Thursday, July 23, 2009

మతరహిత ప్రభుత - మతరహిత పాలన


"తీర్ధయాత్రలకూ ఇచ్చే సబ్సిడీ రాజ్యాంగ విరుద్ధం" అని రాష్ట్ర హైకోర్టు నిరసించింది. రాష్ట్ర ప్రభుత్వం (మైనారిటీ ఆప్పీజ్మెంటులో భాగంగా) జరూసలేం కు ప్రభుత్వ ఖర్చుతో వ్యక్తిగతమైన తీర్ధయాత్రలు చెయ్యించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఇటువంటి వ్యక్తిగతమైన తీర్థయాత్రలకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయొద్దని స్పష్టంగా ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


రాజ్యాంగంలోని 27వ అధికరణం ప్రకారం మతపరమైన కార్యక్రమాల నిర్వహణ, ప్రోత్సాహం, ఖర్చుల కోసం ఏ రకమైన పన్నునూ వసూలు చేయడానికి వీల్లేదు. అలాగే ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 245, 246, 266, 283 తదితర అధికరణలకు విరుద్ధమనే పిటిషనర్ల వాదనని, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.ఆర్‌.దవే, జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేసిన పిమ్మట ఈ మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది.

ఈ పిటిషన్లపై విచారణ సమయంలోనే హైకోర్టు ధర్మాసనం 'ప్రభుత్వ సాయంతో పుణ్యం సంపాదించుకోవటం ఎంత వరకూ సబబంటూ' ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొసమెరుపు.

ఈ ఉత్తర్వుతో జరూసలేం యాత్రలతో పాటు, భవిష్యత్తులో ఆరంభం కానున్న అమరనాథ్‌ యాత్రలూ ఆగిపోతాయి. హజ్‌ యాత్రలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటికోసం ప్రత్యేక చట్టం కూడా ఉంది. కానీ ఆ యాత్రల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ వైఖరి అవలంభించాల అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది.

హైకోర్టు చర్యతో మతంపట్ల ప్తభుత్వం వ్యవహరించాల్సిన తీరుపైగల రాజ్యాంగ స్ఫూర్తికి కొత్త ఉపిరి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ విధానంతో అయినా భవిష్యత్తులో మన ప్రభుత మతరహిత పాలనను అందిస్తుందనే ఆశ చిగురించింది.

*****

9 comments:

రమణ said...

హర్షించదగ్గ తీర్పు. తీర్ధయాత్రల కోసం ప్రభుత్వ ధనాన్ని వృధా చేయటం ఏమాత్రం సమర్ధనీయం కాదు. అది ఏ మతం వారికైనా ఒక్కటే.

Indian Minerva said...

"ప్రభుత్వ సాయంతో పుణ్యం సంపాదించుకోవటం ఎంత వరకూ సబబంటూ"
చాలా మంచి ప్రశ్న.
మరి ఇదే విధంగా హజ్ యాత్ర విషయంలో కూడా వ్యవహరిస్తారా? నాకు నమ్మకం లేదు. ప్రభుత్వం యాత్రల విషయంలో ప్రస్తుతం వున్న ఖర్చులను వదిలించుకోవాలని కాకుండా క్రొత్త వాటిని తలకెత్తుకోవాలని చూడటం ఏమీ బాగాలేదు.

పెదరాయ్డు said...

మత స౦భ౦ధ విషయాలన్ని౦టిలోనూ ఇదే విధ౦గా ఆలోచిస్తే మ౦చిదే...!

Praveen Mandangi said...

Viva Secularism! (స్పానిష్ బాషలో viva అంటే వర్ధిల్లాలి అని అర్థం)

Satyamevajayate said...

ఈ పిటిషన్లపై విచారణ సమయంలోనే హైకోర్టు ధర్మాసనం 'ప్రభుత్వ సాయంతో పుణ్యం సంపాదించుకోవటం ఎంత వరకూ సబబంటూ' ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొసమెరుపు.---
......
నాకు ఇది నచ్చలేదు ..ఏదో నిజంగానే ..దేవుడు, పాప పుణ్యాలు, చిత్రగుప్తుడు ..చందమామ కదల మాదిరి ...
ఒక న్యాయ స్థానం ఇలాంటి నమ్మకాలకి వత్తాసు పలికినట్టు .....IRRATIONAL is the word....
ఒక్క లోక్ సత్తా బలం పుంజుకుంటేనే మార్పు ఆశించవచ్చు ...మిగతా గుంపులన్నీ దొంగల ముఠాలే...
ప్రజలకి ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో ..?

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

కన్యాకుమారిలో పుట్టిన హిందువు మహా అయితే అమరనాథ్, కాశ్మీరులో పుట్టినోడు ఈచివర కన్యాకుమారి. ఇంతకంటే ఎక్కువ దూరంలో హిందువుల పుణ్యక్షేత్రాలు లేవు. హజ్‌కు ముస్లీముల సంఘాలు ఉన్నాయి. ఇక బౌద్దులకు, జైనులకు బీహార్లో ఉన్నాయి. మరిప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది జరూసలేంకేనా?

Vinay Chakravarthi.Gogineni said...

@satyamevajayate

why everywhere u mention loksatta....this is not related to loksatta right,

gud judgement.........
just for votes , y.s.r started this jerusalem visit and all....

Satyamevajayate said...

అవును ..అవకాశం వచ్చినపుడల్లా ..ఒక మంచి ప్రయత్నం ,ఒక సరయిన పద్ధతి ,కావలసిన అనుభవం ,నిస్వార్ధమైన వ్యక్తిత్వం అన్ని కలసిన సందర్భం ..లోక్ సత్తా మాత్రమె ...మీరు ఒకసారి ..ఆలోచించండి , స్వార్ధ రాజకీయాలకి ,కుటుంబ రాజకీయాలకి ,లేక నెహ్రూ వంశ ..సమర్థన --కుటిల రాజకీయాలకి ..ప్రత్యామ్నాయం ..లోక్ సత్తా మాత్రమె ...

ఒక్క లోక్ సత్తా నే మనకు దిక్కు ...
జయప్రకాశ్ గారు చాలా సార్లు చెప్పినట్లు ...మన యువత ముందుకురావాలి ...
మనం ప్రస్తుతం చాలా మంచి కాలంలో ఉన్నాము ..మనిషీ చాలా ప్రగతి సాధించాడు ...నేడు యువతకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ..మనం వాటిని సమంగా ఉపయోగించుకొని ..సమాజాన్ని ..వెలుగు బాటలో నడిపిద్దాం ..అందరికి ఫలాలని సమంగా పంచిపెడదాం ...ఈ స్ఫూర్తి అందరికి కలగాలి ..అందరి జీవితం విలువా సమానమే.

Nrahamthulla said...

తీర్ధయాత్రలకు ఇచ్చే సబ్సిడీ ఇచ్చే బదులు కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్నిలక్ష రూపాయలకు పెంచవచ్చు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టిన పద్ధతులను పాటించవచ్చు.ఒక బిడ్డతో కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకునేవారికి ఈ హజ్,జెరూసలేం సబ్సిడీ నిధులను ప్రోత్సాహకబహుమతులుగా తరలించి అందజేయవచ్చు.