Wednesday, July 16, 2008

ఒక మెతుకు పట్టుకునిచూస్తే చాలా !?!

"అన్నం ఉడికిందోలేదో చెప్పడానికి ఒక మెతుకుపట్టుకు చూస్తే చాలదా!" అనేది మనం sweeping generalization చెయ్యడానికి చాలా కన్వీనియంట్ గా వాడే సామెత. ‘నిజంగా ఒక మెతుకుని పట్టుకునిచూస్తే చాలా?’, అన్నది ఇక్కడ చర్చించాల్సిన సమస్య.నా ఇదివరకటి టపా ‘నా మనోభావాలు దెబ్బతిన్నాయి’లో, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూ శంకర్ అనే పాఠకుడు చాలా వివేకవంతమైన ప్రశ్నను, సోదాహరణంగా లేవదీసారు. తను "గోరింటాకు సినిమా విషయంలో నేను మంద కృష్ణని సమర్ధిస్తా, ఆంధ్రజ్యోతి విషయంలో వ్యతిరేకిస్తా" అన్నారు. ఒక్క క్షణం నాకు అర్థంకాలేదు, కానీ తరువాత ఆలోచించి చూస్తే "నిజమేనేమో!" అనిపించింది. ఒకసారి ‘కంత్రి’ సినిమాపై మందకృష్ణ మాదిగ లేవదీసిన దుమారం రాజకీయ ప్రేరేపితం అనుకుని నిరసించినా, ‘గోరింటాకు’ సినిమా విషయంలో వికలాంగులని కించపరిచేలాఉన్న డైలాగుపై సాగిన సంవాదం చాలావరకూ అంగీకారాత్మకంగా అనిపిస్తుంది.జూనియర్ ఎన్.టి.ఆర్ తోనున్న రాజకీయవిభెధాన్ని దృష్టిలో పెట్టుకుని ‘కంత్రీ’పై ధ్వజమెత్తినా, ఇప్పుడే కాంగ్రెస్లో చేసిన రాజశేఖర్ సినిమాపై దండెత్తడానికి సహేతుకమైన కారణం నాకు కనిపించలేదు. ఒక బ్లాగు మిత్రుడు వ్యంగ్యంగా, ‘ఇదొక నడవని సినిమాకి ప్రమోషనల్ పబ్లిసిటీ’గా చెప్పబూనినా, ఒక దగ్గర నెగెటివ్ పబ్లిసిటీ అయిన పంధా ఇంకో సినిమా ప్రమోషన్ కి ఎలా పనికివస్తుందో కాస్త ఆలోచించాల్సిన విషయమే సుమా! అంతెందుకు, ఆంధ్రజ్యొతి విషయంలో మూర్ఖంగా ప్రవర్తించిన మంద కృష్ణ, అంతకుమునుపే వికలాంగులతోకలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించి, వారి హక్కుల్ని కాపాడాడన్న విషయం మనలో చాలామంది (నేను కూడా) కన్వీనియంట్ గా మర్చిపోయాం.ఈ మందకృష్ణ ఈ ఒక్క ఘటనలో వేసిన తింగరివేషాన్ని అడ్డంపెట్టుకుని కొందరు బ్లాగర్లు ఏకంగా, "దళితులంతా ఇంతే" అనే సిద్దాంతాన్నికూడా ప్రతిపాదించేసారు. ఈ sweeping generalization ఎంత హాస్యాస్పదమంటే, "మా చిన్నప్పటి ఇల్లు మురికికాలువ పక్కనుండేది కాబట్టి, ఆ తరువాత నేను మారిన ఇళ్ళన్నీ మురికి కాలువ పక్కనే ఉంటాయి" అని ప్రతిపాదించినంత. అందుకే బహుశా, ఒక మెతుకుపట్టుకుని చూస్తే, మొత్తం అన్నం కొన్ని విషయాలలో ఉడికినట్లు కాదు అనిపిస్తుంది.ఒక చర్యకి లక్షలాది మనుషుల మనోభావాలు ఒకేసారి దెబ్బతినెయ్యడం ఎంత విచిత్రమో, ఒక మతం, కులం, వర్గంలోని ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తే, మొత్తం జాతిని తప్పుబట్టడం అంతే విచిత్రం కాదూ!

బాలథాకరే, ప్రవీణ్ తోగాడియా లాంటివాళ్ళు "ముస్లింలను పాకిస్తాన్ పంపెయ్యండి" అంటే, మొత్తం హిందువులంతా అలాగే అనుకుంటారని అంగీకరిద్ధామా?

"హిందువులు ముస్లింలను అణగదొక్కేస్తున్నారు" అని జామామసీద్ పెద్ద అంటే, దేశంలో ఉన్న ముస్లింలందరూ అలాగే భావిస్తున్నారని ప్రతిపాదించేద్ధామా?

