ట్రాన్స్పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా (Transparency International India) అనే ఒక స్వఛ్చంద సంస్థ ఈ మధ్య దేశవ్యాప్తంగా జరిపిన అవినీతి సర్వేలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని "ఫరవాలేదు" (Moderate) అనే కేటగిరీ చేర్చారు. ఈ సర్వేలో "ప్రమాదకర స్థితి"(Alarming), "చాలా ఎక్కువ"(Very High), "ఎక్కువ"(High) , "ఫరవాలేదు" (Moderate) అనే కేటగిరీలున్నాయ్. అంటే, మొత్తానికి అవినీతిలో మన ప్రభుత్వాలకంటే చాలా రాష్ట్రాలు ముందున్నాయన్నమాట.
ఈ సర్వే దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాల (BPL Families) మధ్య జరపడం మరో విశేషం. అవినీతిని తమ జీవితాలలో ప్రతి క్షణం ఎదుర్కొని, దాని ద్వారా అతిగా నష్టానికి గురయ్యే వీరిమధ్య జరిగిపి ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాక, సర్వేలో ‘రేషన్ దుకాణాల వ్యవస్థ’ (PDS), ‘విద్య’, ‘వైద్యం’, ‘విద్యుత్తు’, ‘త్రాగునీరు’, ‘గ్రామీణ ఉపాధి పథకం’(NREGS), ‘భూమి రిజిస్ట్రేషన్’, ‘వనాలు’, ‘ఇళ్ళపంపకాలు’ , బ్యాంకింగ్ మరియూ పోలీసు వ్యవస్థలకి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. పోలీసు వ్యవస్థలో అవినీతిని, ప్ర్రమాదకర స్థాయిగా దాదాపు అన్ని రాష్ట్రాలవారూ గుర్తించగా , మిగతావాటిని కలుపుకుని ఒక సరాసరిన ఈ ర్యాంకింగ్ చెయ్యడం జరిగింది. ఇక ఈ ర్యాంకింగ్ ను చూద్దాం.
‘ప్రమాదకర స్థితి’లో ఉన్న రాష్ట్రాలు : అస్సామ్, బీహార్, జమ్ము& కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, గోవా, నాగాలాండ్
‘చాలా ఎక్కువ’ ఉన్న రాష్ట్రాలు : కర్ణాటక , రాజస్థాన్, తమిళనాడు, మేఘాలయ , సిక్కిం
‘ఎక్కువ’ ఉన్న రాష్ట్రాలు : ఛత్తిస్ ఘడ్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కేరళ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్
‘ఫరవాలేదు’ అనిపించే రాష్ట్రాలు : ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహరాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, పాండిచ్చేరి, త్రిపుర.
పై సర్వే ప్రకారం దక్షిణ భారతదేశంలో మిగతావారికన్నా మనమే బెటర్ అన్నమాట. నిజంగానే మనం ఫరవాలేదో్.... లేక ఈ విధంగా అవినీతిని కొలవలేని కొత్త మార్గాల్ని కనుక్కున్నామో.... ఇంకా మనవాళ్ళు తెలివి మీరారో... లేకపోతే మన పేదవారు చాలా అమాయకంగా జవాబులు చెప్పారో.... అస్సలు తెలియకపోయినా, "మనమూ ఫరవాలేదు!" అనుకొని తృప్తిపడదాం.
Wednesday, July 2, 2008
అవినీతిలో మన ఆంధ్రప్రదేశ్ ఫరవాలేదండోయ్...!
Subscribe to:
Post Comments (Atom)
6 comments:
వామ్మో... ఫరవాలేదు కేటగిరీ లో ఉన్న మనమే ఇలా ఉంటే పాపం ప్రమాదకరం కేటగిరీ వాళ్ళ గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది.
మీ ఆర్టికల్స్ చాలా బాగున్నాయండి.ఆఫిస్ నుండి తిరిగిరాగానే వంట చేసుకుని సినిమా చూద్దాం అని లాప్టాప్ ముందు కుర్చున్నాను.మీ బ్లాగ్ చదువుతూ టైం మరిచిపోయాను.నాకు హిందు పేపర్ అంటే చాలా ఇష్టం ఉండేధి.ఇప్పుడు మీరుకూడా బాగావ్రాస్తున్నరనిపిస్తుంది.సమస్యను ఎత్తి చూపిస్తున్నారు.మీరు సివిల్ సర్వీస్ ఎగ్జాంస్ కి ఎందుకు ప్రిపేర్కాకూడదు.సోసియాలజి ,ఆంథ్రూపాలజి మైన్ సబ్జెక్ట్స్ గా తీసుకుని ట్రై చెయ్యొచ్చుగా ,
ఇది నా సలహా మాత్రమే .మీకు నేనిచ్చిన పదునైన కోణం అనేది కరక్టే అనిపిస్తుంది .
@విధేయ గారు.నా వ్యాసాలు నచ్చినందుకు నెనర్లు. సివిల్ సర్వీస్ కాదుగానీ ప్రస్తుతానికి "సోషల్ సర్విస్" సెక్టర్లో Communication Consultant గా పనిచేస్తున్నాను.
ఎప్పుడూ ఈ సివిల్ సర్విస్ ఆలోచన నాకు రాలేదు...I wanted to be a film maker, ఇప్పటికీ ఆకోరిక తీర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను.
రవీంద్ర గారి కమెంట్ అదుర్స్ ...
మహేష్ గారు మీరన్నీ research చేసి సాఅసినట్టు ఉంటాయండీ.... గ్రేట్ వర్క్
అవినీతి ఎక్కడ తగ్గింది.ఎక్కువయిందేమోనని అనుకుంటున్న సమయంలో ఈ సర్వేపలితాలు చూసి ఆశ్చర్యపోవాల్సిన పతిస్థితి.మనం తక్కువ అని అనుకోకూడదుగానీ మిగిలినవాళ్ళు మనకన్నా ముందు పోయి మనకు ఆ పరిస్థితి.అయినా ఈ సర్వే చూసి మన వాళ్ళు మనం చాలా వెనకపడినామని భావించి ఇక విజ్రుంభిస్తారులెండి.వచ్చే సంవత్సరానికల్లా మనమే నంబర్ 1. వార్త ఏదయినా మీ విశ్లేషణ చాలా బాగుంటుందండి.అభినందనలు.
ఇందులో ఒక తిరకాసు ఉందండోయ్
రాజకీయ అవినీతి ఈ సుర్వేలో చేర్చబడలేదు.ఏ సుర్వే అక్కరలేకుండా అందులో (political corruption) మన రాష్ట్రం ఫస్ట్ అని చెప్పెయొచ్చు. TII survey 2005 నాటిది. మన గ్రాఫ్ తరవాత బాగా పైకి వెల్లిందిగా. అంచేత వైస్ "సాక్షి" ని చూపించి చంకలు గుద్దుకోవలసిన పని లేదు
దూవాసుల పద్మనాభం
Post a Comment