Wednesday, July 2, 2008

రాంగోపాల్ వర్మ త్రిచిత్రాలు (Trilogy) - ఒక సామాజిక విశ్లేషణ

రాంగోపాల్ వర్మ మంచి దర్శకుడా, చెత్త దర్శకుడా అనే చర్చలు తను తీసిన ప్రతి సినిమా రిలీజైన తరువాత మన మధ్యన జరిగేవే. సినీవిశ్లేషకుల నుంచీ, సాధారణ ప్రేక్షకుడి వరకూ తన సినిమాలోని ప్రతి దృశ్యం, ప్రతి కెమెరా కోణం, ప్రతి పాత్ర కదలికా చాలా ఇష్టంగా చీల్చిచండాడుతాం. ఈ love -hate సంబంధానికి మూలకారణం, ఈ దర్శకుడు చాలా ప్రతిభావంతుడూ, సమకాలీన దర్శకుల నడుమ తనదైన ప్రత్యేకత కలిగినవాడూ అవడమే అని నా నమ్మకం. ఏది ఏమైనా, ‘శివ’ సినిమాతో తెలుగు సినిమా చరిత్ర శకాల్ని మార్చిన ఈ దర్శకుడు, ముంబై వచ్చి తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించి భారతీయ సినీజగత్తులో కూడా ఒక కలకలాన్ని రేపాడన్నది కాదనలేని నిజం.ఈ పరిణామక్రమంలో చాలామంది గౌరవించదగ్గ సినీదర్శకుల లాగే, తన సినిమాలలో వర్మ తనకు తెలిసిన సమాజ పార్శ్వాన్ని తెరబద్ధం చేసాడని నా విశ్వాసం. కల్పిత కథలూ, ఏడుపుగొట్టు చిత్రాలు, నిజానికి దూరమైన చిత్రీకరణ పరంపరల నడుమ, వర్మ సమాజంలోని ఒక చీకటి కోణాన్ని సహజమైన చిత్రీకరణల మధ్య విజయవంతంగా తెలుగు, భారతీయ సినిమాలకు పరిచయం చేసాడు. మనం ఎంత అసహ్యించుకున్నా, చీకటి ప్రపంచం (underworld) ఒక నిజం. మన సమాజంలో ఉన్న ఒక ముఖ్యమైన కోణం. సమాజంలో ఈ కోణం యొక్క అంచలంచల ఎదుగుదల పరిణామ క్రమం తన సినిమాల రూపంలో, తన కధానాయకుల రూపంలో "రికార్డ్" చేసాడు అనిపిస్తుంది.అందుకే తన మొదటి సినిమా ‘శివ’, తనదంటూ ఒక శైలిని ఏర్పరిచిన ‘గాయం’ , వర్మ స్టైల్ ను ఒక శిఖరాగ్రానికి చేర్చిన ‘సత్య’ సినిమాలను తన త్రిచిత్రాలు (Trilogy)గా ఎంచి, ఒక సామాజిక విశ్లేషణ చెయ్యడం జరిగింది. ఆ విశ్లేషణ "ఈ మాట" నెట్ పత్రికకోసం రాసాను. ఈ లంకె ద్వారా ఆ విశ్లేషనాత్మక వ్యాసాన్ని చదివి, మీ అభిప్రాయాల్ని తెలుపగలరు.
---------------------------------------------

13 comments:

RSD said...

నమస్తే
మీరు రాసింది తప్పని నేనటం లేదు కానీ, రాంగోపాల్ వర్మ ఏదో డబ్బులు కోసం వాడి సినిమాలు తీసి పాట్లు పడుతున్నాడు. అవి జస్ట్ చూసి వదిలేయడం మంచిదా లేకపోతే ఈ విశ్లేషణ మూలానా మీరేమైనా సాధించారా? మీ విశ్లేషణ వల్ల ఎవరికి ఉపయోగమో కొంచెం ఆలోచించండి. ఈ వర్మ గారిక్కానీ, ఆఖరికి వాడి దగ్గిర పనిజేసే అసిస్టెంట్లు గానీ ఈ బ్లాగు చూసే ఆస్కారం ఉందా? పోనీ చూసారనుకోండి ఏం ఒరుగుతుంది వాళ్ళకి కానీ, మీకు కానీ, మీ బ్లాగు చదివే వాళ్ళక్కానీ?

