నిప్పులు కడిగిన కులాల
మసిబొగ్గుల మాటున
గౌరవంగా బ్రతికేద్దాం.
వినే చెవిలో సీసం.
పలికే నాలుకను చీలికచేసే
ఆదర్శాలను అభినందించి
ప్రశ్నిస్తే వెలి.
ఎదురుతిరిగితే తల తెగాలి.
అనే, ప్రమాణాలందించిన
పెద్దల బుద్దులని అక్షరాలా ఆచరించి.
అంటరానితనాన్నీ,
రెండూగ్లాసుల విధానాన్నీ
అఫిషియల్గా చట్టంబద్దం చేసి
కులాల ఆచారాల్ని
రాజ్యాంగంకన్నా అపురూపమందాం.
అందరూ కలసికట్టుగా
కూలాల్ని ఉద్దరిద్ధాం.
మానవత్వానికి సరదాగా సమాధికట్టి,
మార్పుని ఆశించేవారిని
‘కులపిచ్చిగాళ్ళని’ నిరసించి నోరుమూయించి
మువ్వన్నెల జెండాకాక, కుల అజండాని
భుజానమోస్తూ, భారతదేశాన్ని బలోపేతం చేద్దాం.
*****
14 comments:
చూద్దాం..! మువ్వన్నెల జెండా చేయలేనిది ఈ కుల అజెండా అయినా చేస్తుందేమో!
ఈ ద్దాం ల వల్ల కవిత కాస్త పదును తగ్గినట్లులేదూ??
ప్రశ్నిస్తే వెలి.
ఎదురుతిరిగితే తల తెగాలి.
ఇక్కడికాపితే మాంఛి కొటేషన్ అయ్యుండేది మహేశా
భావం బావున్నా... ఫ్లోలో ఎక్కడో తేడా వచ్చింది మాష్టారు... నాకు ఛందస్సులూ వగైరాలు తెలీవు గానీ...
ఎక్కడో ఏదో మిస్సయిన ఫీలింగ్...
మహేష్ గారు,
నాకెందుకో మాటలు రాలేదు కాసేపు!ఎందుకంటే కులం మీద ఒక టపా రాస్తూ రాస్తూ మధ్యలో కూడలి తెరిచి మీ టపా చూశాను. చాలా బాగుంది. కులం అజండా ని మోసేవాళ్లవే రోజులు!
ఏమిటో కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకైతే.
కవితలో చాలా మంచి ఆలోచనలున్నాయి.
నిప్పులు కడిగిన కులాల ప్రస్తుత భావాలు మసిబొగ్గులలాఉన్నాయి అన్నది ఒక వ్యంగ్యాస్త్రం.
ఆ మసిబొగ్గులమాటునే దక్కే కొద్దిపాటి గౌరవం తోనే జీవితాన్ని ఎదోలా బతికేద్దాంలే అనుకోవటంలో తరతరాల నిస్పృహ, ఏమీ చేయలేని తనం ఉందన్న విషయం భలే చెప్పారు.
చెవిలోసీసం, నాలుక చీల్చటం, రెండు గ్లాసుల విధానం, చెప్పలేదుకాని కొన్ని చోట్ల మలాన్ని తినిపించటం వంటి వాటిని ఆదర్శాలనటం ఒక అద్భుతమైన వ్యంగ్యం.
వాటిని ప్రశ్నిస్తే వెలివేస్తున్నారనేది ఒక నగ్న సత్యం.
ఎదురుతిరిగితే తల తెగటం అంటే ఆలోచనలను, అభిప్రాయాలను మొగ్గలోనే తుంచేస్తున్నారన్న ఆవేదన.
పై అభిప్రాయాల పెద్ద బుద్దులని అక్షరాలా ఆచరిద్దాం, అఫిషియల్ గా చట్టబద్దం చేసేద్దాం అనటం మరొక వ్యంగ్యాస్త్రం.
