Saturday, July 19, 2008

కత్తిరింపు సేవలు...

గమనిక : ఈ వ్యాసం యొక్క అసలు శీర్షిక "కత్తిరిద్దాం రా!" కు సెన్సారువారు అభ్యంతరం తెలిపిన కారణంగా మార్చడమైనది. దేన్నికత్తిరిస్తారో... శీర్షికలో లేకపోవడం వలన, ప్రేక్షకులు తమ ఆలోచనాశక్తిని ఉపయోగించి పెడర్థాలు, ముఖ్యంగా బూతు ప్రధానమైన అర్థాలు తీస్తారేమోనని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.‘కంత్రీ’ సినిమాలోని ఒక దృశ్యం వలన దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ‘గోరింటాకు’ లోని డైలాగుతో వికలాంగులు కలతచెందారు. ‘రెడీ’ సినిమాలో సునిల్ పాత్రద్వారా కూచిపూడి కళాకారులు మనస్థాపంపొందారు. ఈ ఘటనల నేపధ్యంలో ప్రాంతీయ సెన్సార్ మండలి కొత్త నియమాల్ని సృష్టించి అమలు చేసింది. ఆ కొత్త నియమాల్ని కొంత తెలుగులో మార్చి ఇక్కడ ఇస్తున్నాను చూడండి;

  1. ఏదైనా కులాన్ని,మతాన్నీ,ప్రాంతాన్నీ లేక వృత్తిని సూచించే దృశ్యాలనూ లేక సంవాదాలు be scrupulously avoided.
    Should refrain from using words like “కుంటోడా, గుడ్డోడా, చెవిటోడా, మూగోడా,నత్తి,”
  2. Words like “నీయమ్మ, నీయమ్మ, నాకొడుకా, దొంగనాకొడుకు, దొబ్బెయ్యడం, తొక్కలో, etc may be removed.
  3. Lampooning or portraying or making mockery of their caste/religious status must be avoided. Should refrain from showing physically challenged as villains and comedians and showing them in bad light.
  4. కులపర మతపరమైన పేర్లు should not be used. ప్రాంతీయ యాసల్నీ, మాండలికాల్నీ విలన్లకూ, కామెడియన్ల చిత్రీకరణలో may not be used
  5. పోలీసు, వైద్యం మరియూ టీచర్ల వంటి వృత్తులను should not be show in poor light as they would demoralize the respective professions.
  6. Extra care should be taken not to film violent scenes and objectionable scenes at places of worship. The sanctity of the place of worship should be kept in mind.


పైనున్న నియమాలు సెన్సారు చిత్తశుద్దినేకాక, వారి తెలియని తనాన్నీ, చేతకాని తనాన్నీ కూడా తెలియజేస్తున్నాయి. కావాలనే నేను అనువదించని ఆంగ్ల వాక్యాలు ఎంత అర్థరహితంగా, డొంకతిరుగుడుగా ఉన్నాయో చూడండి. ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటిస్తే ఏదైనా సినిమా తియ్యగలమా? అసలు ఉద్దేశమేమిటో...ఈ నియమావళి ఎందుకో దీనికి రూపకల్పన చేసినవాళ్ళకైనా తెలుసోలేదో సందేహమే! ఇలాంటి అమలు చెయ్యలేని రూల్స్ వల్ల నిజంగా ఎవరికి లాభమో తెలియడం లేదు.


ఇప్పుడే అందిన వార్త: ‘కత్తిరింపు సేవలు’ అని ఉన్న నా టపా శీర్షిక, ‘నాయీబ్రాహ్మణుల’ వృత్తిని కించపరిచేలా ఉందని ఆ సంఘాలు ఆందోళన చెయ్యడం వలన సెన్సారువారు నా టపా సర్టిఫికేట్ ని లాగేసుకుని, బ్లాగునుండీ గెంటేసారు. కాబట్టి అర్ధాంతరంగా టపాకు సెలవుతీసుకోవలసి వస్తోంది. ఈ వివాదం నుండీ బయటబడితే, తీరిగ్గా ఈ విషయం మీద మరో టపా సవివరంగా రాస్తాను.--------------

10 comments:

పూర్ణిమ said...