ఇలా అన్నానని కోపం తెచ్చుకోకండే? నిజానికి నాకు సినిమాల గురించి మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే నేను సినిమాలు చూసేదే తక్కువ. బట్ నేను అడిగేది, ఈ విశ్లేషణ వల్ల ఎవరికి లాభం అనేదే. మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. సారీ.

కత్తి మహేష్ కుమార్ said...

@RSD, మీ సందేహం సహేతుకం. కానీ అన్ని లలితకళల్లాగే, సర్వకళల సమాహారమైన "సినిమాకు ఒక సామాజిక ప్రయోజనం ఉంది", అని నాలాంటి జనుల నమ్మకం.

"మనం జీవిస్తున్న సమాజంలోని పోకడలను అర్థం చేసుకుంటే ఎవరి లాభం?" అనుకుని మానేస్తే, అసలు సాహిత్యం యొక్క అవసరం లేదు కదా! సినిమాకూడా అంతే,‘సమాజంలోని ఆ సమయానికి తగ్గ పోకడలను దృశ్యబద్దం చేసేదే సినిమా’ అని నా నమ్మకం.

ఇక ఈ టపాను రాంగోపాల్ వర్మో, వారి అసిస్టెన్ట్లలో చదువుతారని నేను రాయలేదు.తను తెలుసుకున్న లోకాన్ని, మనలాంటి తెలియనివాళ్ళకు సినిమాల ద్వారా పరిచయంచేసిన వర్మ, ఒక సామాజిక శాస్త్రవేత్తతో సమానమని నాకు అనిపిస్తుంది.ఆ సామాజిక దృక్పధంతోనే దీన్ని రాశాను.


హాలీవుడ్ కు (అమెరికాకు) ‘గాడ్ ఫాదర్’ సినిమా ఎలాగో మన తెలుగుకు శివ, గాయం అలాంటివి.ఇక ‘సత్య’ముంబై మాఫియా చరిత్రకు ఒక testimony లాంటి చిత్రం.వాటిని విశ్లేషించి అర్థాలు శోధించకుంటే,వచ్చే నష్టం లేదని మీ ఉద్దేశం. కానీ ఈ శోధనకు ఒక శాస్త్రీయత ఉందని నా అభిప్రాయం.


"ఇక సినిమాలకు శాస్త్రీయత ఏమిటా?" అని మీరు అడిగితే, మీరు సినిమాలు చూడకపోవడంతోపాటూ యూనివర్సిటీ విద్య కూడా అభ్యసించలేదు, అని నేను అనుకోవల్సి వస్తుంది.ఈ మధ్య విశ్వవిద్యాలయాలలో film & cultural studies అనే శాఖలున్నట్టు మీకు తెలుసా? సినిమాల మీద డాక్టరేట్లు సంపాదించవచ్చని మీకు తెలీదా?

మీకు ఇంకా సందేహాలుంటే ఇక్కడ చర్చించడానికి నేను సర్వదా సిద్ధం, అని తెలియజేసుకుంటున్నాను.

Venu said...

మంచి విశ్లేషణ. చాలా బాగా వ్రాశారు మహేష్ గారు. కాస్త బుర్ర పెట్టి సినిమాలు తీసే దర్శకులలో వర్మ గారొకరు.

దేవన అనంతం said...

నమస్కారం మహేష్ గారు,,

నేను రాంగోపాల్ వర్మ అభిమానినే కాని కొంచెం అటు ఇటు గా ఒకే కథా వస్తువు ను పదే పదే సినిమా గా తీయడం పెరుగు ను మజ్జిగ గా చెయ్యడమే.

మీ నవతరంగం వెబ్ సైట్ చూసాను, చాల బాగుంది, యుసెర్ ఇంటర్ఫేస్ బాగుంది. మీ సమీక్షలు బాగున్నాయి. నేను కూడా చూసిన కొన్ని గొప్ప ప్రపంచ సినిమాలు పై తప్పకుండా నా అభిప్రాయాలను వ్రాస్తాను.

RSD said...

నా చదువు, పెర్సనల్ విషయాలు కాదు కదా మన డిస్కషన్? నేను మీ పెర్సనల్ విషయాలు కానీ చదువు గురించీ అడిగానా? అవి పక్కన పెడదాం.

