Tuesday, July 8, 2008

జ్ఞాపకాల్ని అక్షరబద్ధం చేద్దాం రండి !


ప్రియమైన బ్లాగరులారా, సాధారణంగా చావా కిరణ్ గారు బ్లాగుల్లో రాయవలసిన ‘ఈ పక్షం విషయం’ సూచించేవారు. కానీ ఈ సారి నాకు ఆ బాధ్యత ఇవ్వడం జరిగింది."Memory is a way of holding on to the things you love, the things you are, the things you never
want to lose"
అంటారు. అంటే, మననుండీ ఎప్పటికీ విడిపోని, కోల్పోని, ప్రియమైన గుర్తులే జ్ఞాపకాలు అని. ఎంత అందమైన ఆలోచన!జ్ఞాపకాలే లేకపోతే మన జీవితం ఇంత అద్భుతంగా అనిపించేదా? అందుకే అనుకుంటా బహుశా, "A memory is what is left when something happens and does not completely unhappen" అంటారు. ప్రతి మనిషి జీవితంలో ఈ జ్ఞాపకాలుంటాయి. కొన్ని తీపి, కొన్ని చేదు, కొన్ని వగరు, కొన్ని అద్భుతం, కొన్ని అతిశయం మరికొన్ని ఆనందాన్ని తమలో ఇముడ్చుకుని మన హృదయాంతరాలల్లో నిక్షిప్తంగా ఉండిపోతాయి.వాటిని తట్టిలేపుదాం... ఆకారాన్నిద్దాం.... అక్షరాల్లో ఇముడ్చుదాం...అందరితో పంచుకుందాం."Every man's memory is his private literature" మన బ్లాగులు మన భావవ్యక్తీకరణ ప్రపంచాలే కనుక, మన జీవన సాహిత్యాన్ని మనదైన శైలిలో పంచుకుందాం.అందుకే, ఈ పక్షం (15 రోజుల) విషయం "మర్చిపోలేని జ్ఞాపకాలు". ఈ రోజు 8 జూలై నుండీ 23 జూలై వరకూ మనమన బ్లాగుల్లో ఈ విషయంపై టపాలు రాద్దాం. ఎక్కువ స్పందనను పొందిన టపాను ఉత్తమ టపాగా ఎంచి గౌరవిద్దాం.-------------------------------------

17 comments:

సుజాత said...

అయితే మీదే ఉత్తమ టపా!

పూర్ణిమ said...

మర్చిపోలేని జ్ఞాపకాలు?? మర్చిపోయే వాటి సంగతి ఏంటి మరి?? ;-)

ఇక బ్లాగ్లోకంలో "జ్ఞాపకాల" జాతర మొదలవుతుంది మాటా.. ఓ హో.. ఇక పండగే.. పండగ!!

బొల్లోజు బాబా said...

నా కవితలన్నీ నా మరచి పోలేని జ్ఞాపకాలే!

బొల్లోజు బాబా
p.s. . ఈ మధ్య కొంచెం టచ్ తప్పా. Excuse me all.

Kranthi said...

ఎన్ని చెప్పినా తరగని భావాలు జ్ఞాపకాలు ఎవరెన్ని రాస్తారో చూద్దాం.

meenakshi.a said...

Oho alaagaa .santhosham...
ika nadumu biginchaalannamaata...
ika sandaDe sandaDi...anna maata....
ooooooooooooooooooooo...

వేణూ శ్రీకాంత్ said...

Good idea Mahesh. I am sure it will be great fun.

అబ్రకదబ్ర said...

పదిహేను రోజుల పాటు ఒకటే విషయమ్మీద రాయమంటే రాసే ఆసక్తి ఎక్కువమందికి ఉండకపోవచ్చునేమో. అలా కాకుండా ఫలానా రోజు అనుకొని ఆ ఒక్కరోజూ జ్ఞాపకాల దొంతరలకి కేటాయిస్తే బాగుంటుందేమో. ఆ రోజు గురించి ఓ వారం పదిరోజుల పాటు ప్రచారం చేస్తే ఎక్కువమందికి తెలుస్తుంది.

రాజేంద్ర కుమార్ దేవరపల్లి said...

జ్ఞాపకాల ను జ్ఞాపకాల గూర్చి రాయటమంటే స్పూనుతో సముద్రాలను తోడటమే,చూద్దాం.విజేతలు ఎవరౌతారో??

సుజాత said...

విజేతలా? అంటే ఇది పోటీనా? నాకు పోటీలంటే పడదు. నేను తప్పుకుంటున్నా!

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత, పోటీ అంటే పోటీ కాదు లెండి. రాసిన టపాలగురించి ఆఖర్న ఒక విశ్లేషణ ఎలాగూ రాయాలిగనక ఎక్కువ కామెంట్లోచ్చిన టపా గురించి కొంత ఎక్కువ చర్చ ఉంటుంది అంతే! ఉత్తమ టపాగా ఎంచి గౌరవిద్దామని చెప్పడం జరిగిందే తప్ప,ఏదో ఒక ప్రైజు అస్సలు ఇవ్వటం లేదు. ఇక మొదటి,ద్వితీయ ,తృతీయ లాంటి కేటగిరీలు అస్సలు లేవు. ఒక objective లెక్క ఉంటుందని number of comments అన్నంత మాత్రానా...పోటీ అనేసి మీరు తప్పుకుంటే ఎలా?

మన ‘ప్రొద్దు’ లో ‘ఈ నెల బ్లాగు’ అంటే అది పోటీగా భావిస్తున్నామా? అదొక ప్రోత్సాహం అంతే!

జాన్‌హైడ్ కనుమూరి said...

ఆలోచన బాగనేవుంది

హ!!!!!!!!!మ్మ!!!!!!
ఎక్కడనుంచి మొదలుపెట్టాలో???????????

కొత్త పాళీ said...

ఏం మహేశ మహాశయా .. ఏదో ఇన్నాళ్ళూ "ఫ్రెష్" గా రాస్తున్నారని ఆనందిస్తున్నా, మీ ఆలోచనల సంగతి ఎలా ఉన్నా, మీ భాషని ఎంజాయ్ చేస్తూ. ఉన్నట్టుండి ఇలాగ "ఇవ్వడం జరిగింది", "..కుందాం, ..ద్దాం" .. ఇలా మారిపోయిందేం? ఇంకాసేపుంటే .. "ఆ విధంగా ముందుకు పోదామని సవినయంగా మనవి చేస్తున్నా" అని కూడా అనేట్లున్నారు.

ఈ ప్రతిపాదన గురించి ఒక సూచన - పోటీ అనే మాట రానీయద్దు. ఈ పక్షపు బ్లాగ్విషయం అనండి చాలు. దానికి వచ్చే ప్రాముఖ్యత ఎలాగూ వస్తుంది.

అబ్రకదబ్ర said...

పోటీ ఐతే ఇంకా మొదలవలేదుగానీ నాకైతే క్రాంతి గెలిచేస్తుందనిపిస్తుంది. కొత్త పెళ్లికూతుర్లు పోటీల్లో పాల్గొనగూడదని నిషేధమేదన్నే చేస్తేగానీ మిగతా వాళ్లకి ఛాన్సుండదు.

మేధ said...

జ్ఞాపకం.. జ్ఞాపకం.. జ్ఞాపకం.. జ్ఞాపకమే లేకుంటే బ్రతుకేది...?!

కత్తి మహేష్ కుమార్ said...

@కొత్తపాళీ గారు, ఇలా అలవాటు లేని పని చెయ్యటం వల్ల నా భాషకూ కాస్త తడబాటు వచ్చిందనుకుంటా! చావా కిరణ్ గారు అడిగేసరికీ "చూస్తాను" అని ఇలా ప్రయత్నించా. ఇక ముందు ఈ సాహసం చెయ్యనండి. ఇక ‘పోటీ’ అని నేను టపాలో ఎక్కడా ప్రస్తావించలేదు.

రాజేంద్రగారి "విజేతలు" అనే వరకూ, "పోటీ" అని సుజాతగారి భావించనంతవరకూ ఆ ధ్యాసే నాకు రాలేదు. క్షమించండి. తెలియక చేసిన ఈ ప్రయత్నాన్ని మన్నించగలరు.

సుజాత said...

మహేష్ కుమార్ గారు,
ఏదో చేతిలో కంప్యూటరు ఉందని గిలికాను లెండి! మీరు మరీ సారీలు, మన్ననలదాకా పోనక్కర్లేదు. లైటు!

భావన said...

ఇంక ఏమైంది కధ కంచి కి మన ల్యాప్ టాప్ హైబెర్నేటింగ్ మోడ్ కు వెళ్ళి పోయిందా? చివరకు ఎవరి టపా లో జ్ఞాపకాలు ఎక్కువ పంచుకోబడ్డాయి? ఏమయ్యింది?