‘ఈవ్ టీజింగ్’ పైన ఇంతకు మునుపు నేను రాసిన టపా పైన జరిగిన చర్చ దాదాపు మొరాలిటీ (morality) పై ఉండటం కాస్త ఆశ్చర్యంతో పాటూ బాధని కలిగించింది. దానితో పాటూ సెక్స్ గురించి ఉన్న సామాజిక విలువల పట్ల మన భారతీయుల్లో ఉండే over obsession విస్మయానికి గురిచేసింది. కొన్ని ఆలోచనల తీవ్రత ఎలా ఉందంటే, ‘మనుషుల్ని చంపైనా సరే దేవాలయాన్ని నిర్మిస్తాం’ అనే తీరులో, ‘ఈవ్ టీజింగ్ ఉన్నా ఫరవాలేదుకానీ మన సమాజ విలువల్ని మాత్రం ప్రశ్నించకూడదు’ అన్నట్లుగా అనిపించాయి.
మూలకారణం ఇదీ అని కొన్ని పరిశోధనలు చెబుతున్నా, ఆ పరిశోధనల్ని ప్రశ్నిస్తున్నామేగానీ, సమస్య తీవ్రతను అర్థం చేసుకుని కనీసం తమకు తోచిన పరిష్కారాన్ని చెప్పలేకపోతున్నాం. కొందరు కొన్ని పరిష్కారాలు చెప్పడంకూడా జరిగింది. ఆ చర్చల్ని క్రోడీకరించి ఇక్కడ అసలు సమస్య తీవ్రతని విపులంగా చర్చించడానికి ప్రయత్నిస్తాను. పరిష్కారాలు ఈ టపాకు వచ్చిన స్పందనల్ని దృష్టిలో ఉంచుకుని తరువాత భాగంలో వివరిస్తాను.
‘ఈవ్ టీజింగ్’ అనే పదం ఈ సమస్య తీవ్రతను మరుగుపరుస్తోందని నా అనుమానం. అసలు ఈ పదానికి అర్థమేమిటి? థెసారస్ డిక్షనరీ ప్రకారం, ఈ పదం native English పదం కాదట, దీని పుట్టుక మన భారతదేశంలోనే జరిగింది. దీని అర్థం "harassment of women". ఈ అర్థం యొక్క అమానుషత్వం ఆ పదంలో కనబడుతోందా, అన్నది ప్రశ్నార్థకమే! అంటే, ఈ పదం ప్రయోగమే సమస్యను సాంకెతికంగా మరుగుపరిచడానికి (euphemism) చేసిన ప్రయత్నమన్న మాట.
ఇక సమస్య తీవ్రత గురించి చెప్పాలంటే, చాలా మంది మహిళలు...కాదు కాదు...అందరు భారతీయ మహిళలూ ఈ సమస్యను ఏదోఒక స్థాయిలో అనుభవించినవారే.మరి ఇంత విస్తృతమైన ఉన్న ప్రాబ్లమ్ గురించి కనీసం పెద్దస్థాయి చర్చకూడా ఎందుకు జరగదంటే, ‘ఇలాంటివి జరుగుతూ ఉంటాయ్, వీటి గురించి మర్చిపోవాలి’ అనే నిరాసక్తత. మానభంగం జరిగినా ‘she might have asked for it' అనే మగదృక్కోణం (ఇది ఆడవాళ్ళలో కూడా ఉంటుంది). ‘ఇది మామూలే’ అనే అలవాటుపడినతనం. ‘ఇలాంటివి బయటకి చెప్పుకుంటే, సిగ్గుచేటు’ అనే సామాజిక కండిషనింగ్. వెరసి ఇదొక వికృత సామాజిక రుగ్మత అన్న నిజం మరుగునపడిపోయి, స్వేచ్చగా ఆడవాళ్ళని ఈ సమస్యను అనుభవించడానికి వదిలేసాం. చాలా గొప్ప "యత్ర నార్యస్తు పూజ్యంతే" సంస్కృతి కదా మనది! ఆ మాటే నిజమయ్యుంటే, ఈ దేశంలో దేవతలు కాదు దెయ్యాలు వాసం చేస్తుండాలి.