మీర్రాసిన విశ్లేషణ వల్ల సాంఘిక ప్రయోజనం ఏమిటి? ఎవరికి ఉపయోగం?(జాగ్రత్తగా చదవండి ఇక్కడ. పనికి రానిది అని నేను అనటం లేదు. నాకు ఉపయోగం అర్ధం కాక అడుగుతున్నాను అంతే.)

నా ఉద్దేశ్యంలో వర్మ డబ్బులుకోసం తీసాడు. ఏ హీరో ఎలా పోతాడో వాడికి అనవసరం. డబ్బులు వస్తాయంటే వీళ్ళు ఏ చెత్త అయినా తెర మీదకెక్కించడానికి రెడీ అని నేను అనుకుంటున్నాను. మడిగట్టుకుని నేను ఇంక చెత్త సినిమాలు తీయను అనే వాళ్ళు ఇంకా సినిమా ఇండస్ట్రీ లో ఉన్నారంటారా?

urworstnitemare said...

వుప్పుడూ .. వో తలమాసిన లింగయ్య పుట్టాడు. ఆళ్ళ అమ్మానాన్నా సావగొడితే ఏడుసుకుంటా బడికెల్లాడు. ఆడ మేట్టారు సావగొడితే ఏడుసుకుంటా సదివి పేసయ్యాడు. యీ దేసంలో నువ్వు పనికిరావు పోరా అని సావగొడితే ఏడుసుకుంటా యిదేసం వొచ్చాడు. ఆడ మేనేజరు గాడు సావగొడితే ఏడుసుకుంటా పనిజేస్తన్నాడు. ఇంటికెల్తే పెల్లం సావగొడితే ఏడుసుకుంటా నెట్టెక్కి యెదవ కామెంట్లు రాస్తన్నాడు. ఆడి యెదవ కామెంట్ల వొల్ల ఏం సాంఘిక ప్రయోజనం? ఎవుడికి ఉపయోగం? అసలాడు పుట్టి ఎవుడికి ఉపయోగం? అహ .. అసల్నాకు తెలీక అడుగుతున్నాలే..

వేణూ శ్రీకాంత్ said...

చక్కగా విశ్లేషించారు మహేష్, మీరన్నట్లు ఈ మూడు సినిమాలు వాటి హీరో లు ట్రెండ్ సెట్టర్స్. కానీ అంత Talent వున్న వర్మ multi tasking ని వదిలి దర్శకత్వం పై దృష్టి పెడితే ఇంకా మంచి సినిమాలు తీయగలడేమో అనిపిస్తుంది.

కత్తి మహేష్ కుమార్ said...

@RSD, చలం సాహిత్యంకన్నా, రాంగోపాల్ వర్మ సినిమాలు చూసిన తెలుగువారు ఎక్కువుంటారు. కానీ, చలంగారి రచనల మీద పుంఖాలు పుంఖాల విశ్లేషణ మనకు లభ్యం. దాని ఉపయోగం మనం ప్రశ్నిస్తున్నామా? లేదు! ఎందుకంటే, అవి సమాజానికి ఉపయోగం అని మనం నమ్ముతాంగనక.


సినిమాలూ అంతే. These are works of art and deserve analysis. ఇక నేను రాసిన దాని వలన జరిగే immediate సామాజిక ప్రయోజనం, ఒక ఆలోచనని,ధృక్కోణాన్ని పరిచయం చెయ్యడం.అవి ఎంతవరకూ ‘ఉపయోగం’ అనేవి సమయం నిర్ణయిస్తుంది. అయినా, సమాజానికి అర్జంటుగా ఉపయోగపడిపోవాలని ఏ రచయితా రాయరనుకుంటా! ఆలోచనల్నీ, దృక్పధాల్నీ పంచుకోవడం సమాజ చైతన్య స్రవంతిలో అమూల్యమైన అంగం.దానికి నేనూ ఒక బిందువుని అందించే ప్రయత్నం చేస్తున్నాను. బహుశా మీరూ ఈ కామెంట్లు అందుకే రాస్తున్నాని నా నమ్మకం.


పైన చెప్పినవన్నీ intangible hoax అని మీకు అనిపిస్తే,వ్యక్తిగతంగా ఈ వ్యాసం వలన నాకు కలిగిన లాభం చెబుతాను వినండి. ఈ వ్యాసం యొక్క మాతృక నేను MA Communication చదువుతుండగా, ఒక internal assessment/assignment కోసం రాశాను. దానికి నాకు 10 కి 8 మార్కులొచ్చాయి.They are part of my final marks in my post graduation.