కొందరు మహిళలు, అత్యాచార నిరోధకచట్టాన్నో లేక కట్నవ్యతిరేక చట్టాన్నో కక్షసాధింపుకోసం వాడుతున్నారని, అందరూ దుర్వినియోగ పరుస్తున్నారని భావించి దాన్ని రద్దుచేద్దామా?

SC/ST అత్యాచార నిరోధక చట్టాన్ని కొందరు దళితులు స్వప్రయోజనాలకోసం వాడుతున్నారని, అగ్రవర్ణాల అణచివేతకై దీన్ని ఆయుధంగా వాడుతున్నారని సిద్ధాంతీకరించేద్దామా?అందుకే కొన్ని పరిస్థితులూ, విషయాలలో మెతుకుపట్టుకుని చూసి, మొత్తం సంగతిని అవగాహనచెయ్యడం మాని, కొంత ముందువెనకల తార్కికాన్ని ఆసరాతీసుకుని నిర్ణయాలూ చేద్దాం ! సిద్ధాంతాల్ని ప్రతిపాదిద్దాం!!


-----------------

23 comments:

Budugu said...

reservations gurinchi oka article raayagalaraa?

అబ్రకదబ్ర said...

అసలు ఒక సంఘటనతో మందకృష్ణ ఎప్పుడూ ఇంతే అని కూడా ముద్ర వెయ్యలేం కదా. అతను నిజాయితీగా పోరాటం చేసిన రోజులూ ఉన్నాయి (ఇప్పుడా రోజులు గతమేమో). కృష్ణలాంటి వారి వల్ల దళితులందరూ ఇంతే అని ఎలా అనలేమో, కొన్ని సంఘటనల్ని అడ్డు పెట్టుకుని అగ్ర కులపోళ్లందరూ ఇంతే అనీ చెప్పలేం.

వేణూ శ్రీకాంత్ said...

Good Point Mahesh.

కత్తి మహేష్ కుమార్ said...

@బుడుగు,రిజర్వేషన్ల మూలంపై నేను అంగీకరించినా, ప్రస్తుతం అమలులో ఉన్న విధానం మరియూ దాన్నిపొందుతున్న కొందరి మనోవైఖరి(attitude)మీద నాకు కొన్ని సందేహాలున్నాయి. వాటన్నింటినీ కలిపి ఒక టపా రాయడానికి ప్రయత్నిస్తాను. ఈ టపా మీద మీ ఉద్దేశం తెలిపిఉంటే సంతోషించేవాడిని.

@అబ్రకదబ్ర; "అగ్ర కులపోళ్లందరూ ఇంతే " అని ఏవరైనా చెబితే వారికి దళిత ఉద్యమ నేపధ్యం గురించి అస్సలు తెలీదనుకోవచ్చు.అలా అన్నవారిని దళితహంకారులుగా మనం విజయవంతంగా గుర్తించొచ్చు.

పౌర/మానవ హక్కుల నేపధ్యంలో ఉద్భవించిన దళిత ఉద్యమానికి ఎందరు దళితేతరులు (అగ్ర కులపోళ్ళు అనే పదం ఇబ్బందిగా ఉంది)కృషిచేసారో తెలియనివారు, ఈ విధంగా మూర్ఖంగా అతిపోకడలకి పోతారని గుర్తించాలి.

@వేణూ శ్రీకాంత్, నెనర్లు.

సుజాత said...

మంద కృష్ణ ఒకప్పుడు గొప్ప లీడరేమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు కొంత మంది అండతో ఎంత పిచ్చిగా ప్రవార్తిస్తున్నాడంటే, దాని వల్ల దళితులందరిమీదా మిగతా వర్గాల వారికి ఎలాంతి అభిప్రాయం ఏర్పడుతుందో గ్రహించలేని మూఖత్వంలో ఉన్నాడు. ఈ ప్రవర్తన వల్ల ఆయనకు 'ఏమి ' ఒరుగుతుందో గానీ దళితులు చాలా నష్టపోతారన్న విషయం స్వయంగా దళిత సోదరులే గుర్తించాలి.లేదంటే రోకలి తలకు చుట్టాల్సిన పరిస్థితి తెచ్చుకునేలా కనిపిస్తోంది ఈయన.

సాధ్యమైనంత తొందరలో కృష్ణ గారి నాయకత్వాన్ని మాదిగలు వదిలించుకుంటే మంచిది.

చైతన్య said...

