ఈ కులంలో పుట్టకపోతే
లేకపోతే మనుషుల్ని ప్రేమించలేకపోయేవాడ్నేమో
Kaitunakala dandem_kavitalu
Friday, July 17, 2009
కైతునకల దండెం - కవితా సంకలనం
నేనూ ఇంకోలా ఆలోచించేవాడ్నేమో
ఈ కులంలో పుట్టడమే మంచిదయింది
అవమానమంటే అర్థమయింది
అందర్నీ ప్రేమించడమూ తెలిసింది
ప్రాచీనసాహిత్యం పాఠమైనప్పుడల్లా
నా ముఖకవళికలన్నీ మారిపోయేవి
బయటపడకూడదనో,పారిపోవాలనో
బహిష్కరించాలనో అనుకునేవాడ్ని
మూకుమ్మడిగా కళ్ళనీ నామీదే ఫోకస్!
ఎన్నిసార్లు చంపుతావంటూ
దేవుడ్ని కాలర్ పట్టుకోవాలనిపించింది!!
నాకు తెలీదు
అమ్మకడుపులోనైనా అవమానాలకు దూరంగా ఉన్నానోలేదో
బాబుకాలికి మచ్చెలా వచ్చిందని
ఈ మధ్యనే అమ్మనడిగితే
‘ప్రశ్నించడం నేర్చుకుంటున్నాడు’ ఏమవుతుందో!
అనుకుంటూ, తడబడుతూనే చెప్పింది
"నువ్వు కడుపులో ఉండగా పెద్ద తుఫానొచ్చింది
ఊళ్ళోజనమంతా పెద్దోళ్ళింటికెళ్ళిపోయారు
నేనూ కడుపీడ్చుకుంటూ
కాస్త చోటిమ్మని బతిమిలాడాను
మైలపడిపోతే చచ్చిపోతామని
లోనికేకాదు పంచెకే చేరనివ్వలేదు!
రివ్వురివ్వున గాలి,పెద్ధపెద్ధ ఉరుములు,హోరిహోరున వర్షం,
ఎప్పుడేమవుతుందో ఎవరికీ తెలీదు
కూకటివేళ్ళతో కూలిపోతున్నా
ఆ చెట్లేదిక్కయాయా రెండ్రోజులూ !
తుఫాను వెలిసిన ఆ మర్నాటికి
ఆకలితో నకనకలాడి కళ్ళుతిరిగి పడిపోయాను
నిండుచూలాల్ని బ్రతికించమని ప్రాధేయపడుతూ
మళ్ళా పెద్దోళ్ళింటికే వెళ్ళాడు మీ బాబు
పొద్దుకాలమంతా పెద్దోళ్ళకేకదా పనిచేసేది
కాసిన్ని గెంజినీళ్ళైనా పెయ్యమని అర్థించాడు
కట్టెలుకొట్టుకొస్తే పోస్తామన్నారు
ఖాళీకడుపుతోనే, తూలిపోయినా
కట్టెలతోపాటూ కాలూ గాటుపెట్టుకునైనా
కాసిన్ని గెంజినీళ్ళి సంపాదించాడు !
గుక్కెడు మాత్రం గుటకేసాను
కడుపులో ఇమడలేదు
మీ బాబు రుచిచూస్తే తెలిసింది
పెద్దోళ్ళు పోసింది బియ్యం కడుగేనని !"
ఇంకెన్ని గుండెల్లో దాచుకున్నారో
గుచ్చిగుచ్చి అడిగితేతప్ప నాకుచెప్పరెప్పుడూ
ఈ కులంలో పుట్టడమే మంచిదయ్యింది
అవమానాలకు తట్టుకోలేక
ఆగ్రహం పట్టలేక హత్యలెన్నింటినో చేసేవాడ్నేమో!
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
కవిత అద్బుతంగా ఉంది.
బాధ గ్లామరైజ్ కాబడకుండా తేటగా, నిజాయితీగా ఆవిష్కరించబడాలంటే, బాధపడ్డవాడే వ్రాయాలి. పరమసaం.
బొల్లోజు బాబా
Thanks for the link. I find that I understand the Telugu here much better than the Telugu in some of the classical books like "Manucharitra" and even your blog posts.
.NAAKU TELIYA KUNDANE NAA KALLALO NEELLU...CHAALA ROJULAKI...THANKS
ఈ కవితా సంకలనం అందించినందుకు ధన్యవాదాలు
Post a Comment