ఇక మీరు అడిగిన చివరి పాయింట్, వర్మ గురించి. రాంగోపాల్ వర్మ ఎలాంటివాడు, తన బిజినెస్ మాడల్ ఏమిటి అనేది నాకు అప్రస్తుతం. I judge him as a Director by the kind of films he made and his contribution to Indian cinema by the kind of `subjects' he has chosen to film. బహుశా తన గురించి ఇంత బాగా మీకు తెలియడానికి వ్యక్తిగతంగా మీకు పరిచయం ఉండోచ్చు, కానీ నాకు రాంగోపాల్ వర్మ as individual తెలియదు. క్షమించగలరు.

@venu, నెనర్లు. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. అందుకే కనీసం అలాంటి దర్శకుల సినిమాల విశ్లేషన చాలా ముఖ్యం అని నమ్ముతాను.

@దేవన అనంతం, నేను కూడా వర్మ పెరుగు ‘సత్య’ తరువాత మజ్జిగైందని భావిస్తాను. కానీ ఇంత మంచి అభిరుచి కలిగిన దర్శకుడి మళ్ళీ మంచి గడ్డపెరుగు లాంటి సినిమా తీస్తాడని ఆశ.

మీరు నవతరంగంలో రాయాలనుకుంటే, అర్జంటుగా devarapalli.rajendrakumar@gmail.com ఒక లేఖ రాయగలరు.

@urworstnitemare,నిజమే కదా! వ్యాసం ఉపయోగం ప్రశ్నార్థకమైన వారు, మళ్ళీ ప్రశ్నలు సంధించి సమయం వృధా ఎందుకు చేసుకుంటారో కదా?

@వేణూ శ్రీకాంత్, నెనర్లు. మనిషి సృజనాత్మకత ఒక స్థాయిని దాటాక తగ్గుతుంది. మళ్ళీ rejuvenate కావడానికి కొంత సమయం పడుతుందనుకుంటా...ఇక multitasking వదిలేస్తే మంచి సినిమాలు తియ్యగలడేమో అన్నది మన ఆశ. చూద్దాం. ఈ పరిణామ క్రమంలో తను బాలీవుడ్ ను కార్పొరటైజ్ చేసాడు చూశారా! That is an achievement in itself.

వేణూ శ్రీకాంత్ said...

Oh, I usually don't follow Bollywood movies Mahesh, but to my knowledge he did created opportunities through his factory, but most of his factory movies were disasters right? did he really made any change in Hindi movie making ? mI I vishlEshaNa laagaa varma's influence on hindi movie making ani evarannaa raste bavundu.

కత్తి మహేష్ కుమార్ said...

@ వేణూ శ్రీకాంత్, You have raised a important question. మీరు చెప్పినట్లుగా ఒక పూర్తి టపా దీనిగురించి రాయొచ్చు. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే, వర్మ హిందీ చిత్ర పరిశ్రమకు రాక ముందు చోప్రాలు,జోహర్లూ, కపూర్లూ అంటూ కుటుంబాలో లేక సుభాష్ ఘాయ్ లాంటి వ్యక్తులో రాజ్యమేలేవారు.వర్మ చేసిన మొదటి పని professionalize చెయ్యడం, తద్వారా corporate money ని చిత్రపరిశ్రమలోకి తీసుకురావడం.

ఇది బయటనుండీ వచ్చిన వర్మ లాంటివాడికి చాలా కష్టం, శ్రమతో కూడిన పని సుమా! అందుకే Its and achievement in itself అన్నాను. ఒక్కోసారి శ్రమని హిట్లూ,ఫ్లాపులతో కొలవలేము. He has lead that path on which, now the entire industry is planning its future.

వేణూ శ్రీకాంత్ said...

Mahesh, Thanks for the explanation.

యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ said...

i too like rajani...

geethoo said...

Mahesh garu, I read few articles in your blog. Great writing. Now I am an official 'fan' of you & your blog.

I read the whole trilogy of RGV and few articles in Navatarangam. Great job. also, learnt abt your 'dialogue writing' in 'NEW' movie.

Is this movie out in the market? I mean did it release? anyways, as I said before I will be in touch.