Sunday, July 19, 2009

నిజం చెబితే నేరమా?


"నిజం చెబితే అదేమీ నేరం కాదు. ఇంకా మీకు ఎదురు డబ్బులిస్తాము." అంటున్నారు స్టార్ టీవీవాళ్ళు.

ఈ నిజాలేమైనా మనుషుల్ని కాపాడేవీ, దేశాన్ని రక్షించేవీ అయితే ఏమైనా అనుకోవచ్చు.
కానీ ఇవి కాపురాలు కూల్చేవీ, ప్రేమించిన వాళ్ళను దూరం చేసేవీ అయితే ఎట్లా?!!
అటూఇటూగా మన ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలో దివాకరంలా అయిపోమంటున్నారు ‘సచ్ కా సామ్నా’ అనే ఒక టీవీ కార్యక్రమం నిర్మాతలు.
‘మూమెంట్ ఆఫ్ ట్రూత్’ అనే ఒక అమెరికన్ టీవీ షోకి ఇదొక భారతీయ అనుకరణ.


జూలై పదిహేనో తేదీన ప్రారంభమైన ఈ నిజాలు చెప్పే కార్యక్రమాన్ని నేను చూడలేదుగానీ, ప్రోమోలు చూసే కొంచెం ఉలిక్కిపడాల్సొచ్చింది.
ఈ కార్యక్రమానికొచ్చిన ఒక టీచర్ ను యాంకర్ అడిగిన ప్రశ్న... "ఎప్పుడైనా భర్తకు తెలీకుండా ఇంకో మగాడి గడిపాలనుకున్నారా?"
హోరున మ్యూజిక్కు...టీచర్ దిక్కులు చూసింది...భర్త ముఖంలో రంగులు మారాయి...వారి పిల్లలు ఇబ్బందిగా ముఖం పెట్టారు...
"లేదు" అని టీచర్ సమాధానం
"తప్పు సమాధానం" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
టీచర్ ముఖంలో నెత్తుటి చుక్కలేదు. భర్త మూఖంలో తీవ్రమైన బాధ. పిల్లల్ని చూపించలేదు.
"ఎప్పుడైనా మీరు మీ భర్తను చంపాలనుకున్నారా?"
"అవును"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
ఈ షో తర్వాత వాళ్ళ సంసారం ఏమయ్యిందో తెలీదు.


ఇంకో కుటుంబం
ఒక టెలివిజన్ నటుడు. దాదాపు యాభై అరవై వయసుంటుంది.
యాంకర్ అడిగాడు "మీరెప్పుడైనా వేశ్యా సంపర్కం కలిగి ఉన్నారా?" అని.
"లేదు"
"తప్పు సమాధానం" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
ఈ నటుడికి ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు. ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్తో జీవిస్తున్నాడు
తరువాత ప్రశ్న "మీ రెండో పెళ్ళాం మిమ్మల్ని కేవలం డబ్బుకోసం పెళ్ళిచేసుకుందని అనుకుంటున్నారా?"
"అవును"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
యాంకర్ తిన్నగా తలవంకించాడు.
"మీ డ్రీమ్ గర్ల్ ఇప్పటికైనా మీకు దక్కిందా?"
"లేదు. ఇప్పటికీ నా డ్రీమ్ గర్ల కోసం నేను ఎదురుచూస్తూ ఉన్నాను. దొరికేస్తే డ్రీమ్ గర్ల్ ఎట్లవుతుంది?"
"సమాధానం సరైనది" అని స్కీన్ మీద పెద్దగా కనిపించింది.
యాంకర్ నవ్వాడు.
ముగ్గురు భార్యలూ, గర్ల్ ఫ్రెండ్ ముఖాలు మాడిపోయి కనిపించాయి.
ఆ తరువాత వారి జీవితాలు ఏమవుతాయో తెలీదు.

ప్రేక్షకులు మాత్రం ఆనందిస్తున్నట్లు. తృప్తిగా తలలాడిస్తున్నట్లు కనిపిస్తున్నారు.
స్టూడియోలో, ఇళ్ళలో ఈ భాగోతాన్ని ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తోంది.
ఇప్పటికి ఈ షోలో పాల్గొనటం కోసం ఇరవై ఐదు లక్షల మంది రిజిస్టర్ చేయించుకున్నారు.

