Sunday, July 27, 2008

'Male'కొలుపు Part 2


మనిషి శరీరంలో హార్మోన్లూ వాటి రాజకీయాలు



ఆడా, మగా మధ్య అంత సులువుగా మార్చడానికి వీలులేని భౌతిక మరియూ మానసిక తేడాలు, భేధాలూ ఉన్నట్లు మనం Part 1 లో చర్చించాం. ఈ మార్పుల్ని తమతమ శరీరాల్లో నిర్విరామంగా reinforce చేసే, ‘హార్మోన్ల’ గురించి ఈ భాగంలో తెలుసుకుందాం.



ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనల్లో మగవారి శరీరంపై ఆధిపత్యాన్ని చలాయించే హార్మోన్ గా టెస్టోస్టెరాన్ (Testosterone) ని గుర్తించారు. ఈ హార్మోన్ కున్న రెండే రెండు లక్షణాలు. ఒకటి అనుభవించడం. రెండు నాశనం చెయ్యడం. కొంచెం ఘాటుగా చెప్పాలంటే, "Fuck it or Kill it" అనేవి ముఖ్యలక్షణాలన్నమాట. ఇంత తీవ్రమైన శారీరక అవసరాల్ని ప్రేరేపించే హార్మోన్లని మోస్తున్న మగాడి ప్రవర్తన చిత్రంగానూ, అప్పుడప్పుడూ ఎబ్బెట్టుగానూ ఉండటంలో పెద్ద వింతలేదనుకుంటా! ఈవ్ టీజింగ్ గురించి జరిగిన చర్చలో మగాళ్ళలో ఎక్కువ sexual frustration ఉంటుందని చెప్పడానికి కారణం కూడా ఈ హార్మోనే.



ఈ మగ హార్మోన్లని, ఆడవారిలో జడత్వం (Frigidity) పోగొట్టడానికి చేసే చికిత్సలో భాగంగా వాడతారుకూడా. అంతేకాక, ఈ హార్మోల్ ప్రభావం వల్ల మగవారిలో సున్నితత్వం పాళ్ళు తగ్గడంతో పాటూ, sex కు ‘అవసరాలే’ తప్ప ‘భావనలతో’ చాలావరకూ సంబంధం లేకుండాపోతుంది. ఆడవాళ్ళల్లో ఈ పరిస్థితికి విపరీతంగా ఆలోచనలుంటాయి. ప్రేమించే మనిషితోతప్ప ఆడవారు సంబంధాలు ఏర్పరుచుకోలేరు. కానీ మగవారు అందుకు కొంత మినహాయింపు. ఈ ప్రవృత్తికి ముఖ్యకారణం ‘టెస్టోస్టెరాన్’ అనే హార్మోన్.



మగవారి హార్మోన్ కు ఇంచుమించు సరిసమానమైన ఆడ హార్మోన్ పేరు, ఆక్సీటోసిన్ (Oxytocin). దీన్ని“రెలేషన్ షిప్ డ్రగ్’ లేదా ‘హార్మోన్ ఆఫ్ లవ్’ అని పిలుస్తారు. ప్రేమ, సంరక్షణ, మానవసంబంధాలపట్ల నిబద్దతలాంటి విలువల్ని ఆడవారి శరీరంలో నిత్యనూతనంగా స్రవించే హార్మోన్ ఇది. మగవారిలాగా "slam-bam-thank-you-ma'am" వంటి ఇన్స్టెంట్ సంబంధాలపైపు కాక ఒక నిర్ధుష్టమైన సుదీర్ఘసంబంధాలపట్ల ఆడవారిలో అనుకూలత ఉంటుంది. అందుకే మాతృత్వం వంటి సంబంధాలను కేవలం ఆడవారే పోషించగలరు వీరిలో మాతృత్వానికి(mothering) కావలసిన ఓపిక, నిబద్ధత, ఫోకస్ వీరిలో ఉంటాయి. ఇలాంటి లక్షణాలు హఠాత్తుగా మగవారిలో రావాలంటే కష్టమే!



కాకపోతే, ఇప్పుడు మారిన ఆర్థిక సామాజిక పరిస్థితుల దృష్ట్యా మగవాడు మిస్టర్ సెన్సిటివ్ (Mr.Sensitive) అవతారం ఎత్తాల్సిందే. లేకుంటే చాలాచోట్ల నిరసించబడటంతో పాటూ, రిజెక్ట్ చెయ్యబడతాడు. ఆడవాళ్ళుకూడా ఈ పరిస్థితుల దృష్ట్యా తమకు అసహజలక్షణాలైన స్వతంత్ర్య అధికారాన్ని అందిపుచ్చుకోవడంతోపాటూ, తమ జీవితాల్ని సంబంధాల ప్రాతిపదికే కొలమానంగా చూడటాన్ని త్యజిస్తున్నారు. అంటే తమల్ని కూతుళ్ళుగా,భార్యలుగా,కోడళ్ళుగా,తల్లులుగా చూడటాన్ని నిరసించి, ఒక స్వతంత్ర్య భావాలున్న మహిళగా గుర్తించాలనే ప్రయత్నం చేస్తున్నారు.



