"మగాడు మారాలి ! ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. సెన్సిటివ్ గా ఉండాలి. సంబంధాలకి విలువనివ్వాలి. ఇంటిగురించి పట్టించుకోవాలి." ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చాలాసార్లు వినిపించేమాటలే ఇవి. ఈ మాటల తాత్పర్యం ఏమిటయ్యా అంటే! "మగాడు ఆడవారిలోని ఉత్తమలక్షణాలన్నీ పుణికితెచ్చుకుని అర్జంటుగా మారిపోవాలి" అని. మారుతున్న అవసరాలూ, కాలమాన పరిస్థితుల దృష్ట్యా చాలా సబబైన మార్పే అని అంగీకరించినా, ఇది అంత సులువుగా అయ్యేపనేనా? ఒకవేళ జరిగినా, ఈ మార్పుకుగల మార్గాలేమిటి అనేది million dollar question.
తెలుగులో సాధారణంగా వాడే పదాలు ఆడా,మగా. ఈ పదాలకి లింగపరమైన తేడా ఉందేతప్ప వ్యవహార మరియూ లక్షణపరమైన భిన్నత్వంలేదు. దీన్ని ఇంగ్లీషులో ‘Sex’ అంటారు. కానీ లక్షణపరమైన తేడాని తెలియజెప్పే 'Gender' అన్నపదానికి తెలుగులో ఎటువంటి సమానార్థకమూ లేదు. ఇందులో ఒకటి శారీరక నిర్మాణానికి సంబంధించిన సూచకమైతే, రెండవది సామాజిక, సాంస్కృతిక లక్షణాలకి సంబంధించినది. సింపుల్గా చెప్పాలంటే మగాడికీ - పురుషత్వానికీ, ఆడదానికీ -స్త్రీత్వానికీ ఉన్న తేడాయే Sex కి Gender కీనూ.
లింగ(sex)పరమైన భేధాలు ప్రపంచవ్యాప్తంగా ఒక్కటే! మగాడు శుక్రకణాల్ని విడుదలచేస్తే, ఆడవారు అండాన్ని విడుదలచేసి తద్వారా పిల్లల్నికని పాలిస్తారు. ఈ తంతుకు అనకాపల్లైనా, అమెరికా అయినా ఒక్కటే, ఏమాత్రం భేధం లేదు. కాకపోతే స్త్రీత్వం (feminine), పురుషత్వం (masculine) లాంటివి ఇదివరకూ చెప్పినట్లు సామాజిక,సాంస్కృతిక సంబంధమైనందువల్ల తేడాలు ప్రతి ప్రాంతానికీ కొట్టొచినట్లు కనిపిస్తాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా జెండర్ పాత్రను మార్చాలనుకున్నా, సంస్కరించాలనుకున్నా, సవరించాలనుకున్నా మార్పుతేలేని లింగభేధాలలోని మౌళిక అంశాలని నేపధ్యంలో ఉంచుకోవాలి. అలాకాకుండా, మొత్తంగా ఆడామగల్లోని ‘తేడా’లను మార్చాలనుకుంటే, మొదటికే మోసమొచ్చే అవకాశం ఉంది. కాకపోతే,ఆడామగా మధ్యగల బౌతిక తేడా ప్రాతిపదిక ఎంత గట్టిగాఉందంటే, అవి విశ్వవ్యాప్తంగా కొన్ని సమానాంతర సాంస్కృతిక విధాల నిర్మాణానికి (parallel cultural phenomenon) దోహదమయ్యిందనిపిస్తుంది. అంటే, ఈ జెండర్ వివక్షకు (gender discrimination) గల కొన్ని రూపాలు అమెరికాకూ, అనకాపల్లికీ ఒకటిగా తయారయ్యయన్నమాట. Making it all the more complicated.