నేను సుజాత గారితో ఏకీభవిస్తున్నాను. కృష్ణ మాదిగ గారి జెండా, అజెండా ఏమిటో మరి ఆయనే చెప్పాలి. వికలాంగుల సమస్యల పైన పొరాడారు. అది ప్రశంసనీయమే. మరి హఠాత్తుగా ఆయన దృష్టి సినిమాల పైన మళ్ళింది. భవిష్యత్తులొ ఆయన మరిన్ని సినిమాల పైన ఉద్యమిస్తారు అని నేను భావిస్తున్నను. అది కూడా ప్రత్యేకంగా "ఒక వర్గం " వారి (ఇక్కడ కులం మతం కాదు వర్గం అంటే ... పాలకులకు, వారి సెవకులకు మరియు కృష్ణ గారి వ్యతిరేకులు ) పైన. సినిమాల పైన ఆయన ఉద్యమించడం ఇది మొదట సారి కాదు, అన్న భావన తేవడానికి బహుశ గోరింటాకును ఉపయొగించుకొని ఉంటారు.

కల said...

ముందుగా మహేష్ గారికి,
మీ టపాలన్నింటికి నేను తెగ ఫ్యాన్ ని అయిపోయాను. బాగా ఆలోచింపచేసేలా ఉంటాయి. Good work keep going.

ఒకరిలోని శారీరక లేదా మానసిక లోపాన్ని ఎత్తి చూపితే వారు చాలా బాధపడతారన్న సంగతి అందరికి విదితమే. మనలో లేని అంశాన్ని లేదా లోపాన్ని ఎవరన్నా ఎత్తి చూపితే దానికి మనం పెద్దగా feel అవం. ఉదాహరణకి మనకు తెలిసిన వారెవరన్నా "ఏం కళ్లు కనపడటం లేదా? (ఈ మాటని మన బ్లాగు లోకంలోని మిత్రులందరూ ఎప్పుడో ఒకసారి ఉపయోగించే ఉంటారు, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి)" అంటే దానిలో ఉన్న వ్యంగం గురించే ఆలోచిస్తామే కాని వికలాంగులందరిని అవమానించే ఉద్దేశ్యంతో ఉపయోగించం కదా? "గోరింటాకు" లో కూడా నాకలాంటి వ్యంగమే కనిపించింది కానీ, నిజంగా వికలాంగులందరి (ఏమిటో ఈ పదం వాడాలంటేనే బాధగా వుంది) మనోభావాలను దెబ్బ తేసే విధంగా లేదు. మరి ఎందుకోసం, ఎవరికోసం ఈ అనవసర రాద్దాంతం?
దానికి ఈ రాద్దాంతకర్తలే (సిద్దాంతకర్తల లాగా అన్నమాట) సమాధానం చెప్పాలి.

కత్తి మహేష్ కుమార్ said...

చర్చలో నేను చెప్పిన మూలబిందువు మీద కాక,దానిని చెప్పడానికి ఉదహరించిన మందకృష్ణ గురించి ఇక్కడ చర్చ ఎక్కువగా జరుగుతోంది. అయినా, అదీ ఒక ముఖ్యమైన సామాజిక అశంకాబట్టి చర్చ సబబే!

@సుజాత; మీరు చెప్పినవాటితో దాదాపు అందరు దళితులూ అంగీకరిస్తారని నాకనిపిస్తోంది. కాకపోతే,దళితులలో నాయకుడు తయారవ్వడానికి 50 సంవత్సరాలుపడితే, అతను శక్తిని సంతరించుకోవడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. ఇలాంటి నేపధ్యంలో కొత్తనాయకుడు అర్జంటుగా ఎవరూ కనబడ్డంలేదు కాబట్టి ఇతన్ని భరిస్తున్నారని నా నమ్మకం.

కోసమెరుపేమిటంటే,శక్తిసంతరించుకున్న కొద్ది కాలంలోనే అది తలకెక్కి తిక్కతిక్కగా ప్రవర్తింపజేస్తోంది. అందుకే ఇన్ని నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి.అతను గొప్పలీడరు కాకపోవచ్చు ప్రస్తుతానికి మాదిగలకి మరో alternate లీడర్ లేరు. అందుకే పరిస్థితి ప్రమాదకరంగా తయారవుతోంది.

@చైతన్య; మీ conspiracy theory బాగుంది.ఇక మందకృష్ణ అజెండా SC వర్గీకరణ అని అందరికీ తెలిసిన విషయమే. అది చాలా ఎళ్ళుగా ప్రభుత్వం దగ్గర నానుతున్న నేపధ్యంలో, ఒక సంపూర్ణ సామాజిక నేతగా ఎదిగే ప్రయత్నంలో మరిన్ని సమస్యలకోసం పోరాడటానికి సిద్దపడ్డాడు. కాకపోతే ఒక నాయకుడి వెనుక ఉండాల్సిన think tank లాంటి బుద్దజీవులు ఈ వ్యక్తికి లభ్యంకాక, గుడ్డెద్దు చేలో బడ్డట్టైంది ఇతని స్థితి.

