Friday, July 11, 2008

మన పెళ్ళి ప్రాతిపదికే తప్పైతే?

కట్న గురించి రాసిన టపాలో, మన సాంప్రదాయ వివాహాల గురించి కూడా చాలా చర్చ జరిగింది. ఈ నేపధ్యంలో ఠకాల్న మా కాలేజీలో ప్రొఫెసర్ రఘునాధ్ చెప్పిన వాక్యాలు గుర్తుకొచ్చాయి. తను అనేవారు, "in India marriages happen for wrong reasons" అని. తరచి చూస్తే అది చాలా నిజమని చాలా మంది అభిప్రాయాలు చెప్పకనే చెప్పాయి.‘పెళ్ళి’ అనే ఒక వ్యవస్థ మానవమనుగడకి చాలా అవసరం అనేది అందరూ అంగీకరించే నిజం. ఇక్కడ సమస్య పెళ్ళి అవసరమా? కాదా? అన్నది కాదు. ప్రశ్న కేవలం ఈ విధానంలో అంగీకరించబడే పెళ్ళిల్లు అవసరమా? అన్నది మాత్రమే. సాంప్రదాయాలూ, కట్టుబాట్లు, ఆచారాల పేర్లతో కొన్ని పరిధులు అప్పటి కాలానికి అనుగుణంగా ఎర్పరుచుకుని వాటినే గుడ్డిగా ఇప్పటికీ ఆచరిస్తూ, అన్యాయమని అనిపించినా, ఆదరించడం అవసరమా అన్నదే మూల సమస్య.అసలు పెళ్ళెందుకు? అని ప్రశ్నించికుంటే వచ్చే సరళమైన సమాధానం, సహచర్యం, సహజీవనం, సాంఘిక గౌరవం, సామాజిక ప్రగతి. ఈ నాలుగు విధానాలనూ/లాభాలనూ వివరంగా చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అందునా అర్థం చేసుకోవడానికి అవి మరీ బ్రహ్మపదార్థాలు కావు గనక, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యత తెలిసినవే గనక ఎక్కువ వివరణ లేకుండా, కేవలం పేర్లు మాత్రమే ఉటంకించాను. మొదటి రెండు లాభాలూ వ్యక్తిగతమైతే, తరువాతవి మొత్తం సమాజానికీ, ప్రపంచ ఉనికికీచాలా అవసరం. కాబట్టి పెళ్ళి ప్రాముఖ్యతా, కొందరి దృష్టిలో పవిత్రతా ప్రశ్నార్థకాలు అస్సలు కావు.కానీ పెళ్ళి మాటల మొదలు, చూపులూ, బేరసారాలూ, ఏర్పాట్లూ, విధివిధానాలూ, ఆచార సాంప్రదాయాలూ, హంగులూ, హంగామాలూ, ఆర్భాటాలూ, పలకరింపులూ, ప్రదర్శనలలోఎంత డొల్లతనం కనబడుతుందో తలుచుకుంటే, గుండె బేజారెత్తిపోతుంది. ఇక అనుభవిస్తే మెదడు మొద్దుబారిపోవడం ఖాయం. నిజానికి పెళ్ళిచేసుకుంటున్న మగాడు ఆడదానికి ఈ చాలా విషయాలలో అస్సలు సంబంధమే ఉండదు. ఇక ఈ ముఖ్యమైన నిర్ణయాలకి ప్రాతిపదిక తెలుసుకుంటే, హస్యంగా అనిపించినా చాలా అసహ్యమైన తంతు అని అంగీకరించాల్సిందే!అందుకే మన భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో పెళ్ళికి ఎంచుకోబడుతున్న ప్రాతిపదిక మరియూ కారణాలను (అందరికీ తెలుసుగనక) కాస్త తలుచుకుందాం.

1. పరువూ - ప్రతిష్ట: మహా అయితే తాత, లేదూ ముత్తాత పేర్లు తప్ప కుటుంబ చరిత్రకూడా మనకెవరికీ తెలీదుగానీ, పరువూ ప్రతిష్ట అనేవి సినిమా డైలాగుల్లా ప్రతి పెళ్ళి తంతుముందూ బేరీజు చేసుకునే అతి ముఖ్యమైన విషయాలు. వాళ్ళ తాతలు నేతులు తాగారు కాబట్టి ఇప్పుడు మూతుల వాసన బాగానే ఉండొచ్చన కొండొకచో నిర్ణయాలు. మళ్ళీ ఎమైనా అంటే, "అటు ఏడుతరాలు, ఇటు ఏడు తరాలూ చూడకుండా పెళ్ళే!" అని బీరాలు. ఏడుసముద్రాల అవతల అమెరికాలో ఉంటే మాత్రం వాడెలాంటివాడో కూడా తెలీనవసరం లేకుండా పెళ్ళి మాత్రం ఖాయం చేసేస్తారు. అయినా ఇదొ గొప్ప కారణం. కులం ఇందులో ఒక మహత్తర భాగం పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పఖ్ఖరలెదనుకుంటా!


