మతబ్రహ్మచారులందరూ ఒకటిగా చేరి ‘గే’చట్టాన్ని రద్దుచెయ్యాలని ఉద్యమించారు. తమకు సంసారమే పనికిరాదనుకునే వీళ్ళకు ‘గే/లెస్బియన్’ లతో సమస్యేమిటో ఒక పట్టాన అర్థంగాని విషయం.
వీళ్ళ మాటల్ని టివీ లో వింటుంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది, వీళ్ళు మతం పేరుతో చెబుతున్నదాంట్లో నిజమెంతుందో తెలీదుగానీ...ఏ ఒక్కరూ ఇంత వరకూ 105 పేజీల కోర్టు జడ్జిమెంటు మాత్రం చదవలేదు.
gay rights_judgement
ఒకవేళ వీరు చదివినా బహుశా అర్థం కాదేమోగానీ...
కనీసం మీరైనా చదవండి.
gay rights_judgement
21 comments:
Just leave the gays alone! We have no right to bother them as long as they don't bother us!!!
సార్, నాకు, నాబోటి వారికి ఇలా అన్నీ ఫుల్లుగా చదివే తీరికా, ఓపికా వుండవు కనుక ఎలాగూ మీరు చదివేసి వుంటారు కనుక ముఖ్యాంశాలు ఏమయినా వుంటే చెబుదురూ.
// తమకు సంసారమే పనికిరాదనుకునే వీళ్ళకు ‘గే/లెస్బియన్’ లతో సమస్యేమిటో ఒక పట్టాన అర్థంగాని విషయం.
మహేష్ గారు,
మత బ్రహ్మచారుల గురించి వదిలేయండి. మీరు 'గే/లెస్బియన్ ' చట్టాన్ని సమర్ధిస్తున్నారా ?
ప్రకృతికి విరుద్ధంగా జరిగే వాటిని ఎలా సమర్ధిస్తారు ? స్త్రీ-పురుషుల సంబంధాన్ని కాదన్న వాళ్ళు మానసిక జాఢ్యం ఉన్నవాళ్ళే. చూస్తూ చూస్తూ మానసికరోగులకి చట్టబద్ధత కల్పించటం ఎంతవరకు సమంజసం?
భావవైశాల్యం ఉండాల్సింది ప్రకృతికి విరుద్ధంగా జరిగే చర్యల మీద కాదు.
nenu same sarath gaarilaagane
but teerika leka kaadu baga lazyness anukovachhu second anta artham chesukune mind ledu.......aa side........
ante ippudu evro iddaru kottukuntunnarani manaki em kaleduga ani voorukuntama .....aapali.alani idi anukunta.........srushtiki viruddham ga.........cheyatam tappukada............
ani.......
ఆయనే ఉంటే మంగలెందుకనీ, అంత జడ్జ్ మెంట్ చదివే ఓపికే ఉంటే ఆ టపా ఏదో మేమే రాసేద్దుంగా! ముఖ్యాంశాలు చెప్పండి. అభిప్రాయమైతే వెంకట రమణ గారితో ఏకీభవిస్తున్నాను.ఇదొక మానసిక జాడ్యమే!
స్వలింగ సపర్కం అనేది జాడ్యం కాకపోగా దానిని ఏవగించుకోవడాన్నే మానసిక జాడ్యంగా ఇప్పుడు గుర్తిస్తున్నారు. దానిని హోమో ఫోబియా అంటారు. అది చాలా ఎక్కువగా వుంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం. భారత్ లో అట్రాసిటీ చట్టాలు వంటివి ఎంత పదునుగా వుంటాయో అభివృద్ధి చెందిన దేశాల్లో లైంగిక ధోరణులను బట్టి గేలి చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంది. మారుతున్న కాలాన్ని బట్టి మన అభివృద్ధిని కేవలం ఐ ఫోన్ ల వంటి వాటిల్లోనే కాకుండా మానసిక ధోరణుల్లో కూడా అహ్వానించగలగాలి.
బై ద వే - నేను బై సెక్సువల్ ను. నేను హై కోర్టు తీర్పును హర్షిస్తున్నాను. కాకపోతే ఈ తీర్పుని సుప్రీం కోర్టో, పార్లమెంటో రద్దు చేసినా ఆశ్చర్యం లేదు. ఏమయినప్పటికీ భారత్ లో ఈమాత్రం ప్రగతి అయినా సంతోషకరమే.