ఒక నిర్థిష్టప్రణాలిక ఎలాగూ లేదుగనక, ఉద్యమం కాస్తా ఇష్టారాజ్యమయ్యింది. రెండవ స్థాయి నాయకత్వం కూడా కొరవడటంతో ఒక నియంతపోకడలు ఇతనిలో పొడచూపి,కాస్తోకూస్తో జ్ఞానమున్న సహచరగణాన్నికూడా దూరం చేసింది.ఈ దారికానని స్థితిలో ఇతను చేసేవన్నీ politically motivated అనికూడా అనుకోలేము.He is now a leader without a rightful cause and not in touch with reality of his people.

అంతమాత్రానా, we cannot write him off. He is still a `force' to reckon with in this democracy.

నేను చర్చించిన over simplification మళ్ళీ మీరు చేసినట్లనిపిస్తొంది!

@కల; అంగీకరించకపోయినా కనీసం ఆలోచింపజెయ్యాలనేదే నా అభిమతం కూడా! నెనర్లు.
విషయానికొస్తే ఈ మూడు వాక్యాలనూ చూడండి;
1.ఏం కళ్లు కనపడటం లేదా?
2.ఏం గుడ్డోడివా?
3.ఏం కళ్ళుదొబ్బాయా?
మీరు అంధులు కాకపోయినా, తక్కువ అమానకరంగా ఏదనిపిస్తుంది? మొదటిది అప్పటి వ్యక్తి స్పందనకి reference అయితే, రెండవది వికలాంగతని ఎత్తిచూపేది. మూడోది వ్యంగ్యం.

భాష చాలా జాగ్రత్తగావాడాల్సిన ఆయుధం. మిడిమిడి జ్ఞానంతో రాసేస్తే సమస్యలు వస్తాయి,బహుశా ఇదీ అదేనేమో!(నేను గోరింటాకు సినిమా చూడలేదు)

Budugu said...

"ఈ టపా మీద మీ ఉద్దేశం తెలిపిఉంటే సంతోషించేవాడిని."
కొన్ని మెతుకులు అంతే. దళితులంతా ఇంతే కాదు కానీ మాదిగ లాంటి దళితులు అంతే.

రిజర్వేషన్ల గురించి మీరు రాయబోయే వ్యాసం కోసం ఎదురు చూస్తూ..

బుడుగు

Uday said...

మహేష్ గారు,

ఇక్కడ మీ వాదనా సరి అయినదే గానె అనిపిస్తుంది ( బహుశా మీ వాదన పటిమ వలన కావచ్చు) . అలాగె మీరు రిఫర్ చేసిన బ్లాగరు చెప్పిన దాంట్లొనూ నిజం వుంది, కాకపొతె, స్వీపింగ్ రిమార్క్స్ చెయ్యటం వలన ఆయన చెప్తున్న కొన్ని విషయలు మరుగున పడిపొతున్నయి. సదరు బ్లాగరు సేఫ్ జోన్ లొకి వెల్లిపొయినందు వలన ఇక దానిగురించి వాదన అనవసరమే అయినప్పటికి, మీ పొస్ట్ కి రెస్పొన్స్ గా ఈ కామెంట్ రాస్తున్నా. SC/ ST ఆక్ట్ కి అమెండ్మెంట్స్ చెయ్యల్సిన సమయం వచ్చిందేమొ. అలా చెస్తే చట్టం దుర్వినియొగం కాకుండా చూడవచ్చు. అన్నం లొ కొన్ని మెతుకులు వుడకక పొయినా ( కొంతమంది చట్టాన్ని దుర్వినయోగ పరిచినా ) కష్టం తినే వాల్లకె కదా ( సమాజమె కదా నష్ట పొయెది).

కత్తి మహేష్ కుమార్ said...

@ఉదయ్;ఎవరెక్కడ స్వీపింగ్ రిమార్క్ చేసినా అది అర్ధసత్యమవుతుందే తప్ప, నిత్యసత్యమవదు. ఆక్కడ ఆ బ్లాగరి చేసింది ఆమాత్రమే అయితే సమస్య లేదు. అర్ధసత్యాన్నికూడా సగౌరవంగా ఆదరించొచ్చు.

కానీ SC/ST Act లో మార్పులు తీసుకురావాలి అనేది ఆదర్శమైతే, దానికి ప్రాతిపదికగా కొంత వివేకవంతమైన అంకెలూ,ఆధారాలూ చూపి దాని బేసిస్ గా వాదనలు చెయ్యాలి.అంతేతప్ప అసహ్యం,జుగుప్స,కోపం,ప్రెజుడిస్ ఆధారంగా కాదు.అది హేయమైనదే కాక ఖండనీయంకూడా.