2. ఈడూ -జోడూ: ఇదొక పెద్ద హాస్య ప్రహసనం. సహజీవనానికీ, సాహచర్యానికీ అవసరమైన స్వారూప్యత(compatibility) ఎవరికీ అఖ్ఖరలేదు కానీ, ఎండకు మారిపోయే వంటి రంగూ, హీల్స్ వేసుకుంటే పెరిగిపోయే ఎత్తూ, కాస్త ఎక్కువ తింటే పెరిగిపొయే బరువూ వీళ్ళకు చాలా ముఖ్యం. ఇక అమ్మాయికి కళ్ళజోడుంటేనో, అబ్బాయికి బట్టతలుంటేనో ప్రపంచయుద్ధాలే జరిగిపోగలవు. అంటే పైపైమెరుగులు తప్ప, పెళ్ళికి అవసరమైన మానసిక హంగులు అస్సలు అవసరం లేవు. వీటికోసం జరిగే పెళ్ళిచూపుల తంతు గురించి ఆ టార్చర్ కు బలైన అమ్మాయినీ, ఆ విధానంలో ఇబ్బందిగా, దర్జాని వెలగబెట్టే అబ్బాయినీ అడిగి తెలుసుకోవాలి.


3. డబ్బూ - దస్కం: అబ్బాయికి సరైన ఉద్యోగం, అమ్మాయి తరఫున నుండీ సరితూగే కట్నం. ఇవి తరువాత వచ్చే ముఖ్యకారణం. ఇవి తెగితేకానీ పూజారి ముహూర్తం పెట్టడన్నమాట. ఇక్కడ ఎలాగూ మార్కెట్ ధరలు నిర్ణయించడం జరిగిపోయింది కాబట్టి అమ్ముకోవడానికీ, కొనుక్కోవడానికీ ఇక్కడ ఎలాంటి సిగ్గుబిడియాలూ కుటుంబాలకి ఉండవని ఇదివరకటి టపాలోనే తెలుసుకున్నాం.పై మూడు ముఖ్య విధానాలు కాక ఇంకా చాలా ఉండొచ్చు కాని దాదాపు అన్నీ పై మూడింటిలో ఏదో ఒక భాగంలో చేరేవే అని నాకు అనిపిస్తుంది. అంటే పెళ్ళి అనే గమ్యం సరైనదేగానీ, దాన్ని చేరడానికి మన సమాజం ఎంచుకుంటున్న ప్రాతిపదిక (basis) తప్పులతడకగా అనిపించట్లేదూ? Though end can justify its means in many cases, what if the means is so mean? ప్రాతిపదిక ఇంత అర్థరహితంగా ఉంటే పెళ్ళిల్లు సుఖంగా ఉంటాయా అన్నది అడగవలసిన ప్రశ్న."కొన్ని తరాలుగా ఇలాగే జరిగింది, అందరూ సుఖంగా సంసారాలు చేసుకోవట్లేదూ?" అనేది చాలా మంది పెద్దల వాదన. నిజమే మా తాతయ్య-బామ్మల తరం, నాన్నా-అమ్మల తరం సుఖంగానే జీవించామన్న నమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక భరించాలి, బాధ్యతను సహించాలి అన్న విశ్వాసం ఆ తరంవారి సొత్తు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయా? అందుకే ఈ దారి...సుఖమయ పెళ్ళి అనే గమ్యానికి నిజంగా పూలబాట కాకపోవచ్చు అనిపిస్తుంది.


If our present means or reasons for marriage are doubtful, Its our duty and responsibility to look for better ones.


---------------------

29 comments:

ప్రతాప్ said...

ఆలోచింప చేసేదిలా ఉంది.

క్రాంతి said...

బాగా రాసారండి.పెళ్ళికొడుకుల అమ్మకాలు,కొనుగోలుపై ఒక పుస్తకమే రాయొచ్చు.సిగ్గుశరం లేకుండా నా రేటు/మా వాడి రేటు ఇంత అని చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం.

RSG said...

మాష్టారూ, Hats Off!!! మొదట్నుంచీ మన పెళ్ళిళ్ళు "నీకెంత.. నాకెంత" పద్ధతిలోనే జరుగుతున్నాయి. మనం మారాలంటే ఇంకొన్ని తరాలు పడుతుందేమో??

పూర్ణిమ said...

For the first time, I've no confusions abt this.

If our present means or reasons for marriage are doubtful, Its our duty and responsibility to look for better ones.

We got to take accept it as our duty to change the terms in marriage!!

karthik said...

after all 'there is a need behind every social relation' so these all are the after effects of it.
as you rightly pointed out we r following things which r not upto our time.

anyway quite thoughtful. thanx for posting

meenakshi.a said...

మహేశ్ గారు బాగా చెప్పారు....మీరు మొదట చెప్పిన దాంట్లో..అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తారు నిజమే..కాని నా ద్రుష్టిలో అది వేస్ట్...వాల్ల ఫ్యామిలి బ్యాక్ గ్రౌండ్ బాగున్నంత మాత్రాన అబ్బాయి మంచివాడే అని నమ్మేస్తారు..ఈ విషయం లో కొన్ని సార్లు మంచి జరుగుతుంది..కాదనను..కానీ అన్నీ వేలలా కాదేమో..ఇక సెకండ్ పాయింట్...పెల్లి చూపులు..ఈ పెళ్ళి చూపుల్లో అమ్మాయి మొహం తప్పా ఏం తెలుస్తుంది..ఇద్దరు కలకాలం కలిసి బ్రతకడానికి కావాల్సింది...వాల్ల అభిప్రాయాలు కలవడం కదా....మరి ఈ పెళ్ళి చూపులు ఎందుకో అసలు అర్దం కాదు..ఇక పోతే పెళ్ళి చూపుల ఖర్చు గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు...వచ్చిన వాల్లందరికి కారాలు మిరియాలు పెట్టాలి..బుద్ధిగా కూర్చోవాలి...ఎన్ని ఆంక్షలో...మా అత్తకూతురిని చూడ్డానికి వచ్చినప్పుడు మొత్తం బెటాలియన్ వచ్చారు....అది కూడా..ఒక సారి అబ్బాయి వాల్ల నాన్న,బాబాయి,ఇంకా తోకలు తొండాలు...తరవాత వాల్ల అమ్మా,పిన్ని..వాల్లు.తరవాత అబ్బాయి గారు..చి చి నాకైతే భలే చిరాకొచ్చింది...ఇక పోతే మూడవది..నిజంగా నేను చూసినదే.. ...అమ్మాయిని చూడ్డానికి వచ్చే ముందు...అబ్బాయి వాల్లు అడిగారు..మీరు పదిహేను లకారాలు ఇవ్వగాలరా..అని..అలాగైతేనే అమ్మాయిని చూస్తాం అని చెప్పారు...ఇలాంటి వాల్లు ఎంత మంది ఉన్నారో ఇంకా...అసలు ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో..?