:-) ఈ సెన్సార్ గోల నాకెప్పొడూ అర్ధం కాదు. మొన్న షర్మిలా టాగోర్ పాల్గొన్న చర్చను ఒక గంట సేపు చూసాను కానీ.. ముక్క అర్ధం కాలే!! అవును అందరి "మనోభావాలు"కీ ఒక్కో రూల్ పెడితే.. ఇక మిగిలేదేముంది?

Anonymous said...

మహేష్ గారూ,
నేనూ ఈ విషయాన్ని ఆంద్రావిలాస్ లో చూసి షాక్ అయ్యాను. నియమాలు రూపొందించేవారికి ఆమాత్రం ఙ్ఞానం ఉండక్కర్లేదా?
విలన్లు ఏ మాండలీకం మాటాడకూడదు. పోనీ మూగోడు అందామంటే అదీకుదరదు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు చేసే వెధవ పనులు చూపించకూడదు. అత్త కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకని.. వాళ్ళు చేస్తే లేని తప్పు సినిమా లో చూపిస్తే వచ్చిందా?

మేధ said...

మొన్నీ మధ్య మన రాష్ట్ర సెన్సార్ బోర్డ్ సభ్యురాలు టి.వి.9 వారి చర్చలో పాల్గొని తమ అమూల్యమైన అభిప్రయాలని తెలియచేశారు.. దాడాపు గంటసేపు వచ్చింది కార్యక్రమం.. నాకు అర్ధమైంది ఒక్కటే, ఆ వచ్చినావిడ బాగా పో(మా)ట్లాడుతుంది...! అది తప్ప ఇంకేమీ లేదు విషయం దాంట్లో.. ఈవిడగారి అడ్డగోలు వాదనకి పాపం యాంకర్ నవ్వి-నవ్వి పడిపోయాడు...!
దీని గురించి ఈ రోజు ఈనాడులో వచ్చిన వార్త...
http://eenadu.net/ncineshow.asp?qry=cinefront1

చేసెయ్యలాని, ఇంకేదో చేస్తున్నారు సెన్సార్ బోర్డ్ వాళ్ళు....!

అయితే త్వరలో మీరు కూడా సెలిబ్రిటీ అయిపోతున్నారనమాట, ఈ వివాదం వల్ల...!!!

అశ్విన్ బూదరాజు said...

ఇదెలా ఉన్నా ? ఈ మధ్యన ’U' certificate తో వచ్చిన ఓ అగ్ర కధానాయకుని తెలుగు సినిమా అంటూ లేదు, దశావతారం తప్పా

Sankar said...

ఇక సినిమాలు తియ్యడం ఆపెయ్యమని డైరెక్టుగా చెప్పకుండా ఇలా కొత్త విధానంలో చెప్తున్నారన్నమాట... ఇన్నితలపోట్లతో సినిమాలు తీసేకంటే బుద్ధిగా మరో వ్యాపకం వెతుక్కోవడం ఉత్తమమనిపిస్తూంది ఏ నిర్మాతకైనా.. ఇప్పటికే స్టార్ హీరోలంతా పాలిటిక్స్‌కి షిఫ్ట్ ఐపోతున్నారు కాబట్టి నిర్మాతలు అక్కడ పెట్టుబడి పెట్టుకోవచ్చు. రచయితలు వాళ్ళకు స్పీచ్‌లు ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చు. కళా దర్శకులు స్టేజ్ డెకరేషన్, లైట్ బాయ్స్ సీరియల్ లైట్లు బిగించుకొంటూ బతికేయొచ్చు. ఎటొచ్చీ దర్శకత్వ శాఖ వాళ్ళకే ఏం చెయ్యాలో దిక్కు తోచదు. వీరు అర్జెంటుగా పునరావాశం కోసం దరఖాస్తు ఇప్పట్నుండే మొదలెడితే ఇండస్ట్రీ దివాళా తీసే సమయానికి ఎంతోకొంత ఫలితం ఉంటుంది. ఇప్పటివరకూ కేవల ప్రి సెన్సారింగ్ మాత్రమే ఉండడంవల్ల పైకమున్న నిర్మాతలకీ ఏమీ ప్రాబ్లెం లేకుండా పోయింది... ఇప్పుడు పోస్ట్ సెన్సార్‌షిప్‌కి తట్టుకోవడం ఎవ్వరి తరమూ కాదు. ఇకమీదట సెన్స్సార్ బోర్డులనుండి బయటపడే సినిమాలకి... టైటిల్, విశ్రాంతి,శుభం కార్డులు మాత్రమే ఉంటాయి. సినిమాలో ఏ పాత్రన్నా ఒక్క డైలాగు చెప్పిందంటే అది ఖచ్చింతంగా ఏదో ప్రాంతంలో వాడుకలో ఉంటుంది కాబట్టీ మనకి మాటల్లేని మూకీ సినిమాలే గతి(ముఖ్యమంత్రిగారు నటిస్తున్నా సినిమా ఒకటి గ్యారంటీఘా రిలీజ్ అవుతుంది) ... లేదంటే ఏ తమిళ సినిమానో తెలుగు సబ్ టైటిల్స్తో చూడొచ్చు.