అందుకే నేను మొదట్లో కేవలం ఆధారాలను చూపానే తప్ప వాదనకు దిగలేదు.కానీ మితిమీరిన అహంకారం ప్రదర్శించిన ఆ బ్లాగరి చివరికి అసలు రంగును (కుల అహంకారాన్ని)స్వయానా బయటపెట్టి ఇప్పుడు తప్పుకున్నానన్నంతమాత్రానా అతని ప్రెజుడిస్ నిజమైపోదు.అతని వాదన సత్యమవదు.

ఆ చట్టాన్ని తీసుకుని దాన్ని ఎక్కడ ఎలా modify చెయ్యాలో చెప్పుంటే చాలా బాగుండేది. అంతే తప్ప తన అక్కసుని అభాండాలు వస్తూ వెళ్ళడుస్తుంటే అవి నిజాలని నమ్మమంటారా?

Anonymous said...

".కానీ మితిమీరిన అహంకారం ప్రదర్శించిన ఆ బ్లాగరి చివరికి అసలు రంగును (కుల అహంకారాన్ని)స్వయానా బయటపెట్టి ఇప్పుడు తప్పుకున్నానన్నంతమాత్రానా"

మహేష్ గారూ ! మీరు మీ బ్లాగు ద్వారా నా మీద చేస్తున్న ఈ దుష్ ప్రచారాన్ని ఖండిస్తున్నాను. నా కులాన్ని నేను మన:స్ఫూర్తిగా గౌరవిస్తాను. నా కన్నతల్లిలాంటి నా కులాన్ని గౌరవించడం నా జన్మహక్కు, కర్తవ్యం కూడా ! నా కులంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. అది నా అదృష్టంగా భావిస్తాను. మీరు ప్రస్తావిస్తున్ అసలు రంగు ఇదే అయితే, అవును, ఇదే నా అసలు రంగు. అంతమాత్రాన ఇతర కులాలు పనికిమాలినవని నేనెప్పుడూ అనలేదు. గౌరవించడానికి కారణాలున్నాయి. ఇతర కులాల్ని అవమానిస్తూ నా బ్లాగులో నేనెప్పుడూ రాయలేదు. అంతమాత్రాన నేను అననివి నాకు అంటగట్టడం - నన్ను ఒక బ్రాహ్మణ స్టీరియోటైపుగా ప్రచారం చెయ్యడం అభ్యంతరకరం. అభిమానం వేరు. అహంకారం వేరు. మీ తల్లిని మీరు గౌరవిస్తే గౌరవిస్తున్నానని చెప్పుకుంటే ఇతరుల తల్లుల్ని అవమానించినట్లు ఎలా అవుతుందో మీరు హేతుబద్ధంగా వివరించగలరా ? దళితుల కులాభిమానం అస్తిత్వవాదము. అగ్రకులాలవారి కులాభిమానం మాత్రం కుల-అహంకారం. ఇదేనా చెప్పదల్చుకున్నది ?

దీన్ని బట్టి నాకేం తెలుస్తోందంటే ప్రభుత్వామోదం పొందిన కులాభిమానాలు "రంగులు" కావు. అవి అందరూ ఆమోదించి తీరాల్సినవి. ప్రభుత్వామోదం లేని కులాలవారి కులాభిమానాలు నిషిద్ధాలు. అంతేనా ?

మీరనుకుంటున్నట్లు "తెగేదాకా లాగడం" పరంపర ఆగలేదు. ప్రస్తుతానికి వాయిదా వేశానంతే ! ఆ పరంపరలో వ్యాసాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు కోరుకుంటున్న సాక్ష్యాలూ ఆధారాలతో సహా ! నా వ్యాసాలు చదివి అగ్రకులాలవారిలో చైతన్యం వస్తుందేమోనని మీరు పడుతున్న భయమూ, బాధ నాకర్థమైంది.

దళితుల పేరు చెప్పి మీరెవరినీ బెదిరించలేరు. అగ్రకులాలలో రగుల్తున్నఅసంతృప్తిని మీలాంటివారు ఇంకెంతో కాలం అరచెయ్యి అడ్డుపెట్టి ఆపలేరు. నా కార్యరంగం చాలా విస్తృతమైనది. బ్లాగులొక లెక్కలోవి కాదు.

బొల్లోజు బాబా said...