sujata said...

ఎవరి టపా చదివితే, మైండ్ బ్లాంక్ అయి... టైప్ లో రాసారు. మీ అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. మనం మరీ అనాగరికంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాము. కట్నం, సమస్యలూ.. భార్య వేధింపులూ, భర్త సాధింపులూ.. అత్త మామల ఇంటెర్వెన్షన్, పిల్లలూ.. ఇవన్నీ దీనికి అనుబంధాలే. లవ్ మేరేజీ చేసుకుని, నిలబడి, ఆర్ధికంగా, మానసికంగా స్వతంత్ర్యంగా జీవించడానికి, కాస్త దమ్ము ఉండాలి. లేని వారు... ఈ సైకిలు అంతా భరించాలి. పెళ్ళిచూపులూ, సాంప్రదాయాలూ, లాంచనాలూ, పెట్టిపోతలూ, పెద్ద యెత్తున కట్నాలూ.. కానుకలు, ఆర్భాటంగా ఫంక్షన్లూ, విందులూ, వినోదాలూ.. ఇవన్నీ సాంప్రదాయ వివాహానికి ఉన్న ప్రాధమిక లక్షణాలు. అబ్బయిల తల్లితండ్రులు, కట్నం కోసం ప్రేమ వివాహాలను వ్యతిరేకిస్తారు. అమ్మాయిల తల్లిదండ్రులు పరువు కోసం. అనవసరంగా వీళ్ళని విడదీసి, ఇంకెవరితోనో ముడివేసి, డబ్బూ, పరువూ సాధించుకుంటారు. మధ్య లో నష్తపొయెది.. ఎవరు ?

బొల్లోజు బాబా said...

మంచి విషయాలు ఆలోచనకు పెట్టారు.
బొల్లోజు బాబా

ప్రసాద్ said...

మహేశ్ గారూ,
ఇప్పటి పెళ్ళి చూపుల ప్రహసనంలో అమ్మాయి మనసు అబ్బాయి, అబ్బాయి మనసు అమ్మాయి తెలుసుకొనే అవకాశమే లేదు. అబ్బాయిలైనా, అమ్మయిలైనా పైపై మెరుగులు కాదు నాకు మనసే ప్రధానం అన్నా ఆ విధంగా తన తోడును వెతుక్కోవడం ప్రస్తుత పరిస్థితిలో దుర్లభం. కనుక వున్నంతలో ఇక ఎంచ గలిగిన పైపై మెరుగులను బట్టే భాగస్వామిని ఎంచుకొని, తెలియని విషయాలను అదృష్టానికి వదిలేయాల్సి వస్తోంది.

ఇక జాతకాలు, కుల పట్టింపులు మొదలైనవి చాలా మట్టుకు తగ్గు ముఖం పట్టాయి. ఇప్పటి తరం వాటిని పట్టించుకోకపోయినా తల్లిదండ్రుల ఇష్టాలకు వ్యతిరేకంగా నడచుకోలేకపోతున్నారు. నా చిన్నప్పుడు ఒక ఉపకులం మరో ఉపకులంలో చేసుకున్నా బందువర్గం నుండి వెలివేయబడేవాళ్ళు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు.

అలాగే కట్నకానుకల పరిస్థితిలో కూడా మార్పు వచ్చింది. అయితే రావాల్సిన మార్పులో ఇదంత చెప్పుకోదగ్గది కాదేమొ! ఇప్పుడు చదువుకొని, వుద్యోగం చేయగలిగిన అమ్మాయికి ఇస్తున్న ప్రాధాన్యం కట్నకానుకలకు ఇవ్వట్లేదు. అయితే ఇది పెళ్ళి తర్వాత అమ్మాయి సంపాదించే డబ్బు మీది ఆశ అవనూ వచ్చు.

ఇక మన పెళ్ళి తంతు వ్యవహారం లోపభూయిష్టమైనదే అయినా పాశ్చాత్య తరహా కూడా ఆదర్షమైనదేం కాదు. ఏదేమైనా పెళ్ళి ఎలా జరిగినా, భాగస్వామిని ఎలా ఎంచుకున్నా భాగస్వాములిద్దరూ వందశాతం సంతృప్తి పొందలేరు. ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించుకోవడం మీదే పెళ్ళి సాఫల్యత వుంటుంది.

--ప్రసాద్
http://blog.charasala.com

sneha said...

పెళ్ళి అనేది అమ్మయైనా అబ్బాయైనా వయసు వచ్చింది, ఉద్యోగం వచ్చింది, మంచి సంభంధం వచ్చింది అని కాకుండా మనతో కలిసి జీవితం పంచుకోవడానికి మనకి సరిపొయే వ్యక్తి దొరికినపుడు చేసుకుంటే మీరు టపా లొ చెప్పిన సమస్యలు కొంతైనా తగ్గగలవు.

