబట్టి నాకు రిజర్వేషన్ సౌకర్యం ఉంది. నా దైనందిన
జీవితం లో నేను క్రైస్తవాన్ని ఫాలో ఔతున్నాను. ఓట్ వేయాల్సి వచ్చినప్పుడు నాకు ఇష్ట మొచ్చిన పార్టీకి నేను ఓటు వేస్తున్నాను.
ఒక వేళ, రికార్డుల ప్రకారం నేను దళితుడు: క్రిస్టియను అని రాయమని మీరు అడుగుతున్నారా!? అలా ఐతే నాకు తీవ్ర అభ్యంతరం ఉంది.
నేను హిందువును - నేను ప్రస్తుతానికి క్రైస్తవాన్ని ఫాలో ఔతున్నాను; అంతే! రేపు మళ్ళీ మరో కారణంగా సత్య సాయి బాబా నచ్చితే, నేను వేరే ఫాలో ఔతాను.
అలాంటి వెసులు బాటు నాకు హిందువు గా (మత పరంగా) ఉన్నదని నా అభిప్రాయం . కావాలంటే, నేను కాసేపు బౌద్దడను కావచ్చు; ఇలా నేను ఏది ఫాలో ఐనా,
మారిన ప్రతి సారి, రికార్డుల్లో మతం మార్చుకోమంటే, చిరాగ్గా ఉంటుంది.
ఒకవేళ : నేను కేవలం క్రిస్టియన్ ఐతే - అప్పుడు కేసు కొంచెం క్లిష్టమే! - క్రిస్టియన్ గా పుట్టి, మళ్ళీ నేను హిందువుగా రికార్డుల్లో మారటానికి ఛాన్స్ ఉందో లేదో నాకు
తెలీదు. ఇప్పుడు ఇంకో డౌట్ కూడా వచ్చింది: ఒక్క సారి నేను క్రిస్టియానిటీకో, బౌద్ధానికో మారిపోయాక మళ్ళీ నేను హిందువు గా మారిపోయానని రికార్డుల్లో చెప్పే
అవకాశం ఉందా!?
కానీ అలా అవకాశం ఇస్తే, రిజర్వేషన్స్ ఎలా మ్యానేజ్ చేస్తాం! అందుకని, హిందువు అనేది ఓ వేరియబుల్ కాన్స్టెంట్ గా పెట్టుకోవటం నాకు నచ్చింది. అది అలాగే
ఉండాలి.ఓ దళితుడుగా నాకు హిందూ ఐడెంటీయే నచ్చినట్టుందే!
అదీ కాక : దళిత క్రిస్టియన్ అనే వాడు ఒకడుంటే, కాపు క్రిస్టియన్, రెడ్డి క్రిస్టియన్, బ్రాహ్మిన్ క్రిస్టియన్ అని కూడా నమోదులు ఉండాలిగా అని వాదించాల్సి వస్తుంది.ఒక
వేళ అలా వాదిస్తే, క్రిస్టియానిటీలో కులవ్యవస్థని పెంచి పోషించినట్టవ్వదూ? ఉన్న చీలికలు చాలక, ఇంకా ఇన్ని కొత్త చీలికలా!? పైగా క్రిస్టియానిటో లో కుల వ్యవస్థ
ఎక్కుడుందీ!!?? అందుచేత - "దళితుడు" - అంటే వాడు హిందువుగా రాసుకోవటమే కరెక్టు అని నాకు అనిపిస్తోంది!
పోతే : అసలు రిజర్వేషన్లు కుల ప్రాతిపదికగా కొనసాగించాలా?లేక ఆర్ధిక స్థితిగతుల ప్రాతిపదికగా కొనసాగించాలా అన్నది మంచి చర్చ. ఆర్ధికంగా ఏ విధంగా
అణగారిపోతున్నా కూడా, "రిజర్వేషన్" ద్వారా మంచి చేయూత నివ్వచ్చునేమో నని నా కనిపిస్తుంది.
Dear కత్తి: When you write "Dalits are DALITS not because of muslim and christian rule. It is essentially because of the discrimination of hindu upper caste".
you are missing the real point and solution for the lower caste people in India. I will try to explain with some examples.
1) Hindus were enslaved by Muslims and Christians for 1000 years. It is a fact. The word "slave" was used purposely to convey that Muslims and Christians were the masters who determined the destiny of all Hindus (including Hindu Dalits). They imposed religious taxes on Hindus. They looted the wealth of Hindus. They looted the freedoms of Hindus. It is like Jewish slavery under Babilonians, Egyptians, Persians and White Europeans (read Romans).
Jewish religion, culture, social systems and their Old Testment was infuenced by this slavery under Babiloniand, Egyptians, Persinas and White Europeans (Whites).
Similarly Hindu religion, culture, social systems and their religious books were influenced by the rslavery enforced by Muslims and Christians.
You are discounting the above facts and accusing upper castes. You can not go far with this logic. With you shortsightedness you are encouraging Hindu Dalits to embrace foreign religion, which is more sinister than what upper caste people follow.
2) You have to cure the underlying casue, but not the symptoms. Upper caste exploitation is only a symptom, but the actual cause was Muslim and Christian enslavement of Hindus.
3) If we apply your logic , all Blacks must convert either to Islam or Buddism or Hinduism. Can you digest if it happens that way?
Because Blacks were brutally enslaved by Christians. Should they blame Christianity for that?
4) Wehave to find rational and practical solutions for Hindu Dalit problems. With hatred we can not go far.
మంచి డిస్కషను జరిగింది.
ఇక్కడ చాలామంది విశ్మరించిన ఒకవిషయం
కన్వర్టెడ్ క్రిష్టియనులకు ప్రభుత్వం బి.సి.- సి. అనే గ్రూపులో చేర్చి రిజర్వేషన్లు (2%)కల్పించింది. (ఎ.పి లో)
ఇక ఈ సమస్య విస్త్రుత పరిధిలో మాట్లాడాలంటే, మతం మారినంతమాత్రాన పరిస్థితులు మారాయని అనుకోలేం. కనుక హిందూ దళితులుగా ఫలాలను అందుకోవటం సహేతుకమే.
ఏది ఏమైనా ఈ రిజర్వేషన్లనేవి ఒకటి లేద రెండుతరాలకు మాత్రమే పరిమితం చేయటమో, లేక బి.సి లకు వర్తింపచేసినటువంటి శాస్త్రీయమైన క్రీమీ లేయర్ పద్దతి ప్రవేశపెట్టటం వల్ల కొన్ని సామాజిక సమస్యలను పరిష్కరించినట్లవుతుందనీ, సమాజంలో నిజంగా అర్హులైనవారందరికీ న్యాయం జరుగుతుందనీ నా అభిప్రాయం.
@బొల్లోజు బాబా:
You brought up couple of excellent points.
1)This point is informative.
కన్వర్టెడ్ క్రిష్టియనులకు ప్రభుత్వం బి.సి.- సి. అనే గ్రూపులోచేర్చి రిజర్వేషన్లు(2%)కల్పించింది.(ఎ.పి లో)
2) This is what we need.
ఏది ఏమైనా ఈ రిజర్వేషన్లనేవి ఒక (టి లేద రెండు) తరానికి (లకు) మాత్రమే పరిమితం చేయటమో
If we don't implement the 2nd point, fruits can not reach to the most needy who constitute the bottom of this social/economic pyramid.
If you you reward the same person(s) generation after generation, people behind him/her/them in the queue never get a chance. Resources are limited. One person or family can not grab all the fruits generation after generation. That to these are freebies given by rest of the society.
Post a Comment