ఇది నా స్నేహితునికి జరిగింది, ఇది నాకు జరిగింది అంటూ కొన్ని స్పోరాడిక్ సంఘటనలను చూపుతూ, పలానా వర్గం వారంతా ఇంతే, పలానా కులం వారిలాగే ఉంటారు అని సార్వజనీకరణ చేసి సదరు బ్లాగరి తన టపాలలో ప్రవచించలేదా?

ఇది ఈ ఒవర్ సింప్లిఫికేషను వలననే కదా కొంతమంది స్పందించవలసిన అవసరం వచ్చింది.

తాను గొప్ప ఇతరులు తక్కువ అని భావించటం ఎప్పటికీ అహంకారమే అవుతుంది. దీనికి ఎన్ని వాక్చాతుర్య వాదనలను కూడగొట్టుకున్నా సరే.

నీ తల్లి నీకు గొప్పదయినపుడు, ఎదుటి వాడి తల్లి ఎదుటివాడికి అంతే గొప్ప అన్న విషయాన్ని గ్రహించి మెసలు కోవటం ఎంత సుహృద్భావమో కదా.
బొల్లోజు బాబా

కత్తి మహేష్ కుమార్ said...

@తాలబా: నేను మీ మీద మీ బ్లాగుమీద కేవలం ఉదయ్ చెప్పినదాన్ని విశదీకరిస్తూ మాత్రమే చెప్పటం జరిగింది. ప్రత్యేకించి మీ బ్లాగు మీద ధుష్ప్రచారం చేసే తీరికా,ఆలోచనా నాకు అస్సలు లేవు. నేను చెప్పాలనుకున్నవి మీ బ్లాగులో ఇదివరకే చెప్పానుకూడా. కాబట్టి ప్రత్యేకించి ఇక్కడ మీమీద కత్తిగట్టాల్సిన అవసరం లేదు.

మీ కులం ప్రసకిగానీ,దళితుల పేరు చెప్పి బెదిరించడంగానీ నేను ఈ టపాలో లేక నా వ్యాఖ్యలో చెయ్యలేదు. అయినా మీరు ఈ విషయాలు ప్రస్తావనకు తీసుకురావడం నా భయాన్నీ,బాధనీగాక మీ insecurityని బయట పెడుతున్నట్లు గమనించగలరు.

మీ కార్యరంగం ఎంత విసృతమైనా నాకు అప్రస్తుతం. మీరైనా, ఇంకెవరైనా ఇటువంటి ప్రెజుడిస్ ని పెంపోందించే విధంగా టపాలు రాస్తేనో,మాట్లాడితేనో నేను వ్యతిరేకిస్తాను...అదీ ప్రజాస్వామికంగా.

nagamurali said...

మహేశ్ గారూ,
ఎంతో సెన్సిబుల్ గా ఆలోచించే మీరు తాడేపల్లి గారి గురించి మితిమీరిన అహంకారం ప్రదర్శించారనీ, కుల అహంకారాన్ని/అసలు రంగుని బయట పెట్టుకున్నారనీ వ్యాఖ్యానించడం చాలా బాధ కలిగింది. ఆయన చెప్పినవి అర్థసత్యాలే అని మీరు భావించినప్పటికీ ఇలా వ్యక్తిత్వ హననం (character assassination) చెయ్యబూనడం చాలా బాధ కలిగించింది. మీరిద్దరూ చర్చిస్తున్న విషయాల్లో నాకున్న అవగాహన చాలా తక్కువ. అయినప్పటికీ గొప్ప విషయ పరిజ్ఞానంకల మీవంటి ఇద్దరు వ్యక్తులు చర్చిస్తుంటే, అందులో మాలాంటి వాళ్ళకి నేర్చుకోడానికి ఎంతో ఉంటుంది. తాడేపల్లి గారి రచనలు చదివినప్పుడు ఆయన సూటితనం, చాలా సున్నితమైన విషయాలపై కూడా నిష్కర్షగా తన భావాలని వెల్లడించే నిజాయితీ, అదే సమయంలో అవతలి వాళ్ళ అభిప్రాయాలకీ, దృక్పథాలకీ గౌరవాన్ని ఇచ్చే ఉదారత్వమూ, విశాలత్వమూ చాలా ఆదర్శవంతంగా కనపడతాయి. ఆయన చర్చిస్తున్న విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఎంత సున్నితమైనవో అందరికీ తెలుసు. ఆయన అవగాహనా, దృక్పథమూ తప్పే కావచ్చు. అయినప్పటికీ మీరు చేసిన కామెంట్లు ఒప్పుకోదగినవి కావు. ఆయన రచనల్ని చూస్తే మీరన్న మాటలతో ఏకీభవించే వాళ్ళు ఎవరూ ఉంటారని నేను అనుకోను. బ్లాగుల్లో ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. దయచేసి మీరొక్కసారి మీ వ్యాఖ్యల గురించి ఆత్మావలోకన చేసుకుని వాటిని తొలగిస్తే బాగుంటుంది.
నమస్కారాలతో,
నాగమురళి.