వేణూ శ్రీకాంత్ said...

మంచి టాపిక్ మహేష్ ఈ ప్రాతి ప్రదికలు మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది... కాని మార్చడానికి ప్రాక్టికల్ అడ్డంకులు చాలా ఉన్నాయి వాటిని దాటడమెలాగో, అసలు సరైన ప్రాతిపదికలు ఏంటో కూడా మరో టపా వ్రాయండి.

కత్తి మహేష్ కుమార్ said...

@ప్రతాప్: నెనర్లు

@క్రాంతి;ఉద్యోగాన్ని బట్టి ప్రతి కులంవాళ్ళూ ఆల్రెడీ సగౌరవంగా రేట్లు ప్రకటించిన సమాజం మన సొంతం.గర్వపడదామో, సిగ్గుపడదామో మన విచక్షణపై ఆధారపడి ఉంది.

@RSG;నెనర్లు. ఆ మార్పు తెచ్చే తరం నీదీ,నాదీ ఎందుకు కాకూడదు? ఎవరో వచ్చి ఉద్ధరించాలంటే ఎలా?

@పూర్ణిమ; hope you take charge of your own life and change the terms of your marriage accordingly.

@మీనాక్షీ; నువ్వు చెప్పిన ప్రహసనం వింటుంటే నవ్వుతోపాటూ జుగుప్సా కలుగుతోంది. ఇలాంటి నిజాల్ని కూడా నువ్వు నీ బ్లాగులో రాయాలి. ఇక మార్పంటావా..అది నువ్వే తీసుకురావాలి. జీవితం నీది, నిర్ణయం నీది.

@సుజాత గారూ; నిజానికి నా మైండ్ బ్లాంకైపోయి ఈ టపాలు రాస్తున్నాను. నా మిత్రుడు తన పెళ్ళికోసం జరుగుతున్న డ్రామా చెప్పేసరికీ నిజంగానే నాకు మతిపోయినంత పనైంది.
ఇక నష్టపోయేది ఎవరన్న విషయం నష్టపోతున్న అందరికీ తెలుసు. కానీ సర్ధుబాటే జీవన సిద్ధాంతమైన జీవితాలలో ప్రజలు బతుకీడుస్తారేగానీ జీవించడం లేదని నాకనిపిస్తుంది.

@బాబాగారూ; నెనర్లు

@ప్రసాద్ గారూ; నేను మనసు తెలుసుకునే వరకూ కూడా వెళ్ళటం లేదు. కనీసం మనిషినైనా సరిగ్గా తెలుసుకోలేని విధానానికి ఇన్ని హారతులెందుకు పడుతున్నామా? అని సందేహిస్తున్నాను.

పాశ్చాత్య విధానం మంచిదా లేక,ఆప్ఘనిస్తాన్ విధానం మంచిదా అనేవికాదు మన సమస్య. మన విధానాలు ఏవిధంగా ఉన్నాయో చూడటం, వాటిల్లో ఏమార్పురావాలో కోరడం ముఖ్యం.

@స్నేహ; బాగా చెప్పారు.ఈ సమస్యలు తగ్గేరోజు ఈ రోజే కావాలని ప్రతిరోజూ కోరుకుందాం.

RSG said...

@Mahesh,

Well, I've some ideas. But don't know whether I can pull it off or not, after all reading about your friend :)

Wish me luck..

అబ్రకదబ్ర said...

@మహేష్,

"మా తాతయ్య-బామ్మల తరం, నాన్నా-అమ్మల తరం సుఖంగానే జీవించామన్న నమ్మకంలో ఉన్నారు. ఎందుకంటే పెళ్ళి చేసుకున్నాక భరించాలి, బాధ్యతను సహించాలి అన్న విశ్వాసం ఆ తరంవారి సొత్తు"

ఆ విశ్వాసం ఈ తరం వారిలో లేదని మీరెందుకనుకుంటున్నారు?

వచ్చిన పదుల కొద్దీ సంబంధాల్లోంచి ఒకటి ఏరుకోవటానికి పరువు-ప్రతిష్ట, ఈడు-జోడు, డబ్బు-దస్కం అనబడే ఆ మూడు విషయాలూ ఒక filtering criteria మాత్రమే అని మీరెందుకనుకోరు? ఈ మూడిట్లో ఏ ఒక్కదాని ప్రమేయమూ లేకుండా పెళ్లి చేసుకున్నవారెంతమంది మనలో? వీళ్లంతా ఆనందంగా లేరని చెప్పగలరా? పోనీ ఆ మూడిటి ప్రమేయమూ లేకుండా చేసుకున్న ఆదర్శ పెళ్లిళ్లు ఏవీ పెటాకులు కావటం లేదని చెప్పగలరా? మీకు తెలుసో లేదో - ఇండియాలో ప్రేమ వివాహాలే ఎక్కువగా విడాకులకి దారి తీస్తున్నాయి.

ఈ మధ్య మీ టపాల్లో I am okay; You're not okay అనే ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.