కత్తి మహేష్ కుమార్ said...

@పూర్ణిమ;నువ్వు TV చూస్తున్నప్పుడు ఎవరైనా (వాళ్ళకు) ఆ ప్రోగ్రామ్ నచ్చలేదని, నీకళ్ళు మూస్తే ఎలాఉంటుంది.కాస్త ఇరిటేషన్ కలుగదూ!ఇదీ అంతే అనుకుంటా. కాకపోతే ఇలాంటి విషయాల్ని అర్థంచేసుకుని మరీ వ్యతిరేకించడమో,అంగీకరించడం చెయ్యాలి. ఈ క్రింది లంకెలోని సెన్సార్ నియమావళి ఉద్దేశాలూ చూడండి. http://www.cbfcindia.tn.nic.in/

@మురళీధర్;నియమాలు ఏర్పరిచినవారు ఈ "తప్పులు" ఉద్దేశపూర్వకంగా చేసారని నా నమ్మకం.ఇది సమస్యను లేవదీసినవాళ్ళని శాంతించడానికి చేసిన గిమ్మిక్ లాగా కనబడుతోందితప్ప,ఒక సాంకేతికంగా బేరీజుచేసిన ప్రయత్నంగా అస్సలు కనబడటం లేదు. అందుకే వీరి చిత్తశుద్దిలోపానికీ,మూర్ఖత్వానికీ నవ్వాలి,కోపగించుకోవాలి.

@మేధ; నిజమే మీరన్న ఆ కార్యక్రమం నేనూ చూశాను. అసలు సెన్సారు సభుల్ని ఎన్నుకునే తంతే లోపభూయిష్టం,పక్షపాత విధానం అయినప్పుడు ఇలాకాక ఎలా ఉంటారు! వాళ్ళసలు అక్కడ ఏంచెయ్యడానికున్నారో తెలీనివాళ్ళచేతుల్లో మన సినిమాలుండబట్టే,ఈ పరిస్థితి.

@అశ్విన్; మీరు చెప్పింది అక్షరాలా నిజం. కానీ A సర్టిఫికెట్ ఉన్న సినిమాలు కేవలం పెద్దలే చూస్తున్నారంటారా? UA అంటే పేరంటల్ గైడెన్స్ ఈ చిత్రానికి కావాలి అని అర్థం. ఎంతమంది పిల్లలు యమదొంగ లేక జల్సా సినిమాల్ని వారి తల్లిదండ్రులతో చూసారు?

మనదగ్గర సక్రమమైన రూల్స్ లేవు..ఉన్నా అవి పాటించబడవు. ఇక ఎంతకాలమైనా ఎవడో డిసైడ్ చేసిన విధానాలకి మన రుచులూ,అభిరుచులూ పణంగాపెట్టిబతకాలో?

@శంకర్;బాగా చెప్పారు. అలాంటి పరిస్థితి ఒకసారి రావాలని కోరుకుందాం. అప్పుడుగానీ వీళ్ళతిక్క కుదరదు.

అబ్రకదబ్ర said...