కత్తి మహేష్ కుమార్ said...

@నాగ మురళి: నేను తాలబా గారికిచ్చిన సమాధానం చదవండి.పైపెచ్చు మెదటగా నేను ఆయన్ని కులాహంకారి అని తన బ్లాగులో జరిగిన చర్చలో కూడా అనలేదు.ఆయనగారే నన్ను "దళితపక్షపాతి" అని గౌరవించుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలూ, చర్చలూ తన బ్లాగులో తుడిచేసి కన్వీనియంటగా కొత్తగా ధ్వజమెత్తడం నాకు అర్థం కాకున్న విషయం.

నేను ఉత్తమ బ్లాగుల చర్చలో ఈ టపా లంకె ఇచ్చింది,నా టపాలు కొన్ని కొందరికి నచ్చకపోతే నా బ్లాగు మొత్తాన్ని చెత్త అన్నందుకు ఉదాహరణగా "ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలా?" లంకెఇచ్చాను. ఈ టపా మొత్తంలోఎటువంటి వ్యక్తి ధూషణలూ లేవు. వ్యాఖ్యల్లోకూడా అప్పట్లో వారు తమ బ్లాగ్ముఖంగా చెప్పిన statement మాత్రమే చెప్పాను. నా అభిప్రాయం కాదు.అవమానించాలనే ఉద్దేశమూ లేదు.

ఇక్కడ నా ఆత్మావలోకనంకన్నా, వారి అపోహలు తొలగడం ముఖ్యం.నేను నా వాఖ్యల్ని తొలగించడం కన్నా, వారు తొలగించిన వ్యాఖ్యల్ని పునరుద్ధరించి ఆ మాట వారనలేదని నిరూపించడం అవసరం.

నేను వ్యక్తిధూషణకూ,వ్యక్తిత్వహననానికి పాల్పడడానికి వ్యతిరేకిని.ఒక ఆలోచనా ధోరణిని ఖండించడంలో నేను తీవ్రపదజాలం వాడినా,వ్యక్తిని అవమానించి scoring a pint నా పంధాకాదు. నాకున్న జ్ఞానం,భాషతో ఎటువంటి విషయాన్నైనా చర్చించి సాధించగలననే నమ్మకం నాకుంది. ఇలాంటి cheat tricks నాకు అవసరం లేదు.

నాగమురళి said...

మహేశ్ గారూ,

అదే నాకు కూడా ఆశ్చర్యం కలిగించేది. ఈ వివాదానికీ ప్రస్తుత టపాకీ ఏమీ సంబంధం లేదు. ఎంతో వాడిగా వేడిగా జరిగిన చర్చల్లో కూడా మీరు మాట తూలడం నేను చూడలేదు. నిక్కచ్చిగా వెల్లడించే మీ అభిప్రాయాలూ, చర్చలూ చదివినవాళ్ళెవరూ మీరు ఈ విధంగా ఒక వ్యక్తి గురించి వ్యాఖ్యానిస్తారని ఊహించలేరు. తాడేపల్లి గారు చెప్పినదంతా తప్పే అయినప్పటికీ, ఆయన అభిప్రాయాలు కొంతమంది హర్షించలేనివే అయినప్పటికీ మీవంటి వ్యక్తి ఆ విధమైన వ్యాఖ్యలు చెయ్యకూడదు. ఆయన మీగురించి అపోహ పడుతున్నారని భావిస్తే భావించవచ్చు. ఆయన మిమ్మల్ని దళితపక్షపాతి అన్నారని మీరు అంటున్నారు. దళిత పక్షపాతిగా ఎవరైనా నన్ను అంటే (నిందా పూర్వకంగానైనా సరే) అది చాలా గర్వకారణంగా నేను భావిస్తాను. ‘మితి మీరిన అహంకారం ప్రదర్శించడమూ, అసలు రంగునీ, కుల అహంకారాన్నీ బయట పెట్టుకోవడమూ’ మొదలైన ఆరోపణలు నిందాపూర్వకమైనవి అనే నేను భావిస్తున్నాను. అవి ‘దళిత పక్షపాతి’ అన్న మాటకి సమానమైన ప్రత్యారోపణలు కావు.