ఈ సమస్య యొక్క రూపాల్ని కొంత చూద్దాం.
చూపులు: దీనికి ముద్దుగా దీన్ని ‘సైట్ కొట్టడం’ అని పేరు. యుక్తవయసులో అమ్మాయి అబ్బాయిల్నీ, అబ్బాయిలు అమాయిల్నీ చూసుకోవడం సహజం. కానీ ఇది ‘సమస్యగా’ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తయారవుతుంది. కాలేజిలో నా స్నేహితురాలు ఈ విషయంగా బాధపడుతుంటే, "అబ్బాయిలు చూడకపోతే, చూడలేదంటారు. చూస్తే ఇలా బాధపడతారు" అని నేన్నదనికి తను , "looking is OK with us, but preying at us is not very acceptable" అంది. తన భావం తెలుగులో చెప్పాలంటే, "చూడ్డం వరకూ మాకు సమస్యలేదు, కాని తినేసాలా చూస్తేనే కాస్త ఇబ్బందిగా ఉంటుంది" అని. ఈ విషయాన్ని కాస్త పొడిగిస్తే, ‘కొందరి మగాళ్ళచూపులు, కళ్ళతోనే బట్టలు ఊడదీసినట్టుగా అనిపించి అసహ్యం వేస్తుంది’ అని. ఇప్పుడీ చూపులకి మొబైల్ కెమెరాలూ, రివ్యూ మిర్రర్ లూ తోడయ్యాయి.అంటే సమస్యని ఎంత లోతుగా అర్థంచెసుకుంటే అంత అసహ్యం వేస్తుందని నాకు తెలిసింది. అసలు సమస్యే లేదు, ఇదొక accepted culture అనుకుంటే, అసలు సమస్యే లేదు అని కూడా అర్థమయ్యింది. కానీ I prefer to understand the issue rather than keeping it under the carpet.
కూతలు : ఇంగ్లీషులో cat calling అనే ఒక పదం ఉంది. ఈ విధానానికి తగిన పదం అదే అనుకుంటా. అమ్మాయిలను చూడగానే అరుపులూ, కేకలూ,ఈలలూ వెయ్యాలనిపిస్తుంది కొందరికి. ఈ కామెంట్లు అమ్మాయి డ్రస్సుతో మొదలై అంగాల వర్ణన వరకూ వెళ్తాయి. ఇక్కడ హద్దులు కొన్నిసార్లు ఎంతగా మితిమీరిపోతాయంటే, ఈ ప్రబుద్ధులు చిన్నపిల్లల్ని కూడా వదలరు. "పిల్లే ఇంత బాగుంటే, తల్లెలా ఉంటుందో" అనికూడా తమ సృజనాత్మకతనూ, extended imagination ను ప్రదర్శిస్తారు.ఈ వికృతం సాధారణంగా గుంపులుగా ఉండే మగవాళ్ళు చేస్తారు. ఒంటరిగా ఉంటే నోరు కూడా పెగలని మగాడు, మంది తోడుంటే మృగమైపోతాడన్నమాట. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ఈ సంస్కృతి ‘మెజారిటీ’కి అంగీకారమైనది అని. మన ప్రజాస్వామ్యం ప్రకారం దీనికి లైసెంస్ ఇవ్వాల్సిందే. కొందరిని ఇలా ఎందుకు చేస్తారని అడిగితే "just for fun" అన్నారట. ఎదుటివాళ్ళు ఎంత బాధపడతారో కూడా తెలీకుండా అనుభవించే ఆనందాన్ని fun అనాలా, లేక పైచాచికత్వం అనాలా? ఆడాళ్ళుపడే బాధకి కొలమానాలు లేవుగనక, let them have fun అనుకుని సరిపెట్టుకుందామా?
