Friday, July 24, 2009

కథెప్పుడు మారేను?

కథ ఎప్పుడూ ఇలాగే మొదలౌతుంది...

తలవంచుకుని అబ్బాయి
తలదించుకున్నఅమ్మాయితో
కళ్ళుకళ్ళు కలుపుతాడు
ముసిముసినవ్వులు
ఆకర్షణలూ,కోరికలూ
వయసు ప్రతాపమో, సినిమా ప్రభావమో
ప్రేమలౌతాయి

అప్పుడే...
సమాజం ఒళ్ళు విరుచుకుంటుంది
కులాలూ,గోత్రాలూ
మతాలూ,వర్గాలూ
సామాజిక గౌరవాలూ అంటూ
బేధాల లెక్కలు బేరీజుచేస్తారు
ప్రేమికుల్ని విడదీసి
వారి ఎడబాటుని, విరహాన్ని,
పెట్టుకోని ముద్దుల్ని,కలువలేని కౌగిలింతల్ని
గర్వంగా పద్దురాసి పాతిపెడతారు

ప్రేమికులు ఎదిరిస్తారు
పోరాడి పారిపోతారు
పారిపోయి పెళ్ళాడతారు
బెదురు కుందేళ్ళ సంసారం
ఆనందసాగర మధనం
కొన్నాళ్ళే...ఆ తరువాత
జాడతీసి జోడీని విడదీస్తారు
తెగనరికి న్యాయాన్ని నిలబెడతారు.

సాహసించి పోరాడారు.
పోరాడి హతులుగా మిగిలారు
ఇంతేనా కథ?

కథ ముగింపు మార్చాలి
ఈ కథని కలలో అయినా ఒకసారి తల క్రిందులు చెయ్యాలి!


*హర్యాణాలో ఒక ప్రేమ జంటను ఒకే గోత్రనామం కలిగివుండి, సాంప్రదాయానికి విరుద్ధంగా పెళ్ళి చేసుకున్నారని మొత్తం గ్రామవాసులందరూ కలిసి చంపేశారు. చంపామని గర్వంగా మీడియా ముందు చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులుకూడా కసాయిలతో చేతులు కలిపారు. పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చునే ఉన్నారు. రాజకీయ నాయకులు కులపంచాయతీల వ్యతిరేకంగా ఒక ముక్కకూడా మాట్లాడటం లేదు. ఈ ఆటవికన్యాయానికి పాశవికంగా బలైన ప్రేమ జంటకు నివాళి ఈ కవిత.

*****

8 comments:

రమణ said...

:( :(

మరువం ఉష said...

సరిగ్గా మొదటి పంక్తిలో వుండగా అనుకున్నాను, కనీసం ముగింపైనా క్రొత్తగా వుంటే బాగుండునని. పాత కథే. నా వలన ఒక జంట పట్ల తల్లితండ్రుల విముఖతని తొలగించగలిగాను. కులమన్న గోడని కూలచగలిగాను. నా పిల్లల పట్ల నాది అవసరమైతే ఇదే ప్రవృత్తి. నాలా కొందరు కలిస్తే కథలు కొత్త పుంతలు తొక్కుతాయి. కానీ తమ ముగింపు తామే వ్రాసుకున్న జంటలూ వున్నాయి. వ్యామోహాన్ని ప్రేమ అని అపోహ పడి ఆపై వెనుదిరిగే బాపతు వీరు. కనుక ఇవన్నీ కూడా ముగిసిపోని చరితలే.

సుజాత వేల్పూరి said...

ఉషగారు,

ఏ జంటైనా సరే ఒకరికొకరు కావాలనుకున్నపుడు తమ కథ తామే రాసుకోవాలి.ఇంకొక్కళ్ళ స్క్రిప్ట్ ను అంగీకరించకూడదు. కథని కొత్త పుంతలు తొక్కించగలిగే సత్తా ఉన్నపుడే ముందడుగు మాత్రం వేయాలి. ఏమంటారు?

పరిమళం said...

అన్ని కధలూ ఒకేలా ఉండవు ..... అప్పుడప్పుడూ ముగింపులు మారతాయి ...మారాయికూడానండీ !

Anonymous said...

అడపా దడపా కొన్ని అలా జరుగుతూనే వుంటాయి. వాళ్ళ మూర్ఖత్వాన్ని ఎవరూ మార్చలేరు.

సక్ససఫుల్ లవ్ స్టోరీ ఇదిగోండి.
బాతాఖానీ ఖబుర్లు–42 ” ఏక్ దూజే కేలియే ”

నాకు తెలిసి 50% పైనే పేరెంట్స్ లో మార్పు వచ్చింది. అదే విధంగా ఈ కాలపు అబ్బాయిలు, అమ్మాయిలు గుడ్డిగా ప్రేమించేసుకోవడం లేదు. వెనుకా ముందు చూసుకునే ప్రేమించుకుంటున్నారు.

మరువం ఉష said...

సుజాత, నా కథ నేను వ్రాసుకున్నట్లు నడవలేదు. అపుడే నాకు అర్థం అయింది. ప్రేక్షకులని బట్టి సన్నివేశం మారినట్లు మన పాత్రలు ఆశువుగా మాట మార్చుకోవాలని. రెండో కథ మొదలు పెట్టాలనిలేదు. ;) అందుకే మంచి ప్రేక్షకురాలిగా ఏ జంట కథనైనా శుఖాంతం అయ్యే దిశలో నా మాట కలుపుతాను.

Vinay Chakravarthi.Gogineni said...

@katti gaaru
baagundi kavita.really nice.......
especially

ప్రేమికుల్ని విడదీసి
వారి ఎడబాటుని, విరహాన్ని,
పెట్టుకోని ముద్దుల్ని,కలువలేని కౌగిలింతల్ని
గర్వంగా పద్దురాసి పాతిపెడతారు
em raasaru boss.......excellent ...
plz write frquently.......


konni kulaalu ani kakunda edo vuntay........naake jarigindi evrything ok but ...enduko vaddu antaaru emito chepparu(valla side).......

guddiga preminchukovadam maana ledu but fail ayinappudu casual ga teesukuntunnaru........

satta vunna okkosaari munduku polem.....konni sentiments vuntay konni morals vuntay........

enduknate manam raasukunnatlu edi vundadu manalni konni influnce chestay anthe...........

ప్రియ said...

చాలా బాగుంది. నిజమే కలలోనైనా మారాలీ పరిస్థితి.