తాబాసు గారు మిమ్మల్ని పక్షపాతిగా అపోహ పడితే పడనివ్వండి. ఆయన దుష్ప్రచారం చేస్తున్నారని భావిస్తే మీరూ ప్రజాస్వామికంగా, దీటుగా సమాధానాలు చెప్పండి. మీరు చెప్తూనే ఉన్నారు కూడా. కానీ ఇటువంటి వ్యాఖ్యలు మాత్రం మీవంటి వారు చెయ్యదగినవి కావు. ఇంతకన్నా నేను చెప్పగలిగిందీ లేదు. వాటిని తొలగించి ఈ వివాదాన్ని ముగింపు చేస్తే మాత్రం నేనూ, తోటి బ్లాగర్లూ చాలా చాలా సంతోషిస్తాము.

నమస్కారాలతో,
నాగమురళి.

కత్తి మహేష్ కుమార్ said...

@నాగమురళి: ఈ చర్చలన్నీ ఆయన బ్లాగులో ఇదివరకూ జరిగినవే."మీరు దళితపక్షపాతైతే నేను కులాహంకారినే, నేను బ్రాహ్మణ కులంలో పుట్టినందుకు గర్విస్తాను" అంటూ వారు ఒక పెద్ద వ్యాఖ్యకూడా రాసారు (ప్రస్తుతం అది డిలీట్ చెయ్యబడింది). మరలాంటప్పుడు హఠాత్తుగా నేను వారు చెప్పిందాన్నే, ఇక్కడ వారి పేరుకూడా ఎత్తకుండా, కేవలం suggest చేస్తేనేవారికి ఇంత అవమానకరంగా ఎందుకు అనిపిస్తోందో నాకు తెలీదు.

నన్ను ఈ వ్యాఖ్యని తొలగించమంటున్న మీరు,దయచేసి ఆయన బ్లాగులో ప్రస్తుతం రాసిఉన్న టపా చదివి చూడండి. ఎవరు ఎవరి వ్క్యక్తిత్వహననానికి పూనుకునే మనస్తత్వంగలవారో మీకు అవగతమౌతుంది.నా గురించి వారు ఎంత అవమానకరంగా అవాకులు రాసారో మీరే చూసి నిర్ణయించండి.

నాగమురళి said...

మహేశ్ గారూ, తాడేపల్లి గారు తన కులంలో పుట్టినందుకు గర్విస్తాను అని రాశారు గానీ, తాను ‘కులాహంకారిని’ అని రాశారని నేను అనుకోవడం లేదు. ఆయన చెప్పిన మాటనే మీరు కోట్ చేశాననడం అన్యాయం. మీరే కొంచం కోపాన్ని పక్కనపెట్టి ఆలోచించండి. కేవలం ఆయన చెప్పిన మాటనీ, భావాన్నీ మాత్రమే మీరిక్కడ suggest చేశారా, లేకపోతే ఆయన మీద ఉన్న కోపాన్ని మీ మాటల్లో బయట పెట్టారా?

ఆయన బ్లాగు టపా చూశాను. అక్కడ కూడా కామెంటు రాశాను. ఎంతో విషయ పరిజ్ఞానం, వివేకం ఉన్న వ్యక్తిగా మీవైపు నుంచి జరిగిన పొరపాటుని ఏమైనా సరి చేస్తే బాగుంటుందేమో ఆలోచించండి. కాదు, మీ తప్పేమీ లేదంటే, ఎవరూ చెప్పగలిగేది ఏమీ ఉండదు. ఇంతకుమించి నేనేమీ మాట్లాడను.

భాస్కర్ రామరాజు said...

మనం చదువుకున్న వాళ్ళం. చదువుకున్న వాళ్ళలా ప్రవర్తిద్దాం. జరిగిపోయిందాని గురించి తవ్వుకునే కన్నా, మన ముదు తరాలకి ఎలాంటి సమాజాన్ని ఇద్దాం అని అలోచిస్తే అందరికీ మంచిది. మన సమాజం ఎదుగుదలకి కులం అడ్డు ఐనప్పుడు దాన్ని పక్కకి జరపలేకుండా ఉన్నామటే నిజమైన వికలాంగులు ఎవరో అర్ధం అవుతుంది..

కత్తి మహేష్ కుమార్ said...

@భాస్కర్ రామరాకు గారూ: మీ ఉద్దేశ్యంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తున్నాను.ఇక్కడ ఎవరు "తవ్వారో"కూడా మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను.

ఈ సమాజంలో సమానత్వాన్ని కాంక్షించేవారిలో నేనూ ఒకణ్ణి.కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న మార్పులు ఆ సమానత్వం దిశగా వేయబడుతున్న అడుగులుగా భావిస్తాను.అంతే తేడా.

ప్రసాద్ said...

మహేశ్ గారూ,
కొన్నిసార్లు మౌనం ఔషధంగా పనిచేస్తుంది. ప్రయత్నించండి.

--ప్రసాద్
http://blog.charasala.com

నాగన్న said...
This comment has been removed by the author.