చేతులు - చేతలు: బస్టాపుల్లో,బస్సుల్లో, వర్క్ ప్లేస్ లో, బజార్లో , షాపింగ్ మాల్లో, లోకల్ ట్రైన్ లో, సినిమా హాల్లో ప్రతిచొటా ‘యాక్సిడెంటల్’ గా తగిలే చేతులు, ఆ చేతులు అప్పుడప్పుడూ మితిమీరి చేసే చేతలు. ఇది, ఈ సంస్కృతిలో మరోస్థాయి. ఎందుకు చేస్తారూ అంటే, "I get a guilty pleasure out of it" అన్నాడత ఒక పట్టుబడిన ఈవ్ టీజర్. తప్పని తెలుసు, కానీ అలా చెయ్యడంలో ఆనందం అనుభవిస్తాడట. అది ఒక మానసిక రుగ్మతలాగా వినిపించడం లేదూ? అంటే, మన చుట్టుపక్కల చాలా మంది ఇలాంటి మానసి రోగులున్నారన్నమాట.మరి వీరిని చికిత్స చేసి బాగు పరుద్దామా? పోలీసులకు పట్టిచ్చి శిక్ష వేయిద్దామా? లేక మూలాలని తెలుసుకుని పరిపూర్ణగా సమాజాన్ని శుద్ది చేద్దామా?పైన చెప్పిన అన్ని దశలూ sexuality కి సంబంధించినవైతే, మరి సమాధానం ఎక్కడ వెదకాలి ? పరిష్కారం ఎక్కడ చూడాలి? సమస్య లేదనుకుని కళ్ళు మూసుకుందామా? ఉన్నా అది మన ఆడవాళ్ళకి రాలేదని తృప్తిపడదామా? సమస్యకు సమాధానంగా పరిశోధనలు చెప్పినవాటిని "నేతి నేతి"(ఇది కాదు ఇది కాదు) అని వాయిదా వేద్దామా? తప్పించుకు తిరుగుదామా? మన సామాజిక విలువల్ని గట్టిగా పట్టుకుని మహిళల్ని మాత్రం ఈ పైచాచికానికి బలిచేద్దామా?చర్చ జరగాలి. సమాధానాలు కావాలి. అవి తప్పుడు అపోహలనుంచీ కాక విజ్ఞత, వివేచన కూడిన ఆలోచననుంచీ రావాలి.
Monday, July 7, 2008
మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారు ? Part 2
----------------
Subscribe to:
Post Comments (Atom)
9 comments:
రెండు భాగాలుగా రాసిన ఈ విషయంపై నా అభిప్రాయం, అమ్మాయిలకు కొన్ని సలహాలు.. ఇంతులు - ఈవ్ టీజింగ్
Good. You choose the right photographs that complement your posts. Wonderful.
ఈవ్ టీజింగ్ హేయమైన చర్యే!! దీనికి ఎన్ని కారణాలు ఉన్నాయో అన్ని పరిష్కారాలు ఉన్నాయనిపిస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు అన్నీ వర్క్ అవుట్ అయ్యిపోయి ఈ సమస్య పూర్తిగా సమసిపోతుంది అనుకుంటే.. అది ఇంకా అవివేకం.
ఈ సమస్య పూర్తిగా పరిష్కరించే భాధ్యత నీదే అని అంటే మాత్రం, నేనివి చేయడానికి ప్రయత్నిస్తా..
౧. అమ్మాయిలు బెరుకు, బేలతనం విడనాడి ధైర్యంగా ముందుకు సాగాలి. అందుకు అవసరమైన మానసిక శారీరిక శిక్షణ కలిపించాలి.
౨. ఇలాంటి చర్యలకు పూనుకునే వారి పై కఠిన చర్యలు తీసుకుంటే.. తప్పు పునరావృతం చేసే వారి సంఖ్య తగ్గుతుంది.