సెన్సారు వాళ్ల రెండో అభ్యంతరం (నియ్యమ్మ, నియ్యక్క, దొబ్బెయ్యి లాంటి మాటల గురించి) అర్ధవంతంగానే ఉందనిపిస్తుంది నాకు.

రవి వైజాసత్య said...

కత్తిరింపు సేవలు’ అని ఉన్న నా టపా శీర్షిక, ‘నాయీబ్రాహ్మణుల’ వృత్తిని కించపరిచేలా ఉందని ఆ సంఘాలు ఆందోళన చెయ్యడం
హి హి హి.. బావుంది.
ప్రభుత్వం సినిమాని సినిమావాళ్ళకి వదిలేస్తే శుభ్రంగా ఉంటుంది..సెన్సారు బోర్డులు, సినిమాటోగ్రఫీ చట్టాలు, రాయితీలు, డబ్బింగు సినిమాలు, స్ట్రెయిట్ సినిమాలు, లోకల్ నాన్ లోకల్ ఈ చెత్త తలనొప్పులన్నీ వదులుతాయి..అప్పుడైన ప్రభుత్వం నిజంగా చేయవలసిన పనులపై దృష్టి పెడుతుందన్న "దురాశ". అన్నింటిలో వేలుపెట్టే ప్రభుత్వం వేలును కొరికెయ్యాలని నా "అత్యాశ"

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర; మీరు చెప్పిన రెండో నియమం on the face value సరిగానే అనిపిస్తుంది. కానీ ఆ వాక్యంలోని ఇంగ్లీష్ చూడండి, "scrupulously avoided" ఈ విరోధాభాసానికి ఏమైనా అర్థముందంటారా?

@రవి వైజాసత్య; నెనర్లు.
Self regulation is the best form. కానీ మీడియాకిచ్చిన ఆ గౌరవం సినిమాలకెప్పుడూ దక్కలేదు, బహుశా దక్కబోదుకూడా. హాలీవుడ్ లోఉన్న రేటింగ్ సిస్టమ్ లాంటిది పెడితే సరిపోతుందికదా అనే ఆలోచన చాలా మంది సూచించారు. అంటే ఎవడు తీసేదివాడు తీస్తాడు,నచ్చినోడు దాన్ని చూస్తాడు. చూడదగనివారు ఆ సినిమాని చూడకుండా చేసే mechanism device చేస్తేచాలు అనర్థం.

ప్రజాస్వామ్యంలో అలాగే ఉండాలి. కానీ మనం mature అవ్వకముందే, deviant అయిపోతున్నాం.neither can we arrive at an agreed system nor can we crate a self regulatory mechanism. మార్పు మూడు వైపులా రావాలి సినిమాతీసేవాళ్ళు,ప్రేక్షకులు, ప్రభుత్వం. అదెప్పుడొస్తుందో!

కొత్త పాళీ said...

:)
అదేదో సామెతుండాలి. "చేతకానోడు ..ఏదో చేశాడని" .. అలా ఉందిది. :)
సరే ఇవన్నీ లేకుండా సినిమా ఎలా తియ్యాలంటే .. మొత్తం సినిమాలో సుమారు ఒక పావు భాగం హీరోయిన్ మరియు ఇతర స్త్రీపాత్రల బొడ్లు చూపెట్టడం, హీరోలకీ విలన్లకీ డయలాగులు లేకుండా "హ హు యహా" అనే అరుపులతో కానివ్వడం .. పనిలో పనిగా కమెడియన్లకి కూడా డయలాగులు తీసేసి (వీళ్ల డయలాగుల మూలంగానే అసలీ సమస్యలన్నీ వచ్చేది) ఒకడు నడుస్తుంటే వాడి కాలికింద అరటి తొక్క వేస్తే జర్రున జారి పడినట్టు అలా హాస్యం సృష్టించడం .. అరటితొక్క పాత బడిపోతే వెరైటీ కోసం కొబ్బర్నూనె, ఫేన్శీ హెయిరాయిల్, ఇంజినాయిల్, ఆవదం ఇత్యాదులు కూడా ఉపయోగించవచ్చు.