అసలే నానాటికి మట్టిగొట్టుకుపోతున్న భారతీయ సంస్కృతిని పరిరక్షించడం పోయి, ఇలా విదేశీయుల పోకడను సమర్థిచడం ఎంత వరకు సమంజసం. "గే/లెస్బియనిజం" పర దేశస్థులకు సరిపడవచ్చేమో గాని, మనకు ఇది మంచిది కాదు. అసలే స్త్రీ సంతతి తరగిపోతున్న ఈ ప్రస్తుత తరుణంలో, యాసిడ్ దాడులు ఇంకా ఇతర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్న వేళ,ఢిల్లీ కోర్టు ఇటువంటి ప్రకృతి విరుద్ధమైన తీర్పులను ఇస్తే, భావి తరాలు ఇంకా ఎటువంటి వింత పోకడలకు అలవాటు పడతారో ఆలోచిస్తుంటేనే నాకు భయమేస్తోంది.
@వెంకటరమణ:"ప్రకృతికి విరుద్ధ"మా! చాలా హాస్యాస్పదమైన ప్రతిపాదన చేస్తున్నారు. ఒకసారి మీ చుట్టూచూడండి. ప్రకృతిలో ఉన్నవన్నీ వైరుధ్యాలే. ఆ వైరుధ్యాల నుంచీనే ఒక సారూప్యం పొందుతూ విడిపోతూ ఉండేదే ప్రకృతి.
ఒక మగాడు మరొక మగాడ్ని,ఒక ఆడది మరొక ఆడదాన్ని "సహజంగా" ఇష్టపడితే,అదే కావాలి అనుకుంటే, ఇందులో ప్రకృతి విరుద్ధం ఏముంది? సామాజిక కట్టుబాట్లకు విరుద్ధం కావచ్చు.ఆ దేశ చట్టానికి వ్యతిరేకం కావచ్చు. కానీ ప్రకృతి విరుద్ధం అని మాత్రం అనలేము. ఎందుకంటే అదంతే! అదంతే కాబట్టి అది ప్రకృతి విరుద్ధం కాదు. అది ఉంది కాబట్టి ప్రకృతి విరుద్ధం కాదు.
వీళ్ళు స్త్రీ-పురుష బంధాన్ని కాదనటం లేదు. వాళ్ళ సుఖమేదో వాళ్ళు వెతుక్కున్నామంటున్నారు. అదే మా జీవితం అంటున్నారు. మరి మనకెందుకు సమస్య? దాన్నొక మానసిక ఝాఢ్యం అని మీరంటున్నారు. అది మాకు "సహజం" అని వాళ్ళంటున్నారు. సహజమనై వారు నిరూపిస్తుంటే అది ఝాఢ్యం అని మనం నిరూపించలేకపోతున్నాం. కాబట్టి తప్పెవరిదంటారూ?
@సుజాత: చట్టం స్వలింగసంపర్కానికి చట్టబద్దత కల్పించలేదు. ఆది నేరం కాదు అని మాత్రమే తీర్పునిచ్చారు. ముఖ్యంగా అది అంగీకారాత్మకంగా జరిగితే ఖచ్చితంగా నేరం కాదు అని తీర్పునిచ్చారు. మన sexual orientataions మనవైనప్పుడు, వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి. నాలుగు గోడల మధ్య,వ్యక్తిగత హద్దుల్లో అవి జరిగినన్నాళ్ళూ ఎవరికీ సమస్య కావనే అనుకుంటాను.
ఇక అది మానసిక ఝాడ్యం అని మీరంటే, మీకే "హోమో ఫోబియా" ఉందని వారంటారు. మీరు నిరూపించలేరు. కానీ వారు నిరూపించగలరు.
@సాయి ప్రవీణ్: భారతీయ సంస్కృతి గురించి నాకు తెలీదుగానీ, గే/లెస్బియనిజం అనేది విదేశీ పోకడ అనేది చాలా అవాస్తవం. ఎందుకంటే ఈ పోకడ కనీసం రేడియోకూడా ఇంకా ప్రవేశించని మారుమూలల్లో కూడా ఉంది.
మహేష్ గరూ,
"ప్రకృతికి విరుద్ధ"మా! చాలా హాస్యాస్పదమైన ప్రతిపాదన చేస్తున్నారు. ??????ఎందుకంటే అదంతే! అదంతే కాబట్టి అది ప్రకృతి విరుద్ధం కాదు.
మీ వాదనతో విభేదిస్తున్నాను.