మీ మరో టపాకై వేచి చూస్తున్నా!! :-)
మహేష్,
"మూల కారణం ఇదీ అని కొన్ని పరిశోధనలు చెబుతున్నా ఆ పరిశోధననల్ని ప్రశ్నిస్తున్నామే కానీ ...."
ఆ ప్రశ్నించినవాడిని నేనే కాబట్టి మళ్లీ మొదలెత్తుకోవాల్సి వస్తుంది. చిత్తగించండి.
మీరుదహరించిన పరిశోధనలు ముందుగానే 'ఈవ్ టీజింగ్ కి కారణమిదీ' అని ఓ నిర్ణయానికొచ్చి దాన్ని బలపరిచే రీతిలో సాగిన అధ్యయనాల్లాగున్నాయే కానీ ఈ సమస్యకున్న విశ్వజనీనతని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు లేవు. ఎంతసేపూ మన సమాజంలోని ఈవ్ టీజింగ్ గురించేగానీ, ఇతర సమాజాల్లోనూ ఇటువంటి జాడ్యముందని గుర్తిస్తున్నట్లే లేదు. ఉపఖండంలో దీన్ని ఈవ్ టీజింగ్ ఆంటే, ఇతర దేశాల్లో దీన్నే సెక్సువల్ హెరాస్ మెంట్ అంటారు. తేడా పేరులోనే - సమస్యలోనూ, దాని తీవ్రతలోనూ కాదు. ఆడా మగా సంబంధాల్లో విప్లవాత్మక మార్పులు దీనికి పరిష్కారమైతే, అటువంటి మార్పుల్ని ఇప్పటికే అమలు చేస్తున్న దేశాల్లో ఈ సమస్య పూర్తిగా కాకున్నా మనకున్నంత ఎక్కువ స్థాయిలో ఉండకూడదు కదా. ఈ ప్రశ్న నేను ఇప్పటికే రెండు సార్లడిగాను. దానికింతవరకూ సమాధానం లేదు!
సరే, మీకు నచ్చే గణాంకాల పద్ధతిలోనే వద్దాం. ఈ కింది ముక్కలు చదవండి:
* Two out of every three subway riders in New York has been sexually harassed (the survey was of a mixed group, with almost 70% of respondents being women).
* In Tokyo, the problem is just as bad - 64% of women in their 20s and 30s reported being groped on the train or in transit stations. In fact, the problem is so well recognised in Japan, that there's even a specific name for subway harassment: chikan.
* In the US, a woman is beaten every 18 minutes and every six minutes a woman is raped. Between 22 and 35 per cent of women who visit emergency rooms are there as a result of domestic violence.
* In the Caribbean, one in three women has been sexually abused as a child.
* According to the World Health Organization, 85 - 115 million girls in the world's population have undergone some form of female genital mutilation and suffer from its adverse health effects.
* Statistics Canada estimates 1.2 million women and 300,00 men experience some form of sexual harassment at work every year.
ఇవన్నీ సూచించేది దేన్ని? పైవన్నీ మీరు ప్రతిపాదించే safe expression of sexuality అమల్లో ఉన్న దేశాలే. అక్కడ పరిస్థితి మనకన్నా ఘోరంగా ఉందంటే దానర్ధం ఏమిటి? నేను ముందే చెప్పాను. 'నేను బలవంతుడిని' అన్న అహం వల్ల పురుషులు మహిళలమీద దాడులకు తెగబడుతున్నారే కానీ ఆయా సమాజాలు స్త్రీ-పురుష సంబంధాలపై విధించిన నియమాలకి సెక్సువల్ హెరాస్ మెంట్/ఈవ్ టీజింగ్ కి సంబంధం లేదు (ఎక్కువ సందర్భాల్లో)
. ఆడపిల్లలు ఎదురు తిరిగి రెండంటిస్తే ఇలాంటి కేసులు చాలావరకూ తగ్గుతాయి.
