నాకన్నా ముందొచ్చి
నా కోసం స్వాగతం
"హలో" అని స్నేహం చేశా
హత్తుకుని జీవితాంతం గడిపేసా
ప్రతిఘడియా వెళ్తాడేమో అని చూశా
కానీ...
నేను పొయ్యేసమయానికి
నాకే వీడ్కోలిచ్చి పంపేసాడు
అతిధి అనుకున్నా...కానీ
నాకే నా జీవితాన్ని అందించి
తను మాత్రం కదులుతున్నట్లు కనిపిస్తూనే
ఎక్కడికీ కదలకుండా సాగనంపాడు
విడిపోతూ వీడుకోలు చెబుతూ అడిగాను
"అతిధి ఎవరని?"
చిరునవ్వే సమాధానం
గీత దాటిన క్షణాన తెలిసింది
మనమంతా అతిధులం
‘సమయం’ మాత్రమే శాశ్వతం అని
"People come and go, but time stays. Time is not a guest."
- Geoff dyle
****
9 comments:
baavundi nice poem.
Very Nice One!
బాగుందండి!!!
మనమంతా అతిధులం‘సమయం’ మాత్రమే శాశ్వతం
గడచిన సమయం తిరిగిరమ్మన్నా రాదు పాపం.
బాగుంది
hmm different dimension చాలా బాగుంది మహేష్.
Its true!
అద్భుతం....చలనశీలతను గుర్తించడంలోనే మన తాత్వికత పరిణామం చెందుతుంది.. బాగా చెప్పారు.
మీ ఆలోచన అపురూపం. నా దృష్టిలో శాశ్వతం కాని జీవితాన శాశ్వతంగా మిగిలే బంధాలు కాలం ఇచ్చిన వరాలు. ఒకరి నుండి ఒకరికి అందించబడుతున్న అవి మాత్రం చిరంజీవులు. కాలానికి సహవాసులు.
Post a Comment