కాలేజిలో ఉండగా, మా హాస్టల్ ఎదురుగానే ఒక పోస్టఫీస్ ఉండేది. ప్రతిరోజూ కాలేజికి వెళ్ళే ముందు, కొంత మంది అమ్మాయిలు తాము ఇళ్ళకు రాసిన ఉత్తరాలు అక్కడ పోస్ట్ చేసి వెళ్తుండేవారు. ఒక రోజు నేను బయటకు రాగానే, గేట్ దగ్గర పేపర్ చదువుతున్న జూనియరొకడు ఉత్తరం పోస్ట్ చెయ్యడానికొచ్చిన అమ్మాయి డ్రస్సు గురించి పెద్దగా ఆ అమ్మాయికి వినపడేటట్టు కామెంట్ చెయ్యడం వినిపించింది. సాధారణంగా ఈ విషయం చికాకుని కలిగించినా, ఆ అమ్మాయి నాకు తెలిసినదవ్వటం వల్ల కొంత కోపంకూడా వచ్చింది. అయితే మా జూనియర్ అన్నది "ఒహో! కత్తి లాంటి డ్రస్" అని మాత్రమే. అప్పుడే నాకొక ఆలోచనొచ్చింది. వెంఠనే ఆ అమ్మాయిని అక్కడే ఆగమని చెప్పి, మా జూనియర్ని పట్టుకెళ్ళి తనకి introduce చేసాను. పరిచయం చేస్తూ, "he was appreciating your dress today" అని ఆ అమ్మాయితో అన్నాను. దానికి ఆ అమ్మాయి వీడ్ని చూసి ఆనందంగా, "thank you" అంది. ఆ తరువాత వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు లెండి! అది వేరే విషయం.
కానీ ఈ సంఘటన జరిగిన తరువాత ‘ఈవ్ టీజింగ్’ గురించి కొంత ఆలోచించటం జరిగింది. ఈ వికృత సంస్కృతి, డ్రస్సు గురించి కామెంటడంతో మొదలై, అమ్మాయిల శరీరాంగాల వర్ణన నుంచీ, అసభ్య పదజాలంతో ‘పిలవడం’తో పాటూ, అభ్యంతరకరంగా తాకడం వరకూ ఎన్నో రూపాల్లో ఉంటోంది. మహిళల్ని గౌరవిస్తామని చెప్పుకునే మన భారతదేశంలో 1993వ సంవత్సరంలోనే దాదాపు 84,000 కేసులు రిజిస్టెర్ అయ్యాయి. ఇక రిజిస్టర్ కానివి లక్షల్లో ఉంటాయని అస్సలు సందేహం లేదు. ఇక మరో ఆసక్తికరమైన కోణం ఏమిట్రా అంటే, ఈ కేసుల్లో అరెస్టు చెయ్యబడిన కుర్రాళ్ళలో 32% కాలేజీలకు వెళ్ళే గౌరవప్రదమైన కుటుంబాల నుంచీ వచ్చిన వాళ్ళు. ఈ విపరీతాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం 1998లో ఒక ఆర్డినెన్స్ ఈ విషయంగా పాస్ చేసింది. దీని ప్రకారం ఇలాంటి నేరాలకి పాల్పడినవాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్షతో పాటూ 10,000 జరిమానా విధించడం జరుగుతుంది. ఇలాంటి చట్టాలు తమిళనాడుతో పాటూ దాదాపు దేశమంతా చేయబడ్డాయి. అయినా ఈ చట్టాలు నిజంగా ఉపయోగపడుతున్నాయా? అన్నది ప్రశ్నార్థకమే.
ఈ విషయం మీద జరిగిన కొన్ని పరిశోధనల్ని తీసుకుంటే, మన సమాజంలోని అణగద్రొక్కబడిన లైంగిక విధానం (suppressed sexual life style) నుండీ, సినిమాలు, అమ్మాయిల ఆహార్యం (dressing pattern) , మగాళ్ళలో తమ మగతనం పట్ల ఉన్న అపోహలూ లాంటి చాలా కారణాల్ని గుర్తించారే తప్ప, వాటిని మార్చడానికి చెయ్యాల్సిన ప్రయత్నాల పట్ల దృష్టి నిలిపినట్లుగా అనిపించదు. చట్టాన్ని చెయ్యటం అనే ఒక చిన్న భాగాన్ని మాత్రమే చెయ్యగలిగిన ప్రభుత్వం, మిగతా కారణాలలో కనీసం నామ మాత్రంగానైనా మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడటం లేదు. ఇది చాలా సంక్లిష్టమైన సమస్య, దీన్ని సమూలంగా మార్చాలంటే, మన సమాజ నిర్మాణాన్ని fundamental గా alter చెయ్యాలి అనిపిస్తుంది. అంటే, ఇప్పట్లో ఆడవారికి ముక్తి లేదన్నమాట! కానీ, కనీస ఇందుకోసం ప్రయత్నం కూడా చేస్తున్నట్టు ఇటు సమాజం, అటు ప్రభుత్వం కనపడకపోవడం మరింత ప్రమాదకరంగా కనబడుతోంది.
సెక్స్ ఎడ్యుకేషన్ అంటే, అదేదో పాపంలా చూసే సమాజం-రాజకీయాలూ ఉన్నంత వరకూ అపోహలు దూరం కావు. అమ్మాయిలూ అబ్బాయిలూ టీనేజి -కాలేజి వయసుల్లో గౌరవప్రదమైన సంబంధాలు నెరిపే అవకాశం ఇవ్వనంత కాలం, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వీరికి రాదు. లైంగిక సంబంధాలకి, నైతికం ముసుగులు తొడిగి రహస్య వ్యభిచారానికి ప్రోత్సాహం ఇచ్చినంత కాలం, అణగద్రొక్కబడిన లైంగిక జీవితాలు బాగుపడవు. ఇక సినిమాలంటారా, హీరో "పచ్చి పచ్చిగా" హీరోయిన్ని ప్రేమిస్తేగానీ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టర, మనకు హిట్ సినిమా రాదు. ఇక ఉన్న చట్టాన్ని సక్రమంగా ఉపయోగించి శిక్షలు పడేటట్లు చెయ్యనంతకాలం ఈ విఛ్చలవిడితనం ఎలాగూ కొనసాగుతుంది.
అంటే ఈ విషయాన్ని గురించి చర్చించడం, వీలైతే కొంత బాధపడటం, లేదా చూసీచూడనట్టు నటించడం, మన ఇంట్లోని ఆడవాళ్ళకి ఇలా కాకూడదని ప్రార్థించడం మినహా మనం చెయ్యగలిగింది ఏమీ లేదన్నమాట!
Saturday, July 5, 2008
మగాళ్ళు ‘ఈవ్ టీజింగ్’ ఎందుకు చేస్తారూ?
(ఇప్పుడే గ్రహించాను ! ఇది నా 50 వ టపా....అంటే అర్థ శతకం దాటానన్నమాట )
-----------------------------------
Subscribe to:
Post Comments (Atom)
30 comments:
Great ee statistics kosam meeru chese background work abinandincha taginadi andi and your observation on surroundings also.Mimmalni gurinchi cheppa galige antha pedda vadini kaaka poina edo ala anipinchindi cheppalani ante.thanks
మహేష్,
మీరన్నట్టు సమాజాన్ని మొత్తం కూకటి వేళ్లతో fundamental గా alter చేస్తే గానీ ఈ సమస్య పూర్తిగా పోదంటే..దీనికి విముక్తి లేనట్టే! నిన్ను అసభ్యంగా కామెంట్ చేసిన వాడి గూబ పగల గొట్టు అని చెప్పే పరిస్థితి పోవాలంటే పైన చెప్పిన altered సమాజం రావాలి. అది ఇప్పట్లో కుదిరే పనా?
అయినా సిటీల్లో ఇప్పుడు కాలేజీ పిల్లలు మన రోజులనాటి కాలేజీ పిల్లల్లా ఉన్నారా ఏంటి? 'ఏరా, ఒసే ' అని పిల్చుకుంటూ స్నేహితుల్లాగానే ఉంటున్నారు(హాపీడేస్ లాంటి సినిమాల వల్ల కూడా ప్రభావితులై). ఎటొచ్చీ టౌన్లలోనే ఈవ్ టీజింగ్ పరిస్థితి కొంచెం మారాలి.
మీరు ఫొటోలు ఎక్కడినుంచి తెస్తారో గానీ బలేగా ఉంటాయండి బాబూ!
@సుజాత, మీరు మెట్రో సిటీల గురించి అపోహలో ఉన్నారండి ! చాలా conservative అనుకోబడే చెన్నై లో ఒక సంవత్సరానికి సగటుగా 3,000 ఈవ్ టీజింగ్ కేసుకు రిజిష్టర్ అవుతున్నాయి.చాలా ఎక్కువగా ఢిల్లీ మహానగరం లో ఉన్నాయి, తక్కువ ముంబై. మన హైదరాబాద్ కాస్త అటూ ఇటుగా ఉంది అంతే!
కారణాలడిగితే మగాళ్ళు "just for fun","women enjoy the attention and we enjoy watching their reactions" అంటే, ఆడవాళ్ళు తోటి ఆడవాళ్ళ గురించి "The woman must have asked for it" or "she is dressed to invite trouble" అన్నారట. నిజంగా, వింటుంటే సిగ్గనిపిస్తుంది.
ఫోటోలు కాస్త తీవ్రంగా శోధించి అంతర్జాలంలోనే పట్టుకుంటానండీ!
@క్రాంతి, నెనర్లు. ఎవరెంతవారని కాకుండా, టపా గురించి నిర్మోహమాటంగా అభిప్రాయాల్ని పంచుకోగలరు.
As usual, the photo and topic go hand in hand!! Good Job!
ఇక ఇది చాలా సున్నితమైన విషయం. సామూహికంగా మార్పు రావాలి అంటే కుదిరే పరిస్థితి కాదు. Moral education వల్ల తప్ప దీని పరిష్కారం నాకింకోటి తోచడం లేదు. ఇక అమ్మాయిలూ వీటంన్నిటికీ ప్రార్ధనలతో పాటు శారీరకం గా మానసికంగా సిద్ధమయ్యి ఉండాలి. ఎవడో ఏమో అన్నాడని మన విధి విధానం మార్చుకోవటం సమంజసం కాదు. నేటి స్త్రీలు అన్నింటినీ ఎదురుకోవాలి ఇంటా బయటా, if they are serious abt themselves!!
మహేష్ ఫోటో లు మీ టాపిక్ కి అనుగుణం గా భలే ఓపికగా వెతికి పట్టుకుంటారండీ... Also i appreciate your research for stats, believing that they are real :-)
ఇక టపా విషయానికి వస్తే మీరు చెప్పిన ఉదాహరణలోనే మీరు మంచి solution ని కూడా చూపించారు. అమ్మాయి అబ్బాయి ల మధ్య లైంగిక అవసరాలే కాక మాములు స్నేహం కూడా ఉంటుంది అనే స్పృహని యువత లో పెంచాలి. మొత్తం యువత దృక్పధం లో మార్పు తేవాలి. దానికి మొదట పేరెంట్స్ పిల్లల మధ్య communication పెరగాలి ఇది ప్రస్తుత తరం లో చాలా వరకు మారుతుంది అనుకుంటున్నాను. ఇంకా powerful media చెతులలో ఉన్న వ్యక్తులు కృషి చేయాలి. శేఖర్ కమ్ముల లాంటి వాళ్ళే కాలేజీ లో చేరేది జంటని వెతుక్కోడానికే అన్నట్లు సినిమాలు తీస్తుంటే ఇంక మాములు వాళ్ళ పరిస్తితి ఏంటి చెప్పండి. అలానే చట్టాలు చేసేసి ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా వాటి అమలు లో కూడా కఠినం గా వ్యవహరించ గలిగితే కనీసం కొంత వరకు అయినా తగ్గించ గలమేమో.
I have another possible solution. Family!
Mothers, instead of pampering their rAjA bETAs like demi-gods, would teach their sons to respect women/girls, it would solve lot of isues. We learn lot of values from the family members.
'మన సమాజంలోని అణగదొక్కబడిన లైంగిక విధానం ఈవ్ టీజింగ్ కి ఒక కారణం' అనటం సరి కాదేమో. అణగదొక్కబడని లైంగిక విధానం ఉన్న సమాజాల్లోనూ ఈవ్ టీజింగ్ అనేది విస్తృతంగా కనిపించే విషయమే. ఇది ప్రపంచ వ్యాప్తమైన సమస్య. చట్టాలతో పరిష్కారమయ్యేది కాదు. ఇది మనిషిలోని జంతు ప్రవృత్తికి నిదర్శనమేమో. బలం కలిగిన జంతువు బలహీనమైనదాన్ని ఆటపట్టించటం సహజం. మనుషుల్లో అది ఈవ్ టీజింగ్ రూపాన్ని సంతరించుకుందేమో. సినిమాల్లాంటివి ఆ ప్రవృత్తికి ఆజ్యం పోస్తున్నాయే కానీ అవే దీనికి మూలం కాదు. 'సమాజంలో సమూలమైన మార్పులు' లాంటి అసంభవమైన పద్ధతులు దీనికి పరిష్కారం కాదు. ఎక్కువ మంది కుర్రాళ్లది మంద మనస్తత్వం. వీళ్లు గుంపులో గోవిందయ్యల్లా అవకాశమొచ్చింది కదాని నలుగురు స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిని ఏడిపించే రకాలే. వీళ్లుగానీ ఒకసారి ఎదురుదెబ్బతిన్నారంటే మళ్లీ అటువంటి సాహసం చేయరు. ఎదురు తిరిగి నాలుగు మాటలనే అమ్మాయిలకి ఈవ్ టీజింగ్ సాధారణంగా పునరావృతం కాదు.
@"మన సమాజంలోని అణగదొక్కబడిన లైంగిక విధానం ఈవ్ టీజింగ్ కి ఒక కారణం అనటం సరికాదేమో!" అన్న మీ మాట కూడా ఒక సందేహమే. కానీ అది ఒక ప్రముఖ కారణమని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఆ article లోని కొన్ని భాగాలను ఇక్కడ రాస్తున్నాను.
"Most Indians know the answer to this question. India is still a country where majority of the marriages are arranged, and most youngsters don't date. Individuals, especially women, do not choose their own mates - they merely say aye or nay to the person chosen by their families....."
"a boy becomes sexually active at around 12-13 years of age and gets married after 25 years of age, over a dozen years of the height of his sexual life are spent in enforced singledom, without a romantic partner. In addition to this, bombard the guy with overt and covert sexuality in all kinds of media, and every guy out there is a walking bomb of repressed sexual energy. I am actually surprised that the situation is not much worse than it is now...."
"Eve-teasing is merely an urge to express and experience sexuality in a society which actively and passively suppresses it..."
"If there was a well-taught and well-understood code for pleasantly communicating their attraction and safely sharing their sexuality with uninhibited young women, guys wouldn't be indulging in unpleasant and unsafe expressions like eve teasing and harassment"
పైన చెప్పిన విషయాలు అంగీకారం కాదంటారా? ఇక సినిమాలు కొన్ని అపోహలకూ లేక ఇలాంటి అపోహల్ని reinforce చెయ్యడానికి పనికొస్తున్నాయి, అన్నది అందరూ అనుకునే నిజమే కదా!
మీరు చెప్పిన "నాలు తగిలించడం" చెయ్యాలంటే ఆ ఈవ్ టీజింగ్ కు గురైన అమాయి ఏంజరిగిందో చెప్పాలి. ఈవ్ టీజింగ్ జరిగితే "she might have asked for it" అనేవాళ్ళుంటే, ఆ అమ్మాయి ఈ ధైర్యం చెయ్యగలదా. ఇక పోలీసు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జరిగే humiliation సంగతి ఎవరైనా ఆ పని చేసిన అమ్మాయి మీకు తెలిస్తే అడగండి...
పరిశోధనలదేముంది. ఈరోజొకటి చెబితే, రేపు మరోటి చెబుతారు. Aspirin విషయంలో ఉన్న గందరగోళపు పరిశోధనల గురించి వినున్నారా? కాఫీ ఎక్కువగా తాగటం మంచిది కాదని ఆమధ్యదాకా పరిశోధకులు కుప్పలకొద్దీ వ్యాసాలు రాశారు. రెండు వారాల క్రితం రోజుకి ఆరు కప్పుల కాఫీ తాగితే కేన్సరు, గుండె జబ్బులు రావని ఒక వైద్య బృందం తమ ఇరవయ్యేళ్ల పరిశోధనలో తేల్చింది! కాబట్టి ఇటువంటి సర్వే రిపోర్టులని పట్టించుకోనవసరం లేదు. మీరుదహరించిన వ్యాసంలో భారతీయ కుర్రాళ్ల గురించి మాత్రమే ఉంది కానీ ఇది ప్రపంచవ్యాప్తమైన విషయమని మర్చిపోయినట్లున్నారు. నేను మరో మాట కూడ అన్నాను 'ఇది అణగదొక్కబడని లైంగిక విధానం ఉన్న దేశాల్లోనూ విరివిగా కంపించే విషయమే' అని. దాని గురించి మీ పరిశోధకులు ప్రస్తావించలేదెందుకో?
ఇక అమ్మాయిలు ఎదురుతిరగటం మాత్రమే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం అని నేననటం లేదు. అది నేను చెప్పిన 'మంద మనస్తత్వం' కల కుర్రాళ్లని చాలావరకూ హద్దులో పెడుతుందని మాత్రమే నా ఉద్దేశ్యం. మొత్తం ఈవ్ టీజింగ్ కేసుల్లో వీళ్ల సంఖ్య చాలా ఎక్కువ.
@పూర్ణిమ, సమాధానం moral education కాదేమో. దయచేసి నేను అబ్రకదబ్రగారికిచ్చిన సమాధానం చూడండి. `విలువల చదువు' పేరిట మనవాళ్ళు చేసేది "ఇది తప్పు, ఇది కరెక్ట్" అని చెప్పటం. అది సమాధానమయ్యుంటే,ఈవ్ టీజింగ్ చేసేవాళ్ళందరికీ అది తప్పు అని తెలుసు. మూలకారణం sexual frustration అయినప్పుడు దాన్ని sex education లేదా socially acceptable sexual behaviours ను ప్రోత్సహంచడం ద్వారా ఎదుర్కోవాలి. వాటికి తగ్గ సామాజిక నమూనా ప్రస్తుతానికి మన దగ్గర లేదు. అందుకనే ‘సమాజం సమూలంగా మారాలేమో’, అన్నాను.
కాకపోతే,ఆ eternal క్షణం కోసం ఎదురు చూడటం మూర్ఖత్వమే.మన పరిధిలో ఈ కుసంస్కృతిని ఎదుర్కోవాలి. అది ఎలా అనేది బహుశా ఈ చర్చ ముగిసేసరికి కొంత తెలుస్తుందేమో!
@వేణూ శ్రీకాంత్:నెనర్లు. నేను ఉదహరించిన అంకెలు కిరణ్ బేడీ నేతృత్వాన అప్పట్లో ఏర్పడిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్ (1993) నుండీ. ఈ మధ్య కాలంలో అంత విస్తృతమైన సర్వె ఏదీ జరిగినట్లు లేవు. ఉంటే recent అంకెలు ఇవ్వగలిగేవాడిని. కిరణ్ బేడీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే ప్రస్తుతం ఉన్న చట్టం (1998) చెయ్యబడింది.అదీ కొందరు అమ్మాయిలు ఈవ్ టీజింగ్ కారణంగా మరణిస్తేగానీ ఇది చట్టమవలేదు. మొదటగా ఈ చట్టం చేసిన తమిళనాడు అసెంబ్లీలో జరిగిన చర్చ ఎంత దయనీయంగా ఉందో చూడండి:
"some Opposition parties' suggestion to refer the Bill to the Assembly Select Committee for a detailed discussion, as the legislation could be misused against male students"
"``If necessary, we will come out with a legislation to protect men, too,'' he added. `So far we have not received any complaint regarding Adam-teasing. If several complaints are received, we could then think of introducing legislation to prohibit Adam-teasing"
"one of the reasons for the increase in the incidents of eve-teasing was that some women today had lost their basic qualities of ``fear and shyness''. Some women had even spoiled culture by wearing ``salwar-kameez, midi and frock'', instead of ``sari or half-sari''. The Government should advise women to follow local culture"
"Tamil film songs and scenes justifying eve-teasing had increased manifold recently, creating an impression in adolescent minds that eve-teasing was part of daily life and instigating males to commit violence against women"
ఇక మీరు సజెస్ట్ చేసిన సమాధానాలు అభిలషనీయాలు. అలా జరుగుతుందని కోరుకుందాం.
@sb murali 2007: family sure has an important role to play.కానీ ఆ చర్చకుతగ్గ వాతావరణం మన దగ్గర ఉందా అన్నదే సందేహం. తమ అమ్మలకు అక్కలకూ ఈ అనుభవం జరగకూడదనుకునే యువత, పక్కింటి అమ్మాయిని టీజ్ చెయ్యడానికి పూనుకుంటాడు. కాబట్టి, there must be some deeper reasons for this evil.
@అబ్రకదబ్ర, క్షమించాలి నేను ఉహరించిన రిపోర్ట్ భారతీయ యువత గురించి కాబట్టి అందులో లైంగిక స్వేచ్చ ఉన్న దేశాల గురించి వుస్తృతమైన సమాచారం లేదు. అది ఇక్కడ బహుశా అప్రస్తుతం కూడా, నేను ఇక్కడ చెబుతున్నది ఏ అమెరికానొ ఈ విషయంలో copy చెయ్యమని కాదు. Aping country like America may not yield results in India. We have to evolve our own social code for `safe expression of sexuality' in sexually active years before marriage.
మళ్ళీ ఆ రిపోర్ట్ చదివాను అందులో ఆ దేశాల గురించి ఇలా చెప్పడం జరిగింది: "In Western countries like the US, if a guy feels attracted to a girl, there is a very definite social code and language he follows to express his intentions. Both the guy and the girl have the independence to safely share and experience their attraction, without any disapproval or danger. In India, such a social code and independence was missing in the past, and is just beginning to emerge now"
నేను చెప్పిన విషయాల్ని accepted moral perspective లో కాకుండా, ఈ సమస్యకు solution పరంగా చూస్తే మనకు జవాబులు దొరకవచ్చు.
After reading all opinions I couldn't help but laughing at the ignorance of Mr Mahesh's argument. Actually we all should commend Mahesh for bringing up this issue.
Anyway..as to why I call his arguments ignorant is..."venkatikevado kondanalikki jabbante, unna nalika poye mandichhatta"..
He is proposing a solution of a wide-range pre-marital sexual relations in disguise of "`safe expression of sexuality' in sexually active years before marriage".
Needless to mention what kind of issues/troubles it would bring up in a society like us.
I regulary read Mahesh's articles. A vast majority of them are good and sensible. However I noticed this trend of proposing 'open societies with no rules/order or very lenient/liberal social polices" before too. I am not a conservative person by any means, but I also don't want the pendulum to swing too far in the opposite direction either.
Mr Abrakadabra-> I happen to agree with you almost all times so far. Your response to a non-sense article about "NASA/Moon-Landing Deceit" is very commendable. I can't believe how gullible some people are in this world. I couldn't believe that there could be people on this planet who don't believe that a Man had put his foot on the Moon. Also, I talked to some people who believe that Sept 11 is an inside job of US Govt.
Sorry Mahesh..if I was harsh..
@Independent, Thank you for calling my argument ignorant and at the same breath hailing my attempt to raise such a crucial issue on the blog.
I have actually sited 4 reasons for this deviant behaviour, namely 1)suppressed sexuality 2)Prevailing Myths about male hood among men 3)Films reinforcing such behaviour, and lastly 4)Men's believes on how a women should (properely /decently) dress. Only one reason is visible to many and suggestion related to it, simply because it challenges the status-quo that is very convenient to the male dominated mindset.
Its easy to pick on my suggestion (that was actually out of a report)to allow `safe expression of sexuality' by taking a moral stand. It surely will have huge following among men.
When I say 'safe expression of sexuality' you immediately draw a conclusion that, I am promoting free sex (I personally don't have any problems with it as well). Can't you think of more sane and sensitive form of sexuality.In sexually active age both sexes need companionship of opposite sex. Whats wrong if they spend some time together? The problem seem to be more with our Indian psych, if a man and women talk...ultimate aim is to end up in bed. What is sickening, our existing mindset or what I am proposing?
Please do ask women who are going through hell due to present situation 'what do they prefer !', a free society or sexual harassment resulting out of lack of that freedom?
By the way, what pendulum swinging too far are you talking about in the opposite direction? Can you suggest how far it should swing in this issue?
అబ్బాయిలు-అమ్మాయిలను కామెంటు చేస్తే ఇడియట్ అంటారు,చూసీ నోరు మూసుకునుంటే స్టుపిడ్ అంటారు,ఇదొక జోకు అయినా కాస్త నిజముందేమో అనిపించినా,
అబ్బాయిలు అమ్మాయిలను ఎందుకు ఏడిపిస్తారు అన్నదానికి,అసలు ఈ ఈవ్ టీజింగు తగ్గటానికి ఏమిచెయ్యాలి అన్నదానికి జలుబు/పడిశెం కి ఎన్ని చిట్కాలున్నాయో అన్ని ఉన్నాయి తరుణోపాయలు.కానీ మూలం మన ఇళ్ళల్లో,బళ్ళల్లో ఉందని కొందరు బాగానే చెప్పారు.ఈవ్ టీజింగును గూర్చి అధ్యయనం చెసేందుకు ఇప్పటివరకూ అకడమిక్ గా,పెడగాగికల్ గా,శాంతిభధ్రతల సమస్యగా,సంస్కృతికి సంభంధించిన అంశంగా,ప్యూర్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ తో ఇప్పటికి చాలా సర్వేలు జరిగాయి.ఈ సర్వేలు ఒక్కోప్రాంతంలో ఒక్కోరకమైన ఫలితాలు,జవాబులు రాబట్టటంతో జాతీయస్థాయిలో నివారణచర్యలు తీసుకునేందుకు విఘాతం ఏర్పడింది.కానీ ప్రభుత్వాలు విధించే ఆంక్షలవల్ల లాభించేది అతి స్వల్పమన్న సంగతి అందరికీ తెలిసిందే.అసలు ఈవ్ టీజింగ్ అనే సమస్య ఒకటుందని పండితులు చాలా మంది గుర్తించకపొవటం విచారకరం.ఆరోగ్యకరమైన చర్చ ఆచరణయోగ్యమైన ఫలితాలు ఇస్తుంది ఎప్పుడూ.
Hey Mahesh..It looks like we are heading for a pretty tight friction here :-). I can't cry wolf, because I was the one who started it..
Well.Let me try to take a stab..if I can.
1. Yes, you have cited multiple reasons, but you seem to have proposed only one solution(rather you agreed with that solution in the so-called report). Quite frankly, it was a vague solution, 'coz it doesn't spell out what is that safe vent-out of suppressed-sexuality.
Hence I assumed the pre-marital sex..There is a reason for that assumption..We all know what a 'slippery slope' is. It never ends with the first-step, it only begins there..
You said it will have huge following among men..I am sorry I couldn't get it.. If you think Men will like it, I am sorry I don't. I am a Man.
Now, what is the problem with pre-marital sex. Ask any too-liberal society(the one that you seem to like) and they will tell you how 'teen-pregnancy' is dis-integrating the social structure and threatening the very institution of marriage. Look at any western society, and you will notice that the institution of marriage is on decline and societies and older generations are not being replaced with responsible younger generations. I am pained by this fact. (You might propose protected-sex. However there are tons of other problems in those liberal societies with young kids..that will be a discussion for another day).
You tell me as to how far the pendulum should swing, I already told you how far shouldn't it go(in my opinion that is). You are the one who came up with 'safe expression of suppressed sexuality'.
PLEASE READ THIS AGAIN.
"Please do ask women who are going through hell due to present situation 'what do they prefer !', a free society or sexual harassment resulting out of lack of that freedom?"
This is exactly why I get puzzled with you Mahesh..You write very genuine, sensible articles otherwise...and I don't know what happens to you and you come up with these kind of unbelievable(to say politely) arguments!!.
I can't believe that any girl/woman would pick a society with free-sex to alleviate problems of eve-teasing. I am still shaking my head!!!.
Anyway Mahesh..I guess we don't agree with each other. Let's agree to dis-agree respectfully...
By the way..I just noticed some of kids' pictures near gaddivamu etc.,. They are awesome and near to my heart. I grew up in a terrible remote village with not even a bus-facility. It reminded me all those child-hood days..Very Sweet..
@Independent,బహుశా నేను ఆంగ్లపదం (safe expression of sexuality) ఉపయోగించకుండా, "అమ్మాయిలూ అబ్బాయిలూ యుక్తవయస్సులో గౌరవప్రదమైన పరిచయాలు పెంచుకుంటే ఈ సమస్యలు తీరొచ్చు" అని అందంగా మన తెలుగు వారికి సొంతమైన లౌక్యంతో రాసుంటే ఇన్ని వృధా చర్చలు వచ్చేవి కావనుకుంటా.
PLEASE READ THE ABOVE CAREFULLY. BOTH ARE SAME.
మనకు SEX అనే పదం క్రోసు దూరంలో వినపడినా అబిష్టు...అబిష్టు అని చెవులు మూసుకుని, బహిరంగ ప్రదేశాలలో కోరికని అణుచుకోవడానికి పరాయి మహిళల్ని కామెంట్ చేస్తూ, వీలైతే తాకుతూ ఆనందించే గొప్ప సంస్కృతి కదా మనది!
విషయాన్ని సూటిగా చర్చించి మనలోని దయ్యాల్నీ,భూతాల్నీ ఎదురుగా చూపిస్తే, కాస్త పంటికింద రాయిలాగే ఉంటుంది.మసిపూసి మారేడుకాయ చేసి, అందంగా, ఎవరికీ నిజంవల్ల హాని కలగకుండా, మెత్తగా చెబితే బాగుంటుంది. కానీ ఏంచేద్ధాం,అది నా శైలి కాదు.
అయినా నా టపాలో నేను ఏ solution suggest చెయ్యలేదు. చర్చల్లో నా అభిప్రాయం చెప్పానంతే. కాస్త గమనించగలరు. I respect your decision to disagree agreeably.I believe in that very strongly.
Hmmm... interesting viewpoints!! I'm always clueless on this topic. :-( All I intended through moral education is that if people understand that the pleasure derived out of eve teasing is not near to anything that a wonderful companionship can give, it would be better. Well.. will it achieved by that? I don't know.
There is no one common way of getting rid of this. But I still strongly believe that women got to be prepared for all these, they can't wait until a solution is found. In that fight they are always alone, but still they got to fight!!
Agree or disagree with ur viewpoints I still feel this post has been thought provoking!!
భా.జ.ప వారి politically correct language "Adolescent Education Program me" లాగా మీరు మరొక phrase ని వాడండి! ఆమోదయోగ్యం అవుతుందేమో!
తెలుగు బ్లాగులో ఆంగ్ల భాషా ప్రావీణ్యతా పోటీలెందుకో!?! ఇంగ్లీషు రాని నాబోటి వారికవి అర్ధం కావు కదా. (మళ్లీ దీనిమీద ఎవరు మొదలెట్టారు, ఎందుకు కొనసాగించారు లాంటి వివరణలతో చర్చ వద్దు. ఎలాగూ మహేష్ ఈ అంశం మీద రేపో మాపో మరో వ్యాసం రాసేస్తాడుగా :-) )
ఈవ్ టీజింగ్ అనేది నిజంగానే అవాంఛనీయం. కాలేజీలలో, రోడ్ల మీద, బస్సులలో ఆడవారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో...
అవి అరికట్టాల్సిందే. కానీ ఇంత వరకూ జరిగిన ఆర్గ్యుమెంట్లలో వీటికి సొల్యూషన్ మాత్రం కనిపించలేదు.(మన దగ్గరన్నీ సొల్యూషన్ లేని సమస్యలేనేమో ?)
మీరు సైట్ చేసిన రిపోర్టు ప్రకారం "Safe expression of sexuality" ని నిర్వచించలేదు. మీరు కూడా!
నా ప్రకారం రోజులు చాలా మారాయి. మీరన్న ఆ ఫ్రీడం ఇప్పుడు చాలా సిటీల్లో కొంత వరకూ వచ్చిందనే నా అభిప్రాయం. నేను హైదరాబాదు, బెంగుళూరు లని ఎరుగుదును. ముంబై, ఢిల్లీలలో నా స్నేహితుల ద్వారా ఇంకొంత తెలుసు. మీరన్న ఆ ఫ్రీడం ఈ నగరాల్లో ఉందనే అనిపిస్తుంది (గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఆశ్చర్యంగా చూసే వరకూ వచ్చింది. ఇదింకో ఎక్స్ట్రీమేమో ?). మరి ఈ నగరాల్లో ఈవ్ టీజింగ్ తగ్గిందా అనడానికి నా దగ్గర స్టాట్స్ లేవు.
అదీ కాక మార్పు ఒక్క రోజులో రమ్మంటే రాదు. నగరాల్లో వచ్చిన మార్పు ఇంకా చిన్న వాటికి చేరాలంటే సమయం పట్టచ్చేమో ?
ఇక independent కి మీరన్న ఫ్రీడం pre-marital sex అనే ఎందుకు అనిపించిందంటే మీ ఇంతకుముందు టపాల వల్ల కావచ్చు. నాకూ అలానే అనిపించింది. :-) వీటి వల్ల ఇంకో రకమయిన సమస్యలు వస్తాయి (జూనో లాంటి సినిమాలు మీరు చూసే ఉంటారు).
* అన్నట్టు ఆడమ్ టీజింగూ జరుగుతుంది. కానీ చాలా చాలా తక్కువ :-)
@నెటిజన్, మంచి సూచన. నెనర్లు. క్షష్టమే అయినా,ఈ సారి రాసేటప్పుడు కొంత sanitized పదాలు రాయడానికి ప్రయత్నిస్తాను.
@అబ్రకదబ్ర:ఇంగ్లీషులో అడిగితే, సమాధానం ఆంగ్లంలోనే చెప్పడానికి ప్రయత్నించాను.కాకపోతే నేను రాసిన విషయం ఇకటైతే,చర్చంతా morality మీద సాగడం చిత్రంగా ఉంది.బహుశా ఆడవాళ్ళు ఈ చర్చలో పాల్గొనకపోవడంతో, అలా జరిగిందేమో!
@ప్రవీణ్: ఇది సొల్యూషన్ లేని సమస్య కాదు. కానీ దీనికి సమాధానం కాస్త విస్తృతమయినది.ఈ సమస్యకు సమాధానం దిశగా, మొత్తం సమాజం,ప్రభుత్వం,కుటుంబాలూ కలిసి చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయ్. నా తరువాత టపా దాని గురించి రాద్ధామని ఈ రార్ధాంతం అంతా చూసిన తరువాత అనుకుంటున్నా!
నేను టపాలో చెప్పింది "అమ్మాయిలూ అబ్బాయిలూ టీనేజి -కాలేజి వయసుల్లో గౌరవప్రదమైన సంబంధాలు నెరిపే అవకాశం ఇవ్వనంత కాలం, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వీరికి రాదు" అని. మరి ‘safe expression of sexuality’ గురించి moral ధృక్కోణంలో ఇంత చర్చజరగడానికి కారణం, నా మునుపటి టపాలతో పాటూ కొంత ఈ విషయంపై మన over obsession కూడా అయ్యుండొచ్చు.
ఇక సిటీల్లో ఈవ్ టీజింగ్ తగ్గిందని మీరు అనుకుంటున్నారు. తగ్గితే ఆనందమే. కాకపోతే ఆ మాట ఎవరైనా అమ్మాయి నోట వచ్చుంటే కాస్త credible గా ఉండేది అనిపిస్తుంది.నాకు లభించిన data ప్రకారం ఢిల్లీ ఈ విషయంలో ఇప్పటికీ నెంబర్ 1.
జూనో సినిమా నేను చూసాను. చాలా మంచి సినిమా. ఆ సినిమాలోని టీన్ ప్రెగ్నెన్సీ ప్రముఖపాత్రధారిణికి సమస్య కాదు కదా! తను కావాలని ప్రెగ్నెంట్ అయ్యింది.అదొక సమస్య అని ఎప్పుడూ అనుకోలేదు. She was very clear in her mind. ఈ సారి కాస్త మంచి ఉదాహణ వెదకండి.
Abrakadabra garu-> I was thinking of mentioning that I am only a reader of these blogs. It just slipped from my mind. I never responded to anyone before(except for Purnima's post). Hence, I never attempted to learn to write in telugu lipi. I still don't know where to go(I promise I will try..If anyone can help me in this regard, I would greatly appreciate it).
I didn't want to loose the thought until I learn how to blog in telugu. If that was a mistake, I am truely sorry. I didn't want to write telugu with english alphabets either, because it's difficult to read.
Now, meekemo naku teledu kani, naku English assalu radu anna sangati naa pi English batti meeku eepatiki ardham ayipoyi untundi:-). Ati bhyankaramaina Palletoollo putti, poortiga telugu medium lo chadivi, Engg. ki vellaka aa Inferiority Complexes tho almost 6/7 years suffer ayyi, ippudippude andulonchi bayataku ravadaniki prayatnistunna. Inka raledu, ika eppatiki ralenemo kooda.
Mee comment 'Angla bhasha praveenyalendukooo..' anna commentlo vyangyam nannu chala badha pettindi. Naa name 'independent' kottaga choosi, janalu ardham chesukuntranukunna....Nenu telugu blogging ki(aa mata koste, asalu any bloggingki ayina) nenu kotta ani.
Andulo vyangyam lekunda mamuluga chepite, badhesidi kademo..
Sarelendi..I guess I will stop blogging until I learn to blog in telugu.
Bye
ఇండిపెండెంట్,
మిమ్మల్ని నొప్పించాలని కాదు. ఊరికే జోకానంతే. కాకపోతే జోకు తుస్సుమంది. కావాలని వ్యంగ్యంగా మాట్లాడటం నా పద్ధతి కాదు. నా రాతలు నచ్చాయన్నారు కదా - పనిగట్టుకుని మిమ్మలెందుకు విమర్శిస్తాను? ఇంగ్లీషు స్క్రిప్ట్ లో తెలుగు రాయటంకన్నా మీలా నేరుగా ఇంగ్లీషులోనే రాయటమే మంచిది. తెలుగు నేర్చుకునేదాకా రాయనని ఒట్టేసి మీ అభిప్రాయాలు వెల్లడించటం ఆపొద్దు. దయచేసి ఒట్టు తీసి గట్టున పెట్టి వ్యాఖ్యలు రాయటం కొనసాగించండి :-) మళ్లీ చెబుతున్నాను, ఏమీ అనుకోవద్దు.
కత్తి గారు మీకు ఒక ఆర్టికిల్ మీద ఇంతలా Statisticcs ఎలా వస్తాయండీ.. ????]
@బూదరాజు అశ్విన్: నేను కాలేజిలో ఉండగా తరచూ,సాటి విధ్యార్థులతో పాటూ, టీచర్లలతో కూడా వాదొపవాదాలకు దిగేవాడిని. ఒకసారి మా ప్రొఫెసర్ ఒక మాటన్నాడు "you have far more opinion than information.I can only disagree with your opinion,but cannot argue based on that." అన్నాడు.
అప్పటినుండీ, ఏదైనా విషయంపై ఒక అభిప్రాయం ఎర్పరుచుకునేముందు, ‘అందుబాటులో ఉన్న కొన్ని నిజాల్ని’ తెలుసుకుని మరీ ఏర్పరుచుకుంటాను. ఆ నిజాల్ని తెలుసుకునే process లో statistics వాటంతట అవే తెలుస్తాయి.
ముందుగా అర్ధశతకం పూర్తి చేసుకున్నందుకు శుభాభినందనలు...
ఇక టపా విషయానికి వస్తే, చాలా మంది కామెంట్లు చేసేవాళ్ళలో ఏదో ఊసుపోక చేసే వాళ్ళే ఎక్కువమంది ఉంటారు.. ఒకసారి ఎవరైనా కాస్త గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడితే ఈ కామెంటింగ్ తగ్గుతుంది... కానీ కొంతమంది కామెంటింగ్ చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది.. అలాంటి వాళ్ళతో పెట్టుకోవడానికి ఎవరు ఇష్టపడరు.. ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడంతోనే ఆగిపోదు, ఆ తరువాత ఎన్నో ఎదుర్కోవాలి.. అందుకే బురద మీద రాయి వేయడం కంటే, అది లేని వైపు చూసి వెళ్ళడం బెటర్ అని అనుకుంటారు...
ఇక సిటీస్ విషయానికి వస్తే, ఈ మధ్య అమ్మాయిలు-అబ్బాయిల మధ్య స్నేహం బానే పెరిగింది.. కానీ ఈ చిరాకు పుట్టించే కామెంటింగ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా ఎక్కువవుతోంది.. అమ్మాయిలు ప్రక్కన ఉన్నప్పుడు ఎంతో మంచిగా ప్రవర్తించే అబ్బాయిలు వాళ్ళు అటు వెళ్ళగానే వాళ్ళ మీదే చెత్తగా కామెంట్ చేసే ప్రబుధ్ధులు చాలా మంది ఉన్నారు...
పైన మురళీ గారు చెప్పినట్లు కుటుంబ వాతావరణం కూడా డిపెండ్ అయి ఉంటుంది.. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించే వాళ్ళు బయట అలాంటి పనులు చేయరు.. ఇక మీరన్నట్లు జరిగిన కేసులు కూడా ఉన్నాయి, కానీ అలాంటి వాళ్ళకి ఆ కుటుంబ సభ్యుల మధ్య సంబంధం అంత బాగా ఉండి ఉండదు.. ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాం, తను మా అమ్మ, ఈమె నా అక్క/చెల్లి.. ఇలా అంతకంటే ఎక్కువ రిలేషన్ లేదు వాళ్ళ మధ్యలో.. ఇక వీళ్ళ మీద దాడి చేసినప్పుడు ఏదో నా ఇంట్లో వాళ్ళ మీద చేశారు అని తప్పించి మా అక్క/చెల్లి ని చేశారు అని ఏమీ ఫీలింగ్ ఉండదు..
ఫైనల్ గా నేను చెప్పొచ్చేదేంటంటే అధ్యక్షా!, దేనికైనా మార్పు కుటుంబంలో నుండే రాగలగాలి... అప్పుడే ఏదైనా సాధ్యపడుతుంది!
>>ఈ రార్ధాంతం అంతా చూసిన తరువాత అనుకుంటున్నా!
మీరు కాక ఇంకెవరు మాట్లాడినా రాద్దాంతమనా మీ ఉద్దేశం ? :)
చర్చకు ఆహ్వానించిన తర్వాత "రాద్దాంతం" తప్పదు.
>>నేను టపాలో చెప్పింది "అమ్మాయిలూ అబ్బాయిలూ టీనేజి -కాలేజి వయసుల్లో గౌరవప్రదమైన సంబంధాలు నెరిపే అవకాశం ఇవ్వనంత కాలం, పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వీరికి రాదు" అని. మరి ‘safe expression of sexuality’ గురించి moral ధృక్కోణంలో ఇంత చర్చజరగడానికి కారణం, నా మునుపటి టపాలతో పాటూ కొంత ఈ విషయంపై మన over obsession కూడా అయ్యుండొచ్చు.
అవకాశం ఇవ్వనిదెవ్వరు ? నేను పై వ్యాఖ్యలో చెప్పినట్టు సిటీలలో అది ఉందనే నేను అనుకుంటున్నాను. అయినా పరిస్థితిలోమార్పు లేదనే కదా...
>>ఇక సిటీల్లో ఈవ్ టీజింగ్ తగ్గిందని మీరు అనుకుంటున్నారు. తగ్గితే ఆనందమే. కాకపోతే ఆ మాట ఎవరైనా అమ్మాయి నోట వచ్చుంటే కాస్త credible గా ఉండేది అనిపిస్తుంది.నాకు లభించిన data ప్రకారం ఢిల్లీ ఈ విషయంలో ఇప్పటికీ నెంబర్ 1.
సిటీలలో ఈవ్ టీజింగ్ తగ్గిందనే స్టేట్‌మెంటు నేను చెయ్యలేదు. actually the point i wanted to make is the opposite. కానీ నా దగ్గర స్టాట్స్ లేవని నేను ఇదీ అని స్టేట్‌మెంట్ చెయ్యలేదు.
(మరి ఈ నగరాల్లో ఈవ్ టీజింగ్ తగ్గిందా అనడానికి నా దగ్గర స్టాట్స్ లేవు.)
మరి ఆ ఫ్రీడం ఉన్నా ఈవ్ టీజింగ్ తగ్గలేదు అని మీరే చెబుతున్నారు. కాబట్టి మీరు చెబుతున్నట్టు ఆ "freedom of expression", "free sex" మాత్రమే సరిపోవేమో.
>>జూనో సినిమా నేను చూసాను. చాలా మంచి సినిమా. ఆ సినిమాలోని టీన్ ప్రెగ్నెన్సీ ప్రముఖపాత్రధారిణికి సమస్య కాదు కదా! తను కావాలని ప్రెగ్నెంట్ అయ్యింది.అదొక సమస్య అని ఎప్పుడూ అనుకోలేదు. She was very clear in her mind. ఈ సారి కాస్త మంచి ఉదాహణ వెదకండి.
సార్ మీరు మీకు కావల్సినట్టు మార్చుకుని చూస్తానంటే నే ఏమీ చెయ్యలేను. one night fling, తర్వాత తను కావాలనుకోకపోయినా pregnant అవాల్సి రావడం. పుట్టబోయే బిడ్డని అడాప్షనా ? పెంచగలనా ? ఇన్ని కంఫ్యూజన్ల మధ్యే కదా సినిమా నడిచింది. ఇవన్నీ మీరు సూచిస్తున్న సొల్యూషన్లకి చెందిన కాంప్లెక్సిటీలు కావా ?
మీరు కావాలంటున్న ఫ్రీ సెక్స్, వగయిరాలకి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కావని మీరు ఎందుకనుకుంటున్నారోనాకర్థం కాలేదు. మీరు ఉదాహరణ సరిగా అర్థం చేసుకోవాలేమో ?
అసలు విషయంపైన కాక కొసరు విషయంపై చాలా చర్చ జరిగింది కాబట్టి‘రాద్ధాంతం’అని కాస్త ఎత్తిపొడుపుగా అన్నాను. అంతే తప్ప ఇక్కడ కామెంటిన వార్ని కించపరచడానికి కాదు. అలా చెయ్యాలని నాకుంటే,అసలు ప్రశ్నలకు ఓపిగ్గా సామాధానాలు ఇచ్చేవాడ్నేకాదు.
ఇక సిటీల్లో తగ్గలేదని మేధ గారి testimony తన కామెంట్లో ఉంది. చూడండి.
ఇక freedom to express sexuality ఒక్కటే సమాధానమని చెప్పడం లేదు. కానీ సమస్యకు మూలం అదే అయినప్పుడు, సమాధానం దానినుండీ వెతకడం ప్రారంభించాలని మాత్రమే నా కామెంటులో చెప్పాను. టపాలో నేను కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తనేగానీ, పరిష్కారాలు ఇవ్వలేదు.
అయినా, "ఆడామగా పరిచయాలు ఆరోగ్యకరమైన సంబంధాలు పెంచుకోవాలి" అనగానే SEX అని ఎందుకు ఆలోచిస్తారు? ఈవ్ టీజింగ్ లో భాగంగా అమ్మాయిల్ని కసిగా చూసో, ఇబ్బంది కరంగా ముట్టుకునో ఆనందపడే యువకులు, పరిచయాల తరువాత ఆ ‘కుతి’నుండీ బయటపడొచ్చని ఎందుకనుకోరు? అందుకే over obsession on sexual morals అన్నాను.
ఇక JUNO is a film about teen-pregnancy and how the principle character deals with it in an "unapologetic way". దీనిలో ఎక్కడా moral చర్చలేదు. కానీ ఇక్కడ టపాపై జరిగిన చర్చ దాని moral implications గురించి. ఇక మరో మాట sex education లో మూడోపాఠం contraception గురించి. కాబట్టి pregnancy గురించి అంతగా ఖంగారుపడఖ్ఖర లేదు.
కత్తి మహేష్ గారు కాస్త లేట్ గా చదివాను మీ టపా, అందుకు సారీ. ఇకపోతే మీ అర్ధశతక టపాకి శుభాబినందనలు. మొత్తం మీ టపా మరియూ కామెంట్లు చదివిన తరువాత నా చిన్ని బుర్ర కి అర్ధమయ్యింది ఏమిటంటే ఈ ఈవ్ టీజింగ్ కి కారణం అబ్బాయిలే, అమ్మాయిలందరూ ఝాన్సీ లక్ష్మి లాగో, లేడీ అమితాబచ్చన్ లాగో పొరాడాలి అని, ఇక్కడ ఒక్కవిషయం! బుద్దిగా తలంతా నున్నగా దువ్వుకొని, చేతిలో రెండు పుస్తకాలతో, అడుగుపెట్టే నూనుగు మీసాల కుర్రాడిని (నున్నంగా షేవింగేనా కాస్తయినా రఫ్ గా ఉండాలంటూ) ఏడిపించే అమ్మాయిల సంగతి?? ఈరోజుల్లో, ఈ ఏడిపించడం అనే విషయానికి వస్తే, అబ్బాయిలు, అమ్మాయిలు అన్న తేడా ఎక్కడుందండీ? తప్పుగా అనుకోకండీ, కాలేజ్ రోజుల్లో నా స్నేహితురాలి విషయంలో జరిగిన ఓ సంఘటన చెప్తాను, నా స్నేహితురాలు చాలా అందంగా ఉంటుంది. మేమిద్దరము స్కూల్ నుండి ఫ్రండ్స్ మి. మా యింటికి వస్తే, మా కబుర్లకి రోజులు గడిచిపోతాయి, ఇంటికి ఏ రెండురోజుల తరువాతో వెళ్ళేది. ఈ కబుర్లలో, ఆ అమ్మాయి లో ఒకే ఒక నిరాశ, మా యింటి దగ్గర అబ్బాయిలు ఓరోజు చూడడం లేదనో, ఇంకో రోజు చూస్తున్నారనో రెండు విధాలా బాధపడిపోయేది, ఈ క్రమంలో అప్పుడే కాలేజ్ లో నిలదొక్కుకొంటున్న ఓ అబ్బాయిని "నేను ప్రేమిస్తున్నా" అంటూ ఆశ పెట్టింది ఇలా అనే కన్నా ఆట పట్టించింది కరెక్టేమో . చివరికి అది ఆకర్షణగా తేలి ఇంకో రెండు మూడు ప్రేమాయాణల తరువాత పెద్దలు కుదిర్చిన అబ్బాయితో పెళ్ళి చేసుకొంది. ఇక్కడ ఏమి తెలియకుండా ప్రేమలో పడ్డ ఈ మొదటి అబ్బాయి ఇప్పుడు ఎర్రగడ్డ పిచ్చసుపత్రి లో ఆమె పేరు తలుచుకొంటూ కాలం గడుపుతున్నాడు, మరి దీనినేమంటారు? సరదాగా ఆటపట్టించిన ఆ అమ్మాయి తను హ్యాపీ గా ఉంది. సమస్య ఇద్దరివైపు వుందండి. అమ్మాయిలు తెలియకుండా జీవితాంతం ఏడిపిస్తారు, అబ్బాయిలు ఆ కాసేపు సరదా అంటూ ఏడిపిస్తారు. నేను ఏ ఒక్కరి పక్షం కాదు సమస్య ఇద్దరివైపు ఉందీ! అని చెప్పడమే ఈ ప్రయత్నం.
జ్యోతిగారి బ్లాగులో కూడా ఇప్పుడే చదివాను, అక్కడ ఇదే రిప్లై.
@రమణి:నెనర్లు.
సరదాగా అమ్మాయీ అబ్బాయీ ఇద్దరూ ఎంజాయ్ చేసే ఏడిపించడానికీ,మాససిక క్షోభకు గురిచేసే ఈవ్ టీజింగ్ కీ చాలా తేడా ఉంది. నా కొత్త టపా చూడండి.
ఇక మీరు చెప్పిన స్నేహితురాలి ఉదాహరణ విషయం కొంచెం వేరు. దాని గురింఛి ప్రత్యేకంగా చర్చిద్దాం.
Post a Comment