మీ దృష్టిలో ప్రకృతి అంటే ఏమిటి?
నా దృష్టిలో అయితే ఇలా
బాక్టీరియా లాంటి ప్రాధమిక జీవులనుంచి మానవుల దాకా ప్రొక్రియేషన్ అనేది ఒక బాధ్యత. (ఎందుకంటే సమాధానం ఇంకా లభించలేదనుకోండి అది వేరే విషయం)
బాక్టీరియాలలో కూడా డోనార్, రిసిపియెంట్ అనే రెండు స్ట్రైన్స్ ఉంటాయి. వాటి మధ్య జన్యు పదార్ధ మార్పిడి జరుగుతుంది. ఇక అభివృద్ది చెందిన జీవులలో అయితే శుక్రకణమూ, అండమూ అని వేరే చెప్పుకోవక్కరలేదు.
అంతే తప్ప ప్రకృతి సిద్దంగా ఏ రెండు డోనార్ లేదా రిసిపీయంట్ జీవులు సహజీవనం చేసిన ఉదంతాలు కనపడవు.
ప్రకృతి అలాంటి ప్రయోగాలు చేసి విఫలమై, విరమించుకొంది.
కనుక ఒక డోనార్, ఒక రిసిపీయంట్ జీవులు కలిసి ఉండటమనేది, సుమారు యాభై కోట్లుగా ఈ భూమిపై జరుగుతున్న ఒక తతంగం.
ఈకాలాన్నంతా ఒక పన్నెండు గంటల సమయం అనుకొంటే, కేవలం ఇరవై సెకన్ల క్రితం వచ్చిన నాగరిక మానవుడు, దానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం ప్రకృతి సహజమా ... హవ్వ హవ్వ.
being a biologist i consider such things as freaks of nature. two things may happen in future (means crores of years later) 1. such people will be eliminated from population, because of failure to procreate.
2. they may get adopted in such a way so that they can procreate (which is a remote possibility as per present available knowledge )
ఇక దీనికి మరో కోణం వ్యక్తి స్వేచ్చ, స్వీయానందమే తప్ప ప్రత్యుత్పత్తి కాదు కదా అన్న వాదన వస్తుంది.
దీన్ని ఆధునిక కాల పోకడగా పరిగణించాలి తప్ప మరీ ఇది కూడా ప్రకృతి సహజమే అనేంత తెంపరితనం పనికి రాదేమో.
ఆలోచించండి.
అలా అనుకొంటే కాన్నిబాలిజం కూడా చట్టబద్దం చేయాల్సుంటుంది. ఎందుకంటే కానిబాలిజం మరింత ప్రకృతి సహజమౌతుంది. కారణం దానికి కాస్తో కూస్తో ప్రకృతి అప్రూవల్ ఉంది దీనికంటే.
బొల్లోజు బాబా
@బొల్లోజుబాబా: గే/లెస్బియన్లు "కొత్త జీవులు" కాదు. సాధారణంగా జన్మించిన మనుషులే. కానీ వాళ్ళ sexual orientation మాత్రమే వేరు.ఈ "జాతి" ప్రొక్రియేషన్ లేక నశించిపోవడం ఉండదు. ఈ పోకడతో పుట్టే మనుషులు పుడుతూనే ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా straight couples who are capable of procreation కే పుడతారు.
కాబట్టి మన చర్చ ఈ "orientation" గురించి మాత్రమే ఉండాలనుకుంటాను. ఈ పోకడ పుట్టుకతో ఉండి, వయసుతోపాటూ realize అవుతుంది అంటే అది ప్రకృతి సహజంగా ఉందన్నమాటే. కానీ సమాజం,చట్టం ఒక order కాపాడటానికి కొన్ని కట్టడులు పెడుతుంది. ఉదాహరణకు హిందువుల్లో ఒక భర్తకు ఒకే భార్య ఉండాలి లాంటివి. అదొక కట్టుబాటేతప్ప "పకృతి సహజం" కాదుకదా!
sex యొక్క ప్రధమ ఉద్దేశం ప్రొక్రియేషన్ మాత్రమే అనేది పాతమాట.Sex is also for love,pleasure and entertainment.ఈ గే వ్యవహారాలు అందుకే.