‘మానవుడి మనస్సులో ఒక అధోలోకం ఉంటుంది’ అంటారు. అది అంధకారంలో, స్వప్నాల్లో జాగృతమై అక్కడి జంతువులు విచ్చలవిడిగా స్వైరవిహారం చేసి తమ తీరని కోరికల్ని తీర్చుకుంటాయి. బహుశా అదే మానవ మనోఅధోలోకం కోరికలు ఈ voyeuristic రియాలిటీ టీవీల ద్వారా పూర్తవుతోందేమో!
ఇప్పటివరకూ రియాలిటీ టీవీ అంటే పాటల పోటీలూ, డ్యాన్సుల పోటీలూ వచ్చేవి.
కొన్నాళ్ళకు ముందు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఒకర్నొకరు డంప్ చెయ్యడాలు (M- tv Splits villa), రాఖీ సావంత్ స్వయంవరాలూ ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు చెప్పలేని నిజాలు, చెబితే కాపురాలు కూలిపోయే నిజాలు చెప్పించి మనోరంజనం చేస్తామంటున్నారు.
కానీ....ఆనందిద్దాం! మనలోని అధోలోకాల్ని సంతృప్తి పరుద్ధాం!

*****

15 comments:

Srujana Ramanujan said...

Hmm. Highly disgusting. But this's reality. We should digest it?

Anonymous said...

eduru dabbulemo kaani samsaaralu chediretatluga unnnay kada...!

చంద్ర మోహన్ said...

కోరి వచ్చి మరీ రియాల్టీ షోలలో పాల్గొనే వారి సంసారాలకు ఎలాంటి ఢోకా ఉండదు లెండి. తన భార్య/తల్లి టీవీ షోలో కనపడిందన్న ఆనందం ముందు ఆమె చీకటికోర్కెలు వెలుగులోకి రావడం అన్నది చాలా చిన్న విషయం నేడు.

అధో జగత్తుకు ఆహ్వానం! ఇప్పుడు టాప్ ఫ్లోర్ కు మార్చబడినది.

ప్రణీత స్వాతి said...

kaapuralu koolipoye nijalu cheppinchi koti rupayalu bahumati ichesi chetulu dulipesukuntunnaru..

aina prati daniki videsi channels yenduku follow kavalo ardham kavatledu..??

reality shows aahladapariste baguntundi kani...ila...yemo yemanalo mari!!

mahesh garu...namaste!
na peru praneeta..ivvalle 1st time mee blog choosanu, bagundi..!!

mee tapalu chadivi abhiprayam rayacha nenu kuda(with your permission)??

Hima bindu said...

నిర్వహించేవాల్లకంటే వచ్చి పార్టిసిపేట్ చేసేవాళ్ళను అనాలి ......రెండు గంటల క్రితం టి.వి
లో చూసి అనుకున్నాను దీనివల్ల యేమానంధం పొందుతారు సభ్యులు అని .

Praveen Mandangi said...

ఒకవేళ ఈ షో నిజమైతే పబ్లిక్ గా ఇలాంటి ప్రశ్నలు వేసి నిజం, అబద్దం అంటూ తప్పుడు సర్టిఫికేషన్ ఇచ్చినందుకు ఆ షో వాళ్ళ మీద భార్యభర్తలు పరువు నష్టం దావా వెయ్యాలి. ఇది నిజం కాదు, నటన కాబట్టే అలా వెయ్యలేదు. నటనే అనుకుందాం. మరీ ఇలాంటి నాటకాలు చూపించి అసహ్యం కలిగించడం అవసరమా?

Anonymous said...

నిజమే. మంచి విశ్లేషణ! మీడియా సమాజానికి సేవ చెయ్యాల్సిన కనీస ధర్మాన్ని ఎప్పుడో తుంగలో తొక్కేసినట్టున్నాయి.

ప్రభుత్వాలు, ప్రజలు, జన సంక్షేమ ఆర్గనైజేషన్లు, ఊరుకున్నంత వరకు ఇలా టివి ప్రోగ్రాములు వస్తూనే ఉంటాయి.

Anonymous said...

నిజమే. మంచి విశ్లేషణ! మీడియా సమాజానికి సేవ చెయ్యాల్సిన కనీస ధర్మాన్ని ఎప్పుడో తుంగలో తొక్కేసినట్టున్నాయి.

ప్రభుత్వాలు, ప్రజలు, జన సంక్షేమ ఆర్గనైజేషన్లు, ఊరుకున్నంత వరకు ఇలా టివి ప్రోగ్రాములు వస్తూనే ఉంటాయి.

Kathi Mahesh Kumar said...

@సృజన: నిజమే.Reality bites అంటారు. నాకు మాత్రం ఈ షో నచ్చలేదు.

@నెలబాలుడు: షో ఇప్పుడే మొదలయ్యింది కాబట్టి ముందు ముందు షోలో పాల్గొనేవారిపై,చూసేవారిపై ఎంత ప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడే చెప్పలేము. నాకైతే కొంత ఇబ్బంది కరంగానే అనిపించింది.

