Thursday, July 3, 2008

‘శాం’ మానెక్ షా కి నివాళి

భారతదేశ మొదటి ఫీల్డ్ మార్షల్, అందరూ ప్రేమగా "శాం బహదూర్" అని పిలిచే,  ‘శాం హార్ముస్జీ  ప్రేమ్జీ జంషెడ్జీ  మానెక్ షా’ గారికి నివాళిగా,  ఒక అజ్ఞాత సైనికుడి ఆంగ్ల కవితని ఇక్కడ పొందు పరుస్తున్నాను. మానెక్ షా గారి అంతిమయాత్రలో చాలా మంది రాజకీయ ప్రముఖులూ, ప్రభుత్వ ప్రతినిధులూ పాల్గొనకపోవడం, నాకు చాలా బాధ కలిగించిన విషయం. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పర్యటనలో ఉండగా, ప్రధాని మన్మోహన్ సింగ్ మరియూ రక్షణ శాఖామంత్రి ఏ.కె. ఆంధొని ఢిల్లీలో ఉండికూడా హాజరుకాకపోవడం విచారకరం. 1971 లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో వీరు చూపిన ధైర్యం, సాహసం, ముందుచూపూ మనకు విజయాన్ని తెచ్చిపెట్టిందన్న నిజం తోపాటూ, తరువాత కాలంలో చాలా పదవులు నిర్వహించి భరతమాత సేవ చేసిన ఈ వీరుడికి, మరణానంతరం  తగిన గౌరవం అందలేదు అనిపించింది.


అందుకే, ఒక  అజ్ఞాత  సైనికుడి ఆవేదనను ప్రతిఫలించే కవితని ఇక్కడ పొందు పరుస్తున్నాను.


What I am worth…I hear, we have crossed the sixtieth year,
Standing guard without any fear,
Another day in the desert sun,
Or a night at height, with a freezing gun,
Tell me my India 'What I am worth.'

For the Battles and Wars that I fight,
Never asking which one is right,
From Dawn to Dusk and then to Dawn,
Your Bishop, Your Knight Your Eternal Pawn,
Tell me my India 'What I am worth.'

While you fill your coffers today,
Wondering where and how to make,
Another fortune, another buy,
Your aspirations are now touching the Sky,
Tell me my India' what I am worth.'

You make a mention on your political line,
Come to my post, wine and dine,
Then run to your stock, while I stand your guard,
Killing and dying but still fighting hard,
Tell me my India' what I am worth.'

The other day I was on TV too,
You came up to me with your educated crew,
Told me to speak cos you seemed to care,
Wrote your story stripped me bare.

I was so naive I didn't know,
For you it was the nine o'clock show,
The country wants to hear some line,
Before they sleep, knowing they are fine,
Tell me my India' what I am worth.'

My Men tell me, that they are strong,
Would fight for their country, for all that's wrong,
While I tell them to stand and fight,
You ignore my existence, my very right,
Tell me my India' what I am worth.'

I thought I would tell my children in time,
How I fought for this country, this love of mine,
I wonder, if I should mention it though,
Don't want them embarrassed, while they start to grow,
Tell me my India' what I am worth.'

I was your ambition, your child hood dream,
Your Pilot, Your Sailor your Jawan in green,
Where did we part as friends, our ways
I never let you down a single day,
Tell me my India' what I am worth.'---------------------------------

11 comments:

త్రివిక్రమ్ Trivikram said...

అంతగొప్ప సైనికాధికారి చనిపోతే అంతిమయాత్రకు భారతదేశపు Supreme Commander of Armed Forces అయిన రాష్ట్రపతి రాకపోవడం దారుణం. ఆమె ఉన్నది అధికారిక పర్యటనలోనైనా రద్దుచేసుకుని రావలసింది. ఏ పర్యటనలో ఐనా మన దేశపు రాష్ట్రపతి వెలగబెట్టవలసిన రాచకార్యాలేముంటాయి గనక? ఇక ప్రధానమంత్రి, రక్షణ శాఖామంత్రి ఢిల్లీలో ఉండి కూడా హాజరుకాకపోవడం మరీ దారుణం. "జై జవాన్, జై కిసాన్" అన్న నినాదాన్ని కనీసం నిన్నైనా ఎవరైనా వారికి గుర్తుచేసి ఉండవలసింది. ఔను, సాహసోపేతమైన కార్యాలు చెయ్యడానికి సైన్యంలో చేరాలని చిన్నప్పుడు ఉవ్విళ్ళూరినవాళ్లమే. పెద్దయ్యాక మాత్రం మనకు కాలర్ నలగని ఉద్యోగాలే కావాలి. మన దేశంలో జవానుకు గౌరవం లేదు, కిసానుకు జీవనమే లేదు. సిగ్గేస్తోంది.

sujata said...