మానవత్వానికి సమాధి కట్టి కులాల్ని ఉద్దరిద్దాం, మువ్వన్నెల జండానుకాక, కుల అజెండాతో భారతదేశాన్ని బలోపేతం చేద్దాం అని కవి అనటం పైన చెప్పుకుంటూ వస్తున్న సత్యాలను, అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అంటున్న ఒక నిర్వేద పూరిత ఆక్రోశం.
ఇక్కడ ఉటంకించిన విషయాలనన్నిటినీ తనదైన శైలిలో కవి నిరసిస్తున్నాడు.
అలా ప్రవర్తించటం మానవత్వానికి సమాధి కట్టటం లాంటిదేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
రేపటి తరం ఇలాంటి మురికి కూపంలో చిక్కుకోకుండా మువ్వన్నెల జండా మాత్రమే పట్టుకోవాలని ఉంచిన ఫొటో ద్వారా సూచిస్తున్నాడు. ఇది గొప్ప ఆశావహదృక్పధం, కవిలోని సర్వమానవ సమానత్వ భావనలకు ప్రతీక.
ఒక క్రిటికల్ అంశంపై విశ్లేషణాత్మకంగా వ్రాసిన మంచి కవిత.
వాక్యాల బ్రేక్ అప్ పై కొంచెం శ్రద్ద తీసుకున్నట్లయితే ఇంకా సులభంగా అర్ధం అయిఉండేదేమో అనిపించింది.
బొల్లోజు బాబా
కవిత్వాలు శైలులు నాకు తెలీవు కానీ మీరు చెప్పిన విషయం చెప్పిన విధానం చాలా బావుంది మహేషా...
నేను ఇంజినీరింగ్ లో ఉన్నపుడు ఒకరోజు ప్యూన్ వచ్చి 'SC/ST candidates' అంతా ఆఫీసుకు రండీ అన్నపుడు కొందరు వెళ్ళారు.
అప్పటివరకు ఎవరు యే కులం, అసలు ఈ కులం గోల ఏంటి అన్నది తెలియని వాళ్ళందరికీ ఆ రోజు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆ తర్వాత ఆ SC/ST విద్యార్థుల పట్ల కొందరి దృక్పథం మారింది. కారణాలు అనేకం!
ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే: జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇకనయినా మన తరం వాళ్ళు మారాలి. స్కూల్లో లేదా కాలేజిల్లో కుల ప్రస్తావన రాకూడదు. అందరూ సమానమే, ఎవరూ ఎక్కువ కాదు ఎక్కువ కాదు అన్న భావన పెంపొందించాలి.
అప్లికేషన్ లో ఎక్కడా కుల ప్రస్తావన ఉండకూడదు. కులప్రాతిపదికన ఎవరూ రిజర్వేషన్లు తీసుకోకూడదు
అందరూ సమానం అయినపుడు మాకు కులప్రాతిపదికన డబ్బులు, పుస్తకాలు, ఉద్యోగాలు ఎందుకు అని రిజర్వేషన్లు ఉన్నవాళ్ళు నిలదీయాలి.
అలా జరగనన్నాళ్ళు ఈ కులాలు కుల వివక్షలు మారవు.
(మీ టపా, సుజాత గారి టపా నాలో ఈ విషయంలో జరిగే అంతర్మధనాన్ని పలకరించింది. అందుకే అది ఇక్కడ, మహేష్ గారి టపాలోను పోస్ట్ చేస్తున్నాను...)
కులానికి మరణం లేదా? అని ఎందుకు ప్రశ్నించడం?
అలా కోరుకుంటే మనకీ రాజకీయ నాయకులకీ తేడా లేదు నా ఉద్దేశంలో...
మనిషిలోని సంకుచితత్వానికి మరణం లేదా ?అని ప్రశ్నించండి... అదే అన్ని సమస్యలకీ మూలం... ఆ తరవాత స్వార్ధానికి మరణం లేదా? అని ప్రశ్నించండి... సంకుచితత్వం చనిపోకుండా చూసేది స్వార్ధం...