సధారణంగా సమాజంలోని మార్పుని జీవితంలో ఒక భాగంగా చేసుకున్న మహిళకు ఈ మార్పుని జీర్ణించుకోగలిగిన శక్తి ఉంది. కూతుర్నించీ కోడలిగా, కోడల్నించీ తల్లిగా మారే క్రమంలో సమాజంతో తన వ్యక్తిత్వాన్ని negotiate చెయ్యగలిగిన స్త్రీకి, ఈ మార్పుని అందిపుచ్చుకోవడం సులువయ్యింది. అంతేకాక, సామాజికంగా స్త్రీవాద ఉద్యమాలూ, ఆలోచనలూ ముందే కొంత దారిని ఏర్పరిచాయి. కానీ మగాడి పరిస్థితే అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు సాంప్రదాయక విలువలూ-నమ్మకాలూ, మరోవైపు అతని శరీరంలోని హార్మోన్లూ ఈ మార్పుని అంగీకరించడానికి అడ్డంకులు ఏర్పరుస్తుంటే కాలానుగుణంగా త్వరితగతిన మారలేక, మారే దారెలాగో తెలీక అనుక్షణం నిరసింపబడి, "తనే కారణం" అని నిందలు ఆపాదించబడి దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు.



అందుకే ఈ పరిణామక్రమంలో మగవాడ్ని మేల్కొపడం ఎంతైనా అవసరం. ఫెమినిస్టుల నిరసనలనుంచీ, ఆడవారి అర్జంటు expectations నుంచీ తనని కాపాడి తెలియజెప్పడం, మార్పుకి తయారు చెయ్యడం అత్యంత అవసరం. అలా తయారు చెయ్యడానికి గల మార్గం మేమిటో? ఈ సమాజం యొక్క పరిణామక్రమంలో ఆడామగా ఇద్దరూ ఎలా తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఈ మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించొచ్చో Part 3 లో చర్చిద్దాం.




‘మార్పులో మర్మాలు’ Part 3 త్వరలో


********

12 comments:

Rajendra Devarapalli said...

సమాజం యొక్క పరిణామక్రమంలో ఆడామగా ఇద్దరూ ఎలా తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఈ మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించొచ్చో ---promising interesting,innovative prescription!

Purnima said...

మీరు చెప్పినదాని బట్టి.. "ఒకవైపు సాంప్రదాయక విలువలూ-నమ్మకాలూ, మరోవైపు అతని శరీరంలోని హార్మోన్లూ" లే పరస్పర విరుద్ధం అనిపిస్తుంది నాకు. మీరన్న హార్మోన్లు ప్రతీ మగాడిలో ఉండాలి.. కానీ slam-bam-thank-you-ma'am" attitude అందరిలో ఉంటుందా?? ముఖ్యంగా మన దేశంలో.. Now I'm curious to know abt the same issue exclusively from Indian men perspective.

ఈ తరం మగవారి మీద మునుపటికన్నా ఎక్కువ "ప్రెజర్" ఉందన్న మాట వాస్తవం.. మీరిచ్చే సూచనలేంటో.. వేచి చూడాల్సిందే!!

I'll get back on this post again!!

సుజాత వేల్పూరి said...

ప్రేమ, సం రక్షణ,సంబంధాల పట్ల నిబద్ధత, మాతృత్వం పట్ల కోరిక, దాన్ని భరించే ఓపికా...అబ్బ , I love Oxytocin.

మారిన సమాజ పరిస్థితుల దృష్ట్యా మగవాడు కొత్త అవతారం ఎత్తాలి, ఎత్తాలి అంటున్నాను మహేష్ మీరు, కానీ అలా loving, caring, నిబద్ధత, సహనం,ప్రేమ ఉన్న మగవాళ్లని,స్త్రీని స్త్రీగా గౌరవించే వాళ్లని బోలెడు మందిని నేను చూసాను. వైస్ వెర్సా! మరి ఇటువంటి ప్రత్యేక లక్షణాలు కొంతమంది పురుషుల్లో ఉండడానికి ఏ హార్మోన్ కారణమంటారు?