మీ వాదనలో మరో డొల్లతనమూ ఉంది. 'అమెరికాలో మాదిరిగా ఒకమ్మాయిపై ప్రేమ/కోరికని సులువుగా వ్యక్తం చేసే విధానం అమల్లోకొస్తే ఇలాంటివి తగ్గుతాయి' అన్నారు. అప్పుడా కుర్రాడు ఆ ఒక్క అమ్మాయితో మర్యాదగా ఉండొచ్చేమో కానీ మిగతా అమ్మాయిలతో వెకిలి వేషాలేయడనేమీ లేదు.
అబ్రకదబ్ర చెప్పినదాన్లో చాలా నిజం ఉంది. సమస్య సెక్సువాలిటీ అణిచివేత కాదు. నా ఉద్దేశంలో ఇది రేప్ కి కేవలం ఒక్క మెట్టు తక్కువ. రేప్ లో సెక్స్ ముఖ్యం కాదు. అదొక పవర్ ప్లే. ఈ ప్రవర్తనలోనూ ఉన్నది అదే .. చూడు సుమా, నీమీద నీకు రక్షణ లేదు, నేను తల్చుకున్నప్పుడల్లా నీ హద్దుల్ని అతిక్రమించగలను అని భయ పెట్టి ఆనందించే ఒక పైశాచిక గుణం. దానికి విరుగుడు అవతలి వ్యక్తి భయపడక పోవటమే అని నా అభిప్రాయం.
@కొత్తపాళీ; మీరు చెప్పిన "పవర్ ప్లే" మామూలుగా ఫెమినిస్టులు ఇచ్చే వివరణ.దానిని సరైన వివరణే అని ఒప్పుకుంటే కొని సమస్యలున్నాయి.
రహస్యంగా ఆడవాళ్ళ అంగాల్ని తాకి ఆనందించడం ఏ విధమైన పవర్ ప్లే?
దూరంగా ఉన్న అమ్మాయిని కేకవేసో ఈలవేసో వేధించడం ఏవిధమైన పవర్ ప్లే?
అది ఒక మానసిక రుగ్మతగా అనిపిస్తుందేకానీ, male domination చూపించే పవర్ ప్లే అనాలంటే కాస్త సందేహంగా ఉంది. మన సమాజం రూపొందించిన జీవన నమూనా (design) ఈ పవర్ ప్లే కోసం కాదంటారా? ఇంత పెద్ద స్థాయిలో అల్రెడీ పవర్ ప్లే జరిగిపోయిన తరువాత కేవలం ఈ మానసిక రుగ్మతల మీద అభియోగంమోపి వాటిని trivialize చేద్దామా?
ఈవ్ టీజింగ్ ఒక sexual ‘crime’ దానికి కొన్ని సామాజిక రుగ్మతలు కారణం. ఎందుకంటే, చాలా గౌరవ ప్రమైన కుటుంబాలనుండీ వచ్చిన యువకులు కూడా ఈ నేరాలకి పాల్పడుతున్నారు. అందుకే this seem to be a result of deeper problem in our society.దానికి నాకు తోచిన, నేను తెలుసుకున్న కొన్ని కారణాలలో ముఖ్యమైనదిగా our sexual attitudes కనిపించింది.‘అదొక్కటే పరిష్కారం’ అని నేను ఎక్కడైనా చెప్పుంటే అది నా మూర్ఖత్వమే. ఇంకా చాలా విషయాల్లో మార్పులు రావాలి. వాటిగురించి, ఈ చర్చ ముగించిన తరువాత ఒక టపా రాయాలి.
@అబ్రకదబ్ర;మీరు చెప్పిన గణాంకాలకి నెనర్లు.But all their statistics are better than India.ఇక్కడ ప్రతి రెండు నిమిషాలకీ ఒక ఘటన జరుగుతుంది. గుడ్డిగా అమెరికాను ఫాలో అవ్వమని కాదు నేను చెప్పింది. can we evolve our own model in regard to our sexual attitudes. కాకపోతే ప్రస్తుతం ఉన్నవాటిల్లో మార్పు రావాలన్నది మాత్రం నిజం కదా! ఆ మార్పు ఎలా ఉండాలి అనేది, నేను prescribe చెయ్యలేను. కేవలం సజెస్ట్ చెయ్యగలను.
ఇక మీరు చెప్పిన దాన్ని మట్టి చూస్తే ఈ సమస్య ఏవిధంగాను తీరదు. నా మొదటి టపా రాసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. కానీ I want to be positive.అందుకే పరిష్కారాలు వెదుకుతున్నాను.
మహేష్,
నేనేదో నీ తృప్తికోసం గణాంకాలిస్తే వాటిల్లోంచీ ఈకలు పీకటమేనా :-) 'యు.ఎస్.లో ఆరు నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది' అని నేనంటే 'మనకి రెండు నిమిషాలకో అత్యాచారం జరుగుతుంది, కాబట్టి ఇక్కడ పరిస్థితి ఇంకా ఘోరం' అనే కౌంటరా!?! మిత్రమా, బిలియన్ జనాభా ఉన్న మనకి రెండు నిమిషాలకో సంఘటన జరిగితే, మనలో నాలుగో వంతున్న వాళ్లకి ఆరు నిమిషాలకొకటి జరుగుతుంది. ఎలా చూసినా ఇది మనకెక్కువ, వాళ్లకి తక్కువ అనుకునే సమస్య కాదు. మనతో పోలిస్తే కట్టుదిట్టమైన చట్టాలు, విచారణా పద్ధతులు, సత్వర న్యాయం జరిగే పరిస్థితులు ఎక్కువ ఉన్న అమెరికాలో ఈ ఫ్రీక్వెన్సీలో అత్యాచారాలు జరగటమే ఘోరం. అవే లేకుంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదో ఊహించుకోండి.
మహేశ్ గారు...ఈ సమస్య ప్రతి రోజు ఉండేదె...కాలేజ్ కి వెళ్ళేప్పుడు
బస్ ఎక్కాలంటే భయం వేస్తుంది..ఇక సమస్య కి పరిష్కారం ...ఏమిటో తెలీదు...కాని ఇలా ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని పట్టుకుని తన్నాలనిపిస్తుంది..కావలని తగలడం సారి చెప్పడం...అసలు కావలని చేసారో,అనుకోకుండా పొరపాటు జరిగిందో అర్దం కాదు..అఫ్ కోర్స్ అందరు అబ్బాయిలు అలా ఉండరు...కాని ఇలా ఈవ్ టిజింగ్ చేసేవాళ్ళని ఎలా మార్చాలో తెలీదు...ఇలా చేసే వాల్లలో చదువుకున్న అబ్బాయిలు కూడా ఉండడం చాలా బాదకరం..ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా దీనికి ఒక కారణమేమో అనిపిస్తుంది..నాకు
..అమ్మాయిలను కామెంట్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది..
ఆమ్మాయిలు ఈ సమస్యలను ఎదుర్కోవలంటే మానసికంగాను,శారీరకంగాను సిద్ధం కావాలి..
అమెరికా లో కూడా ఇలా జరుగుతుందా...నేను ఇన్నాల్లు వాల్లు నాగరికులు.....కావాలంటే డేట్ అడుగుతారు కాని ఇలా చేస్తారని అనుకోవట్లేదు....అప్పుడు వాల్లకి మనకి తేడా ఏంటండి.....
నాకు ఇప్పటికే చాలా బ్రమలు వున్నాయి. అమెరికా అంటే నాగరికులని మనం కూడ వాల్ల లాగ తయరవ్వాలని అనుకుంటున్నాను... ఎవరైనా NRI లు అమెరికా ఇండియా ,వాల్ల జీవన విధనాలకి మనకి వున్న తేడాలని వివరిస్తూ వ్యాసం రాస్తే మాలాంటి వూహించు కొనే వాల్లకి వుపయోగ పడగలదు.....
Post a Comment