@చంద్రమోహన్: టీవీ has become such a think. మీరు చెప్పింది నిజం కాబట్టే పాతిక లక్షలమంది ఇప్పటికే రిజిస్టర్ చేయించుకున్నారు మరి. అధోజగత్తుకు ఆహ్వానం మన లివింగ్ రూంలోనే ఉంటుందిక.

@ప్రణీత:బ్లాగులున్నదే రాయడానికి. కానివ్వండి.

@చిన్ని: దీనివల్ల ఆనందం పొందేది పార్టిసిపెంట్స్ కాదు. వాళ్ళ నిస్సహాయతనూ,ఇబ్బందినీ, బలహీనతల్నీ చూసి ప్రేక్షకుడు ఆనందపడతాడు.ఇలా సాటి జీవి కష్టాన్ని చూసి ఆనందించే ఏకైక జీవి మనిషేకదా!

@అన్వేషిత: ఖచ్చితంగా ఈ షోకి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు నడవబోతున్నాయి. వీలైతే మనవంతు ఒక చెయ్యి వెయ్యడమే.

@ప్రవీణ్: అది నాటకమే అయినా, నా సమస్య అది చూసి మనం పొందుతున్న "రాక్షసానందం".

సుజాత వేల్పూరి said...

షో స్వభావం ఏమిటో తెలిసి, వచ్చాక , వాళ్లడిగిన ప్రశ్నలకు మొహాల్లో నెత్తురు చుక్కలు లేకుండా చేసుకోవడం కూడా రియాలిటీ షోల్లో భాగమే! వాళ్ల సంసారాలకేం ఢోకా లేదు చంద్రమోహన్ గారు చెప్పినట్లు!

"అధో జగత్తుకు ఆహ్వానం! ఇప్పుడు టాప్ ఫ్లోర్ కు మార్చబడినది." చంద్రమోహన్ గారూ, కేక!

Bala said...

We have to ask these questions to the TV presenters and owners of it. What kind of world it is, we are confused about whom to have sex (with male or female etc) and where to have sex, certainly the street dogs will laugh at us. Corporate prostitution for cooperates.

The scared values are commercilized in the hands of Bustards.

Anonymous said...

ఇది ఏదో ఆంగ్ల ఛానల్‌లో MOMENT OF TRUTH అనే కార్యక్రమం యొక్క అనువాదము.డబ్బు కోసమనో, లేదా ఒక సరదాకో, లేదా అదేదో సాహసం అంటూ మన బతుకును బజారుకు తీసుకురావడం నాకైతే నచ్చలేదు.

Madhu Jamjur said...

చాలా మంచి గా చెప్పారు !

ఎందుకో నాకు ఈ ప్రొమోస్ చూసినప్పటినుండి తెలియని ఆవేదన కలుగుతొంది.

ఒక్క విషయం మాత్రం నిజం

మనసులొ అనుకొన్న విషయాలు ఎదుటి వారికి తెలిస్తే మానవీయ సంబంధాలు మచ్చుకు కూడ కానరావు ! ఏమంటారు

Ramani Rao said...

వాళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళకి టి విల్లో కనపడాలి. దొందూ దొందే. కాబట్టి కాస్త పేక్షకులకి వినోదం కల్పించాలి , చేష్టలుడగడం, నెత్తుటి చుక్క లేకపోవడం, ముఖాలు మాడిపోడం ఇవన్నీ వినోదం కలిగించే విషయాల్లో భాగలే. చిన్న సైజు సినిమాలన్నమాట. ఇప్పుడు మన తెలుగులో ఆటలు పాటల్లో మెంటర్స్ కొట్టుకొంటున్నారు, జెడ్జస్ ఏకీభవించడంలేదు లాంటి వినోదాలు ఇవ్వడంలేదూ.. అలాగే. కొంతమంది జనాలకి తమ గురించి కన్నా , ఎదుటివాడికి ఏమవుతోంది, ఏదోఒకటి అయితే బాగుణ్ణు అనే తపన ఎక్కువ అదే క్యాష్ చేసుకొంటున్నారు ఆ టి వి వాళ్ళు. అంతే.

@చంద్రమోహన్ గారు : అథోజగత్... సూపర్.

Anonymous said...

నేనికా ఈ షో చూడలేదు కాని, మీ టపా చదువుతుంటే అదేదో సినిమాలో బ్రహ్మానందం, ఆలీ ల కామెడీ గుర్తొచ్చింది.