సమాజంలోని మార్పుని weaker sexగా పురుషులచేత భావించబడే స్త్రీలు త్వరగా జీర్ణం చేసుకోగలిగినపుడు, ఆ పని పురుషులెందుకు చేయలేరో?

పూర్ణిమ చెప్పినట్టు indian men perspective లో దీన్ని ఎలా చెపుతారో తెలుసుకోవాలని ఉంది.

అయినా....కత్తి గారు, మీ విజ్ఞాన పరిథికి,స్టడీకి, బిజీ లైఫ్ లో కూడా ఇంత చక్కగా బ్లాగులు రాయడానికి మీకున్న ఉత్సాహానికీ....భలే కుళ్ళుగా ఉందండీ!
మీ అందరి బ్లాగులూ పాతవి కూడా కలిపి చదవడానికైనా తొందరగా హై..వచ్చేయాల్సిందే!

Anonymous said...

మహేష్ గారు చాల చక్కగా acientific approach తో explain చేసారు. చాలా బాగుంది.నిజంగానే నేటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా మగాడు మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న సమాజం లో స్త్రీలు కేవలం ఇంటిని చక్కబెట్టే ఇల్లాల్లుగా లేరు. సామాజికంగా, ఆర్ధికంగా స్వతంత్రంగా ఉన్నారు.ఇంకా మగవాల్ల attitude ఇలానే వుంటే కుటుంబ జీవితాన్ని వీడి ఒంటరిగా ఉండటానికి వెనుకాడటం లేదు.ఇప్పటి స్త్రీలకి కావాల్సినది కేవలం భద్రత కాదు.పదినిమిషాలు వారిని మెప్పించే పొగడ్తలు కాదు. జీవితమంతా పంచగలిగే ప్రేమ,గుర్తింపు,విలువ. దీనిని మగవాళ్ళు గుర్తించకపోతే మీరు చెప్పిన frustration మరింత పెరిగి, ఆడ,మగ మధ్య శాశ్వత జాతివైరం ఏర్పడే అవకాశం ఉంది.ఇప్పటికే నాకు తెలిసి మగాళ్ళు భందాల విషయం లో ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు. చాలా ఆసక్తిగా వుంది కదా ఈ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ పైన ఇంత వరకూ ఏ హాలీవుడ్ సినిమా రాలేదా? లేకపోతే చెప్పండి. మనమే తీసేద్దాం. Telugu Bloggers presents "MEN vs WOMEN, the world in 3000"

సిరిసిరిమువ్వ said...

మంచి విషయాలు చెపుతున్నారు కానీ మీరు మరీ generalize చేసి చెపుతున్నట్లుంది. మీరు చెప్పినదాన్నిబట్టి ఇప్పుడు మగావారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లా?? కానీ అందరు మగవాళ్ళు అలా ఉండటంలేదే!!ఒకప్పటికంటే ఇప్పటి మగవారిలో ఓపిక,నిబద్ధత,సహనం,ప్రేమ బాగానే ఉంటున్నాయి.

ఏది ఏమైనా ఆడామగా ఇద్దరూ ఎలా తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఈ మార్పుని తీసుకురావడానికి ప్రయత్నించొచ్చో చెప్పే మీ 3వ భాగం కోసం ఎదురుచూస్తున్నాను.

Saraswathi Kumar said...

@ మహేష్ మరియు కామెంటేటర్స్,ఈ విషయం గురించి నేను చర్చించలేక పోయినా దీనికి సంబంధించి బాగా ప్రజాదరణ పొందిన పుస్తకాన్ని ఇక్కడ నేను ప్రస్తావించదలచుకున్నాను.'Men are from Mars and Wemen are from Venus' అంటే మగవారు ఆడవారు వేరు వేరు గ్రహాలకు చెందిన వారు..అంటే వేరు వేరు తత్వాలు కలిగిన వారని అర్థం.అలా విభిన్న తత్వాలు కలిగిన వీరిరువురూ ఎలా అన్యోన్యంగా సహజీవనం చేయాలో వివరించడమే ఈ పుస్తకం లోని విషయం.ఇది బుక్ స్టాల్స్ లో దొరికినా కూడా HYD,Abids లో జరిగే సండే మార్కెట్లో చాలా చీప్ గా దొరుకుతుంది.

Kathi Mahesh Kumar said...

@సిరిసిరిమువ్వ & సుజాత; పెద్దస్థాయిలో జరిగే పరిశోధనలు దాదాపు ఒక ట్రెండ్ ని సూచిస్తూ జనరలైజ్ చేస్తాయి. ఇక్కడ నేను చెబుతున్నది అదే. హార్మోన్లూ, సైకాలజీతోపాటూ "సోషియల్ కండిషనింగ్" అనేదికూడా మనుషుల వ్యవహార శైలిని మారుస్తుంది.నా మూడోభాగం దానిగురించే.