ప్రేమ విషయం పక్కన పెడితే... తెల్లగా ఉన్న వాళ్ళ వెనక నల్లగా ఉన్న వాళ్ళు వెంటపడతారు... అందంగా లేని వాళ్ళు అందమైన వాళ్ళ వెంటపడతారు... ఇంకా ఉదాహారణలు కోకొల్లలు... అలాంటి ఉదాహరణల్లో ఉన్న మనస్తత్వానికి కులం లో చూపే తత్వానికి తేడా లేదు... ఆ ఉదాహరణల్లో మనుషులు వారి ఆలోచనా విధానాన్ని ఎప్పుడు మార్చుకుంటారో, అలాంటప్పుడు కులం కూడా బతకదు... అసలు ప్రపంచంలో ఏ భేదమూ ఉండదు...
కాబట్టి నేను కులాన్ని చంపాలనుకోను... అది చనిపోవాలి అని కూడా అనుకోను...
నాలో సంకుచితత్వం చనిపోయినప్పుడు, నాలో కులం మనుగడ సాగించలేదు... నాలో సంకుచితత్వం ఎప్పుడు చనిపోతుంది అంటే, ఒక్కరోజులో చావకపోవచ్చు, ఒక్కోసారి ఒక్క నిముషపు ప్రేరణ దాన్ని చంపేయ్యొచ్చు... ఒక్కోసారి నాకు జీవితకాలం పట్టొచ్చు...
ఏది ఏమైనా, నేస్తమా! నాకు నీ సహనం కావాలి... నేను మారొచ్చు, మారకపోవచ్చు. నా తరవాత తరాన్ని నేను మార్చగలనేమో. నాలో కులపు వాసనలు కనపడుతుంటే, నన్ను చంపే ప్రయత్నం చెయ్యొద్దు... నన్ను బతకనివ్వు... నేను మారతాను... పది మందిని కూడా మారేట్టు చేస్తాను... ఈలోగా నన్ను చంపొద్దు...
ఎందుకంటే, చదువు, సంస్కారం నాలో పైన చెప్పిన ఉదాహరణలలోని మిగిలిన సంకుచిత భావనల లాగానే, ఈ సంకుచిత భావనని తొలగించలేకపోతుంది అని తెలుసుకున్నాను... నాలో స్వార్ధం దానిని నాతో పెనవేసుకునేట్టు చేస్తుంది... ఈ స్వార్ధపు సంకుచిత సంకెళ్ళు తెంచుకోడానికి నాకు ఒక్కోసారి అనుభవంతో రాటుదేలిన దృక్పధం అవసరమనిపిస్తుంది... నాకున్న అనుభవం చాలదనిపిస్తుంది... నాకు ఆనుభవం వచ్చే వరకు నేస్తమా నాకు నీ సహనం కావాలి, నువ్వు నన్ను భరించలేకపోయినా నాకు నీ తోడు కావాలి...
(... ఇది నాణేనికి అటు వైపుని చూపించే ప్రయత్నం మాత్రమే...)
ఇది మీ " గోడలు" కి కూడా అన్వయించుకోవచ్చు... ఇంకా మీరు కులం విషయం గురించి ఆలోచించినప్పుడు, ఆవేశం, అసహనం కలిగినప్పుడు కూడా అన్వయించుకోవచ్చు....
సమాజం లో కులాన్ని పూర్తిగా తీసివేసి, మతాన్ని కూడా ఇంటికి,గుడికి పరిమితం చేస్తే బాగుంటుంది.