అంత లేదు. రెటైర్ అయ్యేదాకా.. ఆర్మీ ఆఫీసరు కింగే ! కానీ, రెటైర్ అయ్యాకా.. ఎవ్వరూ పట్టించుకోరు. అది ఎవరికైనా సహజమె (వేరే ప్రొఫెషన్ వాళ్ళకు కూడా..) జవాన్ల సంగతి నిజమే. ఎంత పేద కుటుంబాల నుంచో వచ్చి ఫౌజ్ లో చేరతారు. ఎంత బండ పని అయినా.. నోరెత్తకుండా చేస్తారు. వీళ్ళకు ఆర్మీ లో ఉద్యొగం అంటే అదో కెరీర్ లక్ష్యం. దీనికి, మన ప్రతిభా పాటిల్ కూ పొంతన ఎమిటి ? ఆవిడ సోనియా చేతి లొ కీలు బొమ్మ. సోనియా.. ఎందు లోనూ ధురీణురాలు కాదు. ఈ చెత్త రాష్ట్రపతి రాకపొవడమె, మానెక్ షా కు మంచి నివాళి.

netizen నెటిజన్ said...

@సుజాత: All said and done after all she is the President of India. It is improper to slight her.

సుజాత said...

@త్రివిక్రం గారు,
బాగా చెప్పారు.

@సుజాత గారు,
మీరూ బాగా చెప్పారు. ఆవిడ రాష్ట్రపతి అయితే ఎవరిక్కావాలి, ఇంకెవరైతే ఎవరిక్కావాలి..అంతటి వీరుడికి నివాళి సమర్పించలేకపోయాక. అయినా పాపం ఆవిడకి టైము ఉండాలి కదండీ! దిగిపోయే లోపు దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ మన ఖర్చుతో దర్శించి, ప్రసాదాలూ, జీర్ణ వస్త్రాలూ పొందాలా వద్దా?

మహేష్ గారు,
మహావీరుడికి మీతో పాటూ మా నివాళి. ఈ తరం వాళ్ళెవరికీ ఆయన చనిపోయేదాకా ఆయనెవరో తెలీకపోవడం విచారించాల్సిన విషయమా కాదా! బాధ వేస్తోంది.

పూర్ణిమ said...

మొన్న నెటిజన్ గారి బ్లాగులో చూసాకే.. వీరి గురించి పూర్తిగా తెలిసింది. మర్నాడు ఎవరో అడిగితే.. ఆపకుండా రెండు నిమిషాలు మాట్లాడే అంత తెలిసింది. ఇప్పుడు మీరు కూడా రాసినందుకు.. అభినందనలు.

కార్గిల్ యుద్ధం అప్పుడు అటల్ జీ ఒక మాట అన్నారు: చదరగం లో అయినా.. యుద్ధం లో అయినా మంత్రులు వెనక్కి తగ్గే అవకాశం ఉంది.. కానీ జవాన్లకి లేదు అని. అది అక్షరసత్యం.

ఏదో యుద్ధమప్పుడే మనకు వీళ్ళెంత ముఖ్యమో అర్ధం అవుతుంది. ఆ తర్వాతంతా మామూలే!! :-(

netizen నెటిజన్ said...

@సుజాత గారు, మీరు నెటిజన్ ఉద్దేశించి వ్రాసిఉంటారని అనుకుని:
"మీరూ బాగా చెప్పారు.. జీర్ణ వస్త్రాలూ పొందాలా వద్దా?"
క్షమించాలి!
It is improper to slight her

netizen నెటిజన్ said...

@మహేష్ గారు:క్షమించాలి!
It is improper to slight her.she is the President of India. You are an Indian. Hope better sense will prevail.

netizen నెటిజన్ said...

Let us all salute him!

వేణూ శ్రీకాంత్ said...

I join you folks in saluting him.

కత్తి మహేష్ కుమార్ said...

అందరికీ నెనర్లు. Let's all salute the great man and a great Soldier.

@netizen, I do understand. We have to give respect to the constitutional position she is holding. నేను పైన చెప్పిన బాధల్లా, తను హాజరు కాలేకపోయిందని మాత్రమే.

But, I agree when Trivikram when he says,"Its sad in-spite of she being the 'supreme commander of armed forces' failed to attend the funeral."

మేధ said...

ఈ వార్త చదివిన ప్రతి భారతీయుడు/రాలు వాళ్ళ మనసుల్లో నివాళులు అర్పించే ఉంటారు, ఒక్క మన ప్రభుత్వ పెద్దలు తప్ప.. అలాంటి వాళ్ళ గురించి చర్చించుకోవడం కూడా దండగే... అలా ప్రవర్తించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి..