Monday, July 14, 2008

ఈవ్ టీజింగ్ & కట్నం గురించి కొన్ని నిజాలు

ఈవ్ టీజింగ్ గురించి జరిగిన చర్చలో కొందరు మెట్రో సిటీలలో ఈ సంస్కృతి తగ్గినట్లుగా చెప్పడం జరిగింది. వారికోసం ఇక్కడ నాలుగు ప్రముఖ మెట్రో సిటీలలోని గణాంకాలను ఇస్తున్నాను.


కేవలం మార్చి, 2003 (ఒక్క నెలలో) లో ఈవ్ టీజింగ్ కేసులు

ముంబై : 27
కొలకత్తా : 30
ఢిల్లీ : 744
చెన్నై : 143

మన దేశ రాజధానికి ఈవ్ టీజింగ్ లోనూ రాజధానే!


ఆంధ్రప్రదేశ్ లో కేవలం 6 నెలల్లో (జనవరి 2002 - జూన్ 2002) రిజిస్టెరైన ఈవ్ టీజింగ్ కేసులు 1,807
మధ్యప్రదేశ్ 2,906 తో మొదటి స్థానంలో ఉండగా, మనది సగౌరవమై రెండవస్థానం.కట్నం గురించి జరిగిన చర్చలో, "కట్నం కోసం పీడించకుంటే చాలు" అన్నారు.

మన ఆంధ్రప్రదేశ్ లో 2001 వ సంవత్సరంలో కట్నం కారణంగా మరణించిన ఆడపడుచుల సంఖ్య అక్షరాలా 535. అంటే కనీసం రోజుకి ఒక మహిళైనా కట్నానికి బలై ప్రాణం కోల్పోతోందన్నమాట.ఇక మహిళల్ని గౌరవించి పూజించే మన మహత్తర దేశంలో, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల 2000 సంవత్సరం లెక్కలు కాస్త చూడండి;

1. రేప్ : 16,496
2.కట్నం మరణాలు : 6995
3. గృహ హింస : 45,778
4. ఈవ్ టీజింగ్ : 32,940
5. సెక్సువల్ హెరాస్ మెంట్ : 11,024

మార్పు మనదేశంలో త్వరగా రాదు కాబట్టి, ఆ మార్పొచ్చే రోజుకోసం ఎదురుచూద్దామా? లేక మార్పు తీసుకురావడానికి ఇప్పుడే మనకు చేతనైన ప్రయత్నాన్ని చేద్దామా? Nobody have to wait for change to happen. If you believe in change THIS IS THE TIME TO CHANGE.(పైన తెలిపిన సంఖ్యలు Center for Social Research అనే సంస్థవారి Eliminating the violence against women : some facts అనే డాక్యుమెంట్ లోనుండీ తీసుకోబడినవి)


------------------

9 comments:

meenakshi.a said...

మీరన్నట్టు మార్పు త్వరగా రావాలి అని నేను కోరుకుంటున్నాను.....కాని ఆ మార్పు ఎలా వస్తుంది..దానికి ఏం చేయాలి..?..ఆ మార్పు సాధ్యమేనా..?

teresa said...

Good job,publishing the data. Makes your post more objective..

Dr. Ram$ said...

మీతో ఏకీభవిస్తున్నను.. కాని మీరు 2008 లో రాసిన టపా కి వచ్హిన వ్యాఖ్య ల కి 2001 సర్వే ల లెక్కలు చూపించి ఏమి నిరూపించాలి అనుకుంటునారో అర్ధం కావడము లేదు.. ఒక్కసారి అలోచించండి..మనం ఇంకా 2001 లో నే వున్నామా?? అప్పుడు ఎంత మంది అమ్మాయిలు వుద్యోగాలు చేసే వాళ్ళు.. ఇప్పుడు ఎంత మంది అమ్మయిలు ఉద్యోగాలు చేస్తున్నారు?? పోల్చి చూసుకుంటే మీరు చెపుతున్న లెక్కలు సమానం గా ఉంటాయా?? నేను చెప్పేది ఏమిటి అంటే, అమ్మాయిలు బయటకు తక్కువ గ వస్తున్న రోజుల్లో నే అన్నేసి మానభంగాలు, గొడవలు జరిగితే.. ఇప్పుడు అమ్మయిలు అబ్బయిల తో సమానం గా బయట తిరుగుతున్న రోజుల్లో ఇంకెన్ని మానభంగాలు, హత్యలు జరగాలి అంటారు?
సమస్య ని ఒకవైపు నుండే ఎందుకు చూస్తారు? రెండొ వైపు గురించి ఎందుకు అలోచించరు?? కట్నము కోసం పీడించడము గురించి నేను మిమ్మలని ఒక ప్రష్న అడగదలుచుకున్నను?? పెద్దలు అమ్మాయి కి అబ్బాయి కి ఆస్తి ని సమానంగా ఎందుకు పంచరు? అమ్మాయి కి కట్నం అనే పేరు తగిలించి నాలుగు ముక్కలు పడేసి, అబ్బాయి కే ఆస్తి ని ఎందుకు వుంచుకుంటారు?? కన్న తల్లిదండ్రులే అమ్మాయి అబ్బాయి అని వేరు గా చూస్తుంటే? మిమ్మలని ఒక పర్సనల్ ప్రశ్న అడుగుతున్నందుకు క్షమించండి. మీరు మీ తోబుట్టువుల తో సమానం గా ఆస్తి పంచుకున్నారా?? మీ అలోచనలు అవి చూస్తుంటే మీరు పంచుకునే వుండొచ్హు అనుకుంటున్నాను..అందుకు ముందుగానే కౄతఙతలు కూడా తెలుపుతున్నాను మహేష్ గారు.. అసల అమ్మాయి అబ్బాయి సమనమే అని ఆడ పిల్లని ఇచ్హే వాల్లే ముందే చెపితే ఇంక కట్నము అనే విషయము ఎందుకు వస్తది??

తరువాత అమ్మయిలని హరాస్ చేయడము గురించి..సమాజం లో వున్న చిన్న చిన్న లోపాల ని యిలా బూతద్దం లో తవ్వి తవ్వి చూపించి, ఒక విలనిజం, వర్గ శత్రుత్వం చూపించే బదులు, చాలా పాజిటివ్ లు కూడా వుంటాయి కదా, వాటిని ఎందుకు పాఠకుల కి తెలియజేయరు? మీ లెక్కల ప్రకారం ప్రతి ఇద్దరు ఆడ వారి లో ఒకరు బాధింప బడుతున్నారు అని..అది నిజమే ఐతే ఇప్పుడు మనం చూస్తున్న మహిళా బ్లాగర్ల లో సగం మంది బాధింపబడుతున్నట్లే? యిది నిజమే అంటారా??మీరు చదువుకున్న కాలేజి లో 100 మంది అమ్మయిలు వుంటే అందుళొ 50 మంది అమ్మయిలు హరాస్ చేయబడ్డారు అనేనా మీ ఉద్దేశ్యము! ఎప్పుడైనా అలోచించారా?? ప్రతి సర్వే కి వున్న నిబద్దత ఎంత? కలకత్తా లో వున్న మురికి వాడల జీవన విధానం, మన రాష్ట్రం లో వున్న మద్య తరగతి జీవన విధానం ఒక్కటే కాదు కదా.. 100 కోట్ల జనభ లో 16000 రేప్ లు జరిగాయి అని రాశారు.. 16000 మంది రాక్షషులు వున్నారు అని, మొత్తం సమాజాన్నె దుమ్మెత్తి పోద్దాం అనుకుంటే మరి మిగిలిన 50 కోట్ల మంది మంచి మగవారు ఏమయి పోవాలి?? నిజంగా సమాజం మీరు బాధ పడి పోతున్నంతగా బ్రష్టు పట్టిందంటారా??

మోహన said...

@Dr. Ram$

It will be nice to if you can give some points supporting your argument of positive angle in this regard.

మోహన said...

@Mahesh

Do you have any suggestions about how we can bring out the change ?

కత్తి మహేష్ కుమార్ said...

@Dr.రామ్; 2003 తరువాత credible data source ఒకేచోట లేకపోవడంతో నేను గణాంకాల్ని ఇవ్వలేదు. కానీ మీ ఉద్దేశం liberalization తరువాత మహిళలపై హింస తగ్గుండాలి అనే అయితే ఈ క్రింది పేరాని చదవండి.
"Unfortunately in India, more national economic prosperity has led to a corresponding upward spiral of crimes against women. The National Crime Records Bureau (NCRB) reports that from an average of 125 women who faced domestic violence everyday in India in 2000, the number has ratcheted up to 160 in 2005. Also, more than 19 Indian women are killed for dowry everyday, 50 are raped and 480 subjected to molestation and abduction. The Bureau stated that 45 per cent of Indian women are slapped, kicked or beaten by their spouses with India also having the highest rate of violence against women during their pregnancies – nearly 50 per cent women were kicked while expecting babies with nearly 74.8 per cent attempting to commit suicide."

పరిస్థితి 2001 కన్నా ఘోరంగానే తయారయ్యిందని చెప్పొచ్చు.

తల్లిదండ్రులు అబ్బాయీ అమ్మాయీ అని తేడా చూపడానికి నేను బద్ధవ్యతిరేకిని. అటువంటి తల్లిదండ్రులని నిరసిస్తాను. నా తల్లిదండ్రులు అలా చేస్తే వెలివేస్తాను.అందులో ఏమాత్రం సందేహం లేదు.ఇక ఆస్థి విషయం అంటారా, ఇటు తల్లిదండ్రులూ, అటు అత్తమామలనుంచీ ఏమీ ఆశించకుండా గౌరవప్రదంగా బతికే చదువూ, సంస్కారం నాకు అలవడ్డాయి.నేను అలాగే జీవించడానికి ఇష్టపడతాను.

"చిన్నచిన్నలోపాలు" అని మీరు ఇంత తేలిగ్గా అన్న విషయాల తీవ్రత మీకు తెలియక అన్నారో లేక అహంకారంతో అన్నారో అర్థం కాకుంది!నేను భూతద్దంపెట్టి చూపట్లేదు మీలాంటి చాలామంది సమస్య తీవ్రతని గుర్తించక గౌరవప్రదమైన భారతీయ సంస్కృతి ముసుగులో తలదాచుకుంటున్నట్లున్నారు అంతే.

రేప్ జరిగినా "అది ఆడదాని తప్పే" అన్నట్లు చూసే మన సమాజంలో చెప్పుకోలేకపోయినంత మాత్రానా ఆడవారు ఈ బాధలు పడటం లేదని మీరు నిర్ధారణకు రావడం సోచనీయం. ఒక్కసారి కళ్ళు తెరిచి మీ చుట్టుపక్కల చూడండి. మనసుంటే ఆ బాధల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

ఒక రేప్ జరిగిందని బాధపడదామా? లేక 100 జరగలేదని సంతోషిద్ధామా?...మీరు అడిగిన వాటిల్లో తర్కముందిగానీ మానవత్వం లోపించినట్టనిపిస్తోంది.

@మోహన & మీనాక్షి : ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అని చాలా సంస్థలూ, వ్యక్తులూ తమ జీవితాల్నీ, వనరుల్నీ వెచ్చిస్తున్నారు.వీరి అభిప్రాయంలో core issues ఇవి; RESPECT, RESPONSIBILITY & EQUALITY. మహిళల పట్ల గౌరవం, తప్పుజరిగితే దానికి బాధ్యత తీసుకునే సమాజం, ఆడామగ మధ్య సమానత, ఈ మూడూ వచ్చేవరకూ ఈ హింస కొనసాగుతుందని అభిప్రాయపడడం జరిగింది.

@తెరెసా; నెనర్లు

కత్తి మహేష్ కుమార్ said...

@మోహన & మీనాక్షి; ఒక దగ్గర మంచి వ్యాసం దొరికితే మీకోసం ఇక్కడ పెస్ట్ చెస్తున్నాను.
Root causes

1.Social conditioning:

The social conditioning of how men should behave and how women should behave made the society to mould men and women in a different manner. While men can behave improperly with women while in a group, we rarely see the women behave in the same manner. Has any one heard about a group of women abusing a single man? Very rarely such a thing happens and if it happens, the news coverage about such women will be heinous. A similar behavior by men at multiple places will not get such coverage. That means society subconsciously expects only men to abuse women. If girls are also brought up without inducing fear in them and they too grow up with the same naughty behavior as men exhibit, there will be many men who will surely fear and run away when they look at women. In such a society where gender difference is minimised, the cases of abuse and violence will be reported just the way some other crimes are reported rather than showcasing as crime against women.

While the above applies to all the countries in the world, India has institutionalized the behavior of women in such a manner that it is acting detrimental to women’s interests due to the back seat taken by women. Families bring up girl child in the most protected environments and the girls never will be able to develop the courage required to face the abusers. The same families will not monitor the boys and allow them to move freely along with their peers at any age. The boys thus develop not only the courage to face the society, but many of them even become naughty with respect to behavior with women. These boys rarely think that it is a mistake or crime to do so. They just believe that it is manly to behave in such a manner due to the influence passed on from the peers and of course seniors. Such conditioning has been passed on and on between generations.

2.Biological reasons:

Company of girl is important for a boy and vice versa as well. It is not just for marriage. Such a company is required in every age during the growth of the children as adults. If a man is brought up in such circumstances and has been between women throughout the life during school and college and finally at work, he will not look at women with awe. Many of the women abusers come from backgrounds where they have less interaction with women. In spite of the fact that they study in co-education schools and colleges, if the schools/colleges have social conditioning in such a manner that boys sit separately and girls sit separately, the actual mix up and understanding of the opposite sex does not happen and the people from both the sexes look at the actions of the ones in opposite sex with awe. That creates intense desire to know about the persons in the opposite sex. This desire will some day blow up into a wrong doing due to the biological need of the individual. Also due to the risk of unwanted pregnancy for women and with no such fear for a man, the woman becomes more vulnerable.

3.Physical strength:

It is a proven fact that a man is physically powerful than a woman. This is the basic reason why the abuser is the man most of the times and not the woman. Things might have been probably different if a woman was more powerful physically. The society would have achieved gender equality long back had the nature created the woman powerful than a man. It is always safe to have the one who should bear the pregnancy more powerful. There is nothing for a man to fear even if he is weak as he does not have the fear of pregnancy.

4.Peer influence:

Peer influence will make women fear the men and the same peer influence will give courage and sense of satisfaction in men to chase women and abuse them.

Solution

Long term solution:

1.Proper education curriculum should be created to ensure peer influence is made even in both the sexes.
2.Ensure that the boys and girls mix with each other from very young age so that people take the opposite sex casually than with awe
3.Kill all the social stereo types
4.Men get all their confidence initially due to group behavior and during that phase observe that the woman fears and runs. The confidence will later allow the men to take on the women all alone as well. The solution will be ideal to curb such thoughts in men, but it is not practical. Hence the most practical solution is to mould women also in such a manner that when in groups men also fear them and run. That will slowly bring the equality of sexes.

Short term solution:

1.Create strict laws to counter the menace
2.Equip women with self defense techniques
3.Promote literacy in women
4.Respect single women as well and do not create social pressure on their marriage
5.Make the women aware of their rights created through law and make the social organisations accessible

Dr. Ram$ said...