@సుజాత,

"లవ్ మేరేజీ చేసుకుని, నిలబడి, ఆర్ధికంగా, మానసికంగా స్వతంత్ర్యంగా జీవించడానికి, కాస్త దమ్ము ఉండాలి. లేని వారు... ఈ సైకిలు అంతా భరించాలి"

మధ్యే మార్గం కూడా ఉంది. తల్లిదండ్రులు చూసిన అమ్మాయినే ఈ ఆర్భాటాలేవీ లేకుండా చేసుకున్న వాళ్లు పదులకొద్దీ ఉన్నారు నా స్నేహితుల్లో - నాతో సహా. 'లవ్ మేరేజ్ చేసుకోవాలి' అనే ఆశయం ఉండటమేమిటి? లవ్ అనేదేమన్నా ఉద్యోగమా - దానికోసం వెదుక్కుని ఒకమ్మాయిని పట్టుకోటానికి? అది అందరికీ కుదరకపోవచ్చు. అంతమాత్రాన వాళ్లు పెళ్లితో తమ జీవితంలోకి అడుగు పెట్టినవారిని ప్రేమించలేరని ఎలా చెబుతాం?

Niranjan Pulipati said...

మహేష్ , చాలా మంచి విషయాలు చర్చకు పెడుతున్నావు. ఈ చర్చల ద్వారా కొంత మందైనా ఈ సమస్యల గురించి ఆలోచించి, మంచి నిర్ణయాలు తీసుకుంటే అంతకన్నా కావాల్సిందేముంది..

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర గారూ; మీరు మీ భావాలద్వారా ఒక conformist గా అనిపిస్తున్నారు,నేను డిక్లేర్డ్ confrontationalist ని కాబట్టి ఆమాత్రం ఆలోచనల్లో తేడా ఉండాలి. ఇక్కడ ఎలాంటి పెళ్ళిళ్లు పెటాకులయ్యాయా అన్నది కాదు సమస్య. ప్రస్తుతం ఉన్న పెళ్ళి ఆధారిత కురీతులకు మూలాలు ఎక్కడా అని వెదుకుతున్నాను.అదీ చాలా వరకూ ప్రశ్నలు లేవనెత్తి మాత్రమే. ఇక్కడ చాలా మందికి వీటిల్లో కొన్ని సమస్యలు తోస్తున్నాయి. మీకు మీ ఆలోచన సరైందనిపిస్తే ఫాలో అయిపోవడమే.

ఇక I am OK , you are not OK ధోరణిలో నాటాపాలున్నట్లు నాకు తెలియలేదు. I feel strongly about the issue and I write about them. That's all.ఇక నేను చెప్పే విషయాలు చాలావరకూ నేను బలంగా నమ్మినవీ,నా జీవితంలో నేను పాటించినవి. కాబట్టి ఒకవేళ కొంత (over)confidence గా కనబడి అది arrogance అనిపించి ఉండొచ్చు.

@నిరంజన్;నెనర్లు.ఈ ప్రయత్నమంతా అందుకే. కనీసం కొంతమందైనా ఆలోచిస్తారని ఆశిద్ధాం.

Srividya said...

చాలా మంచి టపా.. ఇప్పటి పరిస్థితికి అద్దం పడుతోంది.

సందీప్ said...

@అబ్రకదబ్ర
ఇండియాలో ప్రేమ పెళ్ళిళ్ళే ఎక్కువగా పెటాకులవుతున్నాయన్నారు.
నిజమే కావచ్చు.కానీ దానికి కారణం మహేశ్ చెప్పినదే. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు సాధారణంగా ధైర్యవంతులు,బలమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అయిఉంటారు. అందుకే,ఇక సరిపోదనుకున్నప్పుడు విడిపోవడానికి వెనుకాడరు.
అదే మన ముందు తరమైతే,పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి...
మొగుడు పూర్వ జన్మ కర్మ ఫలం,పూజ కొద్ది మొగుడు, పుణ్యం కొద్ది పిల్లలు వంటి సామెతలు వల్లె వేసుకుంటూ జీవితాన్ని నిర్లిప్తంగా గడిపేస్తారు.
విడాకులు తీసుకోని జంటలన్నీ సుఖంగా ఉన్నట్టు కాదు కదండీ.
విడాకులు తీసుకోవడం నేరమూ కాదు...

అబ్రకదబ్ర said...

సందీప్,

'ప్రేమ పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు ధైర్యవంతులు, మిగతా వాళ్లు పిరికి వాళ్లు' అన్న తరహాలో ఉన్న వ్యాఖ్యలు సరికాదన్నది నా భావం. ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా పెటాకులవటానికి మీరు చెప్పిన కారణం మరీ వింతగా ఉంది. ప్రపంచంలో ఏ ఇద్దరి భావాలూ ఒక్కలా ఉండవు. ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చిన పెళ్లైనా, ఎదుటి వారిని అర్ధంచేసుకుని వారితోనే కలకాలమూ గడపటానికి ఎక్కువ ధైర్యమూ, బలమైన వ్యక్తిత్వమూ కావాలి - 'తూ నా బొడ్డు' అని విడిపోటానికి కాదు. విడాకులు తీసుకోని జంటలన్నీ సుఖంగా ఉన్నట్లు ఎలా కాదో, వాళ్లందరూ నిర్లిప్తంగా బతుకులీడుస్తున్నట్లు కూడా అలాగే కాదు.

ఇంతకీ, విడాకులు నేరమని నేననలేదు. దానికి ఎవరి కారణాలు వాళ్లవి.

అబ్రకదబ్ర said...