>> "ఇక అది మానసిక ఝాడ్యం అని మీరంటే, మీకే "హోమో ఫోబియా" ఉందని వారంటారు. మీరు నిరూపించలేరు. కానీ వారు నిరూపించగలరు"
మేధావుల్ని పిచ్చివాళ్లనటం పాత తరాల పోకడ. పిచ్చివాళ్లకి మేధావులుగా ముద్రేసి తరించిపోటం ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన ధోరణి. అటువంటి వాళ్ల హక్కుల కోసం ఉద్యమాలే హాస్యాస్పదమైతే, 'వాళ్ల పిచ్చి మీరు నిరూపించలేరు, కావాలంటే మీరే పిచ్చివాళ్లని వాళ్లు నిరూపించగలరు' అనటం నిఖార్సైన వితండవాదం. వాళ్ల ఏడుపేదో వాళ్లు నాలుగ్గోడల మధ్యా ఏడిస్తే ఇలా కోర్టులక్కేల్సిన అవసరమేంటి? ఆ యవ్వారాలు బట్టబయలు చెయ్యటానికీ, రోడ్లెమ్మట విచ్చలవిడిగా బరితెగించి ఊరేగటానికీ ప్రిపరేషన్స్ ఇవన్నీ. ఇదో సహజ సిద్ధమైనదని వాదిస్తున్నారు కదా.. చూస్తుండండి. రాబోయే ఏళ్లలో ఆ వైపుకి ఎంతమంది ఆకర్షితులవుతారో. అప్పుడీ హైకోర్టులు నాలిక్కర్చుకుని తీర్పులు తిరగరాసినా ఒరిగేదేమీ ఉండదు.
ముందు మామూలుగానే ఉన్నా, తర్వాత ఈ గులాబి దళంలోకి 'మత మార్పిడి' చేసుకున్నవాళ్లు అమెరికాలోనూ, విదేశాల్లోనూ చాలామందున్నారు. కాబట్టి "That's who they are; they are born like that" అంటూ తేలిగ్గా నిర్ధారించేయకండి.
మహేష్ గారు,
మీరన్నట్లు అనేక ప్రకృతి వైరుధ్యాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ విషయం అత్యంత ప్రాధమికమైనది ;మనిషి పుట్టుకకు సంబంధించినది ; అంటే మానవుడిగా పరిణామం చెందిన తరువాత, స్త్రీ-పురుషుల కలయికే కదా అత్యంత సహజం ?
//ఒక మగాడు మరొక మగాడ్ని,ఒక ఆడది మరొక ఆడదాన్ని "సహజంగా" ఇష్టపడితే ....
నమ్మలేకుండా ఉన్నాను.
స్వలింగ సంపర్కులు సమాజంలో అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. బహిరంగ ప్రదేశాలలో కాకుండా, ప్రక్క వారికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనకేంటి సమస్య అంటున్నారు, దానికి చట్టబద్ధత కల్పిస్తే, అనేక మంది ఆ విధంగా మారితే కొన్ని వందల, వేల సంవత్సరాల తర్వాత , మానవుల పుట్టుక సంగతేమిటి?
@అబ్రకదబ్ర: మీరు ఇప్పటికీ మీ "అభిప్రాయాలతో" వాదిస్తున్నారేతప్ప, జడ్జిమెంటు చదవలేదు. చదివితే మీకు ఈ కోర్టుకేసు నేపధ్యం తెలిసేది. అమెరికాలో ఉన్న సమస్య ఇక్కడున్న సమస్యలు వేరువేరు. పోలీసుల వేధింపుల నేపద్యంలో ఒక మానవహక్కుల సమస్యగా decriminalization of gays ఈ చట్టానికి నేపధ్యం. ఎందుకు ఇలా చెయ్యవలసి వచ్చిందో కోర్టువారు మొత్తం చరిత్ర మొత్తం విడమర్చి చెప్పారు. ఇంకా మీరు "అపోహల" ఆధారంగానే వాదించాలనుకుంటే చెయ్యగలిగేది ఏమీ లేదు.
హెట్రోసెక్సువల్స్ ని హోమోసెక్సువల్స్ గా ఎవరూ "మార్చ"లేరు. అప్పటికే ఆ ధోరణి ఉండీ రహస్య జీవితం గడుపుతున్నవాళ్ళు కొందరు బహుశా బయటపడొచ్చు అంతే. కాబట్టి మతమార్పిడి తరహా ప్రతిపాదన అసందర్భం.
@వెంకట రమణ: మహాఅయితే కొందరు (a minuscule minority) హోమోసెక్సువాలిటీని experiment చేస్తారు. అంతకు మించి పెద్ద మార్పేమీ రాదు. కాబట్టి మానవుల భవిష్యత్తుగురించి బెంగ అవసరం లేదు. Homosexuality is just a sexual orientation అంతే.