ఇప్పుడు మన సమాజంలో ఉన్న సమస్యల్లా, ఇన్ని తరాల conditioning వలన ఏర్పడిన లక్షణాల్ని,కాలానుగుణంగా మార్చడానికి ప్రయత్నించడం. అంతేకాక, వీటితోపాటూ ఉన్న కొన్ని అపోహల్నికూడా నిజాలుగా భ్రమించి సమూలంగా మార్చడానికి యత్నించడంకూడా ఈ turmoil కి కారణం కావచ్చు. ఉదాహరణకు," శారీరక నిర్మాణం ప్రకారం మగాడు బలవంతుడూ, స్త్రీ సున్నితమైనదీ అయినంతమాత్రానా, ప్రతి మగాడూ ధృడంగానూ, ప్రతి మహిళా సున్నితంగానూ ప్రవర్తించాలి" అంటే సమస్య ఖచ్చితంగా వచ్చినట్లేకదా ! ఈ మార్పుల్లోని ఆశయాల్ని కాస్త తీవ్రభావజాలం(extreme ideology) గా మార్చి ,అటు ఫెమినిస్టులూ (feminist) ఇటు మేల్ చౌవ్వనిస్టులూ (male chauvinist) ఒక జెండర్ యుద్దాన్ని సృష్టించేశారు.
ఈ సంక్లిష్టమైన సామాజిక సమస్యను ఒకేకోణంలోంచి చూసి "నిర్మూలించాలి" అనుకోవడం సమర్థనీయం మాత్రం కాదు. "తప్పంతా మగాడిదే!" అనే ఎద్దేవాకూడా సరైనది కాదు. He has a reason to be the way he is. మార్పు అవసరం అని అంగీకరించిన నాడు, ఆ మార్పును ఇరువేపులనుంచీ కూలంకషంగా అర్థం చేసుకుని, అప్పుడు దాని దిశగా ప్రయత్నాలు చెయ్యాలి. అలాక్కాకుండా యుద్ధాలు చేస్తే మిగిలేది క్షతగాత్రులేతప్ప, మారిన సమాజం మాత్రం కాదు. అందుకే, మార్పు నేర్పిస్తే వస్తుందేతప్ప నిరసిస్తేకాదు అంటారు.
విశ్వవ్యాప్తంగా స్త్రీవాదులు కూడా అంగీకరించే కొన్ని నిజాలేమిటంటే, సెక్స్ జెండర్ అనే భేధం లేకుండా, ఆడా మగల విలువల పరిధి (value sphere)లో చాలా బలమైన తేడాలున్నాయి. మగాడు మితిమీరిన వ్యక్తిత్వం, స్వతంత్ర్య అధికారం, హక్కులూ, న్యాయం మరియూ వ్యవస్థలమీద ఎక్కువగా తన సహజమైన అనుకూలతని చూపుతారు. ఆడవాళ్ళు మానవ సంబంధాలూ, సంరక్షణ వంటి విలువల పరిధిని కలిగిఉంటారు. అంతేకాక, మగాళ్ళు మానవసంబంధాల పట్ల స్వతహాగా భయాన్ని కలిగిఉంటే, ఆడవారు స్వతంత్ర్య అధికారానికి (autonomy) దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ సిద్ధాంతాన్ని evolutionary psychology అంటారు. మానవ పరిణామ క్రమంలో,సహజ భౌతిక లక్షణాలవల్ల ఏర్పడిన మానసిక మార్పులను ఈ శాఖ/విభాగం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందన్నమాట.
కాబట్టి, ఇక్కడ సమస్య మగ ఆడగా మారడమో లేక ఆడ మగగా మారడమో కాదు. ఇద్దరికీ ఉన్న విలువల్ని ‘సమానంగా గౌరవించబడడం’. ఇద్దరి మధ్యనున్న తేడాను చెరిపివేయడం కాదు. రెంటిలోనూ సమానతని తీసుకురావడం. కాబట్టి, ఈ మార్పుతీసుకురావడానికి అవసరమైన మార్గాలు వెదకడం ఇద్దరికీ అవసరం. ముఖ్యంగా ఇది మగాడికి చాలా అవసరం ఎందుకంటే, ఈ విలువలు మార్చుకునే దశలో ఎక్కువ trauma కి గురయ్యేది మగాడే కాబట్టి!. ఎందుకంటే ఆడవారిలో సహజంగా ఉన్న assimilating శక్తి మగాడిలో తక్కువగా ఉండటంతో పాటూ, ఖర్మగాలి మగాడి హార్మోన్లు కూడా అతనికి సహకరించని పరిస్థితిలో ఉన్నాయి.
మగాడి హార్మోన్లూ, వాటి పాలిటిక్స్ గురించి Part 2 లో చర్చిద్దాం.
Sunday, July 27, 2008
‘Male’కొలుపు Part 1
******
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
అమ్మో!!... అన్ని నిజాలే కాని అందరూ ఒప్పుకోవాలి కదా? నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనుకుంటారు. వెయిటింగ్ ఫర్ తర్వాత్ పార్ట్..
వెయిటింగ్ ఫర్ తర్వాత్ పార్ట్..
పునరాగమన స్వాగతం
పోష్టులోని విషయాలు ఆలోచింపచేస్తున్నాయి.
బొల్లోజు బాబా
Meeru emi chestaru ? Blogging kakunda?
Back with a bang!! Welcome.. Sir!!
ఆదివారం పూట బోలెడన్ని పనులు చేసేసుకోవాలి అనుకున్నా!! కానీ ఇవ్వాలంతా "ఆడా-మగా" అంటూ బ్లాగులోనే గడిపేసేటట్టున్నా.
మీ టపా కొన్ని ఇంటెరెస్టింగ్ పాయింట్స్ ఆలోచించేలా చేస్తుంది. ఈ హార్మోన్ల గొడవ, సైకాలజీ బెడద గురించి ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు దాకా నా అభిప్రాయాలన్నీ నా observations వల్ల ఏర్పడాయ్యి.. ఇప్పుడీ scientific approach ద్వారా అన్వయించుకోవాలి.
అన్నట్టూ మీ టపాలో నాకేదో కొత్త అందం కనిపిస్తుంది.. ;-)
@పూర్ణిమ;చాలా మంది నా బ్లాగులని అభిప్రాయాల మీద దండెత్తిన మీదట,కాస్త objective గా రాయడానికి ప్రయత్నిద్దామని ఈ శైలిని ఎన్నుకున్నాను. బహుశా అందుకే కాస్త కొత్తగా ఉందేమో! ఇది కూడా పాఠంలాగా బోర్ కొట్టకుండా, ఆలోచించేలా చేస్తోందంటే ఆనందంగా ఉంది.
@సుజాత; చాలా క్లిష్టమైన ప్రశ్నవేసారండి!నేను ఏంచేస్తానో చెప్పాలంటే అదొక పెద్ద టపా అవుతుంది. కానీ సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేనొక communication consultant గా పనిచేస్తాను. చాలావరకూ అభివృద్ధి (social development) కార్యక్రమాలలో ఉన్న ఈ component గురించి శోధన,కల్పన,అమలు వంటి వాటిల్లో ప్రభుత్వాలకూ,సంస్థలకూ నేను సలహాలు ఇస్తుంటాను.
@అశ్విన్,బాబాగారూ,రాజేంద్ర; రెండొ భాగం రేపేవస్తుంది. చూసి కామెంటగలరు. నెనర్లు.
@జ్యోతి;ఈ విషయాలలో తప్పనిసరి పరిస్థితుల్లో మంకుపట్టు వీడుతున్నారు లెండి. నెనర్లు.
బాగుందండీ మీ విశ్లేషణ. బాపుగారు సినిమాలో చెప్పినట్లు, "భార్య, భర్త సమానమే, కాకపోతే భర్త కొంచెం ఎక్కువ సమానం" అనే సిద్ధాంతాన్ని ఎక్కువ మంది పురుష పుంగవులు ఫాలో అవుతుంటారు. ఒకరి అభిప్రాయాలని ఒకరు గౌరవించుకుంటే ఏ సమస్యలూ ఉండవు. తరువాతి భాగం కోసం ఎదురుచూస్తున్నాను.