@పూర్ణిమ;core values భారతదేశంలో ఉన్న మగాళ్ళకీ అమెరికాలో ఉన్న మగాళ్ళకీ మారవు. సోషియల్ కండిషనింగ్ మారుతుంది. అందుకే suppression మన context లో ఎక్కువ.Indian men perspective నేను స్వతంత్రించి త్వరలో రాయడానికి ప్రయత్నిస్తాను. కొన్ని నిజాలు ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ మార్పుకోసం వాటిని తెలుసుకోవడం ముఖ్యం.

@మురళీధర్; సినిమా తీసేద్దాం! ఈ విషయం మీద కొన్ని సినిమాలొచ్చినా (రాధాగోపాళం etc.)కావలసినంత డీప్ గా చర్చించలేదనుకుంటా!

@సరస్వతి కుమార్; ఈ పుస్తకం గురించి నేనూ విన్నాను. కాకపోతే టైటిలే కాస్త discriminatory అనిపించి ఇప్పటివరకూ చదవలేదు.

సుజాత వేల్పూరి said...

రాధాగోపాళం ఒక చెత్తాతి చెత్త సినిమా!

రానారె said...

"మగవారి హార్మోన్ కు ఇంచుమించు సరిసమానమైన ఆడ హార్మోన్ పేరు, ఆక్సీటోసిన్" -- ఈ మాట సరికాదేమోనండి. ఎందుకంటే ఆక్సిటోసిన్ ఆడవారిలోనే కాదు, మగవారిలోనూ దాదాపు అదే మోతాదులో విడుదలవుతుంది. అంతేకాదు దీని విడుదలతో మగవారిలో టెస్టోస్టీరాన్ పరిమాణమూ ప్రభావమూ తగ్గుతాయంటారు. ఆక్సిటోసిన్ హాయిగొలిపేదీ, సాన్నిహిత్యాన్నీ కోరేదీ, నెమ్మదిని చేకూర్చేదీ కాగా -- టెస్టోస్టీరాన్ ప్రభావం మీరన్నట్లు తీవ్రమైనది.

'ఈనాడు'(2006 డిసెంబర్)లో వచ్చిన వ్యాసాన్ని చదివి, ఈ హార్మోన్ల గురించి అంతర్జాలంలో చూసి అప్పుడు తెలుసుకున్న విషయాలివి. (ఈ వ్యాసం నుంచి కొన్ని భాగాలను నా బ్లాగులో 'కీలకం' అని ఒక టపాలో రాసిపెట్టి వుంచాను.)

సత్యసాయి కొవ్వలి Satyasai said...

రానారే చెప్పినది సరైనదనుకుంటా. ఆడ హార్మోనులు ఈస్ట్రోజన్, ప్రోజిస్టిరాన్. ఆడవారిలో టెస్టోస్టిరాన్, మగవారిలో ఈస్ట్రోజన్లు కొద్ది పరిమాణంలో ఉత్పత్తవుతాయి.
మంచి టాపిక్ మొదలెట్టారు. అభినందనలు. ఈవిషయంమీద నాకు చాలా ఆసక్తి ఉంది. చాలామందికి ఆసక్తి కలిగిందని వ్యాఖ్యలు చెప్తున్నాయి.

Unknown said...

ఇలాంటిదే ఇంకో ఇంటరెస్టింగ్ థియరీ "evolutionary psychology" చూడండి.

మీ కొత్త శైలి బాగుంది మాట్లాడుకునేలా!

ఏకాంతపు దిలీప్ said...

ఒక జిజ్ఞాసతో కూడిన పరిశీలన.

ఈ టపాలో మీరు భావాలు వ్యక్తపరిచిన తీరు నిజంగా మార్పు కాదని... ఈ "ఆడ,మగ" అంశంతో మార్పు వచ్చేసిందని అని చెప్పడం సబబు కాదని నేను నమ్ముతున్నాను. :-) ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ తేలికగా పోల్చుకోగలిగే రెండు వర్గాలు ఏమైనా వున్నవా అంటే అది ఆడ, మగ.

కాబట్టి ఇలా అందరు పోల్చుకునే విషయంలో ఆబ్జెక్టివ్గా ఉండకపోతే మీకు మొదటికే మోసం వస్తుంది. కాబట్టి మార్పు వచ్చింది అనడానికి నేను ఇంకొన్ని టపాలు పరిశీలించిన తరవాతే చెప్పగలను. అయినా, నా అభిప్రాయానికి అంత విలువ లేకపోవచ్చు. ప్రస్తుతం ఈ అంశంతో you are forced to be objective and plain in presenting.