@మహేష్:
అంత పెద్ద తీర్పు చదివే తీరిక లేదు. కోర్టుల ఎదుట ఏళ్లుగా పేరుకుపోయిన పెద్ద సమస్యలు, ఇంతకన్నా ముఖ్యమైనవీ, ఇంతకన్నా ఎక్కువమంది హక్కులతో ముడిపడినవీ సవాలక్ష ఉన్నాయి. వాటిని పట్టించుకుని తీర్పులిస్తే బాగుండేది.
నేనసలు తీర్పుల గురించి వాదించటం లేదు. ఆ తీర్పు కారణంగా చర్చ మొదలయింది కాబట్టి తీర్పు విషయం ప్రస్తావించానంతే. అసలు సమస్యని గురించి నేను మాట్లాడుతున్నాను.
అమెరికా విషయమూ, ఇండియా విషయమూ వేర్వేరు కాదు. అమెరికాని చూసి వాతలు పెట్టుకునేవాళ్లు ఇండియాలో లక్షల్లో ఉన్నారు. ఇలాంటి పెడధోరణులకీ అమెరికానే ప్రేరణగా తీసుకుని అదో ఫ్యాషన్ అనే భ్రమలోనో, 'కొత్తదనం' ప్రయత్నిద్దాం అనే యావలోనో ఆ రొంపిలో దిగేవాళ్ల గురించి నేను మాట్లాడుతున్నాను.
మహేష్ గారూ
ఏ లక్షణమైనా జన్యువులపై ఆధారపడి ఉంటుంది. నేరప్రవ్రుత్తినుంచి కాన్నిబాలిస్టిక్ టేండెన్సీస్ వరకూ. గే/లెస్బియన్ల ఓరియంటేషను కూడా అటువంటిదే. పైన చెప్పిన టెండెన్ సీస్ జనాభాలో తరతరాలుగా ఉంటాయి ఎందుకంటే వాళ్లు ప్రొక్రియేషను జరుపుకొనే సాధారణ జీవులు కనుక. కానీ గే లెస్బియనిస్టిక్ ఓరియెంటెడ్ జీవులు (మరల విడిగాసహజ రీతిలో ప్రత్యుత్పత్తి జరుపుకోరనే భావిద్దాం ఎందుకంటే ప్రస్తుతం సమర్ధిస్తున్నాం కనుక) తమ జన్యువులను తరువాతి తరాలకు అందించే అవకాశాన్ని కోల్పోతారు. తద్వారా అలాంటి ఓరియెంటేషను కలిగిన వ్యక్థుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఇదేదే ఒక శతాబ్ధమో ఒక ఒక మిల్లీనియములోనో జరిగే విషయం కాదు. ఇవొల్యూషను ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాలు.
శాస్త్రప్రకారం మనిషి కూడా జంతువే. మనచుట్టూ ఉండే జంతువుల లక్షణాలన్నీ మనిషిలో చూడవచ్చు. సిబ్లింబ్ రివల్రీ, పాలిగామీ, కానిబాలిజం, స్త్రీజీవికోసం పోరాటం, altruism, pack formation etc. అలాంటి లక్షణాలన్నీ ప్రకృతి సహజాలు. జంతువులకూ మనిషికీ తేడా అల్లా కొన్ని చెడ్డ ఇంస్టింక్ట్స్ ని నియంత్రించుకొనే వ్యవస్థను రూపొందించుకొన్నాము. మన చర్చ దానిగురించి కాదు కదా.
నే చెప్పదలచుకొన్నది గే/లెస్బియన్ ఓరియెంటేషను అనేది ఒక సహజ ఇంస్టింక్ట్ కాదని.
మీ దృష్టి ఒక మానవజీవితానికి మాత్రమే పరిమితమై ఉంది. నే చెపుతున్నది, బాక్టీరియానుంచి మానవునిదాకా జరిగినన పరిణామ చరిత్రను దృష్టిలో ఉంచుకొని.
నేను మీతో వాదిస్తున్నది, అలాంటి ఓరియెంటేషనును ప్రకృటిసహజమని అన్నందుకు మాత్రమే. ఆ మాట వాడటం ఖచ్చితంగా మిస్ ఇంటర్ప్రెటేషనే.
sex యొక్క ప్రధమ ఉద్దేశం ప్రొక్రియేషన్ మాత్రమే అనేది పాతమాట.Sex is also for love,pleasure and entertainment. ---- నేనేమీ కాదనలేదే. కానీ ఈ గే వ్యవహారాలు ప్రకృతి సహజాలంటేనే అభ్యంతరం చెప్పాను.