("చిన్నచిన్నలోపాలు" అని మీరు ఇంత తేలిగ్గా అన్న విషయాల తీవ్రత మీకు తెలియక అన్నారో లేక అహంకారంతో అన్నారో అర్థం కాకుంది!నేను భూతద్దంపెట్టి చూపట్లేదు మీలాంటి చాలామంది సమస్య తీవ్రతని గుర్తించక గౌరవప్రదమైన భారతీయ సంస్కృతి ముసుగులో తలదాచుకుంటున్నట్లున్నారు అంతే.)

నేను రేప్ లు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అని ఎక్కడ అనలేదు.. రాక్షషులు అనే అన్నాను..మీరు అనుకుంటున్న భారతీయ సంస్క్రుతి ఏమిటొ, దాని కింద మేము యే రకం గా తలదాచుకుంటున్నామో తెలుసుకోవాలి అనుకుంటున్నాను..నేను నా అహంకారం చూపించే వాడిని ఐతే సమస్య కి రెండు కోణాలు వుంటాయి అని చెప్పను..నే చూస్తున్నదే లోకం అని వాదించే వాడిని.. యీ రేపిస్ట్ ల ని సమాజమే తయారు చేస్తుందనా మీ ఉవాచ? నేను అది ఒక మానసిక రుగ్మత అనుకుంటున్నాను..వాళ్ళని శిక్షించాలిసిందే..ఒక మానసిక రుగ్మత వున్న వెధవ తప్పు చేస్తే దాన్ని సమాజం మీద రుద్దుదాం అని బయలుదేరే సంఘ సంస్కర్తలు ని ఏమనాలి?? మీరు ఎక్కదైనా చూశారా అమ్మాయిలని వేదించండి అని చెప్పే సమాజాన్ని??

(రేప్ జరిగినా "అది ఆడదాని తప్పే" అన్నట్లు చూసే మన సమాజంలో చెప్పుకోలేకపోయినంత మాత్రానా ఆడవారు ఈ బాధలు పడటం లేదని మీరు నిర్ధారణకు రావడం సోచనీయం.ఒక్కసారి కళ్ళు తెరిచి మీ చుట్టుపక్కల చూడండి. మనసుంటే ఆ బాధల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి)

ఆడవారి బాధలని మీరు బాగా అర్ధం చేసుకున్నారు అనుకుంటున్నాను..అందుకు మిక్కిలి సంతోషము కూడా..కాని రేప్ జరిగితే అది ఆడదాని తప్పే అని యెవరు అనలేదు, అనబోరు కూడా..ఒకవేల మీకు అలాంటి సంఘటన ఎదురు ఐతే తప్పక అది ఆదిమానవ యుగం అనే అనుకుంటున్నాను.. మీరు నా వ్యాఖ్య ని ఆసాంతం తిలకించారో లేదో నాకు తెలియదు. నేను ఎక్కడ తప్పు చేసిన వాడిని వెనకేసుకు రాలేదు..తప్పు ని తప్పు గానే చెప్పాను.. మీరు గొప్ప మనసు వున్న వ్యక్తులలా వున్నారు, మీ చుట్టు పక్కల జరిగిన రేప్ లు, హరాస్మెంట్ ఎన్ని చూడగలిగారు??? ఎంత మంది బాధలు తెలుసుకోగలిగారు? మీ లెక్కల ప్రకారం మన సమాజం ఎంతో బ్రష్టు పట్టి పోయింది కాబట్టి, ఇప్పటకి మీరు చూసిన ప్రతి ఇద్దరి ఆడ వాళ్ళ లో ఒకళ్ళ బాధ తెలుసుకోగలిగి , ఓదార్చగలిగారు అనుకుంటున్నాను..యీ బ్రష్టు పట్టిన సమాజాం లోని కుల్లు ని తెలుసుకోగలిగి, మార్పు కి కృషి చెస్తున్నందుకు మీకు నెనర్లు..

తల్లిదండ్రులు నుండి ఆస్తి పంపకాల దగ్గర నా ముఖ్య వుద్దేస్యం, అలా ఆడ మగ అనే తేడా చూపిస్తున్నరు అనే గాని, మీరు వక్రీకరించుకున్నట్లు, మీరు వూహించుకున్నట్లు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కోసం ఎదురు చూడమని కాదు..అలాగే అత్త మామ గారి ఆస్తి కోసం కూడా ఎదురు చూడమని కాదు..


నేను అహంకారినే అయ్యి వుండొచ్హు, మానవత విలువలు లేని వాడినే అయ్యి వుండొచ్హు, స్త్రీ ల పట్ల మీ అంత గౌరవం లేని పాపిష్టి వెధవని ఐన అయ్యి వుండొచ్హు..కాని నేను మొత్తుకునేది ఏమిటి అంటే, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే.., యిలాంటి లెక్కల తో స్త్రీ ల ని కాస్త తక్కువ చేసి, పురుష ల ని కాస్త విలన్ ల ని చేసి చూపొద్దు అనేది నా మనవి..

కత్తి మహేష్ కుమార్ said...

@Dr.రామ్;నేను ఇక్కడ ఉటంకించిన గణాంకాలు నా ఇదవరకటి టపాలకి సంబంధించిన వివరణలకు ఉపయోగపడేవి మాత్రమే.ఆ మాటని నేను మొదట్లోనే చెప్పాను. బహుశా ఆ టపాలు చదవకుండా ఈ అంకెలని మాత్రమే చదివి, మీరు నిర్ణయానికొచ్చేస్తున్నట్టున్నారు.

మీరన్నట్లు రేప్ నీ ఈవ్ టీజింగ్నీ సమాజం పనిగట్టుకు ప్రోత్సహించదు. కానీ మన సామాజిక నిర్మాణం వాటికి అనుకూలంగా ఉంది, దాన్ని తెలుసుకుని మార్చాలి అన్నదే ఇక్కడ చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.

రేప్ జరిగితే అది ఆడదాని తప్పు ‘అంటారు’ అని నేను అనలేదు, ‘ఆడదాని తప్పే అన్నట్లు చూస్తారు’ అని మాత్రమే అన్నాను. ధృక్కోణానికీ, మాటకీ చాలా తేడా ఉందని గ్రహించగలరు.హెరాస్ మెంట్ కి గురైన అమ్మాయిలు బయటకి చెప్పుకోకపోవడానికి గల ముఖ్యకారణం "మాదే తప్పు అంటారన్న సందేహం"" తప్పుచేసిందని సమాజం వెలివేస్తుందన్న భయం" అని పరిశోధనలు చెబుతున్నాయ్.

నిజమే మీరు తప్పు చేసినవారిని వెనకేసుకొనిరావటం లేదు. కానీ, తప్పు యొక్క తీవ్రతని తక్కువచేసి మాట్లాడటమే కాక, అందరూ అలాంటివారు కాదు కాబట్టి సంతోషించమంటున్నారు.మగాళ్ళలోని మంచిని శ్లాఘించలేదు కాబట్టి పురుషుల్ని తక్కువచేసి మాట్లాడినట్లుగా భావిస్తున్నారు.


ఇక లెక్కల సంగతంటారా, మగవాళ్ళు రేప్ కి,ఆడమ్ టీజింగ్ కీ, కట్నం చావులకీ,గృహ హింసకీ లేక హెరాస్ మెంట్ కి గురౌతున్న వివరాలు మీదగ్గరుంటే చెప్పగలరు. సమస్య ముఖ్యంగా మహిళలది కాబట్టి ఆవివరాలివ్వడం జరిగిందేతప్ప, మగవాళ్ళని తక్కువచేసి చూపడానికి కాదు.