మహేష్,

సమస్య అనుకుంటే అన్నీ అలాగే కనిపిస్తాయి. ఇక్కడున్నవాళ్లలో మీరు చెప్పిన 'ఆ మూడూ' పట్టించుకోకుండా పెళ్లి చేసుకుందెంతమంది? మనం ఆచరించని నీతులు వేరేవాళ్లకి చెప్పబోవటం ఎందుకు? చర్చని కట్నానికి పరిమితం చేస్తే నేను కామెంటేవాడిని కాదు. 'పరువు-ప్రతిష్ట', 'ఈడూ-జోడూ', 'ఒడ్డు-పొడుగు' అంటూ ప్రతి చిన్న విషయాన్నీ ఎద్దేవా చేయటానికి మీరు ప్రయత్నిస్తే నేనిలా రాయవలసొచ్చింది.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర; ఒక సారి తప్పు చేసినవాళ్ళకి, వాళ్ళు చేసింది తప్పు అనే స్పృహ వచ్చిన తరువాత పదిమందికీ చెప్పడం తప్పంటారా? వాళ్ళకి ఆ moral right లేదంటారా? తప్పన్న విషయాన్ని తప్పుచేసినవాడు చెప్పినా తప్పు తప్పే. ఇక నేను చెప్పేవి నీతులు కావు, ఆలోచనలు. ఇక అవి నేను ఆచరించినవి కాబట్టి అంతే conviction తో చెప్పడానికి ప్రయత్నిస్తాను.

నేను పెళ్ళి జరిగేవిధానాన్ని ‘ఎద్దావా’ చేస్తున్నానని మీరంటున్నారు. ఉన్న సమస్యల్ని ఎత్తిచూపుతున్నానని నేనంటున్నాను.We can disagree agreeably.మీ వ్యక్తిగత నమ్మకాల్ని ప్రశ్నించే అధికారం నాకు లేదు. కానీ నేననుకున్న సామాజిక రుగ్మతల్ని గురించి బాహాటంగా మాట్లాడే నా అధికారాన్ని మాత్రం వదులుకోలేను.

సందీప్ said...

@అబ్రకదబ్ర
అయ్యో, ప్రేమించి పెళ్లి చేసుకోని వాళ్ళు పిరికివాళ్ళన్నది నా ఉద్దేశం కాదండి. కానీ తన భాగస్వామిని తానే ఎన్నుకుని,పెద్దలని ఒప్పించి లేదా ఎదిరించి పెళ్ళి చేసుకునే వాళ్ళది కాస్త ఎక్కవ ధైర్యం అంటున్నాను.
ఇక మీరన్న అర్ధం చేసుకుని కలకాలం గడపడం గురించి.నిజంగా
ఒకరినొకరు భరించలేని స్థాయిలో ఆ విభేదాలు ఉన్నప్పుడు కలిసి ఉండటానికి ధైర్యం ఎందుకు కావాలో నాకు అర్ధం కావటంలేదండి.సహనం కదా కావాలి??
నాకైతే విడిపోవడానికి ధైర్యం కావాలేమో అనిపిస్తోంది.
but may be, i am
too young to understand these things.
ఇప్పటికైతే నా ఉద్దేశం మాత్రం ఇదే...

arvindrishi said...

Chaala value judgements chesina tarahaalo saagindi mahesh mee tapa.Existing system ni vyatirekinchatam anedi kooda oka stero typed confirmism tappa "No" ani cheppina prati abhiprayamoo chaitanya pooritamina confratationasim kaakapovachu. Ee comment cheyatam nijanga naaku anavasaram but i want to drive a point on your tapa.

Chaala judgemental ga meeru chesina ee comment on abrakadabras comment is really uncalled.Anakundaa undaalsindi.nenu ee system ni vyatirekistunnanu kabatti ee oravadi ki vyatirekanga unna anni bhavanalu sanatanaminavi ane Value judgement is not required.

values are relative ani oka tapa lo antaaru, indulo nenu aacharistunnanu kabatii cheptunnanu antaaru.Convenience anukovala idi?

Oka pattern ite spastanga kanipistondi ee madhya mee tapaalallo. oka leftist, feminist idealistic thought process.late 1980's lo aagipoina bhaavalalula unnayi.A little outdated.Aakali raajyam movie ni 2008 lo choosina feel.

Indian system of marriage lo +ve points enno unnayi meeku only -ves maatramein enduku kanabadutunnayi.Ide tarahalo saagindi mee eve teasing tapa kooda ippude chadivaanu. Words lo maatram pettaledu meeru but oka sexually freed society ni solution ga propose cheyatam ...edo oka report base toti ikkadi culture ni tosi rajani ela oka system ki meeru solution propose cheyagaligaaro naaku artham kaaledu...idi mee personal values ni samardhinchukune process lo oka systeme wrong ani cheptunnatlu undi..tappa nijanga solution kanukkune prayatnam la ledu.

Meelo oka deep routed hatred on Indian traditions and systems kanipistunnayi. Sophisticated languge valla moderate tone lo vinipinchina there is a pattern to your thoughts.oka saari all tapas oke saari chadivaanu. Oka brain washed pattern suspastam.Ekkado deeni routes undi untaayi.Good bad ugly perumallakeruka...kanee ee thought process is provoking you to say no ...a strong No for Indian systems.

Objectivity koravadindi ee tapalallo.Typical Indian pysche is attuned to reading bad news first and responding to it.Anduvalla populism vastundi.Ee roju unna TV channels, news papaers laagane saagutunnayi me tapaalu kooda.Tell bad news first, criticize Indian systems like Ayurveda, astrology...evado jana vignana vedika ani peltaadu inka adi trend autundi.Gudilo bali istunte TV9 ki nidra pattadu ghoram antaadu. Bakrid ki subhaakankshalu cheptaadu...em maatladite evadu bomb vestaado ani bhayam. Ide pyshce kanipoistondi mahesha..."tolerate" ane goppatanam undi ee culture lo...mee tapalo adi chetakaani tanam ga chitreekarinchabadutundi...inkaa 1000 good points. Reform ani cheppemundu +ves kooda cheppandi.