అలాంటప్పుడు కానిబాలిజం లేదా స్త్రీజీవి కోసం వీధి పోరాటాలు కూడా ఇంకా ఎక్కువ ప్రకృతి సహజమౌతాయి . వాటిని చట్టబద్దం చేయటం మీరు సమర్ధిస్తారా?
bollOju baabaa
బొల్లోజు బాబాగారు: హోమోసెక్సువాలిటీ జన్యుపరమైన మ్యుటేషన్ లేక లోపంగా గుర్తింపబడలేదు. అది కేవలం ఒరియంటేషన్ మాత్రమే. అది పెరుగుతుందా,తగ్గుతుందా అనేది ప్రొక్రియేషన్ తో సంబంధం లేదనుకుంటాను.
మీరు చెప్పిన సహజ లక్షణాలపైనగల సామాజిక,చట్టనియంత్రణ అవసరమని నేను ఒప్పుకుంటాను. కానీ అవి సమాజంలోని మనుషుల అవసరాలకు అనుగుణంగా, హక్కులకు అనుగుణంగా మారాలి. ఈ భావనతోనే హోమోసెక్సువల్స్ డి-క్రిమినలైజేషన్ కోసం ఈ చట్టాన్ని సవరించడం జరిగింది.
నావరకూ ఒక లక్షణం మన ప్రపంచంలో, జంతువుల్లో, మనుషుల్లో ఉంటే అది "సహజమే". అది తప్పా కరెక్టా అనేది సమాజ నిర్వచనంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వలింగ సంపర్కం సహజమైన లక్షణం. ఇప్పటివరకూ అది చట్టవ్యతిరేకం. ఇప్పుడు చట్టబద్ధం. అంతే తేడా.
నేనెక్కడా మ్యుటేషనని అనలేదే.
నేనిచ్చిన పోలికలు (నేరప్రవృత్తి, కానిబాలిస్టిక్ tendencies) కూడా mutations కావే!
1. "ప్రకృతికి విరుద్ధ"మా! చాలా హాస్యాస్పదమైన ప్రతిపాదన చేస్తున్నారు. ??????ఎందుకంటే అదంతే! అదంతే కాబట్టి అది ప్రకృతి విరుద్ధం కాదు.
2.నావరకూ ఒక లక్షణం మన ప్రపంచంలో, జంతువుల్లో, మనుషుల్లో ఉంటే అది "సహజమే".
probably you got me.
i believe homosexuality an aberration just like many, which does not have any NATURE's approval since the origin of life at any moment in the past.
It is to be considered as problem rather than a natural phenomenon. otherwise as i told earlier, NATURE WILL LOOK AFTER AS IT DID WITH MANY ABERATIONS.
if the trend goes like this some day some one will argue i have genes for cannibalism/polygomy it is NATURAL please give permission for me to do it.
then his human rights also are to be taken into account.
WHERE ARE WE GOING TO ?
BOLLOJUBABA
ఇక మగాళ్ళు మగాళ్ళని వొస్తావా ఆసిడ్ పోయమంటావా అని.
అమ్మాయిలు..అమ్మాయిలని రేప్ చేయటాలు సహజం అవతాయి కాబోలు.
"వృషాకపి" లాంటివి కూడా సహజమే అంటారు కాబోలు..
ఇక కామాతురానం "న భయం న లజ్జ .. నవావి ..నవరుస " తో పాటు
" న స్త్రీ .. న పురుషః " అని చేర్చుకోవలేమో..
@ venkata ramana
స్వలింగ సంపర్కులు సమాజంలో అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. బహిరంగ ప్రదేశాలలో కాకుండా, ప్రక్క వారికి ఇబ్బంది కలగకుండా ఉన్నంత వరకు మనకేంటి సమస్య అంటున్నారు, దానికి చట్టబద్ధత కల్పిస్తే, అనేక మంది ఆ విధంగా మారితే కొన్ని వందల, వేల సంవత్సరాల తర్వాత , మానవుల పుట్టుక సంగతేమిటి?...
if it is so, brahmacharya also has to be illegalized...i fear if most of the human become brahmacharis ,human race will be extinct soon antaanu..
Post a Comment