@దిలీప్; మీరు సూచించింది నాణేనికి మరో వైపుకాదు.ఈ సమస్యలకి మూలాన్ని.కులం parse ఎప్పుడూ సమస్యాత్మకం కాదు. కులవివక్ష ముఖ్యసమస్య. ఒకరు ఎక్కువ మరొకరు తక్కువా అనే భావజాలం సమస్య. దానికి మూలం సామాజిక సంస్కృతైతే, మీరు చెప్పిన సంకుచితత్వం దాన్ని పెంచిపోషించి విశ్వవ్యాప్తం చేసింది.కులనిర్మూలన జరిగినా జరగకపోయినా కులవివక్షమాత్రం ఖచ్చితంగా నిర్మూలించబడాలి.
@బాబాగారు; మీ విశ్లేషణ నా అర్థకవితకు పూర్ణరూపం కల్పించిందని చెప్పగలను. కొంత ఆవేశంలో కొంత అసంతృప్తితో రాసానేగానీ ‘కవిత’ రాయాలని రాయలేదు.మీరు చెప్పిన వాక్యనిర్మాణం మీద ఇకనుంచీ మరింత శ్రద్ధ కనబరుస్తాను.
@మురళి & బుడుగు;మీ సూచన సహేతుకం కానీ, ఆచరణ సాధ్యమేనా అన్నది చూడాలి!
@సుజాత గారు; మీ టపా చదివాని కామెంటానుకూడా చూడండి.
@ రాజేంద్ర; కొన్ని "ద్దాం" లు తొలగించాను.
@ నరసింహ: మీకు అర్థం కాకున్నా అర్థం చేసుకోవాల్సిన సమస్య ఇది. ప్రయత్నించండి.
@ వేణూ&సరస్వతీ కుమార్: నెనర్లు.
Good. పలికే నాలుకను చీలికచేసే
ఆదర్శాలను అభినందించి
ప్రశ్నిస్తే వెలి.
ఎదురుతిరిగితే తల తెగాలి.
:-) Good poem.
మహెష్ గారు, మీరు చెప్పిన ఎవగింపు, అసహ్యం స్తాన ఇప్పుడు కొపం, ద్వేషం ఎర్పడ్డాయి. కారణం విదితమె, మూల కారణాలకు సహెతుకమైన పరిష్కారాలను గాలికి వదలి, షార్ట్ టర్మ్ ఫలితాలను ఎరగా వేసి కులం బేస్డ్ గా విభజించి ఒక్కొ కులానికి ఒక పథకం అంటూ ఒక్కొ ఓటు బ్యాంకు ని మ్యానేజ్ చెస్తున్న ఈ కుటిల రాజకీయాలు మసి బారె వరకు, మీలాంటి వాల్లు రాసె కవితలు అందరి హ్రుదయాలను తడుతూ ఉంటాయి. ఇది మనం కాదనలేని నిజం, అక్షర సత్యం. కులాల్ని మరిచి మతాల్ని పాతేసి, బుజాల మీద చేతులెసుకొని కలిసి పోయె సంస్కారం మా జనరెషన్ లొ పుష్కలంగా ఉంది. ఈ చీల్చడాలు, వెలివెయడాలు, ఎవగింపులు ఇవన్ని మా సమైక్యత ని చెడగొట్టలెవు.కాని పనికి రాని ఏ చట్టాన్నైనా, పథకాన్నైనా నిస్సంకొచంగా ఎదిరిస్తాం. ఇన్నాల్లు రిజర్వెషన్ లకు వ్యతిరెకంగా సమ్మెలు చెసిన వాళ్ళలొ కూడ(నమ్మండి) అవసరం లొ ఉన్న వాల్లను కుల మతాలకు అతీతంగ ఆదుకొనె వాల్లు చాలా మందె ఉన్నారు. లొకమంతా చెడిపొలెదు మాష్ఠారు. కచ్చితంగా మీ ఆవెదన చాలా మందికి చేరి ఉంటుంది, మీరు చెప్పిన కుసంస్కారాలన్ని క్రమంగా మరుగవుతున్నాయి, భవిష్యత్తులొ అవుతాయి కూడ.
Post a Comment