You don't seem to have any good news to share about thousands of marriages that are paving way for new trends.

Mee tapalallo language chaala baaguntundi, pictures nijanga solid.Asalu ekkadekkado unna inta mandi open ga vachi discuss cheyataaniki oka manchi platform ni repeated ga meru create chestunnaru adi wonderful.Mee bhavanallo koncham objectiity, less judgemental ga unte manam donka road lo kaakunda issue gurinche maatladukuntaamemo..choodandi..!

కత్తి మహేష్ కుమార్ said...

@అర్వింద్; I agree to what your are trying to suggest. కానీ "నేను డిక్లేర్డ్ confrontationalist ని" అని నేను చెప్పిన సమాధానం నిజానికి మరొకటపాలో అబ్రకదబ్రగారు నన్ను అన్న మాటకు reference గా మాత్రమే.

నేను నిజంగా సమాజానికి ఎదురెళ్ళడంలోనే విశ్వాసం ఉంచేటట్లైతే, చర్చలు లేకుండా మీరన్న జడ్జ్ మెంట్ పాస్ చేసి ఊరకుండేవాడిని. ఇక నా టపా చాలావరకూ వ్యతిరేకంగా సాగినా మొదటి రెండు,మూడు పేరాలలొ పెళ్ళిప్రాముఖ్యతకు పట్టంకట్టిన తరువాతే,ఆ పెళ్ళికి మన సమాజం ఎన్నుకుంటున్న దారిని నిరసించాను. దయచేసి మొదటి రెండు,మూడు పేరాలని చదవగలరు.

నేను చెప్పిన విషయాలు మీకు out-dated అనిపించడంలో ఆశ్చర్యం లేదు. పెద్ద నగరాల్లో ఉన్న చాలామంది యువత అలాగే భావించొచ్చు. కానీ హైదరాబాద్ దాటి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే నేను ఉటంకించిన పరిస్థితులు అక్షరసత్యాలు. కొత్తగా NRI పెళ్ళిళ్ళ ప్రహసనాన్ని గురించి కొందరు చెబితే ఈ సమస్య యొక్క విస్తృతం నా comprehension కు మించిందనిపించింది.అంటే సమస్య రూపం మారిందిగానీ,తీవ్రత పెరిగింది అని.నా ఉద్ధేశం సమస్యని చర్చించడం కాబట్టి ఈ టపాలో భారతీయ వ్యవస్థలోని గొప్పతనాన్ని పొగడడానికి సమయం కేటాయించలేదు.


ఇక నా మనసులో ఒక "deep rooted hared for Indian system" ఉంది అని మీకు అనిపించడానికి కారణం బహుశా నా విషయాలన్నీ సమాజంలోని నెగెటివ్ aspects తీసుకుని చర్చకు పెట్టడం వలన కావచ్చు.

నేనూ ప్రకృతి అందాన్ని గురించీ, కోకిల స్వరాలగురించీ,గోదావరి ప్రవాహాన్ని గురించి రాస్తూ కాలంవెళ్ళదీయ్యొచ్చు. కానీ ఒక committed individual గా,ఒక సామాజిక బాధ్యతగలిగిన పౌరుడిగా కొంచెం సీరియస్ విషయాలుకూడా నా మదిలోమెదులుతాయి, అందుకేవాటినీ నా టపాలలో పెడతాను.

ఇక పాప్యులిజం నా ధ్యేయమైతే, సీరియస్ విషయాలు కాక మీరన్న నా ‘మంచి భాషను’ ఉపయోగించి పాప్ కార్న్ సెన్సేషనలిజం టపాలు రాయలేనా? వాటికి శ్రమ అఖ్ఖరలేదు, ఇంత ఆలోచనా అఖ్ఖరలేదు.ఈ బ్లాగుద్వారా ప్రపంచాన్ని మార్చడం నా ఉద్దేశ్యం అస్సలు కాదు. I am using this plat form only to air my point of view.

నా బ్లాగు ఇంత తీక్షణంగా చదివి స్పందిస్తున్నందుకు నెనర్లు.

arvindrishi said...

modati rendu peraalu chadivaanu nenu pelli gurinchi raasaru, Indian system of marriages lo unna +ve element touch chesinatlu anipinchala.

Ika judgement ane point koste tapa tone lo charcha ane view point kante judgemente ekku va kanipistondi.

Hyd ki 30 kms dooram lo situation meru cheppinatlu undachemo. Kotta maarpu aa voolaki 30 kms dooram lo already modalayyindi ane point gurinche nenu cheptunnanu.Ee kotta oravadi meeru maatladaledu.Varakatna samasya eppatido ade undi chuttoora annattu asalu basis of Indian pellille dollatanam ...chaala pedda matalu ...mana anubhavam saripotunda inta judgement cheyataaniki? Enta emperical study chesaaka peddavaallu pettina padhatulayyuntaayi...tokuna No ante?

Deep rooted hatred...as u said negatives maatramein maatladatam valla anipinchi undochu...as i said nijam perumallakeruka nijanga meeku ala unna aa discussion ikkada imp kaademo.

prakruti andam lo, kokila kantham lo , godavari pravaham lo serious ness,commitment levani nenanukonu.Adi paniki raani time pass charya kooda kakapodu...ide ne cheptuntaa ...meeru raase topics meku serious anipinchavachu gaaka papam kokila, govaree em chesaayi mimmalni...pedda geeta geese maatladataam:-)

aahladanninche tapaalaki srama akharaleda...emtandee ee roju meeru statements meeda statements...alochana akharleda...

point to point mimmalni aakshepinchatam naa uddesam kaadu kanee prati maatalonoo meeru chaala liberal ga statements chesetunnaru ...avi pakka vaallu relate cheskune vite kastam kada ...may be, if i can borrow ...I am ok you are not ok ane bhavana kanipistondi...evari meeda ee kopam?