మీ సహజ శైలికి కాస్త భిన్నంగా వుంది.
మహేష్ గారు...బెంగుళూరు కు వెళ్ళారు కదా...
టపా ఇలా రాయడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా..?
intresting post..waiting 4 d part-2..
Ok. I see. So that makes your blog interesting.
I agree with Purnima and I am very comfortable with your new style of writing. No tension here. No Avesam..!
ఎందుకూ objectiveగా రాయాలనే తపన? దానికి మిగతా వాళ్ళు బోలెడుమందున్నారు, వార్తా పత్రికలున్నై. మీ బ్లాగుని స్పెషల్ గా నిలబెట్టేదే మీ సబ్జెక్టివ్ దృక్కోణం.
@కొత్తపాళీ గారూ objective గా రాయాలనే తపన నాకస్సలు లేదు. ఏదో ఒకసారి ప్రయత్నిద్దామని రాస్తున్నాను.ఈ టపా తర్వాత మళ్ళీ బహుశా మామూలైపోతానేమో!
జెండర్ యుద్ధం అనేది one-way traffic లాగా ఫెమినిస్ఠుల వైపునుంచి మగజాతి మీద ప్రకటించబడింది. ఆ యుద్ధప్రకటనకు అసలు కారణం కొంతమంది ఆడవాళ్ళకు ఆదాయమార్గాలేర్పడ్డం. మగవాళ్ళు అలాంటి యుద్ధానికెప్పుడూ సుముఖంగా ఉన్నట్లు ఆధారాల్లేవు.
దేవుడు (ప్రకృతిమాత) ఆడదానికి చేసిన అన్యాయానికి మగవాడు పరిహారం చెల్లించాలన్న ధోరణిలో సాగుతాయి ఫెమినిస్ఠు రాతలు. టపా మొదట్లోనే మీరు ప్రస్తావించిన "మగవాళ్ళలో మార్పు" డిమాండు కూడా ఈ కోవకు చెందినదే. మగవాడిలా మారడం ఆడదానికి సాధ్యపడదు కనుక మగవాడే ఆడదానిలా మారితే/ మార్చితే బావుంటుందని కొంతమంది ఫెమినిస్టుల ఆలోచన. They are madly obsessed with making the world a better place to live only for women.
మగవాడు మగవాడిలా ప్రవర్తించిన/ ప్రవర్తించాల్సి వచ్చిన రోజుల్లో ఆడవాళ్ళంతా అందువల్ల లాభపడ్డ సంగతి మాత్రం convenient గా మర్చిపోతారు. అతను తోటి మగవాళ్ళతో కలిసి క్రూర జంతువులతో పోరాడినప్పుడు నిర్మించినప్పుడు అతని మీద ఇలాంటి డిమాండ్లు చేసి ఉండలేదు ఎవరూ ! కాస్త నాగరికతలో ముందుకెళ్ళి వ్యవస్థలు కొంచెం స్థిరపడ్డాక అతని so-called పురుషాధిక్యం వీళ్ళకు విషమైపోయింది.
ఆడవాళ్ళకు ఏదైనా నచ్చకపోతే చెప్పుకోవడానికి, తిట్టడానికి, భోరున ఏడవడానికి మగవాళ్లున్నారు. మగవాడికి మాత్రం, ఫిర్యాదు చేసుకోవడానికి ఎవరూ లేరు. ఒకప్పుడు అలాంటివాటికి కొద్దో గొప్పో భార్య ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి కనుక మగవాళ్ళు మారడం సంగతలా ఉంచి మఱింత కఠినాత్ములయ్యే అవకాశం మాత్రమే కనిపిస్తోంది.
It's only traditional spiritual culture that can tame wild emotions in humans. But humanity will re-learn this lesson at great cost after much lapse of time.
Post a Comment