Sunday, July 19, 2009

జీవితం


జీవితాన్ని గడిపేస్తూ

జీవిస్తున్నాననుకున్నా
భావాలని అనుభవిస్తూ
జీవిస్తున్నాననుకున్నా
అనుభవాల్ని విశ్లేషిస్తూ
జీవిస్తున్నాననుకున్నా
విశ్లేషణల్ని అభిప్రాయాల్ని చేసుకుంటూ
జీవిస్తున్నాననుకున్నా
అభిప్రాయాల్ని ప్రాతిపదికలు చేసుకుంటూ
జీవిస్తున్నాననుకున్నా
ప్రాతిపదికల్ని ప్రణాళికలుగా మలుస్తూ
జీవిస్తున్నాననుకున్నా
జీవితాన్ని గడిపేస్తూ
జీవిస్తున్నాననుకున్నా

కానీ...
ఇప్పుడే తెలిసింది
నేను ప్రణాళికల్లో పడున్నప్పుడు
తనకుతానుగా గడిచిపోయింది జీవితమని

"Life is what happens to you when you are planning other things"
- John Lennon

****

4 comments:

గీతాచార్య said...

Sure, it's master like.

We oughtta digest Lennon's words.

rākeśvara said...

అయ్యో పాపం

గీతాచార్య said...

@రాకేశ్వర రావు,

;-)

మరువం ఉష said...

అందుకే కదా జీవితం గురువు అనేది, తన గమనం తనదే మన చేతిలో కళ్ళెం వుంచినట్లెవుంచి తన దారిన తాను సాగుతుంది. సగం వెనక్కి చూసుకుంటూ మిగిలిన సగం ముందుకు చూసుకుంటూ అసలు వర్తమానాన్ని విస్మరించేవారు ఎందరో. నేనూ అంతేనేమో?