కత్తి మహేష్ కుమార్ said...

@అర్వింద్: "everything is not fine" అనే అసహనం తప్ప నాకు ఎవరి మీదా కోపం లేదు. కావాలనుకున్న మార్పుల్ని నా జీవితంలో తేవడానికి ప్రయత్నించిన తరువాతే విశ్లేషణకు ఇక్కడ పెట్టాను.

నేను డొల్లతనం అన్న పెళ్ళి ప్రాతిపదికల్లోని లోతుని మీరు తెలియజెప్పగలిగితే, నావి ‘లిబరల్ స్టేట్ మెంట్స్’ అని ఒప్పుకోగలను. లేదా దాన్ని నాకు తెలిసిన నిజంలోంచీ నేను ఏర్పరుచుకున్న అభిప్రాయాలుగా మిగిలిపోతాయి.బహుశా నా అభిప్రాయాల్ని అంగీకరించినవారు చాలా మందే ఉండటం కూడా నా నమ్మకాన్ని స్థిరం చేసిందనుకుంటాను.

ప్రకృతి,కోకిలా,గోదారీ వగైరాలు టైంపాస్ అన్న ఉద్దేశంలో నేను చెప్పలేదు.నాకు సినిమాలు కూడా చాలా సీరియస్ విషయాలే...అందుకే వాటితోపాటూ కొన్ని సీరియస్ విషయాలుకూడా నాకు తోస్తాయికాబట్టి రాస్తాను అంటున్నానంతే.

పెదరాయ్డు said...

In the process of posting a comment for this article, i have created a new post:), pls go to http://panchayiti.blogspot.com/

BezaWa said...

అమ్మో మహేశ్ గారు మా వాళ్లు నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసే పన్లో ఉండగా మిరు ఈ బాంబు పేల్చారు. !!!
మరైతే పెళ్ళికి సరైన ప్రాతిపదిక ఏమిటి ? అభిప్రాయాలూ అభిరుచులు కలవటమేగా? మరైతే అవి కలవటానికి , కలిశాయో లేదో తెలుసుకోవటానికి దారి ఏది?
How can we decide compatibility without spending time together, knowing each other?

I think the roots our marriage system come handy that way.
When people inquire about family status/history they are essentially trying to find the so called compatibility.
ఈడు-జోడు is another part of finding the compatibility.
Even if someone is going for a love marriage, do they go out and fall in love with someone not matching physically (oddu-podugu)?
When we find compatibility its great... and when parents find it for us it is wrong??

I have seen marriages falling apart in the wet a lot more than in India.
We Indians believe in repairing the relationships rater than replacing them.
We don't go for marriage counselors for keeping the marriage intact.
But when our parents help us do the same we criticize the system.

No country, no process is ever perfect. We have to make it better. But to say the entire system is shallow (డొల్ల) somehow doesn't convince me.

(on a lighter note:హైదరాబాద్ కి ముప్పై కిలోమీటర్ల దూరం లో ఒక dating సైట్ ప్రారంభించి చూద్ద్దాం, ఎలా నడుస్తుందో. )

I am a regular reader of your blogs like the stuff you write. Thought of writing appreciating comments in ur earlier blogs.. But I was tooo lazy. Just now I didnt completely agree with this blog and took time to write all this stuff. May be we react more when something we don't like happens. May be that is the case with you writing this piece.

కత్తి మహేష్ కుమార్ said...

@బెజవా; ఇప్పటికైనా స్పందించినందుకు నెనర్లు.మీరన్నట్లు మన పెద్దలు ఈ ప్రాతిపదికల్ని బహుశా చాలా ఆలోచించి అప్పటి కాలమానం ప్రకారం ఏర్పాటు చేసేఉంటారు. They might still come handy. కానీ ప్రస్తుతం అవలంభిస్తున్న ఈ విధానాలలో ritualism ఉందితప్ప,core essence తప్పిపోయినట్లు నాకు అనిపించింది. అందుకే "end may be justifiable but,means is doubtful" అన్నాను.

పెళ్ళి విషయంలో ఏ పద్దతీ ఇంకా సమగ్రతని సంతరించుకోలేదని నాకూ తెలుసు. అందుకే ప్రస్తుతం ఉన్న విధానంలోని అసమగ్రతని చూపించి, మార్పుకు పిలుపునిచ్చాను. నా ఆఖరి పేరా చదివండి.I am asking individuals to look for better reasons for marriage, if the existing one's are doubtful.ఇవి మాకు చాలు, అనుకునేవాళ్ళు హాయిగా ఈ తంతుని ఫాలో అయిపోవడమే!

ఇక మీరు చెప్పిన "falling out of marriage" ఈ వ్యవస్థ మార్పుల్లో ఒక భాగం.దాన్ని నిరసించాల్సిన అవసరమూ లేదు, తప్పనిసరిగా సామాజిక బలవంతం మీద కలసిఉండడాన్ని సగౌరవం, అని అనుకోవడానికీ లేదు.

@పెదరాయ్డు;నెనర్లు. మీ టపా చదివి అక్కడ స్పందిస్తాను.