Tuesday, July 7, 2009

‘సినీ’ర్వచనాలు - ప్రేమ: స్నేహం - సంగీతం

తెలుగు సినిమాల్లో అర్థవంతమైన సంభాషణలు తగ్గిపోయి చాలా రోజులయ్యిందనుకుంటాను. పంచ్ కోసం చెప్పే డయలాగులేతప్ప మనసుల్ని తాకే మాటలు మనకు సత్యదూరమే. ప్రాసతో పలికే వెటకారాలేతప్ప, మనుషుల్ని మెదిలించే వాగ్గుళికలు వినిపించడం కల్ల.

కానీ ఎంత యావరేజి సినిమా అనుకున్నా ఇంగ్లీషు, తమిళ భాషల్లో అక్కడక్కడా కొన్ని రసగుళికలు,జీవనసత్యాలు, నిత్యసత్యాలూ,బంధాలు- అనుబంధాల సారాలూ సినిమాల్లో వినిపించేస్తున్నాయి. అలా ఈ మధ్యకాలంలో విన్న కొన్ని సినీ సంభాషణల్ని, జీవన నిర్వచనాల్నీ పంచుకుంటాను.

చిత్రం: మ్యూజిక్ అన్డ్ లిరిక్స్
ఈ చిత్రంలోని నాయిక సోఫీ (డ్ర్యూ బెర్రీమూర్) "ప్రమాదవశాత్తూ గీత రచయిత్రి" గా మారుతుంది. Accidental lyric writer అన్నమాట. నాయకుడు అలెక్స్ (హ్యూగ్రాంట్) ఒక సంగీత దర్శకుడు. వీళ్ళ సంభాషణల్లో స్వరాన్నీ-గీతాన్నీ నిర్వచించిన విధం ఎంత హృద్యంగా ఉందో చూడండి.

Sphie Flisher: A melody is like seeing someone for the first time. The physical attraction.
Alex Fletcher: I so get that.
Sphie Flisher: But then, as you get to know the person, that's the lyrics. Their story. Who they are underneath. It's the combination of the two that makes it magic.

స్వరం మనుషుల మొదటి కలయికలో కలిగే అనుభవం లాంటిది. నచ్చితే ఆకర్షణ నచ్చకపోతే వికర్షణ.

కానీ పరిచయం...స్వరాన్ని అల్లుకున్న గీతం లాంటిది. అందులో అర్థమయ్యే పదాలుంటాయి. అన్వయించుకోదగిన కథ ఉంటుంది.

అవి ఆర్ధ్రంగా ఉంటే స్వరానికి అందం రెట్టిపౌతుంది. కలయికలోని ఆకర్షణ పదిలమౌతుంది.

లేదంటే... ఆకర్షణ భగ్నమౌతుంది. వికర్షణ కలిగుంటే అదే స్థిరమౌతుంది. అందుకే స్వరానికి గీతం ముఖ్యం. గీతానికి స్వరం ముఖ్యం.

ఆకర్షణకు పరిచయం ముఖ్యం. పరిచయం ప్రియమైతేనే ఆకర్షణకు అర్థం పరమార్థం. ఆరెండూ కలిసినప్పుడే "ప్రేమ మాయ" సాధ్యం.


చిత్రం: నాడోడిగళ్ (తమిళ్)
"Friends are someone who knows the heart in your song and can sing it back to you when you have forgotten the words".

స్నేహితుడంటే నీ పాటలోని మనసు తెలిసినోడు. ఆ పాట పదాలు నువ్వే మరిచిపోతే, మళ్ళీ నీకు పాడి గుర్తు చేసేవాడు.

ఎంత అందమైన భావన. పాట అర్థం కాదు. మనం జీవితగీతంలోని "మనసు" తెలిసినోడే నిజమైన స్నేహితుడు. ఆ మనసుని పరిస్థితులో, సమయమో, మార్పో లేక మరే ఇతర కారణంగానో మనమే మర్చిపోతే ఆ మనసు పాట పదాల్ని మనకు పాడి గుర్తు చేసేవాడే స్నేహితుడట. ఎంత సంగీతమయమైన ఆలోచన. అద్వితీయమైన స్నేహ నిర్వచనం. అది భావుకతలాగా లేదు. మనసుపాటలాగా ఉంది. జీవనగీతంలా ఉంది. నాకు నచ్చింది.

ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది? అస్సలు కనబడదే!!
ఇలా మనుషుల గురించి, వారి ఆలోచనల గురించి. మానవ సంబంధాల గురించీ మన తెలుగులో మళ్ళీ సినిమాలెప్పుడొస్తాయో! జీవితాల్ని నిర్వచించకపోయినా, కనీసం మానవీయ అనుభూతుల్ని ఎప్పుడు నింపుతాయో!!

*****

15 comments:

Chari Dingari said...

Mahesh, manushulni medilinche vaagulikalu...'kaddu'...ikkada 'kaddu' ante 'kaladu' ani artham, nuvvu e artham lo vaadaavo teleedu, please refer this dictionary,

కద్దు (p. 0239) [ kaddu ] kaddu. [Tel. for కలదు.] It is; it happens usually. It is the case. --See కలుగు. అట్లా చెప్పడముకద్దు it is usual to say so. అట్లా ఉండడముకద్దు it frequently is the case. అమావాస్య రెండు దినములు కద్దనగా two days before new moon. (Lit. when they said, after two days it will be new moon). It is opposed to లేదు, thus కద్దులేదనక he neither said yes nor no.

శారద said...

భలే వారండీ మీరు!
"దొబ్బేయ్", "ఒసేయ్!" "పోకిరీ", "సచ్చినోడా" లాటి మాటలతో, రెండర్ధాల వెకిలి హాస్యపు సంభాషణలతో,
"ఇక్కడ ముట్టుకో", "అక్కడ పట్టుకో" లాటి అద్భుతమైన సాహిత్యాలతో
తెలుగు సినిమా వెలుగుతోంటే ఇంకా ఏదో లేదని అలా నస పెడతారేమిటి? :)
శారద

Vinay Chakravarthi.Gogineni said...

meekeppudu mana films meeda padi edavatam tappite vere em leda vatillo vetikinattu telugu lo vetakandi kana badakapote appudu nannu titandi.............endukulevandi.......

meeku vetakatam cheta kaavatam ledu...............

ee madhya choostunnanu mee posts anni ela vunnayante











meru oka pedda "complaint box"


pinavaariki alanti vi anni languages lo vunnayi kakapote mana swanta bhasha kaabatti vaati gurinchi ekkuva telusu ...vere languges ithe chaala baaga vunnayi antene vintam............

సుజాత వేల్పూరి said...

స్నేహితుడంటే నీ పాటలోని మనసు తెలిసినోడు. ఆ పాట పదాలు నువ్వే మరిచిపోతే, మళ్ళీ నీకు పాడి గుర్తు చేసేవాడు. ...అద్బుతంగా ఉంది కదా!

జీవితం అంటే అందరికీ ప్రేమే! కానీ తీస్తే చూడరేమో అనే ఆర్థిక పరమైన భయం! 'తీస్తే చూస్తాంగా'అనుకునే వాళ్లుంటారని ఊహించుకోడానికే భయం! తెలుగులో ఇలాంటి రిస్కులు తీసుకునే వారు తక్కువే! ఏ తమిళంలోనో, మళయాళంలోనో వస్తే వాటిని డబ్ చేస్తే తప్ప! మీలాంటి వారైతే డబ్ చేయకపోయినా ఒరిజినల్ అయినా చూసేసి ఇలా...మాక్కూడా చెప్తారనుకోండి!...!

చాలా రోజుల తర్వాత హాయిగా ఉండే టపా రాశారు. థాంక్స్!

రమణ said...

చాలా చక్కగా వివరించారు మహేష్ గారు.
ఈ మధ్య మధ్య వచ్చిన 'గమ్యం' చిత్రం జీవితాన్ని నిర్వచించే, మానవీయ కోణాల్ని ఆవిష్కరించే సినిమానే అనుకుంటాను.
నిజమే, ఇటువంటి సినిమాలు ఇప్పుడు తగ్గాయన్నది వాస్తవం.

మేధ said...

మొన్న మల్లన్న పాటలనుకుంటా వింటుంటే, ఆ లిరిక్స్ వినలేక వెంటనే పాటలు మార్చేసా.. వాటిల్లో తిట్లు తప్ప, ఇంకేమీ వినిపించలేదు నాకు!!! మంచి మాటలు లేకపోయినా ఫర్లేదు, బూతులు, తిట్లు లేకుండా ఉంటే చాలు అనిపిస్తోంది ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే..!

Ramani Rao said...

హ్హ హ్హ హ్హ శారద గారు .. భలే చెప్పారు.

పెదరాయ్డు said...

ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది - నిజమే పాత సినిమాలు చూస్తు౦టే దా౦ట్లో ఎన్నో జీవిత పాఠాలు కనిపిస్తాయి. కానీ సినిమాల్లో మానవత్వ౦ కనుమరుగయి౦దని బాధ పడుతున్నారు, అది మన జీవితాల్లోనూ దాదాపు కనుమరుగయిపోయి౦ది, పోతో౦ది.

Anonymous said...

"ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది? అస్సలు కనబడదే!!"
ఔను ఇది పచ్చి నిజం!
ఇప్పుడు వచ్చే గందరగోళం సినిమాల మధ్య ఒక పాత ఆణిముత్యం చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
కాని అప్పుడప్పుడు "ఆ నలుగురు" లాంటి మంచి సినిమాలు వస్తున్నాయి.

Anonymous said...

ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది?

అంతే కదా.. !!

Kathi Mahesh Kumar said...

@గోగినేని వినయ్ చక్రవర్తి: "బలంగా నమ్మితేనో లేక తీవ్రంగా వ్యతిరేకిస్తేనో మాత్రమే నాకు రాయలనిపిస్తుంది." కాబట్టి నా బ్లాగులోని నా భావాలు మీకు complaints లాగుంటే అది మీ సమస్యేగానీ నాది కాదు.

అయినా,నేనొక కంప్లయింట్ బాక్స్ అని మీరు కంప్లయిన్ట్ చెయ్యడం ఎంత హాస్యాస్పదమో గమనించండి.

ఇక తెలుగు సినిమాల గురించి. తెలుగు సినిమాల్లో ఏముందో ఏమి లేదో నాకు తెలుసు. నా తెలుగు సినిమా భావాల గురించి మీ జడ్జిమెంటు మీదగ్గరుంచుకోండి.

@డాక్టర్ నరహరి: తప్పు సరిదిద్దినందుకు ధన్యవాదాలు. సరిచేసుకున్నాను.

శ్రీనివాస్ పప్పు said...

మహేష్,
గ్రీష్మంలో వసంతం లా ఉంది మీ పోస్ట్ మాత్రం.
"ఒకప్పుడు మన తెలుగు సినిమాల్లో ఎంత "జీవితం" ఉండేది. ఇప్పుడేది? అస్సలు కనబడదే!!
ఇలా మనుషుల గురించి, వారి ఆలోచనల గురించి. మానవ సంబంధాల గురించీ మన తెలుగులో మళ్ళీ సినిమాలెప్పుడొస్తాయో! జీవితాల్ని నిర్వచించకపోయినా, కనీసం మానవీయ అనుభూతుల్ని ఎప్పుడు నింపుతాయో!!"
ఆశ మనిషిని బతికిస్తుంది,కోరిక చంపేస్తుందని ఎక్కడో చదివినట్టు గుర్తు.
ప్రస్తుతానికి మాత్రం ఆశతోటే ఎదురుచూద్దాము మనం అందరూ ఆశించే మంచి సినిమాలు రావాలని...

గీతాచార్య said...

@Vinay Hehehe.

గీతాచార్య said...

ఒక సమాజంలోని పరిస్థితులనే కళ చూపుతుంది అనేది నజమయితే ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితులనే ఇప్పటి సినిమాలు చూపెడుతున్నాయి.

We have no particular culture like the other Southern states have. Ours is the most mixed culture. So, that's what is represented in the movies too.

As u know, ART IS THE SELECTIVE RECREATION OF REALITY ACORDING TO AN ARTIST'S METAPHYSICAL VALUE JUDGEMENTS.

మనవాళ్ళ value-judgements అలా ఏడిశాయి మరి.

Inspired Souls said...

@ mahesh garu
Glad that you bought the topic of music n lyrics!! thats one my favourite movies in terms of conversation!! very simple and
very sensitive!!
starts with hero saying -- " i am a happy 'has been'

and that climax song!!
it has never been easy for me to find words along melody!! i heard it 1000 times..

we must see some conversatios like this soon in telugu movies!!
iam expecting one from you for sure